3, ఫిబ్రవరి 2026, మంగళవారం

జీవితంలో చివరి మజిలీలు:*

 22f8;

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇M.A.166.

*మన ఆరోగ్యం…!



   *జీవితంలో చివరి మజిలీలు:*

               ➖➖➖✍️


*మొదటి మజిలీ:*

*58 నుంచి 65 సంవత్సరాల మధ్య!

```

*మీరు మీరు పనిచేస్తున్న వ్యవస్థ/సంస్థ నుంచి దూరంగా జరుగుతారు.

*మీరు ఎన్ని విజయాలు సాధించినా, ఎంత శక్తివంతులైనా ఒక ‘మామూలు మనిషి’గా మాత్రమే మిగిలి పోతారు.

*మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో గతంలో పోషించిన హోదాలు, చెలాయించిన పెత్తనం మీ బుర్ర లోంచి తొలగించుకోండి. 

*ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరు పట్టించుకోరు.```



*రెండవ మజిలీ:* 

*65 ఏళ్ల నుంచి 72 వరకు!```


*ఈ వయసులో సమాజం మిమ్ములను నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటుంది. మీ మిత్రులు. 

*సహోద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. 

*మీరు గతంలో పనిచేసిన చోట కూడా మిమ్ములను గుర్తించేవారి సంఖ్య కూడా పలచబడుతుంది.


*’నేను అప్పట్లో అలా ఉండేవాడిని, ఒకసారి ఏంచేశానో తెలుసా?’ అని ఎవరితో చెప్పకండి. 

*మీ తరువాతి తరం ఆ విషయాలు పట్టించుకోరు. మీరు బాధ పడకూడదు. 


*దీనినే డమాబుస్‌ స్తితి అంటారు. (బీడువారిన చేను)```



*మూడవ మజిలీ:*

*72 – 77 సంవత్సరాల మధ్య!

```

*ఈ మజిలీలో మీకు ఎందరు సంతానం ఉన్నా, మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నా మీరు మీ జీవిత భాగస్వామితోనో, లేక ఒంటరీగానో మాత్రమే మిగిలిపోతారు. 

*కుటుంబం మీనుంచి దూరం జరుగుతూ ఉంటుంది.

*మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్ములను పలకరిస్తే, అది మీ మీద ప్రేమ, అభిమానం, గౌరవంగా భావించండి. 

*ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళతారని కోపగించుకోకండి. 

*వారు ఊపిరి సలపని పనుల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.```



*నాల్గవ/చివరి మజిలీ*: 

*77 ఏళ్ల తరువాత..!```


*ప్రకృతి మీ శరీరాన్ని క్షీణింప చేస్తుంది. అందుకోసం విచారించాల్సిన అవసరం లేదు. 

*జీవిత చరమాంకంలోకి ప్రవేశించామని గుర్తించండి.

*శరీరం సహకరించినంత వరకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి.

*మీకు నచ్చింది తినండి, త్రాగండి, ఆడండి, పాడండి.

*ఆనందంగా, హుషారుగా ఉండండి. అంతే!!! 



*మిత్రులారా..

*ఈ ఆర్టికల్ ఎవరు రాశారో.. 

*చాలా బాగా వాస్తవాలు చెప్పారు.

*యాభై ఎనిమిదేళ్లు దాటిన ప్రతివారు ఒక సమూహంగా ఏర్పడండి. 

*ఏదో ఒక ప్రదేశంలో, ఒక ఖచ్చితమైన సమయంలో కలుసుకోండి. *మీ అభిప్రాయాలు పంచుకోండి. ఇతరుల ఆలోచనలను స్వాగతించండి. 

*తెలిసిన వారితో ఫోన్ లో సంభాషించండి. 

*గత జీవితపు మాధుర్యాలను పంచండి.

*నవ్వండి..! నవ్వించండి..!!

*నవ్వుతూనే ఉండండి.!!!✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 87121 84465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

కామెంట్‌లు లేవు: