14, జూన్ 2026, ఆదివారం

సమస్యాపూరణం

 సమస్యాపూరణం.

సమస్య. "సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్".




సంస్కృత మందు గౌరవము, సాధన, శోధన ,సుంతలేని -దు

స్సంస్కృతి నేటి జాడ్యమయె, 

సంస్కృత మెంచగ శాస్త్ర మూలమౌ,

సంస్కృతి లేనివారలె య సత్యము లిట్టుల బల్కుచుంద్రుగా

"సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్"


సురభి శంకరశర్మ.



పాఠకులు కూడా ఈ సమస్యను   వారి కవితా పాఠవాన్ని అనుసరించి ఊరించి ఇక్కడ  కామెంట్ రూపంలో ఇక్కడ పోస్ట్ చేయవచ్చు

కామెంట్‌లు లేవు: