5, డిసెంబర్ 2021, ఆదివారం

స్పాండిలైటిస్ మరియు సయాటిక

 స్పాండిలైటిస్ మరియు సయాటిక గురించి వివరణ - 


          ఈ రెండు సమస్యలు నేడు సర్వసాధారణం అయినవి . దీనికి ప్రధానకారణం మన ఆహారపు అలవాట్లు మరియు మనం చేయు ఒత్తిడితో కూడుకొనిన పనులు కూడా కారణమే . ఇవి శరీరము నందు పెరుగు వాతదోషము వలన కలుగును. 


       ఈ స్పాండిలైటిస్ లో మెడ వెనుక భాగములో గల C 2 , C 3 , C 4 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడటం వలన నరం ఒత్తుకుపోయి ఈ సమస్య ప్రారంభం అగును. కొందరు తల పైకి ఎత్తలేరు . కొందరు తలను పక్కలకు సరిగా తిప్పలేరు . దీనికి కారణం వారి మెడ నరాలు , కండరాలు బిగుసుకొని పోతాయి . ఇంతకు ముందు చెప్పిన విధముగా నరము నొక్కుకొని పోయినప్పుడు నొప్పి మెడ నుంచి భుజాలకు మరియు చేతులకు కూడా పాకును . 


          సయాటిక నందు వెన్నుపాము చివర నొప్పి మొదలయ్యి కుడికాలు నందు గాని ఎడమకాలి చివర వరకు గాని నొప్పి ఉండును. ఈ నొప్పి తీవ్రత చాలా అధికంగా ఉండును. కదిలినప్పుడల్లా సూదులతో పొడుస్తున్నట్లు ఉంటుంది. వెన్నపాము నందలి L4 , L5 , S1 డిస్క్ ల మధ్య ఖాళి ఏర్పడి ఆ ఖాళి నందు నరం పడి నలగడం వలన ఈ సమస్య ఏర్పడును . 


              నేను ఈ రెండు సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు గమనించిన విషయాలు ఏమిటంటే స్పాండిలైటిస్ వచ్చిన వారికి చిన్నగా కొంతకాలానికి సయాటిక కూడా వస్తుంది. సయాటిక వచ్చిన వారికి కొంతకాలానికి స్పాండిలైటిస్ వస్తుంది. సమస్య మొదలైనప్పుడు సరైన చికిత్స తీసుకోకున్న రెండు సమస్యలు చుట్టుముట్టును . మరొక్క ముఖ్యవిషయం ఈ రెండు సమస్యలు మొదలు ఒకవైపు మాత్రమే మొదలై చివరికి రెండోవైపు కూడా సమస్య మొదలగును . ఉదాహరణకు సయాటిక వెన్నుపాము చివర నుంచి మొదలు అయ్యి కుడికాలుకు వచ్చింది అనుకుందాం మనం మన శరీర బరువును ఎడమకాలి మీద వేసి నడవటం కాని నిలబడటం కాని చేస్తాము . ఇలా కొంతకాలానికి ఎడమ కాలికి కూడా నొప్పి ప్రారంభం అగును. ఇది అత్యంత తీవ్రమైన సమస్య . 


       అల్లోపతి వైద్యము నందు వైద్యులు దీనికి సర్జరి పరిష్కారంగా చెప్తారు. కాని కొంతకాలానికి మరలా సమస్య తిరగబెట్టడం నేను గమనించాను . ఆయుర్వేద వైద్య విధానంలో దీనికి అత్యంత అద్బుతమైన చికిత్సలు కలవు. 


      ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నవారు నన్ను సంప్రదించగలరు. ముఖ్యముగా ఆయుర్వేద చికిత్స యందు పథ్యం ప్రధానపాత్ర పోషిస్తుంది . ఇక్కడ పాటించవలసిన ఆహార పథ్యాలు మీకు వచ్చిన ఆనారోగ్య సమస్యకు మాత్రమే తప్ప ఔషధాలుకు కావు . నేను తయారుచేసి ఇచ్చు ఔషధాలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  


                కాళహస్తి వేంకటేశ్వరరావు 


            అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

సంపూర్ణ సూర్యగ్రహణం

 Oneindia Telugu

Surya Grahanam 2021: శనివారం..అమావాస్య..సంపూర్ణ సూర్యగ్రహణం: కనిపించే దేశాలివే

By Chandrasekhar Rao

Updated: Fri, Dec 3, 2021, 11:16 [IST]

  Google Oneindia New

కొద్దిరోజుల కిందటే చంద్రగ్రహణాన్ని చూశాం. కిందటి నెల నవంబర్ 19వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. భారత్‌లో ఇది కనిపించలేదు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో కొంతభాగం మాత్రమే ఈ కార్తీక పౌర్ణమి నాటి చంద్రగ్రహణం కనిపించింది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. కనువిందు చేయనుంది. కొన్ని దేశాల ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. భారత్‌లో ఇది కనిపించదు.ముందుగా సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం. సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. దీన్నే సూర్యగ్రహణం అంటాం. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో చంద్రడు వచ్చిన సమయంలో చంద్రుడికి సంబంధించిన నీడ భూమిపై పడుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సూర్యుడి నుంచి వచ్చే కాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. దీన్నే అంబ్రా అని పిలుస్తాము. సూర్యుడి బాహ్య ప్రాంతంను మాత్రమే అడ్డుకుంటే పెనంబ్రా అని ఇంగ్లీషులో పిలుస్తాము. సంపూర్ణ సూర్యగ్రహణం రోజున చంద్రుడు మొత్తం సూర్యుడికి అడ్డుగా ఉంటుంది. అదే పాక్షిక సూర్యగ్రహణం రోజున సూర్యుడిలో ఒక భాగం మాత్రమే చంద్రుడు అడ్డుకుటుంది.



శనివారం అమావాస్య నాడు..

ఈ సంవత్సరపు చివరి సూర్య గ్రహణం ఇది. ఈ నెల 4వ తేదీన..శనివారం అమావాస్య నాడు ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్న సమయంలో సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వస్తాడు. అప్పుడు సూర్యుడి నీడ భూమిపై పడుతుంది. ఈ అంతరిక్ష అద్భుతం పలు దేశాల్లో కనిపిస్తుంది. పాక్షికమే అయినప్పటికీ..కొన్ని దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్‌ను చూడగలుగుతాయి. గ్రహణం సమయం ఆరంభం నుంచి పూర్తి ఆ ఛాయ తొలగిపోవడానికి దాదాపు ఆరు గంటల పాటు పడుతుంది.




కనిపించే దేశాలివే..

దక్షిణార్ద్ర గోళంలో కొన్ని దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. అంటార్కిటికా, అట్లాంటిక్ మహా సముద్రం దక్షిణ తీర ప్రాంత దేశాలు, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాల్లో కనిపిస్తుంది. సెయింట్‌ హెలెనా, నమీబియా, జార్జియా దక్షిణ ప్రాంతం, దక్షిణాఫ్రికా, శాండ్‌విచ్‌ ఐలండ్స్, క్రోజెట్‌ ఐలండ్, లెసొతొ, ఫాక్‌లాండ్‌ ఐలండ్స్, చిలీ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగా మాత్రమే కనిపిస్తుందని తెలిపింది.


.


.



ఐఎస్టీ ప్రకారం..

భారత్‌లో ఇది కనిపించదని నాసా స్పష్టం చేసింది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం.. 4వ తేదీన ఉదయం 10 గంటల 59 నిమిషాలకు సూర్యగ్రహణం ఆరంభమౌతుంది. మధ్యాహ్నం 3:07 నిమిషాలకు ముగుస్తుంది. మధ్యాహ్నం 12:33 నిమిషాలకు గ్రహణం గరిష్ఠ స్థితికి చేరుకుంటుంది. క్రమంగా తగ్గుతుంది. 3:07 నిమిషాలకు గ్రహణ ఛాయ పూర్తిగా ముగిసిపోతుంది. ఈ సంవత్సరం మూడు గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ నెల 4వ తేదీన ఏర్పడేది నాలుగో గ్రహణం.



ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చు..

ఇంతకుముందు మే 26వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం, జూన్‌ 10వ తేదీన వార్షిక సూర్యగ్రహణం, నవంబర్‌ 19 పాక్షిక చంద్రగ్రహణాలు కనువిందు చేశాయి. ఈ సూర్యగ్రహణాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్ నుంచి లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నాసా అధికారిక యూట్యూబ్ ఛానల్‌ nasa.gov/live లో ఇది ప్రత్యక్ష ప్రసారమౌతుంది. మధ్యాహ్నం 12 గంటలకు లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు తెలిపింది

సంతోషము - సుఖము - ఆనందము*

 *ॐ సంతోషము - సుఖము - ఆనందము*


    సంతోషము, సుఖము, ఆనందము అనేవి వేరువేరైనా, 

    ఓకే విధమైన అర్థంలో వాడుతూ ఉంటాం. 

    వాటి నిర్వచనాలూ, ఆనందమనేదాని వివరణలు తెలుసుకొందాం. 


*సంతోషము:*


    సోమరిగా నుండకుండా, శక్తికొలది పురుషార్థములు (ధర్మముతో కూడిన అర్థ సంపద, తద్వారా ధర్మముతో కూడిన కోరిక, దానివలన వచ్చే మోక్షము అనేవి "ధర్మ అర్థ కామ మోక్షమనే పురుషార్థములు") చేయుచు, 

    హాని జరిగినప్పుడు శోకించకుండా, 

    లాభము కలిగినప్పుడు హర్షము లేకుండా ఉండడం "సంతోషము". 


*సుఖము:* 


    దేనిని పొందుట వలన మిగిలిన యే సంపదయైనను దానికన్న తక్కువదే అనిపించునో, 

    ఏ యితర లాభమును మనస్సును ఆకర్షింపని స్థితిలో, 

    మనస్సును ఆకర్షింపగల అనుభూతి ఒక్కటే సుఖము. 

    ఏ స్థితిని పొందినవాడు పెద్ద దుఃఖముల వలన కూడా చలింపడో అదే నిజమైన సుఖము. 


ఉదా॥ 

1. ఒకచోట కూర్చొని తృప్తి పొందినప్పుడు, మరింత సౌకర్యమైన అవకాశము వచ్చినా, 

    దానిని తిరస్కరించి, ఉన్నదానితో తృప్తిపొందుతూ ఉండడం "సుఖం". 

2. రేడియో ఉపయోగంతో తృప్తిపడుతూ, టేప్ రికార్డరుగానీ ఇతర సౌకర్యవంతమైన పరికరాలువచ్చినా, 

     రేడియో ఉపయోగానికే స్థిరపడితే, అది "సుఖం". 

3. పదోన్నతి (Promotion) అవుసరం లేక, ఉన్నదానితోనే తృప్తి పడితే, అది "సుఖం". 


*ఆనందము:* 


    వివిధ పదవులూ స్థానాలలో ఉన్నప్పుడు, 

    ఆ అధికారాన్ని పొందుతూ ఉండే దైహిక సౌకర్యమూ మానసిక ఉల్లాస స్థితీ ఆనందం. 

    ఇది పదవీ స్థాయిలను బట్టీ మారుతూంటుంది. 


ఉదా॥ 

    రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నరు, ముఖ్యమంత్రి, కలెక్టరు, న్యాయమూర్తి మొదలగు పదవులలో వారు పొందే మానసిక స్థితులు - వారివారి ఆనందములు. 


*ఆనందానికి శాస్త్ర ప్రమాణం*  


    వివిధ ఆనందాలను తైత్తిరీయోపనిషత్తు ఈ విధంగా తెలుపుతోంది.

1. మనుష్య ఆనందము 

     శారీరక మానసిక దృఢత్వంగల ఒక ఉత్తమవ్యక్తికి సర్వ సంపదలతోనూ ఈ భూమండలమంతా చెందితే ఎంత ఆనందం వస్తుందో అది మనుష్య ఆనందానికి ప్రమాణము(unit). 

" ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః I 

  త స్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ I 

   స ఏకో మానుష ఆనన్దః"  

2. దీనికి వంద రెట్ల ఆనందం మనుష్య గంధర్వానందం, 

3. ఆ మనుష్య గంధర్వానందానికి వందరెట్లు దేవగంధర్వానందం, 

4. దానికి వందరెట్లు పితృదేవతల ఆనందం, 

5. ఆ పితృదేవతల ఆనందానికి వందరెట్లు అజానజుల ఆనందం, 

6. వారి ఆనందానికి వందరెట్లు కర్మదేవతల ఆనందం, 

7. ఆ కర్మదేవతల ఆనందానికి వందరెట్లు దేవతల ఆనందం, 

8. వారి ఆనందానికి వందరెట్లు ఇంద్రుని ఆనందం, 

9. ఇంద్రుని ఆనందానికి వందరెట్లు బృహస్పతి ఆనందం, 

10. బృహస్పతి ఆనందానికి వందరెట్లు ప్రజాపతి ఆనందం, 

11. ప్రజాపతి ఆనందానికి వందరెట్లు బ్రహ్మానందం.


                    =x=x=x= 

  

    — రామాయణం శర్మ 

            భద్రాచలం

4, డిసెంబర్ 2021, శనివారం

బ్రహ్మవిద్య

 మొదటి రెండు అధ్యాయాలలోను బ్రహ్మవిద్య గురించి వచ్చింది; మూడవ అధ్యాయంలో నిర్గుణ బ్రహ్మను సగుణ బ్రహ్మగా చూపించి గురువు ద్వారా బ్రహ్మవిద్యను పొందాలని సూచించింది.


బ్రహ్మవిద్యను గురుశాస్త్ర ఉపదేశం ద్వారానే పొందగలము. అది పొందటానికి మనకు అధికారత్వం కూడా ఉండాలి. ఉదాహరణకు మన అందమైన మొహం మనం చూసుకోవాలనుకుంటే, దానికి ఏం కావాలి? కన్ను, అద్దం.


అద్దం ఎంత బాగున్నా, మన కన్ను కనపడకపోతే మనం అద్దంలో చూసుకోలేము. అలాగే కన్ను ఎంత అందంగా ఉన్నా, అద్దం లేకపోతే మన మొహం చూసుకోలేము. అలాగే ఆత్మజ్ఞానం పొందాలంటే రెండు కావాలి. సంసిద్ధమైన అంతఃకరణం, గురుశాస్త్ర ఉపదేశం. అంతఃకరణం కన్ను లాంటిది; గురుశాస్త్ర ఉపదేశం అద్దం లాంటిది. మనం సంసిద్ధమైన మనస్సుతో లేకపోతే గురువు శాస్త్రం ఎంత చెప్పినా అర్థం కాదు. అలాగే మనం ఎంత సంసిద్ధంగా ఉన్నా, గురుశాస్త్ర ఉపదేశం లేకపోతే ఆత్మజ్ఞానం పొందలేము. ఉపనిషత్తు గురువునూ, శాస్త్రాన్ని కలిపి చెపుతుంది. ఎందుకంటే శాస్త్రంలో ఉన్న విద్యే గురుపరంపరగా వస్తుంది. దాన్నే గురువు శిష్యునికి నేర్పిస్తాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించవచ్చు. శాస్త్రం అర్థంచేసుకోవటం కష్టమా, తేలికా? ఒకచోట తేలిక అంటుంది. ఒకచోట కష్టం అంటుంది. సుసుఖం కర్తుమవ్యయమ్ గీత 9-2


ఈ విద్య నేర్చుకోవటం చాలా తేలిక.


క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదని


కథ 1-3-14


విద్య నేర్చుకోవటం క్షురకుని పదునైన కత్తి అంచుమీద నడవటంలాంటిది. ఏది నిజం? రెండూ నిజమే. మనసు సంసిద్ధంగా ఉంటే, బ్రహ్మ విద్యను అర్థం చేసుకోవటం చాలా తేలిక. మనస్సు సంసిద్ధంగా లేకపోతే అర్థం చేసుకోవటం

3, డిసెంబర్ 2021, శుక్రవారం

శివుడికి జలుబు

 "శివుడికి జలుబు చేసింది"


     నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా. కనీసం మాతో మాట్లాడే టైమ్ కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది? అడుగు తూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీ దేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబు తో వణికి పోతున్నాడు శివుడు.😖😞😤


నెల రోజుల బట్టి మొత్తుకుంటున్నా! చెబితే విన్నారు కాదు. ఏదిబడితే అది. పండా, కాయా, రేషన్ చెక్కరా, కల్తీ తేనె....ఏమీ చూడకుండా.. అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థ పడుతున్నారు..🤨😙


పాపం భక్తులు.... ప్రేమతో పోస్తున్నారు కదా అని........ఏమీ అనలేకపోయాను.😌


"భక్తులు ప్రేమతో కాదు. TV ఛానెళ్లల్లో ఏది చెబితే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయమేస్తుంది. ఒక్కొక్క పండుకి ఒక బెనిఫిట్ ఇస్తారట గా మీరు? నవ్వుతూ అంది అమ్మవారు.


" నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు. భక్తి తో నన్ను తలుచుకుంటే చాలు. ఈ స్కీం లు నావి కావు. అప్పటికీ చాగంటి చేత, గరికపాటి చేత చెప్పిస్తున్నా ఎవ్వడూ వినిపించుకోవట్లేదు.😟😟


"కనీసం కన్నెర్ర చేయొచ్చు కదా."


'ఆ పని కూడా చేశా. కళ్ళల్లోకి పోయి ఇంకాస్త మండుతున్నాయి.' ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు.


"సర్లేండి. ఈ కషాయం తాగండి". ఇచ్చింది పార్వతి.


ఇదంతా చూస్తున్న నారదుల వారు, వెళ్లి వైకుంఠంలో చెప్పాడు.


వెంటనే TV ఆన్ చేసిన అమ్మవారికి...షాక్ తగిలింది. విశాఖ, కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాలప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీద కు *భక్తి* తో విసిరేస్తున్నారు. పాపం అది చూసి అమ్మవారు ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అసలే చలికాలం.


అది చూసి, విష్ణువు పకపకా నవ్వసాగాడు.


" మరీ సంబర పడిపోకండి. ధనుర్మాసం కూడా వస్తుంది. మాకూ నవ్వే అవకాశం వస్తుంది"అంటూ, ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారదా అంది మహాలక్ష్మమ్మ.

🙏🙏🙏



నిజ భక్తితో ఆలోచించండి. 🙏

2, డిసెంబర్ 2021, గురువారం

వృధాప్యమే

 _పాదాలు బలహీనం అయితే వృధాప్యమే ..!_

_వృధాప్యం పాదాల నుండి పైకి మొదలవుతుంది!_    

 _కాబట్టి పాదాలు చురుకుగా, బలం గా ఉంచండి !!_


 _మన వయస్సు పెరుగుతున్నప్పుడు మరియు  వృద్ధాప్యం చెందుతున్నప్పుడు, మన పాదాలు ఎల్లప్పుడూ చురుకుగా & బలంగా ఉండాలి._


_మనం నిరంతరం వృద్ధాప్యం / వృద్ధాప్యం చెందుతున్నందున, మన జుట్టు బూడిదరంగు (లేదా) చర్మం కుంగిపోవడం (లేదా) ముఖంపై ముడతలు పడటం గురించి మనం భయపడకూడదు._


  _దీర్ఘాయువు సంకేతాల మధ్య, ప్రముఖ యుఎస్ మ్యాగజైన్ "ప్రివెన్షన్" ద్వారా సంగ్రహించినట్లుగా, సుదీర్ఘమైన ఫిట్ లైఫ్, బలమైన కాళ్ల కండరాల పైన *అత్యంత ముఖ్యమైనవి & అవసరమైనవిగా జాబితా చేయబడ్డాయి._ 


 _ప్రతిరోజూ నడవండి._


 _మీరు కేవలం రెండు వారాల పాటు మీ కాళ్ళను కదపకపోతే, మీ నిజమైన కాళ్ళ బలం 10 సంవత్సరాలు తగ్గుతుంది._


 _కేవలం నడవండి_


  _డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన ఒక అధ్యయనంలో వృద్ధులు & యువకులు, రెండు వారాల పాటు నిష్క్రియాత్మకత , వల్ల_ 


 _కాళ్ల కండరాల బలం *మూడవ వంతు బలహీనపడవచ్చు, ఇది 20-30 సంవత్సరాల వృద్ధాప్యానికి సమానం !!_


 _కాబట్టి నడవండి_


 _మన కాలి కండరాలు బలహీనపడటం వలన, మనం తరువాత పునరావాసం & వ్యాయామాలు చేసినప్పటికీ, కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది._


 _కాబట్టి నడవండి_


 అందువల్ల, 

నడక వంటి రెగ్యులర్ వ్యాయామం చాలా ముఖ్యం 


 మొత్తం శరీర బరువు/ లోడ్ అలాగే ఉండి కాళ్లపై విశ్రాంతి తీసుకుంటుంది.


  పాదాలు ఒక రకమైన స్తంభాలు , మానవ శరీరం యొక్క మొత్తం బరువును భరిస్తూ ఉంటాయి.


 రోజూ నడవండి.


  ఆసక్తికరంగా, ఒక వ్యక్తి యొక్క ఎముకలలో 50% & కండరాలలో 50%, రెండు కాళ్లలో ఉంటాయి.


 రోజూ నడవండి..


 మానవ శరీరంలోని అతి పెద్ద & బలమైన కీళ్ళు & ఎముకలు కూడా కాళ్లలో ఉన్నాయి.


 రోజు 10 వేల  అడుగులు నడవండి  


  బలమైన ఎముకలు, బలమైన కండరాలు మరియు సౌకర్యవంతమైన కీళ్ళు ఐరన్ ట్రయాంగిల్ ను ఏర్పరుస్తాయి, 


ఇవి అత్యంత ముఖ్యమైన భారాన్ని కలిగి ఉంటాయి, 


70% మానవ కార్యకలాపాలు మరియు ఒకరి జీవితంలో శక్తి దహనం (burning of calories) రెండు పాదాల ద్వారా జరుగుతుంది.


 ఇది నీకు తెలుసా?  


ఒక వ్యక్తి చిన్న వయస్సులో ఉన్నప్పుడు, అతని/ ఆమె తొడలు 800 కిలోల చిన్న కారును ఎత్తడానికి తగినంత బలాన్ని కలిగి ఉంటాయి! 


 పాదము శరీర లోకోమోషన్ 


 కాళ్లు రెండూ కలిపి మానవ శరీరంలోని 50% నరాలను, 50% రక్తనాళాలను మరియు 50% రక్తం వాటి ద్వారా ప్రవహిస్తున్నాయి.


 ఇది శరీరాన్ని కలిపే అతి పెద్ద ప్రసరణ నెట్‌వర్క్.


 కాబట్టి రోజూ నడవండి.


 ఒకవేళ  పాదాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది, 


కనుక బలమైన కాలు కండరాలు ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా బలమైన హృదయాన్ని కలిగి ఉంటారు. ..


 కాబట్టి రోజూ నడవండి.

వయస్సు పాదాల నుండి పైకి మొదలవుతుంది


 ఒక వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పటి కంటే  వయస్సు పెరిగే కొద్దీ, మెదడు మరియు కాళ్ల మధ్య సూచనల ప్రసార ఖచ్చితత్వం & వేగం తగ్గుతుంది, 


.  కాబట్టి  నడవండి 


  అదనంగా, బోన్ ఫెర్టిలైజర్ కాల్షియం అని పిలవబడేది కాలక్రమేణా త్వరగా తగ్గి పోతుంది, ఇది వృద్ధులను ఎముక పగుళ్లకు గురి చేస్తుంది.  


 రోజూ నడవండి.


 వృద్ధులలో ఎముక పగుళ్లు, ముఖ్యంగా మెదడు త్రోంబోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను సులభంగా ప్రేరేపిస్తాయి.


  తొడ ఎముక విరిగిన సంవత్సరంలోపు 15% మంది వృద్ధ రోగులు సాధారణంగా చనిపోతారని మీకు తెలుసా.  


 తప్పకుండా నడవండి

కాళ్లు వ్యాయామం చేయడం, 60 ఏళ్లు దాటినప్పటికీ, చాలా ఆలస్యం కాదు. 


కాలంతోపాటు మన పాదాలు/ కాళ్లు క్రమంగా వయస్సు మీద పడుతున్నప్పటికీ, మన పాదాలకు/ కాళ్లకు వ్యాయామం చేయడం అనేది జీవితకాల పని.


 10,000 అడుగులు నడవండి


 కాళ్లను క్రమం తప్పకుండా బలోపేతం చేయడం ద్వారా, ఒకరు మరింత వృద్ధాప్యాన్ని నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు. 


 _రోజు నడవండి_


  _దయచేసి మీ కాళ్లకు తగినంత వ్యాయామం అందేలా మరియు మీ కాలి కండరాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి_ 


_రోజూ కనీసం 30-40 నిమిషాలు నడవండి._


 _ప్రతిఒక్కరూ రోజూ వృద్ధాప్యంలో ఉన్నందున మీరు ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ 40+ స్నేహితులు & కుటుంబ సభ్యులతో పంచుకోవాలి_


 ‍♀️

విష్ణుసహస్ర నామ స్తోత్రం

 విష్ణుసహస్ర నామ స్తోత్రం విశిష్టత


రోజుకు కనీసం ఒక్క సారైనా 

విష్ణుసహస్ర నామ పారాయణం చేయండి.

ఉత్తమ ఫలితాలు పొందండి..


మంత్రాల ఘనికి మూల మంత్రం శ్రీ విష్ణుసహస్రనామం

ఓం నమో నారాయణాయ .

ఓం నమో భగవతే వాసుదేవాయ.

ఫలితం మీకే స్పష్టంగా తెలుస్తుంది...


విష్ణు సహస్ర నామ స్తోత్రము పారాయణ చేసిన 

అశ్వ మేధ యాగం చేసినంత పుణ్యం కలుగును ఆయురారోగ్యము కలుగును, 

పాపములు తొలగును. 


స్తోత్రము లో ప్రతి నామము అద్భుతం. 

మన నిత్య జీవితంలోని అన్నీ సమస్యలకు పరిష్కరాలు ఇందులో వున్నాయి


విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు నిష్ఠతో పఠించే వారికి ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. కష్టనష్టాలు ఒక్కసారిగా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో విష్ణు సహస్ర నామపారాయణం అన్నింటికీ విరుగుడులా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు. 


అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా కష్టాలు, వ్యాధులు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు శుభాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పఠనం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ.. ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా ఇంటి దేవతా పూజతో, ఇష్టదేవతా పూజతో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. 


అయితే విష్ణు సహస్రనామాన్ని అనునిత్యం ఏడాది పాటు పఠించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటే..?


1. అదృష్టం


2. ఆర్థిక ఇబ్బందులు వుండవు 


3. గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం 


4. కోరిన కోరికలు నెరవేరుతాయి


5. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది


విష్ణు సహస్రనామాన్ని పఠించే ముందు శుచిగా స్నానమాచరించడం చేయాలి. ఆపై పూజగదిలో కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. లేకుంటే వినడమైనా చేయాలి. ఈ విష్ణు సహస్ర నామం నుంచి వెలువడే శబ్ధం దుష్ట ప్రభావాన్ని దూరం చేస్తుంది. అలాగే ఇంటి ముందు తులసిని పెంచడం ద్వారా మంచి ఫలితాలు వుంటాయి. అలాగే తులసీ మొక్క ముందు నేతి దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందిన వారవుతారు.


అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 

108 మార్లు జపించవలెను. 

పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:


1. విద్యాభివృద్ధికి :-

      14వ శ్లోకం.

సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |

వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||


2. ఉదర రోగ నివృత్తికి:-

       16వ శ్లోకం.

భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||


3. ఉత్సాహమునకు:-

       18వ శ్లోకం.

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |

అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||


4. మేధాసంపత్తికి:-

       19వ శ్లోకం.

మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |

అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||


5. కంటి చూపునకు:-

       24వ శ్లోకం.

అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |

సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్ ||


 6. కోరికలిడేరుటకు:-

         27వ శ్లోకం.

అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |

సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||


7. వివాహ ప్రాప్తికి:-

       32వ శ్లోకం.

భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |

కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||


8. అభివృద్ధికి:-

       42వ శ్లోకం.

వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |

పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||


9. మరణ భీతి తొలగుటకు:-

        44వ శ్లోకం.

వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||


10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:-

         46వ శ్లోకం.

విస్తారః స్థావర స్స్తాణుః ప్రమాణం బీజ మవ్యయం |

అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||


 11. జ్ఞానాభివ్రుద్ధికి:-

           48వ శ్లోకం.

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |

సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||


12. క్షేమాభివ్రుధ్ధికి:-

           64వ శ్లోకం

అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |

శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||


13. నిరంతర దైవ చింతనకు:-

          65వ శ్లోకం.

శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |

శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||


14. దుఃఖ నివారణకు:-

           67వ శ్లోకం.

ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |

భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||


15. జన్మ రాహిత్యమునకు:-

          75వ శ్లోకం.

సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |

శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||


16. విద్యా ప్రాప్తి కి :-

       80వ శ్లోకం.

అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|

సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||


 17. శత్రువుల జయించుటకు:-

            88వ శ్లోకం.

సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !

న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||


18. భయ నాశనమునకు:-

           89వ శ్లోకం.

సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |

అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||


19. సంతాన ప్రాప్తి కి :-

       90వ శ్లోకం.

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|

అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||


20. మంగళ ప్రాప్తికి:-

         96వ శ్లోకం.

సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |

స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||


21. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:-

          97 & 98వ శ్లోకం.

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |

శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||


22. దుస్వప్న నాశనమునకు:-

            99వ శ్లోకం.

ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |

వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||


23. పాపక్షయమునకు:-

           106వ శ్లోకం.

ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |

దేవకీ నందన స్స్రష్టా క్షితీశః పాపనాసనః ||


24.సర్వ రోగ నివారణకు:-

     103వ శ్లోకం.

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః

తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||


25. సుఖ ప్రసవమునకు:-

    107వ శ్లోకం.

శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|

రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||

శ్రీ స్సర్వ ప్రహరణాయుధ ఓమ్ నమ ఇతి


విష్ణు సహస్ర నామము మొత్తం చదివిన తదుపరి మీకు ఇందులో కావలసిన శ్లోకం 108 సార్లు పఠించవలెను.

(సేకరణ)

సోమసూత్ర ప్రదక్షిణ

 9:11 AM


దాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాల  చేసే ప్రదక్షిణ కి భిన్నంగా ఉంటుంది ఏ గుడిలోకి వెళ్ళిన సర్వసాధారణంగా ప్రదక్షణలుచేస్తారు కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది .



ఇతర దేవాలయాలలో చేసిన విధంగా *ఈశ్వరుని* దేవాలయంలో ప్రదక్షణ చేయకూడదు శివాలయంలో ఏ విధంగా ప్రదక్షణ చేయాలో *లింగపురాణంలో* స్పష్టంగా వివరించింది.


శివాలయంలో చేసే ప్రదక్షిణ *చండి ప్రదక్షిణ* లేదా *సోమసూత్ర ప్రదక్షిణ* మని అంటారు


ఈ చండి ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు


పొందవచ్చు పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు లింగపురాణంలో శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి ఈ విధంగా చెబుతుంది శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షణ ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షణ చేసి చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుండి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది


వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు.


ఈ విధం చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర పదకిణమని అని పేరు.



కర్పూర శిలాజిత్ భస్మము -

 ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 4 . 


 * కర్పూర శిలాజిత్ భస్మము - 


        ఈ భస్మమును సేవించిన మూత్రరోగములు, మేహరోగములు , మందాగ్ని , ధాతునష్టం తగ్గించును . 


 * ముదారుసింగు భస్మం - 


       ఈ భస్మమును సరైన అనుపానములతో సేవించిన సెగ , సవాయి రోగములు , ఉబ్బసములు పోవును . ధాతువృద్ధి చేయును . 


 * మైలుతుత్త భస్మం - 


         ఈ భస్మమును సేవించిన కుష్ఠు , కీళ్లనొప్పులు , పాతసెగలు , మూత్రరోగములు , రణ భాధలు తగ్గును . 


 * గంధక భస్మం - 


       ఈ భస్మమును సరైన అనుపానంతో సేవించిన కుష్ఠు , కీళ్లనొప్పులు , చర్మదోషములు , పక్షవాతములు , సవాయి మేహములు , భగందరము , వాతములు హరించును . 


 * అభ్రక భస్మము - 


       ఈ అభ్రక భస్మమును అనుపానయుతముగా సేవించిన శ్లేష్మ పైత్య రోగములు , పైత్య వాత రోగములు , శ్లేష్మ వాత రోగములు , సమస్త రోగములు హరించును . దీనిని నేను తయారుచేయు అనేక ఔషధాలలో విరివిగా వాడతాను . 


              ఇప్పటివరకు మీకు నేను తెలియచేసినటివంటి భస్మాలన్నీ అనేకరకాలైన రోగాలపైన బ్రహ్మస్త్రాల వలే పనిచేయును . ఈ భస్మాలను విడివిడిగా వాడుట కంటే కొన్ని భస్మాలను కలిపి వాడినప్పుడు ఫలితాలు అమోఘముగా రావటం జరిగింది . 


     మూలికలు కాలం గడుస్తున్న కొలది తమయొక్క శక్తిని పోగొట్టుకొనును . మూలికా చూర్ణాల శక్తి కేవలం 5 నెలల వరకు మాత్రమే ఉండును. కాని భస్మాల యొక్క శక్తి సమయం గడిస్తున్న కొలది పెరుగును . 


                       సమాప్తం 


   

              కాళహస్తి వేంకటేశ్వరరావు 


               అనువంశిక ఆయుర్వేదం 


                     9885030034

Numbers