🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*బుధవారం 4 ఫిబ్రవరి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣2️⃣5️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*125 వ రోజు*
*వన పర్వము పంచమాశ్వాసము*
*ద్రౌపది సత్యభామలు*```
ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని “ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు. వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం?
నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను” అని అడిగింది.
ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో..
“సత్యా! నీవు నన్ను దుష్ట స్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.
ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట
సత్యభామ సిగ్గుపడి " ద్రౌపదీ! నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము " అన్నది. ద్రౌపది " సత్యా! దానిదేముంది అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతి రోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందు వలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసే వారు నీకు మిత్రులైనా వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండ రాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహసంబంధాలు పెట్టుకో. విలాసజీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు " అన్నది. సత్యభామ ద్రౌపదితో " నీ భర్తలు దైవసమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు కలత చెంద వద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు " అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యక వనం వదిలి ద్వైత వనానికి వెళ్ళారు.```
*సశేషం*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసిం🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి