26, జూన్ 2021, శనివారం

ఆయుర్వేదం - రస ఔషదాలు .

 ఆయుర్వేదం -  రస ఔషదాలు .


 ఇంతకు ముందు నేను ఆయుర్వేదం లొ శల్య తంత్రం గురించి తెలియచేసాను. ఇప్పుడు ఆయుర్వేదం లొ రస ఔషధాల గురించి తెలియజేస్తున్నాను. 


 మూలికలతో చేసినటువంటి ఔషధాలు వెంటనే ఉపయోగించవలెను. వాటికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. కానీ కొన్ని రకాల లోహములు ను శుద్ధి చేసి ఉపయోగించవచ్చు. అవి ఎప్పుడు ఉపయోగించినా సమర్దవంతం గా పనిచేస్తాయి. మానవుని శరీరం అష్టదాతువులతో నిర్మితమై ఉంటుంది. ఈ దాతువులు లలొ హెచ్చు తగ్గుల వలన మానవునికి రోగాలు ప్రాప్తిస్తున్నాయి. మరలా వాటిని పూరించడం వలన రోగాలు తగ్గు ముఖం పడతాయి. నేటి అల్లోపతి వైద్య విదానం అదే వాటిని ప్రాకృతికం గా తయారు చేయరు . 


ఉదాహరణకు పాండు రొగమునకు ఒక అత్యద్బుతమైన ఔషధం ఉన్నది. పాండు రోగం అనగా శరీరం నందలి రక్తము లేకుండా పాలిపోయినట్టు ఉండుట .ఈ వ్యాధి గ్రస్తులు తెల్లగా మొఖము నందు జీవకళ లేకుండా ఉంటారు.  ఏ గ్రామ భూమియందు 100 ఏళ్ళ నుండి ఉన్నట్టి చిట్టేపు రాళ్లను తీసుకుని వచ్చి వాటిని ఎర్రటి నిప్పుల్లో బాగుగా కాల్చి ఆవుపంచకం లొ ముంచి చల్లార్చాలి . ఈ రకం గా 12 సార్లు చేయాలి . ఇలా చేసిన తరువాత చూర్ణం చేయగా అది సిందూరం రంగులొ వస్తుంది. దానిని ఉదయం సాయంత్రం పుచ్చుకోనిన కేవలం 41 రొజులలొ మనిషి ఎర్రగా తయారవుతాడు. పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇలా చాలా ఉన్నాయి .


       భావ ప్రకాశిక మొదలయిన ఆయుర్వేద గ్రంథాలలో ఈ రసాయనిక తంత్రాల గురించి ఉన్నది. 3,4 శతాబ్దాల నుంచి వాగ్బట్టాచార్యుని కాలం వరకు ఈ రసయనిక ఔషధాలు చికిత్సకు  ఉపయోగించి నట్టు అంతగా లేదు . క్రీ.శ  4 వ శతాబ్దం లొ సంకలనం చేయబడ్డట్టు చెబుతున్న Bowers manicript అంతకు పూర్వం రచించబడిన D .r hernal గారిచే సంపాదించ బడిన వ్రాతపతి గా ఉన్న వైద్య గ్రందం నందు కుడా స్వర్ణ , లొహ ధాతువుల ప్రస్తావన ఉన్నది. కానీ విశేషం గా ఎక్కడా ఉపయోగించినట్టు లేదు .వైదిక కాలం న సోమరస ఉపయోగం అదిక ప్రచారం లొ ఉన్నందున రసవిజ్ఞానం ఋగ్వేద కాలం నుండి ఆదరణ, ప్రచారం లొ ఉనట్టు భావించుచున్నారు. దానిని అనుసరించే చరకాదులు తమ గ్రంధములయందు రసౌషదాలకు స్థానం ఇచ్చారు. భారతీయుల రసప్రక్రియలకు మూలం ప్రాచీనం అని తెలియచున్నది. 


      ఋగ్వేదం న స్వర్ణం, ఇనుము, సీసము, ఇత్తడి, శ్యామ లొహం. ఇలాంటి లోహాల ప్రసక్తి కలదు. రసశాస్త్ర ప్రక్రియ కొన్ని తాంత్రి కముల యందు ప్రాధమిక స్థాయిలో వర్ణించ బడెను. రసాయనిక తాంత్రికం లొ సిద్ధ నాగార్జునుడు ప్రసిద్ధుడు .


 రస తంత్రములో ఉపయోగించబడు ద్రవ్యములను పలువురు తంత్ర కర్తలు పలు విధాలుగా వర్గీకరించారు. అందులొ రత్న సముచ్చయకారుని వర్గీకరణ సామరస్యం గా ఉన్నది. అతడు మహారసములు, ఉపరసములు, సాధారణ రసములు, దాతువులు, ఉపదాతువులు ఇలా వర్గీకరణం చేసారు. 


 మహా రసములు - అబ్రకం, వైక్రాంతం, స్వర్ణ మాక్షిక, తామ్ర మాక్షిక , సస్యకము తుత్తుము , చపలము, రసకము , అని ఎనిమిది మహారసములు గా పేర్కొనబడినవి.


 ఉప రసములు - గంధకం, గైరికము, కాశీసము, స్పటికము, తాలకము , మనశ్హిల , అంజనము, కంకు ఉస్టం అనే ఎనిమిది ఉపరసములగా పేర్కొనబడినవి .


 సాదారణ రసములు - కంపిల్లము, గౌరీ పాషాణము, నవసాగారము, కపర్ధం, అగ్ని జారం, గైరికం, హింగులం, మ్రుద్దారు శృంగి, ఈ ఎనిమిది సాదారణ రసములగా పేర్కొనబడినవి .


  పూర్వాచార్యులు పాదరసం నోక్కదానినే మహారసం గా గ్రహించి తక్కిన వాటిని ఉపరసములుగా పరిగణించారు. రస ఔషద శాస్త్ర ప్రకారం రెండు రకాలు అగు ద్రవ్యాలు కలవు.మొదటి రకం పాదరసం, గంధకం, శంఖ పాషానాది రసొపరసములు. సాదారణ రసములు.రెండొవది సువర్ణం, రజతం, తామ్రము, వంగము, సీసము లోహాది దాతువులు.సుశ్రుతమున వంగం, సీసం , తామ్రము ,రజతము, స్వర్ణం , అయస్కాంతం , మండురం, వైడుర్యం , స్పటికం, ముత్యం , శంఖం ఇవి ఔషద ద్రవ్యాలుగా పేర్కొన్నారు . చరక సంహిత ఎందు రక్తపిత్త వ్యాధి చికిత్సకు , నేత్ర రోగ చికిత్సకు వైడుర్యం, ముత్యములు , మణులు, ప్రవాళం, శంఖం, లోహము, తామ్రము , సౌవీరంజనము ఔషధాలుగా చెప్పినాడు. కుష్టు రొగమునకు పాదరస గంధకములు ఔషదములు గా పేర్కొనెను .ఈ వ్యాధులకు అయస్కాంతం ఉపయోగించడం కూడా సుశ్రుత సంహితలో ఉన్నది.


          సువర్నాధి దాతువులను పలచని రేకులగా చేసి సైంధవ లవనములను ఆ రేకులకు పూసి వానిని కాల్చి నిర్దేశించిన కషాయములలో ముంచి అందునుంచి మెత్తని చుర్ణమును గ్రహించు విదానం వివరించబడెను. ఇట్టి సుక్ష్మ చూర్ణం తయారికి 16 పర్యాయాలు ఆ రేకులను అగ్నిలో కాల్చి ముంచవలసి ఉన్నది. ఈ లొహ రేకులను చండ్రనిప్పుల బొగ్గుల మద్య నుంచి కాల్చి చల్లబడిన తరువాత మెత్తని చుర్ణమును తేనెతో సేవించవలసి ఉన్నది.అని తెలియచేయడం అయినది. అష్టాంగ హృదయం నందు నేత్ర రోగములనుకు పాదరసం తో చేసిన అంజనం ఉపయోగించెడి విదానం తెలియజేసెను.


  

  గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

భారతం నుండి కొన్ని ప్రశ్నలు:

 భారతకథ మనందరికీ తెలుసు.

భారతం నుండి కొన్ని ప్రశ్నలు:


1. సర్పయాగం చేసినవాడు?- జనమే జయుడు 


2. అభిమన్యుని కొడుకు? - పరీక్షిత్తు 


3. సూర్యుని రథసారథి? - అనూరుడు (తొడలు లేనివాడు ఉరువు = తొడ)


4. గరుత్మంతుని తండ్రి? - కశ్యప ప్రజా పతి 


5. వ్యాసుని తల్లిదండ్రులు? - మత్స్య గంది ( సత్యవతి), పరాశరుడు  


6. శుక్రాచార్యుని అల్లుడు? - యయాతి 


7. దుష్యంతుని తల్లిదండ్రులు? -  రత్న తార లిన 


8. భరతుని మరోపేరు? - సర్వ దమనుడు 


9. భీష్ముని మరోపేరు? - గాంగేయుడు (దేవా వ్రతుడు) 


10. పాండురాజు నాన్నమ్మ? - మత్స్య గాంధి  ( సత్య వతి) 


11. గాంధారి తండ్రి పేరు? - సుబలుడు 


12. కుంతీదేవి అన్నయ్య? - వసుదేవుడు 


13. వసుసేనుడు ఎవరు? - కర్ణుడు 


14. ద్రోణాచార్యుని గురువులు? - అగ్ని వేశాడు 


15. ఏకలవ్యుని తండ్రి పేరు? - హిరణధను 


16. కమలపాలిక ఎవరు? - హిడింబ 


17. యాజ్ఞసేని సోదరుడు? - దుష్ట ద్యుమయుడు 


18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు? - ప్రతి వింద్యుడు 


19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి? - సర్పరాజు కౌరవ్యుడు 


20. అశ్వత్థామ తల్లి పేరు?​ - కృపి 


 ప్రయత్నించి చూద్దాం. ఎంతవరకు సమాధానాలు రాబట్టగలమో

బలము

 🪔 *卐ॐ _సుభాషితమ్_ ॐ卐* 💎


శ్లో|| పక్షిణాం బల మాకాశం, 

మత్స్యానా ముదకం బలమ్, 

దుర్బలస్య బలం రాజా,

బాలానాం రోదనమ్ బలమ్, 

బ్రాహ్మణస్య సంధ్యావందనం బలమైశ్వర్యమ్ .


తా|| పక్షులకు ఆకాశమే బలము. చేపలకు ఉదకమే బలము. బడుగువర్గం వారికి రాజే బలము. పసిపాపలకు ఏడుపే బలము. బ్రాహ్మణునికి సంధ్యావందనము బలము మరియు ఐశ్వర్యము.


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

సమాచార హక్కు చట్టం

 *సమాచార హక్కు చట్టంపై  సామాన్య ప్రజలలో మదలైయ్యే సందేశాలకు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది బి. ఎస్.కృష్ణారెడ్డిగారి సమాధానాలు*


*1.సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి ?*

◆సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చింది. కేంద్ర , రాష్ట్ర పభుత్వాల పాలనకు ఒక పార దర్శకత, జవాబుదారీ తనం తీసుకురావడానికి ఇది ఉద్దేశించినది. రెండు ప్రభుత్వాల పని తీరుకి సబంధించిన సమాచారం దేశ ప్రజలందరికి అందుబాటులో వుంచడానికి ఇది కృషి చేస్తుంది.


*2. పబ్లిక్ ఆధారిటీలు అంటే ఎవరు?*

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాసనాల ద్వారా గాని , రాజ్యాంగంలో చేసిన ఏర్పాటు వల్ల గాని, స్వంతంగా పాలనా నిర్వహణ ఏర్పాటు చేసుకునే సంస్థలు పబ్లిక్ అధారిటి అంటారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థలు, ప్రభుత్వ అధికారం కింద పనిచేస్తున్న సంస్థలు, ప్రభుత్వ స్వంత సంస్థలు  ఇవి కూడా పబ్లిక్ అధారిటి కిందకు  ఆర్ధిక సహాయం వల్ల నడిచే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి.


3.కోరిన సమాచారాన్ని ఎవరు అందిస్తారు?

◆సమాచార ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సమాచార అధికారి ప్రతి పబ్లిక్ సంస్థలోను నియమించబడతారు. వారు తప్పనిసరిగా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వాలి. ఆర్.టి.ఐ. దరఖాస్తులు కూడా వీరిని అడ్రస్ చేసి పంపాలి.సబ్ డివిజినల్ స్థాయిలో అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు వుంటారు. వీరు తమకు చేరిన దరఖాస్తులను , అప్పీల్స్ ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరుకు పంపుతారు.


*4.సమాచార కమిషనుకు రాసే దరఖాస్తు, పబ్లిక్ అథారిటికి మీరు రాసే దాని కంటే ఏ విధంగా ప్రత్యేకమైనది ?*

◆సమాచార హక్కు చట్టం ప్రకారం ఇతర దరఖాస్తుల మాదిరి కాకుండా ఇక్కడికి సమాచారాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తులకు, అప్పీళ్ళకు తప్పనిసరిగా స్పందించి,పరిమిత సమయంలో అందించాల్సి వుంటుంది. అలా జరగని పక్షంలో ఆ అధికారిపై చట్ట ప్రకారం శిక్ష విధించ వచ్చు. అంతే కాదు, అతనిపై క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు. ఆర్.టి.ఐ. నుపయోగించి, పొందగల సమాచారం పరిధి ఎంతో విశాలమైంది. ఈ చట్టం ప్రకారం, పార్లమెంటుకు కానీ, రాష్ట్ర శాసన సభకు కానీ సమర్పించే ఏ సమాచారమైనా ప్రజలు ఆర్.టి.ఐ. ద్వారా పొంద వచ్చు. ప్రజలు తాము కోరుతున్న సమాచారానికి కారణం కానీ, తమ వ్యక్తిగత వివరాలు కానీ,ఒక్క కాంటాక్టు అడ్రసు తప్ప, అధికారికి చెప్పాల్సిన పనిలేదు.


5.సమాచార హక్కు ను కోరుతున్న దరఖాస్తు ఇన్ని పదాల లోనే వుండాలని నిబంధన ఏమయినా వుందా?*


◆ఔను. ఆర్.టి ఐ అప్లికేషన్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామాతో కలిపి, 500 పదాలకు మించి వుండరాదు. అయితే అప్లికేషనుకు అనుబంధం వుంటే అది లెక్కలోకి రాదు. అయినాకానీ , పదాల పరిమితి పెరిగిందనే కారణంతో ఎవరి దరఖాస్తును తిరస్కరించడానికి వీల్లేదు.


*6. సమాచార హక్కు చట్టం ప్రకారం నేను సమాచారం పొందాలంటే ఏం చెయ్యాలి?*

◆నిర్దేశించిన రుసుము చెల్లించి,సంబంధిత పబ్లిక్ అధారిటి యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరిట, దరఖాస్తు చేయాలి. ఆ అధికారికి మీరు అడుగుతున్న సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు ఇక్కడ అవసరం లేదు.ఒకవేళ మీరు దరఖాస్తు రాయలేని నిరక్షరాస్యులు అయినట్టయితే , మీకు దరఖాస్తు రాసి పెట్టడానికి ఎవరినాయినా సూచించే బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తీసుకుంటారు.


*7. సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి?*

సమాచార హక్కు చట్టం కింద ఈ క్రింది విషయాలు మీరు పొందవచ్చు.

◆డాక్యుమెంట్స్, రికార్డ్స్, మెమోలు, ఈ మెయిల్స్, అభిప్రాయాలు. సలహాలు, పత్రికా ప్రకటనలు, ఆర్డర్స్, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, రిపోర్టులు, పేపర్స్, సర్క్యులర్స్, శాంపిల్స్, మోడల్స్

ఎలెక్ట్రానిక్ ఫారంలో వున్న డేటా, డాక్యుమెంటు ఒరిజినల్ కాపీ,

మైక్రోఫిల్మ్, ఇమేజ్ రూపంలో వున్న మైక్రో ఫిల్మ్


*8. ఏ ఏ విషయాలు సమాచార దరఖాస్తు  ద్వారా పొందడానికి సాధ్యం కాదు ?*

◆ఈ క్రింది విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాలకు భంగం కలిగించే సమాచారం దేశ భద్రత, వ్యూహాత్మక , వైజ్ణానిక, ఆర్ధిక ప్రయోజనాలపై , విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే సమాచారం, హింసను ప్రేరేపించే సమాచారం

ఫలానా సమాచారాన్ని ప్రకటించకూడదని ఏదయినా న్యాయస్థానం లేక ట్రిబ్యూనల్ ఆదేశించి వున్న పక్షంలో అలాంటి సమాచారం ,సమాచార వెల్లడి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనుకుంటే ఆ సమాచారం సమాచార వెల్లడి పార్లమెంట్ , రాష్ట్ర శాసన సభ హక్కులను ఉల్లంఘించేదయితే అలాంటి సమాచారం

వాణిజ్య పరమయిన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షానికి హాని కలిగేటట్లయిటే అలాంటి సమాచారం . అయితే, అలా వెల్లడి చెయ్యడం వల్ల ప్రజలకుఎక్కువ మేలు కలుగుతుందంటే ,ఆ సమాచారం ఇవ్వవచ్చు. ఉద్యోగ సంబంధ రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో వున్న సమాచారం విశాల ప్రజాప్రయోజనాల రీత్యా వెల్లడి చేయాల్సిన అవసరం వుందని సంబంధిత అధికారి భావిస్తే దాన్ని ప్రకటించవచ్చు.

ఏదయినా విదేశ ప్రభుత్వం నుంచి అంది,గోప్యంగా ఉంచాల్సిన సమాచారం సమాచార వెల్లడి వల్ల ఒక వ్యక్తికి ప్రాణ హాని కానీ, ప్రమాదం కలుగుతుందనుకుంటే ఆ సమాచారం, చట్టాల అమలుకోసం, భద్రతా ప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించిన,లేక సహాయపడిన వారి గుర్తింపుకు దారితీసే సమాచారం దర్యాప్తు ప్రక్రియనూ, నేరస్తులను పట్టుకునేందుకు గానీ,వారిని శిక్షించేందుకు అవరోధాలు కలిగించే సమాచారం ఏదైనా అంశాలపై మంత్రి మండలి నిర్ణాయక పత్రాలు,అవి బహిర్గతం చేసే దాకా ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని వెల్లడి చేయరాదు. సమాచారం ప్రజా ప్రయోజనాలకు కాని, ప్రజా కార్యక్రమాలకు సంబంధంలేని, వ్యక్తిగత సమాచారం గోప్యతను వెల్లడి చేసే వివరాలు


*9. సమాచారం తీసుకోవడానికి ఏ భాషను ఉపయోగించాలి?*

◆మీకు కావలసిన సమాచారాన్ని ఇంగ్లీషు, హిందీ లేక స్థానిక భాష లో ఈ దరఖాస్తు పంపుతున్న మీ ప్రాంతంలోని అధికార భాషగా  గుర్తించిన ప్రాంతీయ భాషలో గాని వుండవచ్చు.


●10. నాకు కావలసిన సమాచారాన్ని నేను కాపీ చేయడం గాని, చూడడం కాని ఎలా చెయ్యాలి?*


◆డాక్యుమెంట్స్ , మాన్యుస్క్రిప్టులు, మరియు రికార్డులు తనిఖీ చేయవచ్చు. నోట్స్ తీసుకోవచ్చు., సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కాపీలు లేక వాటి అనుబంధ కాపీలు, పదార్ధాల సర్టిఫైడ్ శాంపుల్స్ , సీడీ ల రూపంలో వున్న సమాచారం, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్స్, ప్రిట్ అవుట్స్ ( కంప్యూటరులో వున్న సమాచారం), లేక ఇతర ఎలక్ట్రానిక్ రూపంలో వున్న సమాచారం


*11. కావలసిన  సమాచారం అధికారులు ఏ రూపంలో ఇవ్వగలరు?*

◆పబ్లిక్ సంస్థ వనరులలో వ్యత్యాసాలతో కూడిన మార్పులు జరగకపోతే, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు. ఆ డాక్యుమెంటుకు హాని లేని పక్షంలో , లబ్దిదారులు కోరిన విధంగా, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు .


*12.సమాచార చట్టం  దరఖాస్తును (అప్లికేషన్) నింపడానికి ఏదైనా  ఖచ్చితమైన ఫార్మెట్ వుందా?*

◆లేదు. సమాచారాన్ని కోరుతూ దాఖలు చేస్కునే దరఖాస్తు ఫారానికి ప్రత్యేకమయిన ఫార్మెట్ ఏమీ లేదు. కానీ దరఖాస్తు దారుడు ఈ‌ క్రింది వివరాలు రాయాల్సి వుంటుంది.

1)దరఖాస్తు తేదీ.

2)సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామా

దరఖాస్తుదారుని చిరునామా

3)కోరదల్చుకున్న సమాచారం( స్పష్టత కోసం నంబర్లవారీగా కానీ, టేబుల్ రూపంలో గానీ వుంటే మంచిది. దానికి ప్రతిస్పందనలు కూడా అదే రూపంలో వుంటాయి.)

4)కోరిన సమాచారం ఎలాంటి రూపంలో – ప్రింట్ అవుట్స్, సిడి , ఈ మైయిల్స్ చెల్లించాల్సిన రుసుము స్టాంపు రూపంలో అయితే అంటించండి చెల్లింపు విధానం తెలపండి.సంతకం అనేక కెంద్ర, రాష్ట ప్రభుత్వ సంస్థలు శాంపిల్ ఫార్మేట్స్ ను రూపొందించాయి.పర్యావరణ , అడవుల మంత్రిత్వ శాఖల కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను http;//envfor.nic.in/sites/default/files/app_pro.pdf వెబ్ సైట్ లో చూడగలరు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు కూడా ఒక దరఖాస్తు ఫార్మెట్ తయారు చేశారు. ఇది దరఖాస్తు సౌలభ్యం కోసం మాత్రమే తప్ప తప్పనిసరిగా పాటించితీరాలని నిబంధన ఏమీలేదు. ఈ ఫార్మెట్ లేదనే కారణం గా దరఖాస్తుని తిరస్కరించడానికి వీల్లేదు.


*13. ఆన్ లైన్ ద్వారా సమాచారాన్ని ఫైల్ చేయవచ్చా?*

◆అది పబ్లిక్ అధారిటి మిద ఆధార పడి వుంటుంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే సమా చార హక్కు http;//rtionline.gov.in/ పేరిట ఒక పోర్టల్ నూ రూపకల్పన చేసింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలపై మాత్రమే వినియోగదారుడు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాచార హక్కు గురించి వెబ్ సైట్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.


*14.సమాచారం  పొందడానికి ఎంత సమయం పడుతుంది?*

1)మీరు అడిగిన సమాచారం   వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు (లైఫ్ అండ్ లిబర్తికి ) సంబందించాయిన అంశం అయితే  మీ దరఖాస్తు సంబంధిత అధికారికి  ముట్టిన  ముట్టిన సమయమ నుంచి 48 గంటలలోపు సమాచారం అందించాలి.


2) దరఖాస్తు చేరిన ౩౦ రోజులలోగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం అందించాలి. అప్లికేషన్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి పంపినట్టయితే అతను సంబంధిత అధికారిని దాన్ని చేర్చి సమాచారం సేకరీంచే నిమిత్తం మరొక 5రోజులు అవసరమవుతుంది. 


*15. సమాచార హక్కు దరఖాస్తు సరైన అధికారికి పంపకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తుందా?*

◆మీ దరఖాస్తు సంబంధిత అధికారికి చేరకుండా మరొకరికి చేరినా కానీ, దాన్ని తిప్పి పంపంచడానికి వీల్లేదు. ఈ‌ చట్టం పకారం దాన్ని అందుకున్న వ్యక్తి, లేక సంస్థ 5 రోజుల్లోగా నిర్దేశిత అధికారికి తిరిగి చేర్చితీరాలి..


*16. సమాచారం తీసుకోవడానికి నేను ఏదైనా ఫీజు చెల్లించాలా.?*

◆సమాచార హాక్కు కింద సమాచారం కోరుతూ పంపే అప్లికేషను ఒక కాపీ మీ దగ్గర అట్టిపెట్టు కొండి. అప్లికేషను రిజిష్టర్ పోస్టు అక్నాలేడ్జిమేంట్

లో పంపండి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ అథారిటి సమర్పించబోయే సమాచారానికి ఒక నియమిత ఫీజును నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆ మొత్తాన్ని రూ. 10 గా ప్రకటించింది.(ఈ పైన ఇచ్చిన పట్టికలో


ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజు ఎంతెంత నిర్ణ యిన్చిందో, ఎలా ఫీజు కట్టలో ఇవ్వడం జరిగింది. 1) ఒకవేళ దరఖాస్తు దారుడు

దారిద్యరేఖ దిగువున వున్నా వాడితే,( ఫీజు చెల్లించలేని పరిస్థితిలో) వుంటే దానికి సంబంధించిన గుర్తింపు కార్డును సమర్పించాల్సి వుంటుంది అనగా దరఖాస్తు వెంట  తెల్ల రేషన్ కార్డు జిరాక్సు జత పర్చవల్సి ఉంటుంది.

*సెక్షన్7(3)(a)* ప్రకారం సమాచార రుసుము (కోర్టు సంబంచిన మాత్రం రూ25/- మిగతా శాఖ వారికి రూ10/- మాత్రమే చెల్లించాలి.


*దరఖాస్తు రుసం(పీజును)*

(1) నగదు రూపంలో,

(2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు,

(3) డిమాండ్ డ్రాఫ్టు,

(4) కోర్టు ఫీ స్టాంపు వేయాలి,(కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెల్లుబాటు కాదు)

(5)బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుం. ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి.

విలయినంతగా పోస్టల్ ఆడారు మాత్రమే రుసుముగా చెల్లించాలి.


కోరిన సమాచారాన్ని బట్టి వాటి ప్రింటవుట్స్ కి పేజీకి రూ.2 చొప్పున చెల్లించాలి. అదనపు చార్జీలు ఎవైన వుంటే, ఆఫీసరు తన జవాబులో తెలియజేస్తారు.


 ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు సమాచారం ఇవ్వడంలో 30 రోజులకంటే ఎక్కువ జాప్యం చేస్తే, అప్పుడు ఎటువంటి ఫీజు వసూలు చెయ్యకుండా ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి వుంటుంది.


*17.ఆర్.టి.ఐ దరఖాస్తుకి స్పందన లేకపోతే ఏం చెయ్యాలి?*

◆సమాచారం కోసం సమర్పించిన దరఖాస్తుకి సంబంధిత అధికారి నుంచి స్పందన లేకపోతే అప్పిలేట్ ఆధారిటీ కి అప్పీల్ చేసుకోవచ్చు. అన్ని పబ్లిక్ అథారిటిల తాలూకు అప్పిళ్ళను చూసేది అప్పలేట్ అధారిటి. మీ మొదటి అప్లికేషనుకు జవాబు రావాల్సిన తేది నుంచి 30 నుంచి 60 రోజుల వ్యవధిలోపల అప్పీలు చేసుకోవాలి.


*18. నాకు చేరిన సమాచారం తప్పుగానో, అసంపూర్తిగానో వుంటే ఏం చెయ్యాలి?*

◆ఇచ్చిన సమాచారం అవాస్తవంగానో , అసంపూర్తిగానో వుంటే అప్పిలేట్ ఆధారిటికి అప్పీల్ చేసుకోవాలి. సమాధానం చేరిన 30 రోజులలోపు అప్పీలుచేయాలి. సరైన కారణాలు వున్నప్పుడు అంతకంటే ఎక్కువ జాప్యం జరిగిన కూడా అప్పీలు అంగీకరిస్తారు.


*19. సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించవచ్చా?*

◆వ్యక్తి గత సమాచారం అడిగినప్పుడు తిరస్కరించవచ్చు. కొన్ని సమాచార విషయాలు ఆర్.టి.ఐ. సహాయంతో అందరితో పంచుకునే వీలులేదు. అలాంటప్పుడు సంబంధిత అధికారులు మీ అప్లికేషన్ తిరస్కరించవచ్చు. అయితే, ఆర్.టి.ఐ చట్టం కింద సదరు సమాచారం ఇవ్వ యోగ్యమైనదే అనిపిస్తే, మీరు అప్పీలు చెయ్యవచ్చు.

మీరు ఈ అప్పీలును మీకు జవాబు వచ్చిన 30 రోజుల లోగా చేసుకోవాలి.మీ అప్లికేషన్ తిరస్కరించినప్పుడు, దానికి కారణాలు, మీరు దానిపై ఎలా అప్పీలు చేసుకోవచ్చో, మీరు పంపాల్సిన అప్పలేట్ అధారిటి ,ఇవన్ని కూడా తిరస్కరిస్తున్న పబ్లిక్ అథారిటి ఇవ్వాల్సి వుంది.


*20. అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారం నాకు అసంతృగా వుందనిపిస్తే నేను ఏం చెయ్యాలి?*

◆అలాంటప్పుడు, మీరు కేంద్ర సమాచార కమిషన్ కు లేదా, రాష్ట్ర సమాచార కమిషన్ కు రెండో సారి అప్పీలు చేయవచ్చు. మీరు మొదట పంపిన అప్పీలుకు జావాబు ఇవ్వాల్సిన సమయం అయిన తరవాత 90 రోజులోగా రెండో అప్పీలు పంపుకోవాలి. లేదా, మొదటి అప్పీలుకు జావాబు వచ్చిన తరవాత 90 రోజులలోగా రెండో అప్పీలు పంపాలి. సరైన కారణం వున్నప్పుడు, ఈ సమయం దాటి పోయినా కూడా అప్పీలు అనుమతించబడుతుంది.


*21. కోరిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర సమాచార కమిషన్/కేంద్ర సమాచార కమిషన్ గాని నిర్ణిత సమయం లో ఇవ్వాలని వున్నదా?*

◆అటువంటి సమయ నిబంధన ఏది లేదు.


*22.కోరిన సమాచారం ఇవ్వని అధికారి పై ఎం చర్యలు తీసుకుంటారు*

◆పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఈ క్రింద వివరించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అతను దరఖాస్తూ స్వీకరించే వరకు లేదా సమాచారం ఇచ్చే వరకు కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ రోజుకు రు .250 లు చొప్పున పెనాల్టి విధించ వచ్చు. గరిష్టంగా రు.25,000లు వరకు పెనాల్టి వేయవచ్చు.

●సరైన కారణం లేకుండానే ఆర్.టి.ఐ. దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించడం

●నిర్ణయించబడిన సమయంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం

●సమాచారం కావాలని ఆలస్యంగా ఇవ్వడం

●తెలిసి కూడా తప్పుడు సమాచారం/అసంపూర్తి సమాచారం/తప్పు దోవ పట్టించే

సమాచారం ఇవ్వడం

●అడిగిన సమాచారాన్ని అసలు లేకుండా చెయ్యడం,

●సమాచారం ఇవ్వడానికి ఏదో విధంగా అడ్డుపడడం.


*23.ఏలాంటి పరిస్థితుల్లో మీరు అప్పీల్ వేయకుండా సమాచార కమీషన్ కు దరఖాస్తు చేసుకొనవచ్చు?*

మీరు సమాచారం కొరకు దరఖాస్తు ప్రజా సమాచార అధికారి గారికి దరఖాస్తు చేసుకొని ఉంటే మీ దరఖాస్తు స్వీకరించకుండా తిరస్కరిస్తే (refused) మీరు  సమాచార హక్కు చట్టం రాష్ట్ర)/కేంద్ర  కమీసనర్ల అప్పీల్  చేసుకొనవచ్చు.


*24. రికార్డులను తనిఖీ చేసే అధికారం ఉందా?*

◆సెక్షన్2(j)(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు  అధికారం ఉంది (మొదటి గంటకు ఉచితం మరల ప్రతి గంటకు  రూ5/- చెల్లించాలి


25 సమాచార దరఖాస్తు దారునికి వయసు,విద్య స్థానికత అవసరం ఉందా*?

 ◆లేదు

26. సమాచార హక్కు ప్రతి దరకాస్తుదారుడు వినియోగదారరుడేనా?

◆అవును వినియోగదారుడే


*27.అడుగుతున్న సమాచారాన్ని ఎందుకు అని ఆడిగే హక్కు ఎవరికైనా ఉందా?*

◆లేదు  *సెక్షన్6(2)* ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు.


*28.మీరు అడుగుతున్న సమాచారం ఏ శాఖ అధికారికి వస్తుందో తెలియనప్పుడు. మీరు  తప్పకుండా

◆సెక్షన్-6(1) ప్రకారం సమాచార హక్కు దాఖలు విధానం. తెలియపరుస్తూ కోరిన సమాచార  మీ పరిధిలోకి రాని యెడల *సెక్షన్ -6(3)* ప్రకారం  నా దరఖాస్తును బదిలీ సీజేయగలరు అని తప్పని సరిగా వ్రాయాలి. సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ  ప్రజా సమాచార అధికారిపై ఉండుంది.


*29.ఉచితంగా ఏ సెక్షన్ ప్రకారం సమాచారం పంపిణీ చేయాలి?

◆సెక్షన్7(6) ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితముగా ఇవ్వాలి.


*30.మినహాయింపులు ఎప్పుడు ఏ సెక్షన్ ప్రకారం వర్తించవు?*

◆సెక్షన్8(2) ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే   మినహాయింపులు వర్తించవు.


*31.మొదటి అప్పీలు ఏ సెక్షన్ ప్రకారం అప్పీల్ చేయాలి?*

సెక్షన్19(1) ప్రకారం మొదటి అప్పీలుచేయాలి 45 రోజుల నుంచి 60 రోజుల లోపు ఉండాలి.


*32. ఏ సెక్షన్ ప్రకారం రెండవ అప్పీల్ చేయాలి?*

◆సెక్షన్19(3) ప్రకారం రెండవ అప్పీలు, 90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు.


*33*  కేంద్ర రాష్ట్ర కమీసనర్లకు  ఏ సెక్షన్ ప్రకారం పిర్యాదు చేయాలి*

◆సెక్షన్18(1) ప్రకారం కమీషన్లకు పిర్యాదు చేయాలి.


*34. సమాచారం కోరిన సమయంలో మీ దరఖాస్తును అయిన అర్థక పరమైన  నష్టాలు వచ్చి ఉంటే వాటిని చెల్లించమని అడవచ్చు?*

◆సెక్షన్-19(8)(b)  ప్రకారం ధరాఖస్తుదారు తనకు  కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి సక్రమంగా ఉంటే  నష్టపరిహారం మంజూరు చేయాలి.


*35.తప్పుడు సమాచారం ఇచ్చిన  సమాచారం ఇవ్వకపోయినా సంబంధిత అధికారిపైకమిసనర్లను  చర్యలు తీసుకోమని ఏ సెక్షన్ కింద కొరవచ్చు?*

◆సెక్షన్20(1) ప్రకారం సమాచారం ఇవ్వకపోతే  (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ 250 చొప్పున రూ 25,000 వరకు జరిమానా. విధించమని కోరవచ్చు.


*36.సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల పోరంకు వెళ్ళవచ్చు?*

*సెక్షన్20(2)* ప్రకారం క్రమక్షణ చర్యలకు సిపారసు

గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల పొరనికి వెళ్ళవచ్చు.


*37.సమాచార దరఖాస్తుదారులు ఎటువంటి పరిస్థితుల్లో  హైకోర్టు/సుప్రీంకోర్టు వెళ్ళవచ్చు?*

◆ 1)ప్రజా సమాచార అధికారి (ipo) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిసనర్ లేకుంటే  డైరెక్టుగా  న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.

2)సమాచార కమిషన్లు సమాచారం ఇవ్వమని ఆదేశించిన  సమాచారం ఇవ్వకుండా ఉంటే హైకోర్టు/సుప్రీంకోర్టులకు వెళ్ళవచ్చు.

కృషితో నాస్తి దుర్భిక్షం

 కృషితో నాస్తి దుర్భిక్షం 

జపతో నాస్థి పాతకం 

మౌనేన కలహం నాస్తి 

జాగ్రతేన భయం నాస్తి 

మన మహర్షులు వారి జ్ఞానంతో మన దైనందిక జీవనానికి ఉపకరించే అనేక సూత్రాలను, నీతులను మనకు అందించారు ఆ పరంపరలో వెలసినదే ఈ శ్లోకం 

కృషితో నాస్తి దుర్భిక్షం : అంటే కృషి చేస్తే దుర్భిక్షం ఉండదు అంటే మనం శ్రమ చేస్తే దరిద్రం ఉండదు. ఎందుకంటె శ్రమకు మనము ఫలితాన్ని పొందుతాము ఆ ఫలితం వలన దరిద్రం పారదోల వచ్చు  ఇక్కడ శ్రమ అంటే ఏదయినా ఉద్యోగం లేక వ్యాపారమో వృత్తి కావచ్చు తద్వారా మనకు ధనం లభిస్తుంది.  ఆ ధనంతో వలసిన వాటిని కొనుక్కొని సుఖ జీవనం చేయవచ్చు. 

జపతో నాస్థి పాతకం: జపం చేయటం వలన అంటే కేవలం జపమే కాకుండా దేముడికి సంబందించిన పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వలన మనం చేసిన పాపాలు అన్ని పాటా పంచలు అయ్యి పుణ్య ఫలం లభిస్తుంది అందు వలన పాతకాలు నశిస్తాయి అని అర్ధం. మనం నిత్యం జప తపాదులను ఆచరించి మన చిన్నారులకు కూడా మార్గ దర్శకంగా ఉంటే గృహంలో ముందుగా ప్రశాంతత తరువాత అదృష్టం  చేకూరుతుంది. ఏ ఇల్లు పరి శుభ్రంగా ఉండి అక్కడి గృహస్తులు  దైవ చింతనలో వుంటారో ఆ ఇంటిలో నిత్యం లక్ష్మి దేవి వసిస్తుంది అన్నది సత్యం. 

మౌనేన కలహం నాస్తి: ఇది ఇప్పటి కాలంలో ప్రతివారు ఆచరించ వలసిన సూత్రము. మనం చేసిన ప్రతి పనిని ఈ సమాజం వేయి కళ్ళతో గమనిస్తూ ఉండటమే కాకుండా కొందరు వారికి తెలిసి కొంచం తెలియక కొంచం అహంతో కొంతఎదుటి వారిని విమర్శించాలనే సంకల్పంతో మనకు మనసు గాయ పడే విధంగా ప్రవర్తించినా కూడా మనం మౌనంగా ఉంటే ఎటువంటి మనః స్పర్ధలు రావు తత్ ద్వారా కలహం రాదు. కాబట్టి ఈ రకంగా కలహాన్ని ఆపగలం. మహా భారతంలో తిక్కన మహా కవి వ్రాసిన పద్యం ఈ సందర్భంలో అనుసరణగా ఉంటుంది చుడండి 

ఒరులేయవి వనరించిన 

నరవర యప్రియంబుదన మనంబునకగు 

నొరులకు నవి సేయకునికి 

పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్ 

భావము: ఇతరులు ఏవయితే అప్రియమైనవి అనగా మనకు ఇష్టము కాని పనులు మన యెడ చేస్తారో అవి వారికి చేయకుండా అంటే అదేవిధంగా వారితో ప్రవర్తించకుండాఉండటం పరమ ధర్మము అంటే   ధర్మాల కన్నా ఎక్కువ అయిన ధర్మము అని అర్ధము. మనకు ఎంతో విలువైన వాగ్మయం వున్నది కానీ అది పెద్ద వారు తెలుసుకోవటం లేదు అట్టి తరి ఇక పిల్లలకు ఏమి నేర్పగలరు. ప్రతి వారు కొంత సమయాన్ని వెచ్చించి చక్కటి విషయాలు తెలుసుకొని తమ సంతతికి నేర్పిన ఈ సమాజం ఎటువంటి గొడవలు లేకుండా చల్లగా ఉంటుందనుటకు సందేహం లేదు. 

జాగ్రతేన భయం నాస్తి:  ఇది ఇప్పటి ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన వాక్యంగా నేను  అనుకుంటాను. నాకు ఇటీవల కలిగిన ఒకపరోక్ష అనుభవాన్ని తెలియ చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక వ్యక్తికీ ఒక వడ్డీ వ్యాపారం చేసే సంస్థ ఉద్యోగి బలవంతంగా వ్యక్తిగత ఋణము ఇప్పించారట.  ధనాశతో అతనుకూడా అనాలోచితంగా తీసుకున్నాడు.  తరువాత తెలిసింది తాను నెలసరి చెల్లించే వాయిదా సొమ్ము కలిపితే తానూ తీసుకున్న ఋణం కన్నా చాల ఎక్కువ అని. అంతే కాదు తానూ ఈ కరోనా నేపథ్యంతో నెలసరి వాయిదాలు కొన్ని కట్ట నందువల్ల ఆ సంస్థ వారి ఉద్యోగులు రాత్రియంబవళ్ళు దూర శ్రవణితో మాట్లాడుతో అనేక విధముల దుర్భాషలాడటమే కాక అతనిపై అతని ధర్మ పత్ని ఫై  పోలీసు కేసులు పెట్ట గలమని భయపెట్టు చున్నట్లు నాతొ నుడివినాడు, అందు వల్ల తన కుటుంబ జీవనం దుర్భరమైనదని వాపోయినాడు. ఇది యదార్ధంగా జరిగిన సంఘటన.  నిజానికి తనకు అవసరము లేకున్నను దొరికిందని ఋణము తీసుకోవటం వల్ల వచ్చినఁ ముప్పు అంటే తనంతట తానె ముప్పుని కొని తెచుకున్నట్టు.  మనం రోజు అనేకమైన ఇటువంటి విషయాలను వింటున్నాము కంటున్నాము.  అనేకులు ఋణములు చెల్లించ లేక ఆత్మ హత్యలకు పాలుపడుటము కూడా  మన మెరుగుదుము.  ముందు జాగ్రత్త లేక పోవటమే ఇటువంటి పరిస్తుతములకు  దోహద పడుతాయి.  

మనుషులకు ఆశ లేశ మాత్రంగానే ఉండాలి. ప్రస్తుతము కరోనా కారణంగా ధనార్జన లేని అనేక సాఫ్ట్ వెరు జ్ఞానులు అక్రమ ధనార్జనకు పలు తెరుగుల మోసములు చేయుటకు  పాల్పడుతూ అమాయకులను ప్రలోభ పెట్టి వారిని దోపిడీ చేస్తున్నారన్నది విశ్వ విదిత సత్యం. 

మనకు ఉరక ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఎందుక ఇస్తారు అని ఆలోచించే వారు ఎట్టి ప్రలోభాలకు లొంగరు. కానీ చాలా మంది అమాయకులు అందులోని నిజా నిజాలను పసి కట్టక లక్షలలో కంప్యూటరు మోసాలకు లోనవుతున్నారు.  మన భారతీయుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కేనియా దేశస్తులు కూడా మోసగిస్తున్నట్లు మనం వార్తలలో చూస్తున్నాము.   

" ఆశయాబద్దతే లోకం కర్మణేన బహుచిన్తయామి" 

మరొక శ్లోక వివరంతో మరలా కలుద్దాము. 

ఇట్లు 

బుధ జన విధేయుడు 

భార్గవ శర్మ 

*మోక్ష మార్గాలు

 *మోక్ష మార్గాలు..


 *తరుణోపాయం...*

 

ప్రతి మార్గంలోనూ ఆ మార్గానికి సంబంధించిన ఇబ్బందులు కష్టనష్టాలు ఉండనే ఉన్నాయి. ఇవి కాక మానవ సహజమైన లోపాలు ఎలాగూ మనలో ఉంటాయి. సాధన అన్న తర్వాత జారు పాట్లు భంగ పాట్లు తప్పవు. మోక్షము అనేది చాలా జన్మల తరవాత వచ్చేది. దానికి అడ్డ దారులు సూక్ష్మ మార్గాలు ఉండవు. కానీ ఇందులో భగవంతుడు చిన్న వెసులుబాటు ఇచ్చాడు. సాధన మార్గంలో కొంత దూరం వెళ్లిన తర్వాత జన్మ పూర్తయితే తర్వాతి జన్మలో మళ్లీ సరిగ్గా ఎక్కడ వదిలేసామో అక్కడ నుంచి సాధన మొదలువుతుంది. చేసిన పూజ, సాధన మురిగిపోవు. గజేంద్రమోక్షం ఘట్టంలో ఆఖర లో ఈ మాట వుంది. 


జ్ఞాన భక్తి కర్మ మార్గాలలో అన్నిటిలో కూడా తప్పకుండా ఉండవలసిన దినుసు వైరాగ్యం. వైరాగ్యం లేకుండా ఏ మార్గము కూడా పనిచేయదు. మనము ఏ మార్గంలో ముందుకు పోదా మనుకున్నా ఆ మార్గంలో మన కంటే ముందు అరిషడ్వర్గాలు వెళ్లి మనల్ని దొర్లించడానికి ఆ మార్గం నిండా గుంటలు తోవ్వుకుని కూర్చొని ఉంటాయి. వైరాగ్యం ఉంటే తప్ప ఆ గుంటల్లోంచి బయటపడ లేము. సంసారాన్ని పూర్తిగా వదిలి పెట్టనక్కర్లేదు. కానీ తాపత్రయాలను కొద్దిగానైనా అదుపులో ఉంచు కోవాలి. అన్నిటికంటే ఇదే ప్రధాన మైనది.


60 ఏళ్ళు వచ్చిన తర్వాత నైనా భగవంతుడి మీదా మోక్షం మీదా ఆసక్తి కలగకపోతే మనకు వచ్చిన ఈ మానవ జన్మ వృధా అయినట్లే. కాబట్టి భగవంతుడి మీద నమ్మకం మోక్షం మీద ఆసక్తి తప్పకుండా ఉండాలి. మనం చెయ్యవలసినది ఏమిటి అనేది గురువులు ఇలా చెప్తారు. 


*కలియుగంలో తీవ్రమైన సాధన ఎవరికీ వీలుపడదు. ఏదో ఒకటే మార్గము అనిపట్టు కొని కూర్చుంటే అసలు వీలుపడదు. అన్ని మార్గాల్లో ఉన్న మంచిని తీసుకోవాలి. ఎవరో ఒక దేవుడినో దేవతనో నమ్ముకొని సాధ్యమైనంత వరకూ సత్సంగము, నిత్యం భగవంతునికి సంబంధించిన మాటలను వినడము భగవంతునికి సంబంధించిన పుస్తకాలను చదవడం రోజూ నియమంగా ఏదో ఒక రూపంలో భగవంతుడిని కొద్దిసేపైనా పూజిస్తూ ఉండడం. వీటితో పాటు కొద్దిపాటి ఇంద్రియ నిగ్రహంతో కాస్త ధర్మ బద్దంగా బతుకు వెళ్ల దీయ గలిగితే ఇప్పటి పరిస్థితులలో మనకు సరిపోతుంది. ఉన్నంతలో కోరికలు క్రోధాలు అదుపులో ఉంచుకుని శాంతంగా బతకడమే ప్రస్తుత కాలానికి మనం చేయగలిగిన సాధన. లంపటత్వం తగ్గించుకుని వైరాగ్యాన్ని పెంచుకోవాలి. జ్ఞాన భక్తి కర్మ మార్గాల నన్నింటిని వాళ్ల వాళ్ల రుచిని బట్టి, ఓపికను బట్టి, అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కలిపి ఉపయోగించు కోవడం మంచిది.*


బ్రహ్మ సూత్రాల దగ్గర్నుంచి మొదలుపెట్టి వందల పుస్తకాలు రాసిన ఆదిశంకరులు ఆఖరులో మనకు ఇచ్చిన రత్నాల మూట భజగోవింద స్తోత్రం. అందులో ఉన్న సూచన కూడా ఇదే. భజగోవింద స్తోత్రాన్ని చదివి అర్థం చేసుకొని ఆ సూచనలు రోజూ పాటించ గలిగితే చాలు. అంతకంటే మించిన వేరే సాధన ఈ కాలంలో ఇంకేమీ లేదు. 


*పవని నాగ ప్రదీప్.*

ఓ చౌకీదార్ కథ:

 ఓ చౌకీదార్ కథ:

(గొల్లపూడి మారుతి రావు)


కొంతకాలం కిందట నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాలమ్‌ రాశాను. నా ఆభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్‌ వచ్చింది.‘‘నరేంద్రమోదీని పొగడకండి సార్‌! అతను దుర్మార్గుడు. కర్కశుడు’’ ఆంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోదీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరిచిపోదాం.


కేవలం ముగ్గురు నాయకుల నమూనా కథలు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఉద్యోగి. తీరా ఈయన ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్‌ జనరల్‌ మేనేజరుగా కంపెనీ ప్రమోషన్‌ ఇచ్చిందట. ‘‘వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోడానికి. నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను చేస్తాను’’ అని ఉద్యోగం మాన్పించారు. ఒక ముఖ్య మంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు అ బొత్తాన్ని నిలబెట్టే కుట్టిన కథ చదు వుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకాయన–ఎమ్మెల్యే. సభ అయ్యాక చేతిలో ఖద్దరు సంచీతో–రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసు. ఆయన పేరు వావిలాల గోపాల కృష్ణయ్య.


ఒకావిడ.. పదవిలోకి రాకముందు కేవలం ఒక స్కూలు టీచరు. అవిడ బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ నాయకురాలు మాయావతి. ఆమె సోదరుడు అనందకుమార్‌. 2007లో ఆ మహానుభావుడి ఆదాయం 7 కోట్లు. 7 సంవత్సరాలలో 1,316 కోట్లు అయింది. అంటే 26 వేల శాతం పెరిగింది! అయన ముఖ్యమంత్రి సోదరుడు అన్న కారణానికి ఒకానొక బ్యాంకు సున్నా వడ్డీతో 67 కోట్లు అప్పు ఇచ్చింది. ఇక ములాయంగారి బంధుజనం వందల లెక్కలో ఉన్నారు. వారిని మీరు వెదకనక్కరలేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రతీ పదవిలోనూ, వ్యాపారంలోనూ తమరు దర్శించవచ్చు.


ఇక నరేంద్ర మోదీ కథ. ఆయన బంధువులెవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మొన్న ఇండియా టుడేలో వచ్చిన వ్యాసంలో వివరాలు చూద్దాం. ఒక బాబాయి కొడుకు–అరవింద్‌ భాయ్‌–నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్‌నగర్‌లో చిన్న గదిలో ఉంటాడు. జయంతిలాల్‌ అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. వాద్‌ నగర్‌లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు.


మోదీ అన్నయ్య–సోంభాయ్‌ (వయస్సు 75) పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. ఒకా నొక సభలో కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మాయి ‘‘ఈయన నరేంద్రమోదీ అన్నగార’’ని నోరు జారింది. ఆయన మైకు అందుకున్నాడు. ‘‘నాకూ ప్రధాని మోదీకి మధ్య పెద్ద తెర ఉంది. మీకది కని పించదు. అవును. నేను నరేంద్రమోదీ అన్నయ్యని. ప్రధానికి కాను. ప్రధాని మోదీకి నేనూ 1.25 కోట్ల భారతీయుల వంటి సోదరుడిని’’ అన్నారు.


మోదీ అన్నయ్య అమృతాభాయ్‌(72) చెప్పాడు: 1969లో అహమ్మదాబాద్‌ గీతామందిర్‌ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్‌లో టీ దుకాణం నడిపే రోజుల్లో–ఆ దుకాణం నిజానికి వారి మేన మామది–మోదీ రోజంతా పనిచేసి–ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆఫీసుకి వెళ్లి వృదులైన ప్రచారక్‌లకు సేవ చేసి–ఏ రాత్రికో కొట్టుకే వచ్చి క్యాంటీన్‌ బల్లమీదే నిద్రపోయేవాడట–ఇల్లు ఒకే గది ఉన్న వసతి కనుక. 2003లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో ఒకసారి మోదీ గడిపారట. మరి 2012లో ఎందుకు మళ్లీ గడపలేదు? ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నాడుకదా: అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనశైలిని కల్మషం చేస్తుందని. ఆనందకుమార్‌కీ, రాబర్ట్‌ వాద్రాకీ ఈ మాట చెప్పి చూడండి.


నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. నేను ప్రధాని గురించి మాట్లాడడం లేదు. సోంభాయ్‌ చెప్పిన ప్రధాన చౌకీదారు గురించి చెప్తున్నాను. నా అభిమాని నన్ను మరొక్కసారి క్షమించాలి. మోదీకి జోహార్‌ !!!

భారతం కొన్ని ప్రశ్నలు:

 భారతకథ మనందరికీ తెలుసు.

భారతం నుండి కొన్ని ప్రశ్నలు:


1. సర్పయాగం చేసినవాడు?


2. అభిమన్యుని కొడుకు?


3. సూర్యుని రథసారథి?


4. గరుత్మంతుని తండ్రి?


5. వ్యాసుని తల్లిదండ్రులు?


6. శుక్రాచార్యుని అల్లుడు?


7. దుష్యంతుని తల్లిదండ్రులు?


8. భరతుని మరోపేరు?


9. భీష్ముని మరోపేరు?


10. పాండురాజు నాన్నమ్మ?


11. గాంధారి తండ్రి పేరు?


12. కుంతీదేవి అన్నయ్య?


13. వసుసేనుడు ఎవరు?


14. ద్రోణాచార్యుని గురువులు?


15. ఏకలవ్యుని తండ్రి పేరు?


16. కమలపాలిక ఎవరు?


17. యాజ్ఞసేని సోదరుడు?


18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు?


19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి?


20. అశ్వత్థామ తల్లి పేరు?​


 ప్రయత్నించి చూద్దాం. ఎంతవరకు సమాధానాలు రాబట్టగలమో

మొక్క నాటుదాం*

 🌱🌱🌱🌱🌱🌱🌱🌱

*ఈ వానా కాలం* 

*మొక్క నాటుదాం*

,🌱🌱🌱🌱🌱🌱🌱🌱

ఈ వానాకాలం లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఖాళీ ప్రదేశాలలో నాటుదాం.

    ఖాళీ ప్రదేశాలలో పండ్ల మొక్కలు నాటుదాం.

నాటిన మొక్కను సంరక్షిద్దాం.

   కేవలం మెసేజ్ ఫార్వార్డ్ చేయడం కాకుండా ఒక పండ్ల మొక్క,పూల మొక్క నాటుతానన్న సంకల్పం చెప్పుకుని మాత్రమే ఫార్వర్డ్ చేద్దాం.

మీరు మీ మాట మీద నిలబడే ఉన్నత వ్యక్తిత్వం గల వారు.

*మీరు ఇతరులకు ఆదర్శం.*

*ఈ మంచి పనికి మీరే సరైన వారు.*

ఇంకెందుకు ఆలస్యం పూల మొక్క, పండ్ల మొక్క ఏదీ ఎక్కడ వేయాలో నిర్ణయించి ప్రతి రోజూ దాని ఎదుగుదలను గమనిస్తూ గుండెనిండా ఆనందం నింపుకోండి.....

🌱🌱🌱🌱🌱🌱🌱🌱

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పెద్దల తిథులు

 🌹 *పెద్దల తిథులు ఏ కారణము చేతనో జరపలేక పోతే ఏమి చెయ్యాలి?* 🌹

(సేకరణ: పి.యల్.నరసింహాచార్య

దాసన్)

(25.6.21)


మంచి పనులకే ఆటంకాలు ఎక్కువ! అయినా జన్మ‌నిచ్చిన తల్లిదండ్రుల‌ పట్ల కర్తవ్యలోపము రాకూడదు.‌ స‌కల్పముండాలే కాని ఏ కారణమూ అడ్డము కాదు. వీలైతే ముగ్గురు సద్బ్రాహ్మణులు  భోక్తలుగా దొరకనప్పుడు ~ ఇప్పటి కరోనా ఇబ్బ‌దులవల్ల  ~ హిరణ్య శ్రాద్దా‌న్ని‌ చేయవచ్చును. దేవాలయములోని‌ అర్చకునికి చెప్పితే,  వారు మీతో మంత్రపూర్వకముగా తర్పణము చేయిస్తారు; మీకు తోచిన దక్షిణను తాంబూల సహితంగా ఇవ్వ వచ్చును. 


      ఇదే కాక *ఆమశ్రాద్దము* చేయవచ్చు‌ను. ఒక బ్రాహ్మణునికి కావలసిన *అపక్వ* పదార్థాలను ఇచ్చి అతను చెప్పిన విధముగా మీరు తర్పణాన్ని చేసి అతనికి దక్షిణతాంబూలాదులు ఇవ్వ వచ్చును.  బియ్యము, పప్పుది‌నుసులు,  పాలు, పెరుగు, కొ‌‌న్ని కాయగూరలను ఇచ్చి  వారీంటిలో తళిహ (వంట) చేయించుకుని  భోజనము చేయమని‌ చెప్పవచ్చును. దీన్ని ఆమ శ్రాద్దమని అంటారు. ఈ నాడున్న కరోనా వల్ల కొందరు బ్రాహ్మణులు వంటకు అవసరమైన పదార్థాలను తీసుకొనడానికి ఇష్టపడక పోవచ్చును. అలాంటప్పుడు ఇలా *హిరణ్య శ్రాద్దా‌న్ని*  జరిపించవచ్చును. ఇదే కాక మీ కులదైవానికి దేవాలయములో ఏదో ఒక ప్రసాదాన్ని చేయించి దాన్ని నైవేద్యముగా సమర్పించి పెద్దల గొత్రనామాలతో అర్చన‌‌ చేయించి ప్రసాదాన్ని, దక్షిణ తాంబూలను అర్చకునికి ఇచ్చి నమస్కరించాలి. ఈ పద్దతులను నిష్ట కల స్వాములు అందుబాటులో లేనప్పుడు మాత్రమే పాటించాలి సుమా!


*(శ్రీమతే రామానుజాయనమః)*