*2323*
*కం*
ఎందరినేదరి జేర్చిన
సందరమున నొంటరిగనె సాగు తరి గతిన్
అందరితో కలిసి బతికి
యందరి పరయానమొంటి యాతనె సుజనా.
*భావం*:-- ఎంతమందిని ఏ యే ఒడ్డులకు చేర్చిననూ సముద్రంలో నావ(తరి) ఒంటరిగా నే సాగే విధంగా అందరితో నూ కలిసి బతికే అందరియొక్క మరణయానమూ ఒంటరి వేదనయే.
*సందేశం*:-- అందరితోనూ కలిసే బతికిననూ చివరకు మరణము మాత్రం ప్రతీ ఒక్కరికీ ఒంటరి ప్రయాణమే,అంటే మృత్యువు (మరణం) ఏ ఒక్కరికో బంధువూ కాదు,ఎవరితోనూ మిత్ర శత్రు త్వాలు తనకు ఉండవు,అది కేవలం మన ఆత్మ ను భూలోకం నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళే నావ మాత్రమే.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి