14, జూన్ 2026, ఆదివారం

పాదారవిందశతకము

 *శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి*


 *పాదారవిందశతకము* 


 **14 వ శ్లోకము* 


 *పవిత్రీకుర్యు ర్నః పదతలభువః పాటలరుచః* 


 *పరాగాస్తే పాపప్రశమన ధురీణాః పరశివే !*

 

 *కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి ! వివశా* 

 *వలంతోహ్యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః*

 

 

*భావము :*


*నీ చరణ పరాగాన్ని తలపై దాల్చుటకు విష్ణ్వాదులు తహతహలాడుతూ తొందరపాటుతో ప్రతిచోటా సంచరిస్తున్నారు. అమ్మా కామాక్షీదేవి ! పాపపరిహారంచేసే నీ పాదధూళులు మమ్ములను పావనం చేయాలి సుమా !*


*అమ్మ పాదదూళి మాహాత్మ్యం వివరిస్తూ జగద్గురువులు చెప్పిన 'సౌందర్యలహరి'లో చెప్పిన 3 వ శ్లోకం, భావం :*

 

*అవిద్యానామంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ*

*జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ*

*దరిద్రాణాం - చింతామణిగుణనికా జన్మజలధౌ*

*నిమగ్నానాం దంష్ట్రా - మురరిపు వరాహస్య భవతి*

 *అమ్మా ! నీ దివ్యచరణారవిందముల పాదధూళి, అజ్ఞానమనే చీకటిలో ఉన్నవానికి కాంతులతో నిండిన సూర్యోదయ పట్టణమువంటిది.(అనగా నీ పాదసేవ వలన అజ్ఞానము తొలగి జ్ఞానం కలుగుతుంది). అదేవిధంగా, తెలివిలేని మందబుద్దులైన కదలలే‌ని బద్దకస్తుల పాలిట వారికి చైతన్యము కలిగించే కల్పవృక్ష పుష్పగుచ్ఛమునుండి*

 *జాలువారే మకరందము వంటిది.( నీపాదభక్తి జడులను చైతన్యవంతులను చేస్తుంది). ఇక కోరికలు తీరని దరిద్రులపాలిట సకల కోరికలనూ తీర్చే చింతామణి వంటిది.( నీ పాదపూజ దరిద్రాన్ని పోగొట్టి కోరికలను తీరుస్తుంది). సంసార సాగరములో మునిగిపోవువారి పాలిట, వారిని ఉద్దరించే విష్ణు అవతారమై భూమిని ఉద్దరించిన యజ్ఞవరాహము యొక్క కోరలవంటిది.( నీ పాదస్మరణ భవసాగరమును దాటించి ముక్తిని ప్రసాదిస్తుంది).*

 

*ఆ తల్లి* 

*పాదపద్మములకు నమస్కరిస్తూ* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: