3, ఫిబ్రవరి 2026, మంగళవారం

కలవారి కోడలు

 కలవారి కోడలు


సంపాదన : చెన్నాప్రగడ పద్మావతి, పెదరావూరు


కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలోపోసి. అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న కాళ్ళకు నీళ్లిచ్చి కన్నీరునింపె.



"ఎందుకో కన్నీరు ఏమికష్టమ్ము? తుడుచుకో చెల్లెలా, ముడుచుకో కురులు, ఎత్తుకో బిడ్డను, ఎక్కు అందలము, మీ అత్త మామలకు చెప్పిరావమ్మ.”


"కుర్చీపీటమీద కూర్చున్న అత్త, మా అన్నలొచ్చారు మముబంపుతార?”


"నేనెరుగ నేనెరుగ, మీమామ నడుగు!"


"పట్టెమంచముమీద పడుకున్న మామ, మా అన్నలొచ్చారు మముబంపుతార?” "నేనెరుగ నేనెరుగ, మీబావనడుగు!”


"భారతము చదివేటి బావ, పెదబావ, మా అన్నలొచ్చారు మముబంపుతార?”


“నేనెరుగ నేనెరుగ, మీ అక్కనడుగు”


"వంటచేసేతల్లి, ఓ అక్కగారూ, మా అన్నలొచ్చారు మముబంపుతార?"


"నేనెరుగ నేనెరుగ, నీభర్తనడుగు”



"రచ్చలో వెలిగేటి రాజేంద్రభోగి, మా అన్నలొచ్చారు మముబంపుతార?”


"పెట్టుకో సొమ్ములూ, కట్టుకో చీర, పోయిరా సుఖముగా పుట్టినింటికిని.”


13

కామెంట్‌లు లేవు: