14, జులై 2025, సోమవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 44

 

 ప్రశ్న పత్రం సంఖ్య: 44


కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  


క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.


1) క్రిందిది పంచభూతాలలో లేదు


i ) నీరు 


ii ) గాలి 


iii ) పొగ 


v ) అగ్ని 


2) చందమామ రావే జాబిల్లి రావే వ్రాసింది


i ) దాశరధి రంగాచార్య


 ii ) త్యాగరాజు 


iii ) పెద్దన 


iv ) శ్రీ తాళ్ళపాక ఆన్నమాచార్య


3) భగవత్గీత వీటి సారం అంటారు 


i )పురాణాల 


 ii ) ఉపనిషతుల


 iii ) వేదాల   


iv ) సాంప్రదాయాల


4) ఇంట గెలిచి ___ ;గెలవాలి అంటారు


i ) గచ్ఛ ii ) ఊళ్ళో


 iii ) రచ్చ  


iv ) రచ్చబండ 


5) కావ్యేషు --------- రమ్యం


i ) బూటకం 


ii ) ప్రబంధం  


iii )నవల  


iv ) నాటకం 


6) 180 డిగ్రీలు వున్నదానికే ________ అని పేరు


i ) లంబరేఖ 


ii ) సరళరేఖ 


iii ) ముళరేఖ 


|iv ) ఈ మూడు 


7) మనదేశంలో గృహావసరాలకు సరఫరా చేసె విద్యుత్


i )110V ఉంటుంది 


ii ) 220V ఉంటుంది 


 iii ) 250V ఉంటుంది 


iv ) 300V ఉంటుంది


8) ఇది పురాణం కాదు


i ) మార్కండేయ పురాణం 


ii ) అగ్నిపురాణం


 iii ) వరుణ పురాణం 


iv ) వాయు పురాణం 


9) అన్నదమ్ముల ఆస్తి పంపకాల వివాదాలను ఈ కోర్టు పరిష్కరిస్తుంది 


i ) సివిల్ కోర్టు ,  


 ii ) క్రిమినల్ కోర్టు 


.iii ) కన్స్యూమర్ కోర్ట్ ,


iv ) ఫామిలీ కోర్టు 


10) వడ్లు ఈ రకము భూమిలో పండుతాయి


i ) మెట్ట భూమి ii ) మాగాణి భూమి iii ) బంజరు భూమి iv ) ఇసుకనేలా 


11) సహధర్మచారిణి అంటే


i ) ధర్మ,అర్ధ,కామాలనే మూడు ధర్మాలను సమంగా పంచుకునేదని 


 ii ) ధర్మ,అర్ధ,కామ మోక్షాలనే ధర్మాలను సమంగా పంచుకునేదని


iii ) అధర్మ కార్యాలను పాలుపంచుకునేది అని 


 iv ) ఆస్తిలో వాటా కోరునది అని


 12) పాలపుంత అనునది


i ) గ్రామాలలో పాల కుండను వుంచు ఉట్టి 


 ii ) గ్రామాలలో పాల కుండను వుంచు గూడు


 iii ) నక్షత్ర మండలము


iv ) రాసి చక్రము 


13) వటపత్ర సాయి అనగా


i ) మర్రి ఆకుమీద పవళించిన వాడు 


ii ) తమలపాకు మీద పవళించిన వాడు


iii ) తామర ఆకుమీద పవళించిన వాడు


iv ) జామ ఆకుమీద పవళించిన వాడు


14) జనక మహారాజు ఒక 


i ) ఆత్మవేరు పరమాత్మ వేరని నమ్మిన వాడు 


 ii )స్థితప్రజ్ఞుడు 


 iii ) మనుషులంతా ఒకటేనని నమ్మినవాడు 


iv ) సన్యాసం ఒకటే దేముడిని చేరు మార్గమని తెలుసుకున్నవాడు 


15) జాతక చక్రంలో _____గదులు ఉంటాయి 


i ) తొమ్మిది 


 ii ) పది 


 iii ) పన్నెండు 


 iv ) పదహారు


16) తమలపాకులు వీటికోసం వాడరు


i ) తాంబూలంలో


 ii ) పూజలలో   


 iii ) తోరణాలలో


 iv ) పేరంటంలో


17) "దేహశుద్ది" అనునది దీనికి ఉపయోగిస్తాము   


i ) ఇతరులను కొట్టటం 


 ii ) మంచినీటితో దేహాన్నిశుద్ధి చేయటం  


 iii ) పన్నీరుతో స్నానం చేయటం


 iv ) చెరువులో స్నానం చేయటం 


18) పూర్వాకాలంలో ఇలా అనేవారు " కాశీకి పోయినవారు _____పోయినట్లే"


i ) కాటికి 


 ii ) ఏటికి  


iii ) హిమాలయాలకు 


iv ) ద్రాక్షారామానికి 


19)" సరళీ స్వరాలు" అనునవి


i ) సరళ పాడే స్వరాలూ 


 ii ) సంగీతంకు సంబందించినది 


 iii ) సాహిత్యానికి సంబందించినది 


 iv ) సంగీతము ఇష్టమైనది మరియు స్పష్టమైనది 


20) లాయర్లకు మరియు డాక్టర్లకు వత్యాసం 


i ) కోటురంగు ii ) బూటు రంగు iii ) చొక్కారంగు iv ) అన్నీకూడా

హరుడై సృష్టికినీశుడై

 మ॥

హరుడై సృష్టికినీశుడై వినుతదీవ్యద్విశ్వసంహర్తయై 

స్థిరుడైయుండియు జాయ లేక జగతిన్ సృష్టించ సాధ్యమ్ముగా 

దురుసంయతి తోడ నైన యని దానూహించి యర్థాంగిగా 

స్మరుహేతుం గొని బొందె పార్వతిని భస్మక్షత్రుడానందమున్ 

*~శ్రీశర్మద*

పోతనగారి మనో విశ్లేషణ!

 శు భో ద యం 🙏


పోతనగారి మనో విశ్లేషణ!


              శా: " లగ్నంబెల్లి , వివాహముంగదిసె , నేలారాడు గోవిందు , డు


                      ద్విగ్నంబయ్యెను మానసంబు , వినెనో వృత్తాంతమున్ , బ్రాహ్మణుం


                     డగ్నిద్యోతనుఁడేటికిం దడసె , నాయత్నంబు సిధ్దించునో ?


                     భగ్నంబై చనునో ? , విరించి కృత మెభ్భంగిన్ బ్రవర్తించునో ?  


                             రుక్మిణీ కళ్యాణము- ఆం- భాగవతము-దశమస్కంధము- 1773 పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.


                                 చిన్న నాటినుండి కన్నయ్యను పెండ్లియాడాలనే రుక్మిణి తలంపునకు భిన్నంగా శిశుపాలునితో ఆమెవివాహం

నిశ్చయింప బడింది. అతనిని పెండ్లియాడే ఉద్దేశ్యంలేని రుక్మిణి, అగ్నిద్యోతనుడను బ్రహ్మణుని ద్వారా కృష్ణునకు ప్రణయ సందేశ

మంపింది. " కృష్ణా నేను నీయందు బధ్ధానురాగను. శిశుపాలుని బారి నుండి తప్పించి నన్నేలుకొనుము. నీవు ససైన్యముగ విచ్చేసిన చో

నీవెంట వచ్చెదను. నన్ను నమ్ముమని " సందేశసారాంశము.


                              అగ్ని ద్యోతను డామె సందేశమును గొని ద్వారక కేగెను. అతని నుండి సమాధానమా ,లేదు. గోవిందుడా, రాలేదు. రేపే వివాహము. బలిమిమై వివాహము జరిపించుటకు అన్నరుక్మి సర్వ సన్నధ్ధుడైనాడు. ఈస్థితిలో డోలాయమానమైన యామె మనో విచేష్టతములను బమ్మెఱపోతన బహు రమ్యముగా చిత్రించినాడు.


                  తొలుత "ఘనుడాభూసురుడేగెనో? " యనుపద్యముతో నీమనో విశ్లేషణ మారంభమైనది. అసలా ముసలిబ్రాహ్మణుడంతదూరం వెళ్ళియుంటాడా? మార్గాయాసంతో మధ్యలో యెక్కడైనా కూలబడి యుండడుగదా? 

ఇతను చెప్పింది కృష్ణుడు విన్నాడో వినలేదో? వస్తాడో రాడో? నాఅదృష్టం యెలాఉందో మరి?  


                      ఇలా సాగిపోతున్నాయి.రుక్మిణి ఆలోచనలు. ముహూర్తం దగ్గర పడిన కొద్దీ ఆమెకు కంగారు యెక్కువౌతున్నది.


              " రేపే వివాహం. ముహూర్తంకూడా దగ్గరపడింది. ఇంతవరకూ గోవిందునిజాడ లేదు. మనస్సు ఉద్విగ్నంగా ఉంది ( కంగారు గాబరా యేడుపు యివన్నీ కలిస్తే వచ్చే వికారం) ఈబ్రాహ్మణుడు చెప్పనది విన్నాడో లేదో? బ్రహ్మణుడేల యాలసించెనో? నాప్రయత్నం ఫలవంతమగునో లేదో? బ్రహ్మ నిర్ణయం యేవిధంగా ఉందో? "- ఇది ఆమె మనస్సులోని డోలాయమాన మగుచున్న

భావనలు.


                 లోకంలో మనకు అనుభవమే ! యేదైనా పనిమీద మనంపంపినవారు సరియైన సమయానికి రాకపోతే, వారినుండి యెలాటి వర్తమానం లేకపోతే మనం పడే మనోవేదన చెప్పటానికి మాటలుండవు. అలాంటి సన్నివేశచిత్రణను మనవారిప్పుడు

"చైతన్యశిల్పం"- అనేపేరుతో వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారాన్ని యింత చక్కగా మనకందిన పోతనగారి మనోవిశ్లేషణా సామార్ధ్యన్ని బహుధా ప్రశంసిస్తూ, ఆమహాకవికి కైమోడ్పులతో  


                                                      స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సింగినాదం జీలకర్ర*

 *సింగినాదం జీలకర్ర*


ఇది తరచుగా వినిపించే ఒక సామెత... *సింగినాదం అంటే ఆటవికుల చేతిలో ఉంచుకునే వాద్య పరికరం (దీనిని దుప్పి కొమ్ముతో తయారు చేస్తారు).* గతంలో ఓడ రేవులలో *సరుకులతో ఒక ఓడ రేవుకు వచ్చిందంటే దాని రాకను తెలియచేస్తూ శంఖారావం* లాంటి శబ్దం చేసేవారు. దాంతో ప్రజలు, వ్యాపారస్తులు పొలోమని ఓడ వద్దకు వెళ్లి తమకు కావలసిన వస్తువులు తెచ్చుకునే వారు. *ఓడ రాకను తెలియచేసేదే సింగినాదం.* 


*ప్రత్యేకించి ఒక ఓడ మాత్రం అన్ని సార్లూ జీలకర్ర తోనే రేవుకు వచ్చేది.* సింగినాదం వినపడినా ప్రజలు ఓడ వద్దకు వెళ్లేవారు కాదు. ఆఁ ... ఏముందిలే జీలకర్రె కదా! అని అనుకుని మిన్నకుండిపోయేవారు. ఆ విధంగా పుట్టిందే ఈ మాట.. *సింగినాదం జీలకర్ర.*


*మరో కథనం...*


సింగినాదం జానపదుల, గిరిజనులు ఎక్కువగా వాడే కొమ్ము వాయిద్యం. అప్పట్లో మేక, గొర్రె కొమ్ముతో కూడా ఈ వాయిద్య పరికరం తయారు చేసి వాడేవారు. ఈ *మేక, గొర్రె కొమ్మును* నీటిలో మరిగించి అందులోని గుజ్జును తీసివేసి వాయిద్య పరికరంగా తయారు చేసేవారు.*సంస్కృతం లో కొమ్మును శృంగం* అని అంటారు. ఆ శృంగనాదమే వాడుక లో *సింగి నాదం* అయుంది. పల్లెటూళ్లలో గిరిజనులు అడవి ప్రాంతాల నుంచి వచ్చి పల్లెటూళ్లలో జీలకర్ర అమ్ముతుండేవారు. అలా అమ్మడానికి వచ్చినప్పుడు *శృంగ నాదం* అదే *సింగి నాదం* ఊదేవారు. అలా వచ్చిందే ఈ *సింగి నాదం జీలకర్ర,* అనే సామెత.


*సింగి నాదం జీలకర్ర,* అంటే చాలా చిన్న విషయం అని కూడా మరొక అర్ధం.

కామ: క్రోధ శ్చ లోభ శ్చ

 కామ: క్రోధ శ్చ లోభ శ్చ 

దేహే తిష్ఠంతి తస్కరా:౹

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మా జ్జాగృత జాగృత॥


కామ: -కోరికయును, 

క్రోధ: చ- కోపమును,

లోభ: చ-లోభమును అనే, 

తస్కరా: -దొంగలు, 

దేహే-నీ శరీరమందే, 

జ్ఞాన-జ్ఞాన మనే, 

రత్న-రత్నాన్ని, 

అపహారాయ-దొంగిలించడానికి, 

తిష్ఠంతి-ఉన్నాయి(ఉన్నారు), 

తస్మాత్- అందువలన, 

జాగృత జాగృత-మేలుకో మేలుకో॥


నీలోపల ఉన్న జ్ఞాన మనే రత్నాన్ని దోచుకోడానికి కామం, క్రోధం, లోభం అనే దొంగలు కాచుకొని ఉన్నారు. కాబట్టి ఓ మనిషీ!మేలుకో, మేలుకో॥

14-7-25/సోమవారం/ రెంటాల

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

_(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి)_


అకృతాత్మానమాసాద్య 

రాజానమనయే రతమ్

సమృద్ధాని వినశ్యన్తి 

రాష్ట్రాణి నగరాణి చ

_(5.21.11)_


*అర్థం:*

అన్యాయమైన మార్గాల్లో నిమగ్నమైన 'వివేకరహిత పాలకుల' కారణంగా 'సంపన్న దేశాలు' మరియు నగరాలు కూడా నాశనమవుతున్నాయి.

(ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి ఇదే కదా)


శ్రీ గోపరాజు వేంకట సుబ్బారావు గారి కీర్తనతో శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


   శ్లో𝕝𝕝 *త్రయః కాలకృతాః పాశాః శక్యన్తే న నివర్తితుమ్।*

           *వివాహో జన్మ మరణం యథా యత్ర చ యేన చ॥*


తా𝕝𝕝 *వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు*....

ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవించబడవలెనో అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే....*ఇవి మార్చడానికి అసాధ్యమైనవి...*


 ✍️VKS ©️ MSV🙏

ముప్పు తిప్ప లెట్టి

 ముప్పు తిప్ప లెట్టి ముదిరి పోయిన జబ్బు

వస్తె హోమియోలొ వైద్య ముంటె

ముందుగానె వస్తె ముప్పుతిప్పలు నేల

సకురు అప్ప రావు సత్యమిదిర


భావం: అనేక మంది రోగులు వారి బాధలు అర్జెంటుగా తగ్గించేసుకుందామనే పిచ్చి భ్రమతో ఇంగ్లీషు స్పెషలిస్ట్ వైద్యుల చుట్టూ, కార్పొరేట్ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి తిరిగి సమస్యను బాగా ముదరబెట్టుకొని, పరిష్కారం కానంత జటిలం చేసుకుని, జేబులో డబ్బులన్నీ వాళ్ళు పూర్తిగా పిండేసాక, ఇక మీ జబ్బు తగ్గే అవకాశమే లేదని వారు నిరాశకు గురి చేసాక, పూర్తి దీనావస్తకు చేరుకున్న రోగాలను సైతం ఓర్పుగా, నేర్పుగా నయం చేయగలిగే సత్తా కలిగిన హోమియో వైద్యానికి రోగం వచ్చిన వెంటనే వెళ్తే మీకీ తిప్పలూ, తలనొప్పులూ లేకుండా, ఒంట్లో పార్టులు కోయించుకొని, చెడగొట్టు కోకుండా, జేబులో డబ్బులన్నీ గొరిగించుకోకుండా హాయిగా, త్వరగా నయమై, క్షేమంగా మీరు మీ ఇంటిలోనే ఉంటారు కద నాయనా! ఎందుకు, హోమియోను చులకనగా చూసి, మీరు నానా తిప్పలు పడటం? హోమియోను చూసి ఎందుకలా భయపడి దూరంగా ఉంటారు?అదేమైనా మీ శత్రువా? బాగా ముదిరిపోయి, బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళ రోగాలే నయం చేయగలిగే దమ్మున్నది లేతగా అప్పుడప్పుడే వచ్చిన సమస్యలూ, రోగాలూ నయం చేయలేని తింగరి, చేతకాని వైద్యమనుకుంటున్నారా? 

హోమియో వైద్యమంటే ఒక అద్భుతం, అమృతం! దీనిని అర్థం చేసుకుని, ప్రతీ సందర్భానికీ వాడుకునే వాళ్ళ జన్మ ధన్యం! 

సకురు అప్పారావు చెప్పే ప్రతీ మాటా అక్షర సత్యం!అయినా సరే దానిలో నిజముందో లేదో మీరు కూడా చూడండి, ఆలోచించండి! 

 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

కృత్రిమ కన్నీరు ""

 

కవితా శీర్షిక:

      "" కృత్రిమ కన్నీరు ""


దేహంలో జీవం ఉన్నంత కాలం 

తప్పదు కన్నీళ్ళ ఆగమనం

వాటి రాకతోనే అవుతుంది మనస్సు మలిన రాహిత్యం!


నవ్వినా ఏడ్చినా వచ్చేవి కన్నీళ్లు

తరతమ భేదం లేదు కన్నీళ్ళకు!

కష్టసుఖాలు రెండూ సరి సమానం 

రెండింటిని సమంగా స్వీకరించమని మానవులకు కన్నీళ్ళు ఇచ్చే సందేశం!


తల్లిపాలలా కన్నీరు స్వచ్చమైనది

గుండెలోని భారాన్ని దింపి స్వస్థత చేకూర్చుతుంది!


ప్రకృతిని వికృతిగా మార్చి

కృత్రిమ కన్నీటిని ఆహ్వానిస్తున్నాం!


వృద్ధాప్యంలో కన్నవారిని కనికరించక

వారిని అనాధలుగా వృద్ధాశ్రమంలో చేర్చి

వారి కనులలో అశ్రుధారలను కురిపిస్తున్నాం!


ఆడపిల్లల పుట్టుకను భారంగా తలచి

స్కానింగ్ ద్వారా తెల్సుకుని వారిని పురిటిలోనే చంపుతూ

వారికి కన్నీటిని బహుకరిస్తున్నాం!


కట్నకానుకలకై వనితలను వేధిస్తూ

అతివల జీవితాల్లో కన్నీటి వరదను పారిస్తున్నాం!


దైవ సంకల్ప సంఘటనలు కొన్నయితే

మానవ కల్పిత కృత్రిమ దుర్ఘటనలే అత్యధికం

అవి ఎప్పటికీ తప్పించుకోలేనివి

ఇవి ఇప్పటికైనా తప్పించుకు తీరాల్సినవి!


మన చేతలతో వాటిని సరి చేసుకుని

కృత్రిమ కన్నీటికి అడ్డు కట్ట వేద్దాం

సుఖమయ జీవనానికి శ్రీకారం చూడదాం!!!


************************************


నమస్తే అండీ, మీ రచన అందింది, ధన్యవాదాలు.

తెలుగు తల్లి కెనడా

Show quoted text

పోతనగారి మనో విశ్లేషణ!

పోతనగారి మనో విశ్లేషణ!


              శా: " లగ్నంబెల్లి , వివాహముంగదిసె , నేలారాడు గోవిందు , డు


                      ద్విగ్నంబయ్యెను మానసంబు , వినెనో వృత్తాంతమున్ , బ్రాహ్మణుం


                     డగ్నిద్యోతనుఁడేటికిం దడసె , నాయత్నంబు సిధ్దించునో ?


                     భగ్నంబై చనునో ? , విరించి కృత మెభ్భంగిన్ బ్రవర్తించునో ?  


                             రుక్మిణీ కళ్యాణము- ఆం- భాగవతము-దశమస్కంధము- 1773 పద్యం: బమ్మెఱ పోతన మహాకవి.


                                 చిన్న నాటినుండి కన్నయ్యను పెండ్లియాడాలనే రుక్మిణి తలంపునకు భిన్నంగా శిశుపాలునితో ఆమెవివాహం

నిశ్చయింప బడింది. అతనిని పెండ్లియాడే ఉద్దేశ్యంలేని రుక్మిణి, అగ్నిద్యోతనుడను బ్రహ్మణుని ద్వారా కృష్ణునకు ప్రణయ సందేశ

మంపింది. " కృష్ణా నేను నీయందు బధ్ధానురాగను. శిశుపాలుని బారి నుండి తప్పించి నన్నేలుకొనుము. నీవు ససైన్యముగ విచ్చేసిన చో

నీవెంట వచ్చెదను. నన్ను నమ్ముమని " సందేశసారాంశము.


                              అగ్ని ద్యోతను డామె సందేశమును గొని ద్వారక కేగెను. అతని నుండి సమాధానమా ,లేదు. గోవిందుడా, రాలేదు. రేపే వివాహము. బలిమిమై వివాహము జరిపించుటకు అన్నరుక్మి సర్వ సన్నధ్ధుడైనాడు. ఈస్థితిలో డోలాయమానమైన యామె మనో విచేష్టతములను బమ్మెఱపోతన బహు రమ్యముగా చిత్రించినాడు.


                  తొలుత "ఘనుడాభూసురుడేగెనో? " యనుపద్యముతో నీమనో విశ్లేషణ మారంభమైనది. అసలా ముసలిబ్రాహ్మణుడంతదూరం వెళ్ళియుంటాడా? మార్గాయాసంతో మధ్యలో యెక్కడైనా కూలబడి యుండడుగదా? 

ఇతను చెప్పింది కృష్ణుడు విన్నాడో వినలేదో? వస్తాడో రాడో? నాఅదృష్టం యెలాఉందో మరి?  


                      ఇలా సాగిపోతున్నాయి.రుక్మిణి ఆలోచనలు. ముహూర్తం దగ్గర పడిన కొద్దీ ఆమెకు కంగారు యెక్కువౌతున్నది.


              " రేపే వివాహం. ముహూర్తంకూడా దగ్గరపడింది. ఇంతవరకూ గోవిందునిజాడ లేదు. మనస్సు ఉద్విగ్నంగా ఉంది ( కంగారు గాబరా యేడుపు యివన్నీ కలిస్తే వచ్చే వికారం) ఈబ్రాహ్మణుడు చెప్పనది విన్నాడో లేదో? బ్రహ్మణుడేల యాలసించెనో? నాప్రయత్నం ఫలవంతమగునో లేదో? బ్రహ్మ నిర్ణయం యేవిధంగా ఉందో? "- ఇది ఆమె మనస్సులోని డోలాయమాన మగుచున్న

భావనలు.


                 లోకంలో మనకు అనుభవమే ! యేదైనా పనిమీద మనంపంపినవారు సరియైన సమయానికి రాకపోతే, వారినుండి యెలాటి వర్తమానం లేకపోతే మనం పడే మనోవేదన చెప్పటానికి మాటలుండవు. అలాంటి సన్నివేశచిత్రణను మనవారిప్పుడు

"చైతన్యశిల్పం"- అనేపేరుతో వ్యవహరిస్తున్నారు. ఇదే వ్యవహారాన్ని యింత చక్కగా మనకందిన పోతనగారి మనోవిశ్లేషణా సామార్ధ్యన్ని బహుధా ప్రశంసిస్తూ, ఆమహాకవికి కైమోడ్పులతో  


                                                      స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷