15, డిసెంబర్ 2021, బుధవారం

తేయాకు

 తేయాకు గురించి సంపూర్ణ వివరణ - లాభనష్టాలు .


    తేయాకులో రెండు జాతులు కలవు. ఒకటి ఆకుపచ్చగా ఉంటుంది. దీనిని ఆంగ్లము నందు Viridis అంటారు. రెండొవది నలుపురంగులో ఉండును. దీనిని Bohea అని పిలుస్తారు . నల్లని తేయాకు చైనా , జపాన్ దేశముల పంట .ఈ మధ్యకాలంలో జావా దీవి యందు బ్రెజిల్ దేశము నందు కూడా ఈ రకము సాగుచేస్తున్నారు.


              200 సంవత్సరాల వరకు కూడా తేయాకు గురించి యూరపు ఖండములో తెలీదు .1664 వ సంవత్సరములో ఈస్టిండియా కంపెనీ వారు తేయాకును యూరపు ఖండంనకు పరిచయం చేసి దిగుమతి చేసినారు. మొట్టమొదట బ్రిటిష్ రాజుగారికి బహుమానంగా రెండు పౌనుల రెండు ఔన్సుల తేయాకును తెచ్చి ఇచ్చారు. ఫ్రెంచ్ దేశములో తేయాకు వాడకం తక్కువ కాని కాఫీ , పొగాకు , వైన్ వాడకం ఎక్కువ. నిద్రమత్తు వదలడానికి , శరీరంలో నూతన ఉత్తేజం నింపడానికి తేయాకు పానీయం వాడుతారు. తేయాకు పానియం లో ఎటువంటి పోషకవిలువలు లేవు కాకుంటే దంతబాధతో ఉన్నప్పుడు తేనీరు పాలు కలపకుండా తీసుకోవడం వలన దంత బాధ నుంచి కొంతమేర ఉపశమనం కలుగును.


             తేనీరు వలన లాభాల కంటే నష్టాలు ఎక్కువ కలవు. అలసట , బలహీనత, రక్తహీనత కలిగిన రోగులు తేనీరు సేవించినచో ఎక్కువ నష్టం జరుగును. తేనీరు ఉదయాన్నే ముఖప్రక్షాళన పిదప సేవించినచొ కొంతకాలం పిదప ఉదరము నందు వాయువును పుట్టించును మరియు మంట కలిగించును. సర్వరోగములకు మూలకారణం అగును. ఆకలిని చంపును. నల్లని తేయాకు మరియు కాఫీ ఇంకా ఎక్కువ దుష్పరిణామాలు కలుగచేయును. నాడి ఎక్కువ కొట్టుకొనును. గుండెవేగం పెరుగును . మూత్రపిండాలపైన ప్రభావం ఎక్కువ చూపడం వలన మూత్రము ఎక్కువ వచ్చును. ఎక్కువ కాలం తేనీరు అధిక మోతాదులో సేవించిన చర్మం శీఘ్రముగా పాలిపోవును. శరీరం నందు అమితమైన వేడిని పెంచును. కన్నులు లోతుకు పోవును . నాడి బలహీనం అగును.


           శరీరం నందు ఏదైనా వ్యాధి వృద్ది చెందే సమయంలో తేనీరు అధికంగా సేవించుచున్న కాళ్లు , చేతులు చల్లబడి చెమట పుట్టును . జీర్ణాశయం పైన అత్యధిక ప్రభావం చూపును. కొన్ని ప్రాంతాలలో ఈ తేయాకును కూడా కల్తి చేయుచున్నారు. నల్లని ముతక తేయాకును ఇనప పెనం పైన కొంచం వేడి చేసి ఆకుపచ్చని రంగుకు మార్చి దానికి నీలిమందు , తెల్లసీసం మిశ్రమమును చేర్చి తద్వారా రేగుపండు రంగు వలే నవనవలాడే కోమలమైన ఆకుపచ్చని తేయాకు వలే ఉంగరములుగా చుట్టుకొని ఉండునట్లు సిద్ధము చేయుచున్నారు ఇది అత్యంత ప్రమాదకరం . ఈ విధానములో ఎక్కువుగా కల్తి చైనాలోని కాంటస్ అనే ప్రదేశములో ఎక్కువుగా తయారుచేయుచున్నారు.


                  తేయాకు దంతములకు కానరాని హాని చేయును . అకాల దంతక్షయం కలుగచేయును . తేనీరు తీక్షణ తత్వం ఎక్కువ. వేడిగా ఉండగా తేనీరు సేవించుతాం అందువలన చిగుళ్లకు కూడా తీవ్రమైన నష్టం కలుగును. చిగుళ్లకు రోగం పుట్టించి దంతముల లోపల పుచ్చు వ్యాధిని కలుగచేయును . ఒక సన్నటిపొర నోటిలోపల ఉండును. అదే పొర పొట్టవరకు వ్యాపించి ఉండును. పొట్టలోపల కూడా అదే పొర ఉండును. పొట్టకు కీడుచేయు పదార్దాలు అన్నియు దంతములకు కీడు చేయును . వేడివేడి పానీయాలు మరియు అతి చల్లటి పదార్దాలు పొట్ట మరియు దంతములు రెండింటికి కీడు చేయును . తేనీటిని ప్రతినిత్యం సేవించువారి సంతానం వంశపారంపర్యంగా "గండమాల" అను వ్యాధి సంప్రాప్తిచ్చును . స్త్రీ అధికంగా తేనీరు సేవించుట వలన నాడీదౌర్భల్యం సంభవించును. ముఖ్యంగా గర్భనాడులను దుర్భలపరుచును. దీనివలన ఆ స్త్రీకి కలుగు సంతానముకు వంశపారంపర్య వ్యాధులు సంక్రమించును. ముఖ్యంగా క్షయ , గండమాల వంటి వ్యాధులు సంభంవించును. 


          పైన చెప్పిన విధముగా టీ మరియు కాఫీలను పూర్తిగా నిషేధించి ఆరోగ్యాన్ని కాపాడుకొనగలరు.


       గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ధృతరాష్ట్రులమేనా

 *మనమంతా ధృతరాష్ట్రులమేనా.....❓*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


💫 *వ్యాస మహర్షి ఏ ఉద్దేశ్యంతో భగవద్గీత ప్రారంభంలోనే ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చి ఉండాలి? మనకు ఇస్తున్న సూచన ఏమిటి?*


💫 *వ్యాఖ్యానం :* 

సూక్ష్మంగా ధృతరాష్ట్రుని ప్రశ్నతో భగవద్గీత ప్రారంభమవుతున్నది.  


*ధృతరాష్ట్ర ఉవాచ*:


*శ్లో* ॥ 

*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |*

*మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ! || (1)*


*వ్యాఖ్య* :


*'ధృతరాష్ట్ర ఉవాచ'* : 


💫 *శుభమా అని గీతాధ్యయనం ప్రారంభిస్తూ, దుష్టుడైన గ్రుడ్డిరాజు ధృతరాష్ట్రుని తలచుకోవటమా? ఇదేమిటి? ఎందుకిలా జరిగింది? మహామేధావి, మహాజ్ఞాని ఐన వ్యాసుడు ఎందుకిలా ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చాడు ప్రారంభంలోనే? ఏమిటి ఇందులోని ఆంతర్యం?*


💫 *వ్యాసమహర్షి ఎంతో నేర్పుతో, కావాలనే ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చి ఉండాలి. దీనిలో ఎంతో లోతైన భావం ఉంది.* 


💫 *అసలు ధృతరాష్ట్రునికి ఆ పేరు పెట్టినవాడు వ్యాసమహర్షే.*


💫 *ఒక్క ధృతరాష్ట్రునికే గాదు, మహాభారతంలో చాలామందికి నామకరణం చేసింది ఆయనే. నామకరణం చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. పేరు వినగానే వాడి గుణగణాలు, బుద్ధులు అన్నీ తెలిసిపోతాయి.*


💫 *మనమూ పెడుతుంటాం పేర్లు బాలసారె రోజున. 'సత్యనారాయణ' అని పెడతాం. వాడు చచ్చినా నిజం చెప్పడు. 'ఆనందరావు' అంటాం. ఎప్పుడూ ఆముదం త్రాగిన ముఖం పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. 'సుందరమ్మ' అని పెడతాం పేరు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. 'అన్నపూర్ణ' అంటాం. ఎంగిలిచేత్తో కాకిని తోలదు, పిల్లికి బిచ్చం పెట్టదు. 'శాంతాదేవి' అని పెడతాం. ఎప్పుడూ అశాంతే. సన్యాసం పుచ్చుకున్న తర్వాత 'స్వామి ఆత్మానంద' అని పేరు పెట్టుకుంటారు. ఆత్మానందం మాట దేవుడెరుగు, ఎప్పుడూ చిటపటలే, నిప్పుమీది మిరపకాయలే.*


💫 *కాని, వ్యాసుడు చేసే నామకరణం అలా ఉండదు. చక్కగా అతికినట్టు సరిపోతుంది.*


💫 *'ధృతరాష్ట్రుడు' అంటే తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నవాడు అని. నిజంగా ధృతరాష్ట్రుడు చేసింది అదే. చేతికి చిక్కింది గదా అని పాండవుల రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నాడు. ఆఖరుకు శ్రీకృష్ణుడే వచ్చి చెప్పినా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు.*  


💫 *ఈ ధృతరాష్ట్రునికి గీతను బోధించినవాడు సంజయుడు. 'సంజయుడు' అంటే, 'సమ్యక్ జయం' పొందినవాడు. అంటే ఇంద్రియాలను చక్కగా జయించినవాడు అని. అట్టివాడు గనుకనే వ్యాసులవారి అనుగ్రహంతో దివ్యనేత్రాన్ని పొంది శ్రీకృష్ణుని గీతాబోధను సాక్షాత్తుగా విన్నాడు. ఆయన విశ్వరూపాన్ని దివ్యనేత్రంతో తిలకించి పులకించిపోయాడు.*


💫 *అట్టి సంజయుని ద్వారా గీతా బోధను విన్నా, ధృతరాష్ట్రునికి ఏమీ ప్రయోజనం కలగలేదు. కాని అర్జునునికి మాత్రం గీతా బోధతో మోహం తొలగింది, స్మృతి కలిగింది. ఇద్దరూ విన్నది ఒకే విషయం.*


💫 అయినా ఎందుకీ తేడా? *అర్హతలోనే తేడా. కనుక ధృతరాష్ట్రుని లాగా వినవద్దు - విన్నా ప్రయోజనం ఉండదు అని చెప్పటమే ధృతరాష్ట్ర ప్రసక్తిలోని ఆంతర్యం.*


💫 అంతేకాదు, *మనందరం ధృతరాష్ట్రులమే. కనుకనే ఈ హెచ్చరిక. ఎలా? తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నవాడు గదా ధృతరాష్ట్రుడు అంటే - మరి మనం చేస్తున్నదేమిటి? ఎన్నో హీన జన్మలెత్తిన తర్వాత, ఆ జన్మలన్నీ వ్యర్థం గనుక, మోక్షాన్ని పొందటానికి తగిన మానవజన్మను ఇవ్వమని భగవంతుని ప్రార్థించి, ఈ జన్మను తెచ్చుకున్నాం. ఈ శరీరమనే రాజ్యానికి ప్రభువయ్యాం. అంతే. ఇక భగవంతుని మరచిపోయి, మనం ఎందుకు ఈ దేహాన్ని తెచ్చుకున్నామో మరచిపోయి, ఇది ఒక అద్దె కొంప లాంటిదని, జాగ్రత్తగా వాడుకుంటూ, సమయం రాగానే ఆయన ఇచ్చినదాన్ని ఆయనకు అప్పగించి వెళ్ళాలనే జ్ఞానం లేకుండా, ఇది నాదేనని, అసలు నేనేనని గట్టిగా పట్టుకు కూర్చున్నాం. శాస్త్రాలు, పెద్దలు "ఈ దేహాత్మ బుద్ధి' ని వదలరా బాబూ, నీవు దేహానివి కాదు, నీవు ఆత్మవు; ఈ దేహాన్ని నీవు వాడుకోవటానికి భగవంతుడిచ్చిన పరికరం మాత్రమే" అని ఎంత చెప్పినా వినిపించుకోం.*


💫 *సంపాదించుకోవటం, తినటం, తిరగటం, దాచుకోవటం, దోచుకోవటం - ఇదే మన పవిత్ర కర్తవ్యం అనుకుంటూ, వ్యర్థమైన పనులకు మాత్రమే దీనిని వినియోగించుకుంటున్నాం. ఒకవేళ భగవంతుడు 'నేనిచ్చిన దేహాన్ని నాకివ్వమని' బలవంతంగా లాగివేస్తే తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ దేహాలను తెచ్చుకొనేందుకు వీలుగా కర్మలు చేస్తూ, జన్మ కర్మ వలయంలో పడిపోయి, తిరిగి తిరిగి ఈ దేహాలను తెచ్చుకుంటున్నాం. మరి ఇలా గట్టిగా ఈ దేహమనే రాజ్యాన్ని పట్టుక కూర్చున్న మనం ధృతరాష్ట్రులం కాదా?*


 💫 *అందుకే ఓ ధృతరాష్ట్రులారా! మీరు కూడా ఆ ధృతరాష్ట్రుని లాగానే ఈ అద్భుత జ్ఞానాన్ని వింటే, ఆయనకెలాగైతే విన్న జ్ఞానం వంటబట్టక వృథా అయిందో, మీకూ అంతే. కనుక అర్జునునిలాగా మారి వినండి. భగవంతుని చేరుకోవాలనే తపనతో; నావాళ్ళు, నా రాజ్యం అంటూ మమకారం పెట్టుకోకుండా; మనస్సును నిర్మలం చేసుకొని, బుద్ధిని సూక్ష్మం చేసుకొని వినండి అని చెప్పటానికే 'ధృతరాష్ట్ర ఉవాచ' అని గ్రుడ్డిరాజును గుర్తు చేయటం.*



*సేకరణ:* ఆధ్యాత్మిక భక్తిప్రపంచం 

🙏🙏🙏🙏🙏

సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము

 సూర్యుడు నెలకు ఒక రాసి చొప్పున 12 నెలలు 12 రాశులలో సంచరిస్తాడు. ఆ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అని పిలుస్తారు. ధనుర్మాసము దక్షిణాయణంలో చివరి మాసము. ఈనెల 16న ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి 13 న ముగుస్తుంది. సూర్యుడు రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణము అంటారు. సూర్యుడు జనవరి 14న మకర రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు సంచరించే పన్నెండు నెలలు కలిపి దేవతలకు ఒక సంవత్సరం.


ఒక సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు. మొదటిది ఉత్తరాయణం రెండోది దక్షిణ దక్షిణాయనం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు. దక్షిణాయణం అంటే రాత్రి వదలి పగలు ప్రవేశించే సమయం, ప్రాంతః కాలం వంటిది. మకర సంక్రాంతి రోజున, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటంతో దక్షిణాయణం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది.ధనుర్మాసంలో, ప్రతి ఇంటి ముందు సాయంత్రము రంగవల్లులు వేసి మరుసటి ఉదయం ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను రంగవల్లుల మధ్యలో ఉంచి పూజించడం ఆనవాయితీ. మద్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను మహాలక్ష్మిగాను చుట్టూ ఉన్న గొబ్బెమ్మలను గోపికలు గాను భావించి, పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ కొలుస్తారు. ఈ విధంగా గొబ్బెమ్మలను పూజించడం వల్ల పెళ్లి కాని కన్యలకు, త్వరగా మంచి మొగుడు లభించి వివాహమవుతుందని నమ్మకం.


హరిదాసులు, గుమ్మడి కాయ వంటి గిన్నెను నెత్తిన పెట్టుకొని, హరి సంకీర్తనలతో ప్రతి ఉదయము ఇంటి ముందుకు రావటం ధనుర్మాసం ప్రత్యేకత. హరి సంకీర్తనలతో శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తుంది. భూమిని నెత్తిన పెట్టుకొని వచ్చిన సాక్షాత్తు శ్రీమహావిష్ణుగా హరిదాసును భావిస్తారు.

* "వాదః ప్రవదతామహమ్

 ॐ గీతా జయంతి 


                        సందేశం - 2 


* "వాదః ప్రవదతామహమ్" 

      - వాదించువారిలో వాదించు శక్తి నేనే. 

       I am the logic among controversialists. 

          - Bhagawadgeetha 10/32 

 

వివరణ 


    ఒక్కొక్కడు ఒక్కొక్క విషయాన్నిగూర్చి వాదిస్తాడు. 

* ఒకడు తన నమ్మకాలని గూర్చి వాదిస్తాడు. 

* ఒకడు తన కోరికలని గూర్చి వాదిస్తాడు. 

* ఒకడు తనకు వ్యామోహమున్న వస్తువులను గూర్చి వాదిస్తాడు. 

* ఒకడు తాను సత్యమనుకొన్నదానిని గురించి వాదిస్తాడు. 

    ఎవడు దేనిని గూర్చి వాదిస్తాడో, వాడక్కడ నుండి బయలుదేరి, అంతర్యామిని అనుభవించదానికి ప్రయాణం కడుతున్నాడు. 

    వాదించుచున్నది తానే కనుక, వాదన నుండి బయలుదేరి, వాదించుచున్న తన వద్దకు చేరుకుని, అందలి తనను తెలుసుకొని, ఈ మొత్తం తానే అని దర్శిస్తాడు. 

    కాబట్టి వాదించు వారిలో వాదించు శక్తి దేవుని వైభవము. 


    వాదము "వాద - జల్ప - వితండ" అని మూడు విధాలు. 


1. రాగద్వేషాలు లేకుండా, కేవలం తత్త్వాన్ని తెలుసుకొనే అభిలాషతో చేయబడే ప్రశ్నోత్తరాలని "వాదము" అంటారు. 


2. పరులు ప్రతిపాదించిన విషయాలను ఖండించి, తన ప్రతిపాదిత విషయాలను స్థాపించుకొని, ఇతరులని జయించాలని చేసే ప్రసంగం "జల్పం" అనబడుతుంది. 


3. కేవలం పరుల ప్రతిపాదిత విషయాలను దూషించు ఉద్దేశ్యంతో చేయబడేది "వితండం". 


    By the word "controversialists", we should here understand the various kinds of people using various kinds of argumentation in logic such as "Vada, Jalpa and Vitanda". 


1. Vada is a way of arguing by which one gets at the truth of a certain question. 

     The aspirants who are free from Raga - Dvesha and jealousy raise amongst themselves questions and answers and enter into discussions on philosophical problems in order to ascertain and understand the nature of the Truth. 

    They do not argue in order to gain victory over one another. This is Vada. 


2 Jalpa: 

      Jalpa is wrangling in which one ascerts his own opinion and refutes that of his opponent.


3. Vitanda: 

      Vitanda is idle carping at the arguments of one's opponents. 

      No attempt is made to establish the other side of the question. 


       In Jalpa and Vitanda one tries to defeat another. There is desire for victory. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

మొట్టమొదటి మహిళా కళాశాల

 ఆంధ్రాలో మొట్టమొదటి మహిళా కళాశాల...శ్రీ పద్మావతీ మహిళా కళాశాల, తిరుపతి.........

అదెలా వచ్చిందంటే.....ఆ కాలేజీ అంత గొప్ప గా ఎలా అయిందంటే....

 అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో...

అబ్బాయిల కళాశాలలో అమ్మాయిలను చేర్చుకోరాదని మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ 1951లో తీర్మానించింది.


-  స్వాతంత్ర్యం వచ్చి నాలుగేళ్ళు.  స్త్రీ విద్యకు ఆదిలోనే గండిపడింది. తిరుపతిలో అప్పటికే డిగ్రీ కాలేజీ ఉన్నా, అమ్మాయిలు చేరడానికి వీలులేకుండా పోయింది. 


- ఈ గండిని పూడ్చడానికి, 1952లో టీటీడీ ' శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల'ను స్థాపించింది. ఆంధ్ర రాష్ట్రంలో అదే తొలి మహిళా కళాశాల. 


- రంగనాయకమ్మ మొదటి ప్రిన్సిపాల్ గా కాలేజీని నెట్టుకొచ్చి,  రెండేళ్ళ తరువాత నిష్క్రమించారు.


- స్త్రీల కళాశాల వచ్చిన రెండేళ్ళకు తిరుపతిలో ఎస్వీయూనివర్సిటీ వచ్చింది. 

అక్కడ రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గా చేరిన కే.సూర్యనారాయణ మూర్తి సతీమణే రెండో ప్రిన్సిపాల్ రాజేశ్వరి మూర్తి 1954 లో మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా  పగ్గాలు చేపట్టారు. 


అంతే.. ఆ కళాశాల పరుగులంఘించింది. 


-  శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల కాస్తా 'శ్రీపద్మావతి మహిళా కళాశాల' (ఎస్పీడబ్ల్యూ) గా మారింది. మరో రెండేళ్ళకు 1956లో డిగ్రీ కళాశాలయ్యింది. 


-  అప్పటికింకా కళాశాలకు సొంత భవనాలులేవు. ప్రాక్టి కల్స్  కోసం అబ్బాయిల కళాశాలకు వెళ్ళాల్సి వచ్చేది.  మహిళా కళాశాలకు భవనం ఎలా ఉండాలి? తరగతి గదులు ఎలా ఉండాలి? లెబోరేటరీలు ఎలా ఉండాలి? హాస్టళ్ళు ఎలా ఉండాలి? ప్రహరీ గోడ ఎంతెత్తుండాలి? చివరికి టాయిలెట్లు ఎక్కడుండాలి? అన్నీ రాజేశ్వరి మూర్తి ఆలోచనలకు ఇదిగో ఎస్పీడబ్ల్యు కళాశాల ఇలా రూపుదాల్చింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వంద ఎకరాలను ఆమె సేకరించారు.


-  కాకినాడకు సమీపంలోని  పెద్దాపురానికి చెందిన ఒక సంప్రదాయ కుటుంబంలో 1921 డిసెంబర్ 10వ తేదీన రాజేశ్వరి జన్మించారు. పెళ్ళి అయ్యాక భర్త ప్రోత్సాహంతో చదువు మొదలు పెట్టారు. గణిత శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వారికి పిల్లలు లేరు. 


- రాత్రి, పగలు అనకుండా కళాశాలే ఆమెకు  ఇల్లు అయిపోయింది. అదే  ఆమెకు జీవితం అయిపోయింది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు; ఒకటేమిటి వారి వికాసానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో, వాటి కోసం  ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ వినియోగించారు.


-  విదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో విద్యాపర సంబంధాలను నెలకొల్పారు. కేరళ, కర్ణాటక, మద్రాసు రాష్ట్రాల నుంచి ఏరికోరి అధ్యాపకులను ఎంపిక చేశారు. 


- రాష్ట్రంలోనేఒక అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. ఆ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థినులు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తే, అధ్యాపకులుగా చేరడానికి వారికే అవకాశం ఇచ్చారు.


- టీటీడీ హాస్టళ్ళలో మాంసాహారం నిషేధం .రాజేశ్వరి మూర్తి శాఖాహారి. మాంసాహారాన్ని బైట ఒండించి విద్యార్థినులకు  పెట్టించారు.


- ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి వచ్చినప్పుడు, “మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మనకు అవమానం కదండి” అని సున్నితంగా చెప్పారు. అంతే , ఆయన వెంటనే డైనింగ్ హాలులో బెంచీలు, కుర్చీలు వేయించారు. 


-  తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, తొల ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహాహహులను కళాశాలకు రప్పించారు. ఒక ఆడ బిడ్డను,  తల్లి   తీర్చిదిద్దినట్టు ఎస్పీడబ్ల్యూ కళాశాలను ఆమె  అలా తీర్చిదిద్దారు.


- కళాశాల కోసం నిత్యం పోరాడే వారు. ఎస్పీడబ్ల్యూ కళాశాల ఎదురుగా, రైలు పట్టాల పక్కన ఉన్న రెండు భవనాలు ఈ కళాశాలవే. టీటీడీ అధికారుల నివాసాల కోసం ఈవో ఆ భవనాలను స్వాధీనం చేసుకున్నారు. “కనీసం ప్రిన్సిపాల్ గా ఉన్న నన్ను అడగకుండా మా కాలేజీ భవనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు?” అంటూ టీటీడీ ఈవోపై విరుచుకుపడ్డారు. ఈవో ఆమె పై అధికారి. 


-  మరొక ఈవో తో ఆమెకు భిన్నాభిప్రాయాలు పొడచూపాయి. ఆమె రాజీనామా చేసి 1975లో అమెరికా వెళ్ళిపోయారు.


- అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. అయినా తన మానస పుత్రికను ఒదులుకోలేదు. తరచూ తిరుపతి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఎస్పీ డబ్ల్యూ కళాశాలకే కాదు, ఎస్వీయూనివర్సిటీకి కూడా లక్షల రూపాలు ఇస్తూనే ఉన్నారు.


- కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాలనాధికారిగా పనిచేశారు. అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే అత్యుత్తమ పాలనాధికారి అవార్డు రాజేశ్వరి మూర్తికి లభించింది.  తనకొచ్చిన ఆ అవార్డును ఎస్పీడబ్ల్యూ కాలేజికి ఇస్తున్నట్టు ప్రకటించారు. 


- ఆమె దగ్గర చదువుకున్న అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఏడేళ్ళ క్రితం 93 ఏళ్ళ వయసులో చివరి సారిగా తిరుపతి వచ్చారు.


- ఇప్పటికీ ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థినులను తన పిల్లలనే అంటారు. ఆమె తొలి బ్యాచ్ విద్యార్థులు అప్పటికే ఎనభై ఏళ్ళకు చేరుకున్నారు.


న్యూయార్కులో ఉంటూ, నూరేళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆమె తన వంట తానే చేసుకుంటారు!


PROF. RAJESWARI MURTHY గారు

శత వసంతాలు. తొలి మహిళా కళాశాల రూపుశిల్పి.. డిసెంబర్ 10 వ తేదీన శత జన్మదినం.


ఆ కాలపు అమ్మాయిలకు నడక నేర్పారు, నడత నేర్పారు, మాట నేర్పారు, జీవిత పాఠాలు నేర్పారు. జ్ఞాన తృష్ణ తీర్చి, భవిష్యత్తుకు బాటలు వేశారు.


న్యూయార్క్ లో ఇప్పటికీ  సంతృప్తి కర జీవితాన్ని గడుపుతున్నారు. తిరుపతిలో గడిపిన జీవితాన్ని నెమరేసుకుంటున్నారు.


ఈ రోజు మనం గొప్పగా చూసే ప్రతి గొప్ప వ్యవస్ధ వెనకాల ఒక తెలియని వ్యక్తి యొక్క శ్రమ, త్యాగం ఉంటుంది అనేది అక్షర సత్యం...! ఆ గొప్ప వ్యక్తుల్లో ఆంధ్ర వరకు అయినా, రాజేశ్వరి మూర్తి గారు వుంటారు....!!(Thanks for reading 🙏)

సేవా భాగ్యం

 ఇది రామానుజులవారి వృద్ధాప్యంలో జరిగినదంటారు.ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చి వారిని ."స్వామీ! మీ సేవా భాగ్యం కలుగ జేయండి" అంటూ ప్రార్థిస్తాడు.


రామానుజులు విని నవ్వుతూ అంటారు...

అయ్యా! నేనే నేడో రేపో అని పరమాత్మ పిలుపుకు ఎదురు చూస్తున్న వాణ్ణి. నాకు ఎలాంటి సేవ అవసరం లేదు. శిష్యులు అంతకన్నా అవసరం లేదు. దయచేసి ఇంకెవరినన్నా ఆశ్రయించండి.


వృద్ధుడు ఒప్పుకోడు. జగద్గురువులైన దేవరవారు కాదంటే నాకింకో దిక్కులేదని ప్రార్థిస్తాడు. చివరికి రామానుజుల వారికి ఒప్పుకోక తప్ప లేదు.


వృద్ధుడికి ఇలా చెబుతారు...

అయ్యా! తమరు అంతగా అంటున్నారు కదా! ఐతే నాకు ఒక ఉపకారం చేయండి. నేను రోజూ ఉదయం కావేరిలో స్నానం చేసి, సంధ్యాదులు పూర్తి చేసుకున్న తరువాత, ఒక భాగవతోత్తమునికి పాదప్రక్షాళనం చేసి ఆనీటిని తలపై చల్లుకొని పునీతుణ్ణి కావాలని చాలాకాలంగా కోరికగా ఉంది. శ్రీరంగంలో ఎవరు కూడా నా ఈ కోరిక తీర్చడానికి సిద్ధంగా లేరు. దయచేసి దేవరవారు ప్రతిదినం ఉదయం కావేరి తీరానికి వేంచేసి నాకీ సేవ అందించండి.


వృద్ధుడు సంతోషంగా అంగీకరిస్తాడు.అప్పటినుండి ప్రతిరోజూ ఉదయాన్నే ఆ వృద్ధుడు కావేరీతీరం చేరడం, స్వామి వచ్చి ఉదయం స్నానాదులు ముగించుకునే వరకు వేచి ఉండడం, తరువాత స్వామి ఆ వృద్ధునికి పాద ప్రక్షాళన చేసి పాదోదకం తలజల్లుకోవడం వారికి నిత్యకృత్యమయింది.


దీన్ని చూసి ఆ వృద్ధుణ్ణి దూషించని వాడు శ్రీరంగంలో లేడు. సహజంగానే లోకులందరికీ ఆచార్యలపట్ల అసహ్య అపరాధంగా తోచింది.ఆ వృద్ధుణ్ణి వెలివేసారు.


అయినా ఆ వృద్ధుడు పట్డించుకోలేదు. రామానుజులూ పట్టించుకోలేదు. నిత్యకృత్యం నిరాటంకంగా సాగిపోతుంది.


ఒకరోజు రామానుజుల వారికి అనారోగ్యం చేసింది. దానికి తోడు కుండపోతగా వర్షం. స్వామి నిత్యవిధులన్నీ మఠంలోనే చేయక తప్పలేదు. రెండు రోజులలా గడిచాయి. రామానుజుల ఆరోగ్యం కుదుట పడలేదు. వర్షం ఆగలేదు.


మూడోరోజు ఉదయం, వృద్ధ బ్రాహ్మణుడి భార్య రోదిస్తూ ఆ కుంభవృష్డిలో రామానుజుల వద్దకు వచ్చి చెబుతుంది...


స్వామీ! మూడు రోజుల క్రింద ఉదయం యథా ప్రకారం దేవరవారి వద్దకు నా భర్త బయలుదేరాడు. ఇప్పటిదాక ఇంటికి చేరలేదు. దేవరవారికి   వారి ఆచూకి తెలుస్తుందని వచ్చాను.స్వామికి నోట మాట రాలేదు.


అనారోగ్యం మరిచి పోయాడు. దండమెక్కడో. పవిత్ర మెక్కెడో. ఒక్క ఉదుటున కావేరివైపు పరుగు! స్వామి వెనుక శిష్యులు! ఆ వెనుక శ్రీరంగ వాసులందరూ! వారిని చూసి రంగడూ బయలుదేరి ఉండొచ్చు! 


పరుగెత్తి వచ్చిన స్వామికి కావేరి ఒడ్డున, వర్షంలో తడిసి, ఆకలి దప్పులు లెక్కజేయక, జ్వరంతో వణుకుతూ  యథాస్థానంలో నిలబడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. 


స్వామీ! వేంచేయండి. దేవరవారిసేవా భాగ్యం కృపచేయండి.* అంటూ తీవ్రంగా వణుకుతున్న తన కాళ్ళు ముందుకు చాచాడు.


అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ శిష్యనిదే!!

అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ ఆచార్యులదే!!

అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ సంఘటన కనులారా సేవించిన రంగపుర వాసులదే!!


పరమ విరాగి యైన రామానుజుల కన్నులు గంగోత్రులైనాయి. దూషించిన జనుల హృదయాలు కరిగి సెలయేర్లయినాయి.

శ్రీ రంగనాథుడు స్థాణువైనాడు.


ఇదండీ చరమపర్వ నిష్ఠ!

శేషత్వమంటే ఇది. అది భగవత్ శేషత్వం కానీ, ఆచార్య శేషత్వంకానీ, భాగవత శేషత్వం కానీ. శేషత్వమంటే ఇది!


ఆచార్యులు తనను యథేచ్చగా వినియోగించుకొనే విధంగా స్వరూపముండడము. పాపపుణ్యములతో సంబంధము లేదు.


అపరాధ నిరపరాధములు లేవు. అసలు మనకంటూ అభిప్రాయమే అవసరం లేదు. ఆచార్యులకు చేతిలో ఒక ఉపకరణం కావడం అదే భాగ్యం కదా.....

యుగపురుషుడు

 యుగపురుషుడు నరేంద్ర మోడీ


13-12-2021 మార్గశిర శుక్ల దశమి సోమవారం - భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు.


కాలగమనంలో పనికిరాని మనుషులు కోట్లకొద్దీ పురుగులలాగా పుట్టి పోతూ ఉంటారు. కానీ వెయ్యేళ్ళ కొకసారి మాత్రమే పుట్టే కారణజన్ములు కొందరుంటారు. అలాంటివారిలో ఒకరు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు. నేనిలా అనడానికి ఎన్నో కారణాలున్నాయి.


75 ఏళ్లుగా రావణకాష్టంలా మండుతున్న కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెచ్చింది ఆయనే కాబట్టి.


వెయ్యేళ్ళుగా కోట్లాది హిందువుల హృదయాలను మెలిపెడుతున్న బాధకు కారణమైన కాశీ విశ్వనాధాలయ దీనావస్థను రూపుమాపింది కూడా ఆయనే కాబట్టి. 

ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన గొప్ప పనులు. కానీ ఈ రెండు చాలు, భారతజాతి మొత్తం ఆయనకు శిరసు వంచి పాదాభివందనం చేయడానికి. పొద్దున్నే లేవగానే తలచుకుని నమస్కరించడానికి. 

తరతరాలకూ గుర్తుండిపోతారు కొందరు. ఉదయాన్నే, వారిని మనం తలచుకుని భక్తితో చేతులను జోడించి నమస్కరిస్తాము. వారినే ప్రాతఃస్మరణీయులంటారు. అలాంటి వారిలో ఆదిశంకరులు, వివేకానందస్వామి వంటి వారు ప్రముఖులు. నా దృష్టిలో నరేంద్రమోడీగారిని ఆ వరుసలో ఉంచాలి. భారతజాతి ఆయనకంతగా ఋణపడి పోయింది.


'దివ్యకాశీ భవ్యకాశీ' అంటూ శ్రీ నరేంద్రమోదీగారు రెండేళ్ల క్రితం తలపెట్టిన ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తయింది. అంతకు ముందే సంకల్పించిన గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. నేడు కాశీలో జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో కాశీ విశ్వనాధ్ కారిడార్ ను మోడీగారు జాతికి అంకితం చేశారు.


గంగామాత శుభ్రపడింది. సరాసరి నదినుండి విశ్వనాధాలయానికి వెళ్లే దారి సుగమమైంది. కోట్లాది హిందువుల బాధ మాయమైంది. దేశం పులకరించింది. 


ఈ సందర్భంలో ఆయనిచ్చిన ఉపన్యాసాన్ని మొదటినుండీ చివరివరకూ వినమని అందరినీ నేను కోరుతున్నాను. అలాంటి అద్భుతమైన ప్రసంగాన్ని మనము కొన్నిసార్లు మాత్రమే వింటాము. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా అలాంటి ప్రసంగం ఇవ్వడాన్ని నేను చూడలేదు. ఆ ఉపన్యాసం వింటే, మోడీగారిలోని దేశభక్తుడు మాత్రమే గాక, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని అందుకున్న కర్మయోగి మనకు దర్శనమిస్తాడు. ఒక యోగి, ఒక ఆధ్యాత్మికవేత్త మన కళ్ళముందు కనిపిస్తాడు. వినేవారి ఒళ్ళు పులకరించి, కళ్ళు చెమర్చే అద్భుతమైన ఉపన్యాసమది. ప్రేక్షకులలో ఉన్న 6000 మంది స్వామీజీలలో చాలామంది కళ్ళు తుడుచుకోవడం నేను గమనించాను.


విశ్వనాధాలయాన్ని ముస్లిములు ఎంత అపవిత్రం చేశారో, ఎంతగా భారతీయుల హృదయాలను గాయపరచారో తెలియాలంటే చరిత్రలోకి తొంగి చూడాలి.


అది క్రీ. శ. 1194 వ సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ తన తురక మూకలతో కాశీని ముట్టడించి, భవ్యమైన విశ్వనాధుని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దానికి సపోర్ట్, ఖురాన్లో మహమ్మద్ చెప్పిన మతిలేని హింసాత్మక సూక్తులు. దాని తర్వాత క్రీ. శ 1240 ప్రాంతంలో ఒక గుజరాతీ వైశ్యుడు ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. మళ్ళీ దానిని 1400-1500 మధ్యకాలంలో సికందర్ లోడీ పాలనాకాలంలో కూలగొట్టారు. అక్బర్ పాలించే సమయంలో 1585 లో రాజా మాన్ సింగ్, రాజా తోడర్ మల్లులు మళ్ళీ దానిని నిర్మించారు. తరువాత ఔరంగజేబు అనే నీచుడు మన దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించాడు. వాడి పాలనాకాలంలో 1669 లో ఆలయాన్ని మళ్ళీ కూలగొట్టి, మసీదును కట్టించాడు. 1780 లో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్, మసీదును కదిలించకుండా ప్రక్కనే ఆలయాన్ని కట్టించింది. 1835 లో మహారాజా రంజిత్ సింగ్ , ఈ ఆలయానికి బంగారు పూత పూయించాడు.


ఈనాటికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీగారి పుణ్యమా అని, కాశీ విశ్వనాధాలయం తన పూర్వ వైభవాన్ని పొందింది. వెయ్యేళ్ళ హిందువుల తపస్సు ఈ రోజున ఫలించింది.


ఇదొక్కటేనా? ఈ క్రమంలో ఇంకా చాలా జరిగాయి.


ముస్లిముల రాక్షస పాలనాకాలంలో, అసలైన అన్నపూర్ణాదేవి విగ్రహం దొంగలచేత పెకలించబడి, అమ్ముకోబడి, చివరకు సముద్రాలను దాటి కెనడాలో తేలింది. దానిని మళ్ళీ వెనుకకు తెప్పించి, పునః ప్రతిష్ట చేసిన పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ గారు.


అంతే కాదు. కాశీ సందుగొందులను వెడల్పు చేసే పనిలో, దాదాపు 1500 మంది కుటుంబాలను వేరే చోట స్థలాలిచ్చి తరలించారు. ఆ ఇళ్ల మధ్యలో, చరిత్ర ప్రసిద్ధి గాంచిన 40 ఆలయాలు బయటపడ్డాయి. మన పురాణాలలో వీటి ప్రస్తావనలున్నాయి. కానీ, కాశీలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఏమంటే, ఆక్రమణలకు గురై ఇళ్లలో ఇళ్ళుగా మారిపోయాయి. ఇపుడా 40 ఆలయాలు మళ్ళీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.


ఎంతటి పుణ్యాత్ముడో మోడీగారు? ఇటువంటి కారణజన్ములు ప్రతితరంలోనూ పుట్టనుగాక పుట్టరు.


'పందికేం తెలుస్తుంది పన్నీటి వాసన?' అన్నట్లు వావీ వరసలూ, నీతీనియమాలూ లేని ఆఫ్ఘన్, ఇరాన్, పాకిస్తాన్ దొంగలగుంపులకు హిందూమతం యొక్క ఔన్నత్యం ఎలా అర్ధమౌతుంది? మన దేవాలయాల గొప్పదనమేంటో, నీతీజాతీ లేని అలాంటి నీచులకెలా అర్ధమౌతుంది?


స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు కూడా మన దేవాలయాలను మనం స్వాధీనం చేసుకోలేకపోవడానికి, ధ్వంసం చేయబడిన ఆలయాలను మళ్ళీ కట్టుకోలేకపోవడానికి, సోకాల్డ్ గాంధీ నెహ్రూలూ, ఘనత వహించిన కాపీ రాజ్యాంగ నిర్మాతలూ, మతప్రాతిపదికన దేశాన్ని విడగొట్టికూడా, మన దేవాలయాలను స్వాధీనం చేసుకోకుండా వాటినలాగే వదిలేసిన సోకాల్డ్ నాయకులే కారకులు. ఈ మహాపాపం వారిదే.


యువకునిగా ఉన్నపుడు వైరాగ్యపూరితుడై, ఉన్నతాదర్శప్రేరితుడై, రామకృష్ణా మిషన్ లో బ్రహ్మచారిగా చేరుదామని ప్రయత్నించిన మోడీగారిని ఆపి, 'నీ కార్యరంగం సమాజమే గాని ఆశ్రమం కాదు. దేశానికి నీవు చేయవలసినది చాలా ఉంది. సన్యాసం నీదారి కాదు. వెళ్ళు. భరతమాతకు నీ సేవలందించు' అంటూ వెనుకకు త్రిప్పి పంపిన రామకృష్ణా మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి ఆత్మస్థానందగారి దూరదృష్టి, దివ్యదృష్టి ఫలితాలను ఈనాడు మనం కన్నులారా చూస్తున్నాం. 


మనమే కాదు, రాబోయే వేలాది తరాల భారతీయులందరూ నరేంద్రమోడీ గారి ఫోటోను ఇళ్లలో పెట్టుకుని ప్రతిరోజూ పూజించాలి. ఖచ్చితంగా ఆయన కారణజన్ముడే కాదు, భరతమాత ముద్దుబిడ్డా, మన హిందూధర్మాన్ని మళ్ళీ నిలబెట్టిన యుగపురుషుడు కూడా ! ఇలాంటి మనుషులు వెయ్యేళ్లకు ఒక్కరే పుడతారు. ఆయనలో ఒక జనకమహారాజూ, ఒక శంకరుడూ, ఒక వివేకానందుడూ నాకు కనిపిస్తున్నారు.


భారతదేశం ఆయనకు శాశ్వతంగా ఋణపడిపోయింది ! ఇంకొక నూరేళ్ళపాటు ఆయనే మన ప్రధానమంత్రిగా ఉండాలి!


---------------------------------


source: teluguyogi.net

శ్రీమాన్ రుపెనుగుంట్ల సత్యనారాయణ శర్మ గారు

14, డిసెంబర్ 2021, మంగళవారం

Swiss Time Bank*

 *Swiss Time Bank*


A student studying in Switzerland observes:


While studying in Switzerland, I rented a house near the school.


The landlady Kristina is a 67-year-old single  old lady who had worked as a teacher in a secondary school before she retired.


Switzerland's pension is very good, enough to not worry her about food and shelter in her later years.


However, she actually found "work" - to take care of an 87-year-old single old man.


I asked if she was working for money.


Her answer surprised me:

“I do not work for money, but I put my time in the ‘time bank’, and when I cannot move in my old age, I could withdraw it.”


The first time I heard about this concept of "time bank", I was very 

curious and asked the landlady more.


*The original “Time Bank” was an old-age pension program developed by the Swiss Federal Ministry of Social Security. People saved the 'time' taking care of the elderly when they were younger, and when they were old, ill or needed care could withdraw it.*


Applicants must be healthy, good at communicating and full of love. Everyday they have to look after the elderly who need help.


Their service hours will be deposited into the personal 'time' accounts of the social security system.


She went to work twice a week, spending two hours each time helping the elderly, shopping, cleaning their room, taking them out to sunbathe, chatting with them.


According to the agreement, after one year of her service, *"Time Bank”* will calculate her working hours and issue her a “time bank card”.


When she needs someone to take care of her, she can use her “time bank card” to “time to withdraw “time and time interest”. After the information verification, “Time Bank” will assign other volunteers to take care of her at the hospital or her home.


One day, I was in school and the landlady called and said she fell 

off the stool when she was wiping the window. 


I quickly took leave and sent her to the hospital for treatment.


The landlady broke her ankle and needed to stay in bed for a while.


While I was preparing to apply for a home to take care of her, the landlady told me that I need not worry about her.


She had already submitted a withdrawal request to the “Time Bank”.


Sure enough, in less than two hours "Time Bank" sent a nursing worker to come and care for the landlady.


In the following month, the care worker took care of the landlady everyday, chatted with her and made delicious meals for her.


Under the meticulous care of the carer, the landlady soon recovered her health.


After recovering, the landlady went back to "work". She said that she intends to save more time in the "time bank" while she is still healthy.


Today, in Switzerland, the use of "time banks" to support old age has become a common practice.


The Swiss government also passed legislation to support the "Time Bank" pension scheme.


📯📯📯📯📯📯

*What a Beautiful  concept. Hope it gets adapted all over the world too!*

భగవద్గీత లో

 *భగవద్గీత  లో ఇష్టమైన శ్లోకాలు..*


భగవద్గీత  లో భక్తి జ్ఞాన వైరాగ్య సంబంధమైన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 


వీటికి తోడు జీవితంలో సాధారణంగా ఎదురయ్యే కష్టాలు ఇబ్బందులు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నకు సూటిగా కాకుండా కాకున్నా కాస్త చుట్టూ తిరిగి వచ్చేటట్లు గా జవాబులు ఉంటాయి. మనకు అప్పటి మన పరిస్థితులకు ఏదో ఒక శ్లోకం సరిగ్గా సరిపడేది ఉంటుంది. ఎవరికైనా తమకు పనికివచ్చే శ్లోక మే ఇష్టమైన శ్లోకం అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే భగవద్గీతలో ప్రతి శ్లోకమూ గొప్పదే.


నాకు సంబంధించినంత వరకు జీవితంలో చాలా సందర్భాల్లో చాలా శ్లోకాలు ఉపయోగపడ్డాయి. ఎక్కువ భాగం మనకు వచ్చే సందేహాలకు జవాబులు దొరకడం మన బాధలకు ఊరట మనశ్శాంతి కలగడం ఈ శ్లోకాలవల్ల జరుగుతుంటుంది. అంతేకానీ, సుందరాకాండ పారాయణము, సత్యనారాయణ వ్రతము మొదలైన వాటి లాగా భగవద్గీత శ్లోకాలు వల్ల డబ్బులు రావడం కష్టాలు తీరడం వంటి ఉపయోగాలు అంత ప్రసిద్ధంగా ఎవరూ చెప్పలేదు. 


 మనశ్శాంతి కోసమో సందేహ నివారణ కోసమో భక్తి జ్ఞాన వైరాగ్యా ల కోసమో భగవద్గీత ను ఉపయోగించుకోవాలి అనుకుంటే మొదట మొత్తం పుస్తకాన్ని చదివి   ఏ అధ్యాయములో ఏమి ఉందో కొద్దిగా అవగాహన చేసుకొని ఉండాలి. అప్పుడు మనకు పనికి వచ్చే శ్లోకాన్ని గుర్తుపట్టవచ్చు. 


 సంస్కృత భాషలో పరమ చరమ అని రెండు పదాలు ఉన్నాయి.దానికి మించి  దానికి పైన మరి ఏమీ లేకపోతే అది పరమ అవుతుంది. పరమేశ్వరుడు అంటే అతడిని అదుపాజ్ఞల్లో పెట్టేవాడు మరి ఎవరు ఉండరు. అందరికంటే పైన ఉండేవాడు అతనే అని అర్థము. అలాగే చరమ అంటే ఆఖరిది. కొస ముక్క. అంత దాకా చెప్పిన దాని సారమంతా దానిలో ఉంటుంది అని అర్థము.


 వైష్ణవులు మూడు శ్లోకాలను చరమ శ్లోకాలు గా భావిస్తారు. మొదటిది రామాయణంలో  ఉంది. రెండవది భగవద్గీతలో ఉంది. మూడవది వరాహ పురాణంలో ఉంది.


1.


సకృదేవ  ప్రపన్నాయ తవాస్మితీ చ యాచతే |

అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ౹౹ - రామాయణము.


2.


సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ౹

అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచ౹౹ - భగవద్గీత.


3.


స్తితే మనసి సుస్వస్తే శరీరే సతి యో నరః |

ధాతు సామ్యే స్థితే స్మర్తా విశ్వరూపం చ మా మజం

త థా స్తాం మ్రియమానం తు కష్ట పాషాణ సన్నిభం 

అహం స్మరామి మద్భక్తం నయామి పరమామ్ గతిమ్౹౹ ౼ వరాహ పురాణము.


ఇవి కాక సీతా  చరమ శ్లోకం అని శ్రీరంగ చరమ లోకమని, ఇంకా బోలెడు శ్లోకాలు చలామణిలో ఉన్నాయి.


భగవంతుడిని నమ్మి ఆయనను శరణు పొందడమే వైష్ణవ మతం లో ప్రధానమైన అంశం. వాళ్లు ఎంతో పవిత్రంగా భావించే ద్వయ మంత్రానికి అర్థం కూడా ఇదే. ద్వయ మంత్రం కానీ శరణాగతి గాని జీవుడి వైపు నుంచి చేసేవి. దీనికి ఆధారము భగవంతుడు "నన్ను శరణు అన్నవాడిని నేను ఉద్దరిస్తాను" అని ఇచ్చిన వాగ్దాన మే. ఆ వాగ్దాన ఉన్న శ్లోకాలే చరమ శ్లోకాలు. అది భగవద్గీతలో అ.18 శ్లో. 66 సర్వ ధర్మాన్ పరిత్యజ్య అని ఉన్నది. చాలామంది దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.


*పవని నాగ ప్రదీప్.*

మార్గశీర్ష శుద్ధ ఏకాదశి

 మార్గశీర్ష శుద్ధ ఏకాదశి #గీతాజయంతి గా ఆచరిస్తున్నాము. లౌకిక భాషలో చెప్పాలంటే ఆరోజు భగవద్గీత పుట్టినరోజు అని అర్థము. కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో 


”ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ: మామాకా: పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ” ప్రశ్నించాడు.


యుద్ధమునకు తలపడిన నావాళ్ళు అయిన కౌరవులు పాండవులు యేమి చేసిరి అని ప్రశ్న. ఆ సందర్భమున వ్యాసభగవానుడు సంజయునకిచ్చిన, ‘యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట’ అను వరము వలన జరిగినదంతా చూచి ధృతరాష్ట్రునకు వివరించినాడు. ఆ సంరద్భముననే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించినాడు. ఇట్లు ఆరోజు గీతలోకమునకు వెలువడినది. అందువలన గీతాజయన్తిగా మనం ఆనాడు జరుపుకుంటున్నాము.భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది. 


‘గీతా సుగీతాకర్తవ్యా కిమన్యై: శాస్త్రసంగ్రహై: 

యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిర్గతా’ 


అనునది గీతా ప్రశస్తి.


 ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు, ఇతర శాస్త్రాభ్యాసాలెందుకు, ఆ గీత పద్మనాభుని ముఖ పద్మము నుండి వెలువడినది అని భావము. అసలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశమును ఎందుకు చేశాడు అంటే ఇలా చె ప్తున్నారు.


ఆస్థాన స్నేహకారుణ్య ధర్మాధర్మధియాకులం పార్ధం

ప్రపన్న ముద్ధిశ్య గీతా శాస్త్రం ప్రవర్తితమ్‌ 


అని అనగా ఉండకూడని చోట చూపకూడని చోట స్నేహమును కరుణ చూపుచున్నాడు అర్జునుడు. ధర్మాన్ని అధర్మముగా, అధర్మాన్ని ధర్మముగా భావించి అన్యదా జ్ఞానముతో విపరీత జ్ఞానముతో అనగా ఒక దాన్ని ఇంకోదానిగా భావించి కలత చెందిన బుద్ధితో నున్న అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ”శిష్యస్తేహం శాధిమాల త్వాం ప్రపన్నం” అని శరణు వేడ గా గీతాశాస్త్రమును ప్రవర్తింపచేసినాడు.గీతా శాస్త్రమును ప్రధానముగా బోధించు తత్త్వము శరీరాత్మ విజ్ఞానము అనగా శరీరము చేసే పనితో ఆత్మకు సంబంధము లేదు. శరీరము చేసేదాన్ని ఆత్మ చేసినది అనుకోవటమే అహంకారము. శరీరమునకు కావలసిన వారిని ఆత్మకు కావలసి నవారిగా భావించుట మమకారము. సంసారమనే సర్పాన్నికి అహంకారమమకారములు రెండు కోరలు. రెండు కోరలు తీసేస్తే పాము కాటు వేయజాలదు. అహంకారమమకారములను వదిలివేస్తే సంసారమును చేయజాలము. చేయుచున్నది నేను కాదు, భగవానుడు చేయించుచున్నాడు.


ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దాణే అర్జున తిష్ఠతి భ్రామయన్సర్వ భూతాని యంత్రారూఢాని మాయయా


 అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. 


ప్రతిప్రాణి హృదయమున పరమాత్మ ఉన్నాడు. తన సంకల్పముతో సకల భూతములను యంత్రములపై ఉన్నవానిని త్రిప్పుచున్నాడు. ఇట్లు అందరి చేత అన్ని పనులను చేయించువాడతడే అన్ని ఫలితములను పొందువాడు అతడే. అందుకే స్వామి నాకు కర్మ చేయుటలోనే అధికారము, ఫలముల యందు కాదు అన్నాడు. అన్ని పనులు చేయుచున్నది శరీరము కదా. శరీరమునకే ఫలము ఉండదు తృప్తి, సంతోషము, అనుభూతి, మనస్సునకు బుద్ధికి ఇంకా చెప్పాలంటే భావనతో ఆత్మకు అవేమీ పని చేయుట లేదే. పని చేస్తున్నదానికి ఫలితం రావటం లేదు. ఫలితం పొందుచున్నవి పని చేయుట లేదు, ఇది యదార్ధజ్ఞానము. ఇది కలిగిన నాడు శోకము, దు:ఖము, సంతోషము కలుగవు. అన్ని ఫలితాలు పరమాత్మవే అన్ని కర్మలు చేయించేవాడే పరమాత్మ. అతను చేయిస్తున్నాడు, దీనికి మన శరీరము సాధనము. స్పూన్‌ గరిటెలాగా. గరిట పాయసంలో తిప్పినా పప్పులో తిప్పినా కూరగాయితో తిప్పినా తిరగటమే దాని పని కాని ఇది తియ్యగా ఉంది ఇది కారంగా ఉన్నది అనదే. పాయసంలో గరిటలా సంసారంలో జీవుడు తిరుగుచున్నాడు, అతనికి కష్టము లేదు సుఖము లేదని తెలియాలి. నిత్యము కార్యశీలివి కావాలి ఫలశీలికాదు. పని నీవు చేయాలి ఫలమును నాకర్పించాలి. ఫలము నాకర్పించిన నాడు పుణ్యము పాపము నీది కాదు. స్వర్గము, నరకము నీకు రాదు. నాలోకమే పరమపదమే లభిస్తుంది. స్వార్థాన్ని వదిలిపట్టి పరార్థాన్ని, పరమార్థాన్ని భావించిన నాడు సుఖదు:ఖాలు, రాగద్వేషాలు, ఆశాపాశాలు, లాభనష్టాలు యేమీ ఉండవు. ఇవేమీకానపుడు సంతోషం యెందుకు ? విచారం యెందుకు? స్థిర చిత్తముతో, స్థిర ప్రజ్ఞుడవై వ్యవహరించుము నన్ను శరణువేడుము. ఫలాన్ని ఇచ్చేవాణ్ణి, పనిచేయించేవాణ్ణి నేనే నీ యోగక్షేమములను నేను వహిస్తాను. ఇది గీతాసారము.


గీతము సరియైన గురువుల వద్ద అధ్యయనం చేస్తే ఇది చక్క‌ని వ్యక్తిత్వ వికాసమును కలిగిస్తుంది అందరిలోను పరమాత్మ ఉన్నాడు అని తెలిసిననాడు ఎవరినీ ద్వేషించజాలవు. అందరినీ ప్రేమిస్తావు. ఇదియే విశ్వప్రేమ, లోకకళ్యాణము. గీతను అర్థముతో చదువువారు. వీలుకాకుంటే ఒక మూలమే చదవండి. గాంధీజీ విజయానికి అహింసా మార్గానికి ఆధారం గీతే. వివేకానందుని విశ్వ విజయానికి మూలము గీతయే. వల్లభాయ్‌ పటేల్‌ను ఉక్కు మనిషిని చేసింది, లాల్‌ బహుదూర్‌ శాస్త్రిని జైజవాన్‌ జైకిసాన్‌ అనిపించినది గీతయే. అహింసామార్గం శాంతి మార్గానికి నిర్వచనం చెపునది గీతయే. రాజేంద్రప్రసాద్‌ భారత ప్రథమ రాష్ట్రపతి జేబులో గీతయే ఉండేది. జేబులో ఉండాలి మనలో ఉండాలి బుద్ధిలో ఉండాలి రోజూ ఒక శ్లోకమైనా చదువుతాము. గీత చెప్పిన వాటిలో ఒక్కటైనా ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఈనాటి నుండి ఆచరించాలి. ఇదే భారతీయ గీతకు చేయు నిజమైన నిస్వార్థమైన ఆరాధన. అలా చేద్దాం చేయిద్దాం.


భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజును #గీతాజయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజుగా జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.


గీకారం త్యాగరూపం స్యాత్

తకారమ్ తత్వబోధకమ్

గీతా వాక్య మిదమ్ తత్వం

జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:


గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది. అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం.


సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః

పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్


ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు, 


మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః. 


అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.


వాసాంసి జీర్ణాని యథా విహాయ

నవాని గృర్ణోతి నరో పరాణి

తథా శరీరాణి విహాయ జీర్ణా

న్యన్యాని సంయాతి నవాని దేహీ


చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబత్తలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.


నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః

న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః


ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు.


కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన

మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి


అర్జునా! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగాకుండుగాక.

 

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్


ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి, అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

సాదు, సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.


కృష్ణుడంటాడు..


"ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..." అని, 


అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడు లక్షణాలను, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాము.


నిజమైన దేవుడు ఆయనను నమ్మినా, నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు. అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి ఒక కాంతికిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు, అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది. అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాని అర్ధం చేసుకుని జీవితంలో అనుసరించినా, కొద్దిగా గంగాజలం త్రాగినా, కృష్ణపరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు. వారికి మోక్షం లభిస్తుంది.


గీతాజయంతి రోజున భగవద్గీత పుస్తక పఠనం, దానం విశేష ఫలాన్ని ఇస్తుంది.. 


        🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏