28, ఆగస్టు 2020, శుక్రవారం

జ్యోతిష్య శాస్త్రం ఒక వృత్తాంతం.

ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరుడు తన కూతురు లీలావతి జాతకం ప్రకారం ఆమె భర్త మరణిస్తాడని తెలుసుకుని ఏ ముహూర్తానికి ఆమె వివాహం జరిగితే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందో తెలుసుకుని ఆ ముహూర్తానికి కాకుండా వేరే ముహూర్తానికి వివాహం జరిపించాలని ఒక గడియారాన్ని తయారుచేస్తాడు. కుండలో నీరు పోసి అడుగున చిన్న రంధ్రం ద్వారా నీరు ఒక్కొక్క చుక్క కింద పడేలా ప్లాన్ చేస్తాడు. దాని ఆధారంగా కాలాన్ని తెలుసుకుంటాడు. కానీ చివరికి కుమార్తె వివాహం జరిగి ఆమెకు జాతకం ప్రకారం వైధవ్యం ప్రాప్తింస్తుంది.
జాతక దోషాన్ని నివారించలేకపోయానని చింతిస్తూ తాను గడియారంగా మలచిన కుండ ను పరిశీలిస్తాడు. ఆ కుండ అడుగున చిన్న ముక్కు పుడక కనపడుతుంది. జరిగిన వాస్తవం ఏమిటంటే భాస్కరుని కుమార్తె లీలావతి ఆడుకుంటూ కుండలోకి తొంగిచూసినప్పుడు ఆమె ముక్కుపుడక జారి కుండలో పడి గడియారం గతి తప్పుతుంది. అందువల్ల భాస్కరుడు తాను అనుకున్న ముహూర్తానికి కాకుండా జాతకం ప్రకారం దోషం ఉన్న ముహూర్తానికే తన కూతురు వివాహం జరిపించి తరువాత బాధపడతాడు. ఇది జ్యోతిష్య శాస్త్రం గురించి ఒక వృత్తాంతం.

******************
🏵🏵🏵

శ్రీ శైల మల్లికార్జున💐💐💐

మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను అచ్చులు,హల్లులతో ఎలా స్తుతించాడో
చూడండి. ఇలాగే పాల్కురికి సోమన్న కూడా అద్భుతంగా వ్రాశారు.
మీ అందరికోసం ఈ శుభదినాన చదవండి.

'అ'ఖిల లోకాధార
'ఆ'నంద పూర
'ఇ'న చంద్ర శిఖి నేత్ర 
'ఈ'డితామల గాత్ర
'ఉ'రు లింగ నిజరూప
'ఊ'ర్జితా జలచాప
'ఌ'లిత తాండవకాండ
'ౡ'నికృతా జాండ
'ఏ'కైక వర్యేశ
'ఐ'క్య సౌఖ్యా వేశ
'ఓం' కార దివ్యాంగ 
'ఔ'న్నత్య గుణ సంగ
'అం'బికా హృదయేశ
'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ
'ఖ'ల జలంధర హరణ
'గ'ల నాయక విధేయ
'ఘ'న భక్తి విజేయ
'జ'శ్చూల కాలధర
'చ'రిత త్రిశూల ధర
'ఛ'ర్మ యాధ్వస్త
'ఞ'న గుణ ధళ ధీర
'ట' త్రయాది విదూర
'ఠ' ప్రభావాకార
'డ'మరుకాది విహార
'ఢ' వ్రాత పరిహార
'ణ' ప్రవాగార
'త'త్త్వ జోనేత
'థ'వి దూర జవ పక్ష
'ద'వన పాలన దీక్ష
'ధ'రణీ థవోల్లీడ
'నంది కేశారూఢ
'ప'ర్వతీశ్వర లింగ
'బ'హుళ భూత విలాస
'భ'క్త్వ హృద్వ నహన
'మం'త్రస్తుతోధార
'య'క్ష రుద్రాకార
'ర'తిరాజ బిన హంస
'ల'లిత గంగోత్తంస
'ళ'మా విదవ్రంశ
'వ'రద శైల విహార
'శ'ర సంభ వాస్ఫార
'ష'ట్తింశ తత్త్వగత 
'స'కల సురముని వినుత
'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః.

పూర్తి సేకరణ.

ఓ కొడుకు, .కోడలు.-కథ .

ప్రతి ఒక్కరూ చదవవలసిన వాస్తవ కథ ........ప్రతి కొడుకు,తల్లి, అత్త, కో్డలు, మనవడు, భార్య, భర్త,,,,,ఒక్కరికేంటి అందరికి కనువిప్పు కలిగించే వాస్తవ కథ.........

ఓ కొడుకు, .కోడలు....వారి పుత్రుడు...వారితో పాటు నాన్నమ్మ ఒకే ఇంట్లో ఉండేవారు.
ఆ కోడలికి అత్తగారి ని ఎలాగైనా వేరుగా ఉంచాలి అన్న ఆలోచన ఉండేది.... ఎన్నో సార్లు భర్తను అడిగి చూసింది. కానీ ఆ కొడుకు దానికి ఒప్పుకోలేదు.....రోజూ ఏదో వంక తో భర్తను సాధించసాగింది.

ఒక రోజు భర్తతో మంచిగా ఉంటూనే..... ఇలా అన్నది......

"మీ అమ్మ ను పక్కనే ఉన్న ఇంట్లో ఉంచి..... సమయానికి ఆమెకు వేడి వేడిగా వేళకు చేసి
పంపుతాను. ఆమె కూడా విశ్రాంతి గా, ప్రశాంతంగా ఉంటుంది కదా! ఒక్కసారి ఆలోచించండి "

ఏదో చికాకులో ఉండి " సరేలే చూద్దాం " అన్నాడు భర్త... ఇదే అదనుగా అత్త గారికి ఇంటికి పక్కనే ఓ ఇంటిని చూసి పంపడానికి రెడీ చేసింది ఆ కోడలు......

ఆ తల్లి కూడా కొడుకు మాటను కాదు అనలేక...తన వల్ల ఇద్దరి మధ్య గొడవ ఎందుకని ఆ తల్లి అంగీకరించింది....కానీ కొడుకు కు తెలియకుండా ఆ కోడలు ఆ అత్తగారికి ఓ షరతును పెట్టింది.

అదేంటంటే....అత్తగారికి ఓ పళ్ళెం ఇచ్చి భోజనానికి, టిఫినుకు ఆ పళ్ళెం తీసుకుని అత్తగారు రావాలి....

పాపం ఆ తల్లికి ఇది అవమానంగా అనిపించింది... అడుక్కుతినే దానిలా అలా వెళ్ళడం బాధగా అనిపించినా కొడుకును ఇబ్బంది పెట్టలేక అలాగే చేసింది ఆ అత్తగారు.

ఇది మనవడికి చాలా బాధగా అనిపించేది .... నాన్నమ్మ అలా దూరంగా ఉండటం ఆ పసి మనసుకు నచ్చలేదు. అలా తిండి కోసం నాన్నమ్మ రావడం అస్సలే నచ్చలేదు.... వాళ్ళ అమ్మకు తెలియకుండా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడు.......

అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.... మనవడికి మంచి ఉద్యోగం వచ్చింది ....
మొదటి జీతం రాగానే తన తల్లికి ఓ వెండి పళ్ళెం కొని తీసుకుని వొచ్చాడు...

తల్లి ఆనందంతో ....నా మీద ఎంత ప్రేమరా! నీకు .... నాకోసం వెండి పళ్ళెం తెచ్చావా! నువ్వే రా నా కొడుకంటే" అంటూ కొడుకును మెచ్చుకుని మళ్ళీ ఇలా అంది.......

ఇంట్లో ఎవరికీ వెండి పళ్ళెం లేదు... మరి నాకే ఎందుకు తెచ్చావురా కన్నా! " అని అడిగింది.

దానికి ఆ కొడుకు ఇలా జవాబు ఇచ్చాడు....

" అమ్మా! రేపు నాకు పెళ్ళి అవుతుంది.. నువ్వు కూడా వేరేగా ఉండాల్సి వస్తుంది కదా! అప్పుడు... నా పెళ్ళాం నీకు కనీసం స్టీలు పళ్ళెం కూడా ఇవ్వడానికి ఒప్పుకోక పోవచ్చు ....అందుకే ఇప్పుడే వెండి పళ్ళెం కొనేశాను....రేపు నువ్వు ఏ ఆకు లోనో అన్నం తినడం నేను చూడలేనమ్మా!".... కనీసం మా అమ్మ వెండి పళ్ళెంలో అడుక్కుంటుందన్న తృప్తి నాకు ఉండాలి కదమ్మా!"

కాబట్టీ... మనము ఇతరులకు చేసే మంచైనా, చెడైనా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది....

తల్లిదండ్రులను భారంగా భావించి మీరు తప్పు చేస్తూ.....మీ పిల్లలకు కూడా నేర్పకండి......

హిందూ సనాతన సంప్రదాయాలు పాటించండి .... గౌరవించండి...
**************

రామాయణమ్. 44

.
మంధర మాటల ప్రభావం తీవ్రంగా పనిచేస్తున్నది ! కైక మీద.
ఆమె ఆంతరంగంలో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నయి.
.
రాముడు రాజయితే? ఆ ఊహే భరింప శక్యంకాకుండా ఉన్నది ! తనకొడుకు అడవులుపట్టి పోవాల్సిందే! తాను కౌసల్యకు దాస్యం చేయాల్సిందే ! కౌసల్యను తాను ఎంత చిన్నచూపు చూసిందో ! ఇప్పుడు అంతకు అంత అనుభవించాలి .ఇంత బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఈ విధంగా ! ఆ తలపు తట్టుకోలేకపోతున్నది . జరగబోయే అవమానాలు తలచుకొని ఆమె గుండె చెదిరింది.తన ఉనికి ప్రశ్నార్ధకంగా మారబోతున్నది .
.
 ఇన్ని ఆలోచనలు ఆమె మానసాన్ని నిలువునా దహించి వేస్తున్నాయి !
.
 చీకటి ఆవరించి నక్షత్రాలు లేని ఆకాశము వలే ఉన్నది ఆమె అంతరంగము ! .
.
ఉవ్వెత్తున లేస్తున్న ఆలోచనలు ఆవిడను కుదురుగా ఉండనీయటంలేదు ! నేల మీద పడి దొర్లుతున్నది కైక!.
పగపట్టిన పాములాగ బుసలుకొడుతున్నది ,రుసరుసలాడుతున్నది ,వేడివేడి నిట్టూర్పు సెగలు ఆవిడ శరీరాన్ని కాల్చివేస్తున్నాయి!.
.
రాముడి అభిషేక వార్త బయట అందరికీ తెలిసిపోయింది.
.
 కైకకు తానుగా చెప్పకపోతే బాగుండదన్న ఉద్దేశంతో ఆవిడకు తెలియచేయాలని అంతఃపుర ప్రవేశం చేశాడు దశరధమహారాజు.
.
ఆశ్చర్యకరంగా అక్కడ కైక లేదు! తాను వచ్చేసమయానికి సర్వాంగసుందరంగా అలంకరించుకొని తీయగా తనను పలుకరించే ఇల్లాలు అక్కడలేదు ,ఆవిడ పెంపుడుచిలుకలు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాయి ! కైకలేని ఆ ఇల్లు చంద్రుడు,నక్షత్రాలు లేని ఆకాశంలా ఉన్నది.
.
ఎక్కడికి వెళ్ళింది కైక ? పరిచారిక లను అడిగాడు దశరధుడు.
వారు భయంభయంగా అత్యంత వినయవిధేయతలతో "మహారాజా కైకమ్మ తీవ్రమైన కోపంతో కోపగృహంలోనికి వెళ్ళారు" అని తెలియజేశారు .
.
ఆవిడ కనపడనందుకే ఆయన మనస్సును విచారం ఆవరించింది ఇప్పుడు ఆవిడ కోపగృహప్రవేశం ఆయన మనస్సును విషాదంతో నింపింది!.
.
ఆవిడ ఉన్నచోటుకు మెల్లగా వెళ్ళాడా వృద్ధనరపతి !
.
అక్కడ పెరికివేసిన లతలా! బంధింపబడిన ఆడులేడిలా! క్రిందకు పడిపోయిన దేవకాంతలాగ,తన ప్రాణేశ్వరి, యువతి అయిన కైక మూర్తీభవించిన శోకదేవతలా శోభావిహీనంగా కనపడ్డది.
.
ఆ స్థితిలో ఆవిడను చూసిన ఆయన మనస్సు వణికిపోయింది ,తానుకూడా క్రింద చతికిలబడి మృదువుగా ఆవిడ చేయి తన చేతిలోనికి తీసుకొని మెల్లగా నిమురుతూ ,ఏమి కష్టము వచ్చింది దేవీ నీకు ? ఆరోగ్యం సరిగాలేదా ! ఇప్పుడే రాజవైద్యులను పిలిపిస్తాను .
.
నీవు ఎవరికైనా ప్రియము చేకూర్చదలిస్తే చెప్పు ! ఇప్పడే తీరుస్తాను.
.
నీకెవరైనా అపకారం తలపెట్టారా చెప్పు! తక్షణమే దండిస్తాను .
.
నీకన్నా నాకు ప్రియమైనది ఏదీలేదు ! నేను నీవాడిని ! నీ ఆజ్ఞానువర్తిని .ప్రాణాలుఫణంగా పెట్టి అయినా నీ అభీష్టము నెరవేరుస్తాను. నా పుణ్యము మీద ఒట్టు వేసి చెపుతున్నాను అంటూ పరిపరి విధాలుగా ప్రాధేయపడ్డాడు దశరధమహారాజు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*******************

పోత‌న త‌ల‌పులో ...(33)

మొక్షసాధ‌న‌కు సుల‌భ మార్గం
భాగ‌వ‌త ప‌ఠ‌న‌మ‌ని తెలిపే ప‌ద్యం

                        ***
నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్,
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"
   
                        ***

జ్ఞానవంతుడా! వేలకొద్దీ వేదాలను ఎంత చదివినా మోక్షసంపదలు అందుకోడం అంత సుళువు కాదు. అదే భాగవతము, అనే వేదాన్ని పఠిచటం ద్వారా అయితే మోక్షం అతి సుళువుగా దొరుకుతుంది
********************

*ప్రకృతి... నియమాలు.....*


*ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు...*

 *1. ప్రకృతి యొక్క మొదటి నియమం...*

👉 ఒక వేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది.
👉 అదేవిధంగా మనసును మంచి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి.

*2. ప్రకృతి యొక్క రెండవ నియమం...*

👉 ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు.
👉 సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు.
👉 దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు.
👉 జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు.
👉 భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు.
👉 భయస్తులు భయాన్నే పంచగలరు.

*3. ప్రకృతి యొక్క మూడవ నియమం...*

👉 మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే...

👉 భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి.
👉 ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది.
👉 మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.
👉 ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది.
👉 నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది.
👉 అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది.
👉 దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది.
👉 సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది...

*సర్వేజనాః స్సుఖినోభవంతు*
*****************

దర్గాలంటే ఏంటి....



ఇప్పట్లో బాగా చదువుకున్న PHD... MBBS... M-TECH ...చేసిన వారికి... ఆయా కోర్సులకు సంబంధించి "డిగ్రీ పట్టా"లు లాంటివి అందజేస్తుంటారు..!!
అలాగే,
👉మన భారతీయులు "ముస్లిం" ఆక్రమణ దారుల పాలనలో ఉన్న సమయంలో... ఎవరైనా ముస్లిం సైనికుడు గానీ... సైనికాధికారి గానీ హిందువులను కనీసం "100 మంది"కి పైచిలుకు... విచ్చలవిడిగా హత్యలు చేసి ఉంటే అటువంటి సైనికుడ్నీ... ఆ అధికారినీ... ఆ ముస్లిం రాజులు "హజ్రత్" అనే బిరుదుతో సత్కరించి... ఆ రాజు ఆస్థానంలోని ఏదైనా ప్రదేశానికి "మెజిస్ట్రేట్"గా నియమించి అక్కడి పన్ను వసూళ్ళూ...పాలనా వ్యవహారాలను వారికందించేవారు..!!

అందుకే మీకెక్కడైనా దర్గాలు కనిపిస్తే ఒకసారి చూడండి...అక్కడ వాళ్ళ పేరుకు ముందు..."హజ్రత్" అని రాసుకుంటుంది..!!
ఉదాహరణకు : హజ్రత్ సయ్యద్... హజ్రత్ హుస్సేని ఆలం... హజ్రత్ అలీ ఖాన్.. ఇలా దర్గాలకు పేర్లుంటాయి..!!

ఈ "హజ్రత్" లు స్థానిక హిందూ యువతులపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడేవారు.. "చిన్న చిన్న ఆడ పిల్లల్ని" ఇప్పుడు జరుగుతున్నట్లుగా అత్యాచారం చేసి హత్య చేసేసే వారు... ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యుల ముందే ఇంట్లోని ఆడపిల్లల్ని ఎత్తుకుపోయేవారు... వీరికి ఎవరిమీదైనా కన్నుబడితే...ఆ అమ్మాయి వీరు పిలిస్తే తప్పక వెళ్ళాల్సిందే... లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది..!!
ఇంకా కొత్తగా పెళ్ళైన జంట వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాల్సి వొచ్చేది... అలా ఆశీర్వాదాల కోసం వెళ్ళినపుడు... పెళ్ళి కూతురు ఎవరైనా... ఈ "హజ్రత్"లకు నచ్చితే... అటువంటి ప్రతీ అమ్మాయి... ఒక్కతే పూజ పేరుతో మొదటి రాత్రి అతనితో గడపాల్సి వొచ్చేది..!!
అంతే కాకుండా ఆ ప్రాంతంలో వీరు అవసరమైనప్పుడల్లా విచ్చలవిడి వసూళ్ళకూ...దోపిడీలకూ పాల్పడుతూ ఉండేవారు..!!

ఈ "హజ్రత్"లు చనిపోయినపుడు ఆ ఊర్లో వీరికి సమాధి కట్టి... దాన్ని " హజ్రత్ సయ్యద్" దర్గా... "హజ్రత్ హుస్సేనీ ఆలం దర్గా" అని వారి అసలు పేరుతో కలిపి... దర్గాలు నిర్మించేవారు..!!
అలా ఏర్పడ్డవే ఈ " ముస్లిం దర్గాలు"..!!

ఆ ప్రాంతంలోని వారందరూ ఆ "దర్గా" కి "దినా"లనాడు డబ్బులు సమర్పించడం.. పూజలు చెయ్యడం లాంటివి చేసి... ఆ "హజ్రత్ దర్గాల"పైన తమ భయభక్తులూ..గౌరవ మర్యాదలూ చాటుకునే వారు..!!
👉ఇదే పద్ధతి ఇప్పటికీ భారతదేశంలో చాలా చోట్ల "ఉత్తర..దక్షిణ భారతంలో" కొత్తగా పెళ్ళైన జంట... ఏదైనా కోరికలున్న వాళ్ళు మొక్కులు మొక్కుకుంటూ... అక్కడికి వేళ్తే తమ కోరికలు నెరవేరి..తమకు అంతా మంచే జరుగుతుందని భ్రమ పడుతూ ఉంటారు..!!
👉 "నిజాముద్దీన్ దర్గా"... దాని పేరుతో ఉన్న స్పెషల్ ట్రైన్ గురించి (నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్) మీకు తెలియదా?..
ఈ దర్గాలకు వెళ్ళడం అచ్చంగా " #బానిసత్వ_లక్షణం ". హజ్రత్ లు అంటే ఉన్న భయానికి నిర్వచనం లాంటిది..!!
ఇది దర్గాల అసలు చరిత్ర..!!

దర్గా గురించి తెలుసుకున్నాం కనుక ఇప్పుటి నుండి దర్గాలకు వెళ్ళడం మానుకుందాము. దర్గాలో ఉండెది అజ్రత్ లు అంటే మన పూర్వీకులను హత్యలు, మానభంగాలు చేసిన రాక్షసులు.

ఈ విషయాన్ని మన హిందువులందరికీ తెలియజేద్దాం.

ఇంకా సెక్యులర్ ముసుగులో మిమ్మల్ని మోసం చేస్తుంటే, మీరు మోసపోతూ ఇతరులు మోసపోతూ ఉంటే మీరు చూస్తూ ఉంటాం అంటే మీ ఖర్మ!!! మిమ్మల్ని దేవుడు కూడా బాగుచేయలేడు...😏

దేవో దుర్బల ఘాతుకః

జై హింద్ 🚩🚩 ➖ వందేమాతరం ✊️
ఇది వాట్స్ అప్ సేకరణ 

#శివామృతలహరి శతకం

.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||

గతినీవంచు తలంచి కొల్చితిని భర్గా ! భక్తి తాత్పర్య సం
యుత చిత్తమ్మున నీ పదాబ్జముల - సాయుజ్యంబు గాంక్షించి ; దు
ర్గతి వాల్జేసి తొలంగినన్ విడతునే? కాటన్ చిత్రాభస్మమై
శితికంఠా ! తమి నీయెదన్ కులికెదన్ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;
నువ్వే దిక్కని నమ్ముకొని నిరంతరం నీ నామ జపం చేస్తూ
మోక్షం ప్రసాదించమని భక్తి పూర్వకమైన హృదయంతో నీ
 పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నాను. ఒకవేళ
నా ఆశను అడియాశను చేసినా, నిన్ను మాత్రం విడిచిపెట్టను.
నేను  మరణించాక, స్మశానం లో కాలి బూడిడైన తర్వాత కూడా,
నువ్వు ఛాతీ మీద ధరించే విభుదిగా మారి నీ ఎద పై
సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటానయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
( శివుడు స్మశానంలో ఉంటాడని ప్రతీతి అందుకే స్మశానాన్ని రుద్ర భూమి అని కూడా అంటారు.)
*******************

దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు

'నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది' అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇక నిద్రలేవగానే గానీ, ఉదయమే బయటికి వస్తూ గాని ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతుంటారు. అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు, నిద్రలేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు. చేతి మొదట్లో శ్రీమహావిష్ణు, మధ్యలో సరస్వతీదేవి, చివరన లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అరచేతిలో వారిని దర్శించిన తరువాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు.

దృష్టి దోషం, చెడు చూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళు గా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్ల తాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపిన నీళ్లు, ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ, తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ, కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ, చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క, పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క, మెడలో తావీజు... పచ్చిమిరపకాయలు, ఈత ఆకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు.

ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే, ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు, దిష్టి తగిలిన వాళ్లు ఇబ్బందిపడుతూనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు.

హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం.. కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటివి చేస్తారు.

గృహాలు, దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలి?
దిష్టి, దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి, వ్యాపారల మీద, పంటపొలాలు, గృహాలు, కోళ్ళఫారం.. వంటి వాటిపై కూడా ఉంటాయి. అంటే సకల జీవరాశులకు, పొలాలు, వాహనాలు, గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండులతో దిష్టి తీయడం మంచిది.

శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గానీ, గోమయంతో గానీ దుకాణాలను, ఇళ్లను శుభ్రం చేయాలి. అలాగే దుకాణాలపై భాగాన కానీ, పూజాస్థలంలో గానీ గుమ్మడి పైభాగంలో కొంతభాగంగా కోసి, అందులో పసుపు, సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది.

ఇలా టెంకాయతో గానీ, మన్ను, ఉప్పు. మిరప, ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి, టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగులకొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్లై ఇంకా సంతానం కలగనివారు గుమ్మడి కాయ పగులగొట్టరాదు.

ఇంకా చెప్పాలంటే.. ప్రతిరోజూ సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్ళు చల్లి, ఎండాకా లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాకా, ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారవృద్ధి కలుగుతుంది.

బాల గ్రహ దోషముల నివారణకు..
పిల్లలకు దిష్టి తీసే సమయంలో, పళ్లెంలో నీళ్లు పోసి, అందులో కుంకుమ వేసి, మరొక పళ్లెం తీసుకుని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నము ముద్దలు కలిపి అందులో వేసి, దిష్టి తీసి, ఇంటికి దూరంగా బయట పోయాలి. ఇలా చేస్తే బాల గ్రహ దోషములు పోవును...
మీ...
*చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *
లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయ (భువనేశ్వరి పీఠం) పెద్దాపురం,
సెల్ :- 9866193557
**********************

#సార్ధకత*🌻

 *ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక మర్రి పండు కనిపించింది. మర్రిపండుని నోట కరుచుకుని ఎగురుతుండగా అది పక్షి నోటి నుండి జారి పడింది. మర్రి పండు పడిన ప్రదేశం ఒక గ్రామం ప్రక్కన ఉన్న మైదానం. మర్రిపండు మైదానంలో పడిన రోజునే బలమైన గాలులతో వర్షం కురిసింది. గాలులకు మట్టి రేగి మర్రిపండును కప్పేసింది.* 

*రెండు రోజుల తరువాత మర్రి పండు విచ్చుకుని అందులో ఉన్న గింజలు బయట పడ్డాయి* . *మర్రి గింజలు వాటిలో అవి మాట్లాడుకున్నాయి. ఒక గింజ సంతోషంగా “మన పక్షాన అదృష్టం ఉండబట్టే మనమింకా బ్రతికి ఉన్నాము. లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణం అయ్యేవారము” అంది.*  

మరో గింజ “నిజమే..... పక్షి కడుపులోకి వెళ్ళి ఉంటే చచ్చేవాళ్ళం. ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు” అని చెప్పింది. మిగతా గింజలు కూడా అవునవును అని సంబరపడ్డాయి.*  

*మరో రెండు రోజులు గడిచేసరికి ఒక గింజ నుండి మొలక వచ్చింది. ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గెంతులు వేసి “మీరంతా చూడండి. నాకు మొలక వచ్చింది” అని చూపించింది.*  

*మొలకను చూసిన మిగతా గింజలు “ఆ మొలకను లాగి పడెయ్యి. మొలకెత్తావంటే నీ రూపం మారిపోతుంది. భూమి మీద కొత్త రూపంతో పెరుగుతావు. ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు పడాలి. కొన్నిసార్లు మనుషులు మొక్కల్ని పీకి పడేస్తారు. మరికొన్ని సార్లు పశువులు తొక్కి చంపుతాయి. లేదా నమిలి మింగుతాయి. ఇవన్నీ దాటుకుని మొక్కగా పెరిగాలి. ఒకవేళ ఎదిగావనుకో.. , కావలసినంత నీరు అందాలి. అలా నీరు దొరకకపోయినా ఎండిపోయి చస్తావు. అన్ని కష్టాలు పడలేవు... కానీ మాలాగా గింజ రూపంలోనే ఉండిపో. మనమంతా హాయిగా కలసి గడుపుదాం” అన్నాయి.* 

*మిగతా గింజల మాటలు ఆలకించింది కానీ మొలక వచ్చిన గింజ జవాబు చెప్పలేదు. తన మొలకను వేరు చేయలేదు. కొన్ని రోజులకు మర్రి మొక్క భూమి మీదకు వచ్చి ఎదగడం* *ప్రారంభించింది. దాని కాండం నిటారుగా ఎదిగింది. కొమ్మలు ప్రక్కలకు పెరిగాయి. ఎన్నో ఆకులు మొలిచాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పెద్ద వృక్షంగా ఎదిగింది.*  

*ఎండ వేడి నుండి రక్షణ కోసం రైతులు, బాటసారులు మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. పశువులు, జంతువులు రాత్రి వేళల్లో, వర్షం కురిసినప్పుడు చెట్టు క్రింద తల దాచుకునేవి. పక్షులు చెట్టు మీద గూళ్ళు కట్టుకున్నాయి. మర్రి చెట్టు నిత్యం ఎందరికో ఆశ్రయం ఇస్తుండడం వలన అక్కడ సందడిగా ఉండేది.* 

*అప్పుడప్పుడు వైద్యులు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి మర్రి బెరడు, పాలు , ఆకులు, మొగ్గలు కోసుకుపోయే వారు. వాటిని వైద్యం కోసం ఉపయోగించేవారు.* *మైదానానికి ఆడుకోవడానికి వచ్చే పిల్లల్లో కొందరు మర్రి ఊడలతో ఊయల ఊగి ఆనందించేవారు. అవన్నీ చూసి మర్రిచెట్టు సంతోషించేది.*  

అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి...

*ఒక రోజు భయంకరమైన తుపాను వచ్చింది. చాలా బలమైన గాలులు వీచాయి. ఏకధాటిగా వానలు కురిసాయి. తుపాను ధాటికి ఎన్నో వృక్షాలు నేలకొరిగాయి. అప్పుడే మర్రి వృక్షం కూడా నేలకు ఒరిగింది. మర్రి వృక్షం అలా* *ఒరిగిపోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. మర్రిచెట్టు క్రింద, కొమ్మల మీద నివసించే పక్షులు , జంతువులు మూగగా రోదించాయి.*    

*మరికొన్ని రోజులకు మర్రి చెట్టు పచ్చదనం తగ్గిపోగానే గ్రామస్తులు గొడ్డళ్లతో నరికి చెట్టు కొమ్మలను, కాండాన్ని వంట చెరుకుగా, గ్రుహోపకరణాలుగా వాడుకున్నారు. కలప మోసుకు వెళుతున్న వారు “ బ్రతికినప్పుడే కాకుండా చనిపోయాక కూడా ఉపయోగపడిందని” చెప్పుకున్నారు.*  

*స్వార్ధంతో గింజలుగా భూమిలోనే ఉండిపోయిన మిగతా గింజలు తమ సోదరుడికి లభిస్తున్న ప్రశంసలు విని సంతోషించాయి. మరో వైపు సిగ్గుపడ్డాయి.* 

*వాటిలో ఒక గింజ “మనమంతా దిద్దుకోలేని పొరపాటు చేసాము. ఎలా పుట్టామో అలాగే మిగిలిపోయాము. ఎవరికీ ఉపకారం చేయలేకపోయాము. మనల్ని గుర్తుపెట్టుకునే మంచి పని ఒక్కటి కూడా చేయలేకపోయాము.   

పుట్టిన ప్రతి జన్మకూ సార్ధకత ఉండాలి. మన జన్మ మాత్రం వృధా అయింది. పక్షి నోటి నుండి జారిపడినందుకు మనం గొప్ప అవకాశం పొందినప్పటికీ వృధా చేసుకున్నాము . మన సోదరుడు మాత్రం మంచి పని చేసాడు. మరణించి కూడా జనం గుండెల్లో, వారి ఇళ్లల్లో నివాసం ఏర్పరుచుకున్నాడు. జీవితమంటే మన సోదరుడిదే” అంది.* 

*అది విన్న మరొక మర్రి గింజ “కొందరు మనుషులు కూడా పిరికితనంతో బ్రతుకుతారు. ఇప్పుడు మనం చేసిన తప్పే చేస్తుంటారు. ఇతరులకు మేలు చేసే జీవితం వలన తృప్తి కలుగుతుందని తెలుసుకోలేక జీవితాన్ని వృధా చేసుకుంటారు... ప్రక్కవారికి చేసే సేవల వలన చిరస్థాయిగా పేరు నిలుస్తుందని తెలుసుకుని ఒకరికొకరు సాయపడుతూ బ్రతికితే ఎంతో బాగుంటుంది” అంది.* 

జరిగిపోయిన దాన్ని వెనక్కుతీసుకురాలేము . కాబట్టి ఈ జన్మకు ఇంతే” అని బాధపడ్డాయి.*    

కానీ మనకు అవకాశం ఉన్నది, మారదాం, పుట్టినందుకు జన్మను సార్థకత చేసుకుందాం ....

🍁🍁🍁 🍁🍁🍁
*********************