28, ఆగస్టు 2025, గురువారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ


నభఃస్పృశం దీప్తమనేకవర్ణం

వ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ 

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా

ధృతిం న విందామి శమం చ విష్ణో (24)


దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని 

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస (25)


ఆకాశాన్ని అంటుతూ, అనేకరంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి, ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగ కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశా.. జగన్నివాసా.. దిగులు పడివున్న నన్ను అనుగ్రహించు.

చింత చిగురు...*

 ;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀```ఆరోగ్య చింతలను తీర్చే…```



                *చింత చిగురు...*

                   ➖➖➖✍️

తింటే మీకే తెలుస్తుంది...,



```

సీజన్‌లో దొరికే చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. 


ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింతచిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. 



*చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

*దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. 

*ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 

*ఈ చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. 

*యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండటమే ఇందుకు కారణం. 


*కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. 

*జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. 

*ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి. 


*తరచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. 

*థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

*గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. 

*శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే గాక, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 

*చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

జగన్నాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : నెం 1217


⚜  ఒడిస్సా : పూరీ 


⚜  శ్రీ క్షేత్రం - జగన్నాథ స్వామి ఆలయం



💠 మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ ఆలయం.



💠 జగన్నాథ ఆలయాన్ని శ్రీకృష్ణుడు తన సోదరుడు మరియు సోదరితో జగన్నాథుడిగా ప్రధాన దైవంగా నిర్మించినప్పుడు, పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.



🔆 స్థలపురాణo 


💠 కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు.

అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు.


💠 ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు అనే రాజు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు.

అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు. 

అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు.

అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.


💠 ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట. 

కానీ అలా నదీతీరంలో 

లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. 


💠 అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజువద్దకు మారువేషంలో వచ్చి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. 

కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తాననీ తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. 


💠 కానీ పదిహేను రోజుల తర్వాత... ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు “తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. 

అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు.


💠 దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాధుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం


💠 విమల ఆలయం (బిమల ఆలయం) శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది . 

ఇది ఆలయ సముదాయంలోని రోహిణి కుండ్ సమీపంలో ఉంది . జగన్నాథుడికి సమర్పించిన ఆహారాన్ని విమల దేవతకు సమర్పించే వరకు దానిని మహాప్రసాదంగా పరిగణించరు.


🔆 రథయాత్ర


💠 ద్వాపరయుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. 

ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు. 


💠 ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... 

పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ జగన్నాథ బలభద్రుల కోసం ప్రధానాలయానికి 3 కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. 


💠 రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిధ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాధుడి అతిథిగృహం అన్నమాట!


💠 ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. 


💠 సుభద్రా బలభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. 

అందుకే జగన్నాథుడి రతయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.


💠 జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు.

ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది.


💠 శ్రీ జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 

బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. 

సుభద్ర రథాన్ని దర్పదళన అంటారు.


💠 ఇక్కడ భగవంతుడికి 56 రకాల ప్రసాదాలు కట్టెల పొయ్యి మీద వండి భగవంతుడికి ప్రతినిత్యం నివేదిస్తారు. 

ఆ ప్రసాదాలన్నీ నిలువునా పేర్చిన 6 కుండలలో వండుతారు, కట్టెల పొయ్యికి దగ్గరగా ఉండే కుండలో ఎంత నాణ్యతతో ప్రసాదం తయారు అవుతుందో చివరి కుండలో కూడా అంతే నాణ్యతతో ప్రసాదం తయారవడం ఇక్కడి భగవంతుడి లీలగా పరిగణిస్తారు.


💠 అలా నివేదించబడిన ప్రసాదాలను ఆనంద్ బజార్ అని ప్రదేశంలో భక్తుల కోసం సరసమైన ధరలకు విక్రయిస్తారు. 

అలా భగవంతుడికి నివేదించి భక్తులకు వితరణ చేసే ప్రసాదాన్ని " అబడా" అంటారు.

పూరీ క్షేత్రంలో భగవంతుడి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి సరి సమానంగా ఈ ప్రసాదం స్వీకారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.



💠 ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. 



రచన

©️ Santosh kumar

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శాంతి పర్వము ప్రథమాశ్వాసము*


*482 వ రోజు*


*సృంజయుడి వృత్తాంత*


తరువాత కథను నారదుడు చెప్పసాగాడు " ధర్మరాజా ! అలా నేను పర్వతుడితో కొంతకాలం సృంజయుడి ఇంట్లో ఉండి కొన్నిసంవత్సరాల అనంతరం తిరిగి స్వర్గలోకం పోవానని అనుకున్నాము. వెళ్ళే సమయాన మా పట్ల గౌరవాభిమానాలు చూపించిన సృంజయుడికి ఏదైనా మేలు చేయాలన్న తలంపుతో నేను అతడికి దేవతలకన్నా ఉన్నతుడైన కుమారుడు కలగాలని వరం ఇచ్చాను. పర్వతుడు సృంజయుడికి కలుగబోయే కుమారుడి వలన ఇంద్రుడికి ఏదైనా కీడు కలుగకలదన్న తలంపుతో " సృంజయా ! ఆ కుమారుడు అర్ధాయుష్కుడు కాగలడు " అన్నాడు. అమాటలకు నాకు కోపంవచ్చి " సృంజయా ! ఆ కుమారుడిని నీకు చేతనైనంత కాపాడుకో. నీ శక్తికి మించి నీకుమారుడికి మరణం సంభవించిన వెంటనే నన్ను తలచిన నేను వచ్చి అతడికి ప్రాణదానం చేస్తాను. అలాగే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుడి శరీరంలోని విసర్జితాలు అన్నీ స్వర్ణ మయం ఔతాయి. అందు వలన అతడు సువర్ణష్టీవి అని పిలువబడతాడు " అని అన్నాను. నా మాటలకు సృంజయుడు ఆనందపడ్డాడు. తరువాత మేము వెళ్ళి పోయాము. నా వరంవలన సృంజయుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మలమూత్రములు, శ్వేదం మిగిలిన విసర్జితాలన్నీ బంగారంగా మారసాగాయి. సృంజయుడి ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని పసికట్టిన కొందరు దొంగలు సువర్ణష్టీవివిని అపహరించి తీసుకు వెళ్ళి అతడి నోట్లో గుడ్డలుకుక్కి సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్ళారు. అతడి శరీరమంతా శోధించి ఎక్కడా సువర్ణం లభ్యంకాక వారు సువర్ణష్టీవిని చంపి అక్కడే పారవేసి వెళ్ళారు. సృంజయుడు తన కుమారుడు కనిపించక అంతటా వెతికి చివరకు నారదుడిని తలచుకున్నాడు. నేను అతడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకుని సువర్ణష్టీవి మరణ వృత్తాంతం చెప్పాను. సృంజయుడు సువర్ణష్టీవి మరణానికి ఎంతో దుఃఖించాడు. నేను " సృంజయా ! నీ కుమారుడు యమలోకంలో ఉన్నాడు. నీ కుమారుడిని నేను తీసుకు వస్తాను " అని చెప్పి సువర్ణష్టీవిని పునరుజ్జీవితుడిని చేసాను. సృంజయుడు చాలా సంతోషించాడు. నాను సృంజయుడితో " సృంజయా ! ఇంద్రుడు నీ కుమారుడిని చంపడానికి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు " అని చెప్పి వెళ్ళాను. దేవేంద్రుడికి సువర్ణష్టీవి వలన తనకు ఆపద కలుగకలదన్న భయం పట్టుకుంది. ఒకరోజు సృంజయుడు తన భార్యాబిడ్డలతో గంగా నదీతీరాన విహరిస్తున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వ్యాఘ్ర రూపంలో అతడి మీద ప్రయోగించాడు. వజ్రాయుధం తగిన సమయం చూసి వ్యాఘ్రరూపం ధరించి సువర్ణష్టీవిని చీల్చిచంపి మాయం అయింది. సువర్ణష్టీవి మరణానికి దుఃఖిస్తూ సృంజయుడు నన్ను తలచుకున్నాడు. నేను వెళ్ళి సువర్ణష్టీవిని సజీవుడిని చేసి తిరిగి వెళ్ళిపోయాను. సువర్ణష్టీవి దీర్ఘాయుష్కుడై వేలాది సంవత్సరములు రాజ్యపాలన చేసాడు.ధర్మరాజా ! నీవు కూడా నీ పట్టు వదిలి రాజ్యభారం వహించు.

*వ్యాసుడి హితవు*


నారదుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు మౌనం వీడలేదు. అది చూసి వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియులకు రాజ్యపాలన కంటే వేరే ధర్మంకలదా ! అందువలన వేదవిహితమైన విప్రకర్మలు ఆచరించబడతాయి. విప్రకర్మలు ఆచరించని ఎడల సమాజముకు నష్టం వాటిల్లగలదు. వేదవిహిత విప్రకర్మలు ఆచరించని ఎడల రాజుకు పాపంసంక్రమించి ఉత్తమలోక ప్రాప్తికి ఆటంకంకలుగుతుంది. కనుక ప్రజాపాలనయే నీధర్మం " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పాదములతో తాకరాదు.*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝      *పాదాభ్యాం న స్పృశేత్*

          *అగ్నిం గురు బ్రాహ్మణమేవ చ|*

          *నైవ గాం న కుమారీం చ*

         *న వృద్ధం న శిశుం తథా||*


తా𝕝𝕝  *అగ్నిని, గురువును, బ్రాహ్మణుని, ఆవును, కన్యను,వృద్ధుని, శిశువును పాదములతో తాకరాదు.*


✍️🌸🌹💐🙏

గురువారం🪷* *🌹28 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷గురువారం🪷* 

  *🌹28 ఆగస్టు 2025🌹* 

     *దృగ్గణిత పంచాంగం* 

                  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి  : పంచమి* సా 05.56 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : చిత్త* ఉ 08.43 వరకు ఉపరి *స్వాతి*


           *ఈనాటి పర్వం*

      *ఋషి పంచమి వ్రతం*


*యోగం : శుక్ల* మ 01.18 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : బాలువ* సా 05.56 *కౌలువ పూర్తిగా రాత్రంతా*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 01.46 - 03.34*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం      : మ 03.00 - 04.48*

*దుర్ముహూర్తం  : ఉ 10.03 - 10.53 మ 03.03 - 03.53*

*రాహు కాలం   : మ 01.42 - 03.16*

గుళికకాళం       : *ఉ 09.01 - 10.35*

యమగండం     : *ఉ 05.54 - 07.27*

సూర్యరాశి : *సింహం*              

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.54 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి         : భాద్రపద శుద్ధ పంచమి*

సాయంకాలం        :*సా 03.53 - 06.23*

ప్రదోష కాలం         :  *సా 06.23 - 08.41*

రాత్రి కాలం           :*రా 08.41 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*


*ఏకవస్తుపరిబోధయితారం*

 *దత్తదేవమనిశం కలయామి*


         *జై దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🪷బుధవారం 27 ఆగస్టు 2025🪷*

                    4️⃣4️⃣

                *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


         *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


      *ఖగోళ విషయ విస్తారం*               

```

బ్రహ్మాండమధ్యంలో ఉన్న సూర్యుడు ముల్లోకాలను తన తేజస్సుతో నింపితపింపచేస్తూ, కాంతిమంతం చేస్తున్నాడు. సూర్యుడికి ఏడాది సాగే నడకలో ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువం అనే మూడు గమనాలున్నాయి. ఉత్తరాయణంలో మీదికి వెళ్తాడు. దక్షిణాయనంలో కిందకు వెళ్తాడు. ఉత్తరాయణంలో మెల్లగా నడుస్తాడు కాబట్టి పగళ్లు ఎక్కువ, రాత్రుళ్లు తక్కువ. దక్షిణాయనంలో వేగంగా నడుస్తాడు కాబట్టి పగళ్లు తక్కువ, రాత్రుళ్లు ఎక్కువ. విషువంలో సమానం. రాత్రింబగళ్లు ఎక్కువ - తక్కువలు ఉండవు. సూర్యుడు మేషరాశిలోను, తులారాశిలోను ప్రవేశించినప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మేషంలోకి వచ్చినప్పటి మర్నాటి నుండి రోజు-రోజుకు పగలెక్కువ, రాత్రి తక్కువ అవుతుంటుంది. సూర్యుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో ప్రవేశించేటప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూట పెరుగుదల, రాత్రిపూట తరుగుదల ఉంటాయి. అలాగే, సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల్లోకి ప్రవేశించినప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూటలో తరుగుదల, రాత్రిపూటలో పెరుగుదల ఉంటాయి.


ఇలా దినాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, పెరగడం, తరగడం ఏర్పడుతున్నాయి. సూర్యుడు తన రథం మీద మానసోత్తర పర్వతం చుట్టూ తిరగడానికి ఒక పగలు, ఒక రాత్రి పూర్తవుతాయి. ఆ పర్వతం చుట్టు కొలత తొమ్మిది కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాలు. మానసోత్తర పర్వతానికి తూర్పు దిక్కున ఇంద్రుడి పట్టణం ఉన్నది. దాని పేరు దేవధాని. దక్షిణ దిక్కున యముడి పట్టణం ఉన్నది. దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుడి పట్టణం నిమ్లోచని ఉన్నది. ఉత్తరం వైపున చంద్రుడి పట్టణం విభావరి ఉన్నది. జ్యోతిశ్చక్రం భ్రమించడం వల్ల భూమిలో సూర్యుడు కనిపించడం ఉదయం, ఆకాశంలో కనిపించడం మధ్యాహ్నం, భూమిలోకి చొచ్చినట్లు కనిపించడం అస్తమయం, దూరంగా ఉండడం రాత్రి. ఈ ఉదయాస్తమయాదులు జీవుల ప్రవృత్తి, నివృత్తులకు హేతువులై ఉంటాయి.


సూర్యుడు ఇంద్రపురం నుండి యమపురానికి వెళ్లేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బె అయుదు వేల (2,37,75,000) యోజనాల దూరం దాటి వెళ్తాడు. యమపురి నుండి వరుణపురి, అట్నుంచి సోమపురి ఇలా పోతుంటాడు. ఇలా చంద్రగ్రహనక్షత్రాదులతో కూడి తిరుగుతూ వున్న సూర్యుడి రథచక్రానికి పన్నెండు అంచులు, ఆరు కమ్ములు, మూడు నాభులు ఉంటాయి. ఆ చక్రానికి సంవత్సరం అని పేరు. సూర్యుడి రథానికి ఒకటే చక్రం. ఈ ఏకచక్ర రథం ఒక్క ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వేల యోజనాల మేర సంచరిస్తుంది.


సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు మేరు శిఖరం మొదలు మానసోత్తర పర్వతం వరకు వ్యాపించి ఉంటుంది. దీని పొడవు ఒక కోటి ఏబై ఏడు లక్షల ఏభై వెల యోజనాలు. ఈ ఇరుసుకు గానుగ చక్రంలాగా, చక్రం అమర్చబడి, మానసోత్తర పర్వతం మీద సూర్యరథం తిరుగుతుంటుంది. ఇరుసు ఒకటి ఉత్తర ధ్రువం వైపు. ఇంకొకటి దక్షిణ ధ్రువం కింది దాకా ఉంటుంది. ఈ ఇరుసులు రెండింటి మీద ఈ చక్రం ధ్రువాలలో బిగించబడి ఉంటుంది. భూ పరిభ్రమణం వల్ల ఉత్తర-దక్షిణ ధ్రువాలలో గాలి సుడిగుండాలు ఏర్పడుతాయి. అవే తాళ్లుగా ఆ తాళ్లతో ఇరుసులు ద్రువాలకు బిగించబడి ఉంటాయి. అ రథంలో సారథి కూర్చోడానికి అనువైన చోటు ముప్పెఆరు లక్షల యోజనాల పొడవు, తొమ్మిది లక్షల యోజనాల వెడల్పు కలిగినది. ఆ రథానికి కాడి కూడా ముప్పైఆరు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది.


సూర్య రథానికి గాయత్రి మొదలైన ఏడు ఛందస్సులు (గాయత్రి, ఉష్ఠిక్, త్రిష్ణువ్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి) గుర్రాలై ఉంటాయి. సూర్యుడికి ముందు అరుణుడు రథసారథిగా ఉంటాడు. వాలఖిల్యుడు మొదలైన 60 వేలమంది ఋషిశ్రేష్ఠులు సూర్యుడి ముందర సౌరసూక్తాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఈ ఋషులు బొటన వేలు పైభాగం ఎంత ఉంటుందో అంతే శరీరం కలవారై ఉంటారు. ఇంకా ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, పతంగులు మొదలైన వారంతా నెలనెలా వరుస క్రమంలో సూర్యుడిని సేవిస్తూ ఉంటారు. ఇంతమంది ఇలా సేవిస్తూ ఉంటే, సూర్యుడు తొంభై కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం ఉన్న భూమండలాన్ని అంతటినీ ఒక్క పగలు, రాత్రిలో సంచరించి వస్తూ ఉంటాడు. అంటే ఒక్క క్షణానికి రెండువేల యోజనాలు సంచరిస్తాడు.


మేరువుకు, ధ్రువానికి సూర్యుడు ప్రదక్షిణ చేయడం, రాశి చక్రం మీద సంచరించడం ఎలా కుదురుతుందన్న సందేహం కలగవచ్చు. అంటే, ఉత్తర ధ్రువం ఉండేది ఉత్తర దిశలో కదా. రాశి చక్రం ఉండేది భూమధ్య రేఖ మీద కదా, అలాంటప్పుడు, ఉత్తర ధ్రువానికి ప్రదక్షిణం, రాశి చక్రం మీద సంచరించడం ఏక కాలంలో ఎలా అన్నది అసలు సందేహం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది. అదే, సకలం భగవత్సృష్టి విలాసం అనే విషయం. ఇలాంటి సందేహాలను పూర్తిగా తీర్చగలగడం ఒక్క సర్వేశ్వరుడికే చేతనవుతుంది.


నక్షత్రాలతో, రాశులతో కూడిన కాలచక్రం ధ్రువానికి మేరువుకు ప్రదక్షిణం చేసేటప్పుడు, ఆ కాలచక్రం వెంట సంచరించే సూర్యాది గ్రహాలకు నక్షత్రాలతోను, రాశులతోను, ఉనికి ఉండడంతో చక్రగతి వల్ల, వాటంతట వాటికి ఉన్న గతుల వల్ల, రెండు గతులు ఉంటూ ఉంటాయి. ఆదిపురుషుడైన భగవానుడే, ఆ నారాయణుడే, లోకాలకు యోగ క్షేమాలను కూర్చడానికై సూర్యుడి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. సూర్యుడు మూడు వేదాల స్వరూపం. నారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరమపురుషుడే తనను పన్నెండు విధాలుగా విభజించుకుని వసంతం మొదలైన ఆరు ఋతువులను ఆయా కాలాలలో జరిగే విశేషాల్ని బట్టి ఏర్పాటు చేశాడు. ఆ పరమ పురుషుడు జ్యోతిశ్చక్రం లోపల ప్రవర్తిస్తూ తనదైన తేజస్సుతో సకల జ్యోతిర్గణాలను దీపింప చేస్తున్నాడు. మేషాది పన్నెండు రాశులలోను ఒక్కో మాసం వంతున ఒక సంవత్సరం సంచరిస్తాడు. ఆయన గమనంలోని విశేషమైన కాలాన్ని అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, తిథులుగా వ్యవహరిస్తారు. రాశులలో ఆరవ అంశం ఆయన సంచరించినప్పుడు దానిని ఋతువు (అంటే సంవత్సరంలో ఆరవ వంతు, రెండు మాసాల కాలం) అని అంటారు. కాలచక్రంలో సూర్యుడు సగభాగం, అంటే, ఆరు రాశులలో సంచరించే కాలాన్ని అయనం అంటారు.


                 *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


        *రచన: శ్రీ వనం* 

  *జ్వాలా నరసింహారావు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷``


 *🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - భాద్రపద మాసం - శుక్ల పక్షం -‌ పంచమి -చిత్ర -‌‌ ‌గురు వాసరే* (28.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

27, ఆగస్టు 2025, బుధవారం

పద్యములు

 . *పద్యములు*


ఉ౹౹ తుండము నేక దంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్

       మెండుగ మ్రోయుగజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ 

       కొండొక గుజ్జురూపమున గోరిన విద్యలకెల్ల నొజ్జయై 

       యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్


ఉ౹౹ తొలుత నవిఘ్నమస్తనుచు, ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్

ఫలితము సేయుమయ్య, నిను ప్రార్థనచేసెద నేకదంత మా

వలపలి చేత గంటమున వాక్కుననెప్పుడుఁ బాయకుండు మీ

          తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా.


కం౹౹ తలచితి నే గణనాథుని తలచితి నే విఘ్నపతినిఁ దలచిన పనిగా

        తలచితి నే హేరంబుని తలచితి నా విఘ్నములు తొలగుట కొఱకున్.


కం౹౹ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుఁబ్రాలు చెరకురసంబున్

       నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్.


కం౹౹ గారెలుబూరెలు పూర్ణపు

బూరెలు నుండ్రాళ్ళు లడ్డు పులిహోరయుమే... 

       పూరీలు పాయసము లిం

పారగ నర్పించి కొల్తు నంచితభక్తిన్.


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐


. *వినాయక పంచరత్నములు*


సామజానన నీ మహాత్మ్యము - సన్నుతింపగ విందురా

వేమరుం గొనియాడు వారల - వింతగా మది నెంతురా

ప్రేమమీరగ సాధుదేవర -వేల్పు నీవని గందురా

కామితార్థ ఫలప్రదాయక - కంచుతేరు వినాయకా.


నీ మహాత్మ్యము లెల్ల ధరలో-నిత్యమై వెలుగొందురా

ఓ మహాత్మక భావపోషక - ఒప్పు మూషిక వాహన

వామయంచక పుత్రతామర - వాసవాది సురార్చిత

కామితార్థ ఫలప్రదాయక - కంచుతేరు వినాయకా.


తూర్యభేరులు మ్రోగ భక్తిని తొల్త నిత్తును పువ్వులన్

ఆర్యులందరు దెత్తు‌రప్పుడు - అంబుజానన వారలన్

కోటిసూర్యులకాంతివెల్గుచు-కోరు కోర్కెల దీర్చుదేవర

కార్యసిద్ధి పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


ఝాముఝామున నాను బియ్యము - చాల కొబ్బరికాయలన్

కోమలాంగులు దెత్తురప్పుడు - కోటిమోదక పూర్ణముల్ 

నా మనోహరమైన చక్కెర - నీకు నేనెటులిత్తురా

కామితార్థ పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


రాజపూజిత రాజశేఖర - రాజరాజ మనోహరా

భూమిపాలక భోగిభూషణ - భూరికీర్తిదనాయకా 

నా మనోహర కామ్యదాయక నాథనాథ వినాయకా

కామితార్థ పలప్రదాయక - కంచుతేరు వినాయకా.


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

*శ్రీ మహా గణేశ పంచ రత్నం* 


ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం ।

కళాధరావతంసకం విలాసిలోక రక్షకం ।

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం ।

నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం ॥ 1 ॥


నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం ।

నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరం ।

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం ।

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం ॥ 2 ॥


సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం ।

దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరం ।

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం ।

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం ॥ 3 ॥


అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం ।

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం ।

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం ।

కపోల దానవారణం భజే పురాణ వారణం ॥ 4 ॥


నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజం ।

అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనం ।

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం ।

తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ॥ 5 ॥


మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహం ।

ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం ।

అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం ।

సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ॥

卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐



. *విఘ్నేశ్వరుని మంగళహారతులు*


శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతావంద్యునకును

ఆసరస విద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును

౹౹జయమంగళం నిత్యశుభమంగళం౹౹


నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు ౹

వేఱువేఱుగ దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు ౹

శశిచూడరాకున్న జేకొంటి నొక వ్రతము ౹ పర్వమున దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు

తేనెతో మాగిన తియ్య మామిడి పండ్లు మాకు బుద్ధి నిచ్చు గణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు ౹

కమ్మని నెయ్యియు కడుముద్ద పప్పును బొజ్జ విరుగగ తినుచు పొరలుకొనుచు ౹౹జయమంగళం౹౹


వెండి పళ్ళెరములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలియబోసి ౹

మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ౹౹జయమంగళం౹౹


పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ౹

ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు. ౹౹జయమంగళం౹౹                  


ఏకదంతంబును ఎల్ల గజవదనంబు జాగయిన తొండంబు వలపుకడుపు ౹

జోకయిన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹ 


మంగళము మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వఙ్ఞ వందితునకు

మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹ 


బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి ౹

మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ౹౹జయమంగళం౹౹ 


పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి గట్టిగా కనకములు కరులు హరులు ౹

యిష్టసంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి

నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడ(వ)గు పూజ లాలింపజేతు ౹౹జయమంగళం౹౹


మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైన గంధసారములను ౹

ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ౹౹జయమంగళం౹౹ 


దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును ౹

దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు ౹౹జయమంగళం౹౹


చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను ౹

పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ౹౹జయమంగళం౹౹


మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు ౹

నేరెడు నెలవంక(ది) టెంకాయ తేనెయు బాగుగా(చాలగా) నిచ్చెదరు చనువుతోను ౹౹జయమంగళం౹౹


ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను ౹

మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెలీడేర(కోర్కెదీర) ౹౹జయమంగళం౹౹



. *౹౹జయమంగళం నిత్య శుభమంగళం౹౹*


卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐

శ్రీ గణపతి తత్వం అంతరార్థం*

 🙏🙏🙏#శ్రీ గణపతి తత్వం అంతరార్థం*


*‘తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్

’ ప్రాచీన కాలం నుండీ నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడి ననుసరించి ‘ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం గణపతి పూజాం కరిష్యే’ అని చెపుతూ విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ గణపతిని మొదటగా ఆరాధించడం జరుగుతుంది.*

వినాయకుడు రెండు రూపాలలో ఉంటాడు. విఘ్నాలు కలుగజేసేవాడు, విఘ్నాలను తొలగించేవాడు. ఏదైనా పనిమీద వెళ్ళునపుడు దాని ఫలితం మనకు మంచిది కాకపోతే మనకు విఘ్నాలు కలుగజేస్తాడు. సత్ఫలితం అయితే విఘ్నాలు తొలగిస్తాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి.


*వినాయకుడు ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి. అకుంఠిత దీక్షతో భక్తిప్రపత్తులతో కొలవాలేగాని, కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత.

గణపతి శబ్ద బ్రహ్మ స్వరూపం.

ఓంకార ప్రణవ నాద స్వరూపుడు మహా గణపతి. నామ మంత్రాలకు ముందు ‘ఓం’కారము ఎలా ఉంటుందో అలాగే అన్ని శుభ కార్యాలకి ముందు గణపతి పూజ తప్పక ఉంటుంది.*


*గణపతి పుట్టుక: జ్యోతిషశాస్త్ర అన్వయం ‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించాడు. భద్రమైన పదం భాద్రపదం. శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజోరూపం. చతుర్థి అనగా చవితి. జాగ్రత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలనూ దాటిన తరువాతది నాల్గవది - తురీయావస్థ.నిర్వికల్ప సమాధి.


 ఆయన నక్షత్రం హస్త. హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది. రాశ్యాధిపతి బుధుడు. విజ్ఞానప్రదాత. మేషరాశి మొదటి రాశి. మేషరాశి నుంచి ఆరవ రాశి - కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావం, శతృ ఋణ రణ రోగములను తెలియజేస్తుంది.* 


*మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం. ఆ షష్ట్భావంతో (హస్తా నక్షత్రం,కన్యారాశి) చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితి నాడు పుట్టిన వినాయకుడు ఈ నాలుగు రకములయిన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.*


*కన్యారాశికి సప్తమ రాశి మీనరాశి. మీనరాశి కాలరాశి చక్రంలో పన్నెండవ రాశి. అంటే వ్యయ రాశి. మేష రాశికి వ్యయ రాశి పనె్నండవ భావం వ్యయాన్ని, బంధనాన్ని, అజ్ఞాత శత్రువుల్ని తెలియజేస్తుంది. ఇక్కడ శత్రువులంటే అంతశ్శత్రువులు.* *అరిషడ్వర్గములు - కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు (ఆరు). ఇవి మానవుని ప్రగతికి విఘ్నాలు కలిగించేవి. హస్తా నక్షత్రం, కన్యారాశిలో ఉన్న చంద్రుడు సప్తమ దృష్టితో నేరుగా మీనరాశిని వీక్షిస్తున్నాడు. కనుక వాటిని తొలగించి జీవితాన్ని సుఖమయం సుసంపన్నం చేసి,లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చి, మోక్షగతిని ప్రసాదించేవాడు వినాయకుడని జ్యోతిష శాస్త్ర అన్వయం


.పత్రిపూజ, ఉండ్రాళ్ల నివేదనలోని ఆంతర్యం వినాయకుని నక్షత్రం ‘హస్త’ అని చెప్పుకున్నాం గదా.* *హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. నవగ్రహములకు నవధాన్యములు, నవరత్నములు చెప్పబడ్డాయి. చంద్రుని తెల్లనివాడు - వినాయకుడు శుక్లాంబరధరుడు.*


*నవధాన్యాలలో చంద్రునికి బియ్యం. అందుకే బియ్యాన్ని భిన్నం చేసి, చంద్ర నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ఆవిర్భవించిన వినాయకునికి, ఉండ్రాళ్లు నివేదన చేయటంలోగల ఆంతర్యమిదే. వినాయకునిది కన్యారాశి అని చెప్పుకున్నాం గదా. కన్యారాశికి అధిపతి బుధుడు కదా. బుధునికి నవరత్నములలో ‘పచ్చ’ రాయి- ఎమరాల్డ్ గ్రీన్ అనగా ఆకుపచ్చ రంగు. అందుకే వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రితో పూజ చేస్తారు. సంతుష్టు డవుతాడు స్వామి.*


*గరికపూజ ప్రీతిపాత్రం ఎందుకు?వినాయకునికి గరిక పూజ అంటే ప్రీతి అంటారు. వినాయక చవితినాడే గాక, ప్రతిరోజూ విఘ్నేశ్వరాలయాలలో, గరికతో స్వామిని అర్చిస్తారు.పూజాద్రవ్యములలో గరికను కూడా జత చేసి సమర్పిస్తారు భక్తులు. దీనికి జానపదులు చెప్పుకునే కథ ఒకటి ఉంది. పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతున్నారు.న్యాయ నిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఎంపిక చేశారు. ఈశ్వరుడే గెలిచాడని నంది తీర్పు చెప్పాడు.అయితే ఆ తరువాత అమ్మతో నిజం చెప్పాడు. ‘ఈశ్వరుడు నాకు ప్రభువు. ఆయనే నా ప్రాణం. అందుకే ఆయన గెలిచినట్లు చెప్పాను. అయినా ఆయన అర్ధనారీశ్వరుడు గదమ్మా మీరిద్దరూ ఒకటే’ అన్నాడు.*


 *‘నందీ! నీవు నయం కాని వ్యాధితో బాధపడతావు’ అని శపించి, నంది దీనావస్థను చూచి జాలి చెంది, ‘నందీ! నా కుమారుడైన గణనాథుని పుట్టిన రోజున నీకు ఇష్టమైన పదార్థాన్ని అర్పితం చెయ్యి. అతను అనుగ్రహంతో నీకు శాపవిమోచనం కలుగుతుంది’ అని సెలవిచ్చింది, పార్వతీదేవి. నంది తన కిష్టమైన గరికను గణపతికి అర్పించాడు. అతనికి శాపవిముక్తి లభించింది. ఇది వినాయక పూజలో గరిక ప్రాధాన్యత.*


*‘సహస్ర పరమా దేవీ శతమూలా శతాంకురా సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్న నాశినీ’ సకల కల్మషములను తొలగించే సర్వశ్రేష్ఠమైన ఓషధి. లెక్కకు మించిన కణుపులు, చిగుళ్లు కలగి దుష్ట తలంపుల ప్రభావమును తొలగించు శక్తిగల పరమాత్మ స్వరూపమైన దూర్వాయుగ్మము. మనలోని మాలిన్యాన్ని తొలగిస్తుంది, అని ‘దూర్వాసూక్తము’ పేర్కొన్నది.*


 *దూర్వాయుగ్మం అంటే గరిక. అందుకే గణపతిని గరికతో అర్చిస్తే సర్వశుభాలను ప్రసాదిస్తాడు. మనోమాలిన్యాలను తొలగిస్తాడు.‘గజ’ శబ్దార్థము వశ - శివ, హింస - సింహ, పశ్యకః - కశ్యపః అని వర్ణ వ్యత్యాసముతో మార్పు కలుగుతుంది.ఇదొక వ్యాకరణ శాస్త్ర ప్రక్రియ. ఆ విధంగా, జగ - గజ అని మారుతుంది. కనుక గజాననుడంటే ‘జగణాననుడు’ అని అర్థం. జగత్తే ముఖంగా గలవాడు. గ: లయము, జ- జన్మ. కనుక గజమనగా సృష్టి స్థితి లయములు గల జగత్తు అని అర్థము. ‘గ’ అంటే జ్ఞానము ‘జ’ అంటే పుట్టినది. గజమంటే జ్ఞానము వలన పుట్టిన మోక్షమని అర్థము.*


 *‘జ్ఞానదేవత కైవల్యము’ కనుక గజముఖము, గజాననుని ముఖ దర్శనము శుభప్రదము, జ్ఞానప్రదము, మోక్షప్రదము. సృష్టికి ముందు ‘ఓం’ అని ధ్వని వినవచ్చింది. అది గజాకారముగా పరిణమించింది. కనుక గజమనగా ఓంకార ధ్వని. ఓంకారము గజ నాదము అనగా హస్తినాదము.‘అశ్వపూర్వాం రథమధ్వాం హస్తినాద ప్రబోధినీమ్’ ఇంద్రియములనే గుర్రములచే పూన్చబడిన దేహము అనే రథము మధ్యలోనున్న చైతన్యమూర్తి. చిచ్ఛక్తి - పరదేవత నిరంతరము హస్తినాదముచే అనగా గజ నాదముచే -ఓంకార నాదముచే మేలుకొలువబడుచున్నది. ఇది ‘గజ’ శబ్దానికి శ్రీసూక్త మంత్రానికి సమన్వయం. అదే వినాయక చవితికి స్ఫూర్తి.‘ఆననము’ అనగా ప్రాణనము అనగా జీవకము అని అర్థము.* 


*గజమంటే జగత్తు కనుక, జగత్తుకే ప్రాణము గజాననుడు. గజాననుడనగా సృష్టి, స్థితి, లయ కారకుడని అర్థం. అందుకే మొదటిగా గజాననుని పూజ విధింపబడింది. సకల ప్రపంచమునకు ప్రాణదేవత - గజాననుడు. ప్రాణనాథుడే గణనాథుడు, నిఖిల ప్రాణి గణనాథుడు - గుణగణములు కలవాడు - గుణగణ నాథుడు.గణపతి - లలితా పరమేశ్వరి ‘శాంతిః స్వస్తిమతీ కాంతిః నందినీ విఘ్ననాశినీ’ అన్నది లలితా సహస్ర నామం. లలితాదేవి విఘ్నములను, అవిద్యను నశింపజేస్తుంది. కనుక ‘విఘ్ననాశినీ’ అని పేరు గల్గింది. మరి గణపతి కదా విఘ్నములను లేకుండా చేసేవాడు? దీనినిబట్టి, లలితాదేవి గణపతి స్వరూపిణి, గణపతి లలితా స్వరూపుడు అని తెలుస్తుంది. లలితా గణపతులకు అభేదం. విష్ణు సహస్ర నామములలో గణపతి: ఏకదంతుడు ఏకదం - అంతా ఒక్కటే. రెండవది లేదు అని ఏకత్వ బుద్ధిని అనుగ్రహించు ఆ ఏకదంతుని ఉపాసించాలి ‘అనేకదం’ - ఉపాసకులకు భక్తులకు అనేకములనిచ్చు,తం- గణేశుని, అనేక దంతం- ప్రళయ కాలంలో అనేకములను హరించు గణపతిని ఉపాసించాలి అని అర్థములున్నాయి. ‘ఏకః నైకః నవః కః కిం’ విష్ణు సహస్ర నామముల భావమే ఏకదః అనేకదః’ అని చెప్పారు.*


*గజాననుని రూపం: ఆధ్యాత్మికత మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకములను అరిషడ్వర్గములను (కామక్రోధములు) నశింపజేసి,చిత్తైకాగ్రత నొసగి, స్వస్వరూప సంధానతతో జీవబ్రహ్మైక్య స్థితిని అనుగ్రహించేవాడు వక్రతుండుడు.*


 *మూలాధార క్షేత్ర స్థితుడు. మూలాధారి. లంబోదరం - బ్రహ్మాండానికి సంకేతం. విఘ్నేశ్వరుని చేతిలోని పాశ అంకుశాలు - రాగద్వేషాలను నియంత్రించే సాధనాలు. గణపతికి ప్రియమైన భక్ష్యం - మోదకం. ఆనందాన్నిచ్చేది. మొదకం ఆయన కృపాకటాక్షములలో ఆనందం లభిస్తుంది. నాగయజ్ఞోపవీతం - కుండలినీ శక్తికి సంకేతం. మానవుడు క్రోధాన్ని విడిచి, అనురాగాన్ని అభివృద్ధి చేసికొని శాంతి సహజీవనంతో, సంపూర్ణ శరణాగతితో భగవంతుని యందు ప్రేమభావనా భక్తిని పెంపొందించుకొని, జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశ్వరుడు.*


*‘యుక్తాహార విహారస్య’ అన్నారు గీతాచార్యుడు. ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబంధించినవి. తమోగుణానికి నిదర్శనము. ‘బ్రతుకుట ఆహారం కోసమే’ అనుకునే తిండిపోతులు తమోగుణాన్ని చంపుకోలేరు.* *అటువంటి వారి గూర్చి ఇతరులు జాలి పడటం, మనసులోనైనా పరిహసించటం సహజం. యోగి అయిన వాడు యుక్తాహార విహారాదులతో, తమోగుణాన్ని జయించి సత్వ గుణ సంపన్నుడై, త్రిగుణాతీతుడై, కుండలినీ యోగసిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది చరితార్థుడు కావాలని తన శరీరాకృతి, నాగయజ్ఞోపవీతంతో తెలియజేసి, హెచ్చరించేవాడు - బొజ్జ గణపయ్య.*


*మూషిక వాహనం: అంతరార్థం మూషికం (ఎలుక) వాసనామయ జంతువు.తినుబండారాల వాసననుబట్టి అది ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మనిషి జన్మాంతర వాసనల వల్ల ఈ ప్రాకృతిక జీవితంలో చిక్కుకొని చెడు మార్గాలు పడతాడు. మూషిక వాహనుడుగా వాసనలను అనగా కోరికలను అణగద్రొక్కేవాడు - వినాయకుడు.అంతేకాదు అహంకారానికి చిహ్నం - ఎలుక (మూషికం) అహంకారం బుద్ధిమంతుల్ని పతనం చెందిస్తుంది.*


*బుద్ధిపతి అయిన మహాగణపతి దీనిని మలిచి జయించి సద్వినియగం చేస్తాడు. మూషిక వాహనుడైన గణపతి సమృద్ధినిస్తాడు.వినాయక చవితి పండుగనాడు ఉదయానే్న మంగళ స్నానములు (తలంటు) ఆచరించి, మట్టి విఘ్నేశ్వరుని పత్రి పుష్పములతో పూజించి, తమ పాఠ్యపుస్తకాలన్నిటినీ వినాయకుని ముందు పెట్టి, శ్రద్ధ్భాక్తులతో అర్చించి, సద్బుద్ధి, విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తారు విద్యార్థులు. లక్ష్మీదేవి మూలాధార నిలయం. గణపతి కూడా మూలాధార నిలయుడు. తొలుతగా లక్ష్మీ పత్రార్చన సర్వకార్య సిద్ధిప్రదము. సకల ఐశ్వర్యప్రదం. కనుకనే తన సంగీత రూపకమునకు ఆదిలో శ్రీగణపతిని ‘శ్రీ గణపతిని సేవింపరారే శ్రీత మానవులారా’ అని ప్రార్థనా రూపమైన మంగళమును పలికాడు నాద ముని శ్రీ త్యాగరాజస్వామి.*


*ముత్తుస్వామి దీక్షితులు


 మహా గణపతి కీర్తనలు వినాయక చవితి రోజున ముఖ్యంగా ముత్తుస్వామి దీక్షితుల వారి ముఖ్యమైన కీర్తన, విశేష ప్రాచుర్యం పొందినది, హంసధ్వని రాగ కీర్తన ‘వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం. వీతరాగిణం, వినుత యోగినం విశ్వకారణం విఘ్నవారణం...’ తప్పక జ్ఞప్తి చేసికొని పాడుకోవాలి. కనీసం చదువుకోవాలి.*


 *గణపతి పూజలో ఇది ఒక భాగం అవ్వాలి. ఆ మహనీయుడు కీర్తనలు అందించాడు. మహాగణపతిం మనసా స్మరామి, వశిష్ఠ వాసుదేవాం నందిత’ నాటరాగ కీర్తన, గజాననము తం గణేశ్వరం భజాను సతతం సురేశ్వరం ఇత్యాదులు వినాయక చవితికి స్ఫూర్తినిచ్చే ఆణిముత్యాలు.*


*‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజము...’ శుక్లమైన అంబరం అంటే పరిశుద్ధ జ్ఞానం. అది అంబరం లాగా సర్వవ్యాపకం. దానినే ఒక వస్త్రంలాగా ధరించాడాయన. దాన్ని మనకు ప్రసాదించాలంటే శశివర్ణుడౌతాడు. శశి అంటే చంద్రుడు.*


*చంద్రుడంటే మనస్సు. మనోభూమికకు దిగి వచ్చి బోధిస్తాడు మనకు ఆచార్యుడు. బోధించే స్థోమత ఎలా వచ్చిందాయనకు. చతుర్భుజం. ధర్మ, జ్ఞాన, వైరాగ్వైశ్వర్యాలనే సిద్ధి చతుష్టయ ముందాయనకు. వాటిని నిత్యమూ అనుభవించే మహనీయుడు కనుకనే ప్రసన్న వదనం. తనకు ప్రసన్నమైన శివశక్తి సామరస్య రూపమైన ఏ జ్ఞానముందో, దాన్ని మనకు ‘వదనం’ అంటే బోధించగలడు. ఆ బోధనందుకుంటే అదే మనకు సర్వవిఘ్నోపశాంతయే. సకల విఘ్నాలను సాధన మార్గంలో కలగకుండా తొలగజేస్తుంది.*


*అహంకారమును దరికి రానీయక, భూతదయ గాలికి, స్వార్థరహితంగా త్యాగబుద్ధితో, అమృతమైన మనస్సుతో సర్వమానవ సౌభ్రాతతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించే వారి విఘ్నాలను నేను తొలగిస్తానని చెప్తున్నాడు మహాగణపతి.*


*గణపతి సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపం.*


*గణం అంటే సమూహం. గణాలతో నిండి వున్న ఈ సమస్త విశ్వానికి అధిపతి గణపతి. అలాగే, అహంకారానికి ప్రతీక అయిన ‘ఎలుక‘ను శాసించి వాహనంగా చేసుకున్న గణపతిని, మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అని 6 రూపాల్లో పూజిస్తారు.*


 *‘గణపతి అథర్వ శీర్షం ’ ఆయన్ని పరబ్రహ్మగా చెపుతుంది. ‘నమస్తే గణపతయే... నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను. హే గణపతీ! ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యాలు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైందో ‘అది‘ నీవే అయి ఉన్నావు. అన్నింటికీ కర్తవు, ధరించే వానివి, లయం చేసుకునే వానివి నీవే. నీవే బ్రహ్మమూ, సత్యానివీ. నీకు నమస్కరిస్తున్నాను. సకల వాక్సంబంధిత శక్తివి, జ్ఞానమూర్తివి, ఆనంద మయునివి నీవే. పరబ్రహ్మం, శాశ్వతమైన వానివి నీవే. ప్రత్యక్ష పరబ్రహ్మవూ నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి’ అంటున్నది ‘గణపతి అథర్వ శీర్షోపనిషత్తు’.*


*మంత్రశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధారచక్ర అధిష్ఠాన దేవత అని అంటారు. మూలాధారంలో సుషుమ్న నాడి మూడుచుట్టలు చుట్టుకొని పైన పడగ కప్పుకొని ఉన్న పాములాగ ఉంటుంది. యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేలు కొల్పగలిగితే, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనే షట్‌ చక్రాల ద్వారా ఆత్మను బ్రహ్మరంధ్రం చేర్చి బ్రహ్మ కపాల విస్ఫోటనంతో ప్రకృతిని దాటి పరమాత్మను చేరే యోగ ప్రక్రియ జరుగుతుంది.*


*సుషుమ్న నాడి పక్కన ఇడ, పింగళ అని రెండు నాడులు అనుసరించుకుంటూ ఉంటాయి. నిరంతరం సుషుమ్న వీటితో కలిసే పయనిస్తుంది. ఇడ అంటే జ్ఞానము, పింగళ అంటే కార్యసిద్ధి అలాగే ఇడ అంటే సిద్ధి, పింగళ అంటే బుద్ధి. మూలాధారం గణపతి, గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలనడంలోని అంతరార్థం ఇదే.* 


*అనగా గణపతి అంటే అష్టచక్ర గణములకు అధిపతి. గణపతి అంటే పదకొండు ఇంద్రియ గణములకు అధిపతి. పంచ తన్మాత్రలు, పంచ భూతాలు, పంచ విషయాలు, అహంకారం, మహాతత్త్వం, ప్రకృతి అనే 18గణములకు అధిపతి గణపతి.*


 *మన శరీరంలో ఉండే హస్తములు,పాదములు, జాను, జంఘ, ఊరు, కటి, ఉదర, హృదయ, కంఠ, ఆశ్య, ఫాల, శిర అను ద్వాదశ అయవయ గణములకు అధిపతి మన గణనాథుడు.*


 *అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించడమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. కార్యసిద్ధి కలిగించి తద్వారా సంతోషాన్ని కలిగించే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. పాపాలు తొలిగితే మంచి బుద్ధి కలుగుతుంది. మంచి బుద్ధి అనగా శాశ్వతమైనదాన్ని పొందాలనుకోవడం. అనగా పరమాత్మను కోరుకోవడం. సంసారం, సిరిసంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ అశాశ్వతం.*కావున గణపతి శాశ్వతమైన వాటి గురించి జ్ఞానాన్ని, అశ్వాశ్వతమైన వాటి మీద వైరాగ్యాన్ని కలిగించి భక్తిని కలిగిస్తాడు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము అనగా సుషుమ్న, ఇడ, పింగళ. అంటే సుషుమ్న నాడి గణపతి ఇడ నాడి సిద్ధి, పింగళ నాడి బుద్ధి. ఇది గణపతి తత్త్వం     

 సమర్పణ  

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ