5, నవంబర్ 2020, గురువారం

వేమన

 



---------యోగి వేమన..!!💐శ్రీ💐--------


చాలా మందికి వేమన గురించి..


సినిమా వాళ్ళు ఎంత చూపించారో అంతే తెలుసు.....కానీ వాస్తవం వేరు..


ఈయన అసలు పెరు ""బెదమ కోమటి చిన వేమారెడ్డి""


ఈయన అన్న పేరు ""బెదమ కోమటి పెద వేమారెడ్డి""


అప్పటి కడప..కర్నూలు..అనంతపురం కలిపి ఒకే రాజ్యంగా ఉండేది...


దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు.


అతని మంత్రి ""తురగారాముడు.


తురగారాముడు ఎలాగైనా అన్నదమ్ములనిద్దరినీ చంపి


తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు...


ఇప్పుడు మనం చినవేమారెడ్డిని వేమన అని పిలిచుకుంటున్నాము....


ఇతడు మహా ధైర్యవంతుడు...


పేరుకు అన్నగారు రాజు..


కానీ మొత్తం రాజ్యం వేమన్న ధైర్యసాహసాలు కనుసన్నులో ఉంటుంది.... 


అతని ధైర్యానికి ఉదాహరణ...


 


ఒక మదపుటెద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ హడలెత్తిస్తూ ఉంటుంది...


అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ వుంటారు...


ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం ఏ పహిల్వాన్ చేత కూడా కాదు....


అటుగా వస్తున్న వేమన మీదికి వెళుతుంది....


అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళలోకి చూసి ""ఏయ్"'అని 


 


గద్ధిస్తాడు... 


ఆ శబ్దం ఆ ఎద్దు చెవులనుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది.....


దాని కళ్ళకు వేమన మహా సింహం లాగా కనిపిస్తాడు.... హడలెత్తి తోకముడుచుకొని 


 


పారిపోతుంది....దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు, ముందు 


వేమన్నను మట్టు బెడితే గానీ తన పని సులువు కాదని,,,


వేమన ఉన్నంత వరకూ తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు... 


తన దృష్టిను వేమన మీద ఉంచుతాడు..వేమనకు భోగగత్తెల ( ,వేశ్యల ) సాంగత్య ఎక్కువ..ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే ఈయన ముందు వెళ్ళేవాడు....వేమనకు ""విశ్వద """అనే ఒక ప్రేయసి కూడా ఉంటుంది...


వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం....


ఎన్నోసార్లు తన రాజ్యం గురించి,,,,తాను నిర్వర్థించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు 


హెచ్చరిస్తుంది..కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు....


మీరు శరీర అందం వెనుక పరిగెడుతున్నారు....కానీ అది శాశ్వతము కాదు....


అందం వెనుక అందవికారం కూడా దాగి ఉంటుంది...


యవ్వనంలో కనపడినట్లు ఈ శరీరం ముసలితనంలో తన ప్రాభవం కోల్పోతుంది.


ఏదైతే ఇప్పుడుండి ఇక మీదట ఉండదో దాని కొరకు మీరు పరిగెడుతున్నారు....


మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది....


కానీ వేమన పట్టించుకునే వాడు కాదు....


తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది...కానీ ఫలితం ఉండదు....


అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలవుతాయి....


వెంపల్లి సంబరాలకు ముస్తాబవుతుంది....


ఆ తిరునాళ్ళలో మహా అందెగత్తె ""మాంచాల నాగులు భోగమాటను ప్రారంభిస్తుంది....


ఆమె గురించి ఆ నోటా,,,ఈ నోటా,,,వేమనకు చేరుతుంది...


వేమన ఒక సారి వెంపల్లెకు వెళ్లి చూస్తాడు.....


ఆమె అందానికి దాసుడై పోతాడు....


ఇక తన మకాం పూర్తీగా వెంపల్లె నాగుల యింటికి మారుస్తాడు....


ఓ ప్రేయసీ కంటే ఎక్కువగా అభిమానిస్తాడు.


నెలలు గడుస్తాయి.....


నెలల కొద్దీ ఇంటికి రాకపోయే సరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది....


వేమన నాగుల అనే వేశ్య ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు..


డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపొయ్యడం మంచిది కాదని,,,


రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మ౦ కాదని..


రాజ్య పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది....


 


""విశ్వద" కు వేమన్న భవిష్యత్తు కళ్లముందర కనిపిస్తుంది..


అతని భవిష్యత్తు అంధకారమై పోతుందని గ్రహించి...


సత్యం చెప్పే తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి..


తొందరలోనే మీరు మరణించబోతున్నారు...


శరీరానికి నెలలు కాదు రోజులు మాత్రమే ఉన్నాయి...


ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్థించలేరు..


ఇప్పటికైనా మేల్కొనండి.... 


జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి...


ఆ మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి అంటుంది...


 


వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు...


వేమన ""నాగుల"" కి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన


తురగారాముడు వెళ్లి నాగులను లోబర్చుకుంటాడు....


కొంత మంది సైన్యాన్ని కూడా లోబర్చుకుని ఉంటాడు...


సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం 


 


చేయవలసిందిగా చెబుతాడు....


దానికి గానూ ఆమెకు డబ్బు,,,


జాగీరు ఎరగా చూపుతాడు....


చెయ్యకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీమీదికి తీసుకొస్తానని 


 


బెదిరిస్తాడు....చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది....


 


ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో వున్నప్పుడు తాగమని ఇస్తుంది....


వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు....


అంతే పూర్తీగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలోకి వెళ్ళిపోతాడు..


నాగులు తురగారామునికి పని పూర్తీ అయిందని కబురు బెడుతుంది... 


తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో 


 


వేయించేస్తాడు....


ఆ అడవులలో"" అభిరామ"" అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా 


 


చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు....


ఒక రోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శవాన్ని చూస్తాడు....


అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్లి తన 


 


వైద్యం తో బ్రతికిస్తాడు....మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు....మౌనంగా కూర్చునేవాడు...ఏ వివరాలూ ఎంత అడిగినా చెప్పేవాడు కాదు.....


మహా మౌనంగా ఉండేవాడు...తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు....


విశ్వద చెప్పిన సత్యం,,,,నాగులు,,,తురగారాముడు చేసిన మోసం కళ్ళముందు 


 


కదిలేవి....తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునే వాడు..


ఆకులు అలముల కోసం అప్పుడదప్పుడూ అడవులకెళ్లి తెచ్చేవాడు....


అభిరాముడు..తన గురువుగారైన విశ్వకర్మ యోగి ని


కలిసి జ్ఞానాన్ని తెలిసుకుంటూ ఉండేవాడు....ఒక రోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని,,,తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని


రేపు రావలసిందిగా చెబుతాడు...అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు...


మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు...


దారిమధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతాడు.... దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు......


అభిరాముడు ఎంతకూ ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండడంతో 


 


వేమన బయలుదేరుతాడు....వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళతాడు.....విశ్వకర్మయోగి చెందవలసిన వాడు,,,,రావలసిన వాడు రానే వచ్చాడు ,,


అని వేమన్నను పిలిచి ధ్యాన,,,జ్ఞాన,విద్యను నేర్పించి,, మూడొకన్నును ఉద్దేపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు.... ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది....అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు....


తాను పొందవలసిన దాన్ని పొందలేక పోయానని బోరున విలపిస్తాడు....


వేమన దానికి అభిరామా....దుఃఖిించకు ,,భాధ పడకు,,,


నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ నేను పెడచెవిన పెట్టాను....


ఈ రోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది...


విశ్వద ...అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను. అని చెబుతాడు...


విశ్వద ..అభిరామా ఇద్దరూ కలిసి వినరా వేమా...అని నాకు భోధిస్తున్నట్టుగా,,,చెబుతున్నట్టుగా ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు... 


అందుకే..విశ్వదాభిరామా వినురావేమా..!


ఇది నాకిష్టమైన పద్యం.💐


 


కుండ కుంభమన్నా,,కొండ పర్వతమన్నా,,


నుప్పు లవనమన్నా,,నొకటి కాదే


భాషలిట్టే వేరు పరతత్వం ఒక్కటే


విశ్వదాభి రామ వినురవేమ....!


 


కుండ అన్నా,,,


కుంభమన్నా,,,


ఉప్పు అన్నా,,,


లవణ మన్నా,,,


కొండ అన్నా,,,


పర్వతం అన్నా,,,


అంతా ఒక్కటే.....


భాషలే వేరు....


భగవంతుని తత్వం ఒక్కటే... వేమన్న..


భాషలు వేరు కానీ భావం ఒక్కటే...


భాషలు వేరే....కానీ ఉన్నది 


ఆ ""ఒక్కటే "".


భగవంతుడు..అని తెలియచెప్పాడు.


*లోకా సమస్తా సుఖినోభవంతు..!!*


     🍃🌺 *శ్రీ మాత్రే నమః* 🍃

ప్రముఖ తీర్మానం

 *స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డు మెంబర్ల సమావేశం అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజున నిర్వహించినారు* 


*ఈ ప్రత్యేక సమావేశంలో ఒక ప్రముఖ తీర్మానం చేసినారు* 


*భారతదేశంలోని ప్రతి కుటుంబం యజమానికి*

*Financial Immunity Development Program* 

*ద్వారా ఎంచుకున్న రిటైర్మెంట్ వయసు నుండి జీవిత కాలానికి తనకు తన శ్రీమతికి నెల నెల క్రమం తప్పకుండా పెన్షన్ రూపంలో ఆర్థిక స్వావలంబన సాధించడం*


*ఆశ్చర్య పరిచే సంఖ్య 21900 గురించి తెలుసుకుందాం*



*ఇది మీకు తెలుసా???* 

*ఇప్పుడు భారతీయుల సగటు ఆయుర్దాయం 80 సంవత్సరాలు అనగా సహజంగా పదవీ విరమణ తర్వాత ప్రతి వ్యక్తి ఆదాయం లేకుండా 20 సంవత్సరాలు జీవించి ఉండాలి లి అన్నమాట*


*ప్రతిరోజు మూడు పూటలా ఆహారం తీసుకోవడం సహజమే కదా!!!*

 *20 సంవత్సరాల కాలంలో భోజనం చేసే పూటల సంఖ్య*

3X365X20= *21900*


*ధరల పెరుగుదలను కూడా దృష్టిలో పెట్టుకొని సగటు ఒక పూటకు ఖర్చు రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఒక వ్యక్తికి 20 సంవత్సరాలలో కేవలం ఆహారాన్ని కు మాత్రమే ఖర్చు*

230X21900= *5037000*


*ఇంకా భార్య భర్త ఇరువురికి 20 సంవత్సరాల కాలానికి ఆహార ఖర్చు 1,00,74,000*


*ఇప్పుడు చెప్పండి  సంపాదించే వయసులోనే రిటైర్మెంట్ కోసం దాచుకోవడం ఎంత అవసరమో???*


*SBI Life వారి  రిటైర్ స్మార్ట్ పథకం గురించి నేడే తెలుసుకోండి  మరియు పొదుపు పెట్టుబడి చేసి ఆత్మగౌరవంతో నిశ్చింతగా దంపతులు మీరు ఇద్దరూ రిటైర్మెంట్ జీవితం గడపండి*


*సదా మీ సేవలో*


M.Raghuram

Sr.Development Manager 

9550124660



*మీయొక్క స్పందన కోసం నిరీక్షిస్తూ*

అరణ్యపర్వము-17

 అరణ్యపర్వము-17


చ్యవన మహర్షి వృత్తాంతం


పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు యాదవ ప్రముఖులను వెంటపెట్టుకుని వారిని చూడటానికి వచ్చారు. ధర్మరాజు తాము పడుతున్న కష్టాలు, అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళడం వారికి వివరించాడు. బలరాముడు ” ఆ దృతరాష్ట్రుడు బుద్ధి లేని వాడై ఇంతటి పాపానికి ఒడి గట్టాడు. కనుక మనమంతా ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చేలా చేద్దాం ” అని తనతో వచ్చిన వృష్టి రాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి ” అనుపమ శౌర్యవంతులు, అమిత బలవంతులు అయిన మీరు శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవులలో తిరగటం భావ్యమా? భయంకర మైన యాదసేనల ధాటికి కౌరవసేనలు తట్టుకోగలవా? మనము కేకయరాజులు, సృంజయులు, పాంచాలురు, వృష్టి, భోజక, అంధక మహావీరులతో కలసి శ్రీకృష్ణుని అనుమతితో కౌరవులను సంహరించి పాండవులను రాజ్యాభిషిక్తులను చేద్దాం. అభిమన్యుని అఖిలరాజ్య రక్షకునిగా నిలుపుదాం ఏమంటారు ” అని ఆవేశంగా అన్నాడు. ధర్మరాజు ” అయ్యా! మేము ఒక నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము. కాబట్టి మీరు శాంతించండి ” అని యాదవ వీరులను శాంతపరిచాడు. తరువాత శ్రీకృష్ణుడు, బలరాముడు ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడి నుండి బయలు దేరి పయోష్ణి నదిలో స్నానం చేసాడు. అక్కడి నుండి వారు నర్మదా నది తీరానికి చేరాడు. అక్కడ వారు వైడూర్య పర్వతాన్ని చూసారు. రోమశుడు ధర్మరాజుకు ఆ స్థల మహత్యాన్ని చెప్పసాగాడు.


రోమశుడు ధర్మరాజుతో ” ధర్మరాజా! భృగుమహర్షి కుమారుడైన చ్యవనుడు ఈ ప్రదేశంలో చాలాకాలం తపస్సు చేసాడు. దీర్గకాల తపస్సు కారణంలేత ఆ ముని శరీరం చుట్టూ పుట్టలు వాటి పై తీగలతో కప్పబడింది. ఒక రోజు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య, చ్యవనుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చింది. ఆ పుట్టలో ఉన్న చ్యవనుని కళ్ళు మిలమిలలాడాయి. అది చూసిన సుకన్య కుతూహలంతో ఆ పుట్టను తవ్వించింది. చ్యవనుడు కోపించి శర్యాతిని ససైన్యంతో మూత్రం, పురీషం బంధించాడు. ఈ విషయం తెలుసుకుని శర్యాతి చ్యవనుని వద్దకు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పు క్షమించమని వేడుకున్నాడు. రాజకుమారి సుకన్యని తనకిచ్చి వివాహం చేస్తే క్షమిస్తానని చ్యవనుడు చెప్పాడు. శర్యాతి మహారాజు అందుకు అంగీకరించి సుకన్యను చ్యవనునికి ఇచ్చి వివాహం చేసాడు. సుకన్య చ్యవనుడికి సేవలు చేస్తూ ఉంది.


ఒకరోజు అశ్వినీ దేవతలు ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమెను ” అమ్మా!నీవెవరు? ” అని అడిగారు. సుకన్య ” అయ్యా! నేను శర్యాతి మహారాజు కుమార్తెను. చ్యవనుని భార్యను ” అని చెప్పింది. వారు ఆశ్చర్యపోయి ” నీ వంటి అందెగత్తెకు చ్యవనుని లాంటి వృద్ధుడా భర్త. ఇంకనైనా తగిన వరుని కోరుకో. మేము వాడిని తీసుకు వస్తాము ” అన్నారు. అందుకు సుకన్య ఆగ్రహించి ” నాకు నా భర్త మీద ప్రేమ ఉంది ” అని చెప్పింది. తరువాత ఆమె ఈ విషయం చ్యవనునికి చెప్పింది. చ్యవనుడు సుకన్యతో ” వారు చెప్పినట్లు చేయవచ్చు కదా ” అన్నాడు. సుకన్య చ్యవనునితో ” మీ అనుమతి ఉంటే అలాగే చేస్తాను ” అన్నది. ఆమె అశ్వినులతో ” నాకు నవయవ్వన వంతుడైన వరుని ప్రసాదించండి ” అని అడిగింది. అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడు ఈ కొలనులో ప్రవేశించారు. కొలను నుండి ముగ్గురు నవయవ్వనులు బయటకు వచ్చారు. అశ్వినులు సుకన్యతో ” మాలో ఎవరు కావాలో కోరుకో ” అన్నారు. సుకన్య వారిలో చ్యవనుని గుర్తించి ఆయనను వరించింది. చ్యవనుడు అశ్వినులతో ” మీ వలన నేను యవ్వనవంతుడనైనాను. అందుకు ప్రతిఫలంగా శర్యాతి మహారాజు చేస్తున్న యాగంలో దేవేంద్రుడు చూస్తుండగా మీచే సోమరసం తాగిస్తాను ” అన్నాడు. అశ్వినులు సంతోషంతో వెళ్ళిపోయారు.


తన అల్లుడు నవయవ్వనవంతుడు అయ్యాడని తెలుసుకున్న శర్యాతి వారిని చూడటానికి వచ్చాడు. చ్యవనుడు శర్యాతితో ” రాజా! నేను నీచే ఒక మహా యజ్ఞం చేయిస్తాను ” అని అన్నాడు. శర్యాతి అందుకు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చ్యవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు చ్యవనునితో ” వారు దేవ వైద్యులే కాని దేవతలు కారు. కనుక మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు ” అన్నాడు. చ్యవనుడు ఇంద్రుని మాట లక్ష్య పెట్టక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు ఆగ్రహించి చ్యవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. చ్యవనుడు తన తపశ్శక్తితో వజ్రాయుధాన్ని నిగ్రహించాడు. వెంటనే చ్యవనుడు హోమంచేసి హోమం నుండి ఒక భయంకరాకారుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు రావడంతో ఇంద్రుడు భీతిచెందాడు. ఇంద్రుడు చ్యవనుడితో ” మహర్షీ ! మీ తపశక్తి తెలియక అపరాధం చేసాను క్షమించండి. నేటి నుండి అశ్వినులకు సోమరసానికి అర్హులు ” అని అంగీకరించాడు. చ్యవనుడు సృష్టించిన రాక్షసుడు కాముకులైన స్త్రీలలోను, మధ్యం లోనూ, పాచికలలోను, మృగములలోను ప్రవేశించాడు ” అన్నాడు.

రామాయణమ్ 191

 రామాయణమ్ 191

....

ధర్మాత్ముడైన సుగ్రీవుడు మీ స్నేహమును కోరుచున్నాడు .నేను అతని మంత్రిని వాయుపుత్రుడను,వానరుడను,సన్యాసి రూపము ధరించి ఋష్యమూకము నుండి వచ్చినాను .ఇచ్ఛానుసారము రూపము ధరించి ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళగలను.అని పలికి ఇక మాటాడకుండా మౌనంగాఉండి పోయాడు.

.

ఒక్కసారిగా రాముని ముఖము ఆనందంతో వికసించింది.వెదుకబోయినతీగ కాలికి తగిలినట్లుగా సంబరపడిపోయి లక్ష్మణునితో...

.

లక్ష్మణా ! ఈ వానరుడు మాటలు తెలిసిన వాడు ( వాక్యజ్ఞుడు),మధురభాషి.

.

నానృగ్వేద వినీతస్య నాయజుర్వేదధారిణః

నాసామవేదో విదుషః శక్యమేవం విభాషితుమ్.

.

ఋగ్వేదము వినీతుడై చదవనివాడికి,యజుర్వేద ధారణ చేయని వానికి ,సామవేదవైదుష్యము లేనివానికి ఈ విధంగా మాటలాడటం సాధ్యంకాదు.

.

NB

.

క్రొత్తవారి వద్దకు వెళ్ళినప్పుడు ఎలా మాటలాడాలి అని తెలవడం ఒక విద్య ఏమి మాట్లాడకూడదో తెలవడం అంతకంటే పెద్ద విద్య.

వారిని చూసి హనుమంతుడు సరిగా అంచనా వేసి వారిని అడిగాడు .ఒక్కమాట ఎక్కువ తక్కువ లేవు అనవసరపు వందిమాగధ పొగడ్తలు లేవు.

.

ఆయన అడిగినప్పుడు మొదట శ్రీ రాముడు మాటాడలేదు .హనుమంతుడు తనను తను పరిచయం చేసుకుని మిన్నకుండిన తరువాత మాత్రమే నోరు విప్పాడు .

.

మనస్సును అదుపులో ఉంచి క్రమశిక్షణతో గురువు దగ్గర అధ్యయనం చేసేవాడు. వినీతుడు .ఋగ్వేదం వినీతుడై అభ్యసించాలి

.

యజుర్వేదానికి ధారణ ముఖ్యంగా కావాలి వాక్యాలు మరలమరల వస్తుంటాయి.

.

సామవేదం గాత్రప్రధానమైనది అందుకు చక్కటి ఊహా శక్తి కావాలి అందుకు కావలసినది వైదుష్యం .

.

అందుకే మహర్షి వాల్మీకి ..వినీతః,,ధారిణః,విదుషః అనే శబ్దాలు ప్రయోగించారు.

.

ఆయన మాటలాడిన వెంటనే ఈయన ఆయనలోని గొప్పదనాన్ని అంచనా వేయగలిగాడు .

.

సరిగా చదువుకొన్న వాడు ఇవి అంచనా వేయగలగాలి అపుడే చదువుయొక్క సార్ధకత.

.

రామాయణమ్ 192/193

..

రామచంద్రుడు ఇంకా హనుమయొక్క సంభాషణా చాతుర్యము గురించి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు.

.

నూనం వ్యాకరణకృత్స్నమనేన బహుధా శ్రుతమ్

బహు వ్యాహరతానేన న కించిత్ అపశబ్దితమ్....అనగా

.

నిశ్చయముగా ఈతడు వ్యాకరణమును అనేక పర్యాయములు విని ఉన్నాడు . అందుచేత ఇన్ని సార్లు మాట్లాడినా ఒక్క అపశబ్దముకూడా ఇతనిచేత ఉచ్చరించబడలేదు  .

.

ఇక్కడ బహుధా అనగా...... అనేక పర్యాయములు అనే పదం మహర్షి వాడారు.

.

న ముఖే నేత్రయోశ్చాపి లలాటే చ భ్రువోస్తథా

అన్వేష్వపి చ సర్వేషు దోషః సంవిదితః క్వచిత్.

.

ముఖమునందుగానీ 

నేత్రములయందు 

కానీ లలాటమునందు కనుబొమ్మలయందుగానీ ,

మరి ఏ ఇతర అవయవములయందుగానీ 

ఏ మాత్రము దోషము కనపడలేదు.

.

అవిస్తరమసందిగ్ధమవిలమ్బితమవ్యథమ్

ఉరఃస్థం కణ్ఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్.

.

ఉచ్ఛారణలో సాగతీతలేదు ,

సందేహమునకు తావు లేదు,

ఆగి ఆగి మాట్లాడడము లేదు ,

వినేవారికి వ్యథలేదు

 బిగ్గరగా గానీ మందముగా గానీ లేక మధ్యమస్వరములో వినటానికి ఇంపుగా హాయిగా ఉన్నది.

.

NB


అదీ మాట్లాడడము అంటే .

"సాగతీత "అంటే ఏమిటో నిత్యంFM రేడియో వినే వారికి తెలుస్తుంది .

ఇక "అపశబ్దాలు" 24 గంటల News Channels వినేవారికి సుపరిచితమే.

ఆగి ఆగి మాట్లాడటము బిగ్గరగా మాట్లాడటము మన TV ఇంటర్వ్యూలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి....ఇవ్వన్నీ అవలక్షణాలు ..

.

మాట ఎలా ఉండాలి ? అదుగో పైన స్వామి మాట్లాడిన విధంగా ఉండాలి .

ఇంకా  ;...

.

అవయవాలలో ఏ విధమైన వికారాలూ మాట్లాడేటప్పుడు ఉండరాదు.

.

గీతీ దీర్ఘ

శిరఃకంపీ

తధాలిఖితపాఠకః

అనర్ధజ్ఞోల్ప కంఠశ్చ

షడేతే పాఠకాధమాః

.

సాగతీస్తున్నట్గుగా ఉండరాదు ,

తల మెడ భుజాలు విసురుతూ మాట్లాడరాదు. 

ఇక వ్రాసుకొచ్చిన కాగితాలు చూస్తూ మాట్లాడరాదు 

,అర్ధము మారిపోయే విధముగా ఉండరాదు ,

కీచుకంఠము పనికి రాదు 

ఈ ఆరూ దోషాలు అని మన పెద్దలుచెప్పారు.

.

ప్రకృతి,ప్రత్యయ,సమాస,సంధి....వీటన్నిటిగురించి బాగాచదివి ఉన్నాడు ఆయన.

.

ఒక్కసారి ముక్కున పట్టుకొని పరీక్ష పేపర్లో వ్రాసి మార్కులు తెచ్చుకొని ,ఆ తరువాత పెళ్ళి శుభలేఖలలో ,visiting cards లో పెట్టుకోవడానికి తప్ప చదివినది ఏ మాత్రమూ గుర్తుండని చదువు మనది .

.

ఈ విశేషాలు ఇంకా వున్నాయి.

అప్రస్తుత ప్రసంగాలు*_️

 *అవధానంలో అప్రస్తుత ప్రసంగాలు*_️🌹

*ప్రశ్నికుడు*:-

1 . రైలు పట్టాలకూ,

     కాలి పట్టాలకూ 

     అనుబంధం ఏమిటి?


*అవధాని:-*

రైలు పట్టాల మీద వుంటుంది,

కాలి మీద పట్టాలుంటాయి.


*ప్రాశ్నికుడు:-*

2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?


*అవధాని:-*

న్యాయస్థానములో వున్న

న్యాయదేవత. కళ్ళకు *గంతలు* కట్టి వుంటారు కదా!


*ప్రా:-*

3 . సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?

*అవ:-*

ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే

పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! 

అందుకని 'మండే' అంటారు.

*ప్రా:-*

4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?

*అవ:-*

*కని-పెంచుట* లేదు .

*ప్రా:-*

5 . ఈ రోజుల్లో పిల్లలు 

     తల్లిని Head Cook గా

     చూస్తున్నారు . 

     మరి తండ్రిని

     ఎలాచూస్తున్నారు?

*అవ:-*

*ATM* లాగా చూస్తున్నారు.

*ప్రా:-*

6 . సభలో ఎవరైనా 

      ఆవులిస్తే మీరేమి చేస్తారు?

*అవ:-*

పాలిచ్చేవైతే అవధానం

అయ్యాక యింటికి తోలుకెళ్తా .

*ప్రా:-*

7 . మనిషికి 

      ఆనందాన్నిచ్చే సిటీ ఏది?

*అవ:-*

*'పబ్లిసిటీ '*

*ప్రా:-*

8 . తుద+ తుద = తుట్టతుద,

      కడ  + కడ = కట్టకడ

      అవుతుంది కదా! 

      అరటి + అరటి 

      ఏమవుతువుంది?

*అవ:-*

అర టీ + అర టీ 

*ఫుల్ టీ* అవుతుంది.

*ప్రా:-*

9 . క్రికెట్ ప్లేయరుకీ, 

     అవధానికీ 

     సామ్యం ఉందా?

*అవ:-*

వాళ్ళు  *world play* కి వెళ్తారు , 

మేము  *words play* కి వెళ్తాము.

*ప్రా:-*

10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు? 

*అవ:-*

"పురుషులందు

పుణ్యపురుషులు 

*ఏరయా?* అంటాను.

*ప్రా:-*

11 . దేవుని గుడికి 

        తాళం వెయ్యాలా?          

*అవ:-*

భజన జరిగే చోట 

*తాళం* తప్పనిసరి.

*ప్రా:-*

12 . అద్దం ముందున్న

        ఆడువారికీ,

        మైకు ముందున్న

        అమాత్యులకీ 

        తేడా ఏమిటి?

*అవ:-*

_ఇద్దరికీ *సమయం* తెలియదు!_


 చదివి ఆనందించండి - పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి.....స్వచ్ఛమైన.నవ్వు నవ్వండి మన భాషను అందులోని గాంభీర్యాన్ని సోభగలను తెలుసుకోండి.👏

శివామృతలహరి

 శ్రీ. చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;


మ||

నవనీతంబుగదయ్య నీహృదయ మెన్నన్ నీలకంఠేశ్వరా

భువనంబుల్ వడి గాల్చివైచు గరళంబున్ మ్రింగి నేరేడు పం

డు వలెన్ గుత్తుక బట్టి నిల్పితి నిరాటోపంబుగా- ఆచి తూ

చి వచింపం దరమౌనె నీ గొనములన్ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;

ఓ నీలకంఠా!వెన్నలాంటిది కదయ్యా నీ మనసు.

లోకాలను అతి వేగంగా దహించి వేసే కాలకూట విషాన్ని నేరేడు పండు మ్రింగినట్లు మింగి, దాన్ని కంఠం లోనే జాగ్రత్తగా నిలిపి పెట్టుకున్నావు, సమస్త లోకాలను కాపాడి కూడా ఏమాత్రం గర్వం లేకుండా నిలబడ్డావు.నీ గుణాలను

ఈ ఒక్కదాన్ని విడవకుండా వర్ణించడం ఎవరికైనా సాధ్యపడుతుందా స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!


పద్య పఠనం; సుబ్బు శివకుమార్ చిల్లర.

పోత‌న త‌ల‌పులో...104

 పోత‌న త‌ల‌పులో...104


పరీక్షిత్తు! విష్ణుమాయ గురించే కాకుండ, విరాట్పురుషుని నుండి ఈ లోకాలు అన్నీ ఎలా సృష్టింపబడ్డాయి మొదలైన ప్రశ్నలు అడిగావు కదా. వాటన్నిటికి సమాధానంగా శ్రీమద్భాగవతమును చెప్తాను. శ్రద్ధగా విను...

                   ***


మహదహంకార పంచ తన్మాత్ర గగన

పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి

యప్రపంచంబు భగవంతునందు నగుట

సర్గ మందురు దీనిని జనవరేణ్య!

                      ***

ఓ పరీక్షిన్మహారాజ! మహత్తు, అహంకారం, పంచ తన్మాత్రలు అనెడి శబ్దము, స్పర్శము, రూపము, రుచి, వాసన అయిదు, పంచభూతములు అనెడి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు పంచేంద్రియములు అనెడి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అయిదు, విరాట్పురుషుని నుండి సృష్టింపబడుటను సర్గము అంటారు.


                  **

సరసిజగర్భుండు విరా

ట్పురుషునివలనన్ జనించి, భూరితర చరా

చర భూత సృష్టిఁ జేయుట

వరువడిని విసర్గ మండ్రు భరతకులేశా!

                   ***

మహా రాజ! పరీక్షిత్తు! బ్రహ్మదేవుడు నారాయణుని నాభి పద్మనుండి జనించి, బహు విస్తారమైన ఈ చరాచర జగత్తు సమస్తమును క్రమముగ సృజించుటను విసర్గము అంటారు.


                  **

లోకద్రోహినరేంద్రా

నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా

వైకుంఠనాథు విజయం

బాకల్పస్థాన మయ్యె నవనీనాథా!

              **

పరీక్షిత్తు! లోకద్రోహులైన రాజులను సంహరించి లోకాలను సంరక్షించుటలోని ఆ వైకుంఠుని విజయాలను స్థానము అంటారు. ఈ స్థానము అనే విష్ణు మహిమ కల్పాది నుండి కల్పాంతాలవరకు సాగుతూనే ఉంటుంది.

            ***

ఓ పరీక్షిత్తు భూపతి! సర్వేశ్వరుడు, గోవిందుడు, చిదచిదానంద స్వరూపుడు నారాయణుడు. ఆయన స్వయంభూతుడు ఇతరేతర ఉపాధులు లేక ఉండగలవాడు. కల్పాంతమున శ్రీమన్నారాయణుడు తన స్వస్థానమైన పాలసముద్రమున ఆదిశేషుని పాన్పుగా చేసికొని సుఖంగా యోగనిద్రా ముద్రలో ఆనందిస్తు వసించి ఉంటాడు. ఆసమయంలో జీవకోటి సమస్తము తమ తేజస్సులు నశించి నిర్వ్యాపారులై ఆయనలో లయమైపోతాయి.

               ***


జీవుండు భగవత్కృపావశంబునఁ జేసి-

  దేహధర్మంబులై ధృతి ననేక

జన్మానుచరితదృశ్యము లైన యజ్జరా-

  మరణంబు లాత్మధర్మంబు లయిన

ఘన పుణ్య పాప నికాయ నిర్మోచన-

  స్థితి నొప్పి పూర్వసంచితము లైన

యపహత పాప్మవత్త్వాద్యష్ట తద్గుణ-

  వంతుఁడై తగ భగవచ్ఛరీర



భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి

దివ్య మాల్యానులేపన భవ్య గంధ

కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ

డగుచు హరిరూప మొందుటే యనఘ! ముక్తి



మానవుడు జన్మజన్మాంతరాలలో తన దేహధర్మాలను పాటిస్తు అనేక పాప పుణ్య కర్మలు చేసి ఫలితాలు అనుభవిస్తుఉంటాడు. జనన జరామరణాదుల చక్రంలో పడి కొట్టుకుంటు ఉంటాడు. ఈ అనంత పాప పుణ్యచయాలనుండి భగవత్కృపతో కూడిన బహుళసాధనల వలన విడివడతాడు. భగవంతుని అష్టైశ్వార్యాలతో కూడి ఆ పరాత్పరుని సామీప్యం, సాయుజ్యం సంపాదించుకొని, సాక్షాత్భగవస్వరూపం పొందుతాడు. ఆయా దివ్యమైన మాలలు, మైపూతలు మున్నగు వైభోగములన్నీ పొందుతాడు. ఇలా శోభనకరమైన విశిష్ఠ దివ్యదేహంతో హరిస్వరూపం పొందుటను ముక్తి అంటారు.



    🏵️పోత‌న ప‌దం🏵️

🏵️హ‌రిస్వ‌రూపం🏵️

రాహువును శక్తిని

 రాహువును శక్తిని అనుసరించు గ్రహములు ఈశ్వర శక్తిగా, అవి,రవి, కుజ , శుక్ర, శని గ్రహములు. వాటి శక్తిని పురుష, శక్తిగా ఎక్స్ క్రోమెూజోములుగా తెలియుచున్నది. వాటి శక్తిని కేతువు శక్తితో గూడి పరివర్తన చెంది గురు, బుధ, చంద్ర విష్ణు శక్తిగా మారి జీవ చైతన్య లక్షణము కలిగి మార్పునకు మూల కారణంగా అనగా మానవ పరిణామసూత్రంగా, అదియే ప్రకృతి గా మనకు బోధపడుతున్నది. నక్షత్రములను వాటి శక్తని గూడా యీ ప్రాతిపదికన గ్రహములకును నిర్ణయించబడింది. వాటి శక్తికి వారధిగా పై గ్రహములు సంచరించుచు మానవ మనుగడకు ప్రధాన సూత్ర ములుగా వున్నవి. వీర్యకణములకు అధిపతి శుక్రుడు వానివలన ఆయా నక్షత్రములు ప్రవేశించు సమయమునకు నక్షత్ర ప్రభావం వలననే శుక్ర కారక శోభితమైన కణాలు లక్షణములను సంతరించుకొని చంద్రుని శక్తితో కలిసి దేహసంబధ ఆశ్రయమైన జీవిని ప్రభావము చేయుచున్నవి. పరమేశ్వర రూపంలో శక్తి తేజస్సు రేడియేషన్ పురుష రూపంలో దేహంలో ప్రవేశం. దీనికి అతి నీలలోహిత కిరణ లక్షణము గల శని కూడా కారకుడు. అతడు క్షేత్ర కారకుడుగా మనకు తెలియుచున్నది. దీనికి కుజ సంబంధమైన శక్తి పదార్దము అనగా పిండమును గట్టి పడుటకు మూల కారణము. మానవ జీవ లక్షణము లకు వుత్పత్తి మరియు లయమునకును ప్రధానము రాహు శక్తి యని అది నెప్ట్యూన్ రూపంలో గల గుడి గుర్తును మార్గములో అనగా క్లాక్వైజుగా మారుటకు. అపసవ్య మార్గములో యున్న కేతు శక్తి ఏంటీ క్లాక్ వైజ్ గల విష్ణు శక్తి యని, యీ రెండింటి కలయికయే జీవ ఆవిర్భావ మూల సూత్రంగా తెలియుచున్నది. దీనిని వేదము లయమునకును రాహువు మిగిలిన గ్రహములను వాటి శక్తిని లోపరచుకొనుట అనే సూత్రమును మన భౌతిక వాదులు బ్లాక్ హోల్స్ మిగిలిన గ్రహములు అన్నియు కలిసి పోవుట అనే సూత్రమునకు దగ్గరగా యున్నది. అదే కృష్ణ అనగా లయ కారత్వమైన మహా భారత యుధ్దము రచన యని అధర్మమును నాశనము చేసి ధర్మ సంస్థాపనయనే సూత్ర వివరణ. వీటి వునికి గ్రహ మండలంలో మనకు కంటికి కనపడదు. కాని వాని శక్తి విశ్వవ్యాప్తమై తెలియజేయుచున్నది. అణువణువూ వ్యాప్తి చెంది దేనికదే గమనం చేయుచున్నవి. యింత స్పష్టంగా వేదం తెలియజేయుచున్నది. అది భూగమనమునకు మూల శక్తి. యిది ఆగిపోయినఆగిపోయినఅనగా భూతలమంత లేనియెడల ప్రళయము.

మొగలిచెర్ల అవధూత

 ప్రసాద సుధాకరం..


దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రిందట... అప్పుడప్పుడే..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ఒక్కొక్క వ్యవస్థా రూపుదిద్దుకుంటోంది..


ఆదివారం నాడు, శ్రీ స్వామి వారికి ప్రభాత పూజ, హారతి అయిన తరువాత, భక్తులకు ప్రసాద వితరణ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన తో ఉన్నాము..ప్రసాదంగా చేయించిన పదార్ధాన్ని, అందరికీ అందే విధంగా పంచే వ్యక్తి ఎవరు? ఇదొక ప్రశ్న మా ముందు నిలిచింది..ఎందుకంటే, ఆనాటికి ఆలయ సిబ్బంది గా ఉన్నది ముగ్గురే..టిక్కెట్లు, క్యూ లైన్, ఆలయ పరిశుభ్రత, అన్నీ వాళ్లే చూసుకోవాలి..


అప్పుడు వచ్చాడు సుధాకర్!..18, 19 ఏళ్ల వయసు, చిరునవ్వు..ప్రతి శుక్రవారం, సాయంత్రానికి మొగలిచెర్ల వచ్చి..రాత్రికి మాలకొండ చేరి, శనివారం ఉదయం నుంచీ, సాయంత్రం దాకా ఆ మాలకొండ లో వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహుడి సన్నిధిలో ప్రసాద వితరణ లో,అన్నదాన సత్రంలో స్వచ్ఛందంగా సేవ చేసి, తిరిగి రాత్రికి మొగలిచెర్ల చేరుతున్నాడు.. 


అతనిని గమనించిన నాకు ఆదివారం పూట ప్రసాదం వితరణకు మాకు పరిష్కారం దొరికింది అని అనిపించింది...ఆమాటే అడిగాను..సంతోషంగా ఒప్పుకున్నాడు..సహజంగా ఆదివారం ఉదయం పూట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది..ఎవ్వరినీ విసుక్కోకుండా ప్రసాద వితరణ చేయాలి..ఈ సుధాకర్ లో ఉన్న సుగుణం ఏమిటంటే..ఎంత మంది వచ్చినా , ముఖంలో అదే చిరునవ్వు!..ఎవరైనా ప్రసాదం కోసం రెండు మూడు సార్లు వచ్చినా..విసుక్కోకుండా పెడతాడు..మా సిబ్బంది లో ఎవరైనా.."అలా పెడితే, ప్రసాదం అయిపోయి చివరలో కొంతమందికి అందదు కదా? " అంటే.."పోనీలే, ఆకలితో ఉన్నట్టున్నాడు!" అంటూ నవ్వేస్తాడు..భక్తులకు పెట్టె ప్రసాదాన్ని తానే దగ్గరుండి ఆలయం లోకి తెప్పించుకుంటాడు..అర్చక స్వామి ఆ ప్రసాదాన్ని శ్రీ స్వామివారికి నివేదన చేసిన తరువాత..ముందుగా అర్చకస్వాముల కొరకు భక్తి పూర్వకంగా ప్రత్యేకంగా కేటాయించి ఇస్తాడు..ఆ తరువాత భక్తులకు పంచిపెడతాడు..


ఆ దత్తుడు చూపిన మార్గం వీడు అనుకున్నాన్నేను..ఆరోజు నుంచీ నేటి వరకూ.. ఆదివారమే కాదు, వేలాదిమంది భక్తులోచ్చే మహాశివరాత్రి రోజు కానీ..స్వామి వారి ఆరాధానోత్సవాల్లో కానీ..సుధాకర్ దే ప్రసాదవితరణ బాధ్యత!..


వారంలో ఐదు రోజులు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయప్పనులు, రెండు రోజులు దైవ సేవ..ఇదీ స్థూలంగా సుధాకర్ దినచర్య..శ్రీ మాల్యాద్రి లక్ష్మీనృసింహ స్వామికి పరమ భక్తుడు..ఇప్పటికీ వివాహం చేసుకోలేదు.. పెళ్లి గురించి అడిగితే.."ఆ నరసింహ స్వామి గుడి, ఇక్కడే..ఈ దత్తాత్రేయుడి ప్రాంగణం లోనే కట్టించి, ఆ స్వామి కళ్యాణం ఆ గుడిలో చేయించి, తరువాత చేసుకుంటాను!" అంటాడీ ముప్పైఒక్క ఏళ్ల సుధాకర్!..


ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, విప్పగుంట లో నివాసం ఉండే ఈ సుధాకర్....తక్కువలో తక్కువ... ఓ ఐదారు కోట్ల రూపాయల ఆస్తికి ఏకైక వారసుడు!..


ఏ కార్యక్రమానికి ఎవరు సరిగ్గా సరిపోతారో..అటువంటి వ్యక్తులనే ఎంపిక చేసుకోవాలనే విషయం..మాకంటే బాగా ఆ సమాధి లో కూర్చున్న అవధూత దత్తాత్రేయుడి కే చక్కగా తెలుసు!! 


సర్వం..

శ్రీ దత్త కృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Maintenance cases

Important ruling on Maintenance cases 

Affidavit of Disclosure of Assets and Liabilities shall be filed by both parties in all #Maintenance proceedings, including pending proceedings before the concerned Family Court / District Court / Magistrates Court, as the case may be, throughout the country, the #SupremeCourt has directed in an important judgment delivered on Tuesday (4 November 2020).
Read Judgment: t.ly/G8f4