18, అక్టోబర్ 2020, ఆదివారం






 

నీతి కథలు

 💦 *నీతి కథలు - 179*


*గాడిద- నక్క*


అనగనగా ఓ గాడిద. దాని కంఠం వినసొంపుగా ఉండకపోవచ్చుగాని, దానికి సంగీతశాస్త్రం గురించి బాగా తెలుసు. ఆ సంగతి అలా ఉంచితే, పొద్దంతా చాకలి మూటలు మోసి మోసి, పొద్దుపోయాక దోసపాదులుండే మెరకల మీదికి పోతుండేదది. అక్కడ కడుపు నిండా దోసాకులూ,కాయలూ మేసి వస్తుండేది. మెరకల మీదికి పోయినప్పుడే ఓ నక్కతో దానికి స్నేహం కుదిరింది.


ఒకరోజు పున్నమి, ఆవెన్నెలలో నక్కతో గాడిద ఇలా అంది ‘ఇవాళ నీ ముందు పాడాలనిపిస్తోంది.’‘కొంపదీసి పాడేవు. ప్రాణాలు పోతాయి. వద్దు.’ అన్నది నక్క.‘దొంగతనంగా మేతమేసి పోయేవాళ్ళం. గుట్టుగా వచ్చి గుట్టుగా పోవాలి. పాటలూ ఆటలూ వద్దు. ఒకవేళ నువ్వు పాడేవనుకో, ఆ పాటకి రైతు మేల్కొంటే అంతేసంగతులు. ఇద్దరికీ బడితెపూజ అయిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ. వూర్కో’ అంది అంతలోనే.‘అయినా నీ గొంతులో పాటేంటి చెప్పు? నవ్వుతారెవరయినా’ అంది. అంతే! ఆ ఆ మాటకి కోపం వచ్చింది గాడిదకి.‘నా గొంతులో పాటేంటంటావా? నీకేం తెలుసు నా పాటెలాంటిదో? ఒఠ్ఠి అడవి జంతువ్వి. ఎంతసేపూ తిండి తప్ప మీకో పాటా మాటా ? ఛీఛీ’ అసహ్యించుకుంది నక్కని.‘సంగీతం నీకంత బాగా తెలుసా?’‘చాలా బాగా తెలుసు.’ అంది గాడిద. సప్తస్వరాలను పలికింది. తాళ భేదాలు చెప్పింది. వివిధ రాగాలు, గమకాలు గురించి గుక్క తిప్పుకోకుండా దీర్ఘోపన్యాసం ఇచ్చింది.


‘ఇప్పుడు చెప్పు. నా పాట వింటావా? వినవా?’ అడిగింది.తప్పదు, పాడి తీరుతుంది గాడిద. పాట వినడమే ప్రమాదం అనుకుంటే పడుకున్న రైతు మేల్కొంటే ఇంకా ప్రమాదం అనుకుంది నక్క. అయినా తెలివిగా ఇలా అంది.‘ఓ పని చేస్తాను. నేను వె ళ్ళి అదిగో అక్కడ దూరంగా నిలబడతాను. నువ్వు అప్పుడు పాడు. ఒకవేళ రైతు లేస్తే అరిచి చెబుతాను. ఆపేయ్‌.’ అంది నక్క.‘అలా అన్నావు బాగుంది. వెళ్ళిరా’ అంది గాడిద. అదే అదనుగా నక్క అక్కణ్ణుంచి తప్పుకుంది. గాడిద పాట ఎత్తుకుంది. పెద్దగా ఓండ్ర పెట్టసాగింది. ఎంతకీ ఆపదు. దాంతో రైతుకి మెలకువ రానే వచ్చింది. మెలకువతో పాటు బంగారంలాంటి నిద్రను చెడగొట్టినందుకు గాడిద మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంతో పెద్ద దుడ్డుకర్రను పట్టుకుని వచ్చి, గాడిదను ఇక్కడ అక్కడని గాక ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టాడు.


అయినా అతని కోపం చల్లారలేదు. దగ్గరగా ఉన్న రాతిరోలుని లాక్కొచ్చి, దాన్ని గాడిద మెడకి వేలాడదీశాడు.‘ఇప్పుడు పాడు’ అన్నాడు. వెళ్ళిపోయాడు.తిన్న దెబ్బలకి కుయ్యో మొర్రోమంటూ మెడలో రోలుతో నక్క దగ్గరగా వచ్చింది గాడిద.‘బాగుందే! నీ పాటకి మెచ్చుకుని రైతు మంచి కంఠాభరణాన్నే ఇచ్చాడు.’ అని నవ్వింది నక్క.‘పాడొద్దని చెబితే విన్నావా? పాడతానన్నావు. ఏఁవయ్యావు. పాడిప్పుడు.’ అని ఎగతాళి చేసి, నవ్వుకుంటూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది నక్క.

       💦🐋🐥🐬💦

కృపా వలంబనకరి

 🕉️భిక్షామ్ దేహి కృపా వలంబనకరి మతాన్నపూర్ణేశ్వరి🕉️ 🙏👉అందరికి నమస్కారం   ఇవాళ అన్నపూర్ణాదేవి

గురించి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం 

🕉️ శ్లో||వామే మాణిక్యపాత్రం మధురసభరితం బిభ్రతీం పాణిపద్మే

దివ్యైరన్నైః ప్రపూర్ణాం ద్రుతమణివలయే దక్షిణే రత్నదర్వీమ్

రత్నాంగీం పీనతుంగ స్తనభరనమితాం తారా!రోపసేవ్యాం

వందేపూర్ణేం దుబింబ ప్రతిభట వదినా మంబి కామన్నపూర్ణామ్.

 👉 నవరాత్ర పూజావిధానం ప్రకారం రెండవ "రోజైన విదియనాడు శ్రీ

అన్నపూర్ణాదేవిని పూజిస్తారు.

 సమస్త ప్రాణికోటికి #వనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం

అన్నారు. పార్వతీదేవి సృష్టిం చిన ఒక సంఘటన వలన పరమశివునికి ఎక్కడ భిక్ష దోరకని

సందర్భాన అన్నపూర్ణాదేవి రసపాత్రతో దర్శ నమిస్తుం ది. ఆది$క్షువైన ఈశ్వరునికి భిక్ష

పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. 

 శిష్యులతో కాశీ క్షేత్రమును దర్శిం చిన వ్యాసునికి ఏడురోజుల పాటు ఎక్కడ భిక్ష

దోరకలేదు. దాంతో క్షుద్భాధ భరించలేక వ్యాసుడు తన చేతిలోని కమండలంలోని ఉదకాన్ని

దక్షిణ హస్తం లో పోసుకుని కాశీ నగరాన్ని శపించేందుకు పూనుకుంటాడు.

వెంటనే అన్నపూర్ణాదేవి వృద్ధ వనిత రూపంలో వచ్చి అతనిని వారించి "నీ ఆగ్రహం

ముక్కంటికి ఇంకా కోపం తెప్పించిందా? ఆయినా నీవు క్షుద్బాధతో వున్నావు. నా ఇంటికి రా

మంచి ఆతిథ్యాన్ని ఇస్తాను" అన్నది. అనంతరం వ్యాసుడు శిష్యులతో సహా గంగానదిలో

స్నానం ముగించి 'జనానికి వస్తాడు. కమ్మని 'జనాన్ని శిష్యులంతా ఆరగించారు. 

అప్పుడు వ్యాసుడు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఈరూపంలో వచ్చి తన క్షుద్బాధను, కోపాన్ని

చల్లబరిచి కడుపునింపిందని గ్రహించి, తల్లిని అనుగ్రహించమని ప్రార్థిస్తూవుండగా కాశీ

విశ్వేశ్వరుడు వచ్చి వ్యాసుని కా)పట్నం వదలి పొమ్మని శపిస్తాడు.

 అనంతరం అన్నపూర్ణాదేవి కటాక్షం తో దక్షిణ కాశీగా పేరుగాంచిన దాక్షారామ

*మేశ్వరుని చెంతకు చేరాడు. 

 ప్రపంచ సృష్టి పోషకురాలు అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే అన్నవస్త్రాలకు

లోటుండదు, మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధురభాషణ, సమయస్ఫూర్తి, వాక్శు ద్ధి, 

భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి.

 ఈమెకు నివేదన (దధ్యన్నము.)🙏స్వస్తి 🙏 శ్రీ దత్త శర్మ 8277246156

పరోపకారార్థమిదం

 తరువు లతిరసఫలభార గురుత గాంచు

నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు

డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత

జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!


తాత్పర్యం :

ఎవరికైనా మేలు చేస్తున్నప్పుడు "పరోపకారార్థమిదం శరీరమ్" అంటుంటారు చాలామంది. ఇతరులకు ఉపకారం చేసేందుకే ఈ శరీరం ఉన్నది అని దీని అర్థం వచ్చే ఈ వాక్యం మూలం భర్తృహరి సుభాషితాల్లో కనిపిస్తుంది. పరోపకారం మంచివారి సహజ లక్షణం అంటూ భర్తృహరి చెప్పిన పై పద్యాన్ని ఏనుగు లక్ష్మణకవి తేటతెలుగు మాటల్లో అలా వర్ణించారు.


బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క భావం.

గోధుమనారు

 గోధుమనారు 

*********

గోధుమ గడ్డిని 'జీవం కలిగిన ఆహారం గా ' పేర్కొనవచ్చును. ఇది విటమిన్ "ఈ 'తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా క్లోరోఫిల్ ని అందిస్తుంది . రక్త శుద్దికి, శరీర కణాల పునర్జన్మకు ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది. మెరుగుపరుస్తుంది. కాన్సర్ వ్యాధి పెరుగుడలు నివారిస్తుంది. గోధుమ గడ్డి రసం త్రాగడం వలన శరీరములోని విసపురితాలన్ని బయటికు విసర్జింపబడతాయి. 



గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో 'ఎ' విటమిన్‌, బి కాంప్లెక్స, సి,ఇ,కె విటమిన్లు, కాల్షియం, ఐరన్‌,మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సెలీనియమ్‌,సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసులోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది. దీనిని కేవలం గడ్డి రసం అని తీసిపారేయలేము. గోధుమ మొలకలను న్యూట్రిషనల్‌ రిజర్వాయర్‌గా పౌష్టికాహార నిపుణులు గుర్తిం చారు. గోధుమ గడ్డి ప్రయోజనాలను దిగు వన ఉదహరిస్తున్నాము. 


1. ఎర్ర రక్త కణాల అభివృద్ధి: గోధుమ గడ్డి రసం తాగితే ఎర్ర రక్త కణా లు అభివృద్ధి చెందుతాయి. దీనిలో బి12, ఫోలిక ఆసిడ్‌, ఐరన్‌ పుష్కలంగా ఉండి ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహ దం చేస్తాయి. 


2. అధిక రక్తపోటు నివారిణి: గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు. జీర్ణకోశం లోని కొలెస్ట్రాల్‌ను ఇది కడిగేస్తుంది. 


3. తాల్‌సేమియా రోగులకు మంచిది: ఈ మధ్య జరిగిన శాస్త్ర పరిశోధనలో 'తాల్‌ సేమియా' రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది.

సుభాషితం

*నేటి సుభాషితం* 🌹🌹🙏


*అతిపరిచయా ధవజ్ఞా*

*సంతతగమనా దనాదరో భవతి*

*మలయేభిల్ల పురంథ్రీ*

*చందనతరుకాష్ఠ మింధనం కురుతే||*


అతి పరిచయం వల్ల తిరస్కారం, తెగతెంపులు జరుగుతుంది. రాకపోకలు అతిగా జరిగితే అనాదరణ జరుగుతుంది.  మలయపర్వతం మీద నివసించే భిల్ల స్త్రీలు మంచిగంధపు కర్రల్ని కూడా పొయ్యిలో పెట్టేస్తారు కదా ! 


🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏

[18/10, 7:23 am] +91 98484 59989: ⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

                   *👌సుభాషితము👌*


 *శ్లో.* 


*ధర్మార్ధకామమోక్షాణాం యస్యైకో౬పి న విద్యతే!*

*అజాగళ స్తనస్యేవ తస్యజన్మ నిరర్ధకమ్!!*


ఎవనియందు ధర్మార్థకామమోక్షములలో ఒక్కటియైననూ కనిపించదో అతని జన్మము - మేక మెడయందు ఉండు స్తనములవలె వ్యర్థము.


⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️

మూకపంచశతి

 *జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


🌷 మూకపంచశతి 🌷


🌷 ఆర్యాశతకము 🌷


 🌹 7.

ఐశ్వర్య మిందుమౌలేః


    రైకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతమ్౹


    ఐన్దవ కిశోర శేఖరం


     మైదమ్పర్యం చకాస్తినిగమానామ్౹౹


   🌺భావం:


ఐశ్వర్యము గలవాడే ఈశ్వరుడగును .ఈశ్వరుడు అనగా పాలించు ప్రభువు . అమ్మవారి కి శివుడు ప్రభువు. బ్రహ్మాండమే శరీరముగా కలిగిన అమ్మయే చంద్రశేఖరుని ఐశ్వర్యము. అమ్మవారి వలననే శంకరుని కి ఈశ్వరత్వము ప్రాప్తించినది.బ్రహ్మాండముపైభాగమున ఆకాశమున చంద్రుడుండును.ఆ ద్యులోకమే (నీలాకాశమే)అమ్మవారిశరీరముపైని శిరస్సు.ఆ ఆకాశశిరమున నెలబాలుడు( చంద్రరేఖ) అమ్మవారు  అలంకరించుకున్న శిరోభూషణముగా శోభిల్లుతున్నాడు .అర్ధప్రపంచరూపమైన బ్రహ్మాండమంతయూ అమ్మవారయినట్లే శబ్ధప్రపంచమంతయూ అమ్మవారి స్వరూపమే! వాగ్రూపిణి అయిన అమ్మవారు దివ్య కాంచీ ధామమందు వేదముల తాత్పర్యముగా ,జీవైశ్వర్యైక జ్ఞాన హేతువు గా, బాలేందుమౌళి గా ప్రకాశించుచున్నది.


 🙏మాయాతీతస్వరూపిణీ !నను బ్రోవవే త్రిపుర సుందరీ 🙏


🔱  అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ.  🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ

 హైదరాబాద్:- ఎల్బీనగర్ చింతల్ కుంట లో వర్షం లో ఒక వక్తి ఈత కొడుతు తన గమ్య స్థానం కు పయనం.




ఇంగ్లీష్ అవసరం

 అసలు ఇంగ్లీష్ అవసరం లేకుండా  కడుపు నిండా తిండి తింటున్న దేశాల లిస్టు మీ ముందు పెడుతున్నా ....


చైనా 

రష్యా

జపాన్  

జెర్మని 

ఫ్రాన్స్

నెదర్లాండ్

స్వీడన్ 

డెన్మార్క్ 

టర్కి

ఇస్రాయెల్

ఇటలి

ఈజిప్ట్  

నార్వే 

బ్రెజిల్ 

సౌత్ కొరియా 

నార్త్ కొరియా 

మొరాకో 

పోలాండ్ 

పోర్చుగల్ 

స్పెయిన్ 

తర్కేమేనిస్తాన్ 

ఉజ్బెకిస్తాన్ 

తైవాన్ 

స్లోవేనియా 

స్లోవేకియా 

మంగోలియా 

ఆర్జెంటినా 

యెమెన్ 

ఉగాండా 

చిలి 

కొలంబియా 

సౌది 

ఇరాన్ 

ఇరాక్ 

అజెర్బైజాన్ 

అల్జీరియా 

సిరియా 

గాంబియా 

తుర్కెమెనిస్తాన్

అంగోలా 

బెల్జియం 

భూటాన్ 

కంబోడియా 

థాయిలాండ్ 

క్యూబా 

ఫిన్లాండ్ 

జార్జియా 

కజాకిస్తాన్ ...మొదలగునవి 


బ్రిటిష్ వాడికి ఒకసారి చాకిరి చేసాముకదా  అని జీవితాంతం వాడి బాషకి చాకిరి చేయనవసరం లేదు .. సొంత బాషను తాకట్టు పెట్టనవసరం లేదు  ,


బాష అనేది సంస్కృతిని పరిచయం చేసే మాధ్యమం  .

హసనాంబా దేవి ఆలయం

 ఆ దీపం కొండెక్కదు... నైవేద్యం పాడవదు!

హసనాంబా దేవి ఆలయం... మిగిలిన రోజుల్లో ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ గుడి తలుపులు ఏడాదిలో పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే తెరచుకుంటాయి. ఆ కొద్ది సమయంలోనే అమ్మవారి చల్లని చిరునవ్వు తమపైన పడాలనే ఉద్దేశంతో భక్తులు ఎక్కడెక్కడినుంచో ఇక్కడకు వస్తారు. అదొక్కటే కాదు మరికొన్ని ప్రత్యేకతలూ ఉన్న ఈ ఆలయం కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ఉంది.

మూడు రాళ్లరూపంలో కొలువైన హసనాంబాదేవి అంటే... చిరునవ్వులు చిందిస్తూ, తమ కష్టాలను పోగొట్టే దేవతగా భక్తులు భావిస్తారు. అమ్మ ఇక్కడ ఉండటం వల్లే జిల్లాకు కూడా హసన్‌ అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయం తెరిచిన పది లేదా పన్నెండు రోజులు అయ్యాక గర్భగుడిలో పూలూ, నేతితో పెట్టిన దీపం, నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి ఆ తరువాత తలుపులు మూస్తారు. ఏడాది తరువాత మళ్లీ తలుపులు తెరిచేనాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట. అదే విధంగా పూలు కూడా మొదటిరోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపించడం, నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవ్వకుండా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అని చెబుతారు. ఈ గుడిని 12 వ శతాబ్దంలో కట్టారని చరిత్ర చెబుతున్నా ఎవరు నిర్మించారనే దాఖలాలు మాత్రం లేవు.

స్థలపురాణం...

అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవ్వడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇమ్మంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం మొదలుపెడతాడు. ఇది తెలిసిన శివుడు యోగీశ్వరి అనే శక్తిని సృష్టిస్తాడు. అ శక్తి బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాత్రికలతో కలిసి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ తరువాత సప్తమాత్రికలు కాశీ వెళ్లే ప్రయత్నంలో ఈ హసన్‌కి చేరుకుంటారు. ఈ ప్రాంతం నచ్చడంతో మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోని ఓ కొండలో మమేకం అయితే మరో ముగ్గురు దేవతలు దేవగిరి హోండ అనే ప్రాంతంలో ఉండిపోతారు. బ్రాహ్మి మాత్రం కెంచెమ్మన హాస్కోట్‌ పొలిమేరల్లో ఉందని అంటారు. అలా అప్పటినుంచీ ఈ ఆలయంలో అమ్మవారు మూడు రాళ్ల రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తోందట.

అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్లే ఆమెను హసనాంబాదేవిగా పిలుస్తారట. అయితే... అమ్మ ఇక్కడ వెలసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని ఏడాదికోసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పడంతో అప్పటినుంచీ అదే ఓ ఆచారంలా వస్తోందని ఆలయ నిర్వాహకులు చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ఓ అమ్మవారి భక్తురాలిని ఆమె అత్త చిత్రహింసలు పెట్టేదట. అలా ఓ రోజు ఆ కోడలు గుడికి వచ్చినప్పుడూ అలాగే బాధపెట్టడంతో అమ్మకు కోపంవచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందనీ ఇప్పటికీ ఆ రాయి ఆలయంలోనే ఉందనీ అంటారు. ఏడాదికోసారి మిల్లీమీటరు చొప్పున జరిగే అమ్మ ఆ రాయిని చేరుకున్నప్పుడు కలియుగం అంతమవుతుందనేది స్థానికుల నమ్మకం. అదేవిధంగా మరోసారి నలుగురు దొంగలు ఈ ఆలయంలోని అమ్మవారి నగలు దొంగిలించేందుకు వచ్చి రాళ్లుగా మారిపోయారట. ఈ రాళ్లను కూడా స్థానికంగా ఉండే కల్లప్ప గుడిలో చూడొచ్చని అంటారు.

శివలింగాలూ...

అమ్మ చెప్పినట్లుగానే ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మొదటి గురువారం నాడు ఈ ఆలయాన్ని తెరచి బలిపాడ్యమి మర్నాడు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం, పూలు, దీపం సమర్పించి మూసేస్తారు. ఆలయం తెరచిన రెండోరోజు నుంచీ అమ్మను దర్శించుకునేందుకు వేలాది భక్తులు వివిధప్రాంతాల నుంచి తరలి వస్తారు. ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే నిత్యపూజల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అదే విధంగా 101 శివలింగాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవచ్చు....

ఈ ఆలయం హసన్‌ జిల్లాలో ఉంది. విమానంలో రావాలనుకునేవారు మంగళూరు వచ్చి అక్కడి నుంచి ఆలయానికి క్యాబ్‌, బస్సుల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా రావాలనుకునేవాళ్లు మైసూర్‌, బెంగళూరు, మంగళూరు, చిక్‌మగళూరు... ఇలా ఎక్కడినుంచైనా రావొచ్చు. రైల్లో వచ్చేవారు అర్సికెరె స్టేషన్‌లో దిగి... అక్కడి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి బస్సులో చేరుకోవచ్చు.