వంటింటి చిట్కాలు part 2
=================
పోపుల పెట్టె లో దాగున్న మరిన్ని ఆరోగ్య రహస్యాలు మరికొన్ని మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఇవి అన్నీ మనకి తెలిసినవే అయినా మనం పాటించడం మానేసాము.
పేరిన నెయ్యి లో కాసింత బెల్లం వేసుకుని తింటే గొంతు గర గర తగ్గుతుంది. అదే విధంగా తమలపాకులు పరగడుపునే తింటే కఫం తగ్గుతుంది అని చెప్పేవారు. తమలపాకులు తడిపి నుదిటిపై పెట్టుకుంటే తల నొప్పి మటు మాయం అవుతుంది. ఈ మధ్య పెళ్ళిళ్ల ల్లో తములపాకుల బజ్జిలు వేయడం ఎక్కువ అయ్యింది.మంచిదే తమలపాకులు ఎక్కువ వాడటం. అయితే అతి సర్వత్రా వర్జినియేత్ మరువకండి...దేనికీ అతి పని చేయదు.
అన్నం అరుగుదలకు కూడా తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే పూర్వం భోజనం తరువాత తాంబూలం తప్పనిసరిగా వేసుకునే వారు.
ఐరన్ లోపం ఉంటే తమలపాకులు లో పాత బెల్లం వేసుకుని రెండు ఆకులు తింటే నీరసం తగ్గుతుందని చెప్పెవారు.
అందుకే ప్రతి ఇంట్లో తమలపాకులు పాదు ఉండాలి. పెంచడం కూడా చాలా సులభం.
పిల్లలు పుట్టని దంపతులకి మినప సున్ని ఉండలు పెట్టే వారు. పాలు లొ యాలకులు వేసి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.
పిలల్లు నీరసం గా, బలం లేకుండా ఉంటే ప్రతీ రోజు పప్పు అన్నం లో ఆవు నెయ్యి ఎక్కువ గా వేసి పెట్టే వారు.ఆవు నెయ్యి ఎక్కువ గా పిల్లలకు పెట్టడం వల్ల మేధస్సు పెరుగుతుంది.
బలం తక్కువగా ఉండి ఎప్పుడు నీరసం గా, చె లాకీ తనం లేకుండా ఉండే వారికి వారం లో రెండు మూడు రోజులు గారెలు నేతిలో లో వేయించి పెట్టిన మంచి బలం కలుగు తుందని చెప్పేవారు. మరి ఎక్కువ గా తింటే కడుపు ఉబ్బరం తగ్గడానికి అల్లం రసం లేదా అల్లం పచ్చడి వాడమని చెప్పేవారు.
ఇంతకు ముందు తరం బలం గా ఆరోగ్యం గా ఉండటానికి కారణం వారు తీసుకునే బలమైన ఆహారంమే.
కాళ్ళు నొప్పులు గా ఉంటే కొబ్బరి నూనె తో కాళ్ళు మర్ధనా చేసుకుని వేడినీటిలో నిమ్మకాయ చెక్క పిండి ఒక పదినిముషాలు కాళ్ళు మునిగే వరకూ వేడి నీటిలో ఉంచితే కాళ్ళు నొప్పులు తగ్గుతాయని చెబితే అర్చర్యం కలుగుతుంది....నిమ్మకాయ బదులు ఉప్పు వేసుకుంటే కాళ్ళు పగుళ్ళు తాగుతాయి.
ఇలా ఇలా అనేక చిట్కాలు... నేను స్వయంగా చూసాను...వీలైతే తప్పకుండ ఆచరించండి...
వంటింటి చిట్కాలు మరువ కండి. ఇది పెద్దలు మనకి ఇచ్చిన ఆస్తి.....
సురేష్ వంకాయలపాటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి