25, జూన్ 2023, ఆదివారం


 


 

మందేశ్వర_శనేశ్వర_స్వామి_దేవాలయం

 #మందేశ్వర_శనేశ్వర_స్వామి_దేవాలయం





         శనిదేవుడు ఒక్కసారి పట్టుకుంటే, ఏడేళ్లవరకూ మనచుట్టే తారట్లాడుతుంటాడని పేరు. ఆ మందగమనుడు శివలింగాన్ని ప్రతిష్ఠించిన క్షేత్రమే, తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి. అభిషేక ప్రియుడైన మందేశ్వరుడిని పూజిస్తే, శని ప్రభావం వదిలిపోతుందని భక్తుల విశ్వాసం.


శనీశ్వరుడికి సంబంధించి ఎన్నో కథలు. పట్టుకుంటే ఓపట్టాన వదలడంటారు. నలమహారాజును సైతం ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడని చెబుతారు. దేవతలకి కూడా దడపుట్టించగల మహాశక్తిమంతుడన్న ఖ్యాతి. ఎన్ని వేధింపులైనా ఆ క్షేత్రానికి అవతలే! ఒక్కసారి తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని మందపల్లిలో వెలసిన మందేశ్వరుడిని దర్శించుకుంటే...శని ప్రభావం మటుమాయమైపోతుందని ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే, అక్కడి శివలింగాన్ని సాక్షాత్తూ శనిదేవుడే ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. మందేశ్వరుడికి తైలాభిషేకాలు జరిపితే, శని వల్ల కలిగే సమస్త దోషాల నుంచీ విముక్తి లభించినట్టేనని బలమైన నమ్మకం.


ప్రతి మనిషి జీవితకాలంలో రెండుమూడుసార్లు ఏలిన నాటి శని ప్రభావం ఉంటుందనీ, శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే ఆ ప్రభావాన్ని తప్పించుకోవచ్చనీ జ్యోతిష నిపుణులు చెబుతారు. ఆ కారణంగానే, దేశం నలుమూలల నుంచీ శనిత్రయోదశి లాంటి పర్వదినాల్లో వేలాది భక్తులు మందపల్లికి తరలివస్తారు. ముడినువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులూ బెల్లమూ కలిపి నివేదిస్తారు. ప్రతి శనివారమూ ఆలయం శనిపీడితులతో కిటకిటలాడుతుంది. శనిదోషం లేని వారు స్వామిని దర్శించుకుంటే, రాబోయే కష్టాలూ తొలగుతాయని అంటారు.


మందేశ్వర పురాణం..

పూర్వం, ప్రస్తుతం మందపల్లిగా పిలుస్తున్న ప్రాంతం దండకారణ్యంలో భాగంగా ఉండేది. ఇక్కడ మహర్షుల ఆశ్రమాలు ఉండేవి. నిత్యం యజ్ఞయాగాదులు జరిగేవి. ఆ పరిసరాల్లోనే అశ్వత్థుడు, పిప్పలుడు అనే బ్రహ్మ రాక్షసులు నివసించేవారు. అశ్వత్థుడు రావిచెట్టు రూపంలోనూ పిప్పలుడు బ్రాహ్మణుడి రూపంలోనూ కనిపిస్తూ యజ్ఞయాగాలకు ఆటంకం కలిగించేవారు. అంతటితో ఆగకుండా, యాజ్ఞికులను చంపి తినేవారు. ఫలితంగా, బ్రాహ్మణ సంతతి అంతరించిపోసాగింది. అదంతా గ్రహదోష ఫలితమేనని భావించిన మహర్షులు శనీశ్వరుడిని ప్రార్థించి, రాక్షస కృత్యాలను నిరోధించాలని కోరారు. శనిదేవుడు ఆ బ్రహ్మ రాక్షసులిద్దరినీ ఒక్క దెబ్బతో సంహరించాడు. ఫలితంగా, శనీశ్వరుడిని బ్రహ్మహత్యా దోషం పట్టి పీడించసాగింది. దాన్ని నివారించుకోడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయం కోసం మహర్షుల్ని సంప్రదించాడు. పరమశివుడు మాత్రమే ఆ పాతకాన్ని పరిహరించగలడని చెప్పారు. దీంతో శనిదేవుడు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఒక్కసారి పట్టుకున్నాక వదిలే తత్వం కాదు శనిగ్రహానిది. అందుకే, మందగమనుడనీ, మందుడనీ పిలుస్తారు. మందుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి, మందేశ్వరుడన్న పేరు వచ్చింది. క్షేత్రం చుట్టూ వెలసిన పల్లె మందపల్లిగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

మరో కథనం ప్రకారం...ఓసారి నారదుడికీ పరమశివుడికీ మధ్య శని గొప్పదనం విషయంలో ఓ చర్చ జరిగింది. అది కాస్తా ‘ఎవరు గొప్ప?’ అన్న వివాదంగా మారింది. ‘చేతనైతే నన్ను పీడించమను..’ అంటూ ఆవేశంగా సవాలు విసిరాడు శివుడు. ‘ఒక్క క్షణం అయినా శివుడిని పీడించి తీరతాను’ అంటూ నారదుడి ముందు ప్రతిజ్ఞ చేశాడు శని. దీంతో, ఆ గ్రహరాజుకు తన ఆనవాలు తెలియకుండా శివుడు కైలాసాన్ని వీడివచ్చి... మందపల్లిలో తలదాచుకున్నాడు. ‘దేవదేవుడివైన నువ్వు సామాన్యుడిలా దండకారణ్యం దాకా వచ్చావంటే, అదంతా నా ప్రభావం కాదంటావా స్వామీ?’ అంటూ శని పరమేశ్వరుడి పాదాల మీద పడ్డాడు. శివుడిని పీడించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా లింగాన్ని ప్రతిష్ఠించాడు.


క్షేత్రపాలకుడు...

ఆలయ ప్రాంగణంలోనే పార్వతీదేవి, ఉమా బ్రహ్మేశ్వరుడు, ఉమా నాగేశ్వరుడు వెలిశారు. క్షేత్రపాలకుడిగా వేణుగోపాలస్వామి పూజలు అందుకుంటున్నాడు. పూర్వం బ్రహ్మ ఇక్కడ ఓ యజ్ఞాన్ని తలపెట్టాడట. క్రతువు పూర్తయిన తర్వాత కూడా, యజ్ఞగుండంలోని నిప్పు ఎంతకీ చల్లారకపోవడంతో... గౌతమ మహర్షి గోదావరి నదిని గుండం మీదుగా ప్రవహింపజేశాడు. అప్పుడు కానీ, అగ్నిదేవుడు శాంతించలేదు. ఆతర్వాత బ్రహ్మ ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడనీ, అదే బ్రహ్మేశ్వరుడిగా ప్రసిద్ధమైందనీ ఐతిహ్యం. కర్కోటకుడనే సర్పరాజు ఇక్కడ ఘోర తపస్సు చేశాడని అంటారు. శివ సాక్షాత్కారం తర్వాత, మందపల్లి క్షేత్రంలో దివ్యలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇక్కడి నాగేశ్వరుడిని అభిషేకించినవారికి సర్పభయాలూ సర్పదోషాలూ ఉండవని వరమిచ్చినట్టు పురాణ కథనం. ఈ క్షేత్రంలో గౌతమ మహర్షి వేణుగోపాలస్వామిని కూడా ప్రతిష్ఠించాడు. దీంతో మందపల్లికి గోపాల క్షేత్రంగానూ పేరొచ్చింది. రుక్ష్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలుడి కల్యాణం ఏటా మాఘశుద్ధ ఏకాదశి నాడు వైభవంగా జరుగుతుంది. మాఘ బహుళ దశమి నుంచి ఫాల్గుణ శుద్ధ విదియ వరకూ మందేశ్వర (శనీశ్వర) స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.


ప్రాముఖ్యత

మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శనిత్రయోదశి నాడు, మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.


విశేష పూజ దినములు

శని త్రయోదశి - శనివారం రోజులో వచ్చే త్రయోదశి.

మహాశివరాత్రి

శనివారం ఆమవాస్య.

పూజకు కావలసిన వస్తువులు

పసుపు

కుంకుమ

వత్తులు

ప్రమిదులు-2

నల్ల నువ్వుల నూనె-1/2 కేజి

నల్ల నువ్వులు

నవ దాన్యలు-100 గ్రాములు

మేకు-1

యెర్రటి వస్త్రం

నల్లటి వస్త్రం

బియ్యం-1/2 కేజి

బెల్లం

పువ్వులు

తమలపాకులు-10

అరటి పండ్లు-4

కర్పూరం

అగరబత్తి

ఒక్కలు-2

కొబ్బరికాయలు-2

ప్రత్తి గింజలు

అరటి ఆకు-1

గ్లాసులు-2

మందపల్లి గ్రామం రాజమండ్రికి 38 కి.మి., కాకినాడకు 60 కి.మి., అమలాపురంకు30 కి.మి., రావులపాలెంకు 9 కి.మి. దూరంలో ఉంది.

అహంభావాన్ని మాత్రం

 ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు…సజీవంగా వుండేవి…ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [ Ego ] నింపాయి.


ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి ‘మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!” అని చెప్పాడు.


శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా….అనిపించే శిల్పాలు సృష్టిస్తాను…కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు.


అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు.


మృత్యుదేవత ఆ గదిలోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో… శిల్పమేదో… కనుక్కోలేక పోయింది.


ఇక తనవల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి “ఈ శిల్పి” ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది.


అంతే! మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత…అనుకున్నాడు. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో ”ఏది? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!” అనేసాడు.


అపుడు మృత్యుదేవత నవ్వుతూ….నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు! “ప్రాణాధారమైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది” అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.


మనం పెంచుకొనే అహంభావం [ Ego ] అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ”నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు” అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.


మీరు గమనించారా? ” అహంభావం ” అనే పదం లోంచి ‘అహం’ తీసేస్తే మిగిలేది ‘భావం’ అంటే ‘అర్థం’ అర్థమైతే అనర్థం జరగదు.

నామస్మరణతో బి.పి. నియంత్రణ

 🌼విఠ్ఠల .. విఠ్ఠల  నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట🌼



🌿🌼🙏పుణె లోనివేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది.🙏🌼🌿


🌿🌼🙏విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు ' ఠ్ఠ ' అనే అక్షరం నుండి వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది.🙏🌼🌿


🌿🌼🙏రెండు మహాప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది. 

పదిరోజులపాటు, రోజుకు 9 నిమిషాలు శాంత చిత్తంతో విఠ్ఠల నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర మరియు దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి.🙏🌼🌿

 

🌿🌼🙏అందరం భక్తితో " విఠ్ఠల విఠ్ఠల పాండురంగ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం, ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు🙏🌼🌿


విఠ్ఠల విఠ్ఠల పాండురంగ 

విఠ్ఠల విఠ్ఠల పాండురంగ 🙏

సేకరణ

సంసారం

 *శుభోదయం*

🙏💐🙏💐🙏

*సంసారం ఒక సాగరం*

 

*జీవితం అందులో నడిచే నావ*


*జీవి నావికుడు*


*కష్టాలు, కన్నీళ్లు అలలు..* 

*సుఖాలు సంతోషాలు కూడా అలలే...* 


*నేను, నాది అనే స్వార్థం ఆ నావకున్న రంధ్రాలు..*

 

*వీటి ద్వారా కష్టాలు కన్నీళ్లు చేరి ఆ నావను ముంచేస్తాయి.....* 


*మనము, మనది అనే పరమార్థంతో ఆ రంధ్రాలను పూడ్చి వేస్తే...*

 

*సుఖము, సంతోషమనే అలలు ఆ నావను తీరానికి చేరుస్తాయి..*

 

🙏🙏🙏🙏🙏🙏

ఓం అరుణాచల శివ

ఉపనిషత్తులు

 *ఉపనిషత్తులు* 

    ➖➖➖


హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఇవి వేదాల చివరి భాగాలు, అందుకే వీటిని వేదాంతాలు, వేదాంతము అని కూడా అంటారు. సాధారణంగా వేదాలలో నాలుగు భాగాలు ఉంటాయి.


*1. సంహితలు*

వీటిలో మంత్రాలు స్తోత్రాలు ఆవాహనలు సంబంధించినవి ఉంటాయి.


*2. బ్రాహ్మణములు*

ఇందులో సంహితలలోని మంత్రాలను శాస్త్రవిధిగా వివరించే విషయాలు , యజ్ఞ యాగాదులకు వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు


*3. అరణ్యకములు*

ఇందులో వివిధ కర్మకాండలు యజ్ఞ యాగాదులకు సంబంధించిన వివరాలు ఉంటాయి


*4. ఉపనిషత్తులు*

ఇవి పూర్తిగా జ్ఞానకాండ కు సంబంధించినవి అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, మోక్షము, లోకము  ప్రాణులు, ప్రకృతి, భగవంతుడు మొదలగంశాలు ఇక్కడ వివరించడం జరుగుతుంది.


నాలుగు వేదాలలో కలిపి మొత్తము 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే వేదాలలో ఉన్న శాఖల ఆధారంగా వాటిలో 108 ఉపనిషత్తులు మాత్రమే ముఖ్యమైనవి, వాటిలోనూ 10 మాత్రమే ప్రధానమైనవి.


*ఉపనిషత్తుల వివరణ*

భారతీయ తత్వ శాస్త్రానికి ఉపనిషత్తులు శిరోమాణిక్యాల వంటివి. ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చుని అభ్యసించడం లేదా సమీపమును కూర్చుని నేర్చుకునే విద్య అని భాష్య కారులు అర్థం చెప్పారు. ఈ ఉపనిషత్తులకే వేదాంతం అనే మరొక పేరు కూడా కలదు.


వేద సూక్తులు ఆర్యుల కవితావేశానికి చిహ్నం. అంతటి సామర్థ్యం గల ఒక శాఖ ఆర్యులలో ఉండి, ఈ వేదాలు ఉద్భవించడానికి కనీసం కొన్ని శతాబ్దాలు పట్టి ఉంటుంది. ఇందులో అనార్యులు కూడా చాలామంది చేరారు. ఈ ఉపనిషత్తులు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల తర్వాత రూపొందాయని భావిస్తారు.


అయితే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్నప్పుడు, ఒక్క భారతదేశం మాత్రమే ఆధ్యాత్మిక ప్రకాశంతో విరాజిల్లింది . అప్పుడు సంపన్నులైన భారతీయ ఋషులు సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్య దీప్తితో ప్రకాశించే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వారు సాక్షాత్కరించుకున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


ఈ ఉపనిషత్తులు కొన్ని బ్రహ్మ తత్వాన్ని, గురించి కొన్ని ఆత్మ తత్వాన్ని ,గురించి కొన్ని దేహ తత్వాన్ని గురించి, కొన్ని ప్రపంచ స్వరూపాన్ని, మరికొన్ని జీవస్వరూపాన్ని, మరికొన్ని పంచభూతాలైన పృథ్వి నీరు నిప్పు గాలి, ఆకాశాల స్థూల సూక్ష్మరూపాలను, మరికొన్ని మరణాన్ని ,మరణానంతర స్థితులను, కర్మలను ,ఆశ్రమ ధర్మాలను, మోక్ష స్వరూపాలను గురించి చర్చించాయి. అంటే ఈ ఉపనిషత్తులు మొత్తం మీద జ్ఞానాన్ని గురించి మాత్రమే చర్చించాయి మిగతాయి కర్మకాండం గురించి చర్చించాయి ఉపనిషత్తులు జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన విషయాల గురించి చర్చించాయి.

    

ఈ ఉపనిషత్తులు అన్నీ వాదప్రతివాద , సంవాదాల రూపంలో ఉంటాయి. అంటే ఒకరు ఒక విషయాన్ని గురించి ప్రశ్నించడం, ఆ ప్రశ్నకు అనేకమంది కానీ లేదా ఏ ఒక్కరో కానీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రశ్నను వేయడం దానికి సమాధానం చెప్పడం, ఆ సమాధానాన్ని ఖండించడం లేదా సమర్థించడం లేదా సంస్కరించడం లేదా మరొక నూతనమైన సమాధానాన్ని చెప్పడం ఉపనిషత్తులోని వాద పద్ధతిని సూచిస్తాయి. ఈ వాద ఉపవాదాలు అతి విశాలమైన అరణ్యాల్లోనూ, ఆశ్రమాలలోనూ విద్వత్ సభల్లోను జరిగాయి. ప్రతి ఉపనిషత్తు ఒక ముఖ్యమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది. జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు వారు మొత్తం ఉపనిషత్తులలో ముఖ్యమైన పది ఉపనిషత్తులకు భాష్యాలను వ్రాశారు.


*ప్రధానమైన పది ఉపనిషత్తులు*

1. ఈశావాశ ఉపనిషత్తు

2. కేన ఉపనిషత్తు

3. కఠ ఉపనిషత్తు

4. ప్రశ్న ఉపనిషత్తు

5. ముండక ఉపనిషత్తు

6. మాండూక్య ఉపనిషత్తు

7. త్తెత్తరీయ ఉపనిషత్తు

8. ఐతరీయ ఉపనిషత్తు

9. ఛాందోగ్య ఉపనిషత్తు

10. బృహదారణ్యక ఉపనిషత్తు.

      

తిరస్కరించబడిన

 .            

                      _*సుభాషితమ్*_


 𝕝𝕝 శ్లోకం𝕝𝕝


*అవజ్ఞాత్రుటితం ప్రేమ* 

*నవీకర్తుం క ఈశ్వరః |*

*సన్ధిం న యాతి స్ఫుటితం* 

*లాక్షాలేపేన మౌక్తికమ్||*


తా𝕝𝕝 

తిరస్కరించబడిన ప్రేమను మళ్లీ కొత్తగా మొదటి స్థితికి తెచ్చుకోవడం ఈశ్వరునికైనను సాధ్యం కాదు. అలాగే, పగిలిపోయిన ముత్యానికి లక్క పూసినా అది చక్కబడదు.




..















 

తిరుపతి చుట్టూ చూడదగ్గ క్షేత్రాలు

 తిరుపతి చుట్టూ చూడదగ్గ క్షేత్రాలు ప్రదేశాలు...


తిరుచానూరులో పద్మావతి అమ్మవారు,నూతనంగా పునరుద్ధరించిన పేరూరు బండ వద్ద గల ఒకులామాత ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుడి ఆలయం(వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణిక కాలం ఇక్కడ స్వామిని చూసినట్టే ఉంటుంది), అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం, వికృతమాల గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తిస్వర దర్శనం,

 గుడిమల్లం గుడి దర్శనం, అర్ధగిరి ఆంజనేయ స్వామి దర్శనం, కాణిపాకం గణేష్ గుడి దర్శనం,తలకోన జలపాతం ఇంకా ముందుకు వెళదాచుకుంటే నారాయణవనంలో వెంకటేశ్వర స్వామి వివాహమైన ఆలయం, నాగలాపురంలో మచ్చా అవతార వెంకటేశ్వర స్వామి,

రామగిరి లో ఈశ్వరాలయం నంది నోటి నుంచి వచ్చే నీరు, సురుటుపల్లి లో సేయనించి

 ఉన్న ఈశ్వరుడి ఆలయం,తిరుపతిలో కపిల తీర్థం, గోవింద రాజస్వామి దర్శనం, ఇస్కాన్ టెంపుల్,చంద్రగిరి కోట, రీజనల్ సైన్స్ సెంటర్ (పిల్లలకు చాలా ఉపయోగం),శ్రీనివాసం వసతి సముదాయం లో మధ్యాహ్నం,రాత్రి ఉచిత బోజన సదుపాయం కలదు.ఇలాతిరుపతి చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు,ప్రదేశాలు ఉన్నాయి.

మీ ఓపిక మీరు కేటాయించుకున్న రోజులను బట్టి దర్శనాలు చేసుకోవచ్చు.


ఓం నమో నారాయణాయ🙏🙏🙏