*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 20*
*శ్వేతా మంథరహసితే శాతా మధ్యే చ వాఙ్మనోతీతా।*
*శీతా లోచనపాతే స్పీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా॥*
*భావము :*
*జగన్మాతా! నీకు అది అంతములు లేవు. మందస్మితపదనారవిందవు నీవు. క్షీరముతో నిండి ఉన్న మాతృస్థానముల బరువుతో వంగిన సన్నని నడుము కలిగిన చక్కని తల్లివి నీవు. నీ రూపము భావనాతీతమైనది. అటువంటి పరబ్రహ్మమును ఆరాధిస్తున్నాను.*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 21*
*పురతః కదానుకరవై పురవైరివిమర్దపులకితాంగలతామ్ |*
*పునతీం కాంచీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీమ్ ||*
*భావము :*
*మన్మధుని వీరత్వము అమ్మ ప్రసాదించినదే. అటువంటి అమ్మ యొక్క సన్నని దేహము ఈశ్వరుని ఆలింగనంలో ఆనందములో మునిగి తేలుతుంది. కాంచీపురమును చల్లగా చూస్తున్న ఆ తల్లి నాకు ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో కదా?*
🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి