27, ఆగస్టు 2025, బుధవారం

వినాయక వ్రతకల్పము

 

వినాయక వ్రతకల్పము


శ్రీరస్తు శుభమస్తు


వినాయక వ్రతకల్పము


శ్లో ||


శుక్లాంబరధరం విఘ్నం శశివర్ణం చతుర్భుజమ్


ప్రసన్నవదనం ధ్యాయే శృశ్య మిన్నాపశాంతయే.


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకం లంబోదరశ్చ వికటో నిన్నురాజో గణాధిపం ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజావనికి వక్రతుండ సర్పకర్ణో హేరంబ స్కందపూర్వజం షోడశైతాని నామాని యః పఠేచ్ఛ్పణు యాదపి || విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తదా! సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే! అభీప్సితార్ధసిధ్యర్థం పూజితో యస్సురైరపి! సర్వవిఘ్న చ్చిదే తస్మై! శ్రీగణాధిపతయేనమః!'


శుభతిదౌ శోభనముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వతమవ్వంతరే కలియుగే ప్రధమపాదే బంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, కృష్ణా గోదావర్యోః మధ్యదేశే గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరే దక్షిూ యసేవర్షర్తో భాద్రపదమాసే శుక్లపడే చతుర్ద్వాం- వాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ పోషణ విశిష్టాయాం అస్యాం శుభతిధౌ శ్రీమాన్ గోఈ నామధేయః- శ్రీమతః గోత్రస్య నా నుధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమోపాత్తదురితక్షయద్వారా అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థయిర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ధ్యర్థం. సకల విద్యాప్రాస్త్యర్థం పుత్ర పౌత్రాభివృధ్యర్థం - ఇష్ట కామ్యార్థ సిధ్యర్థం మనోవాంఛాసల పిచ్చ్యర్ధం- సమప్త-దురితోపశాంత్యర్ధం - సమస్త మంగళా వాస్త్యర్థం - వర్షేవర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య వరసిద్ది వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరోషిణి ఆదంగ కలశ పూజాం కలిప్యే!! కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య! తప్యోపరి హస్తరినిధాయ- కలశస్యముఖే విష్ణుః కంటే గుద్రస్సమాశ్రితం మూలే రక్రస్థితో బ్రహ్మ మధ్మమాతృ గణాఫ్రికా! కుజౌతు ఎగతా సర్వే సప్త ద్వీపా వసుంధరా! ఋగ్వేదోధ యుజార్వేద స్సామవేదో హ్యధర్వణ్యంగైక్చ హితా స్పర్వేకలశాంబు సమాశ్రిలాక ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయ రకానికి గంగేత యమువేవైన గోదావరి సరస్వతి! నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కలశోదకేవ దేవ మాత్మానం పూజా ద్రవ్యాజిన సంప్రాత్య!!

4


15


శ్రీకృష్ణునిపైబడి తరచుచు, రఖంబుల గ్రుచ్చుము, కోరలం కొరుకుచు ఘోరముగ యుద్ధముచేయు కృష్ణుండును వానిం బడద్రోసి వృక్షముల నేతను, రాళ్ళచేతను తుదకు ముష్ఠి ఘాతములచేతను రాత్రింబవళ్ళు యిరువది ఎనిమిది దినంబులు యుద్ధమొనర్ప లాంబవంతుడ క్షీణబలుండై, దేహంబెల్ల నొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుడు రావణ సంహరి యగు శ్రీరామచంద్రునిగోదలచి అంజలిఘటించి, - దేవా! భక్తజన రక్షకా! నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్టరాక్షస సంహరణార్ధమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెజంగితి. ఆ కాలంబున నాయందలి వాత్సల్య ముచే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞ యొసంగి నాబుద్ధిమాంద్యంబున మీతో ద్వంద్వ యుష్షయి జేయవలెనని కోరుకొంటిని, కాలాంతరమున నది జరుగగల దీని సెలవిచ్చితిరి.. అది మొదలు మీ నామస్మరణ చేయును అనేక వత్సరములు గడువుచు నిట నుండ నిపుడు. తాము ఈ నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శ్రీ దిలమయ్యె, ప్రాణములు కడబట్టే, జీవితేచ్ఛ నశించె. నన్ను క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేదు అనుచు భీతిచే పరిపరివిధముల ప్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి భల్లూకేశ్వరా! శమంతకమణి నాసంగుము వేవేగెద నని దెల్పనతడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తె భుగు బాంబవతిని కానుకగా వొసంగె అంత తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యముల కానందంబు కలిగించి కన్యారత్నముతోను, మణితోడు శ్రీకృష్ణుడు పురరిబుజేశీ సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను జేర్చి యా వృత్తాంతమును చెప్పి శమంతకమణి యొసంగిన నా సత్రాజిత్తు అయ్యో, లేని పోని చింతమోతీ జోషంబునకు బాల్పడితి” నని విచారించి మణిసహితముగా తన కూతురగు పత్యభామను గైకొమ్మనిన, మణి వలదని మరల నొసంగెను అంత శ్రీకృష్ణుడు. శుభముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయంబాడ, నచ్చటికి వచ్చిన సేవాడులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాపనిందలు బావుకొంటిరి; మాకేమి గతి, యని బ్రార్ధింప శ్రీకృష్ణుడు దయాళుడై, బాద్రపదశుద్ధ చతుర్దిని గణపతిని యథావిథి పూజించీ ఈ శమంతకమణి కథను విని, అక్షతలు శిరంబున దాల్చువారికి అవాడు ప్రమాదంబున చంద్రదర్శనమగుటచే వచ్చు నీలాపనింధలు పొందకుండుగాక! వలని అమతీయ దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగి ప్రతి సంవత్సరమును నాక్రపతప శతుర్షియందు దేవతలు, మహార్షులు, మానవులు తమతమ విభవము అది గణపతిని పూజించి అభీష్టసిద్ధిగాంచుచు సుఖంబుగా నుండిరని శౌనకాదిమునులకు సూతుడు తినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగె


సర్వేజనా స్సుఖినో భవంతు

వినాయక వ్రత కల్పము

వినాయక వ్రత కల్పము


 https://drive.google.com/file/d/1VTgr9IIbPylqxatx-S-Lkus94q-H9_Od/view?usp=drivesdk




వినాయకచవితి

 * 🕉️


*వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు*


కం.

విద్యాబుద్ధుల నడుగగ 

సద్యోవరముగ నొసగెడి చవితిగణేశా! 

పాద్యముతోమొదలిడి నిన్ 

వాద్యాంతముగా గొలిచెద వందనమిదిగో 



కం.

వరదాయక గణనాథా! 

విరిదండల పత్రితోడ వేనామములతో 

పరిపరివిధముల గొలుతురు 

కరిముఖుడౌ నిన్ను భక్తి కాశ్యపి నందున్ 

కం.

ఆకుల పూజల జేసియు

నీకై యుండ్రాళ్ళ నిడగ నిజమగు తృప్తిన్ 

మాకై వరముల నొసగే 

యో కరిముఖదేవర జయ మో గణనాథా!

కం.

కరుణను జూడవె తండ్రీ! 

వరముల నీయవె తగువిధి బాసట వగుమా! 

చిరమగు సుబుద్ధి సిద్ధుల 

కరముగ నొసగుమ గణేశ! కామితవరదా! 

*~శ్రీశర్మద*

26, ఆగస్టు 2025, మంగళవారం

ఫైబర్ ఫుడ్!*

 ;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍇M.A.35.

*మన ఆరోగ్యం…!



                 *ఫైబర్ ఫుడ్!*

                ➖➖➖✍️



*#ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ ఫుడ్"!*

```

*మన శరీరం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం ఎంతో అవసరం.


*సమతుల్యమైన ఆహారం అంటే ఏమిటి? 


*శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ కలగలిపి ఉన్న ఆహారాన్ని తీసుకోవడమే సమతుల్య ఆహారం. 


*విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్, ఫైబర్ వంటివి శరీరానికి కావలసినంత తీసుకున్నట్టు అయితే ఆరోగ్యంగా ఉంటారు. 


*అయితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే ఫైబర్ రిచ్ ఫుడ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం...


*కొన్ని పండ్లు తొక్క తీసి తినాల్సిందే కానీ, కొన్నింటిని నేరుగా తినవచ్చు. ఐనా చాలామంది వాటిని తొక్క తీసే తింటారు.


*అలాగే పప్పులను పొట్టు తీయకుండా వాడితే చాలా ప్రయోజానాలు ఉంటాయి.


*పండ్లు, కూరగాయల తొక్కలో, పొట్టు తీయని పప్పులో అత్యధిక శాతం ఫైబర్లుంటాయి. ఈ ఫైబర్లు శరీరానికి ఎంతో ఉపయోగాపడతాయి. దీనివల్ల మలబద్దకం, తత్సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు.


*ముఖ్యంగా యాపిల్ పండు తొక్కలో సోల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ ను, బ్లడ్ షుగర్ ను తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. యాంటీ కేన్సర్ ప్రభావం సైతం దీనిలో ఉంది. పైన చర్మం తీసిన దానికన్నా పూర్తిగా తొక్కతో సహా తినడం వల్ల కేన్సర్ సెల్స్ పై ప్రభావం చూపగలదని అనేక పరిశోధనల ద్వారా తేలింది.


*రెండు లీటర్ల ఆరెంజ్ జ్యూస్ లో ఉండే విటమిన్ ‘సి’ ఒక ఎర్రని యాపిల్ పండు తొక్కలో ఉంటుందని పరిశోధనల ద్వారా వెల్లడి అయ్యింది.


*అదేవిధంగా బంగాళాదుంపల తొక్కలో, మినపపొట్టులో అత్యధిక శాతం ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ - బి పుష్కలంగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు సైతం సమృద్దిగా ఇందులో ఉంటాయి. 


చేదుగా ఉండే సిట్రస్ పండ్ల తొక్కలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఊపిరితిత్తుల సమస్యలకు ఇవి బాగా పనిచేస్తాయి.


*నిమ్మ, నారింజ కాయలు తొక్కలను నేరుగా తినడం సాధ్యం కాదు. కాబట్టి తొక్కకు అంటుకుని లోపలి వైపు ఉండే పల్చని పొరను వంటకాలలో జోడించినా లేక టీ నీళ్ళలో తొక్కలను వేడి చేసి కాచి అవి తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మంగళవారం🍁* *🌹26 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

   *🌹26 ఆగస్టు 2025🌹*  

     *దృగ్గణిత పంచాంగం* 

                  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - శుక్లపక్షం*

*తిథి  : తదియ* మ 01.54 వరకు ఉపరి *చవితి*

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం   : హస్త* పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*యోగం : సాధ్య* మ 12.09 వరకు ఉపరి *శుభ*

*కరణం  : గరజి* మ 01.54 *వణజి* రా 02.46 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:* 

 *మ 12.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 11.30 - 01.15*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.34*

*వర్జ్యం      : మ 01.01 - 02.46*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.00 - 11.46*

*రాహు కాలం   : మ 03.17 - 04.51*

గుళికకాళం       : *మ 12.09 - 01.43*

యమగండం     : *ఉ 09.01 - 10.35*

సూర్యరాశి : *సింహం*             

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.01* 

సూర్యాస్తమయం :*సా 06.34*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.53 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.54*

మధ్యాహ్న కాలం    :     *10.54 - 01.25*

అపరాహ్న కాలం    : *మ 01.25 - 03.55*


*ఆబ్ధికం తిధి         : తిథి శూన్యం*

సాయంకాలం        :*సా 03.55 - 06.25*

ప్రదోష కాలం         :  *సా 06.25 - 08.43*

రాత్రి కాలం           :*రా 08.43 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.07*

******************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీఆంజనేయ స్తుతి🍁*


*నమో నిఖిలారక్షాకరం*

*రుద్రా రూపం*

*నమో మారుతిమ్* 

*రామ దూతం నమామి*


             🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>        


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

రమణ చెప్పిన బాపు కథ!

 💥రమణ చెప్పిన బాపు కథ!


బాపుగురించి చెప్పాలంటే రమణ గురించి, రమణ గురించి చెప్పాలంటే బాపూ గురించి చెప్పక తప్పదు. వారి స్నేహబంధం అంత దృఢమైనది.


ఇద్దరి జీవితాలూ గోదారి ఒడ్డునే మొదలైనా మద్రాసులో వారి బంధం గట్టిపడింది.


సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులూ, పస్తులతో పడుకున్న రోజులూ, మిత్రులతో సరదా సంభాషణలూ, మధ్య మధ్యలో కొంటె బొమ్మలూ, హిట్లు, ఫెయిల్యూర్లు... ఇలా ఒకటేమిటి వారి జీవితాలను తరచి చూస్తే ఎన్నో సంగతులు.


తమ మధ్య చోటుచేసుకున్న ఎన్నెన్నో సంగతులనూ, అప్పటి సందర్భాలనూ రమణగారు తన "కోతి కొమ్మచ్చి"లో గుదిగుచ్చారు.


ముఖ్యంగా తన ప్రియ నేస్తం బాపు గురించి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు... ముళ్ళపూడివారి మాటల్లోనే..


💥ఇడ్లీ కన్నా పచ్చడే బాగుంది!


ఓసారి చిన్న కథ రాసి ప్రభ ఆఫీసుకు వెళ్ళాను. ఎడిటర్ విశ్వంగారికి ఇచ్చి కూర్చున్నాను.


"ఇక మీరు వెళ్లవచ్చు. బాగుంటే దినపత్రికలో ప్రకటన వస్తుంది" అన్నారు విశ్వంగారు.


"చిన్న కథేనండి... కొంచెం చదివి ఇప్పుడే చెప్పేస్తే... అన్నాను నేను.


ఆయన చురుక్కున చూశారు.

చేతిలోని పుస్తకంలో దాచిన బాపు బొమ్మతీసి బల్లమీద పెట్టాను. ‘‘మా ఫ్రెండ్ బాపు – బొమ్మ కూడా వేశాడు. ఫ్రీ’’ అన్నాను.


"అక్కర్లేదు, మాకు ఆర్టిస్టులున్నారు. బయటవాళ్లవి తీసుకోం’’ అంటూనే ఆయన బాపు వేసిన బొమ్మని ఓ క్షణం సేపు చూశారు.


ఏమనుకున్నారో గానీ, పక్కనే ఉన్న నా కథను చూసి చదవసాగారు. రెండు నిమిషాల్లో కథ చదివేశారు. 


బాపు బొమ్మను మళ్లీ ఓసారి చూశారు.

"ఇడ్లీకన్నా పచ్చడే బాగుంది" వేస్తాను లెండి’’ అన్నారు.


ముప్పావలా పెట్టి ఫుల్‌ మీల్స్ తిన్నంత బలం వచ్చేసింది.

ఈ ఇడ్లీ కన్నా పచ్చడి బాగుండటం జోక్‌లా అనిపించినా – తర్వాత అది చిరసత్యమై, స్థిరసత్యమై నిలబడింది.


తర్వాత నేను గోప్ఫ రైటర్నయిపోయి ఎన్ని గొప్ప కథలు రాసినా – బాపు గొప్పన్నర బొమ్మలు వేసేవాడు.

అప్పుడు నేననుకునేవాడిని – ఇడ్లీ కన్నా పచ్చడే బాగుందని.


(సేకరణ)👆

_ఆగష్టు 26, 2025_* 🌝


  🌞 *_ఆగష్టు 26, 2025_* 🌝

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*భాద్రపద మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *తదియ* మ12.36

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం : *హస్త*

మర్నాడు తె5.46 వరకు

యోగం: *సాధ్యం* మ1.14

కరణం: *గరజి* మ12.36

&

*వణిజ* రా1.18

వర్జ్యం: *మ1.00-2.45*

దుర్ముహూర్తము: *ఉ8.17-9.07*

&

*రా10.53-11.39*

అమృతకాలం: *రా11.19-1.02*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *సింహం*

చంద్రరాశి: *కన్య*

సూర్యోదయం: *5.48*

సూర్యాస్తమయం: *6.17*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

🙏 *మాస్టర్ నమస్కారమ్స్* 🙏

   🪷🇮🇳🚩🙏🚩🇮🇳🪷

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

పరహితము

 *శ్రీగురుభ్యోనమః*🙏


పరహితము లేక సేవ యందు స్వార్ధపూరిత భావము చోటు చేసుకున్నచో, నీటి యందు సుడి వలె కామ శరీరమున ఒక సుడి ఏర్పడును. సత్కర్మా చరణము చేయుచు, ధనము, కీర్తి, పలుకుబడి, అనుయాయులు, సౌకర్యములు పెరుగుచుండగా వానియందు ఆసక్తికి లోనైన వారందరును సుడిలో పడినవారే. కాలము సుడిలో వీరందరును క్రమముగా అదృశ్యమగుట తధ్యము. లక్షలాది సద్భావములు, సత్కర్మలు ఇట్లే నశించినవి.


పరమగురువులు ఈ విషయమును ఎక్కువ గమనించు చుందురు. సాధకుని మనోతత్త్వమును పరిశీలించి, హితకార్యము పెంపొందించుట యందే లగ్నమై దీక్షగా పన్నెండు సంవత్సరములు సత్కార్యములు ఆచరించు సాధకుని పరమగురువులు స్ఫూర్తితో నడిపించుటకు సంకల్పింతురు.


*Master K.P.K.🙏*


నవ గోపికా సంఘము

25, ఆగస్టు 2025, సోమవారం

Panchaag


 

మహాకవి మయూరుడు🙏

 మహాకవి మయూరుడు🙏

                  రెండవ భాగం 

 “భక్త మయూర వక్త్రాబ్జ పదవిన్యాస శాలినీ నర్తకీవవరీవర్తి సభా మధ్యే సరస్వతీ” అని జయ మంగళుడు మయూరుని కీర్తించాడు. భక్తుడైన మయూరుని ముఖపద్మంపై పదవిన్యాసం చేస్తున్న సరస్వతి సభలో నర్తకిలా అతిశయంగా ఒప్పుతున్నదని భావం. రాజశేఖరుడు మయూరుని ఇలా శ్లాఘించాడు:


“దర్పం కవి భుజంగానాం గతా శ్రవణ గోచరం

విషవిద్యేవ మాయూరీ మయూరీ వాఙ్నికృంతతి”

భావం : నెమలి క్రేంకారం వంటి మయూరుని వాక్కు నీచకవులనే విషసర్పాల చెవిని సోకగానే విషవిద్య వలే వారి దర్పాన్ని నశింపజేస్తుంది


మయూరుని సూర్య శతకం చదివితే పై ప్రశంసల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదని తెలిసింది. శతకంలో ఒక్కో శ్లోకం చదువుతున్న కొద్దీ, మయూరుడు కేవలం వంద పద్యాలతో మహా కవి ఎలా అయ్యాడో అర్ధమవుతుంది . అద్భుతమైన వర్ణనలు, భాషపై సంపూర్ణమైన అధికారం, రచనా విధానంలో ప్రౌఢిమ అనితర సాధ్యంగా తోచింది. .

మయూరుని సూర్యశతకము ఊహకి అందని అద్భుత రహస్య విషయాలను చక్కని శతకంగా అందించినారు. ఇది మామూలు శతకము కాదు. దీని నిండా ఎన్నో నిధి నిక్షేపాలు ఉన్నట్లు ఎన్నో అద్భుత విషయాలు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యపరంగా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఇంక విజ్ఞానంగా చూస్తే ఈ అద్భుత విషయాల పక్క మన దృష్టి మరలి వానిలోని ఖగోళ రహస్యాలను అర్థం చేసుకోవాలి.

“జంభారీతీభ కుంభోద్భవమివ దధతస్సాంద్ర సింధూర రేణుం

రక్తాస్సిక్తా ఇవౌఘై రుదయతటీ ధాతు ధారాద్రవస్య

ఆయాంత్యా తుల్య కాలం కమలవన రుచేవారుణా వో విభూత్యై

భూయాసు ర్భాసయంతో భువనమభినవా భానవో భానవీయాః || “


జంభ + అరాతి + ఇభ + కుంభ + ఉద్భవం = ఇంద్రుని వాహనమైన ఐరావతం యొక్క కుంభస్థలం నుండి పుట్టిన

సాంద్ర సింధూర రేణుం = దట్టమైన సింధూరపు ధూళిని

దధతః ఇవ = ధరించినట్లు

ఉదయ గిరి తటీ = తూర్పు కొండ చరియలందు

ధాతు ధారా ద్రవస్య = ధాతువుల యొక్క రసధారలయొక్క

ఓఘైః + సిక్తాః + రక్తాః ఇవ = ప్రవాహం చేత తడుపబడి ఎర్రని రంగును కలిగినట్లు

తుల్యకాలం = అదే సమయంలో (సూర్యోదయంతో బాటుగా)

ఆయాంత్యా = వచ్చుచున్నటువంటి

కమల వన రుచా = పద్మవనం యొక్క కాంతిచే

అరుణాః ఇవ = ఎర్రనైనవిగా ఉన్నటువంటి

భువనం + భాసయంతః = ముల్లోకాలను ప్రకాశింప చేయుచున్నవై

భానవీయాః = సూర్యుని యొక్క

భానవః = కిరణాలు

వః = మీ యొక్క

విభూత్యై = ఐశ్వర్యము కొరకు

భూయాసుః = అగును గాక


తాత్పర్యం: సూర్యకిరణాలు ఐరావతం కుంభస్థలంనుండి పుట్టిన సింధూరపు ధూళికమ్ముకున్నట్లు ఉన్నాయి. ఉదయం స్వర్గంనుండి బయలుదేరినప్పుడు స్వర్గలోకపు వస్తువులతో పోలిక అన్నమాట. తరువాత తూర్పు కొండ చరియల లోని గైరికాది ధాతువుల ద్రవాలచే తడిచి ఎర్రబడినవా అన్నట్లు కనబడుతున్నాయి. తరువాత సూర్యుని రాకతో బాటే వికసించిన పద్మ వనంయొక్క ఎర్రని కాంతితో ఎర్రబడినట్లు కనిపిస్తున్నాయి. భూమిని చేరిన కిరణాలు అలా కనిపిస్తున్నాయన్న మాట. ఈ విధంగా ముల్లోకాలను ప్రకాశింపజేస్తున్న భానుని కిరణాలు మీ అందరి సంపదలకూ కారణమగు గాక!

సూర్యునికిరణాలు ఎలాగున్నాయంటే జంభునితోవైరమున్న ఇంద్రునికి చెందిన ఐరావతం యొక్క కుంభస్థలమును తమ ఉత్పత్తిస్థానంగా చేసుకొనియున్న దట్టమైన సింధూరరేణువులవలే భాసిస్తున్నాయట. గోదావరి నాసికాత్ర్యంబకంలో మొదలైనట్లుగా. అరుణవర్ణము తలంపుమాత్రముననే మంగళదాయకం. ఎంచేతంటే అమ్మవారు “అరుణాం కరుణాతతంగితాక్షీం” కదా. అంటే అమ్మవారు కారుణ్యానికి తత్తుల్యము మరియు సంకేతము. అలాగే “ఇందతి ఇతి ఇంద్రః”. పరమైశ్వర్యయుక్తుడు. 

భానవో భానవీయాః’ అన్నది ఎంత సుందర పద ప్రయోగమో గమనించండి! ఇలాంటి శ్లేషాలంకార పద ప్రయోగాలు, శబ్దాలంకారాలు శతకంలోని ప్రతి పద్యంలోనూ కనిపిస్తాయి. పై పద్యంలో “మీ అందరికీ శుభాలు కలుగు గాక” అని చెప్పడాన్ని బట్టి తన కుష్ఠువ్యాధిని పోగొట్టుకోవడానికి ఈ శతకం చెప్పలేదనే భావన కలుగుతుంది

వ్యగ్రైరగ్ర్య గ్రహేన్దుగ్రసనగురు భరైర్నో సమగ్రైరుదగ్రైః

ప్రత్యగ్రైరీషదుగ్రైరుదయగిరిగతో గోగణైర్గౌరయన్‌ గామ్‌

ఉద్గాఢార్చిర్విలీనామరనగరనగగ్రావగర్భామివాహ్నా

మగ్రే శ్రేయో విధత్తే గ్లపయతు గహనం స గ్రహగ్రామణీర్వః


అర్థం 


యః = ఏ సూర్యుడు

ఉదయగిరి గత: = ఉదయ పర్వతాన్ని పొందినవాడై

వ్యగ్రైః = అంతటా ప్రసరించుచున్నట్టియు

అగ్ర్య = తూర్పు దిక్కునందున్న

గ్రహ = గ్రహాలైన

ఇందు = చంద్రుడు మొదలగు వారియొక్క

గ్రసన = తిరస్కరించుట యొక్క

గురుభరైః = గొప్ప భారం కలవియును,

నో సమగ్రైః = సంపూర్ణములు కానివియును

ఉదగ్రైః = పెద్దగా పెరుగుచున్నట్టియును

ప్రత్యగ్రైః = వినూత్నములైనట్టియును

ఈషత్ + ఉగ్రైః = కొద్దిగా వేడిని కలిగినట్టివియును

గోగణైః = కిరణ సమూహములచే

అహ్నాం + అగ్రే = పగళ్ళ యొక్క ప్రారంభమున (ఉదయ కాలంలో)

గాం = భూమిని

ఉద్గాఢ = మిక్కుటమైన

అర్చిన్ = కాంతులలో

విలీన = కలిసి పోయిన

గ్రావ గర్భాం = శిలలు గర్భమందు కల

అమర నగర నగ = మేరుపర్వతం యొక్క

గౌరయన్ = బంగారు రంగు కలదానిగా

శ్రేయః = శ్రీయస్సును

విధత్తే = కలిగించుచున్నాడో

సః = ఆ

గ్రహ గ్రామణీ = గ్రహ నాయకుడైన సూర్యుడు

వః = మీయొక్క

గహనం = పాపమును

గ్లపయతు = పోగొట్టు గాక


తాత్పర్యం: సూర్యుడు, ఉదయాద్రిపై ఉదయ కాలంలో చకచకా నడుస్తూ తనకు తూర్పుదిక్కునున్న చంద్రాది గ్రహాలను తన లేతకిరణాలలో వెలవెల బోయేటట్లు చేస్తున్నాడు. ఉదయ కాలం కనుక ఆ కిరణాలు సంపూర్ణం కాదు. కొంచెం వేడిగా ఉన్నాయి. పెరుగుతున్నాయి. అట్టి కిరణాలచే ఈ భూమిని, ఆ కాంతులను తమలో ఇముడ్చుకొని బంగారు రంగులో ప్రకాశిస్తున్న మేరు పర్వత శిలలు కలదానిగా చేస్తూ శ్రేయస్సును కలిగిస్తున్నాడు. అట్టి గ్రహనాయకుడైన సూర్యుడు మీ పాపాలను పోగొట్టు గాక!


ఈ పుస్తకం ఇంకా దొరుతుందో లేదో తెలియదు. ఇంత మంచి కవిత్వం సంస్కృత సాహిత్యాభిమానులకు అందుబాటులోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది.


దివః కిం బాన్ధవః స్యాత్ప్రియసుహృదథవాచార్య ఆహోస్విదర్యో

రక్షా చక్షుర్ను దీపో గురురుత జనకో జీవితం బీజమోజః

ఏవం నిర్ణీయతే యః క ఇవ న జగతాం సర్వథా సర్వదాసౌ

సర్వాకారోపకారీ దిశతు దశశతాభీషురభ్యర్థితం వః


“ఈ లోకములలో సూర్యుని ఏమని భావించాలి? దేవుడనియా? బంధువనియా? ఆచార్యుడనియా? లేక కులీనుడైన ప్రభువనియా? అది కాకుంటే సర్వలోక రక్షకుడనియా? మరి సూర్యుని లోకాలకు కన్నులాంటివాడందామా? దీపమందామా? పోనీ పూజ్యుడందామా? లేక ప్రాణమే అందామా? జన్మ కారణమందామా? పైన చెప్పినవారిలో సూర్యుడ్ని ఎవరని చెప్పగలం? నిజానికి వీరిలో ఒక్కడని సూర్యుని వర్ణించలేము. ఎందుకంటే సర్వ కాలాల్లో, సర్వ విధాలా, సర్వాన్నీ ఇచ్చేవాడు సూర్యుడు. సర్వ దేవత రూపమున, బాంధవాది రూపమున, లోకాలకు మహోపకారం కలిగించేవాడు సూర్యుడు. అతడు సర్వ దేవతా స్వరూపుడు. అట్టి సహస్ర కిరణ సూర్యుడు మిమ్ములను రక్షించు గాక!”


ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ ధనమిచ్ఛేత్ హుతాసనాత్

ఈశానాత్ జ్ఞానమన్విచ్ఛేత్ మోక్షమిచ్ఛేత్ జనార్దనాత్


అంటోంది స్కాందం. ఆరోగ్యానికి ఆదిత్యున్ని ఆశ్రయించాలి . ఐశ్వర్యానికి అగ్నిని ఆశ్రయించాలి . జ్ఞానానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలి . అలాగే మోక్షానికి జనార్దనుడిని ఆశ్రయించాలి . అంటే ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్కడు అధిపతి. “వైద్యోనారాయణోహరిః“ కదా. అంచేతనే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడయ్యాడు.


                       స్వస్తి 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ