17, మే 2024, శుక్రవారం

రాణి అంబక్క

 రాణి అంబక్క: భయమంటే ఏమిటో తెలియని గొప్ప వీరనారి. ఈ రాణి గురించి ఎంత మందికి తెలుసు? ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక యుద్ధనౌక కు ఒక మహిళ పేరు కాని, రాణి పేరు పెట్టలేదు. కానీ ఒక్క మన భారతదేశం నౌకలు మాత్రమే ఆ అదృష్టం చేసుకున్నాయి.


బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ గొప్ప వీరవనిత గురించి మన చరిత్రపుటల్లో ఏ పుస్తకంలోనూ నోచుకోలేకపోయింది.


ఏ పాఠ్యపుస్తకము చెప్పలేని #రాణి_అంబక్క గారి చరిత్ర:

16 వ శతాబ్దంలో దక్షిణ కన్నడ బంట్వాల్ ఫలక్ అనే ప్రాంతంలో తుకారాం పూజారి అనే చరిత్రకారుడు ఒక మ్యూజియంని మొదలుపెట్టాలి అని అనుకున్నాడు. ఆ మ్యూజియం పేరు "తులు బడుకు మ్యూజియం" అది రాణి అంబక్క చరిత్ర జ్ఞాపకార్థం. భారతీయ చరిత్రలో ఒకే ఒక ధీరవనిత పలుమార్లు పోర్చుగీస్ వాళ్లను ఓడించిన మహారాణి రాణి అంబక్క. ఆమె ధైర్యంలో మరియు వీరత్వంలో రాణి లక్ష్మీ బాయి కి, రాణి రుద్రమ దేవికి మరియు రాణి దుర్గావతి కీ సరిసమానమైన వ్యక్తి.


7 వ శతాబ్దం నుండి మన భారతదేశానికి మరియు అరేబియన్ దేశాలకు మధ్య వాణిజ్య సంబంధాలుండేవి (యుద్ధ గుర్రాలు, మసాలా దినుసులు, బట్టల వ్యాపారం జరిగేది). చాలా యూరోపియన్ దేశాలు మన భారతదేశానికి సముద్రమార్గాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి అప్పటికి. 1498 లో మొదటిసారి వాస్కోడిగామా మన భారతదేశంలోని కాలికట్ ప్రాంతానికి సముద్రమార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. యూరోపియన్ దేశాల నుంచి మొదట భారత్ కి వచ్చింది పోర్చుగీస్.


ఐదు సంవత్సరాల తరువాత పోర్చుగీసు వాళ్లు మొదటి ఓడరేవును కట్టారు. దాని తర్వాత వాళ్లు వివిధ నౌకాశ్రయాలు కట్టారు. మనదేశం తో సహా మస్కట్, మొజాంబిక్, శ్రీలంక, ఇండోనేసియా తో పాటు ఎక్కడో దూరంలో చైనాలో ఉన్న మకావు కలుపుతూ సముద్ర మార్గాన్ని నిర్మించారు. 20 సంవత్సరాలలో పోర్చుగీస్ ఈ మార్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది.


భారతీయులకు, అరబ్బులకు, పెర్షియన్ మరియు ఆఫ్రికన్ ఓడలకు హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం ఉచితంగా ఉండేది. 16 వ శతాబ్దం నాటికి పోర్చుగీస్ యొక్క ఆధిపత్యాన్ని ఏ ఒక్క యూరోపియన్ దేశం అడ్డుపడలేకపోయాయి (డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ వాళ్ళు 17 వ శతాబ్దం మొదట్లో భారత్ లోకి వచ్చారు). 

ఎప్పటి నుండి అయితే ఈ సముద్ర మార్గంలో పోర్చుగీస్ ఆధిపత్యం పెరిగిందో అప్పటి నుండి వాళ్లు రుసుములు విధించడం మొదలుపెట్టారు. పోర్చుగీస్ వాళ్లకు స్థానికంగా ఉన్న రాజులు ఎదురుతిరిగిన వాళ్లను ఓడించి ఆ మార్గాన్ని వశం చేసుకున్నారు.


1526 లో పోర్చుగీస్ మంగళూర్ పోర్ట్ ని ఆక్రమించిన తర్వాత వాళ్ళ తదుపరి లక్ష్యం ఉల్లాల పోర్ట్ పైన పెట్టారు. ఉల్లాల అనేది చౌత రాజు 3 వ తిరుమల రాయ రాజధాని. అది విజయనగరం రాజ్యం కీ కట్టుబడి ఉండేది. చౌతలు మొదట జైన్ రాజులు వాళ్ళు 2 వ శతాబ్దం లో గుజరాత్ నుండి వలస వచ్చారు (అది ఇప్పుడు దక్షిణ కన్నడ, ఉడిపి మరియు కేరళలోని కాసర్ గోడ్ జిల్లా వరకు ఉంది). చౌత లు మాతృస్వామ్య రాజవంశీయులు. ఆ రాజు యొక్క మేన కోడలే రాణి అంబక్క. ఆ రాజు అంబక్క ను దత్తత తీసుకొని రాజ్యానికి రాణిగా ప్రకటించాడు. ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు కత్తి యుద్ధం, విలు విద్య, గుర్రపు స్వారీ, సైనిక వ్యూహం, దౌత్య పరమైన అన్ని విద్యలలో చిన్నప్పటి నుండే ఆరితేరింది. ఆమె రాజ్య సింహాసనం అధిరోహించిన నాటి నుండే రాజ్యానికి పోర్చుగీస్ నుండి ఉన్న ముప్పు తెలుసు. 3 వ తిరుమల రాయ చనిపోయేముందు రాణి అంబక్క ని లక్ష్మప్ప బంగరాజ(మంగళూర్ రాజు) తో వ్యూహాత్మక వివాహ కూటమి ఒప్పందంతో పెళ్లి జరిగింది. అంబక్క కి పెళ్లి అయినా కూడా తన ముగ్గురు పిల్లలతో తన సొంత ఇంట్లో ఉల్లాల లో ఉండసాగింది. కొన్ని రోజులకు వాళ్ళ వైవాహిక బంధం తెగిపోయింది బంగరాజ పోర్చుగీస్ తో సంధి చేసుకోవడం వల్ల.


అంబక్క నాయకత్వంలో వెలిగిపోతున్న ఉల్లల రాజ్యం పైన పోర్చుగీస్ ఒక కన్ను వేసి ఉంచారు. ఆమె నుండి అధిక పన్నులు వసూలు చేయడమే కాక ఆమె పైన మితిమీరిన ఆంక్షలు వేయడంతో ఆమె పోర్చుగీస్ కి ఎదురు తిరిగింది. పోర్చుగీస్ వాళ్లు తన ఓడలో పైన దాడి చేసిన కూడా అరబ్స్ తో వ్యాపారం చేయడం ఆపలేదు. మగవీరుల, బిల్లవా విలు విద్యలు మొదలు మప్పిలః తెడ్డులు నడిపే అన్ని కులాలకు మరియు మతాలకు అతీతంగా తన సైన్యంలో మరియు నౌకా దళంలో మగవారు ఉండేవాళ్ళు.


ఆమె మొండిపట్టు ని చూసి పోర్చుగీస్ పలుమార్లు ఉల్లలా పైన దాడి చేశారు. 1556 సంవత్సరంలో మొదటి సారి పోర్చుగీస్ అడ్మిరల్ డాన్ అల్వరో డి సివేరియా ఆధ్వర్యంలో యుద్ధం చేశారు కానీ అది అననుకూల సంది జరిగింది. మళ్లీ 2 సంవత్సరాల తర్వాత పోర్చుగీస్ అతి పెద్ద సైన్యంతో ఉల్లాల పైకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు అంబక్క మాస్టర్ యుద్ధవ్యూహాలతో మరియు దౌత్య వ్యూహంతో (అరబ్బులు మరియు కోజికోడ్ జమోవియా వాళ్లతో చేతులు కలిపి) పోర్చుగీస్ వాళ్లను ఓడించి వెను తిరిగేలా చేసింది.


General Joao Pexixoto ఆధ్వర్యంలో మరోసారి ఉల్లల పైన దాడి చేసి కోటను ఆక్రమించుకున్నారు. కానీ అప్పటికే వాళ్ళ దాడిని గ్రహించిన రాణి ఆ కోట నుండి తప్పించుకుని పారి పోయింది. అదే రోజు రాత్రి ఆమెకు నమ్మకం గా ఉండే 200 మంది సైనికులతో పోర్చుగీస్ స్థావరాలపై మహాకాళి ల రౌద్రరూపం దాల్చి విరుచుకుపడింది. 70 మంది సైనికులతో పాటు ఆమె కోటను ఆక్రమించిన General ను నరికి చంపింది. ఆమె రౌద్రానికి భయపడిన మిగతా పోర్చుగీస్ సైన్యం పడవలలో పారిపోయారు.


రాణి అంబక్క ధైర్యాన్ని మరియు మనో నిబ్బరం మిగతా రాజులకు కూడా స్ఫూర్తినిస్తున్న విషయం పోర్చుగీస్ వారు జీర్ణించుకోలేకపోయారు. వేరే రాజులతో ఆమెను బెదిరించడానికి ప్రయత్నించాలని చూసారు. అంతే కాకుండా స్వయానా తన భర్త యుద్ధం చేస్తాము మరియు ఉల్లాల రాజ్యాన్ని తగులబెడతామని బెదిరించిన కూడా బెదరలేదు.


ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా నా అదరని మరియు బెదరని రాణి అంబక్క ను చూసి పోర్చుగీస్ ఖంగుతిన్నారు. ఈసారి Anthony D Noronha ( Portuguese Viceroy of Goa) ను రంగంలోకి దింపారు. 1571 లో మూడువేల మంది పోర్చుగీస్ సైన్యంతో Armada అనే యుద్ధనౌక సహాయంతో ఉల్లాల పైన మెరుపు దాడి చేశారు.


రాణి అంబక్క తన కులదైవాన్ని దర్శనం చేసుకొని కోటకు బయలుదేరి వస్తుంటే మార్గ మధ్యలో కోట కాపలాదారుడు వచ్చి జరిగిన ఉదంతం చెప్పగానే వెను వెంటనే తన గుర్రాన్ని యుద్ధ రంగం వైపు తిప్పింది. ఒక మెరుపుల, ఒక మహాచండీ ల యుద్ధ భూమిలోకి దూకింది. భరతమాత కోసం, దేశం కోసం అని అరుస్తూ యుద్ధభూమిలో కి దిగింది. అటు నేల పైన మరియు ఇటు సముద్రంలో, అటు వీధి వీధిలో మరియు ఇటు సముద్రతీరంలో యుద్ధం భీకరంగా సాగింది. మెల్లగా ఒడ్డు పైన ఉన్న పూర్తి పోర్చుగీస్ సైన్యాన్ని సముద్రంలోకి దింపుతూ వాళ్ల పడవలలో పారిపోయేలా చేశారు. ఇటు పిమ్మట ఒడ్డు పైన ఉన్న తన సైన్యాన్ని అగ్ని బాణాలు వేయించ సాగింది. నేలపై నుండి కొన్ని వేల బాణాలు సముద్రంలో ఉన్న పోర్చుగీస్ పైకి వేయించి వాళ్లను సముద్రంలోనే మట్టు పెట్టించింది..


కానీ యుద్ధంలో గాయపడిన రాణి అంబక్క ను ఎలాగైనా చంపాలని సామంతులకు డబ్బు మభ్యపెట్టి ఆమె పైకి యుద్ధం చేయించారు. కానీ భయమంటే ఎరుగని రాణి తను గాయాలపాలైన కూడా యుద్ధం చేస్తూ కదనరంగంలో కన్నుమూసింది.

ఒక గొప్ప వీర వనిత మాతృదేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. రాణి అంబక్క పోర్చుగీస్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని ఘట్టం. చిరస్మరణీయురాలు అయ్యింది. భారతదేశం ఉన్నన్ని రోజులు ఈ భారతీయులం అందరం మీకు రుణపడి ఉంటాము అంబక్క.


తన వీరత్వానికి ప్రతీకగా మరియు భయం అంటూ ఎరుగని తన ధైర్యానికి దాసోహమంటూ 2015 లో మోడీ ప్రభుత్వం నౌకా దళం లోని ఒక నౌకకి రాణి అంబక్క పేరు పెట్టి తమ రుణం తీర్చుకున్నారు.


గమనిక: మన భారతీయ చరిత్రలో మన రాజుల మరియు రాణులు ఏ రోజూ కూడా మొఘలుల చేతిలో మరియు బ్రిటిష్ వాళ్ల చేతిలో ఓడిపోలేదు, చనిపోలేదు. మన వాళ్ళ వెన్నుపోటు వల్లనే చనిపోయారు.


జయహో రాణి అంబాక్క జయహో

Copied..

Panchaag


 

మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది రెండవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*42.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ|*


*వధం నిశమ్య గోవిందరామవిక్రీడితం పరమ్॥9895॥*


 *42.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*దీర్ఘప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతిః|*


*బహూన్యచష్టోభయథా మృత్యోర్దౌత్యకరాణి చ॥9896॥*


బలరామకృష్ణులు అవలీలగా ధనుస్సును విఱిచిన విషయములను, దాని రక్షణకై తాను పంపిన యోధులను వధించిన సంగతులను కంసునకు తెలియవచ్చెను. ఆ యదువీరుల బలపరాక్రమములకు అతడు ఎంతయు భీతిల్లెను. దుశ్చింతలలో మునిగియున్న ఆ దుష్టునకు నిద్రయే కఱవయ్యెను. కనులు మూసినను, తెరచినను మృత్యుసూచకములైన పెక్కు అపశకునములు గోచరింపసాగెను.


 *42.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి|*


*అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా॥9897॥*


నీళ్ళలోను, అద్దమునందును చూచుకొనినప్పుడు వాని ప్రతిబింబమునందు అతనికి శిరస్సు లేకుండ మొండెము మాత్రమే కనబడుచుండెను. ఆకాశమున చంద్రుడు ఒక్కడే ఉన్నప్పటికిని ఇద్దఱుగా గోచరించుచుండెను. అట్లే ప్రతి నక్షత్రము రెండుగా కనబడసాగెను.


*42.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*ఛిద్రప్రతీతిశ్ఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతిః|*


*స్వర్ణప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనమ్॥9898॥*


వానికి తన నీడయందు శరీరము శిథిలమైనట్లుగ తోచుచుండెను. చెవులలో చేతుల వ్రేళ్ళు ఉంచినప్పుడు ప్రాణములయొక్క శబ్దములు వినబడకుండెను. వృక్షములు బంగారుఛాయలతో ఒప్పుచున్నట్లు కనబడుచుండెను. దుమ్ములమీదను, బురదపైనను అడుగిడుచున్నప్పుడు పాదముద్రలు కనబడకుండెను.


*42.30 (ముప్పదియవ శ్లోకము)*


*స్వప్నే ప్రేతపరిష్వంగః ఖరయానం విషాదనమ్|*


*యాయాన్నలదమాల్యేకస్తైలాభ్యక్తో దిగంబరః॥9899॥*


స్వప్నములలో ప్రేతలను కౌగలించుకొనుచున్నట్లుగను, గాడిదపై ఎక్కిపోవుచున్నట్లుగను, విషమును భక్షించుచున్నట్లుగను చూచు చుండెను. ఇంకను జపాకుసుమమాలను ధరించినట్లుగను, శరీరమునందు అంతటను నూనెను పూసికొనినట్లుగను, దిగంబరముగా ఉన్నట్లుగను తోచసాగెను.


*42.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*అన్యాని చేత్థం భూతాని స్వప్నజాగరితాని చ|*


*పశ్యన్ మరణసంత్రస్తో నిద్రాం లేభే న చింతయా॥9900॥*


ఈ విధముగా అతనికి స్వప్నజాగ్రదవస్థలయందు ఇంకను పెక్కు అపశకునములు పొడసూపెను. ఆ కారణమున అతని చింత అధికమాయెను. మృత్యుభీతి మెండయ్యెను, కంటికి కునుకు లేకుండెను.


*42.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*వ్యుష్టాయాం నిశి కౌరవ్య సూర్యే చాద్భ్యః సముత్థితే|*


*కారయామాస వై కంసో మల్లక్రీడామహోత్సవమ్॥9901॥*


పరీక్షిన్మహారాజా! ఆ రాత్రి ఎట్లో గడచెను. సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించెను. అంతట ఆ కంసుడు మల్లక్రీడా మహోత్సవమునకై ఆదేశించెను.


*42.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*ఆనర్చుః పురుషా రంగం తూర్యభేర్యశ్చ జఘ్నిరే|*


*మంచాశ్చాలంకృతాః స్రగ్భిః పతాకాచైలతోరణైః॥9902॥*


వెంటనే కొంతమంది రాజోద్యోగులు మల్లరంగమును సిద్ధపఱచి, దానిని చక్కగా అలంకరించిరి. తూర్యధ్వనులు, ఢంకాధ్వనులు మొదలయ్యెను. ప్రేక్షకులు కూర్చుండుటకై మంచెలను నిర్మించి, వాటిని పూలమాలలతోడను, పతాకములతోను, వస్త్రములతోను, తోరణములతోడను అలంకరించిరి.


*42.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*తేషు పౌరా జానపదా బ్రహ్మక్షత్రపురోగమాః|*


*యథోపజోషం వివిశూ రాజానశ్చ కృతాసనాః॥9903॥*


బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు పౌరులు, జానపదులు రాజాజ్ఞప్రకారము అందు ప్రవేశించి, తమ తమ స్థానములలో కూర్చుండిరి. ఆహ్వానములపై ఇతరదేశముల నుండి వచ్చిన రాజులు యథోచితముగా ఆసనములను అలంకరించిరి.


*42.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*కంసః పరివృతోఽమాత్యై రాజమంచ ఉపావిశత్|*


*మండలేశ్వరమధ్యస్థో హృదయేన విదూయతా॥9904॥*


కంసప్రభువు రాజసింహాసనముపై ఆసీనుడయ్యెను. మంత్రులను, మండలేశ్వరులును అతని చుట్టును జేరి కూర్చుండిరి. కాని, అపశకునముల కారణముగా అతని మనస్సు మాత్రము ఆందోళనకు గుఱియైయుండెను.


*42.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*వాద్యమానేషు తూర్యేషు మల్లతాలోత్తరేషు చ|*


*మల్లాః స్వలంకృతా దృప్తాః సోపాధ్యాయాః సమావిశన్॥9905॥*


తూర్యాది వాద్యములు మ్రోగదొడంగెను. అప్పుడు మదించియున్న మల్లయోధులు చక్కగా అలంకృతులై, భుజాస్ఫాలన మొనర్చుచు, తమ మల్లాచార్యులతోగూడి అందు ప్రవేశించిరి.


*42.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*చాణూరో ముష్టికః కూటః శలస్తోశల ఏవ చ|*


*త ఆసేదురుపస్థానం వల్గువాద్యప్రహర్షితాః॥9906॥*


చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలుడు మొదలగు ప్రముఖ మల్లయోధులు వినసొంపైన వాద్యధ్వనులకు పొంగిపోవుచు రంగస్థలమునకు చేరిరి.


*42.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*నందగోపాదయో గోపా భోజరాజసమాహుతాః|*


*నివేదితోపాయనాస్త ఏకస్మిన్ మంచ ఆవిశన్॥9907॥*


కంసుని ఆహ్వానముపై వచ్చిన నందుడు మొదలగు గోపాలురు అందు ప్రవేశించి, తాము తీసికొనివచ్చిన కానుకలను ఆ కంసరాజునకు సమర్పించిరి. పిమ్మట వారు తమ కొఱకై ఏర్పాటు చేయబడిన మంచెలపై ఆసీనులైరి.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే మల్లరంగోపవర్ణనం నామ ద్విచత్వారింశోఽధ్యాయః (42)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షక భటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట* యను నలుబది రెండవ అధ్యాయము (42)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 

*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*373వ నామ మంత్రము* 


*ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః*


కామేశ్వరునకు జీవనాడి వంటి పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కామేశ్వర ప్రాణనాడీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః*

 అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకులు ఆ తల్లి కరుణచే భౌతికపరమైన శాంతిసౌఖ్యములతోబాటు, ఆముష్మికపరమైన అభీష్టముల సిద్ధి లభించును.


పరమేశ్వరి శంకరుని జీవనాడి వంటిది. *శంకరుడు భయంకరమైన విషమును మ్రింగినను మరణమును పొందలేదు. దానికి కారణము నీ తాటంకముల మహిమయే గదా* అని శంకరభగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలో ఇరువది ఎనిమిదవ శ్లోకంలో ఇలా అన్నారు:


*సుధామప్యఅర్ధము్య - ప్రతిభయ జరమృత్యు హరిణీం*

*విపద్యంతే విశ్వే - విధి శతమఖాద్యా దివిషదః |*


*కరాలం యత్ క్ష్వేలం - కబలితవతః కాలకలనా*

*న శంభోస్తన్మూలం - తవ జనని తాటంక మహిమా॥*

 

దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడా నిరోధింప బడును.


 ఓ పరమేశ్వరీ! బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ముసలితనాన్ని, మృత్యువును జయించాలని అమృతాన్ని సేవించారు. కాని ప్రయోజనం లేకపోయింది. వారందరూ ప్రళయకాలం వేళ కాలధర్మాన్ని పొందుతున్నారు. కాని అమృతమును కాకుండా మృత్యుతుల్యమైన,అతి ఉగ్రమైన, కాలకూట విషాన్ని మింగిన నీ భర్త పరమశివుడు మాత్రం ప్రళయకాలమందు కూడా కాలధర్మం చెందక కాలాతీతుడై, మృత్యుంజయుడైనాడు.దీనికి కారణం ఏమిటంటే తల్లీ...అదంతా పరమ పవిత్రమైన, పతివ్రతమైన నీయొక్క చెవికమ్మల ప్రభావమే కదా!


తల్లీ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలూ భయంకరమైన జరామృత్యువులను హరించే అమృతాన్ని గ్రోలి ప్రళయకాలంలో మరణిస్తున్నారు. అతిభయంకరమై లోకాలను దహించే కాలకూటమనే మహావిషాన్ని భక్షించిననూ నీ పతి శంభుడికి (శివుడికి) మరణం సంభవించలేదు. ఇందుకు ముఖ్యకారణం నీ చెవులకు భాసిల్లే రత్నతాటంకాల (రత్నాల కమ్మల) ప్రభావమే కదా! (నీ తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము).


తాటాకు, తాళి, తాటంకములు ఇవన్నీ తాటి ఆకు లో నుంచి వచ్చిన పదములు. తాటంకములు అంటే చెవి కమ్మలు.  ఇవి మంగళ సూచకములు. పూర్వపు రోజులలో తాళి, తాటంకములు అన్నీ తాటి ఆకుతో చేసినవే. తాళ పత్రములు అంటే తాటి ఆకులు, వీటి మీదనే మన శాస్త్రములన్నీ మనకు అందించ బడినాయి. కాగితము లేని రోజులలో ఈ తాళ పత్రములనే వాడే వారు. వాటినే తాళ పత్ర గ్రంథములు అని వాటిని పిలిచేవారు. పూర్వపు రోజులలో మరియు ఇప్పటికీ భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవము ఈ తాటాకు పందిళ్ల క్రిందనే జరుగుతుంది. విసన కర్రలు కూడా ఈ తాటాకు తోనే చేస్తారు. ముఖ్యముగా శ్రీ రామ నవమి నాడు ఈ విసన కర్రల వినియోగము చాలా ఎక్కువగా వుంటుంది. తాటాకుతో చేసిన విసనకర్రలను పేద బ్రాహ్మణునికి దానం ఇస్తే మహా పుణ్యము. వడ పప్పు, దక్షిణ తాంబూలములతో తాటాకు విసన కర్రలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం నేటికి ఆచారముగా వున్నది. 


చెవులలో ఈ తాటాకును దూర్చుకొని ఆభరణముగా కూడా వాడే వాళ్ళు.  అలా వచ్చినవి ఈ తాటంకములు. చెవి కమ్మలు. చెవికి పెట్టుకొనే ఆభరణములు.


తమిళనాడు లోని జంబుకేశ్వరం. ఒకప్పుడు జంబు మహర్షి ఇక్కడ తప మాచరించి శివుణ్ణి పూజించి నందువలన ఈ ఈశ్వరుణ్ణి జంబుకేశ్వరుడు అని అందురు. ఇది ఆపోలింగము.  శివ లింగము వున్న భాగములో ఎప్పుడూ నీరు ఊరుతూ వుంటుంది. జంబుకేశ్వరం లో అమ్మ వారు అఖిలాండేశ్వరి ఉగ్రకళతో చాలా భయంకరముగా ఉండేదని, తలుపులు తీయడానికి కూడా అర్చకులు భయపడుతూ వుండేవారు అని, కొంతమంది ఆమె ఉగ్రకళకు గురి అవుతూ వుండేవాళ్ళు అని పెద్దలు చెబుతూ వుండేవారు. ఇదే విషయాన్నీ వారు ఆచార్యులు వారు అక్కడకు వచ్చినప్పుడు విన్నవించుకొన్నారు. జగద్గురువులు అమ్మను ప్రార్ధించి అమ్మ యొక్క ఉగ్రకళను ఆవాహన చేసి శ్రీచక్ర రూపములో తాటంకములు చేయించి అమ్మ వారికి కర్ణాభరణములుగా అమ్మ వారికి సమర్పించినారు. అచ్చటనే వినాయకుడ్ని కూడా స్థాపించినారు అని పెద్దలు చెబుతూ వుంటారు. అప్పటి నుంచి అమ్మ ఉగ్ర రూపము పోయి సౌమ్యవతి అయినది అని కూడా చెబుతూ వుంటారు. ఇప్పటికీ అమ్మ వారి తాటంకములను తీయాలంటే మెరుగు కోసము  కంచి కామ కోటి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమమును వారి చేతుల మీదుగా నిర్వర్తిస్తారు అని అంటారు. అంత గొప్ప శక్తి వంతమైనవి అమ్మవారి తాటంకములు. మాంగల్య బలము తక్కువగా   వున్న వాళ్ళు అక్కడకి వెళ్లి అమ్మ యొక్క తాటంకములను దర్శించి వస్తే  దోషము పోతుందని గట్టి నమ్మకము. నిజము కూడా. 


ఇదే విషయాన్ని పోతనగారు తన భాగవతంలో ఇలా చెప్పారు:


*క.కంద పద్యము*


మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!


ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.


(ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. 


అమ్మవారి మంగళ సూత్రము ఒక్కటేకాదు, ఆ తల్లి ధరించిన తాటంకముల మహిమకూడా హాలాహల భక్షణానంతరం శివునికి మరణము లేకుండా.చేసినది. గనుకనే ఆ తల్లి *కామేశ్వరప్రాణనాడీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు

*ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*833వ నామ మంత్రము*


*ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః*


ఏబదియొక్క పీఠములు (మాతృకావర్ణాధిదేవతల) స్వరూపిణిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పంచాశత్పీఠరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునికి మానవజన్మకు, మానవేతర జన్మకు గల భేదము, మానవజన్మను పొందినందుకు ఆ పరమేశ్వరి నామమంత్రస్మరణతో కైవల్యమునందడానికి గల మార్గము ఆ తల్లి అనుగ్రహము వలన తెలియును.


జగన్మాత ఏబదియొక్క శక్తిపీఠముల స్వరూపిణిగా విరాజిల్లుతున్నది అని భావము. 


*పంచాశత్పీఠ* యనగా ఏబది (50) మాత్రమే యథార్థమైన అర్థము. కాని ఏబదికి దగ్గరగా ఉన్నసంఖ్య ఏబది ఒకటిని గ్రహించినచో ఈ నామ మంత్రమునకు సరైన భావము మనకు తెలియును. భాస్కరరాయలు వారు ఏబది ఒకటి అని తీసుకోవడానికి చాలా ప్రమాణాలు తెలియజేశారు. కాని, కొన్ని ప్రమాణములను మాత్రమే గ్రహించి వివరణచేయు ప్రయత్నము జరిగినది.


దక్షయజ్ఞంలో సతీదేవి భర్త అయిన పరమేశ్వరునకు అవమానం జరిగి, సతీదేవి ఆత్మత్యాగముచేయగా, పరమేశ్వరుడు సతీదేవి దేహంతో ప్రళయతాండవము ప్రారంభించాడు. లోకాలు ఆ రుద్రుని తాండవమునకు తల్లడిల్లిపోతుంటే, నారాయణుడు తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండించగా, ఆ ఖండములు *ఏబది ఒక్కచోట* పడి, శక్తిపీఠములుగా వెలసినవి. గనుక శ్రీమాత *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది.


జగన్మాత అకారాది క్షకారాంత మాతృకా వర్ణరూపిణి. మాతృకా వర్ణములు ఏబది ఒకటి (51) *అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ అం అః క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష)*. ఈ అక్షరములకు అధిదేవతలు (శక్తిలు) గలరు. వారు నెలకొని యున్న ప్రతీ ఒకటి ఒక్కొక్క శక్తి పీఠమై విలసిల్లుచున్నవి. అటువంటి ఏబదిఒక శక్తిపీఠముల స్వరూపము తనదిగా భాసిల్లు పరమేశ్వరి *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది🙏🙏🙏


ఈ అధిదేవతలకు, మనదేహంలో ఉన్న షట్చక్రములకు, లలితాసహస్ర నామస్తోత్రంలోని కొన్ని శ్లోకములతో సమన్వయించి ఇక్కడ వివరణ చేయబడినది.


*శ్రీలలితా సహస్ర నామస్తోత్రంలోని*


98వ శ్లోకము:-


*విశుద్ధచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా|*


*ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా॥98॥*


99వ శ్లోకము:-


*పాయసాన్నప్రియా త్వక్-స్థా పశులోక భయంకరీ|*


*అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ॥99॥*


కంఠస్థానమునందున్న విశుద్ధిచక్రములో పదహారు (16) దళముల పద్మము మధ్యగల కర్ణికలో *డాకినీదేవి* ఏకముఖముతో పాటలవర్ణము (ఎరుపు-తెలుపు కలిసిన వర్ణము) లో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని చర్మధాతువు (త్వక్) నందు శక్తిని ప్రసాదించును. పాయసాన్నము అనిన ఈ దేవతకు ఇష్టము. ఈ విశుద్ధిచక్రంలోని పదహారు దళములందు గల పదహారు దేవతలు *డాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పదహారు మంది మాతృకావర్ణములలోని *అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ* అను పదహారు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4.ఈశాని, 5. ఉమా, 6. ఊర్థ్వకేశి, 7. ఋద్ధిర, 8. ౠకార, 9. ఌకార, 10. ౡకార, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 15. అఃక్షర.


100వ శ్లోకము:-


*అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా|*


*దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాది ధరా రుధిర సంస్థితా॥100॥*


101వ శ్లోకము:-


*కాళరాత్ర్యాదిశక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా|*


*మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణీ॥101॥*


హృదయస్థానము నందున్న అనాహతచక్రములో గల పండ్రెండు (12) దళముల పద్మము మధ్యగల కర్ణికలో *రాకినీదేవి* రెండు ముఖములతో శ్యామలవర్ణము (ఎరుపుతో కూడిన నలుపు) లో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని రక్త ధాతువు నందు శక్తిగా ఉన్నది. నేతితో కలిపిన అన్నము ఈమెకు ఇష్టము. ఈ అనాహతచక్రంలోని పండ్రెండు దళములందు గల పండ్రెండు దేవతలు *రాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పండ్రెండు దేవతలు మాతృకావర్ణములలోని *క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ* అను పండ్రెండు అక్షరములకు అధిదేవతలు. వారు 1. కాళరాత్రి, .2. ఖాతీత, 3. గాయత్రి, 4. ఘంటాధారిణి, 5. ఙామిని, 6. చంద్ర, 7. ఛాయా, 8. జయా, 9. ఝంకారి, 10. ఙ్ఞానరూపా, 11. టంకహస్తా, 12. ఠంకారిణి.


102వ శ్లోకము


*మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా|*


*వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా॥102॥*


*రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా|*


*సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ॥103॥*


నాభిస్థానమునందున్న మణిపూరచక్రములో పది దళముల పద్మమందలి మధ్య కర్ణికలో *లాకినీదేవి* మూడు ముఖములతో ఎరుపు వర్ణములో విరాజిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని మాంసధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు బెల్లము కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈ మణిపూరచక్రంలోని పద్మమునకు పది దళములు ఉంటాయి. ఈ పది దళములందు గల పది దేవతలు *లాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పది దేవతలు మాతృకావర్ణములలోని *డ ఢ ణ త థ ద ధ న ప ఫ* అను పది అక్షరములకు అధిదేవతలు. వారు :- 1.డామరి, 2. ఢంకారిణి, 3. ణామిరి, 4. తామసి, 5. స్థాణ్వి, 6. దాక్షాయిణి, 7. ధాత్రి, 8. నందా, 9. పార్వతి, 10. ఫట్కారిణి


104వ శ్లోకము


*స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా|*


*శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణాఽతిగర్వితా॥104॥*


105వ శ్లోకము


*మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా|*


*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ॥105॥*


ఉదరస్థానము నందున్న స్వాధిష్ఠానచక్రములో ఆరు దళముల పద్మమునందు మధ్య కర్ణికలో *కాకినీదేవి* నాలుగు ముఖములతో పచ్చని వర్ణములో భాసిల్లుచున్నది. ఈ దేవత మనశరీరంలోని మేధస్సు ధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు పెరుగు కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈపద్మములోని ఆరు దళములందు గల ఆరు దేవతలు *కాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ ఆరు దేవతలు మాతృకావర్ణములలోని *బ భ మ య ర ల* అను ఆరు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. బందిని, 2. భద్రకాళి, 3. మహామాయ, 4. యశస్విని, 5. రమా, 6. లంబోష్టితా.


106వ శ్లోకము


*మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రాఽస్థి సంస్థితా|*


*అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా॥106॥*


107వ శ్లోకం (మొదటి పాదం)


*ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ|* (107వ శ్లోకం, మొదటిపాదము)


పిరుదుల స్థానమునకు పైన, జననేంద్రియ స్థానమునకు క్రిందను గల మూలాధార చక్రములో నాలుగు దళముల పద్మమందలి కర్ణికలో *సాకినీదేవి* నాలుగు ముఖములతో దూమ్ర వర్ణములో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని అస్థి (ఎముకల) ధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు పప్పు కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈ మూలాధార చక్రంలోని పద్మమునకు నాలుగు దళములు ఉంటాయి. ఈ నాలుగు దళములందు గల నాలుగు దేవతలు *సాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ నాలుగు దేవతలు మాతృకావర్ణములలోని *వ శ ష స* అను నాలుగు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. వరదా, 2. శ్రీ, 3. షండా, 4. సరస్వతి.


107వ శ్లోకం (రెండవ పాదము)


*ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా॥107॥* (రెండవ పాదము)


*మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా|*


*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ॥108॥*


భ్రూమధ్యమునందు గల ఆఙ్ఞా చక్రము. ఇది గంగ, యమున, సరస్వతి సంగమ స్థానము. ఇడ, పింగళ, సుషుమ్నసంగమ స్థానము, వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి సంగమస్థానము, చంద్రఖండము, సూర్యఖండము, అగ్నిఖండము సంగమ స్థానము, చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలము సంగమ స్థానము. 

ఇక్కడ గల ద్విదళ పద్మమునందు హాకినీ దేవి రూపములో భ్రూమద్యస్థానమందున్న ఆఙ్ఞా చక్రములో రెండు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు ఆరు ముఖములతో శుక్ల (తెల్లని) వర్ణము కలిగి భాసిల్లుతున్నది.

ఈ దేవి మజ్జ (ఎముకల మద్య ఉండు) ధాతువు నందు శక్తి రూపమై ఉంటుంది. ఈమెకు పసుపుఅన్నము (పులిహోర) అనిన ఇష్టము. ఇక్కడ హంసవతీ, క్షమావతి అను ఇద్దరు శక్తి దేవతలు హాకినీ దేవిని సదా సేవిస్తూ ఉంటారు. భ్రూమధ్యమునందు *హ క్ష* అను అక్షరములతోబాటు మధ్య *ళ* (ద్రవిడభాషల ప్రకారము) అను అక్షరముగూడ గలదని కొందరు పండితులుచెబుతుంటారు.


ఇంతవరకూ మనం తెలుసుకున్న వివరముల ప్రకారం



విశుద్ధి చక్రంలో - 16


అనాహత చక్రంలో - 12


మణిపూర చక్రంలో - 10


స్వాధిష్ఠాన చక్రంలో - 6


మూలాధార చక్రంలో - 4


ఆజ్ఞా చక్రంలో - 2


*వెరసి 50 అక్షరములు, 50 దేవతలు*


(కాని ఆజ్ఞా చక్రంలో హ, క్ష అను అక్షరముల మాత్రమేగాక ద్రవిడ భాషలప్రకారం మధ్యలో *ళ* అను అక్షరం కూడా తీసుకొనవచ్చునని విజ్ఞులు వివరించారు) 


*గనుక వెరసి అక్షరములు 51* గా భావించవచ్చును.


వీటినే *పంచాశత్పీఠములు* అందురు. ఆయాపీఠములలో ఆయాదేవతల రూపంలో పరమేశ్వరి విరాజిల్లుతున్నది గనుక అమ్మవారు *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది.


ఇక్కడ ఒక సందేహం రావచ్చు. విశుద్ధిచక్రం నుండి క్రిందికి వచ్చి మరల ఆజ్ఞాచక్రమును చెప్పుకొనుటలో ఔచిత్యమేమిటి అనగా, ఇక్కడి వివరణ: 


మాతృకావర్ణ వివరణ *అ* కారం నుండి ప్రారంభ అయినది గనుక, కంఠస్థానములో నున్న విశుద్ధిచక్రం నుండి వివరణ ప్రారంభమయినది. భ్రూమధ్యంలో గల ఆజ్ఞాచక్రంలో గల *హ క్ష* అను అక్షరములు చివరలో చెప్పబడినవి గనుక మూలాధార చక్ర వివరణ అయిన తరువాత ఆజ్ఞాచక్రవివరణ చెప్పబడినది.


వేరొక కారణమేమిటి అంటే - కంఠస్థానములో నున్న విశుద్ధిచక్రము ఆకాశతత్త్వము, తరువాత అనాహతచక్రము వాయుతత్త్వము, ఆ తరువాత మణిపూర చక్రము అగ్నితత్త్వము, స్వాధిష్ఠాన చక్రము జలతత్త్వము, మూలాధార చక్రము పృథ్వీతత్త్వము. అందుచే పంచభూతముల క్రమం ప్రకారం ఈ వివరణలో విశుద్ధిచక్రం నుండి ప్రారంభించడమైనది. చివరగా వివరించిన ఆజ్ఞాచక్రము మనస్సుకు సంబంధించినది. శరీరంలోని పంచభూతములను నియంత్రించేది ఆజ్ఞాచక్రము. అందుచే వివరణ ఈ క్రమంలో జరిగినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

మహాభాగవతం



*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది రెండవ అధ్యాయము*


*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*42.14 (పదమూడవ శ్లోకము)*


*తద్దర్శనస్మరక్షోభాదాత్మానం నావిదన్ స్త్రియః|*


*విస్రస్తవాసఃకబరవలయాలేఖ్యమూర్తయః॥9883॥*


శ్రీకృష్ణుని దర్శనమైనంతనే నగరభామినుల మనస్సులు ఆ స్వామిపట్ల ఆకర్షింపబడెను. అంతట వారు తమను తాము మఱచిపోయిరి. ఆ పారవశ్యములో వారి వస్త్రములు, కొప్పుముడులు, కంకణములు సడలిపోసాగెను. అప్పుడు వారు చిత్తరవులవలె ఎక్కడివారక్కడ నిశ్చేష్టలై ఉండిపోయిరి.


*42.15 (పదునైదవ శ్లోకము)*


*తతః పౌరాన్ పృచ్ఛమానో ధనుషః స్థానమచ్యుతః|*


*తస్మిన్ ప్రవిష్టో దదృశే ధనురైంద్రమివాద్భుతమ్॥9884॥*


*42.16 (పదహారవ శ్లోకము)*


*పురుషైర్బహుభిర్గుప్తమర్చితం పరమర్ద్ధిమత్|*


*వార్యమాణో నృభిః కృష్ణః ప్రసహ్య ధనురాదదే॥9885॥*


అనంతరము శ్రీకృష్ణుడు పౌరులద్వారా ధనుర్యాగ స్థానమును తెలిసికొని అందు ప్రవేశించెను. అచట ఆ స్వామి ఇంద్రధనుస్సువలె అద్భుతమైన ఒక వింటిని చూచెను. స్వర్ణాలంకార శోభితమైన ఆ ధనుస్సును కొందఱు పురుషులు పూజించుచుండిరి. పెక్కుమంది యోధులు కడు జాగరూకులై దానిని రక్షించుచుండిరి. రక్షకభటులు వారించుచున్నను వారిని లెక్కసేయక శ్రీకృష్ణుడు బలప్రయోగముతో దానిని తన చేతిలోనికి తీసికొనెను.


*42.17 (పదిహేడవ శ్లోకము)*


*కరేణ వామేన సలీలముద్ధృతం సజ్యం చ కృత్వా నిమిషేణ పశ్యతామ్|*


*నృణాం వికృష్య ప్రబభంజ మధ్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమః॥9886॥*


పిమ్మట ఆ ప్రభువు తన వామహస్తముతో దానిని అవలీలగా పైకెత్తి, అచటి జనులందఱును చూచుచుండగనే వింటినారిని సంధించెను. ఒక్కనిమిషములో ఆ స్వామి ఆ అల్లెత్రాడును లాగి, బలమైన మదపుటేనుగు చెఱకుగడను వలె, ఆ ధనుస్సును రెండు ముక్కలు గావించెను.


*42.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*ధనుషో భజ్యమానస్య శబ్దః ఖం రోదసీ దిశః|*


*పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్॥9887॥*


కృష్ణభగవానుడు ఆ ధనుస్సును విఱిచివేయునప్పుడు ఏర్పడిన శబ్దము ఆకాశమునందును, అంతరిక్షమునందును, సకల దిక్కులయందును నిండెను. ఆ ధ్వని చెవుల సోకినంతనే కంసుడు భయముతో వణకిపోయెను.


*42.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*తద్రక్షిణః సానుచరాః కుపితా ఆతతాయినః|*


*గ్రహీతుకామా ఆవవ్రుర్గృహ్యతాం వధ్యతామితి॥9988॥*


ఆ ధనుస్సును రక్షించుచున్న యోధులును, వారి అనుచరులును మిగుల కుపితులైరి. పిమ్మట వారు బలరామకష్ణులను హింసింపదలచి సాయుధులై 'పట్టుకొనుడు, బంధింపుడు' అని కేకలు పెట్టుచు, వారిని చుట్టుముట్టిరి.


*42.20 (ఇరువదియవ శ్లోకము)*


*అథ తాన్ దురభిప్రాయాన్ విలోక్య బలకేశవౌ|*


*క్రుద్ధౌ ధన్వన ఆదాయ శకలే తాంశ్చ జఘ్నతుః॥9889॥*


అంతట బలరామకృష్ణులు తమను చంపుటకై ఉద్యుక్తులైన ఆ రాజభటులయొక్క దుడుకుచేష్టలను గమనించి క్రుద్ధులైరి. వెంటనే వారు అచట విఱిగిపడియున్న ధనుస్సుయొక్క ముక్కలను చేబూని, వాటితో ఆ యోధులను చావమోదిరి.


*42.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*బలం చ కంసప్రహితం హత్వా శాలాముఖాత్తతః*


*నిష్క్రమ్య చేరతుర్హృష్టౌ నిరీక్ష్య పురసంపదః॥9890॥*


ఆ సమయమున రక్షకభటులకు తోడుగా నిలుచుటకై కంసప్రేరణతో వచ్చిన యోధులను గూడ ఆ యదువీరులు హతమార్చిరి. పిదప వారు యజ్ఞశాల ప్రధాన ద్వారమునుండి బయటికి వచ్చి, మిగుల సంతోషముతో మథురాపుర శోభలను గాంచుచు సంచరించిరి.


 *42.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః|*


*తేజః ప్రాగల్భ్యం రూపం చ మేనిరే విబుధోత్తమౌ॥9891॥*


అప్పుడు పురవాసులు అందఱును ఆ మహాపురుషుల యొక్క అద్భుత శౌర్య పరాక్రమములను గూర్చి విని ఎంతయు ఆశ్చర్యపడిరి. పిమ్మట వారు ఆ యదువీరుల యొక్క పటిమను, ధైర్యసాహసములను, నిరుపమాన రూప వైభవములను చూచి, 'వీరు మానవమాత్రులుగారు, దైవాంశ సంభూతులే' అని తలపోసిరి.


 *42.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*తయోర్విచరతోః స్వైరమాదిత్యోఽస్తముపేయివాన్|*


*కృష్ణరామౌ వృతౌ గోపైః పురాచ్ఛకటమీయతుః॥9892॥*


ఆ సోదరులు ఇరువురు నగర వీథులలో స్వేచ్ఛగా సంచరించుచుండిరి. ఇంతలో సూర్యుడు అస్తమించెను. అంతట బలరామకృష్ణులు తోడిగోపాలురతో గూడి నగరమునకు వెలుపల నందాదులు విశ్రమించుచున్న తమ బండ్లకడకు చేరిరి.


 *42.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*గోప్యో ముకుందవిగమే విరహాతురా యాః ఆశాసతాశిష ఋతా మధుపుర్యభూవన్|*


*సంపశ్యతాం పురుషభూషణగాత్రలక్ష్మీం హిత్వేతరాన్ ను భజతశ్చకమేఽయనం శ్రీః॥9883॥*


పొంకమైన శరీరాంగముల వైభవమును బట్టి లక్ష్మీదేవి జగదేకసుందరి. ఆమె సౌందర్యాతిశయమునకు ముగ్ధులైన బ్రహ్మాదిదేవతలు 'ఆమె తమకు దక్కిన బాగుండును' అని ఎంతగానో కోరికపడిరి. కాని ఆ లక్ష్మీదేవి మాత్రము ఆ శ్రీహరియొక్క సర్వాంగరూప వైభవమునకు ఆకర్షితురాలై ఆ పురుషోత్తముని వరించినది. అనగా శ్రీహరియొక్క లోకాతీతమైన అవయవ సౌభాగ్యము అతిలోక లావణ్యవతియైన లక్ష్మీదేవిని గూడ ముగ్ధురాలిని చేసినదన్నమాట. అట్టి పరమపురుషుని యొక్క అపురూప సౌభాగ్యములను గాంచుచు ఆనందించెడి భాగ్యము అబ్బుట పెక్కుజన్మల తపఃఫలముగాక మఱేమగును. ఈ విషయమును గూర్చియే శ్రీకృష్ణుడు గోకులమును వీడి మథురకు వచ్చుచున్నప్పుడు విరహాతురలైన గోపికలు ఇట్లు అనుకొనిరి. "రేపటి సుప్రభాతము మథురానగరవాసులకు సుఖావహము కాగలదు". గోపికలు నాడు పలికిన మాటలు నేడు సత్యములైనవి. ఏలయన మథురవాసులు శ్రీకృష్ణుని సౌందర్యమాధుర్యములను తనివిదీర ఆస్వాదించుచు పరమానందభరితులైరి.


 *42.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*అవనిక్తాంఘ్రియుగలౌ భుక్త్వా క్షీరోపసేచనమ్|*


*ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితమ్॥9894॥*


విడుదులకు చేరిన పిమ్మట బలరామకృష్ణులు పాదములను,హస్తములను ప్రక్షాళనమొనర్చుకొని, పాయసాన్నములవంటి ఆహారమును ఆరగించిరి. మఱునాడు కంసుడు చేయదలచిన పన్నుగడలను గూర్చి ఎఱింగి, వారు ఆ రాత్రి సుఖముగా గడపిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

మహనీయుని మాట

 🌻 *మహనీయుని మాట*🍁

      

*"నీకు కావాల్సింది నీవు ఎదుటి వారి నుండి సంగ్రహించినప్పుడు వారికేమి కావాలో చూసుకునే బాధ్యత నీకే ఉంటుంది. వాడుకొని వదిలేస్తే... నీవు ఎంత ప్రయత్నించినా నీకు కావాల్సింది వస్తుందేమో కాని నీ కోసం ఎవరు మిగలరు."*

     

🌹 *నేటి మంచి మాట* 🌼

   

*"ఇతరులు చెప్పేది వినకుండా ... సలహాలు ఇవ్వడం అంటే రోగ నిర్ధారణ చేయకుండా ఔషధం ఇచ్చినట్లు."*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻.

సిరికొలువు

 _*సిరికొలువు*_


_*(తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ)*_

 *18.భాగం* 


_*శ్రీ వైకుంఠంలో పరంధాముడు*_


ఇంత ప్రత్యేక దృష్టితో బ్రహ్మసృష్టించిన భూలోకాన్ని ఇతర లోకాలకంటే మిన్నగా శ్రద్ధగా ప్రేమగా పోషించ సాగినాడు పరంధాముడైన 

శ్రీ మహావిష్ణువు. 


వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుని ఆదేశం మేరకు ఎందరో పరమ యోగులు, మరెందరో మునులు, ఋషులు లోకకల్యాణం కోసం తప మాచరిస్తూ వుండినారు. ఎట్టి ఒడుదుడుకులు లేకుండా కొన్ని వేల ఏండ్ల కాలం గడిచిపోయింది.


ఇలా ప్రశాంతంగా తపస్సులు చేసుకుంటున్న ఋషీశ్వరులకు తమ ధ్యానంలో కొన్ని అమంగళ దృశ్యాలు గోచరించాయి. అనేక ఈతి బాధలు, అతి వృష్టి, అనావృష్టి, భూకంపాలు, జలప్రళయాలు, 


జంఝూమారుతాలు భయానకమైన రోగాలు ఇవన్నీ భూలోకాన్ని చుట్టుముట్టినట్లు, వీటితోపాటు రక్కసుల బెడద దాపురించినట్లు భీతిని కలిగించే భయానక ఘట్టాలు ఆ తపోమూర్తులకు కన్పించాయి. 


వీటన్నింటి నుండి బయటపడలేక సతమత మవుతున్న భూలోక మానవులు నిస్సహాయంగా, సహాయం కోసం, చేయూతకోసం నింగివైపు అర్రులు చాస్తూ వుండిన సన్నివేశాలు, ఆ మహనీయు లకు కన్నులకు కట్టినట్లు గోచరించినాయి.


"దీనికి పరిష్కారం ఏమిటి? భవిష్యత్తులో మానవుడు వైకుంఠానికి గాని, కైలాసానికి గాని వెళ్లి నేరుగా 

శ్రీ మహావిష్ణువుతో, పరమశివునితో మొరపెట్టు కోగలడా? సాధ్యం కాదే! మరి వారికి ఏది దారి? భవిష్యత్తులో రాబోయే విపత్తులనుంచి మానవుని ఎలా రక్షించాలి. దీనికి పరిష్కారం ఒక్కటే. 


మనం అందరం త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి మొరపెట్టు కోవడమే. వేరే మార్గం లేనే లేదు" అంటూ భూలోకంలోని తపస్సంపన్నులైన ఋషివర్యులందరూ, దేవతలతో పాటుగా అందరూ నేరుగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు.


"ఔనౌను! మీరంటున్నది నిజమే. దానికి పరిష్కారం శివుడు చెప్ప గలడేమో' అంటూ అందరినీ కైలాసానికి పిలుచుకువెళ్లాడు బ్రహ్మదేవుడు.


బ్రహ్మాది దేవతలతో వచ్చిన ఋషీశ్వరులను చూచి వారు చెప్పింది సావధానంగా విని ఇలా అన్నాడు పరమశివుడు. “నిజమే మీరు చెప్పింది సత్యం. భవిష్యత్కాలంలో వచ్చే ఇక్కట్లను పోగొట్టి లోకకల్యాణం చేకూర్చగల నిత్య కల్యాణ చక్రవర్తి ఆ 

శ్రీ మహావిష్ణువు ఒక్కడే. 


అన్నింటిని పరిష్కరించి, దారి

చూపించగలవాడు ఆ వైకుంఠ వాసుడు ఒక్కడే. కనుక అందరం కలిసి అక్కడికే వెళదాం పద" అంటూ అందరినీ వైకుంఠలోకానికి పిలుచుకువెళ్లాడు.


ఈశానాది దిక్పాలురు, బ్రహ్మాది దేవతలు, ఎందరో మహనీయులయిన తపస్సంపన్నులు ఎందరోవచ్చి శ్రీ వైకుంఠనాథుని దర్శించి మొరపెట్టుకొన్నారు. 


అతి తొందరలో ఏవేవో విపరీతాలు కలుగుతున్నట్లుగా దృశ్యాలు గోచరిస్తున్నా యని, దానికి పరిష్కారం చూపించి, లోకక్షేమం కలిగించ గలిగినవాడవు నీ వొక్కడవే స్వామీ! అంటూ సాగిలబడినారు, దండ ప్రణామాలర్పించినారు.


అందుకు భూరమానాథుడైన 

శ్రీ మహావిష్ణువు ప్రశాంత గంభీరంగా వారిని పరికించి చూస్తూ, దేవతలారా! ఋషీశ్వరులారా! ఆందోళన అవసరమే లేదు.నన్ను దర్శనం చేసుకొన్నారు కదా! 


ఎలాంటి దుర్నిమిత్తాలైనా, తొలగుతాయి. అష్టకష్టాలు కూడా తొలగుతాయి, సమస్త కల్యాణ పరంపరలు సిద్ధిస్తాయి.మీరన్నట్లుగా, రాబోయే కాలంలోబలహీనులు, అలసులు, అల్పా యుష్కులు, నిరంతర లౌకిక వ్యాపారమగ్న మానసులైన మానవులు ప్రత్యక్షంగా వైకుంఠానికి వచ్చి నన్ను దర్శనం చేసుకోలేరు. 


నన్నే కాదు, వారు ప్రత్యక్షంగా, కైలాసానికి గాని, బ్రహ్మలోకానికి గాని రాలేని అసమర్థులుగా వుంటారు. అందుకే భవిష్యత్తులో ఈవిపరీతార్థాలు చోటు చేసుకుంటాయి. మహనీయులారా! మీ మీ ధ్యానంలో గోచరిస్తున్న ఇక్కట్లు మానవులకు కలగకుండా చేయాలి. అందు ఒక్కటే మార్గం వుంది. 


నేను అవతరించడం ఒక్కటే. భూలోకంలో అవతరించి కలియుగాంతం వరకు ప్రత్యక్షంగా దర్శనమివ్వాలి. దర్శించిన వారిని అందరిని తరింపచెయ్యాలి. వారి ఆపదలన్నింటిని తొలగించాలి. 


వారిచేత తృణమో, పణమో దానంగా స్వీకరించి వారి వారి కోరిక లన్నింటిని తీర్చాలి. ఇవే అప్పటి నా అవతారలక్ష్యాలు కావాలి. అప్పుడే మీకు కనపడిన దుర్నిమిత్తాల ప్రభావం వుండదు. ఉన్నా పనిచెయ్యదు.


అయితే నేను భూలోకంలో అవతరించడానికి గాను శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి ఇరువురూ అత్యంత ప్రధాన భూమికను కూడ నిర్వహించవలసివుంది. అంతేగాక ఆయా అవతార సమయాల్లో, నాతో పాటు లోక కల్యాణానికి భక్త రక్షణకు, శ్రీదేవి భూదేవు లిరువురూ అమూల్యమైన పాత్రను పోషించారు. 


అసలు శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి లేకుండా రాబోయే నా అవతారాలు నిర్వీర్యములు, నిష్ప్రయోజనాలు. వారు లేని నా అవతారం ఊహించడం కష్టం, గడచిన యుగాల్లో అన్ని అవతారాల్లో నా వెంట శ్రీలక్ష్మి, భూలక్ష్ములు వచ్చారు. కాని రాబోయే విశిష్టమైన అవతారాల్లో శ్రీలక్ష్మి, భూలక్ష్ములు ఇరువురూ నా కంటె ముందుగా భువిలో అవతరిస్తారు. ఆ తరువాతే వారి కోసం నేను అవతరిస్తాను. వారిరువురి పాత్ర అత్యంత ఆవశ్యకము.భూలోకవాసులకు అరిష్టాలను, అనిష్టాలను తొలగిస్తూ, అభిష్టాలను కలిగిస్తూ లోకానికి క్షేమాన్ని కలిగించే అవతారాలకు దేవర్షి అయిన నారదమునీంద్రులు కూడ కొంత దోహద పడతారు. అంటూ నారదుని వైపు ఒక్క క్షణం పాటు దృష్టి సారించి శ్రీమన్నారాయణుడు అందరితో ఇలా అన్నాడు.


"ఓ దేవతలారా! పరమయోగులైన మహనీయులారా! మీరందరూ ఎంతమాత్రం ఆందోళన లేకుండా నిశ్చింతంగా మీ మీ లోకాలకు వెళ్లండి. అందరూ లోక క్షేమాన్ని కోరుతూ తపస్సులు చెయ్యండి. ధ్యానాలు నిర్వహించండి. 


యజ్ఞాలు, యాగాలు చెయ్యండి. మీ భయాలు తొలగుతాయి. సర్వత్ర శుభపరంపరలు కలుగుతాయి. తద్వారా నిత్యకల్యాణం పచ్చ తోరణంగా అలరారుతుంది. అంతవరకు మీరందరూ నిరీక్షించండి! ఇక మీరందరూ క్షేమంగా వెళ్లిరండి అంటూ వీడ్కోలు పలికినాడు.అందరు వారి వారి లోకాలకు మరలి వెళ్లినారు. కొన్ని వేల సంవత్సరాల కాలం ఇట్టె గడిచిపోయింది.


 *గోవిందా గోవింద గోవిందా!!!!*

శివానందలహరి

 శ్రీ  ఆది శంకర విరచిత శివానందలహరి   🙏                    ................................. ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృహే

ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే |

ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో

తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ || 22 ||

  

దొంగలరాజగు ఓ ప్రభూ! శంకరా! నామనస్సనే దొంగ ప్రలోభముతో ధనమునపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నించుచూ తిరుగుచున్నది. దీనిని నేనెట్లు సహించగలను? (నా మనస్సేమో దొంగ, నువ్వేమో దొంగలరాజువి, దొంగలంతా ఒక్క జట్టు కదా) నా మనస్సుని నీ అధీనంలో ఉంచుకొని నిరపరాధియైన నా పై కరుణచూపుము తండ్రీ🙏

మరణమును కలిగించును.

 *దుష్టాభార్యా శఠో మిత్రంభృత్యో౬హంకార సంయుతః|*

*ససర్పే చ గృహే వాసో*మృత్యురేవ న సంశయః||*


దుష్ట భార్య, నమ్మకద్రోహం చేసే మిత్రుడు, గర్వముతో ఉన్న నౌకరు, పాములు ఉన్న ఇంటిలో నివసించుట అనునవి తప్పక మరణమును కలిగించును. 


శుభం భూయాత్

నడిచే దేవుడు…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…    

నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*కంచి పరమాచర్య …*

       *ధర్మం పాటించుట...!*

               ➖➖➖✍️


```

పీఠాధిపతులు షడ్రసోపతమైన భోజనం చేయాలి.. వారికి దేనిమీద కూడా జిహ్వ ఉండకూడదు. అదీ నియమం.



ఒకరోజు ఆశ్రమంలో వంట వాడు వంట వడ్డించాడు. 


“ఈ పప్పు ఏ పదార్ధంతో చేసావ్?”అని అడిగారు స్వామి. 


వంట వాడు “తోట కూర పప్పు స్వామి” అని “బావుందా” అని అడిగారు. 


పొరటున స్వామి వారు “బావుంది” అని అన్నారు. 


మరుసటి రోజు, మూడవ రోజు కూడా వంట వాడు తోటకూర పప్పు వడ్డిస్తున్నాడు. 


“అదేమిటి రోజూ ఈ పప్పే ఎక్కడ నుండీ వస్తోంది?” అన్నారు. 


అప్పుడు వంట వాడు “మీరు తోటకూర పప్పు వండితే సంతోష పడుతున్నారు అని శిష్యులతో అన్నాను. వారు కట్టలు కట్టలు తీసుకుని వస్తున్నారు దానిలో మంచిది ఎంచి చేస్తున్నాను.” అన్నాడు.


“అలాగా!” అన్నారు స్వామి వారు.


మరునాడు భోజనం వేళ.. “నేను ఇవ్వాళ బిక్ష స్వీకరించటం లేదు!” అన్నారు. 


తరువాత రోజు కూడా బిక్ష చేయటం లేదు అన్నారు. 


“మరి ఏమి తీసుకుంటారు” అని అడిగారు శిష్యులు. 


“ఉసిరికాయ అంత గోమయం, ఆచమనం చేయటానికి గోమూత్రం” అన్నారు స్వామి. 


వారు అవే ఏర్పాటు చేశారు. 


ఉసిరికాయ అంత గోమయం నోట్లో వేసుకునేవారు, గోమూత్రం చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు. 


అలా వారం రోజులు అయిపోయాయ్. పీఠాధిపతులు ముద్ద ముట్టటం లేదు. ఆశ్రమం లోని వారు అందరు వచ్చి కాళ్ళమీద పడిపోయారు. 


“ఏమైంది స్వామి ఎందుకు?” అని అడిగారు. 


దానికి స్వామి వారు “నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెళితే నన్ను అనుగ్రహ భాషణం చేయమంటారు. నేను గురువు యొక్క స్వరూపం తో వేదిక మీద కూచుని ‘ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇంద్రియాలకు లొంగ కూడదు’అని చెప్తాను. మహానుభావులు శంకరాచార్యులు కూచున్న పీఠo కి అధిపతినయి ఒక తోటకూర పప్పు రుచి కి లొంగి పోయిన నేను జగద్గురు శంకరాచర్య అని పిలిపించుకోనా... పీఠాధిపతి ని అని పిలిపించుకోనా.. పది మందిని కూచోపెట్టి అనుగ్రహభాషణం చేయనా.. ఎక్కడ ఉంది ఈ నాలుకకి ఆ యోగ్యత..? ఏ నాలుక తోట కూర పప్పు రుచి కి లొంగిందో దాన్ని గోమయం తో శుద్ధి చేస్తున్నాను.. గోమూత్రం తో శుద్ధి చేస్తున్నాను. మరొకనాడు ఆ నాలుక రుచి నందు ప్రవర్తించనంత కాలం అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశ దేశాలు పొక్కుతుంది. కంచి పీఠాధిపతులు శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి వారికి తోటకూర పప్పు ఇష్టం అని.. తోటకూర పప్పు కి ప్రీతి పడిన వాడు పీఠాదిపతా.. ఈ పదవి లో కూచున్న నేను ప్రవర్తించని తీరు లో ప్రవర్తించాను. అందుకని శుద్ధి చేసుకుంటున్నాను.” అన్నారు.


ఆనాటి నుండీ స్వామి వారికి వడ్డిoచిన భిక్ష లో పదార్ధాలు..లడ్డు కూర పప్పు పులుసు అన్ని కలపడమే.. ఇది బావుంది అన్న మాట కానీ బాలేదు అన్న మాట కానీ అయన నోటివెంట రాలేదు..

ఇదీ పరమాచర్య జీవితం.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥

 "కంచిపరమాచార్యవైభవం"!!


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀