116f4;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀1️⃣1️⃣5️⃣
*శ్రీమహావిష్ణుపురాణం:*
➖➖➖✍️
115 వ భాగం
*శ్రీకృష్ణావతారము-17*
*జాంబవతి, సత్యభామలతో వివాహం..```
యదువంశానికి ఉపవంశమైన వృష్ణి వంశియుడైన సత్రాజిత్తు బలరామ కృష్ణులకు గల పేరు ప్రఖ్యాతులను చూసి అసూయ చెందేవాడు. బలరామ కృష్ణుల కన్నా ఎక్కువగా పేరురావాలని, యదువంశంలో అత్యంత ధన సంపన్నుడిని కావాలని సూర్యుని ఆరాధిస్తూ కఠోర తపస్సు చేసాడు.
సూర్యుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
సత్రాజిత్తు “నేను తేజోసంపన్నుడు, ధనసంపన్నుడు కావాలని" కోరిక కోరాడు.
సూర్యుడు తన కంఠంలో ఉన్న శ్యమంతకమణిని తీసి సత్రాజిత్తుకి ఇచ్చి "ఈ మణినిధరించినవాడు సూర్యుని వలె తేజో సంపన్నుడు అవుతాడు. ఈ మణి ఉన్న ప్రదేశంలో వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయి. ఈతిబాధలు, అరిష్టాలు ఉండవు. రోజుకి ఎనిమిది బారువుల బంగారం ప్రసాదిస్తుంది. మణిని, బంగా రాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. నిత్యం మణిని పూజించు!శుభం కలుగుతుంది” అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.
తపస్సు ముగించి, శ్యమంతక మణి హారం మెడలో ధరించి సత్రాజిత్తు తన గొప్పదనం చూపించాలని ద్వారకవచ్చాడు. సూర్యుని వలె ప్రకా శిస్తు తేజస్సుతో రాజవీధులలో వస్తున్న సత్రాజిత్తుని చూసి ద్వారక ప్రజలు సాక్షాత్తు సూర్యుడే కృష్ణుడి దర్శనానికి వచ్చాడు అని భ్రమించారు.
భటులు వెళ్లి రాజసభలో సభికుల మధ్యలో ఉన్న కృష్ణుడికి సూర్యుడు దర్శనానికి వస్తున్నాడని చెప్పి పక్కకు తప్పుకుని నిలిచారు.
కృష్ణుడు నవ్వుకుని "వచ్చే వ్యక్తి సూర్యుడు కాదు. వృష్ణి వంశీయుడైన సత్రాజిత్తు. సూర్యుని తపస్సుతో మెప్పించి శ్యమంతక మణి అనే అనర్ఘమణిని అనగా అపూర్వ శక్తి గల మణిని పొందాడు. ధరించిన వ్యక్తిని
ఆ మణి సూర్యుని వలె ప్రకాశవంతుని చేస్తుంది. అంతేకాదు, దినమునకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చే శ్యమంతకమణి ఉన్నచోట ఈతిబాధలు ఉండవు. అరిష్టాలు ఉండవు. ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు" అని చెప్పగా సభికులు ఆశ్చర్యం చెందారు.
అటువంటి మణిని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి వస్తున్నాడేమో అని అందరు భావించారు.
శ్రీకృష్ణుడు వారి అభిప్రాయాలను గ్రహించి సభకు వచ్చిన సత్రాజిత్తుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనుని చేశాడు. సత్రాజిత్తు కంఠంలోని శ్యమంతక మణిని తీసి అందరికి చూపించి "సూర్యుడు తన తపస్సుకి మెచ్చి ఇవ్వడం, శ్యమంతకమణి గొప్పదనం, ప్రసాదించే బంగారం గురించి గొప్పగా చెప్పాడు. తను యదు వంశంలో అందరి కన్నా గొప్ప వాడిని,తేజోవంతునిఅయ్యాను కనుక బలరామ కృష్ణులు, ద్వారకా ప్రజలు తన గొప్ప దనాన్నిగుర్తించిసత్కరించాలనిగర్వంగా ప్రకటించాడు.
సభలోని వారుసత్రాజిత్తుఅహం కారానికి ఆశ్చర్యపడ్డారు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వచ్చి "మీరు నిజంగాచాలాగొప్పవారు,మహి మాన్వితులు అనడంలో సందే హం లేదు. కఠోర తపస్సు చేసి సూర్యదేవుని మెప్పించి శ్యమంతకమణిని పొందారు. ఒకసారి సూర్యదేవుడు మణినిస్తూ చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి.
వ్యక్తుల వద్ద ఇటువంటి మహిమ గల మణి ఉండటం అనేక సమస్యలు వస్తాయి. ఇచ్చే బంగారం కోసం ఆశపడే స్వార్ధపరులు
మీకు ప్రాణహాని కూడా తల పెట్టవచ్చును. కనుక తమరుఈ శ్యమంత కమణిని మహరాజు ఉగ్రసేనునికిఇవ్వండి.కోశాగారం లో భద్రముగా ఉంటుంది. రోజు ఇచ్చే బంగారం తమరే తీసుకోవచ్చును. మీ మంచి కోరి సలహా ఇస్తున్నాను. తరు వాత మీ ఇష్టం" అని చెప్పాడు.
కృష్ణుడు తన మణిని తీసుకో వాలని అలా చెబుతున్నాడు అని భావించి సత్రాజిత్తు తిరస్కరించాడు. నేను కఠోర తపస్సు చేసి సంపాదించినది నా దగ్గరే ఉండాలి అని ప్రకటించి సత్రాజిత్తు కోపంగా ఇంటికి వెళ్లి పోయాడు. ఇంటికి భద్రత పెంచుకున్నాడు.శ్యమంతకమణిని పూజ సమయంలో తప్ప మిగిలిన సమయంలో తను మెడలో వేసుకునేవాడు.
ఒకరోజు అత్యవసర పనిమీద బయటకు వెళ్లవలసినఅవసరం రావడంతో మణిని సంరక్షించే బాధ్యతనుసత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుడికి ఇచ్చి వెళ్లాడు. ప్రసే నుడుమణినికంఠంలోధరించి అడవికి వేటకు వెళ్లాడు.అక్కడ ఒక సింహం ప్రసేనుడికి మెడలో ఎర్రగా ప్రకాశించేమణిమాంసపు ముక్క అని భావించి అతని పై దూకి హతమార్చింది. మణిని నోట కరచుకుని సింహంపారిపో తుంటే జాంబవంతుడు అనే భల్లూకం చూసి సింహాన్ని చంపి మణిని తీసుకుని తన కుమార్తె జాంబవతికిఆడుకునేవస్తువుగా ఇచ్చాడు.
శ్యమంతకమణి ధరించి వెళ్లిన ప్రసేనుడు అడవి నుంచి తిరిగి రాకపోవడంతో, సత్రాజిత్తు రాజసభకు వచ్చి "మణి అడిగినప్పుడు ఇవ్వలేదని కృష్ణుడే వేటకు వెళ్లిన తన తమ్ముడు ప్రసేనుని చంపి అపహరించాడని" ఆరోపణ చేశాడు. తన మణిని తనకు ఇప్పించమనిఉగ్రసేనునికోరాడు. సభలోని వారు కృష్ణుని పై నిందవేసినందుకు సత్రాజిత్తుపై దాడి చేయబోతుంటే కృష్ణుడు ఆపి "తన పై వచ్చిన ఆరోపణ అసత్యం అనినిరూపించడానికి అడవికి వెళ్లి శ్యమంతకమణిని తెస్తానని" ప్రకటించి అడవికి వెళ్లాడు.
అడవిలో ప్రసేనుడి కళేబరం, కొంతదూరం వెళ్లిన తర్వాత సింహపు కళేబరం, అక్కడ నుంచి ఎలుగుబంటి అడుగు జాడలు పర్వతపు గుహలోకి వెళ్లడం గమనించాడు. తన వారిని గుహ బయటఉండమని లోపలికి వెళ్లాడు. అక్కడ ఆట వస్తువుగా ఉయ్యాలకు కట్టిన మణిని చూశాడు. ఆ ఉయ్యా లలో జాంబవతి పడుకుని ఉంది. నిద్రాభంగం కాకుండా మణిని తీసుకుని వస్తుంటే అక్కడకు వచ్చిన దాది చూసి భయపడి గట్టిగా అరిచింది.
అరుపులకు జాంబవతి నిద్ర లేచి కృష్ణుని జగన్మోహనరూపం చూస్తూనిలబడింది.జాంబవంతుడు దాది అరుపులకు అక్కడకు వచ్చి కృష్ణుడితో యుద్దానికితలపడ్డాడు.ఇరువురి మధ్య నెల రోజులు ద్వంద్వ యుద్ధం జరిగింది. ఓడి అలసి నీరసించిపోయినజాంబవతుడు తనతో పోరాడినవాడు త్రేతాయుగపు శ్రీరాముడిగా గుర్తించాడు.
శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి దేవా నాడుత్రేతాయుగంలో నీతో ద్వంద్వయుద్ధంచేయాలని కోరాను.ఆకోరికద్వాపరయుగంలో తీర్చావు. కృష్ణుడివి నీవే! రాముడివి నీవే! నారాయణుడివి నీవే! నా అవివేకానికి మన్నించు!" అని ప్రార్ధించాడు.శ్యమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతి ని సమర్పించాడు.
శ్యమంతకమణితో, జాంబవతి తో ద్వారకకు వచ్చి కృష్ణుడు రాజసభ ఏర్పాటు చేశాడు. సత్రాజిత్తుని పిలిపించి అందరి ముందు జరిగింది చెప్పి మణిని సత్రాజిత్తుకిఇచ్చాడు.సత్రాజిత్తు కృష్ణుడిపై అసత్య ఆరోపణ చేసినందుకు క్మార్పణచెప్పాడు. ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె సత్యభామను,శ్యమంతకమణిని స్వీకరించమని ప్రార్ధించాడు.
అంతకు ముందు సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామ శ్రీకృష్ణుని ఇష్టపడుతుందని తెలిసినా, కృష్ణుడి పై కోపంతో కృతవర్మ తమ్ముడు శతధ్వనుడికి ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు కృష్ణునికి ఇచ్చి చేయడంతో శతధ్వనుడు సత్రాజిత్తు పై కోపం పెంచుకున్నాడు. కానీ బలరామ కృష్ణుల బలపరాక్ర ములకు భయపడి మౌనంగా ఉండిపోయాడు.
శుభ ముహుర్తంలో శ్రీకృష్ణుడికి జాంబవతితో, సత్యభామతో వివాహం జరిగింది. శ్రీకృష్ణుడు వీరినే కాకుండా కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అనే ఐదుగురిని వివాహమాడి అష్టభార్యలు కలిగి ఉన్నాడు.✍️(సశేషం)
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..
-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి