14, జూన్ 2026, ఆదివారం

పోపుల పెట్టె

  పోపుల పెట్టె

=========

రచన:- వంకాయలపాటి వెంకట సూర్య నారాయణ ( సురేష్) పిఠాపురం

==================


అమ్మ ప్రేమతో నిండిన వంటింటి మూలన

నవ్వుతూ నిల్చున్న పోపుల పెట్టె.

చిన్నదే కానీ లోపల

రుచుల ప్రపంచం నింపుకొని,

విస్మయం కలిగించే

మందుల గుట్ట....


జీలకర్ర సువాసనల జ్ఞాపకాలు,

ఆవాల ఆత్మీయతతో,

మెంతుల గుబాళింపుల తిరుగుమోతతో

పదిలంగా దాచుకున్న

పసిడి మూటలా మెరిసే పెట్టె.....


పసిడి లాంటి పసుపు,

ఆత్మీయంగా కలిసే లవణం,

ధనియాల ధ్వనిలో

మనసుకు మధుర సంగీతం వినిపించే

ఆ చిన్న లోకం.....


పొయ్యి పొగలోనూ

అమ్మ ప్రేమ పరిమళం;

పోపుల పెట్టె తెరిచినప్పుడల్లా

ఇంటంతా పండుగ వాతావర నం.


చిన్న పెట్టె అయినా

చెప్పే కథలెన్నో;

చిన్నదే అయినా

తగ్గించే రోగాలెన్నో....

కామెంట్‌లు లేవు: