25, మే 2024, శనివారం

*శివ మానస పూజ

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *రత్నైఃకల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం* 

*నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనమ్* | 

*జాతీచంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా* 

*దీపం దేవ దయానిధే పశుపతేహృత్కల్పితం గృహ్యతామ్* ౧ 


               [ *శివ మానస పూజ* ]


ఓ భగవాన్ పశుపతి, కరుణకు పభ్రువు. అమూల్యమైన రత్నాలతో 

తయారు చేయబడిన సింహాసనంపై, హిమాలయాల నుండిచల్లటి 

నీటితో స్నానం చేసి, దివ్య వస్త్రాలు ధరించి, వివిధ విలువైన రత్నాలు మరియు ఆభరణాలతో అలంకరించబడి, మీ శరీరంపైచందనం మరియు కస్తూ రితో మీరు కూర్చున్నారు. నేను భక్తితో నీకు సమర్పిస్తున్న మల్లెపూలు, చంపక పుష్పాలు, బిల్వ పత్రాలు, ధూపం, పక్రాశించేదీపం స్వీకరించండి.


   👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇


శ్లో𝕝𝕝 *ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేకవిచారం* |


*జాప్యసమేత సమాధివిధానం కుర్వవధానం మహదవధానం* 30


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు. 


✍️💐🪷🌷🙏

భార్యాపుత్రాదులు

 *ఋణానుబంధ రూపేణా*

*పశుపత్నీ సుతాలయః*,

*ఋణక్షయే క్షయం యాంతి*

*కా తత్ర పరివేదనా*.

```

భావం: "పశువులు,భార్యాపుత్రాదులు, ఇళ్ళూవాకిలి ఇవి ఋణానుబంధ రూపంగా వచ్చి, ఋణం తీరగానే వెళ్ళిపోతాయి. 

ఋణం తీరిపోతే ఇక బంధాల వల్ల కలిగే దుఃఖం ఉండదు కదా"


ముఖ్యంగా మనకు రావాల్సిన వాటిని గుర్తుపెట్టుకుంటాం. కానీ మనం ఇవ్వాల్సిన వాటిని మర్చిపోతాం. మనం ఇతరులకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అది ఇచ్చేవరకు మళ్ళీ మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది. మనం తీసుకున్న వాటిని తిరిగి చెల్లిస్తే బంధవిముక్తులమవుతాం. 


ఈ జన్మలో ఇతరులతో మన అనుబంధాలకు కారణం గత జన్మలోని బంధాలే.   


బంధాలెన్నో రకాలు. అందులో ఋణానుబంధం చాలా ముఖ్యమైనది. మనం బంధవిముక్తులం కావాలంటే ఋణవిముక్తులం కావాలి. 


ఇచ్చిన వారు మర్చిపోయారు, అడగడం లేదు కదా, అని మనం తీసుకున్నదాన్ని తిరిగి ఇవ్వకపోతే జీవితాంతం పూజలు చేసినా మనం బంధవిక్తులం కాలేం. ఇచ్చిన వారు మర్చిపోయినప్పటికీ, తీసుకున్న వారు దానిని గుర్తుపెట్టుకొని, తిరిగి ఇచ్చినప్పుడే బంధ విముక్తులవుతారు.


పూర్వం యోగులు తీసుకున్న దానిని ఎక్కడ మర్చి పోతామేమోనని తక్కువగా గ్రహించేవారు. ఎంత అవసరమో అంతే గ్రహించేవారు. అవసరానికిమించి, అది ఉచితంగా వచ్చినప్పటికీ దానిని స్వీకరించేవారుకాదు. ఇస్తున్నారు కదా అని తీసుకుంటూపోతే ఎప్పటికీ బంధవిముక్తులం కాలేము. 


యోగులు అభ్యసించే  “అపరిగ్రహం” ఎంతోకొంత మనం పాటించగలిగితే ఋణానుబంధానికి దూరంగా ఉండగలుగుతాం, ఆ భగవంతునికి దగ్గరవగలుగుతాం.

తిరుమల కొండలకు

 *🛕తిరుమల కొండలకు ఆపేర్లెలావచ్చాయి🛕* 

 *🛕🙏⛰️⛰️\|/⛰️\|/⛰️\|/⛰️⛰️🙏🛕* 



⛰️⛰️ఏడుకొండలు మీద వెంకటేశ్వరుడెందుకున్నాడంటే దానికొక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెబుతారు. శరీరంలో ఏడు చక్రాలున్నాయి. అవి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, అజ్ఞ, సహస్రారం ... అధోముఖమైన కుండినీ శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం. ఏడు కొండలకు ఏడు పేర్లున్నాయి. అవి అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి.


 *⛰️ అంజనాద్రి ⛰️*


అంజనాద్రి అనే పేరు ఎందుకొచ్చిందంటే  త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుని కుమారునిగా పొందింది. అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది.


 *⛰️ వృషభాద్రి ⛰️* 


వృషభాద్రి పేరు ఎలా వచ్చిందంటే ... కృతయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు, అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు. విష్ణువు వృషభాసురునితో యుద్ధం చేసాడు. ఎంతటీ వృషభుడు చనిపోక పోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శునుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు. మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని యిచ్చి వధించాడు. అందువల్ల ఆ కొండకు వృషభాద్రి అనే పేరు వచ్చింది.


 *⛰️ నీలాద్రి ⛰️* 


నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... ఏడు కొండలలో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూరజంతువుల సంచారం విపరీతంగా ఉండేది. దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసున్ని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూరజంతువులను వేటాడి అలసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా, నుదుటిపై కొంతభాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అది పెద్దా లోపంగా ఆమె భావిస్తుంది. తన కురులలో కొంతభాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శీనివాసునికి నిద్రాభంగం అయి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండడు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతయనే వరమిచ్చాడు. ఆ కారణం వల్లే కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది.


 *⛰️ శేషాద్రి ⛰️* 


శేషాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరువచ్చింది. శ్రీహరి వాయువుకు, శేషునికి పందెం పెడతాడు. శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు. వాయువు మహావేగంతో వీస్తాడు. శేషుడు స్వర్ణముఖి తీరం వరకూ వెళతాడు. మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడివడుతుంది. శేషుడు అక్కడే తపస్సు చేయడం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది. ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా ఉంది. శ్వేత వరాహకల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు శ్రీవైకుంఠం నుంచి ఈ పర్వతాన్ని తీసుకుని రావడం వల్ల ఈ కొండకు గరుడాద్రి అనే పేరువచ్చింది.


 *⛰️నారాయణాద్రి⛰️* 


నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... సాక్షాత్ నారాయణుడే నివసించడంవల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది. అంతేగాదు, శ్రీమన్నారాయణుడు మొట్టమొదట ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అదే గాకుండా నారాయణుడే భక్తుడు తపమాచరించి నారాయణుని సాక్షాత్కారం పొందడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. అలాగే నారాయణుడనే బ్రాహ్మణుని ప్రార్థన మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరు వచ్చింది.


 *⛰️ వెంకటాద్రి ⛰️* 


వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే ... "వేం''కారానికి అమృతమని అర్థం "కటం'' అంటే ఐశ్వర్యం, నమ్మి కొలిచేవారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం. అలాగే పాపాలకు ''వేం'' అనే అర్థం ఉంది. ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రచారం ఉంది. పూర్వం శ్రీకాళహస్తిలో పురందరుడు అనే శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు. పుత్రసంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేసాడు. చివరకు ముసలితనంలో మాధవుడనే పుత్రుణ్ణి కన్నాడు. మాధవుడు వేదవేదాంగాది సకల విద్యలను నేర్చుకుని మహాపండితుడయ్యాడు. యుక్తవయస్సు వచ్చింది. చంద్రలేఖ అనే కన్యను పెళ్ళి చేసుకున్నాడు. ఏ లగ్నంలో పెళ్ళి చేసుకున్నాడో కానీ కామాంధుడై భార్యను వదిలి, బ్రాహ్మణ విధులను విడిచి స్త్రీల పొందు పొందేవాడు. అంతేకాకుండా కుంతల అనే వేశ్యను మోహించి దిగజారిపోయి జంధ్యాన్ని తెంచేసి, మద్యమాంసాలను స్వీకరిస్తూ ఆమెతో సుఖించేవాడు. కొంతకాలానికి ఆమె మరణిస్తుంది. ఆమె వియోగంతో అతను పిచ్చివాడిలాగా దేశదిమ్మరి అయిపోతాడు.


⛰️⛰️ఒకరోజు వెంకటాద్రి యాత్ర వెళ్ళే భక్తుల్ని చూశాడు. వాళ్ళతో కలిసి వేంకటాచలానికి బయలుదేరాడు. మొదట చక్రతీర్థంలో స్నానం చేశాడు. దాంతో అతని కల్మషాలన్నీ పోతాయి. పితృదేవతలకు మట్టి పిండప్రదానం చేశాడు. వాళ్ళు ముక్తి పొందారు. వేంకటాచల మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకుని పోయాయి. ఆ విశేషాన్ని చూడడానికి దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహాత్యాన్ని కొనియాడారు. అప్పుడు బ్రహ్మదేవుడు మాధవుని చూసి "ఓ బ్రాహ్మణుడా! నువ్వు వెంకటాచలం మహిమ వల్ల పాపాలను పోగొట్టుకున్నావు. వెంటనే స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించుకో. మరుజన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు. లక్ష్మీదేవి నీ కూతురుగా పుడుతుంది. శ్రీనివాసుడు నీకు అల్లుడు అవుతాడు. అన్ని కోరికలు తీరి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటావు. ఈ పర్వతం వేంకటాద్రి అనే పేరుతొ వర్థిల్లుతుంది'' అని చెప్పు అదృశ్యమవుతాడు. సర్వపాపాలను దహించేది కాబట్టి వేంకటాద్రి అని అర్థం.


 *⛰️ శ్రీశైలం ⛰️* 


శ్రీశైలం అనే పేరు ఎలా వచ్చిందంటే ... శ్రీ అంటే లక్ష్మీదేవి నివసించే కొండ కాబట్టి దీనికి శ్రీశైలమనే పేరు కూడా వచ్చింది. ఈ కొండడు మరొక పేరు వుంది. అదే శ్రీనివాసాద్రి. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు అందులో లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి నారాయణుడిని చూసి తనను పెళ్ళాడమని కోరుకుంది. అప్పుడు నారాయణుడు తనకు ఇల్లు వాకిళ్ళు లేవు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను ... పైగా తనకు భక్తులు ఎక్కడ భక్తితో పూజిస్తారో అక్కడ తాను ఉంటానని. కాబట్టి నువ్వు నా వక్షస్థలంలో ఉండు అని లక్ష్మీదేవికి చెపుతాడు శ్రీ మహావిష్ణువు."శ్రీ'' నివసించే చోటు కాబట్టి స్వామిని శ్రీనివాసుడని. శ్రీనివాసుడు నివసించే తిరుమలకు 'శ్రీనివాసాద్రి'' అనే పేరు వచ్చింది.


 *⛰️వృషాద్రి⛰️*


దీనికి వృషాద్రి అనే మరొక పేరు ఉంది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ... వృష అనే పదానికి ధర్మమనే అర్థం. ధర్మదేవత తన అభివృద్ధి కోసం ఈ కొండ మీద తపస్సు చేయడం వల్ల దీనికి వృషాద్రి అనే పేరు వచ్చింది. అదే కాకుండా యమధర్మరాజు ఈ కొండపైన తపస్సు చేయడంవల్ల కూడా వృషాద్రి అనే పేరు వచ్చింది. ఈ ఏడు కొండలకు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ... చింతామణిగిరి, జ్ఞానాద్రి, తీర్థాద్రి, పుష్కరాద్రి, కనకాద్రి, వైకుంఠాద్రి, సింహాద్రి, వరాహగిరి, నీలగిరి, సుమేరు శిఖరాచలం.

వైశాఖ పురాణము - 17

 వైశాఖ పురాణము - 17


17వ అధ్యాయము - యముని పరాజయము


అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను. యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు. ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును. ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.


యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి. యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.


అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.


సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ

త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా

త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||

నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః

తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||


అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను.


అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు, అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు. ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపముకల, ఇతిహాసపురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.


ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్తపెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోనివారు క్షణమైన తీరికయుండని యితడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలోనున్న భూతములు, దేవతలు ఆశ్చర్యపడుచుండగా యమధర్మరాజు బ్రహ్మపాదముల పైబడి దుఃఖించుచు రక్షింపుము రక్షింపుము అని యేడ్చెను. స్వామీ! నన్ను రక్షించు నీవుండగా నేను పరాభవమునందితిని. మానవుల పుణ్యపాపముల దెలుపుపటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది. నేను నిస్సహాయముగ నిర్వ్యాపారముగ చేతులు ముడుచుకొని యుండవలసి వచ్చినది అని పలికి నిశ్చేష్టుడై యుండెను.


దీనిని జూచి సభలో గగ్గోలు బయలుదేరెను. స్థావరజంగమ ప్రాణులన్నిటిని యేడ్పించు నితడే యేడ్చుచున్నాడేమి? అయినను జనులను సంతాపపరచువాడు శుభమును పొందునా? చెడు చేసినవాడు చెడును పొందక తప్పునాయని సభలోనివారు పలు విధములుగ తమలో తాము అనుకొనిరి.


వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరచి బ్రహ్మపాదములపై వ్రాలిన యమధర్మరాజును దీర్ఘములు, దృఢములునగు తన బాహువులతో పైకి లేవదీసెను. దుఃఖించుచున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి యూరడించెను. నిన్ను పరాభవించిన వారెవరు? నీ పనినిన్ను చేసికొనకుండ అడ్డగించిన వారెవరు? ఈ పాప పట్టికను యిట్లు తుడిచిన వారెవరు వివరముగ చెప్పుము? నీవెందులకు వచ్చితివి? అందరను పరిపాలించు వారే నీకును నాకును ప్రభువు. భయములేదు చెప్పుమని వాయువు అడుగగా యమధర్మ రాజు 'అయ్యో' అని అతిదీనముగ బలికెను.


వైశాఖ పురాణం 17వ అధ్యాయం సమాప్తం.


ఓం నమో నారాయణాయ

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*25-05-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది.

---------------------------------------

మిధునం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

---------------------------------------

కర్కాటకం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------

సింహం


చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు.

---------------------------------------

కన్య


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

---------------------------------------

తుల


స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------

వృశ్చికం


ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసే లాభాలు అందుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది.

---------------------------------------

ధనస్సు


చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్యవిషయాలు అశ్రద్ధ చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు.

---------------------------------------

మకరం


చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

కుంభం


ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది.

---------------------------------------

మీనం


ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. భూ సంభందిత క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

నారదముని జయంతి* 🌸

 🌸 *నేడు వైశాఖ బహుళ విదియ - నారదముని జయంతి* 🌸



*𝕝𝕝 ॐ 𝕝𝕝 _25/05/ 2024 -దేవఋషి శ్రీ నారద ముని వారి జయన్తీ శుభాకాంక్షలు_ 𝕝𝕝 卐 𝕝𝕝*

~~~~~~~~~~~~~~~~~~~~~~~


నారదుడు దేవర్షి , సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ  తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు. నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది.


 *ముల్లోకసంచారి*


నారదుడు త్రిలోక సంచారి. మూడు లోకాల్లోను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తుంటారు. ఎంతోమంది సాత్వికులకు అయన మోక్షమార్గాన్ని చూపించాడు. ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తుంటాడు. అయితే కొంత మంది మేధావులు, రచయితలు మాత్రం ఆయన్ను *“కలహా భోజనుడు” గా “కలహా ప్రియుడు” గా* అభివర్ణించారు.

ఈ లోకం తీరే ఇంత. నిజం మాట్లాడే వాడికి ఎప్పుడు కష్టాలే. అందుకే అన్నారు *‘యదార్ధవాది లోక విరోధి’*. ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్న చూపు. వారిని లోక విరోధులుగానే చూస్తారు. అనేక కష్టాలకు గురి చేస్తారు. నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తపించే వాడు. ముల్లోకాలలోనూ సంచరిస్తూ దేవ, మానవ, దానవులకు  సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తుంటాడు. అయితే నారదుడిది ఒకటే లక్ష్యం. ధర్మం గెలవాలి.


*‘నార’* అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అని , *‘ద’* అనగా ఇచ్చే వాడని అర్ధం ఉంది. మానవజాతి నిరంతర అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి , వారిని సన్మార్గంలో నడిపించేవాడే నారదుడు. అంతే కాదు, నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు.


*జన్మ వృత్తాతం*


ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ మరీచి , అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజపతులను సృష్టించాడు. వీరిలో నారదుడు కూడా ఒకరు.


*ధర్మ రక్షణలో నారదుడి పాత్ర*


 *రామాయణ రచనలో*


రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కనిపిస్తుంది. వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో *“ఎన్ని కష్టాలు వచ్చినా , ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఋజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ?”* అంటూ ప్రశ్నించాడు వాల్మీకి. అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడు గురించి మొదట వాల్మీకికి తెలిపింది నారదుడే. వాల్మీకి మహర్షి రామకథను విని పులకించి పోయాడు. నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను శ్లోక రూపంలో రచించమని కోరాడు.


*మహర్షికి మార్గదర్శనం*


ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్ , యజుర్ , సామ , అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు. సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్ధం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు. మహాభారతాన్ని రాశాడు. మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలుగలేదు. ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ను పలకరించాడు. భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రాయమని కోరాడు. ఈ రచనతో కలియుగంలో ప్రజలకు దైవభక్తి , సత్సాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు.ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం , మహాభారతం , భాగవతాలను గ్రంధస్థం చేయడంలో , వాటి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది.


అలాగే వాల్మీకి , ధ్రువుడు , చిత్రకేతు , ప్రహ్లాదుడు  సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించినది కూడా నారద మహర్షియే.


*ధ్రువుడు*


ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు. వారిలో ఒకరు సునీత. ఆమె కుమారుడు ధ్రువుడు. రెండవ భార్య సురుచి. ఆమె కుమారుడు ఉత్తముడు. ఒకరోజు సురుచి *“నువ్వు రాజు కావడానికి అనర్హుడివి” అని ధ్రువుడిని నిందిస్తుంది. దానితో విష్ణువుని మెప్పించి రాజార్హత సంపాదిస్తానని ఐదేళ్ళ వయసు లోనే అడవి బాట పడతాడు ధ్రువుడు. ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు. “ఓం నమో భగవతే వాసుదేవాయ”* అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువుని మెప్పిస్తాడు.


 *చిత్రకేతు*


శూరసేన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది. ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు. ఆయనకు ఎన్నోఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు. అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు. లేక లేక పుట్టిన కుమారడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు. నారదుడు వచ్చి అతనిని ఎంత అనునయించినా ఫలితం లేకపోవడంతో , తన యోగ శక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని బ్రతికిస్తాడు. తిరిగి ప్రాణం పోసుకొన్న అ బాలుడు *“నేను ఎన్నో జన్మలను ఎత్తాను. ఎంతోమంది తల్లితండ్రులను చూశాను. ఒకరి చేతిలోనుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణెం లాగా మానవుడు తన కర్మాను సారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు. నేను ఈ జన్మ చక్రం నుంచి బయట పడాలను కుంటున్నాను”* అని దేహ త్యాగం చేశాడు. దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయమవుతుంది. అతని మనస్సు నిర్మలమవుతుంది. చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్షమార్గాన్ని చూపాడు నారదుడు.


*భక్త ప్రహ్లాద*


భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతం లోనూ మనకు నారదుడు దర్శనమిస్తారు. హిరణ్యకశిపుడు దేవతలకు శత్రువు. ఒకసారి అతడు మంధర పర్వతం మీద తపస్సుచేసుకుంటూ ఉండగా, ఇంద్రుడు అతని భార్యని చెరపడతాడు. వెంటనే అక్కడకు వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు. ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావని హెచ్చరిస్తాడు. హిరణ్యకశిపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. ఆమెకు ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని లీలను బోధించేవారు. వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు. నారదుడి బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు.


*సతీ సావిత్రి*


సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తారు. మద్ర రాజు ఆశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగు తుంది. నారదుడు వచ్చి సత్య వంతుడు చాలా బుద్ధిమంతుడని , అయితే ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు. అయినా అంతా శుభమే జరుగు తుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత నారదుడి ఉపదేశానుసారం సావిత్రి తన పతిభక్తితో యమధర్మ రాజు ను మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది.


 శ్రీ కృష్ణుడి కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు. ఇటు ధర్మరాజుకి రాజధర్మం , ప్రజలకోసం రాజు నిర్వహించాల్సిన కార్యాలను గురించి  కూడా నారదుడు వివరిస్తాడు. పాండవులు అరణ్య వాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు , ధర్మాలు చెప్పమని మార్కండేయ మహర్షిని వారివద్దకు పంపిస్తారు.


ఇంకా వేదాలు , ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి. ఖగోళ , సంగీత శాస్త్రాలలో సైతం ఆయన నిష్ణాతుడు. వేదాలలో చెప్పిన విషయాలను దేశ, కాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని, ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు. నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు. దానిని `నారద స్మృతి’ అంటారు.  నారదుని  *“నారద శిక్ష”* అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది. నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ్రంథాన్ని ఆయన రచించారు. ఇందులో భక్తి మార్గము , దాని విశిష్టత , దానిని అనుసరించడం ఎలా అన్న విషయాలపై 84 అధ్యాయాలలో వివరించారు. అలాగే `బృహన్నారదీయమ్’, `లఘునారదమ్’ అనే గ్రంధాలలో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు. అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి. నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది.  ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మ రక్షణ కోసం నారద మహర్షి తనదైన పాత్ర పోషించారు.


*మొదటి పాత్రికేయుడు నారదుడు*


ఇలా చెప్పుకొంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. మానవాళి శ్రేయస్సు కొసం ఎన్నో మంచిపనులు చేశారు. అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు. ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ అయన ధ్యేయం ధర్మ రక్షణే. శిష్ట రక్షణ , దుష్ట శిక్షణే. అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు. చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలున్నాయి. కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైన ఉపెక్షించే వాడు కాదు నారదుడు. తప్పు చేసినవాడు ఎంతటి వాడైన అతనికి శిక్ష పడేటట్లు చేయటమే నారదుని లక్ష్యం. మానవాళి శ్రేయస్సు కోసం , ధర్మ రక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. అందుకే నారదుడు మహర్షి అయ్యాడు. మహర్షి అంటే ఋషులకే ఋషి. ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడేవారిని ఋషులనే అంటారు.


నేటి సమాజంలో ఒక పాత్రికేయుని జీవితం కూడా ప్రజల తరఫున పోరాడటమే. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయుని జీవితం సాగుతుంది. ఈ మార్గంలో పత్రికేయులందరికి మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం. అందుకే నారదుడిని మొదటి పాత్రికేయుడు అంటాం.


*నారద జయంతి –  ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం*


వైశాఖ బహుళ విదియ మహర్షి నారదుని జన్మ తిధి. మొదటి ఆదర్శ పాత్రికేయుడయిన నారదుని జయంతిని ప్రపంచం యావత్తు పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయంచేకూర్చే కొంతమంది పాత్రికేయులకుసన్మాన సత్కారాలు జరుగుతాయి. ఆ రోజున మహర్షి నారదుని స్మరించు కొని నిజమైన పాత్రికేయ వృత్తిని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టలెక్కడి నుండి వస్తాయి ? ధర్మ మార్గంలో  నడిచే సమ సమాజం వెల్లివిరిస్తుంది....

గురుచరణ కమలములనే

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *సౌవర్ణేనవరత్నఖండ రచితేపాత్రేఘృతం పాయసం*

*భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్* |

*శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం*

*తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా పభ్రో స్వీకురు*  ౨

                  [ *శివ మానస పూజ* ]


ఓ పభ్రూ! తొమ్మిదివిలువైన రత్నాలు పొదిగిన బంగారు పాతల్రో తయారుచేసిన పాయసం, ఐదు రకాల తీపిపదార్థాలు, పెరుగు,

అరటిపండుతో చేసిన రసంతో చేసిన భోజనాన్ని దయచేసి

స్వీకరించండి. నేను కర్పూరంతో సువాసనతో కూడిన అనేక మూలికలతో చేసిన స్వచ్ఛమైన నీటిని మరియు చివరగా

తమలపాకులను కూడా అందిస్తున్నాను. నా హృదయంలో భక్తితో చేసే

ఈ నైవేద్యాన్ని స్వీకరించండి.



   👇 //------ ( *మోహముద్గరం* )-----// 👇


*గురుచరణా౦బుజ నిర్భర భక్తః*

*సంసారాదచిరార్భవ ముక్తః*

*సేంద్రియమానస నియమాదేవం*

*ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం* ॥31॥


భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ *చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక*!

వెధవ బండి*

 *వెధవ బండి*

(వ్యాకరణము నందు(తెలుగు)మక్కువ గల వారికి విందు భోజనం)

🌺🌺🌺🌺🌺🌺🌺 🌺 🌺 


   ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.


 బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందువలన, వేరే బండివాడిని తీసుకు రాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండిని తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.


 పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా లేదు. నల్లేరు మీద బండి నడకలా కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది. 

కుదుపులు ఎక్కువగా ఉండడం వలన పోరుగూరి నుంచి వచ్చిన పండితుడు *'అబ్బబ్బ వెధవ బండి'* అన్నాడు.


దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).


దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "అది యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.


******  ******  ******  ******


ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.

 ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,

పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.


రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.


అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.


దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.


పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.


ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.


అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడవైన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.


ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.


మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసము ద్వారా

😊తెలియజేస్తున్నాను.


చదివినందుకు ధన్యవాదాలు😊🙏🏻🙏🏻🙏🏻

పంచాంగం 25.05.2024 Saturday.

 ఈ రోజు పంచాంగం 25.05.2024  Saturday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాస కృష్ణ    పక్ష:  ద్వితీయ తిధి స్థిర వాసర: జ్యేష్ఠ నక్షత్రం సిద్ధ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


విదియ సాయంత్రం 06:54 వరకు.

జ్యేష్ఠ పగలు 10:33 వరకు.

సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:41


వర్జ్యం : ఈ రోజు లేదు 


దుర్ముహూర్తం : ఉదయం 05:45 నుండి 07:28 వరకు.


అమృతఘడియలు : రా.తె  04:08 నుండి 05:45 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

రహస్య గ్రంథాలు

 ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు -  వాటి గురించి విశేషాలు .


     మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను . 


 *  బృహద్యంత్ర సర్వస్వము  - 


         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు 


                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.


                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.  


          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.


 *  ఆగతత్వలహరీ  - 


         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .


 *  అవతత్వ ప్రకరణం  - 


          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు . 


 *  అండ కౌస్తభం  - 


           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర 

జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.


 *  అంశు బోధిని - 


           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.


 *  ఆకాశ తంత్రం  - 


            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.


 *  ఋక్ హృదయ తంత్రం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.


 *   ఔషధీ కల్పం  - 


            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.


 *  కరక ప్రకరణము  - 


             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.


 *   కర్మాబ్దిసారము  - 


             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.


 *   కౌముదీ  - 


               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.


 *   ఖేట సర్వస్వము  - 


              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.


 *  ధాతు సర్వస్వము  - 


             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి

లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు . 


 *  ధూమ ప్రకరణం  - 


           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.


 *  నామార్థ కల్పం  - 


           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.


 *  ప్రపంచ లహరీ  - 


             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.


 *  బ్రహ్మాండ సారం  - 


               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.


 *  మేఘోత్పత్తి ప్రకరణం  - 


              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.


 *  లోక సంగ్రహము  - 


              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.


 *  లోహ తంత్రము  - 


              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.


 *  వాయుతత్వ ప్రకరణము  - 


              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు. 


 *  వైశ్వనర తంత్రము - 


              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.


 *  శక్తి తంత్రము  - 


            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా . 


 *  శుద్ద విద్యాకల్పం  - 


         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.


 *  సమరాంగణ సూత్రధారము  - 


         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.


           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి. 


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034