6, మే 2022, శుక్రవారం

శంకర జయంతి ప్రత్యేకం - 6

 ॐ          శంకర జయంతి ప్రత్యేకం - 6 

          ( ఈ నెల 6వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి )


శంకరుల అవతారం 


5. వివిధ ఆరాధనలు - పంచాయతనం - సమన్వయం 


    ఈ రోజుల్లో, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్చన/ప్రార్థన/ఆరాధన విధానాన్ని ఒక్కొక్కరు తీసికొనివస్తున్నారు. అనేక సందర్భాలలో ఇతర దేవతారాధనలని నిరసించడం కూడా చూస్తూన్నాం. 

    మిగతా విధానాలపై కనీస అవగాహనలైనాలేక, తమదే సర్వస్వమనుకునే అనేక వర్గాలు తయారవుతున్నాయి. 

    యాంత్రిక జీవితం గడుపుతున్న ఈ రోజుల్లో, శాస్త్రంపై సరియైన అవగాహనలేకుండానూ, 

    వారివారి పద్ధతులు మాత్రమే సరియైనవి అనినమ్మే ఆధునిక గురువుల విధానాలపై అందరూ ఆధారపడుతున్నారు. 


    పూర్వపురోజుల్లో ఏ యతి వచ్చినా, 

    చాతుర్మాస దీక్షకై, సంచారము ఆపి, ఆయా ప్రదేశాలలో ఆగిపోయినా, 

    ఆ ప్రాంతాలవారు సాంప్రదాయ భేదాలేవీలేకుండా, అందరూ ఆ యతిని దర్శించుకోవడం, వారిచ్చే సందేశం వినడం, పాదపూజలు చేయడం జరిగేవి. 

    దీనికి సరియైన కారణం జగద్గురువుల దృక్పథం. 


వివిధ ఆరాధనలు - పంచాయతనం  


    ఆదిశంకరులు ఆ రోజులలోనే వివిధ ఆరాధనా విధానాలని సమన్వయపరచి,  పంచాయతన పూజావిధానం ద్వారా అన్నిటినీ ఒకే తాటిపైకి తెచ్చారు. 

    దాని ద్వారా తత్త్వాన్ని తెలుపుతూ సమైక్య ఆరాధనా విధానాన్ని పటిష్ఠవంతంగా స్థిరపరిచారు.  


పంచశీర్షాలు 


గణపతి అథర్వశీర్షం, 

సూర్య అథర్వశీర్షం, 

నారాయణ అథర్వశీర్షం, 

శివ అథర్వశీర్షం, 

దేవీ అథర్వశీర్షం 

    - అనే ఐదు ప్రామాణికాలలో, 

    మొదటి నాల్గిటిలో "సృష్టి స్థితిలయా"లకి సంబంధించి ఒకే లక్షణాలు వర్ణించబడ్డాయి. 

    నాల్గవదైన దేవీ అథర్వశీర్షంలో మరింత ప్రత్యేకత కనిపిస్తుంది. 

    ఈ ఐదు దైవాలకి సంబందించి, దేశంలో ప్రధానంగా ఐదు ఆరాధనలు ఉన్నాయి.  

    అవి, గాణాపత్య, సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ అనే ఐదు మతాలకి చెందినవి. 


పంచభూతాలు - ఐదుగురు దేవుళ్ళు 


    పంచభూతాలతోనే ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ఐదు శక్తులూ ఐదు దేవతలకి సణబంధించినవిగా ప్రతిపాదింపబడ్డాయి.  

      అవి 

* శక్తి(పృథ్వి - భూ), 

* గణపతి(ఆపః - నీరు), 

* సూర్యుడు(తేజః - అగ్ని), 

* విష్ణువు(వాయుః - గాలి), 

* శివుడు(ఆకాశః)గా పంచభూతాలతో అన్వయించబడ్డాయి. 


    పరమాత్మ ఒక్కొక్క కల్పంలో పంచభూతాలలో ఒక్కొక్కదానిని ఆధారంగా చేసికొని, ఒక్కొక్క రూపాన్ని ధరిస్తాడు. 

    ఒక కల్పంలో వ్యాపకుడుగాయున్న విష్ణువై అవతరించాడు. ఆ కల్పంలో పరబ్రహ్మను నారాయణుగా స్తుతించారు. ఆ రూపంలో ఆయననర్చించిన ఉపాసకులు వైష్ణవులయ్యారు. నారయణ సూక్తం వంటివి ఆయనని స్తుతిస్తాయి. 

    అలాగే మరొక కల్పంలో సూర్యుడు అరుణంవంటివాటితో స్తుతించబడ్డాడు. 

    మరొక కల్పంలో అమ్మవారు శక్తిగా ఆరాధింపబడుతుంటే, మేధాసూక్తం,శ్రీసూక్తం వంటివి అమ్మవారిని కీర్తించాయి. 

    శివుని రుద్రంతో ఒక కల్పంలోనూ, 

    గణపతిని గణపతి సూక్తంవంటివాటితో మరొక కల్పంలోనూ స్తుతించారు. 


    పరమాత్మ వివిధ కాలాలలో వివిధ రూపాలుగా అవతరించినా, అన్నిరూపాలనీ ఎల్లప్పుడూ మనం ఉపాసించడం విశేషం. 

    ఐదు మూర్తులనీ ఒకేచోట చేర్చి, తాను ప్రధానంగా ఉపాసించే దేవతని మధ్యలోనూ, 

    మిగిలిన నలుగురినీ నలుమూలలానూ ఉంచి,  ఆరాధించే పంచాయతనాన్ని శంకరులు ఎంతగొప్పగా సమన్వయపరిచారో కదా! 


    ఈ విధంగా ఐదు రకాల ఆరాధనలలో, ఐదురకాల కేంద్రాలతో (Vishnu centric, Siva centric, Devi centric, Sun centric and Ganesh centric), ఐదుగురు దేవతలనూ కొలవడం అత్యంత ఆవశ్యకం. 


పంచభూతాలు - ప్రపంచము - పాంచభౌతిక దేహము 


    పంచభూతాలూ ఒక్కొక్కదానిలో సగభాగం (1/2),  మిగిలిన నాలుగూ కలిసి (1/8+1/8+1/8+1/8=1/2) సగంగా ఉంటాయి. దానిని పంచీకరణము అంటారు. 

    ఆ ఐదూ కలిస్తేనే ప్రపంచం.  

    పాంచభౌతిక దేహం కూడా ఆ ఐదిటి కలయికే!

    ఐదూ కలిస్తేనే దేహం, ప్ర-పంచమూ కూడా కదా! 


    వేదప్రతిపాదిత ఈ విధానాన్ని వెలికితీసి, ఆనాడే మనకి అందించిన శంకరుల అవతారం ఎంత విశిష్టమైనదో కదా! 


                         కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

5, మే 2022, గురువారం

ముండనం

 ముస్లిం - ముండనం


పరమాచార్య స్వామివారు అప్పుడు కాష్టమౌనంలో ఉన్న కాలం. అందరితోపాటు నేను, నా స్నేహితురాలు నాగలక్ష్మి వరుసలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ముందుకు వెళ్తున్నాము. మా వెనుక వచ్చినతను, “స్వామివారు ఆదేశించినట్టుగానే నేను ఇక్కడకు వచ్చాను” అని అన్నాడు. వెంటనే పరమాచార్య స్వామివారి వైపు చూసి చేతులు రెండూ జోడించి స్వామికి నమస్కరించాడు.


మహాస్వామివారు కూడా అక్కడున్నవారినెవ్వరినీ చూడక, అతనివైపు తీక్షణంగా చూసి చెయ్యెత్తి ఆశీర్వదించారు.


నేను అతని గురించి అడుగగా, తన పేరు సలీం అని, కుంభకోణం నుండి వచ్చానని తెలిపాడు. “నిన్న సామి నా కలలో వచ్చి, ‘రేపు నేను క్షవరం చేయించుకునే దినం. వచ్చి, నన్ను చూసి వెళ్ళిపో’ అని తెలిపారు. అందుకే వచ్చాను” అని తెలిపాడు.


ఆరోజు వపనం దినం - క్షవరం చేయించుకునే రోజు. సన్యాసులు రెండు నెలలకొకసారి పౌర్ణమి రోజు శిరస్సు ముండనం చేయించుకోవాలి. శ్రీమఠంలో దాన్ని సంస్కృత పదమైన ‘వపనం’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. దాన్ని చూడడానికి వెళ్ళడమే మా ఆనవాయితీ. కాని ఆ ముస్లిమ్ భక్తుణ్ణి ఆరోజు రమ్మని చెప్పడమెందుకో నాకు అర్థం కాలేదు. 


నేను అతని గురించి నాగలక్ష్మికి చెప్పగా, “అతని పేరు చెల్లప్పన్ అయ్యుంటుంది. నీ చెవులకి అది సలీం అని వినబడి ఉంటుంది”. అని చెప్పింది. మేము మరలా ఆ ముస్లిం భక్తుణ్ణి కలిశాము. అతను మేడలో రుద్రాక్ష మాలను కూడా వేసుకున్నాడు. మరలా మేము అతణ్ణి అడిగాము, “నువ్వు రుద్రాక్షలు ధరించావు కదా! మసీదులోకి నువ్వు వెళ్ళడానికి వారు అనుమతించరు కదా?”


“అవును నేను ముస్లింనే; పేరు సలీం. ఇంతకుముందే స్వామివారిని నేను మూడు నలుగు సార్లు చూశాను. ఒకసారి స్వామివారు నాకు ఈ రుద్రాక్షలు ప్రసాదంగా ఇచ్చినప్పుడు వీటిని ఏం చెయ్యాలని అడిగాను. అందుకు సామి, ‘అది మెడలో ధరించాలి, కాని నీవారు దాన్ని అంగీకరించకపోవచ్చు. కాబట్టి ఒక డబ్బాలో ఉంచు’ అని చెప్పారు”


సామి వారు ఇచ్చినదాన్ని నేను మెడలోనే వేసుకోవాలని నిర్ణయించుకుని, అలాగే చేశాను. అయినా నేను ప్రార్థనలకోసం ఎప్పుడు మసీదుకు వెళ్ళినా, ఎవరూ నన్ను నిందించలేదు కనీసం ఆ మాలను తీసివేయమని కూడా చెప్పలేదు.

పరమాచార్య స్వామివారి దివ్యశక్తి ఎవరికి తెలుస్తుంది?


--- జయలక్ష్మీ అమ్మాళ్, పొల్లాచి. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.!💐

 💐💐జన్మకు అర్థం..!!!

పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.!💐💐


1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.


2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.


3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.


4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.


5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.


6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.


7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.


ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

 శ్లోకం:☝️

  *కాచం మణిం కాంచన మేకసూత్రే*

*గ్రథ్నాసి బాలే కిము చిత్రమేతత్*

  *అశేషవి త్పాణిని రేకసూత్రే*

*శ్వానం యువానం మఘవానమాహ*


అన్వయం: _కాచం మణిం కాంచనం ఏకసూత్రే గ్రథ్నాసి |_

_(హే) బాలే! కిము చిత్రం ఏతత్ ?_

_తాం ఆహ | అశేషవిత్ పాణినిః , ఏకసూత్రే శ్వానం యువానం మఘవానం (స్థాపితవాన్ ఖలు) |_


భావం: ఒక బాలిక గాజుముక్కను, మణిని, బంగారాన్ని కలిపి ఒకే సూత్రం (దారం)లో గ్రుచ్చి ఆడుకుంటున్నది.

దాన్ని చూచి ఒకాయన - ఓ బాలా! నీవు విలువైన మణిని, సాధారణమైన గాజుముక్కతో కలిపి ఒక చోట కడుతున్నావు ఏమి ఆశ్చర్యం ? - అని ప్రశ్నించాడు.

దానికి ఆ అమ్మాయి - అయ్యా! సర్వజ్ఞుడైన పాణిని కుక్కను, ఇంద్రుని, యువకుణ్ని ఒక్క సూత్రంలో బంధించలేదా? అంతటివాడు ఆ పని చేయగా లేనిది నేను ఒక దారంలో వీటిని చేర్చటం తప్పా? - అని చమత్కారంగా అడిగింది.

ప్రాచీన భారతదేశంలో చిన్నపిల్లలు, పనివాళ్ళు అని కాక అందరికీ ఎంతో కొంత శాస్త్ర జ్ఞానం ఉండేది అని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!

పాణిని అష్టాధ్యాయిలో

*శ్వయువమఘోనామతద్దితే* - అనే సూత్రం అయా శబ్దాలకే చెప్పారు. కానీ ఆ బాలిక సూత్రంలో ఉన్న అర్థాలను చమత్కారంగా ఉపయోగించింది.

*తల్లికి కపిలుడి తత్త్వ బోధ* 

                  ➖➖➖

 *ఏకాగ్రతతో తప్పనిసరిగా చదవండి* 


ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామియై తపోవనాలకి వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి?’ అని చింతించిన దేవహూతి ఒకనాడు….


ధ్యాననిష్ఠుడై వున్న తన కొడుకు కపిల మహర్షిని సమీపించింది.         


తల్లి రాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి 

”అమ్మా… నీ మనస్సులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వాయంభువ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్ధమమహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటులేని సంసారజీవనం సాగించావు. పదిమంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుంది.

‘లేదూ…’ అన్నది లేకుండా చక్కటి జీవితాన్ని గడిపిన నీకు  యీ దిగులు దేనికమ్మా?” అని అడిగాడు.


”నాయనా… నువ్వన్నది నిజమే.  

నా తండ్రి స్వాయంభువ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. 

ఏ లేటూ లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున 

ఏ కొరతా లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. తొమ్మిది మంది ఆడపిల్లలకి, ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థజీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకొని సంతోషిచాను. 


కానీ, నాయనా… నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి, వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందని తపోవనాలకి వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు!   ఒక్కగానొక్కడివి, దైవాంశా సంభూతడివైన నీ పంచన నా శేషజీవితం గడపవచ్చనుకుంటే … నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై    నా ఆశల మీద నీళ్ళు చల్లావు. 


నా తండ్రి, నా భర్త,   కుమార్తెలు, కుమారుడు… ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకొని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు    నా భర్తకి గృహస్థాశ్రమ ధర్మఫలం, కన్యాదానఫలం దక్కింది. వివాహాలైన    నా కూతుళ్ళకీ, కుమారుడివైన నీకూ పితృఋణఫలం దక్కుతుంది. 


ఏ ఫలం, ఫలితం ఆశించకుండా బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి          మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి?” అని వాపోయింది దేవహూతి   గద్గద స్వరంతో.


కపిలుడు మందహాసం చేసి ”అమ్మా! నువ్వేదో భ్రాంతిలో యిలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా” అన్నాడు. 


దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూచి "నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక నాలుగు కదళీఫలాలు భుజించాను కదయ్యా” అంది.


”అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా?” ఆశ్చర్యంగా అడిగాడు కపిలుడు. 


దేవహూతి మరింత విస్తుబోతూ 

”అదేమిటయ్యా … మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్లని ఆరగిస్తున్నాము. 

ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా” అంది. 


కపిలుడు తలపంకించి ”ఓహో… ఋతుధర్మమా?” అన్నాడు. 


‘అవునన్నట్లు’ తలవూపింది దేవహూతి. 


కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ…..

”ఋతుధర్మం అంటే…?” అనడిగాడు. 


ఆ ప్రశ్న విని నిర్ఘాంతపోయింది దేవహూతి.


”అమ్మా… ఋతువుకొక ధర్మం వుంది. అది ఏ కాలంలో ఏవి ఫలించాలో వాటిని ఫలింపజేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ప్రతిఫలంగా మననించి ఏమాశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం?” అని ప్రశ్నించాడు కపిలుడు. 


ఆ ప్రశ్నలకి తెల్లబోతూ ”ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయడం ఋతుధర్మం కదా?” అని ఎదురు ప్రశ్నించింది. 


కపిలుడు మందహాసం చేసి "అంటే, ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తోందన్న మాట! మరి, అరటి సంగతేమిటి? అరటిచెట్టు కాయలిస్తోంది. పళ్లు యిస్తోంది. అరటి ఊచ యిస్తోంది. ఈ మూడూ మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. 


అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యాన్నిస్తున్నాయి. శుభ కార్యాల సంధర్భాల్లో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలుపుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం.   కాయలు నరుకుతున్నాం.  అరటిబోదె నరుకుతున్నాం. చివరికి దాన్ని తీసిపారేస్తున్నాం. మనం ఇన్ని విధాలుగా హింసించి కృతఘ్నులం అవుతున్నా అరటిచెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తుంది… మననించి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు, చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. 


మరి, ఇన్నింటి మీద ఆధారపడిన యీ దేహం తన ‘దేహధర్మం’ నిర్వర్తిస్తోందనీ, ఆ దేహధర్మం ప్రతిఫలం, కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లీ…” అని ప్రశ్నించాడు కపిలుడు సూటిగా. 


నిశ్చేష్ఠురాలైంది దేవహూతి. 


కపిలుడు మందహాసం చేసి "అమ్మా… నువ్వు బాల్య, యవ్వన, కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. ‘నువ్వు’ అంటే ఎవరు?   ఈ నీ దేహమా? 

దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా!    నశించిపోయే దేహం కోసం చింతిస్తావెందుకు?      ఒక శరీరాన్ని 

నీ ‘తండ్రి’ అన్నావు.   మరొక శరీరాన్ని 

నీ ‘భర్త’ అన్నావు. మరికొన్ని దేహాలని ‘సంతానం’ అన్నావు. 


ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే! నీ తల్లి, తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ ఈ దేహం ఎలా తయారైందో, నీ సంతానంగా చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారుచేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా?” అని అన్నాడు. 


దేవహూతి నిర్విణ్ణురాలైంది. 


కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగమును ఉపదేశించసాగాడు…


”అమ్మా… మనస్సు అనేది బంధ – మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగుల్కొని దుఃఖ భాజనుడవుతాడు.    నేను, నాది, నావాళ్ళు అన్న  ఆ శాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతాడు.    జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ‘ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు’ అన్న భ్రమలో మునిగివుంటాడే గాని, నిజానికి ఏ జన్మా, ఏ దేహం శాశ్వతం కాదు. తనది కాదు. 


దేహంలోని జీవుడు బయల్వెడలినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతడిని అనుసరించదు. ఇంక, ‘నా వాళ్ళు’ అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతోటే దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఆ దేహంతోటి అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహ-పర సుఖాలకి దూరమై, జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తుంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీది నీటిబిందువువలె దేహకర్మబంధాలకి అతీతుడై, దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉండి, ఆచరించినట్లయితే కర్మబంధాలకు, దేహబంధాలకు అతీతంగా, ఆత్మరూపుడై ద్వందా తీతుడవుతాడు.


అరటి పిలక     మొక్క అవుతుంది. ఆకులు వేస్తుంది. పువ్వు పుష్పిస్తుంది. కాయ కాస్తుంది. కాయ పండు అవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దానిస్థానంలో మరొక మొక్క పుడుతుంది. 

ఈ పరిణామక్రమంలో ఏ దశలోనూ ‘తనది’ అనేదేదీ దానికి లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడడం, రూపనాశనం పొందడం… ఇది దాని సృష్టి ధర్మం.


"మానవజన్మ కూడా అంతే… దేహాన్ని ధరించడం.. దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్త మాత్రంగా అనుభవించడం… దేహియైనందుకు సాటి దేహాలకి చేతనైనంత సేవ చెయ్యడం… చివరికి జీవుడు త్యజించాక భూపతనమై, శిధిలమై నశించిపోవడం… ఇంతకు మించి ‘నేను… నాది… నావాళ్ళు’ అన్న బంధం ఏ దేహానికీ శాశ్వతం కాదు.


ఇక దేహంలోకి వచ్చిపోయే ‘జీవుడు’ ఎవరంటే …. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు.   ఈ జీవుడు ‘జ్యోతి’ వలె ప్రకాశిస్తూ ‘ఆత్మ’ అనే పేరిట భాశిస్తుంటాడు. 


🙏ఇలాంటి కోట్లాది ‘ఆత్మ’ల ఏకత్వమే ‘పరమాత్మ’… 


ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే 🙏నిరాకారుడు. ఇతడే ‘భగవంతుడు’. 


ఆది, అనాది అయినవాడు యీ ‘భగవంతుడు.’ ఈ భగవంతుడు ‘ఆత్మ’గా ప్రకాశిస్తుంటాడు. ఇతడు ఇఛ్ఛాపూర్వక సృష్టికి సంకల్పించినప్పుడు… అప్పటి వరకు నిరాకారమైన తాను ‘సాకారం’గా తనని తాను సృష్టించుకుంటూ ‘దేహం’ ధరిస్తాడు. ఆ ‘దేహం’లోపల ‘జీవుడు’ అన్న పేరిట ‘ఆత్మ’గా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు…. ఆడిస్తాడు… ఒక్కదేహం నించి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల్లో ‘ఆత్మపురుషుడిగా’ తానుంటూ, 

ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపి వినోదిస్తాడు. 


ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ… కధకుడు తానైనా ఏ కథతోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీది నీటిబొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను, వాటి కథలను నడిపిస్తాడు… ఏ దేహి కధని ముగిస్తాడో, ఆ దేహం రాలిపోతుంది. 


దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికేవరకూ దేహరహితంగా సంచరిస్తూ వుంటుంది.


ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనకే ఆ పరమాత్మని ‘దేవుడు’ అన్నారు. ఈ దేవుడినే పురుషుడు అంటారు. 

ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు. కనుక ఇతడిని ‘నిర్గుణ పరబ్రహ్మము’ అంటారు. 

ఇతడిలో అంతర్గతంగా వుండి సృష్టికి సహకరించేది ప్రకృతి.


ఈ జీవసృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టి, స్థితి, లయములను నిర్వర్తిస్తున్నా… ఏదీ ‘తనది’ అనడు… 

ఏ దేహంతోనూ సంబంధం కలిగి వుండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది?”


కపిలుడు అలా వివరంగా ఉపదేశించి 

”అమ్మా… దేహం ఉన్నంతవరకే బంధాలు – అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వితం అన్నప్పుడు దానితోపాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం? 


తల్లీ, అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలో శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా! మనస్సే బంధ మోక్షములకు కారణం. అరిషడ్వార్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్దమవుతుంది. పరిశుద్దమైన మనస్సులో వున్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. ‘దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా’ మిధ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే నన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో, సర్వత్రా పరమాత్మమయంగా భావించి, అంతటా ఆ పరంధాముడిని దర్శించగలిగితే… దేహం ఎక్కడ? దేహి ఎక్కడ? 


నేను – నాది అనే చింత నశించి … భక్తిమార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది … అమ్మా, ‘మోక్షం’ అంటే ఏమిటో తెలుసా? 

ఏ ‘పరమాత్మ’నించి అణువుగా, ఆత్మగా విడివడ్డామో… ఆ ‘పరమ – ఆత్మ’లో తిరిగి లీనమైపోవడం. 


తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో… అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించడం” అని ఉపదేశించాడు.


దేవహూతికి ఆత్మానందంతో ఆనందభాష్పాలు జాలువారాయి. అప్పటివరకూ తన పుత్రుడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడు దృగ్గోచరమయ్యాడు. 


”నారాయణా… వాసుదేవా… పుండరీకాక్షా… పరంధామా… తండ్రీ… 

నీ దివ్యదర్శన భాగ్యం చేత 

నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివైన నీ కీర్తిని సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహాత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యగాత్మవు, వేదగర్భుడవు అయిన నీవు 

నా గర్భమున సుతుడవై జన్మించి 

నా జన్మను చరితార్థం చేశావు. సృష్టిరహాస్యాన్ని బోధించి, నా అహంకార, మమకారాలను భస్మీపటలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు. తండ్రీ… ఈ దేహముపైన, ఈ దేహబంధాలపైన నాకున్న మోహమును నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకే కోరికలు లేవు. పరమాత్ముడివైన నీలో ఐక్యం కావడానికి, జన్మరాహిత్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రీ…” అని ప్రార్థించింది దేవహూతి ఆర్థ్రతతో.


కపిలుడు మందహాసం చేసి ”తల్లీ! సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కన్పించే యీ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. చరాచర జీవరాసులన్నిటియందూ శ్రీమన్నారాయణుని ప్రతిష్టించుకొని ‘సర్వం వాసుదేవాయమయం’గా భావించు. నీకు జీవన్ముక్తి లభిస్తుంది” అని ప్రబోధించి తానే స్వయంగా ఆమెకు మహామంత్రమైన…

 ”ఓం నమో నారాయణాయ” ఉపదేశం చేశాడు.


3, మే 2022, మంగళవారం

వైశాఖ పురాణం - 3 వ అధ్యాయము

 _*మంగళవారం మే 3, 2022*_


_*🚩వైశాఖ పురాణం - 3 వ అధ్యాయము🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*వివిధ దానములు - వాని మహత్మ్యములు*


☘☘☘☘☘☘☘☘


నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.


అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు  సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును (పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక , మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును , పరుపును , దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును , సుఖవంతుడు , భోగవంతుడు , ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును. గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ , ఉన్ని , గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు. సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసినవారికిని వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ , దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా ! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.


ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు , మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర , తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు , పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును. పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి , మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును. పోక చెక్కలను , సుగంధద్రవ్యమును , కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు , ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.


సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము , నీడలోనున్న యిసుక తిన్నెలు , చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు , జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.


మార్గమున తోట , చెరువు , నూయి , మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి , చెరువు , తోట , విశ్రాంతి మండపము , చలివేంద్రము , పరులకుపయోగించు మంచి పనులు చేయుట , పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.


సచ్చాస్త్రశ్రవణము, తీర్థయాత్ర , సజ్జన సాంగత్యము , జలదానము , అన్నదానము , అశ్వర్థరోపణము (రావి చెట్టును నాటుట)  పుత్రుడు అను నేడును సప్తసంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును. పుణ్యపాప వివేకములేని పశువులు , పక్షులు , మృగములు , వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.


ఉత్తమములైన పోకచెక్కలు , కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును. తాంబూల దాత కీర్తిని ధైర్యమును , సంపదను పొందును. నిశ్చయము , రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు , ధనవంతుడు నగును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును. వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును , అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును. తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.


విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము. వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.



*వైశాఖపురాణం మూడవ అధ్యాయం  సంపూర్ణం*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

            *న్యాయపతి*

        *నరసింహా రావు*


🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏🌞🙏

గుబులు

 గుబులు

------- 


యవ్వనంతో పాటు 

ఒంట్లోకి అడుగుపెట్టింది అందం

అద్దెవాటాలోనే అలా ఒదిగి ఉండిపోలేక

అదేం చనువో, 

ఒళ్ళంతా అల్లుకుపోయింది

ఇక నాకూ తనకూ ఒకే లోకమైపోయింది 


వీథుల్లో అలా వెళ్ళిపోయే కళ్ళు

వెనుదిరిగి చూడటం నేర్చుకున్నాయి

వీథుల్లో వెడుతుంటే వెంటాడటమూ మొదలెట్టాయి

కోరికలు, మోహాలు నామీదే దృష్టి పెడుతుంటే

ఆప్యాయతలు మాత్రం

అస్తమానం ఇంట్లో దిష్టి తీయడాలు చేస్తుండేవి 


అందం అజమాయిషీలో

బంధాలూ బంధుత్వాలూ

ఇబ్బడిముబ్బడిగా ముడిపడిపోయాయి

ఆస్తులు...

ఎన్ని అంతస్తులు దిగొచ్చాయో గానీ

పరపతితో కూడిన ప్రపంచాన్ని 

బహుమతిగా తెచ్చి నా ముందు పడేసాయి 


ఒంటి చుట్టూ ఉన్న మైదానంలో

కొంటెచూపుల కాలం పరుగులు తీస్తుంటే

ఏ చికాకు వేసిందో ఏమో

అద్దెవాటా ఖాళీ చేసేసి యవ్వనం

చెప్పాపెట్టకుండా ఒంటరిగా వెళ్ళిపోయింది

వెళ్ళనా ? వద్దా ?? అంటూ వెనుకాడుతున్న

అందాన్ని నా ఒంట్లోనే వదిలేసి 


ఎంతకాలంగా వేచిచూస్తోందో ఏమో

'నడివయసు' చల్లగా నడిచొచ్చేసింది

యవ్వనం ఖాళీ చేసేసిన ఆ వాటాలోకి 


పెరుగుతున్న బరువులు

అక్కడక్కడా కూడుకుంటున్న కొవ్వులు

నెరుస్తున్న వెంట్రుకలు

మొహం పైని సన్నని గీతలు ముడుతలు

కళ్ళు కింది నల్లని వలయాలు

అందం ముందుకొచ్చి అద్దం చూపిస్తూ 

'బస్తీ మే సవాల్' అంటూ అరవడం మొదలెట్టాయి 


వంటింట్లో కొవ్వు లేని వంటలు

నట్టింట్లో కొవ్వును కరిగించే వర్కౌట్‌లు 

ఆలస్యం లేకుండా అట్టే మొదలయ్యాయి

పైపై పూసే పూతలు... ప్రకృతి చికిత్సలు

ఫలితం ఏమొస్తుందో తెలియని

ప్రయోగాలు ఎన్నెన్నో చోటుచేసుకున్నాయి 


ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండే అందం 

ఈమధ్య ఎడమొహం పెడమొహంగా ఉంటోంది

ఎపుడెళ్ళిపోతానంటుందో అని 

నాకేదో తెలిసీ తెలియని గుబులుగా ఉంది 


అందంతో జీవితం ఇక ఇంతేనా..?

అందంతో సాన్నిహిత్యం అశాశ్వతమేనా...??


          .... శ్రీధర్ చౌడారపు (03.05.2022)

మనకే తెలియదు

 మనకు ఏం కావాలో మనకే తెలియదు. 


*ఒక చిన్న కథ*ద్వారా తెలుసుకుందాం. 


ఒక రోజు భక్తుడు: నేను ఇంటికెళ్లే రోడ్డు మీద బంగారం దొరికేలా ఆశీర్వదించండి స్వామి!! అని అడిగాడు. 


స్వామిజీ:   ఎవరిని కొరుకుంటున్నావురా అబ్బాయ్ దేవుడి నేనా?


భక్తుడు: అవును బాబాయ్ , దొరికితే చాలా బాగుండు!


స్వామిజీ:  దొరికితే ఎం చేస్తావ్?


భక్తుడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు పెట్టుకోవచ్చు.


స్వామిజీ:  ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కద..


భక్తుడు: అవును ..నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి.


స్వామిజీ:  ఎంత?


భక్తుడు: ఒక 100 కొట్లు.


స్వామిజీ:   ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు కొరుకోవచ్చు కదా..


భక్తుడు: అవును లే, ..ఎలాగు దేవుడినే కదా.. సరే లక్ష కొట్లు కోరుకుంటా..


స్వామిజీ:  ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ?


భక్తుడు: బిల్డింగులు, కార్లు కొంటాను!


స్వామిజీ:  పిచ్చోడ!  దేవుడిని, అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని కొంటే???


భక్తుడు: ఇంకేముంది సుఖ సంతోషాలతో ఆనందంగా  ఉండొచ్చు


స్వామిజీ:  పిచ్చివాడా, అదేదొ దేవుడిని సంతోషం కావాలని కోరుకోవచ్చు కదా..?? 


భక్తుడు :నిజమే స్వామి 🙂😐😶😑


మిత్రులారా! మనకు ఏం కావాలో, మనకు తెలియదు...

మనకు ఏమి అర్హత కలదో, ఈశ్వరునికి తెలుసు 

అందుకే ఈశ్వరునికి సంతోషము కలిగించే పనులు చేస్తే, ఈశ్వరుడు మన అర్హతను బట్టి, మనకు కావలసినవి, దానితో పాటు మనకు సంతోషం,సంతృప్తి  ఇస్తాడు.

అహం బ్రహ్మాస్మి

 శ్లోకం:☝️ఆత్మబోధ - 37

*ఏవం నిరంతరాభ్యస్తా*

    *బ్రహ్మైవాస్మీతి వాసనా l*

*హరత్యవిద్యావిక్షేపాన్*

    *రోగానివ రసాయనం ll*


భావం: "అహం బ్రహ్మాస్మి" అన్న భావన నిరంతరము చేయుట వలన అవిద్యా విక్షేపములను హరించును. ఔషధము రోగములను నిర్మూలించినట్లు.🙏

*స్మశాన నారాయణస్వామి

 *స్మశాన నారాయణస్వామి* *ఆలయం,*

*ఆలంపుర్*


పితృ దోషము నుండి బయటపడే 

సులువైన పరిష్కారం..


#పితృదోషం మన తాతలు తండ్రులు 

సంపాదించిన ఆస్తిపాస్తులను 

వంశపారంపర్యంగా అనుభవించటానికి 

మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...

అలాగే... 

తాతలు తండ్రులు చేసిన 

పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.

మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.

అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు..


మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే #పితృదోషం


ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.

అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.

పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.


ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.

వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.

పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...


🔻 చిన్న వారు అకాలమరణం పొందడం 


🔻 శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.


🔻 అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం.


🔻 మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం.


🔻 మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం


ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం

దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.

స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...

అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.


1. కాశీ

2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)


అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.


విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .

అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.


స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....

పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు . 

స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.

ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును ) 

అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.


ఈ ఆలయ ప్రాముఖ్యము  తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !

ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం..


చేరుకొనే విధానం:


అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "


ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి!


దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.


    🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏