19, మే 2024, ఆదివారం

పూజా విధానంలో

 మన పూజా విధానంలోని -  అంతరార్థములు...!!*


1. గంటలు :


దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. 


ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, 

రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.


2.దీప హారతి:


దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. 


దైవమే కాంతి. 

ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు ,కాంతివి నీవే. 


నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, 

మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.


3. ధూపం:


భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. 

వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. 


వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. 

విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన 

అందరిలో కలుగుతుంది.


ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ 

జ్ఞప్తి చేసినట్లవుతుంది.


4. కర్పూర హారతి:


వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. 


ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని 

భక్తులు కోరుకుంటారు.


5. గంధపు సేవ:


ఈ సేవలో చాలా అర్థం ఉంది. 

భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. 


అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. 

ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి.


 ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. 

ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. 


6. పూజ:


దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. 


కాని భగవంతునికి వీటితో పనిలేదు. 

నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. 

కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.


7 పత్రం(శరీరము):


ఇది త్రిగుణాలతో కూడుకున్నది. 

పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.


8 పుష్పం (హృదయము):


ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు 

అని అర్థం కాదు. 


సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం 

అని అర్థం. 


ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.


9 ఫలం (మనస్సు):


మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.

దాన్నే త్యాగం అంటారు.


10. తోయం(నీరు):


భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన 

దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు 

దైవానికే అర్పితం కావాలి.


11 కొబ్బరికాయలు:


హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. 

దానిలో ఉండే నీరు సంస్కారము. 


కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. 


అదే నిజమైన నివేదన. 

లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, 

హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. 


హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. 

మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.


మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.


12. నమస్కారము:


చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. 

ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.


13. ప్రదక్షిణము:


ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. 

ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. 


అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

(సేకరణ)...

విరాళాలు ఇవ్వగలరు

 విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని  మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

9848647145

భుక్తికే ఉపయుక్తము

సుభాషితం - 1142

--------------

🌺వాగ్వైఖరీ శబ్దఝరీ

     శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్ |

     వైదుష్యం విదుషాం తద్వద్

     భుక్తయే న తు ముక్తయే ||

(వివేకచూడామణి

       అనర్గళ వాక్చాతుర్యం, మంచి శబ్దప్రవాహం, శాస్త్రాలకు వ్యాఖ్యానం చేయు కౌశలం అలాగే శాస్త్రపాండిత్యము - ఇవన్నీ భుక్తికే ఉపయుక్తము కాని ముక్తికి కాదు.

🌺ప్రభ,హైదరాబాద్.

     10-5-2024

నీభాగ్యంబుసామాన్యమే

 నీభాగ్యంబుసామాన్యమే!!


బ్రాహ్మీదత్తవరప్రసాదుడ,వురుప్రజ్ఞావిశేషోదయా

జిహ్వస్వాంతుడ,వీశ్వరార్చన కళాశీలుండ ,వభ్యర్హిత

బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్ధ నిర్ధారిత

బ్రహ్మజ్ఞానకళా నిధానమవు,నీభాగ్యంబుసామాన్యమే!!

శృంగారనైషధం-శ్రీనాధకవిసార్వభౌముడు.- అవతారిక-13పద్యం!!

        కాశీఖండమయః పిండమ్-నైషధం విద్వదౌషధం-అనేది పండితవాక్యం.ఇది

హర్షనైధమునకే వర్తించునని కొందరందురుగాక! శ్రీనాధకృతికిని ఇదివర్తించునన్నది,


ఈపద్యమేనిరూపణము.

          శ్రీహర్షుని కృతినాంధ్రీకరింపవలెనన్న ఆకవి కెంతసత్తువకావలెను.ఎన్ని విషయములు తెలియవలెను. ముందు

ఆతడుసరస్వత్యుపాసకుడైనకాని సాధ్యపడదు.ముందుగాశ్రీనాధునకు గలయోగ్యలెట్టివో పరిశీలింపుడు.


1 బ్రాహ్మీదత్తవరప్రసాది. ఉపాసనాబలం

తనబలంగా జోడించుకున్నవాడు.కాబట్టి రచనకు తిరుగుండదు.

2ఉరుప్రజ్ఞావిశేషోదయాహిజ్వస్వాంతుడవు."ఉరుప్రజ్ఞ-అంటే కావ్యోత్పత్తిహేతువులలో ముఖ్యమైన "ప్రతిభ"- ఆప్రతిభాసమున్మేషంలో ఆదిశేషునిప్రభావగుంభితమనంబుగలవాడవు.

3ఈశ్వరార్చన కళాశీలుండు.

        పరమేశ్వరారాధన మొకకళగా నెరిగినవాడు.శివారాధనాతత్పరుడు.

శివార్చనాఫలము అష్టవిధవిభూతులు.

అందులో వశిత్వమున్నది.అదియే కావలసినది తలచినంతనే మూలకావ్యార్ధమంతయు వశమే!

4అభ్యర్హితబ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్ధ నిర్ధారిత

బ్రహ్మజ్ఞానకళానిధానం. అష్టాదశపురాణసముదాయమునగలతాత్పర్యార్ధమునందుసూచింపబడిన

పరంబ్రహ్మస్వరూపమును నిరూపణముచేయగలవాడు.

     ఇదీ శ్రీనాధునికవనసత్వము.

కవితాసామర్ధ్యము.

     ఈమాటలు శ్రీనాధకృతి స్వీకృత సుకృతి మామిడి సింగనా మాత్యుని మాటలు!

          "అహో !కవిసార్వభౌమా!శ్రీనాధకవీంద్రా!నీకవనసామర్ధ్యముఅపురూపము,అనన్యసామాన్యము.


"నాస్తియేషాం యశఃకాయే జరామరణజం భయమ్!!

                             

                                   స్వస్తి!🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                                         🙏

కుటుంబం ప్రధానం.

 తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా GV ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు.

ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు.

తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి, చివరికి అసలు విషయం చెప్పాడు. అది విన్న మన భారతీయుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.

తైవాన్ మిత్రుడు భారతీయుణ్ణి అడిగిన ప్రశ్న:

 ‘‘200 సంవత్సరాల పాటు భారత దేశంలో ఎంత మంది బ్రిటిషర్లు ఉన్నారు’’

‘‘బహుశా 10 వేల మంది ఉండి ఉండవచ్చు’’ బదులిచ్చాడు భారతీయుడు

 ‘‘మరి 32 కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు?వాళ్ళందరూ భారతీయులే కదా? ఔనంటావా?

నిరాయుధులుగా ఉన్న 1300 మందిని కాల్చిపారేయమని జనరల్ డయ్యర్ ఆదేశించాడు. అప్పడు కాల్పులు జరిపింది బ్రిటిష్ ఆర్మీ కాదు. అంత మంది భారతీయ సిపాయిలలో ఒక్కడైనా తన తుపాకిని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతన్ని ఎందుకు చంపలేకపోయాడు?’’అడిగాడు తైవాన్ స్నేహితుడు.

మరో ప్రశ్న అడిగాడు తైవాన్ స్నేహితుడు

‘‘ఎంత మంది మొఘలులు భారత దేశానికొచ్చారు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు భారత దేశాన్ని పరిపాలించారు? భారతీయులను తమ బానిసలుగా భావించారు. మీలోనే కొందరిని మతం మార్చి మీకు వ్యతిరేకంగా పోరాడేలా చేసారు. మీలోనే కొందరు డబ్బు కోసం కక్కుర్తి పడి సాటి దేశస్తులను హింసించారు. తమ సాటివారితోనే అనుచితంగా ప్రవర్తించారు. కాబట్టి మిత్రుడా, మీ ప్రజలే శతాబ్దాల పాటు మీ ప్రజల్ని చంపుతూ వచ్చారు. కేవలం డబ్బు కోసం. మీలాంటి స్వార్ధపరులు, మోసగాళ్ళు, విద్రోహులు, అల్ప బుద్ధులు, శత్రువులతో స్నేహం చేసి, తమ వారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారిని మా దేశస్తులు ద్వేషిస్తారు’’ అన్నాడు

మరో విషయం చెప్పాడు తైవానీయుడు. ‘‘బ్రిటిషర్లు హాంగ్ కాంగ్ ని స్వాధీనం చేసుకొన్నప్పుడు ఒక్క స్థానికుడు కూడా సైన్యంలో చేరలేదు. తమ వారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం వారికి లేదు.

కపట మనస్తత్వం కలిగిన చాలా మంది భారతీయులు ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉంటారు. ముందూ వెనకా ఆలోచించరు’’ 

‘‘అదే మనస్తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం విపక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు, జాతి వ్యతిరేక కార్యకలపాలకు ఉతమిచ్చేందుకు వెనుకాడరు. భారతీయుల్లో అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. మీకు మీరూ మీ కుటుంబం ప్రధానం. సమాజం, దేశం ఏమైపోయినా సరే మీకు బాధనిపించదు’’ అని ముగించాడు తైవాన్ దేశస్తుడు

 

ఇది మనకెవరికీ మింగుడు పడని చేదు నిజం.

దేశాన్ని నాశనం చేస్తుంది.

 శ్లోకం:☝️

*ఏకం విషరసో హన్తి*

 *శస్త్రేణైకశ్చ హన్యతే |*

*సరాష్ట్రం సప్రజం హంతి*

 *రాజానం మంత్రవిప్లవః ||*


భావం: విషం ప్రయోగంతో ఒకరిని మాత్రమే చంపవచ్చు. ఆయుధంతో ఒకరిని [లేదా కొందరిని] చంపవచ్చు. కానీ పీడిత ప్రజల రహస్యమైన విప్లవం చాపకిందనీరులా వ్యాపించి, ఆ దేశ పౌరులను మరియు రాజుతో సహా మొత్తం దేశాన్ని నాశనం చేస్తుంది.

పంచాంగం 19.05.2024

 ఈ రోజు పంచాంగం 19.05.2024  Sunday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస శుక్ల   పక్ష: ఏకాదశి తిధి భాను వాసర: హస్త నక్షత్రం వజ్ర యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి మధ్యాహ్నం 01:48 వరకు.

హస్త రాత్రి 03:14 వరకు. 

సూర్యోదయం : 05:47

సూర్యాస్తమయం : 06:38


వర్జ్యం : పగలు 09:46 నుండి ఉదయం 11:34 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:55 నుండి 05:47 వరకు.


అమృతఘడియలు : పగలు 08:31 నుండి 10:19 వరకు.


రాహుకాలం : సాయంత్రం  04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



ఈ రోజు సర్వేషాం మోహిన్యేకాదశి , పరుశరామైకాదశి 


శుభోదయ:, నమస్కార:

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల

 సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.19.05.2024

ఆది వారం (భాను వాసరే)

***********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ  క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ వైశాఖ మాసే శుక్ల పక్షే ఏకాదశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భాను వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర  ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి  నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

వైశాఖ మాసే  శుక్ల పక్షే  ఏకాదశ్యౌపరి ద్వాదశ్యాం

భాను వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.31

సూ.అ.6.21

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

వైశాఖ మాసం 

శుక్ల పక్షం 

ఏకాదశి మ.1.08 రకు. 

ఆది వారం. 

నక్షత్రం హస్త రా.తె.2.51 వరకు. 

అమృతం రా. 8.12 ల 9.58 వరకు. 

దుర్ముహూర్తం సా. 4.39 ల 5.30 వరకు.  

వర్జ్యం ఉ. 9.34 ల 11.20 వరకు. 

యోగం వజ్రం ఉ.11.26  వరకు.  

కరణం భద్ర ప. 1.08 వరకు. 

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం సా. 4.30 ల 6.00 వరకు. 

గుళిక కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

యమగండ కాలం మ.12.00 ల 1.30 వరకు. 

****************   

  పుణ్యతిధి శూన్యతిథి. 

  ****************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు  జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు  మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

🙏🙏🙏

వైశాఖ మాసం - శుక్ల పక్షం*

 *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

        *వైశాఖ మాసం - శుక్ల పక్షం*   

🔔తిథి      : *ఏకాదశి* మ1.09 వరకు

🔯వారం   : *ఆదివారం* (భానువాసరే )

⭐నక్షత్రం  : *హస్త* రా2.48 వరకు

✳️యోగం : *వజ్రం* ఉ11.25 వరకు

🖐️కరణం  : *భద్ర* మ1.09 వరకు

            తదుపరి *బవ* రా2.05 వరకు

😈వర్జ్యం   :   *ఉ9.31 - 11.18*

💀దుర్ముహూర్తము : *సా4.38 - 5.29*

🥛అమృతకాలం    :  *రా8.09 - 9.55*  

👽రాహుకాలం       : *సా4.30 - 6.00*

👺యమగండ/కేతుకాలం : *మ12.00 - 1.30*

🌞సూర్యరాశి: *వృషభం* || 🌝చంద్రరాశి: *కన్య*

🌅సూర్యోదయం: *5.31* || 🌄సూర్యాస్తమయం:*6.21*

 👉 *అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం*

   మతత్రయ ఏకాదశి*

*గోమాతను పూజించండి*

*గోమాతను సంరక్షించండి* ఇరగవరపు రాధాకృష్ణ🙏

అమ్మకి ఏమి కావాలి?

 అవును

అమ్మకి ఏమి కావాలి?


పిల్లలు చదువుకొని

ఎక్కువ మార్కులు

తెచ్చుకుంటే

ఆ పిచ్చి తల్లి

కళ్ళల్లో

మెరుపులు


అదే పిల్లలు

పెద్దవారై

మంచి ఉద్యోగాలలో

స్థిరపడితే

ఆ అమ్మ

కళ్ళలో కాంతులు


ఒక గొప్ప వ్యక్తిని

వెతికి వెతికి

భాగస్వామిని చేసి

వారి సంతోషాలకు

ఆనందలకు

ఆనంద బాష్పాలు

రాలుస్తుంది


కానీ


ఆ పిల్లల

నిరాదారణకు లోనై

అవమానాల పాలై

బ్రతుకు భారమైనపుడు

ఆ కళ్ళలో

కన్నీటి సుడులు


కంటికి రెప్పలా

కాపాడితే

బిడ్డలు ఇచ్చే బహుమతి

తడి ఆరని

చీరకొంగు


కంటి నిండా నిద్ర లేక

మౌనంగా

ఎన్నో రాత్రులు

రోదిస్తూ ఉన్నా

తలరాత అనుకొని

సర్దుకు పోతుంది కానీ

శాపాలు పెట్టలేదు


కనపడని దేవుడి కోసం

గుళ్ళు గోపురాలు

కానుకలు ఇస్తాము

కనిపించే దైవాన్ని

నిర్లక్ష్యం చేస్తాము


ఆ దైవాన్ని మెప్పించలేము 

ఈ దైవాన్ని నొప్పిస్తే