14, జూన్ 2026, ఆదివారం

వివేకచూడామణి

  *వివేకచూడామణి*


 *శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*80. విషయఖ్యగ్రహో యేన సువిరక్త్యసినా హతః*

*స గచ్ఛతి భవాంభోధే పారం ప్రత్యూహవర్జితః*


*పదవిభజన :*

*విషయ + ఆఖ్య గ్రహః + యేన - సువిరక్త్యసినా - హతః - స - గచ్ఛతి - భవ + అంబోధేః - పారం - ప్రత్యూహవర్జితః*


*భావము :*

*పరిపూర్ణ వైరాగ్యమనే ఖడ్గంతో విషయ వాసనలనే మకరాన్ని ఎవరైతే నరికివేయగలరో, వారే సంసారసాగరాన్ని దాటగలరు.*


*వివరణ :*

*విషయమనే మొసలి, ఏ పురుషునిచే దృఢతరమైన వైరాగ్యమనే కత్తిచే నశింపజేయబడుతుందో, ఆ పురుషుడు సంసార సాగరాన్ని దాటటంలో విఘ్నములు లేనివాడై, జనన మరణాది కల్లోలములతో వ్యాకులమైన సంసార సముద్రం యొక్క అంతమును - అంటే విష్ణువు యొక్క పరమపదమును పొందుతాడు. ముక్తుడవుతాడు.*

*ఇంకా, అటువంటి పురుషుని గురించి 'కఠోపనిషత్తు' ఏమి చెప్పిందంటే :*

*యస్త్వవిజ్ఞానవానవతి అమనస్కః సదా(అ )శుచిః*

*న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి*

*యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదాశుచిః*

*స తు పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే*


*ఎవడు విజ్ఞానము లేనివాడై, మనోనిగ్రహము లేనివాడై, సర్వదా అశుచియై ఉంటాడో, అతడు ఆస్థానాన్ని పొందడు. సంసారాన్ని పొందుతాడు. ఎవడు విజ్ఞానవంతుడై, నిగృహీతమనస్కుడై, సర్వదా శుచియై ఉంటాడో, అతడు దేనిని చేరిన పదప మరల జన్మ పొందడో, అటువంటి పదాన్ని పొందుతాడు.*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: