4, జులై 2022, సోమవారం

ముందు సీటు! ( పాతదే)*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌷శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ🌷 

       *ముందు సీటు! ( పాతదే)* 

                  🌷🌷🌷

రాజ్యం పుట్టిపెరిగిన వూళ్ళో, ఊరంతటికీ రెండే రెండు కార్లుండేవి.  ఒకటి జమిందారుగారిది.  మరొకటి మునసబుగారిదీ!  రాజ్యం తండ్రి నడిపే అరుగుబడి ముందునుంచే ఆ కార్లు పట్టణంలోకి వెళ్తూ ఉండేవి. ఇంచక్కా కారులో సవారీచేస్తూ... కాన్వెంటు బడులకెళ్ళే వాళ్ళ పిల్లలనూ, ఆ రాజహంసల్లాంటి కార్లనూ చూసి రాజ్యం కళ్ళు ఆశతో మెరిసేవి. 


వయసొచ్చాకా తను చదివిన నవలల్లో నాయిక... హీరోగారి పక్క ముందుసీటులో కూర్చుని .. సుదూరతీరాలకు కారులో ప్రయాణిస్తూ... కధను సుఖాంతం చెయ్యడం ఆమెలో మరిన్ని మధురోహలు రేపేవి. 


        తనకు భాస్కరం పెళ్ళిసంబంధం వచ్చినపుడు....భార్యపోయిన అతను, అతనికున్న ఇద్దరిపిల్లలూ ఆమెకు అభ్యంతరకరంగా అనిపించలేదు. ఆమెకళ్ళన్నీ పెళ్ళిచూపులకొచ్చిన అత్తగారు , భాస్కరం దిగిన అంబాసిడర్ కారు మీదే! 


పెళ్ళిలో... అతనితో ఊరంతా కారులో ఊరేగాలన్న ఆమె కోరిక ఆవిరయిపోడానికి ఎన్నో గంటలు పట్టలేదు! స్థోమతులేని మావగారు గుళ్ళో పెళ్ళి చెయ్యడమేంటి....మరునిమిషంలో..తల్లీ, నీళ్ళోసుకున్న చెల్లెళ్ళనూ, మరిద్దరు పెద్దలనూ కార్లోపంపేసి..... రాజ్యాన్ని బస్సులో తమ ఊరు తీసుకుపోయాడు భాస్కరం! 


        పెద్దగా ఆరళ్ళు లేకపోయినా పెత్తనమంతా అత్తగారిదే! తనకొడుకుతో సహా ముగ్గురు పిల్లలనూ సాకడం, పాడి, పంట ఒబ్బిడి చెయ్యడం, వంటిల్లూ, పాలేర్ల తిండ్లూ, మరుది, ఆడపడుచులకు మూటలుకట్టి పంపడం... గానుగెద్దు జీవితమే! 


అప్పుడప్పుడూ ఆటవిడుపులా పెళ్ళికో, పేరంటానికో... కార్లో వెళ్ళే అవకాశం వచ్చినా... డ్రైవింగ్ చేసే భాస్కరం పక్కసీటు అత్తగారిదే.... సౌకర్యంగా... విశాలంగా ఉంటుందని. మరో నలుగురితో వెనుకసీట్లో ఇరుకిరుకు సవారీయే రాజ్యానికి ప్రాప్తంగా ఉండేది! 


    అత్తగారు కాలం చేసాకా, ఆస్తుల పంపకాలయిపోయాకా, పిల్లలు గూడొదిలి తలో దిక్కుకూ వెళిపోయాకా... రాజ్యం ధైర్యం చేసి ఒకరోజు భాస్కరం దగ్గర తన కోరిక వెలిబుచ్చింది. " ఏవండీ! అన్నవరం వెళ్దామేంటి కారులో!"... అంటూ! ఆమోదంతో... వెంటనే చెల్లెళ్ళకు ఫోన్ చెయ్యబోతున్న అతని చెయ్యి పట్టుకుని ఆపి... అభ్యర్ధనగా... " మనిద్దరమే! మీ పక్కన నేనే కూర్చోవాలి!"... సగం సిగ్గూ మరి సగం మొహమాటంతో అంటున్న భార్యకేసి వింతగా చూసాడు! అలాగే అని ఒప్పుకున్నాడు! కానీ మరునాడు ఉదయమే మాటతప్పాడు! తను వేరే శాస్వతప్రయాణం పెట్టుకుని వెళ్ళిపోయాడు! 


   ఆతరవాత రాజ్యం జీవితం ఓ పదేళ్ళ పాటూ కార్లలోనే గడిచిపోయింది వూర్లు తిరుగుతూ. కూతురూ, కోడళ్ళ పురుళ్ళు, వాళ్ళ పిల్లల ఆలనా పాలనలూ, పండగలూ, పేరంటాలతో! అయితే ఏ ఒక్కసారీ రాజ్యం ముందుసీట్లో కొడుకుల పక్కన కూర్చోలేకపోయింది. తనకన్నా రెండొంతులు వలంగా ఉండే కోడళ్ళు ... అత్తగారు ఎక్కడ ముందుసీట్లో కూర్చుంటుందో అని ....గబగబా ....ముందే పరుగెట్టీ భర్తల పక్కన ఉస్సురంటూ కూలబడేవారు.... రాజ్యాన్ని తమ పిల్లలతో వేగడానికి వెనుకసీట్లో కుదేస్తూ! పాపం కూతురు సవితిపిల్లయినా... " అమ్మా! ముందుసీట్లో  హాయిగా ఏసీకి ఎదురుగా కూర్చో"... అని కారు ముందుతలుపు తీసేది! "అల్లుడి పక్కన ఎలా కూర్చోగలను! మర్యాదకాదు!"... అనుకుంటూ రాజ్యం బిడియపడి కూర్చునేది కాదు. 


       ఓరోజు తనింట్లో తోటపని చేసుకుంటోంది రాజ్యం! వీధి గుమ్మం దగ్గర కారాగింది. తన కొడుకు బేగ్ పట్టుకుని ఒంటరిగా దిగాడు. అమ్మ మీద దిగులుగా ఉండి వచ్చానన్నాడు. ప్రశ్నలెయ్యడం రాని రాజ్యం పరమానంద పడిపోయింది. పిల్లాడున్న పదిరోజులూ పదిక్షణాల్లా గడిచిపోయాయి. 


అబ్బాయి తన బాల్యం గురించి చెప్పమన్నాడు. కన్నకొడుకు ఆటపాటలు ఏం చూసిందని తను.... ఏమన్నా చెప్పడానికి! కానీ తన బాల్యమంతా చెప్పింది. మాటల్లో తన కారు సరదా కూడా చెప్పింది. పిల్లాడు ఆశ్చర్యపోయాడు...అమ్మకు ఇంత చిన్న కోరిక కూడా తీరలేదా! .... అనుకుంటూ! మనసులోని ఆర్ద్రత కళ్ళల్లోకి  తెచ్చుకున్నాడు. 


         " నడమ్మా! కారులో నా పక్కనే కూర్చో! హైదరాబాద్ తీసుకెళ్తా! ఊరంతా చూపిస్తా! యాదాద్రి చూపిస్తా! చార్మినార్ బజార్ల రంజాన్ సందడి చూద్దాం. నీకోడలు లేదులే. అలిగి పుట్టింటికి వెళ్ళింది పిల్లలతో! ముందు సీటంతా నీదేనమ్మా! హాయిగా ఆరామ్ సే కూర్చుందువుగాని. బోల్డు కబుర్లు చెప్పుకుందాం! వెళ్తూ...సూర్యాపేటలో మంచి లంచ్ చేద్దాం! బయలుదేరమ్మా".... పిల్లాడు ఆప్యాయంగా తల్లి చెయ్యి పట్టుకున్నాడు. 


పట్టుకోవడమే కాదు... ఓ వారంరోజులు తన పనికి శెలవుపెట్టి... తల్లిని మహానగరమంతా తిప్పి చూపించాడు. మంచి మంచి హోటల్స్ కు భోజనానికి తీసుకుపోయాడు. పెద్ద పెద్ద మాల్స్ లో " అమ్మా ఇవి కొనుక్కో అవి కొనుక్కో"... అంటూ అమ్మకు ఉపయోగపడేవి బోలెడు కొని పడేసాడు. 


కొడుకు పక్కన మహారాణిలా ఊరంతా ఊరేగిన రాజ్యం మనసు సంతృప్తితో నిండిపోయింది. తన జీవితమంతా ఆక్రమించిన ఆ చిన్నికోరిక ఇంత సంతోషంగా తీరిపోయింది! కోడలితో మాట్లాడి ఇద్దరికీ సయోధ్యచేసింది. కొడుకుతో తన వూరికి తిరుగు ప్రయాణమయింది. 


అరవైఏళ్ళ వయసు! బయటతిళ్ళు అరాయించుకోలేని అనారోగ్యం. ఒక్కసారి గుండెల్లో చివ్వున లేచిన మంట! భరించలేని నాసియా! వెనక్కు వెళిపోదామంది. చుట్టూ వాహనాలు. అటో మైలూ-ఇటో మైలు... చుట్టూ అష్టదిగ్బంధనం! తల్లి పరిస్థితి చూసి... వైద్యసహాయానికి పిలిచాడు కొడుకు. కొద్ది సేపటికే వచ్చిచేరిన వైద్యసిబ్బంది .... అంబులెన్స్ తో కనుచూపుమేరలో! కానీ కాలు బయట పెట్టలేని నిస్సహాయత! 


రాజ్యం కొడుకు ఆందోళనను కళ్ళతోనే వారించింది. తనను పొదివి పట్టుకున్న కొడుకు భుజం మీద తలవాల్చింది! చుట్టూ వాహనాల మధ్య తను! కారు ముందుసీటులో... తన కొడుకుతో! రాజమాతలా! ఊరేగింపుగా పోతున్నట్టు! మరి కళ్ళు తెరవలేదు రాజ్యం! కళ్ళుతెరిచి ...వేచి చూసే ఆశలేవీ మరిక లేదనుకుందో ఏమో! 


ధన్యవాదాలతో

ఓలేటి శశికళ

రజోరూపో

 రజోరూపో హి సంకల్పో లోకసంవ్యవహారవాన్‌ పరితిష్ఠతి సంసారే పుత్రదారాసురఞ్జితః.


ప్రాపంచిక (లౌకిక) వ్యవహారములను అధికముగ ఆచరించుచుండువాని సంకల్పము రజోరూపముగ నుండును. అట్టి రజోరూప సంకల్పము గలవాడు పుత్ర భార్యాదులచే మోదమొందుచు ఈ సంసారమున స్థితి గలిగియుండును.


*🙏🙏శుభం భూయాత్ 🙏🙏*

3, జులై 2022, ఆదివారం

పొడుపు పద్యము

 తే.గీ.పడతి నాలుగు వర్ణముల్ పదములోన

కలికి మొదటి వర్ణము బోవ ఘస్రమగును

అతివ తుదిమూడు నుతొలగ హస్తమగును

తెలిసి యున్నచో చెప్పుము తెలుగు లేమ

పి.మోహన్ రెడ్డి.



. ... జాతీయ తెలుగు సాహితీ పీఠము …

  తేనియల్ చిందు నా భాష తెలుగుభాష

        డా. నలవోలు నరసింహా రెడ్డి


          …… పొడుపు పద్యము …...

ఆ. అబ్ధి కొఱకు మాట అక్కరాల్ నాలుగు 

 ఒండు, రెండు నాల్గు గొప్పు ''నీరు" 

మూడు, రెండు, నాల్గు చూడ నయ్యది ''రంగు"   

పదము తెలుప వలయు పసిడి బాల..! 84

శివానుగ్రహం

 శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.    సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.


*శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.*


*అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.*


*శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…*

*శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు,                      శివుని పూజించే చేతులే చేతులు.            శివుని సదా స్మరించేవాడే ధన్యుడు..* 


*పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.*


*అదే 'శివసిద్ధి'.*


*అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.*


*పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.*


*శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.*


*జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

.

సీనియర్ సిటిజన్లకు చాలా ముఖ్యం.

 *నోక్టూరియా*


 నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు.

 శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా నిజానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు.  పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.  నిద్రకు భంగం వాటిల్లుతుందనే భయంతో పెద్దలు రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడానికి దూరంగా ఉంటారు.  నీళ్లు తాగితే మూత్ర విసర్జనకు మళ్లీ మళ్లీ లేవాల్సి వస్తుందని అనుకుంటారు.  పెద్దలు మరియు వృద్ధులలో తరచుగా తెల్లవారుజామున గుండెపోటు లేదా పక్షవాతం రావడానికి పడుకునే ముందు లేదా రాత్రి మూత్ర విసర్జన తర్వాత నీరు త్రాగకపోవడం ఒక ముఖ్యమైన కారణం అని వారికి తెలియదు.  నిజానికి, నోక్టురియా అంటే తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేది మూత్రాశయం పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు.  వయస్సుతో పాటు వృద్ధులలో గుండె పనితీరు తగ్గిపోవడమే దీనికి కారణం, ఎందుకంటే గుండె శరీరం యొక్క దిగువ భాగం నుండి రక్తాన్ని పీల్చుకోలేకపోతుంది.

 అటువంటి పరిస్థితిలో, పగటిపూట మనం నిలబడి ఉన్న స్థితిలో, రక్త ప్రవాహం మరింత క్రిందికి ఉంటుంది.  గుండె బలహీనంగా ఉంటే, గుండెలో రక్తం తగినంతగా ఉండదు మరియు శరీరం యొక్క దిగువ భాగంలో ఒత్తిడి పెరుగుతుంది.  అందుకే పెద్దలు మరియు వృద్ధులు పగటిపూట శరీరం యొక్క దిగువ భాగంలో వాపు పొందుతారు.  వారు రాత్రిపూట పడుకున్నప్పుడు, శరీరం యొక్క దిగువ భాగం ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది మరియు తద్వారా కణజాలాలలో చాలా నీరు నిల్వ చేయబడుతుంది.  ఈ నీరు తిరిగి రక్తంలోకి వస్తుంది.  ఎక్కువ నీరు ఉంటే, నీటిని వేరు చేయడానికి మరియు మూత్రాశయం నుండి బయటకు నెట్టడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాలి.  నోక్టురియా యొక్క ప్రధాన కారణాలలో ఇది ఒకటి.

 కాబట్టి మీరు పడుకున్నప్పుడు మరియు మీరు మొదటిసారి టాయిలెట్‌కి వెళ్లడానికి సాధారణంగా మూడు లేదా నాలుగు గంటలు పడుతుంది.  ఆ తర్వాత, రక్తంలో నీటి పరిమాణం మళ్లీ పెరగడం ప్రారంభించినప్పుడు, మూడు గంటల తర్వాత మళ్లీ టాయిలెట్కు వెళ్లాలి.

 మెదడు స్ట్రోక్ లేదా గుండెపోటుకు ఇది ఎందుకు ముఖ్యమైన కారణం అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది?

 రెండు మూడు సార్లు మూత్ర విసర్జన చేసిన తర్వాత రక్తంలో నీరు చాలా తక్కువగా ఉంటుందని సమాధానం.  శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు కూడా తగ్గిపోతుంది.  దీనివల్ల రక్తం మందంగా మరియు జిగటగా మారుతుంది మరియు నిద్రలో హృదయ స్పందన మందగిస్తుంది.  మందపాటి రక్తం మరియు నెమ్మదిగా రక్త ప్రసరణ కారణంగా, ఇరుకైన రక్తనాళాలు సులభంగా నిరోధించబడతాయి...

 పెద్దలు మరియు వృద్ధులు ఎల్లప్పుడూ ఉదయం 5-6 గంటల సమయంలో గుండెపోటు లేదా పక్షవాతంతో బాధపడుతున్నారని గుర్తించడానికి ఇదే కారణం.  ఈ స్థితిలో నిద్రలోనే చనిపోతారు.

 నోక్టురియా అనేది మూత్రాశయం పనిచేయకపోవడం కాదు, వృద్ధాప్య సమస్య అని అందరికీ చెప్పాల్సిన మొదటి విషయం.

 అందరికీ చెప్పాల్సిన మరో విషయం ఏమిటంటే, పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగాలి, రాత్రి మూత్ర విసర్జనకు లేచిన తర్వాత మళ్లీ తాగాలి.

 నోక్టురియాకు భయపడవద్దు.  పుష్కలంగా నీరు త్రాగండి, ఎందుకంటే నీరు త్రాగకపోవడం మిమ్మల్ని చంపుతుంది.

 మూడవ విషయం ఏమిటంటే, గుండె యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, మీరు సాధారణ సమయంలో ఎక్కువ వ్యాయామం చేయాలి.  మానవ శరీరం అతిగా వాడితే పాడైపోయే యంత్రం కాదు, దానికి విరుద్ధంగా, ఎంత ఎక్కువ వాడితే అంత బలంగా ఉంటుంది.  అనారోగ్యకరమైన ఆహారాన్ని, ముఖ్యంగా అధిక పిండి పదార్ధాలు మరియు వేయించిన ఆహారాన్ని తినవద్దు.

 ఈ కథనాన్ని మీ పెద్దలు మరియు వృద్ధ స్నేహితులతో పంచుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

 సీనియర్ సిటిజన్లకు చాలా ముఖ్యం.

 ఆరోగ్య సమస్య గురించిన డా.బన్సల్ యొక్క ఆసక్తికరమైన మరియు సమాచార కథనం ఇక్కడ ఉంది.. *నోక్టూరియా*.

గాయత్రీమంత్ర స్వరాక్షర మహిమ

 *గాయత్రీమంత్ర స్వరాక్షర మహిమ వర్ణన*

*(శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం నుంచి యథాతథంగా)*


ఆనందశర్మ యిట్లు వివరించెను. "గాయత్రీ శక్తి విశ్వవ్యాప్తశక్తి. ఆశక్తితో సంబంధము స్థాపించు కొనినయెడల సూక్ష్మ ప్రకృతి స్వాధీనమగును. దానివలన భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలోని అన్ని సంపత్తులను పొంద వీలుకలుగును. శరీరమునందలి విభిన్న అంగముల నుండి నాడులు శరీరమందంతటను వ్యాపించియుండును. కొన్నినాడులు కలిసినయెడల గ్రంథియని పిలువబడును. మానవ శరీరమునందలి వివిధ గ్రంథులయందు వివిధ శక్తులు నిబిడీకృతమై యుండును. జపయోగమునందు నిష్టులయినవారు ఆయా మంత్రములను ఉచ్ఛరించుటవలన ఆయా గ్రంథులయందు నిబిడీకృతమైన శక్తులు వ్యక్తీకరించబడుచుండును.


*ఓం* 

అనుదానిని ఉచ్చరించినపుడు శిరస్సుపైన ఆరు అంగుళముల ప్రాంతమునందును,


*భూః* 

అనుదానిని ఉచ్చరించినపుడు కుడికన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతమునందును


*భువ* 

అనుదానిని ఉచ్చరించినపుడు మానవుని త్రినేత్రము పైన మూడు అంగుళముల ప్రాంతమునందును


*స్వ* 

అనుదానిని ఉచ్చరించినపుడు ఎడమకన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతమునందును శక్తి జాగృతమగును.


ఆజ్ఞాచక్రము ప్రాంతమనందున్న *తాపిని* అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న *సాఫల్య* శక్తిని జాగృతము చేయటకు

*తత్*


ఎడమకన్ను యందున్న సఫలత అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'పరాక్రమము' అను శక్తిని జాగృతము చేయుటకు

*స*


కుడికన్ను యందున్న 'విశ్వ' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'పాలన' అను శక్తిని జాగృతము చేయుటకు

*వి*


ఎడముచెవి యందున్న 'తుష్టి' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'మంగళకరము' అను శక్తిని జాగృతము చేయుటకు

*తుః*


కుడిచెవి యందున్న 'వరద' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'యోగము' అను శక్తియొక్క సిద్ధికొరకు

*వ*


నాసికామూలము నందున్న 'రేవతి' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'ప్రేమ' అను శక్తియొక్క సిద్దికొరకు

*రే*


పైపెదవి యందున్న 'సూక్ష్మ' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'ఘున' అను సంజ్ఞ గల శక్తిని జాగృతము చేయుటకు

*ణి*


క్రిందిపెదవి యందున్న 'జ్ఞాన' అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న  

'తేజము' అను శక్తిని జాగృతము చేయుటకు

*యం*


కంఠము నందున్న 'భర్గ' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'రక్షణ' అను శక్తిని జాగృతము చేయుటకు

*భర్*


కంఠకూపము నందున్న 'గోమతి' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'బుద్ధి' అను శక్తియుక్క సిద్ధికొరకు

*గో*


ఎడమవైపు ఛాతీయొక్క అగ్రభాగమునందున్న 'దేవిక' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

దమనము అను శక్తిని జాగృతము చేయుటకు

*దే*


కుడివైపు ఛాతీయొక్క అగ్రభాగమునందున్న వారాహి అను గ్రంధియందు నిబిడీకృతమై యున్న


నిష్ఠ అను శక్తియొక్క సిద్దికొరకు

*వ*


ఉదరమునకు పైభాగమున చివరి ప్రక్కటెముకలు కలియుస్థానమందున్న సింహిని అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'ధారణా' అను శక్తిని జాగృతము చేయుటకు

*స్య*


కాలేయము నందున్న 'ధ్యాన' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'ప్రాణ' అను శక్తిని జాగృతము చేయుటకు

*ధీ*


ప్లీహము నందున్న మర్యాద అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'సంయమ' అను శక్తిని జాగృతము చేయుటకు

*మ*


నాభి యందున్న 'స్ఫుట' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'తపో' అను శక్తిని జాగృతము చేయుటకు

*హి*


వెనుబాము చివరిభాగము నందున్న 'మేధా' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'దూరదర్శితా' అను శక్తిని జాగృతము చేయుటకు

*ధి*


ఎడమభుజము నందున్న 'యోగమాయా' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న 'అంతర్నిహితము' అను శక్తిని జాగృతము చేయుటకు

*యో*


కుడిభుజము నందున్న 'యోగిని' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'ఉత్పాదన' అను శక్తిని జాగృతము చేయుటకు

*యో*


కుడిమోచేయి యందున్న 'ధారిణి' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'సరసతా' అను శక్తిని జాగృతము చేయుటకు

*నః*


ఎడమమోచేయి యందున్న 'ప్రభవ' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'ఆదర్శ' అను శక్తిని జాగృతము చేయటకు

*ప్ర*


కుడిమణికట్టునందున్న 'ఊష్మా' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'సాహసము' అను శక్తిని జాగృతము చేయుటకు

*చో*


కుడిఅరచేతి యందున్న 'దృశ్య' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'వివేకము' అను శక్తిని జాగృతము చేయుటకు

*ద*


ఎడమ అరచేతి యందున్న 'నిరంజన' అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న

'సేవ' అను శక్తిని జాగృతము చేయుటకు

*యాత్*


అను వానిని ఉచ్చరింపవలెను


ఈ విధముగా గాయత్రీమంత్రమునందలి 24 అక్షరములకునూ, మన శరీరమునందు వివిధ ప్రాంతములందు గల 24 గ్రంథులకునూ, ఆ గ్రంధులందు నిబిడీకృతమైన 24 రకములయిన శక్తులకును సన్నిహిత సంబంధము కలదు.

కర దండం

 కర దండం 


గ్రామాలల్లో సాదారణ ప్రజలు ప్రతివారు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర పట్టుకొని వెళ్లేవారు. వారు ఆ కర్రను అనేకవిధాలుగా వాడేవారు. ఏమైనా విషపురుగులు అంటే పాములు తేళ్లు మొదలైనవి వారి దారిలో కనపడితే వెంటనే ఏది వెతకాల్సిన పనిలేకుండా వాటిని  హతమార్చేవారు. ఇక కుక్కలు లాంటి జంతువులు వారి చేతిలోని కర్రను చూసి వారి జోలికి వచ్చేవే కావు.  మీరు గమనించి ఉండొచ్చు కుక్కలు ఒంటరిగా ఒకమనిషి కనపడితే గుంపులుగా వచ్చి దాడిచేస్తాయి.  ఈ విషయం మనలో కొందరికి అనుభవం కలిగి కూడా ఉండొచ్చు. ముందుగా ఒక కుక్క వచ్చి అరుస్తుంది తరువాత మిగిలిన కుక్కలు ఎక్కడినుండి వస్తాయో తెలియకుండా వచ్చి దాడి చేస్తాయి.  అదే నీ చేతిలో కర్ర ఉంటే మాత్రం అవి నీ జోలికి రావటానికి  వెనకాడతాయి. అథవా నిన్ను చుట్టుముట్టిన వెంటనే నీవు నీ చేతికఱ్ఱతో నిన్ను నీవు కాపాడుకోగలవు. కాబట్టి చేతిలో కర్ర ఉండటం సదా క్షేమకరం. ఇక విషయానికి వస్తే....


సాధకా! రోజు  నీ వెంట ఒక గుంపుగా కుక్కలు దాడి చేస్తున్నాయి. కానీ నీకు ఆ విషయం తెలిసినా కూడా నీవు వాటిని పరిగణలోకి తీసుకోక నీవు నేను రోజు ఆ కుక్కల దాడికి  బలవుతున్నావు. సాధకుడు తన సాధనను ముందుకు సాగాలంటే తప్పకుండా ఈ కుక్కలగూర్చి తెలుసుకోవటమే కాక వాటినుండి ఎట్లా రక్షణ పొందాలో తెలుసుకోవాలి. ఇప్పడికే మీకు నేను దేనినిగూర్చి చెపుతున్నానో తెలిసే ఉంటుంది అదేనండి ఆ కుక్కలు యేవో కావు అవే అరిషడ్వర్గంగా పేరుపొందిన ఆరుగురు శత్రువులు. అరిషడ్వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులు అని అర్థం. మన శాస్త్రాలప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించేక్రమంలో తనలోని ఈ ఆరు అంతర్గత శత్రవులను జయించాలి. అవి యేమియనగా కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజారుస్తాయి. ప్రతి మనిషి మనస్సును ఈ ఆరు కలిసికాని లేక ఏ ఒక్కటో లేక ఒక్కటి కంటే ఎక్కువో చేరి కలుషితం చేస్తాయి.  వీటిలో ఏ ఒక్కదానికి చిక్కినా సాధకునికి సాధన అస్సలు కుదరదు.  సాధారణంగా మనం ఎవరైనా ఒక ముఖ్యమైన విషయం చెబుతుంటే కొన్ని సందర్భాలలో వాటి మీద నీవు శ్రద్ధచూపవు ఎందుకురా నేను ఇంతముఖ్యమైన దానిని చెపుతుంటే ఏమి ఆలోచిస్తున్నావు అని నీ మిత్రుడు అడిగితే ఏమిలేదురా ఈవేళ నా మనసెందుకో బాగా లేదని సమాధానం ఇస్తావు.  నిజానికి నీ మనస్సు బాగా లేకపోవటానికి కారణం పైన తెలిపిన ఏదో ఒక శత్రువు దాడి కానీ నీవు ఆ విషయాన్ని గమనించవు.  అదే నీవు గమనిస్తే వాటిని అదుపులో పెట్టుకొనే ప్రయత్నం చేస్తావు. మన పురాణాలలో, ఇతిహాసాలలో ఈ ఆరుగురు శత్రువుల వలన ఎవరు యెట్లా నష్టపోయారో చెప్పారు. కాబట్టి సాధక మేలుకో ఈ ఆరు కుక్కలను నీ మీద దాడి చేయకుండా నిరోధించే ప్రయత్నం చేయి.  అకుంఠిత దీక్షతో తపస్సు సాగిస్తున్న విశ్వామిత్ర మహర్షికి మేనక సాంగత్యంతో తపోభంగం కలిగిన విషయం మనకు విదితమే.  ఇప్పుడు సాధకుల సాధనను భంగపరచటానికి దేవలోకం నుంచి మేనక దిగి రానవసరం లేదు ఏ సాధారణ స్త్రీ అయినా చాలు.  ఇలా వ్రాస్తున్నందుకు ఏమి అనుకోవలదు.  ఎందుకంటె మనం చేసే సాధన అంతబలహీనంగా వున్నదని నా భావన. 


మరి ఈ ఆరుగురు శత్రువులను పారదోలే దండం ఎక్కడ వున్నది అది నాకు దొరుకుతుందా అని అడగవచ్చు.  అది నీ దగ్గరే వున్నది కానీ నీవు దానిని ఉపయోగించటం లేదు ఏమిటి అది అంటే అది మరేమో కాదు నిత్యం దైవ చింతనం.  ఎప్పుడైతే సాధకుడు దైవచింతనంలో నిమగ్నుడై ఉంటాడో వాని చెంతకు ఈ ఆరుగురు శత్రువులల్లో ఏ ఒక్కరు కూడా దాడి చేయటానికి సాహసించరు.  ఎందుకంటె అన్నిరకాల శత్రువులను ఎదుర్కునే కరదండం దైవచింతన మాత్రమే ఇది సత్యం.  అందుకే ప్రతి క్షణం దైవచింతన చేయాలని  పెద్దలు వక్కాణిస్తున్నారు. 


సాధకుడు సదా ఈశ్వర జ్యానంలో ఉంటే ఎట్టి పరిస్థితిలోను మనస్సు అరిషడ్వర్గం మీదికి పోదు.  అథవా పోయిన వెంటనే తన తప్పు తాను తెలుసుకొని దైవత్వం వైపు నడుస్తుంది.  కాబట్టి మిత్రమా ఎల్లప్పుడూ నీ మనస్సును ఆ దేవదేవుని మీదనే వుంచు.  ఆధ్యాత్మిక ప్రగతిని సాధించు. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః

2, జులై 2022, శనివారం

కొవ్వు తగ్గుట కొరకు

 శరీరంలోని అతిగా ఉన్న కొవ్వు తగ్గుట కొరకు సులభమైన యోగం  - 


     తిప్పతీగ పొడి , త్రిఫలాల పొడి సమంగా కలిపి నిలువ ఉంచుకోవాలి . రోజు ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా పొడి వేసి ఒక కప్పు కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి గోరువెచ్చగా ఒక చెంచా తెనే కలిపి ఉదయం పూట తాగాలి. ఒక గంట వరకు మరేమి తినకూడదు . తాగకూడదు . దీనివల్ల క్రమంగా శరీరంలో అతికొవ్వు కరిగిపోతుంది . 

అమ్మవారి_వైభవం

 #అమ్మవారి_వైభవం


మనకు #శ్రీ_విద్యా_సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.

వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క #రధ , #గజ , #తురగ , #సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి.  అందుకే ఆవిడను #దండనాథ అన్నారు.

#లలితా_పరమేశ్వరి_యొక్క_ఐదు_పుష్పబాణాల_నుంచి_ఉద్భవించిన_శక్తులు_వరాహ_ముఖంతో_ఆవిర్భవించిన_శక్తి_శ్రీ_మహా_వారాహీ_దేవి.  లలితా దేవి సైన్యానికి ఆమె #సర్వ_సైన్యాధ్యక్షురాలు.

ఆమెకు ప్రత్యేక రథం ఉంది  దానిపేరు #కిరి చక్రం.  ఆ రథాన్ని #1000_వరాహాలు లాగుతాయి , #రథసారథి_పేరు_స్థంభిని_దేవి.  ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ , మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.


కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |

జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |

మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||

విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |


అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ , అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.  విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.  #ఈ_అమ్మవారిని_ఆజ్ఞా_చక్రంలో_ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే #భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు , శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి , వాడిని సంహరించి , భూదేవిని రక్షిస్తాడు.

స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు #వారాహీ_రూపం_తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.


అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది , లేదా పరిష్కరిస్తుంది.


అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో , అష్ట భుజాలతో , శంఖ , చక్ర , హల(నాగలి), ముసల(రోకలి), పాశ , అంకుశ , వరద , అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.

 ఇది #మహావారాహి (#బృహద్వారాహి) యొక్క స్వరూపం.  ఇంకా #లఘువారాహి , #స్వప్నవారాహి , #ధూమ్రవారాహి , #కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.


అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే , ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే , రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు #సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.  అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.


నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి , సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు #సాక్షాత్తు_భూమాత.

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే , ఉగ్రం వారాహి.   శ్రీ విద్యా గద్యంలో #అహంకార_స్వరూప_దండనాథా_సంసేవితే, #బుద్ధి_స్వరూప_మంత్రిణ్యుపసేవితే”  అని లలితను కీర్తిస్తారు.

 

దేవీ కవచంలో #ఆయూ_రక్షతు_వారాహి” అన్నట్టు.   ఈ తల్లి ప్రాణ సంరక్షిణి.  #ఆజ్ఞాచక్రం_ఆవిడ_నివాసం_ప్రకృతి_పరంగా_చూసినట్లైతే_ఈ_సమయంలో_వర్షం_కురుస్తుంది    రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు.  దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.

వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు.  కానీ #వారాహీ_చాలా_శాంతస్వరూపిణి.  వెంటనే అనుగ్రహిస్తుంది , కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.


వారాహీ అమ్మవారిని స్మరిస్తే #శత్రు_నాశనం_జరుగుతుంది , అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన #కామం , #క్రోధం , #లోభం , #మోహం , #మదం , #మాత్సర్యం , #అహంకారం , #అజ్ఞానం నశిస్తాయి.


అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు , అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.


1.#ఓం_శ్రీం_హ్రీం_క్లీం_వరాహై_మమ_వాక్మే_ప్రవేశయా_వాకు_పాలితాయ ||

మమ మాతా వరాహి మమ దారిద్ర్యం నాశాయ నాశాయ హుం భట ||

2.#ఓం_శత్రు_శంకరి_సంకటహరణీ_మమ_మాత్రే_హ్రీం_దుం_వం_సర్వారిష్టం_నివారాయ_నివారాయ_హుం_భట్ ||

3.#ఓం_క్లీం_వారాహి_హ్రీం_సిద్ధి_స్వరూపిణి_శ్రీం_సిద్ధి_స్వరూపిణి_శ్రీం_ధనవశంకరి_ధనం_వర్షాయా_వర్షాయా_స్వాహా ||

4.#ఓం_శ్రీం_పంచమి_సర్వసిద్ధి_మాతా_మమ_గృహామి_ధనం_ధన్యాం_సమృద్ధిం_దేహి_దేహి_నమః ||

5. #ఓం_హ్రీం_భయానకరీ_అతి_భయంకరి_ఆశ్చర్యా_భయంకరీ_సర్వ జన_భయంకరీ ||

6.#సర్వ_భూత_ప్రేత_పిశాచ_భయంకరీ_సర్వ_భయం_నివారాయ_శాంతిర్_పావతు_మే_సదా ||

7.#సర్వ_భూత_ప్రేత_పిశాచ_భయంకరీ_సర్వ_భయం_నివారాయ_శాంతిర్_పాదుమే_సదా ||


అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి బిడ్డలను_కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి.


హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామములు

 #పంచమి

 #దండనాథా

 #సంకేతా

 #సమయేశ్వరి

 #సమయ సంకేతా

 #వారాహి

 #పోత్రిణి

 #వార్తాళి

 #శివా

 #ఆజ్ఞా చక్రేశ్వరి

 #అరిఘ్ని


దేశం సుభిక్షంగా ఉండాలని…మనమంతా చల్లగా ఉండాలని…ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం


#ధూర్తానామతి_దూరా_వార్తాశేషావలగ్న_కమనీయా

#ఆర్తాళీ_శుభదాత్రీ_వార్తాళీ_భవతు_వాంఛితార్థాయ


అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే, 


#జై వారాహీ,

 

అజ్ఞ్యానం-జ్ఞ్యానం 

తరచుగా మనం ఈ రెండు పదాలను వింటూవుంటాం.  వాడు ఉట్టి అజ్ఞ్యాని అని అనటం కూడా కద్దు అంటే వానికి ఏమాత్రం జ్ఞ్యానం లేదని కావచ్చు. ముందుగా అజ్ఞ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం తరువాత జ్ఞ్యానం ఏమిటో తెలుసుకోవచ్చు. బాల్యావస్థలో వున్న శిశువుకు ఏమితెలియదు అంటే అతనికి ఈ ప్రపంచంగుర్చి అజ్ఞ్యానం వున్నది అన్నమాట ఎక్కడ అజ్ఞ్యానం ఉంటుందో అక్కడ జ్ఞ్యానం ఉండదు అన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు వెలుతురూ, చీకటి లాంటివి అన్నమాట. వెలుతురు ఉంటే చీకటి ఉండదు అలానే చీకటి ఉన్నదంటే వెలుతురు లేదని అర్ధం.

అందుకే జ్ఞనాన్ని వెలుతురుతో అజ్ఞ్యానాన్ని చీకటితో పోల్చి చెప్పారు. మీరు ఒక చీకటి గదిలోకి ప్రవేసించారనుకోండి అప్పుడు మీకు ఆ గదిలోని వస్తువులు ఏవి కనపడవు పూర్తిగా నల్లగా ఉంటుంది.  కారణం అక్కడి వస్తువులను ప్రకాశింపచేసే కాంతి అక్కడ  లేకపోవటమే. అదే మీ చేతిలో చిన్న టార్చి లైటు వున్నదనుకోండి ఆ లైటు కాంతిలో కొద్దీ కొద్దిగా మీరు అక్కడి వస్తువులు చూడగలరు. ఒక కుర్చీ, ఒక బల్ల ఇలా అక్కడ వున్న వస్తువులు లీలగా కనపడతాయి ఎందుకంటె మీ చేతి లైటు వెలుతురూ చాలా స్వల్పమైనది కాబట్టి.  కుర్చీ కనపడుతుంది కానీ దాని రంగు దానిమీద వ్రాసిన అక్షరాలు ఏమైనా ఉంటే అవి తెలుసుకోలేరు. అదే ఆ గదిలో మీరు ఎక్కువ కాంతినిచ్చే విద్యుతు లైటుని వెలిగిస్తే స్పష్టంగా అక్కడి వస్తువుల పూర్తి వివరాలు కనపడతాయి. అన్ని వివరంగా చూడగలరు.  అంటే దీని అర్ధం ఏమిటంటే ప్రకాశం ఎక్కువ అయినా కొద్ది స్పష్టత పెరుగుతున్నది.  ఇదే నియమము మనం జ్ఞ్యానవిషయంలో కూడా అన్వయించవచ్చు. మీకు ఒక విషయానిక సంబందించిన పరిజ్ఞనం పెరుగుతున్న కొద్దీ ఆ విషయం కులంకుశంగా తెలుసుకోగలుగుతారు.  మనకు విషయ జ్ఞనాన్ని రెండు విధాలుగా పొందగలము. 1) గురువుల ద్వారా 2) గ్రంధాల ద్వారా. మనకు తెలియని విషయాలు గురువులు వారి అనుభవంతో వారి పరిజ్ఞనంతో మనకు తెలియ చేస్తారు.  అలానే గ్రంధాలు కూడా మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుపుతాయి. 

జ్ఞ్యానంఅంటే ఒక్క మాటలో చెప్పాలంటే విషయపరిజ్ఞ్యానం అంటే ఒక వస్తువు లేక శాస్త్రానికి సంబందించిన విషయాన్ని తెలుసుకోవటం. అంటే తెలియనితనం అజ్ఞ్యానం తెలుసుకోవటం జ్ఞ్యానం.

 

ఇంకా వుంది