6, ఆగస్టు 2020, గురువారం

భక్తి భావాన్ని పెంచే గంటానాదం

*మన ఇంటికి సమీపంలో ఉన్న దేవాలయం నుంచి గంటానాదం మనకు ఎప్పుడూ వినిపిస్తూవుంటుంది. ఈ శబ్దం వినేవారికి భక్తి భావాన్ని పెంచుతుంది. నేటికి కొన్ని గ్రామాల్లో ఎడ్లు, ఆవులు మెడలో గంటలు కడతారు. ఈ గంటల చప్పుడు ఎంతో రమనీయముగా ఉండి మన సంప్రదాయ భావాలను గుర్తు చేస్తూ ఉంటుంది. దేవాలయాల నుండి వెలువడే వివిధ స్థాయిల్లో ఉండే గంటల శబ్దం " ఓం కారాన్ని"  స్ఫురింపజేస్తుంది అని పరిశోధకులు వెల్లడించారు. గంట శబ్ద తరంగ రూపంలో వ్యక్తమై క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అది నాదమై "ఓం కారాన్ని" వినిపిస్తూ మనసును ఎంతగానో ప్రేరేపిస్తుంది. శంఖారావంతో కూడిన గంటానాదం భక్తుల మదిలో భక్తి భావాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ నాదం ఏకాగ్ర శక్తిని పెంచుతుంది.*

*సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....

పోత‌న త‌ల‌పులో....(11)

మాన‌వ జ‌న్మ ప‌ర‌మార్థాన్ని,
 స‌క‌ల జీవుల ప‌ట్ల క‌రుణ‌ను
ప్ర‌బోధించిన విశ్వ‌మాన‌వుడు పోత‌న‌.

                  ***
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
                    ***

చేతులు జోడించి మ‌నస్ఫూర్తిగా శివుని(భ‌గ‌వంతుని) పూజింప‌ని వాడు, నోరారా శ్రీ‌హ‌రి గుణ‌వైభ‌వాల‌ను కీర్తిస్తూ గాన‌ము చేయ‌నివాడు, స‌ర్వ‌ప్రాణుల ప‌ట్ల క‌రుణ ,ద‌య లేనివాడు, స‌త్యవ‌ర్త‌న‌ము ఆచ‌రించ‌నివాడు జ‌న్మించి ప్ర‌యోజ‌న‌మేమిటి? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌తోనే ప‌ర‌మ ప‌థాన్ని చూపిన మ‌హ‌నీయుడు పోత‌న‌.

🏵️*పోత‌న ప‌ద్యాలు -
సర్వస్యశరణాగతికి మౌన ప్రబోధాలు

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తుట:

ఒకనాడు నందుడు  ఉపనందుడు మొదలైన ఇతర పెద్దలనందరినీ కూర్చోబెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణభగవానుడు ఈవిషయమును తెలుసుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చినట్లు ఇంద్రుడికి అహంకారం వచ్చింది. ‘నా అంతటి వాడిని నేను – పరబ్రహ్మమేమిటి – నాకు అధికారం ఇవ్వడం ఏమిటి – నేనే వర్షము కురిపించడానికి అధికారిని’ అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. పరమాత్మ ఇంద్రునికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు.
పెద్దలందరూ కూర్చుని సమాలోచనలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ‘నాన్నగారూ ! పెద్దలయిన వారికి అరమరికలు ఉండవు కదా! వాళ్ళు ఏదయినా మంచి విషయమయినపుడు అది పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా, వారి సలహాను వింటారు కదా! అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు చెప్పవచ్చని మీరు అనుకుంటే మీరు దేనిగురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా?’ అని అడిగాడు. నందుడు ‘అయ్యో నాన్నా ! నీకు తప్పకుండా చెప్తాను. అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏముంది. రా వచ్చి కూర్చో’ అని ఇలా చెప్పాడు.
‘మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడిన దేవేంద్రుడు ప్రీతిచెంది వర్షమును కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే ఆ గడ్డిని మన పశువులు తింటాయి. బాగా గడ్డి తిని ఎక్కువ పాలను ఇస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. దీనికంతటికీ మూలం ఇంద్రునికి యజ్ఞం చెయ్యడంలో ఉన్నది. ఆ యజ్ఞం చేత ప్రీతిచెంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. మేము ఇంద్రునికి   ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దామని అనుకుంటున్నాము’ అన్నాడు.
కృష్ణుడు ఇంద్రునికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. అందుకోసమే ఆ సమయంలో తండ్రి వద్దకు వచ్చాడు. కృష్ణుడు తండ్రిని మాయచేసి మాట్లాడుతు – నాన్నగారూ! నేను ఇలా చెప్పానని అనుకోవద్దు. ఎవరయినా సరే, వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవడు చేసినకర్మ వలన వానికి గౌరవము గాని, సమాజములో ఒక సమున్నతమయిన స్థితి కాని, జన్మ కాని కలుగుతున్నది.  అటువంటప్పుడు ఎవరి గొప్పతనమునకు, పతనమునకు గాని వారు చేసిన కర్మే ఆధారము. ఆ కర్మే ఫలితమును ఇస్తున్నది. మనం చేసిన కర్మవలననే మనం ఐశ్వర్యమును పొందగాలిగాము. పశుసంపద మన ఐశ్వర్యం.   పశువులను పోషించుకోవడానికి గోవర్ధన గిరి గడ్డిని ఇస్తోంది. ఈ కొండమీద మన పశువులు మేస్తున్నాయి. కంటికి కనపడి ప్రతిరోజూ గడ్డి ఇస్తున్నది గోవర్ధన గిరి.  కంటికి కనపడని ఇంద్రునికి యజ్ఞం చేస్తానంటున్నారు. యజ్ఞమును కంటికి కనపడే గోవర్ధన గిరికి చేయాలి. ఇంద్రయాగం వద్దు గోవర్ధనగిరికి యాగం చేద్దాము’ అన్నాడు.
కృష్ణుని మాటలకు నందుడు ఆశ్చర్యపోయి ‘నీవు చెప్తున్నది నిజమే. ఏదయినా యాగం చేస్తే దానికి ఋషి ప్రోక్తమైన ఒక కల్పము ఉంటుంది. నీవు గోవర్ధన గిరి యాగం అంటున్నావు. దానికి పూజ ఎలా చేయాలో నీకు తెలుసా?” అని అడిగాడు. కృష్ణుడు దానికి ‘ఇంద్రయాగమునకు ఏమేమి సరుకులు తెచ్చేవారో ఆ సరుకులనే తీసుకువచ్చి పూర్వం ఏ పదార్థములను వండించారో వాటిని ఈ యాగమునకు కూడా వండించండి. కానీ పూర్వం వీటినన్నిటిని పట్టుకువెళ్ళి ‘ఓం ఇంద్రాయ స్వాహా’ అని అగ్నిహోత్రంలో వేసేవారు. నేను చెప్పిన యాగంలో ఇవన్నీ తీసుకువచ్చి ముందు బ్రాహ్మణులను కూర్చోపెట్టి ముందుగా వారికీ మధురపదార్థములను పెడతే వారు తింటారు. మిగిలిన పదార్ధం బ్రాహ్మణోచ్ఛిష్టము అవుతుంది. అది మనలను రక్షిస్తుంది. ఆ మిగిలిన పదార్ధమును మనందరం అరమరికలు లేకుండా తినేస్తాము. ఆ తరువాత కుక్కలు మొదలయిన వాటిని పిలిచి వాటన్నిటికి కూడా పెడతాము. ఆ తరువాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి, జనపకట్టలు ఇవన్నీ పెడతాము అవి వాటిని తింటాయి. అవి తిన్న తరువాత వండిన పదార్ధమును కొన్ని కడవల తోటి పక్కన పెడతాము. పిల్ల పిచ్చుక, మేక కుక్క గోపకాంతలు, గోపాలురు, నేను మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధన గిరికి ప్రదక్షిణం చేద్దాము’ అన్నాడు.  నందాదులు ఇదేదో చాలా బాగుంది అయితే అలా చేద్దాము అన్నారు. అనుకున్నట్లే చేసి గిరికి ప్రదక్షిణం చేయడానికి కిందికి వచ్చి గోవర్ధన గిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు. వెనకాతల పెద్దపెద్ద ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. కృష్ణుడు గోపాలబాలురిలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తు    గోవర్ధన గిరిమీద ఉన్న గోవర్ధనుడిగా కనపడుతున్నాడు.
ఈ చప్పుళ్ళు ఇంద్రునికి వినపడ్డాయి. బృందావనంలో ఏమి జరుగుతున్నదని సేవకులను ప్రశ్నించాడు. భటులు ‘ మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెపుతాము. ప్రతి ఏడాది గోపాలురు వానలు పడాలని మీకు పెద్ద యాగం చేస్తూ ఉంటారు. ఈ ఏడాదినుంచి వాళ్ళు ఈవ్రతమును మార్చేశారు. మీకు చెయ్యడంలేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. వాళ్ళకి ఆ గోవర్ధన గిరియే పశువులు తినడానికి గడ్డి ఇస్తోందని వారు గోవర్ధన గిరికే యాగం చేస్తున్నారు’ అని చెప్పారు. వారి మాటలు వినేసరికి ఇంద్రునికి ఎక్కడలేని కోపం వచ్చింది. ‘నాకు యాగం చేయవద్దని చెప్పిన వాడెవడు? గోపాలబాలురు పెరుగు నెయ్యి, త్రాగి వీళ్ళకి కొవ్వు పట్టింది. నేను ఒకనాడు పర్వతములకు ఉండే రెక్కలను నా వజ్రాయుధంతో తెగనరికాను. వజ్రాయుధమును ఆయుధముగా కలిగిన వాడిని. నన్ను పురందరుడని పిలుస్తారు. కృష్ణుడు చెప్పడం వాళ్ళు వినడం ఆయన ఏమయినా ఋషియా లేక దేవుడా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి’ అని మేఘమండలము నంతటినీ పిలిచి వీళ్ళు వర్షం కురియడం వలన వచ్చిన ఐశ్వర్యమదముతో నన్ను మరచిపోయారు. మీరు వెంటనే వెళ్ళి బృందావనం అంతా చీకటయిపోయేటట్లుగా కమ్మేసి పిడుగులు కురిపించండి, మెరుపులు మెరిపించండి. ఆ దెబ్బలకు గోవులు చచ్చిపోవాలి. జనులు చచ్చిపోవాలి. భూమికి, ఆకాశమునకు తేడా తెలియకూడదు. అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండములంత లావు ధారలు పడిపోవాలి. భూమి అంతా జలంతో నిండిపోవాలి. ప్రాణులన్నీ అందులో కొట్టుకు పోవాలి. నేను వజ్రాయుధమును పట్టుకుని ఐరావతమును ఎక్కి వెనకాతల వస్తాను మీరు వెళ్ళండి’ అన్నాడు.
  గోపకులు గిరిప్రదక్షిణం పూర్తిచేసుకొని వచ్చారు. ఆవులు దూడలు ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈలోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపోయింది. ఇంతకుముందు ఎన్నడూ వినని రీతిలో పిడుగులు పడిపోతున్నాయి. ఆకాశం అంతా మెరుపులు. ఆ మెరుపులలో వచ్చే కాంతిని అక్కడి గోవులు, ఎద్దులు దూడలు తట్టుకోలేక పోతున్నాయి. అవి ఎక్కడివక్కడ కూలబడిపోయాయి.   గోపకులు కృష్ణా! నీవు రక్షించాలి, మిగిలిన ప్రాణులన్నీ మరణించక ముందే కాపాడు’ అన్నారు. పరమాత్మ ఒక్క క్షణం ఆలోచించలేదు. కృష్ణుడు అక్కడున్న గోవర్ధన పర్వతమును అవలీలగా పైకి ఎత్తి తన చిటికిన వేలు మీద పట్టుకున్నాడు. చిరునవ్వు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టినట్లు ఆ మహా శైలమును పట్టుకున్నాడు. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపకులు, గోపాలబాలురు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకు వచ్చేశారు. కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆ గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దానికింద నిలబడ్డారు. ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడే గొడుగుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చిటికిన వేలు కర్ర. ఆయన భుజ మూపురమే దానికి ఉన్న వంపు తిరిగిన మూపు. దానికి అన్నివైపుల నుండి జాలువారుతున్న నీటి ధారలు ముత్యములతో కట్టిన అలంకారములు. దానికింద నిలబడి ‘మమ్మల్ని ఇంద్రుడు ఏమి చేస్తాడ’ని నవ్వుతున్న గోపకాంతల నోళ్లలోంచి వస్తున్న కాంతులు అక్కడ పట్టిన రత్నదీపములు, రత్న నీరాజనములు. ఆయన వారిని ఏడురాత్రులు ఏడు పగళ్ళు ఏడేళ్ళ వయసులో తన చూపులతో పోషించాడు.
కృష్ణుడు గోవర్ధన పర్వతమును పట్టుకుని అలా నిలబడితే కొంతమంది పర్వతము క్రిందకు రావడానికి భయపడ్డారు. కృష్ణుడు -
బాలుం డీతఁడు, కొండ దొడ్డది, మహాభారంబు సైరింపగా
జాలండో? యని దీని క్రింద నిలువన్ శంకింపగాఁ బోల; దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పై బడ్డ నా
కేలల్లాడదు; బంధులార! నిలుఁ డీ క్రిందం బ్రమోదంబునన్.
‘వీడు చిన్నపిల్లాడు పెద్ద గోవర్ధన గిరిని పట్టుకున్నాడు. ఏమో తొందరపడి క్రిందకు వెళితే పిల్లవాడు కొండను వదిలేస్తే ప్రమాదం వస్తుందేమోనని బయట నిలబడతారేమో! నన్ను నమ్మండి. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధన గిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. నేను మీకు రక్ష చెప్తున్నాను. వచ్చి ఈ కొండ క్రింద చేరండి మిమ్మల్ని నేను రక్షిస్తాను’ అన్నాడు. అందరూ వచ్చి కొండ క్రింద చేరారు. అలా ఏడురోజులు మీనాక్షీతత్త్వంతో పోషించాడు.
  ఇంద్రుడు చూశాడు. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నాడు. వర్షమును, ఉరుములను, పిడుగులను ఆపించి వేశాడు వర్షం ఆగిపోయింది. ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇంత చిన్న పిల్లాడేమిటి, గోవర్ధన గిరి ఎత్తడమేమిటి? దానిని ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు పట్టుకుని ఉండడం ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దానిక్రింద చేరడమేమిటి? ఇది నిజమా? లేకపోతే ఆ పిల్లాడిరూపంలో పరబ్రహ్మము ఉన్నాడా? అని అనుమానించాడు. తన పదవి ఎగిరిపోతుందని భయపడ్డాడు. గోవర్ధన గిరి వద్దకు వచ్చి చూసేసరికి ఒక్కసారికి మహానుభావుడయిన పరమాత్మ దర్శనం ఇచ్చాడు. ‘నన్ను కన్న తండ్రీ! పరబ్రహ్మమా పొరపాటు అయిపోయింది. మహానుభావా! అహంకారమునకు పోయాను. నా అహంకారమును తీసివేయడానికి గోవర్ధనోద్ధరణము చేసావని గుర్తించలేకపోయాను. ఈశ్వరా! క్షమించు’ అన్నాడు. కృష్ణ పరమాత్మ ‘సరే, నీ తప్పును నీవు అంగీకరించావు కాబట్టి నీవు ఇంద్రపదవిలోనే ఉండు. నీపైన ఉన్నవాడు, నీయందు అంతర్యామిగా ఉన్నవాడు నీకు అధికారం ఇస్తే నీవు వర్షం కురిపించావు. తప్ప నీ అంత నీకుగా ఈ అధికారం లేదు. నేను ఇచ్చాను కాబట్టి నీవు దానిని పొందగలిగావని గుర్తుపెట్టుకో’ అన్నాడు. ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కామధేనువు స్వర్గలోకం నుండి పరుగుపరుగున వచ్చి ఈశ్వరా! నోరున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడయినా దాక్కుంటారు. మా ఆవులు, ఎద్దులు దూడలు నోరులేని జీవములు. వాటిని బయట కట్టేస్తారు. నీవు జగద్భర్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, మా కష్టం నీకు తెలుసు. ఈవేళ గోవులను కాపాడావు. కాబట్టి నిన్ను ‘గోవిందా’ అని పిలుస్తూ ‘నీకు నమస్కారం చేస్తున్నాను’ అన్నది.
ఐరావతం పరుగుపరుగున వెళ్ళి ఆకాశగంగలో ఉన్న నీళ్ళను బంగారు కలశములలో తెచ్చి అభిషేకం చేసింది. కామధేనువు ఇచ్చిన అవుపాలతో దేవేంద్రుడు స్వహస్తములతో కలశములతో కృష్ణుడికి అభిషేకం చేశాడు. దేవతలు నాట్యం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. పుష్పవృష్టి కురిసింది. భగవానుడు గోవిందుడు అయ్యాడు. ఎవరయినా ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు మాత్రమే బ్రతుకుతారు. అందుకని బ్రతికి ఉన్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవింద నామమును ఆశ్రయించి తీరాలి. ఈ  గోవిందనామము ఎంత గొప్పతనమును వహించినది అంటే ఇప్పటికీ వేంకటాచలంలో శేషాద్రి శిఖరం మీద వెలసిన స్వామి గోవిందనామంతో  పరవశించి, పద్మావతీ దేవిని వక్షఃస్థలంలో పెట్టుకొని కారుణ్య మూర్తియై పద్మపీఠం మీద నిలబడి మనకి దర్శన ఇస్తున్నాడు.
*****************

భక్తునికి మహర్షికి జరిగిన సంభాషణ

ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. కానీ మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.._

_*⚜️ స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? ఎలా ఉంటాడు ? అని అడిగాడు.*_

_💫 అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి అది ఏమిటి నాయన అన్నాడు._

_⚜️ *అది వృక్షం.*_

_💫 ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?_

_*⚜️ విత్తనం ద్వారా వచ్చింది స్వామి.*_

_💫 సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు._

_⚜️ *ఎందుకు స్వామి ? మహావృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.*_

_💫 చచ్చిపోతుంది కాని ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !_

_⚜️ *అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?*_

_💫 విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు. విత్తనం చూడలేమా ?_

_*⚜️ విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా !*_

_💫 ఇదే నాయన నీ సందేహానికి సమాధానం._

_⚜️ *అదెలా స్వామి ?*_

_💫 విత్తనం అనేది పరమాత్మ ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము._

_*⚜️ మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?*_

_💫 పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? ఏమి అర్థం కాదు. అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనిగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు._

_💫 సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు తప్ప విగ్రహమే దైవం కాదు. అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !_

_*⚜️ స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?*_

_💫 భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడు కోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడా లేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.. నగలు పెట్టినవాడిలో ఉన్నాడు. దోచుకెళ్ళినవాడిలోనూ ఉన్నాడు. తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు !_
               *శ్రీశర్మద సేకరణ*
*******************

హనుమంతుడు -- సూర్యుడి

హనుమంతుడు సూర్యుడి దగ్గర విద్యను నేర్చుకోవాలనుకున్నాడు. వెంటనే వెళ్లి సూర్యనారాయణుడికి నమస్కరించి విద్యలు నేర్పమని వినయంగా అడిగాడు. అందుకాయన ‘‘నేను ఒకచోట కూర్చుని పాఠం చెప్పలేనని’’ చెప్పాడు. ఎందుకంటే ఒకేచోట కూర్చునుంటే లోకానికి ఇబ్బంది. ఉదయాన్నే బయల్దేరతాడు. అదేవేగంతో వెళ్ళిపోతుంటాడు. వెళ్లిపోవడమంటే ఏ విజయవాడో వెళ్ళి రావడం కాదు. బ్రహ్మాండాలన్నీ చుట్టివస్తాడు. అంతవేగంతో వెడుతున్నవాడు చెబుతున్న మాటలు వినడం కష్టం. పైగా ఎప్పుడూ ఒకేలా ఉండడు. ఉదయం బయల్దేరినప్పుడు దగ్గరగా వెళ్ళి వినవచ్చు. మధ్యాహ్న సాయంకాలాలు అలా కుదరదు. మార్తాండుడై ఉంటాడు. భరించడం కష్టం.సాధారణంగా ఎదురుగా కూర్చుని ముఖం కనబడేటట్లుగా ఉండి చెపుతుంటే మాటలను పట్టుకోవడం తేలిక. కానీ ఇక్కడలా కుదరదు. అలాగని గురువుగారి పక్కన పరుగెడుతూ నేర్చుకుందామా అంటే... రెండు చెవులతో స్పష్టంగా వినడం కుదరదు. గురువుగారికి పృష్ఠభాగం చూపకూడదనే నియమం వల్ల ముందుండడానికి వీల్లేదు. ఇక ఏమిటి మార్గం– గురువుగారి ఎదురుగా నిలబడి, వెనకకు పరుగెడుతూ అదీ సూర్యుడితో సమానంగా, ఒక్క మాట విడిచిపెట్టకుండా నాలుగు వేదాలు, 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. ఇదీ హనుమ వైభవం. అలా నేర్చుకోగలగాలంటే ఆయనకు ఎంత శ్రద్ధ, భక్తి ఉన్నాయో ఆలోచించండి.

లోకంలో ఎన్నో అవతారాలున్నాయి. హనుమ అవతారం మాత్రమే అంత వైశిష్ట్యం పొందడానికి కారణం – అంత శ్రమకోర్చి గురువుగారి దగ్గర పాఠం నేర్చుకోవడమే. హనుమ జీవితం ఒకసారి గమనించండి. ఆయన పుట్టీపుట్టగానే సూర్యుడిని చూసి పండనుకొని ఆకాశానికెగిరిపోయాడు. ఇంద్రుడు వజ్రాయుధం పెట్టికొడితే ఎడమ దవడ విరిగి అక్కడినుంచి కిందపడ్డాడు. ఆ తరువాత దేవతలందరూ వచ్చి ఎన్నో శక్తులు ధారపోశారు. అన్ని శక్తులు పొందిన హనుమ తన జీవితంలో ఓ గంట విశ్రాంతి తీసుకున్నట్లు మీరెప్పుడయినా విన్నారా! లోకంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయడానికి సాహసించని కార్యాలను ఆయనొక్కడే సంకల్పించాడు. నూరుయోజనాల సముద్రాన్ని ఎవరు దాటగలరు? అటువంటిది దాటడమే కాకుండా తానొక్కడే రామభక్తుడిగా ఉండి చుట్టూ రాక్షసులున్నా నిర్భయంగా రావణాసురుడితో మాట్లాడి అంతే వేగంతో తిరిగి వస్తాడు. అంతటి బలవంతుడు, శక్తిమంతుడు, అంతటి పండితుడు, వ్యాకరణవేత్త, తనగురించి చేసుకున్న పని ఒక్కదాన్ని చూపగలరా! ఎన్ని గ్రంథాలు వెతికినా ఒక్కటీ కనిపించదు. కార్యదీక్షాపరుడు అలా ఉండాలి.

సేకరణ:-

*పూర్వ జన్మ కర్మ.....*

ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది. వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని తన భార్య గర్భవతి అని చెప్పాడు.

గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు? అని అడిగాడు గురువు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు. సరే...నీ భార్యను అడిగి రా...తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్లి నీ భార్యను అడిగిరా, పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? అని అడిగాడు. అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.

మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, అంటూ ఒప్పు కుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రసవించింది.

మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు. భార్య భర్తలు గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు.

తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, చేసేది. ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. ఈ విధంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు.

మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. ఇదేం గురువయ్యా ? నాకు నచ్చలేదు. నా కొడుకును ఇవ్వనుకాక ఇవ్వను అంటూ మొండి కేసింది. అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా... అన్నాడు. అమ్మ నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను. కాని ఒక్క సారి బిడ్డను నా చేతి కిచ్చి నా వెంట రండి. మీ బిడ్డను నేనేమి చేయను.తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు.

సరే ననీ బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిరువురు.

గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకుని వెళ్ళాడు. ఆ రెండు గొయ్యిల మధ్య తెల్లని గుడ్డ పరిచి...ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొని మంత్రించి...ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి...

ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు. ఒరేయ్ వీళ్ళకు కొడుకుగా పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు.

రెండో వాడు ఇలా చెబుతున్నాడు. గత జన్మలో వీడు బాకి పడ్డాడు. నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరీ నువ్వు ఎందుకొచ్చావు అని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా...నేను కూడా అందుకే వచ్చాను.

వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను . కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేసాడు.

ఇంకే ముంది? వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నంపెట్టి ఆదరించాడు.

నేను పోయే వరకు నన్ను పోషించాడు.

అందుకే...ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లితండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంతకాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాత పెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు. కాబట్టీ గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్ధం.

ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణానుబంధాలే కాదు, జన్మ రాహిత్యమే కలుగుతుంది.ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది...

మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు కాని అది కాదు.మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు.. ఎక్కడ ఉన్నాడు...ఏం చేస్తున్నాడు.ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైంది, నేనెవరిని,ఎక్కడ నుండి వచ్చాను,మళ్లీ ఎక్కడికి వెళతాను. అసలు మాయ అంటే ఏమిటి??? ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి.ఇదే మోక్షం.మరుజన్మకి రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చు కుంటాడు.

ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు.
*********************

*నామరామాయణం*

శ్రీ నామ రామాయణంగా ప్రసిద్ధమైన ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంది.

బాల కాండము🌷

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ

కాలాత్మక పరమేశ్వర రామ

శేషతల్ప సుఖ నిద్రిత రామ

బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ

చండకిరణకుల మండన రామ

శ్రీ మద్దశరథ నందన రామ

కౌసల్యా సుఖవర్ధన రామ

విశ్వామిత్ర ప్రియ ధన రామ

ఘోర తాటకా ఘాతక రామ

మారీచాది నిపాతక రామ

కౌశిక మఖ సంరక్షక రామ

శ్రీమదహల్యోద్ధారక రామ

గౌతమముని సంపూజిత రామ

సుర మునివర గణ సంస్తుత రామ

నావిక ధావిత మృదు పద రామ

మిథిలా పురజన మోహక రామ

విదేహ మానస రంజక రామ

త్ర్యమ్బక కార్ముక భంజక రామ

సీతార్పిత వర మాలిక రామ

కృత వైవాహిక కౌతుక రామ

భార్గవ దర్ప వినాశక రామ

శ్రీమదయోధ్యా పాలక రామ

రామ రామ జయ రాజా రామ

రామ రామ జయ సీతారామ

అయోధ్య కాండము

అగణిత గుణగణ భాషిత రామ

అవనీ తనయా కామిత రామ

రాకా చంద్ర సమానన రామ

పితృ వాక్యాశ్రిత కానన రామ

ప్రియ గుహ వినివేదిత పద రామ

తత్ క్షాలిత నిజ మృదుపద రామ

భరద్వాజ ముఖానందక రామ

చిత్ర కూటాద్రి నికేతన రామ

దశరథ సంతత చింతిత రామ

కైకేయీ తనయార్థిత రామ

విరచిత నిజ పితృ కర్మక రామ

భరతార్పిత నిజ పాదుక రామ

రామ రామ జయ రాజా రామ

రామ రామ జయ సీతా రామ

అరణ్య కాండము
దండకావనజన పావన రామ

దుష్ట విరాధ వినాశన రామ

శరభంగ సుతీక్షార్చిత రామ

అగస్త్యానుగ్రహ వర్ధిత రామ

గృధ్రాధిప సంసేవిత రామ

పంచవటీ తట సుస్థిత రామ

శూర్పణఖార్తి విధాయక రామ

ఖర దూషణ ముఖ సూదక రామ

సీతా ప్రియ హరిణానుగ రామ

మారీచార్తి కృదాశుగ రామ

వినష్ట సీతాన్వేషక రామ

గృధ్రాధిప గతి దాయక రామ

శబరీ దత్త ఫలాశన రామ

కబంధ బాహుచ్ఛేదన రామ

రామ రామ జయ రాజా రామ

రామ రామ జయ సీతా రామ

కిష్కింధా కాండము
హనుమత్సేవిత నిజపద రామ

నత సుగ్రీవాభీష్టద రామ

గర్విత వాలి సంహారక రామ

వానరదూత ప్రేషక రామ

హితకర లక్ష్మణ సంయుత రామ

సుందరా కాండము
కపివర సంతత సంస్మృత రామ

తద్గతి విధ్వ ధ్వంసక రామ

సీతా ప్రాణాధారక రామ

దుష్ట దశానన దూషిత రామ

శిష్ట హనూమద్భూషిత రామ

సీతా వేదిత కాకావన రామ

కృత చూడామణి దర్శన రామ

కపివర వచనాశ్వాసిత రామ

రామ రామ జయ రాజా రామ

రామ రామ జయ సీతా రామ

యుద్ధ కాండము

రావణ నిధన ప్రస్థిత రామ

వానరసైన్య సమావృత రామ

శోషిత సరిదీశార్థిత రామ

విభీషణాభయ దాయక రామ

పర్వతసేతు నిబంధక రామ

కుంభకర్ణ శిరచ్ఛేదక రామ

రాక్షససంఘ విమర్దక రామ

అహి మహి రావణ చారణ రామ

సంహృత దశముఖ రావణ రామ

విధి భవ ముఖ సుర సంస్తుత రామ

ఖస్థిత దశరథ వీక్షిత రామ

సీతాదర్శన మోదిత రామ

అభిషిక్త విభీషణ నత రామ

పుష్పక యానారోహణ రామ

భరద్వాజాభినిషేవణ రామ

భరత ప్రాణ ప్రియకర రామ

సాకేత పురీ భూషణ రామ

సకల స్వీయ సమానత రామ

రత్నలసత్పీఠాస్థిత రామ

పట్టాభిషేకాలంకృత రామ

పార్థివకుల సమ్మానిత రామ

విభీషణార్పిత రంగక రామ

కీశకులానుగ్రహకర రామ

సకలజీవ సంరక్షక రామ

సమస్త లోకాధారక రామ

ఉత్తరా కాండము🌷

ఆగత మునిగణ సంస్తుత రామ

విశ్రుత దశకంఠోద్భవ రామ

సీతాలింగన నిర్వృత రామ

నీతి సురక్షిత జనపద రామ

విపిన త్యాజిత జనకజ రామ

కారిత లవణాసురవద రామ

స్వర్గత శంభుక సంస్తుత రామ

స్వతనయ కుశలవ నందిత రామ

అశ్వమేధ క్రతు దీక్షిత రామ

కాలావేదిత సురపద రామ

అయోధ్యక జన ముక్తిద రామ

విధిముఖ విభుధానందక రామ

తేజోమయ నిజరూపక రామ

సంసృతి బంధ విమోచక రామ

ధర్మస్థాపన తత్పర రామ

భక్తిపరాయణ ముక్తిద రామ

సర్వచరాచర పాలక రామ

సర్వభయామయ వారక రామ

వైకుంఠాలయ సంస్థిత రామ

నిత్యానంద పదస్థిత రామ

రామ రామ జయ రాజా రామ

రామ రామ జయ సీతా రాం

********************

వివాహములు 8 విధములు :-


1.బ్రాహ్మము:-వేదాధ్యయనం చేసిన ఆచిరవంతుడైన ఒక బ్రహ్మచారి కి తనంతట తానుగా రప్పించి అతనికి అలంక్రుతమైన తన కన్యను ఇచ్చుటయే బ్రహ్మ వివాహము.
2.దైవ వివాహము :-ఋత్విజునికి, కన్య నిచ్చి వివాహము చేయుట.
3.ఆర్ష వివాహము :-ఒక గోవుల జంటను, రెండు ఎద్దులను వరుని నుండి తీసుకుని కన్య నిచ్చుట ఆర్షవివాహమనబడును.
4.ప్రాజాపత్యము:-తల్లిదండ్రులు వరుని పూజిఓచి తన కుమార్తె ను అప్పగించి, మీరిద్దరూ ధర్మాన్ని ఆచరించండి అని చేసే వివాహం. 5.అసుర వివాహము :- పిల్ల తల్లిదండ్రులు కు, పిల్ల కు ధనాన్ని ఇచ్చి చేసుకొనే వివాహము
6.గాంధర్వవివాహము:-వధూవరులు,పెద్దల అనుమతి లేకుండా ఒకరినొకరు ఇష్టపడి చేసుకునే వివాహము గాంధర్వం (దీనిలో ఆకర్షణ ప్రధానము, కావున ఈ వివాహము నకు మనువు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు జరిగే Love marriages పై కోవలోనివే)
7.రాక్చసవివాహము:-ఒక స్త్రీ ని బలవంతంగా ఎత్తుకొని వచ్చి, అడ్డగించిన బంధుమిత్రులు ను నాశనం చేసి చేసుకునే వివాహము రాక్షస వివాహము.
8.పైశాచిక వివాహము :-ఈ వివాహము మిక్కిలి నీచమైన ది.
  ఈ అష్టవిధ వివాహము ల్లో మొదట నాలుగు ఉత్తమమైనవి గానూ, చివరి నాలుగు అంత ప్రాధాన్యం లేనివిగానూ చెప్ప వచ్చును... సేకరణ
స్త్రీ గురించి :-
1.ఎక్కడ స్త్రీ లు పూజింపబడుదురో అక్కడ దేవతలు నివసిస్తారు.
2.ఏ కులంలో ఆడబడచులు, కోడళ్ళు, భార్యలు, బంధువులు అగు స్త్రీ లు గౌరవించబడతారో ఆ కులం అభివృద్ధి చెందుతుంది.
3.తోబుట్టువులకు వివాహాది శుభ కార్యాలలో, పండుగలలో వస్త్ర భూషణములు ఇవ్వాలి.
4.ఆడబడుచు ఆనందం పుట్టింటికి సౌఖ్యము.

************************

పంచ హత్యా పాతకములు


1.చేట
2.సన్నికల్లు రోలు
3.రోలు,రోకలి
4.ఇంటిలో సామానులు శుద్ధి చేసి అలుకుట
5.నీళ్ళ కడవ
(వీటిని ఉపయోగించుట లో తెలిసీ, తెలియక, కొన్ని జీవుల మరణము నకు పరోక్షంగా, గ్రుహస్తుడు పంచ హత్య పాతకుడు అగుచున్నాడు. వీటి దోష నివారణకు క్రింది పనులు చేయాలి.)
1.బ్రహ్మ యఙ్ఞములు :-వేదములు చెప్పుట, తాను చదువుట బ్రహ్మ యఙ్ఞము.
2.పిత్ర యఙ్ఞము :-పితరులకు తర్పణము చే త్రుప్తి ని కల్గించుట.
3.దైవ యఙ్ఞము:-అగ్నియందు వ్రేల్చు యఙ్ఞము.
4.భూత యఙ్ఞము :-వైశ్యదేవము, భూతబలి.
5.మనుష్య యఙ్ఞము :-ఇంటికొచ్చిన అతిధిని పూజిఓచి, సత్కరించి, తనకున్న దానిలో భోజనం పెట్టుట.

పంచ యఙ్ఞములు :-
1.ఆహుతము:-భగవన్నామ జపము.
2.హుతము:-అగ్నిహోత్రమందు చేయబడు హోమము.
3.హ్రుతము:-భూతముల కొసగబడు బలి.
4.బ్రహ్మ హుతము:-బ్రాహ్మాణోత్తముని పూజ
5.ప్రాశితము:-పిత్రుతర్పణము
సేకరణ

మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి??



ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు బంధాలు బాధలు ఉంటాయి...
ఎలా అంటే ఒక దీపం వెలిగేటప్పుడు దానికి చమురు (నెయ్యి లేదా నూనె) కావాలి,
ఎక్కువ గాలి ఉండకూడదు, అలా అని అస్సలు గాలి లేకుండా కూడా ఉండకూడదు.. ప్రతిదీ దానికి ప్రాణ సంకటమే ...
అదే ఇక సారి దీపం ఆరిపోతే ఇక దానికి గాలితో కానీ చమురుతో కానీ దేనితో పని లేదు..
అక్కడితో దాని కధ ముగిసింది అని అర్థం ...

అలాగే ఒక వ్యకి జీవించి ఉన్నంత వరకు ప్రతిదీ కావాలి , ప్రతీది అవసరమే ...
ఒక సారి జీవం పోగానే ఈ ప్రాపంచిక విషయాలు బంధాలు అవసరం లేదు,

వారు చేసిన పుణ్యం తప్ప ఏది కూడా ఉండదు,
ఎవరు వెంట కూడా వెళ్ళలేరు,
అక్కడితో ఆ వ్యక్తి కధ ముగిసినట్టే,...

*దీనిని పట్టి మనకు అర్థం ఏమవుతుందంటే ... ఈరోజు మనం పెంచుకున్న బంధాలు, ప్రేమలు, కోపాలు , తాపాలు, అన్ని అశాశ్వతమైనవే, కేవలం మనము చేసిన సేవనే మన వెంట వస్తుంది అని అర్థమవుతుంది, కాబట్టి నిత్యం మనం , పుణ్యకార్యాలు చేయాలి అని పురాణ వచనం🙏*

*మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం !!*_

_*అవగాహనే మనసుకు మంచి మందు. అవగాహన అంటే మనసుకు విషయం సంపూర్ణంగా, సమగ్రంగా, సమూలంగా అర్ధంకావడం. మనకు బాల్యం నుండి మనసును పోల్చుకోవడం, పోటీపడటం అలవాటుగా మారింది. అదే అలవాటుతో దేవుడు, సాధన, ముక్తి వంటి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనసు పోల్చుకోవడం, పోటీ పడటం చేస్తోంది. నిజానికి మన జీవనం సాఫీగా సాగటానికి ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. మనతో మనం సక్రమంగా ఉంటే సరిపోతుంది. మన గుణాలను దాటటానికి, ప్రవృతిని మార్చుకోవడానికి అనుదినం మనతో మనమే పోటీపడాలి. మనలో వచ్చే మార్పే శాంతికి సోపానం. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం. దీన్ని ఎవరినీ అడిగి తెలుసుకోవాల్సిన పనిలేదు. మనం నిత్యజీవితంలో ఎంత శాంతిగా ఉంటున్నాం, ఎన్ని విషయాల్లో శాంతిగా ఉంటున్నామనేది ఎవరిది వారికే తెలిసే విషయం !*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹?
----------------------

*నచికేతుడు*
>÷<>÷<>÷<>÷<
           🦜

మనిషికి విద్య అవసరం.
నేర్చుకొన్న విద్య నిర్వీర్యమవకుండా వుండాలంటే,  ఆ  విద్యలను ఇతరులకు నేర్పాలి.
అప్పుడే  ఆ విద్యలకు శాశ్వతత్త్వం
కలుగుతుంది.
విద్యార్జన అనంతం. జ్ఞానసముపార్జన మహాసాగరం. ఎంత లోతుకు తరచి చూస్తే అంత విజ్ఞానం కలుగుతుంది.

ఇంటి లోని పిల్లలను ఐదు సంవత్సరాలదాకా మహారాజుల్లా
పెంచాలి.
తరువాత15 సంవత్సరాలదాకా , పనివారిలాగ  చూడాలి. అన్ని పనులూ స్వంతంగా చేసుకునే నైపుణ్యం నేర్పాలి. 
16 సంవత్సరాల నుండి ఆ యువకుడిని  ఒక మంచి స్నేహితునిగా చూడాలని మన
శాస్త్రములు వివరిస్తున్నాయి.
పాఠశాలకు వెళ్ళడానికి ముందుగానే  ఆపిల్లవాని బుధ్ధి వికాసానికి తండ్రి తోడ్పడుతున్నాడు.
తరువాత  15 సంవత్సరాల
దాకా  పాఠశాలకు వెళ్ళి
విద్యని ఆర్జించాలి.
ఆ తరువాత ఆ  పిల్లలు తమకు కావలసిన
విద్యలన్నీ నేర్చుకుంటారు.
అప్పటినుండి   వారు   తండ్రికి మిత్రులవుతారు.

పాఠశాలకు వెళ్ళే వయసు పెద్దలు చెప్పినట్లుగా  విని ఆచరించవలసిన కాలం.   ఆ సమయంలో వారిని
పనివారిగా చూడాలని శాస్త్రం చెప్తోంది.
ఈ పది సంవత్సరాలలో
వారు నేర్చుకొన్న విద్యే
వారికి భుక్తిని , సంఘంలో
విలువను పెంచుతుంది.

దానికి ఉదాహరణ గా నచికేతుని కధ తెలుసుకుందాము.

నచికేతుడు గురుకులవాసం
చేసి ,  సకల విద్యలనభ్యసించి గొప్ప పాండిత్యం సంపాదించి
ఇంటికి  తిరిగి వచ్చాడు.
నచికేతుడు ఇంటికి వచ్చిన
సమయంలో అతని తండ్రి
వాజశ్రవసు  మహర్షి
ఒక యాగం తలపెట్టి ,
యాగ  ద్రవ్యాలను సమకూర్చుకోసాగాడు .
నచికేతుడు అన్నీ  విద్యలు అభ్యసించి వచ్చినందున ,తన తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు. 
"మీరు యాగం చేస్తున్నారు కదా ..
 గోదానం చేయాలంటే ఒక దూడను ఈనిన తరువాత మరల చూలుతో వున్న
గోవును మాత్రమే దానమివ్వాలి .  అంతేకాని మనకు పనికిరాని
వట్టి పోయిన గోవుని దానమివ్వరాదు "  అంటూ మొదలు పెట్టి, తనకు తెలిసిన విషయ పరిజ్ఞానం అంతా తండ్రి ముందు ప్రదర్శించాడు.
తిరిగి మాట్లాడడం మొదలు పెట్టి,  "  నిజానికి యీ యాగ సమయంలో మీరు ఇక్కడ వున్నవన్నీ  దానంగా  యిచ్చి వేయాలి , ఏది సొంతానికి
వుంచుకో కూడదు.  అటువంటప్పుడు,  నన్ను
ఎవరికి  దానమిస్తారు ?
అని  అతి తెలివితేటలతో అడిగాడు.

యాగం ఏర్పాట్లలో నిమగ్నమైన
అతని తండ్రి
నచికేతుని ప్రశ్నలకి  సమాధానాలు  విడమరచి చెప్పలేక ,  ఒకే మాటలో " నిన్ను  ఆ యమునికి దానం యిచ్చెస్తాను",
అని అన్నాడు.
నిజానికి ఆయనికి  ఆ మాటనడంలో ఎటువంటి ఉద్దేశ్యమూ లేదు. కొడుకు మాటలకు విసుగుచెంది
ఆ మాట అనేశాడు.
కోపంలో వచ్చిన మాట అని తెలిసినా, తండ్రి మాట నెరవేర్చడానికి , యముడు
వున్న చోటు వెతుకుతూ వెళ్ళాడు నచికేతుడు.
నచీకేతుడు అక్కడికి  వెళ్ళేటప్పడికి యముడు అక్కడ లేడు. అక్కడే
ఆహారం లేకుండా మూడు రోజులు గడిపాడు  నచికేతుడు.  నాలుగవరోజున
వచ్చిన యమునికి తను వచ్చిన విషయం తెలిపాడు
నచికేతుడు.

"మూడు రోజులుగా ఆహారం
లేకుండా అతిధిగా వుంచి, వుపచరించక  పోవడం
నాదే తప్పు.   దానికి పరిహారంగా  ,నీకు  వరాలిస్తాను  కోరుకోమని " అని మాట
యిచ్