6, నవంబర్ 2020, శుక్రవారం

సమయం -లెక్కలు

 సమయం -లెక్కలు


🍁🍁🍁🍁


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


🍁🍁🍁

గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము -

 గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము - 



       క్యారెట్ మెత్తగా దంచి రసము తీసి , 50 రసము నందు 20 గ్రాముల పటికబెల్లం చూర్ణము కలిపి పూటకు ఒక మోతాదు చొప్పున ఉదయము మరియు సాయంత్రం రెండు పూటలా తాగుచున్న గుండె దడ , నీరసం , నిస్సత్తువ హరించును . 


       పైన చెప్పిన సులభ యోగము వలే మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 


  

   గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

గురువు స్థానం... గ్రేట్!

 *గురువు స్థానం... గ్రేట్!

               

 ఒకప్పుడు హెడ్ మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది...


ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ.


ఒక రోజు ఆయనకి రాజుగారినుండి ఒక ఉత్తరం వచ్చింది.


తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం....


హెడ్ మాస్టర్ తిరుగు టపాలో రాజు గారిని రావద్దని జవాబు రాశారు.


సర్వంసహా రాజ్యాధికారి, తన రాజ్యంలోని   పాఠశాలని చూడాలని కోరుతూ ఉత్తరం రాస్తే (పైగా అది ప్రభుత్వ పాఠశాల) *రావద్దనేంత దమ్ముందా ? హెడ్మాస్టారుకి ?


ఆ దమ్ము ఉన్నవాడు కాబట్టే అలా రాసాడు. కారణం కూడా చెప్పాడు...


 ”మా ప్రభువు అయిన మీరు, వస్తే గౌరవ సూచకంగా నా తలపై ఉన్న టోపీని తీయాలి. ఇప్పటివరకు నా దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు నాకన్నా అధికుడు లేడని భావిస్తున్నారు. నాకన్నా పై అధికారి ఒకడు ఉన్నాడని, ఆయన వద్ద నేను ఒదిగి ఒదిగి ఉంటానని గుర్తించిన క్షణం, వారికి నాపై గౌరవ భావం తగ్గుతుంది... క్రమశిక్షణలో మార్పు వస్తుంది. దాని ఫలితం విద్యాభ్యాసం పై పడుతుంది., ఇది మీరు అర్ధం చేసుకోగలరని ప్రార్ధిస్తున్నాను. ఒకవేళ మీ రాక తప్పనిసరి అయితే నేను రాజీనామా చేయవలసి ఉంటుంది.”


హెడ్మాస్టరుగారి ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకొని, ఆయన “తన సమక్షంలో రాచరిక మర్యాదలు పాటించనక్కరలేదని, తానే టోపీ తీసి హెడ్మాస్టారుని గౌరవిస్తానని” జవాబిచ్చాడు రాజు. 


అలాగే చేసాడు కూడా... గ్రేట్... కింగ్!


శ్రీ తెన్నేటి కోదండరామయ్య గారి *'మా బడి' పుస్తకంలో  శ్రీ రవికృష్ణ గారు రాసిన మనవి మాటలు' నుండి సేకరణ.


 ఎక్కడైతే... గురువులు పూజింపబడతారో... అక్కడ   ఉన్నత విద్యా ప్రమాణాలు పరిఢవిల్లి - దేశం సుభిక్షంగా ఉంటుంది!

                       

                 గురు బ్రహ్మ, 

                 గురుర్విష్ణుః, 

          గురుర్దేవో మహేశ్వరహః

         గురు సాక్షాత్ పరబ్రహ్మ!

           తస్మై శ్రీగురవే నమః

భగవంతుడు

 


ఎంతో హృద్యంగా పాడిన ఈ భజన్ వినండి


      మనసు పారవశ్యంలో తేలి పోతుంది.


            ఎవరన్నారు భగవంతుడు


రాలేదని


             మనం మీరాలా పిలవడంలేదు.


     ఎవరన్నారు భగవంతుడు తినడని


     మనం శబరిలా తినిపించడం లేదు


           ఎవరన్నారు భగవంతుడు నర్తించడని


        మనం గోపికలలా నర్తింప చేయడంలేదు  


                  ఇలా సాగుతుంది.......

నరకానికి వెళ్లకుండా ఉండాలంటే....

 *నరకానికి వెళ్లకుండా ఉండాలంటే....*


శాస్త్రాల ప్రకారం మానవుని సగటు ఆయుఃప్రమాణం వందేళ్లు. 


అయితే ప్రస్తుత యాంత్రిక యుగంలో మారిన జీవనశైలి ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 


దీనికి మన స్వయంకృత అపరాధమే కారణం. 


మారుతున్న జీవనశైలితో నేరుగా నరకానికి చేరుకుంటున్నారు. 


అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని మహాభారతం లో విదురుడు పేర్కొన్నాడు....


ఈ క్రింది లక్షణాలుంటే నేరుగా నరకానికి పోతారు


తను తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్లు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు.


అతిగా మాట్లాడేవాళ్లు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది.


తన కోపమే తన శత్రువు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు నేరుగా నరకానికే పోతారట.


ఇతరులకు సేవ చేయనివారు, సహాయపడనివారు కూడా నేరుగా నరకానికి పోతారట. ఎదుటివాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట.


ధర్మ శాస్త్రం ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరక ద్వారాలు బార్లా తెరచి ఉంటాయట. ముఖ్యంగా స్నేహితులతో నిజాయితీగా ఉండాలి.


మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది.


పై లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారు.


జీవితంలో మార్పు కోరుకుంటే 

డబ్బు శాశ్వతం కాదని గుర్తించండి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలనే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు.


ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోడానికి ప్రయత్నించండి. నేర్చుకునే వాటితో తృప్తి చెందకండి. ఒక నిర్దిష్ట ప్రదేశంలో సౌకర్యంగా ఉంటే, అక్కడ నుంచి మీరు నిష్క్రమించడానికి సంకేతమని తెలుసుకోండి. జీవితంలో మార్పు సహజం.


జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు.


మీకు మీరు నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోండి. ఇతరులకు చెప్పేముందు ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. ఆత్మ ప్రబోధానికి మించింది లేదు.

సాధన ఆరాధన









 

Ar


 

💫 మనో గమనము

 _*💫 మనో గమనము 🌛*_


_*వ్యవహారికంలో సర్వమూ మనస్సే. మనసు అనేది తడిసిన వస్త్రం లాంటిది. దానికి ఎరుపురంగు అద్దితే ఎరుపుగాను, నీలం రంగు అద్దితే నీలం గాను మారుతుంది. ఏ రంగు అద్దితే ఆ రంగు సంతరించు కుంటుంది. జ్ఞానము, అజ్ఞానము మనస్సు లోనిదే !*_  

            

_*ఫలానా వ్యక్తి మంచివాడు కాదు అన్నావంటే అతని మనసుకు నీచత్వం అనే రంగు వేయబడినది అని అర్థము.*_  


_*ఫలానా వ్యక్తి మంచివాడు అని అన్నాము అంటే అతని మనస్సుకు మంచితనం అనే రంగు వేయబడింది అని అర్థము.*_


_*అందుకే మంచి మనసు ఉన్న మనుషులతో సత్సంగం చేస్తే మంచి మనుషులుగా మారుతారు. అందుకే అంటారు పెద్దలు ఈ విధంగా...*_


             _*సత్సంగత్వే నిస్సంగత్వం !*_  

          

           _*నిస్సంగత్వే నిర్మోహత్వం !*_

     

              _*నిర్మోహత్వే నిశ్చలతత్వం !*_

           

           _*నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః !!*_


_*మనస్సు పాల వంటిది ఈ మనసును సంసారమనే నీటిలో కలిపితే పాలు నీరు కలిసిపోతాయి. అంటే మనసు సంసారంతో ఐక్యమైపోతుంది. ప్రపంచమనెడి సంసారంలో లీనమై పోతుంది.*_


_*అందుచేత పాలను ఒక పక్కన ఉంచి పెరుగు తోడుకున్నాక చిలికి వెన్న తీయాలి. ఏకాంతవాసంలో సాధనలు చేసి మనసు అనే పాల నుంచి జ్ఞానం, భక్తి అనే వెన్నను తీసినప్పుడు ఆ వెన్నను సంసారమనే నీటిలో ఉంచిన ఎప్పటికీ కలిసిపోదు. సంసార జలధిపై నిర్లిప్తంగా తేలుతుంది.*_


_*జీవన్ముక్తులు ఇదేవిధంగా ప్రపంచములో ఉన్నా "తామరాకు మీద నీటి బిందువు" లాగ వారికి ఏమీ అంటకుండా బ్రహ్మములో రమిస్తూ ఉంటారు.*_


_*అందుచేత మనస్సును గమనిస్తూ మనో లయము చేసి ఋషులు చెప్పిన మార్గంలో పయనించి బ్రహ్మమును పొందుదాము.*_


🙏🇮🇳😷🌞🌏🤺🥀🚩

శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వారి చరిత్ర🕉️*

 *🕉️మద్దిమడుగు శ్రీ  పబ్బతి ఆంజనేయ స్వామి వారి చరిత్ర🕉️*


*నల్లమల కీర్తికిరీటంగా వెలుగొందుతున్న అమ్రాబాద్ మండలం మద్దిమడుగు గ్రామంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో పిలిస్తే పలికే దైవంగా మద్దిమడుగు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు . నల్లమల కొండల్లో కృష్ణానది ఉత్తర వాహినిగా ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది . ఈ నదికి పడమర నుంచి దుందుభి నది కలిసేచోట దుందుభేశ్వరం అనే పురాణ క్షేత్రం వెలసింది . ఈ క్షేత్రానికి పడమరన 12 కిలోమీటర్ల దూరములో మద్దిమడుగు అనే రేవు పట్టణం క్రీస్తుశకం మూడో శతాబ్ది కాలంలో ఒక పెద్ద కోటను నిర్మించారు . కోట నాలుగు మూలల యందు నాలుగు బురుజులు , దక్షిణాన ఒక బురుజు , నైరుతిన ఎత్తైన ప్రాకారం , పైన రాజు ఉండే నివాసం నిర్మాణమై ఉంది . ఇది వాస్తు నిర్మాణంలో ఉంది . కోటలో స్వామి వారు ఈశాన్య ప్రాంతంలో వెలసి పుట్ట నుంచి బయటకు వచ్చినట్లు ఉ న్నాడు . చుట్టూ నాలుగు అడుగులు , ఒక గజం ఎత్తు కలిగిన ప్రాకారపు గోడలు చిన్న ఆలయంంలో వెలసి మద్దిమడుగు క్షేత్రపాలకునిగా ఉన్నాడు . స్వామి తన మహిమలతో భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు . కాలగర్భంలో అనేక ఏళ్ళు గడిచిన తదుపరి మద్దిమడుగు రేవుపట్టణంగా రూపొందింది . రాజుల కాలంలో వర్తక వ్యాపారాలు కొనసాగాయి . అనేక మార్పులు చెంది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది . రాజుల రాజ్యాలు పతనమైపోయినా నాటి అవశేశాలు నేటికి మద్దిమడుగు పడమర భాగాన నాలుగు కిలోమీటర్ల పొడవున పాతరాతి కట్టడాలు కనిపిస్తున్నాయి . స్వామివారి మూల విరాట్టు విగ్రహం మూడవ శతాబ్ది కాలం నాటిదని చారిత్రక పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు . నల్లమల అడవి ప్రాంతంలో ఉండే చెంచులు పండ్లు , పాలు , తేనె నైవేద్యంగా సమర్పించుకొని అనునిత్యం స్వామిని ఆరాధించేవారు . నల్లమల అడవుల్లో వుండే పశువుల కాపరులు స్వామిని ఆరాధించడం ప్రారంభిచారు . పశు వుల కాపరులు స్వామిని ఆవు పాలతో అభిషేకించి రొట్టెలు , బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టి భక్తి ప్రపత్తులతో ఆరాధించేవారు .*


        *నేడు కూడ భక్తులు తేనె ,   ఆవుపాలు , పొంగళితో నైవేద్యం , గోధుమ రొట్టెలు , బెల్లం కలిపి సమర్పించు కుంటున్నారు . స్వామివారి గర్భాలయం ఎదురుగా రాజులకాలం నాటి నుంచి అగ్నిహోమం నిరంతరం వెలుగుతుంది . కోట ఈశాన్యం బురుజుకు కోటమైసమ్మ అనే దేవత వెలసి ఉన్నది . ఆమెను భక్తులు ప్రతి ఆదివారం దర్శించి పూజలు చేస్తారు . శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామివారి మాలధారణ 1992 కార్తీక మాసంలో శ్రీ కె . జయరాం , గురుస్వామి ఆధ్వర్యంలో 15 మందితో మొదటిసారిగా ప్రారంభమైంది . ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఎదిగింది . స్వామి వారి సంకల్పం మేరకు శ్రీ కె . జయరాం గురుస్వామి మరియు వారి శిష్యులు గురుస్వాములైన వారు పల్లె నుండి పట్టణం దాకా మద్దిమడుగు అంజన్న మాలల మహత్మ్యం సాక్ష్యాధారలతో ఋజువు పరిచారు . మహబూబ్ నగర్ , నల్లగొండ , రంగారెడ్డి , గుంటూరు , ప్రకాశం , కర్నూలు , హైదరాబాదు జిల్లాల నుండి వేలాది మంది స్వాములు మాల ధరించి మద్దిమడుగు వస్తున్నారు .*


           *1998 లో శ్రీ జయరాం గురుస్వామి ఆదేశం మేరకు డి . నరసింహులు , తెల పండితుల దర్శకత్వంలో దీక్షా స్వాములే స్వయంగా పాడిన " మద్దిమడుగు ఆంజనేయ స్వామి భక్తి గీతాలు " పాటల క్యాసెట్ ప్రప్రథమంగా తెలుగు మరియు లంబాడా భాషలలో కమల్ ఆడియో ద్వారా నిర్మించబడి ప్రస్తుతం సూర్యపేట సత్యం క్యాసెట్ సెంటర్ లాంటివారు ఎన్నెన్నో ఆడియో , వీడియో క్యాసెట్లు విడుదలచేసి స్వామి వైభవాన్ని దశదిశల చాటుతున్నారు .*


          *శ్రీ ఆంజనేయ ఆవేశితుడైన శ్రీ జయరాం గురుస్వామి నేతృత్వంలో సుమారు 15సం || ల నుండి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి మాలాధారణ వైశాఖ బహుళ దశిమి హనుమాన్ జయంతి సందర్భంగా ఏదుల ఏర్రగట్టు వీరాంజనేయ స్వామి మాలాధారణ కార్యక్రమాలు కూడ అత్యంత వైభవోపేతంగా జరుగుచున్నవి . మద్ది మడుగు మాలాధారణయే వీటికి ప్రేరణగా చెప్పవచ్చును .*


               *గత ముప్పై సంవత్సరాల నుండి ఆంజనేయ స్వామి సేవలో తరించి , ఎందరికో తరుణోపాయం చెప్పి గురుస్వాములకే గురుస్వామియైన శ్రీ జయరాం గురుస్వామి గారు హైదరాబాదుకు సమీపాన లక్ష్మీనగర్ కాలనీలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయము మరియు హనుమాన్ దీక్ష గురు పీఠము స్థాపించారు . ప్రతి శనివారం అచ్చంపేట స్వగృహం నందు , ప్రతి మంగళవారము హైదరాబాదు పీఠము నందు భక్తులకు , సందర్శకులకు అందుబాటులో ఉంటున్నారు . మిగతా రోజులలో దేశాటనము చేస్తూ హనుమాన్ భక్తి మహాత్మ్యాలను తెలియజేస్తున్నారు . మద్దిమడుగు ఆంజనేయ స్వామి తన సేవకై జయరాం స్వామిని పూర్తికాలం వినియోగించుకోవడం విశేషం . శ్రీ ఆంజనేయస్వామి సేవా సమితి , రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రాధ్యక్షులుగా స్వామి వారి శిష్యులు పేస్ బుక్ హనుమాన్ దీక్ష గురు పీఠం హనుమాన్ శక్తి య్యూటుబ్ చానల్ తో సేవలందించటం మరీ విశేషం !*


           *1993-94 సం || లో దేవాదాయ ధర్మాయ శాఖ ఈ ఆలయాన్ని గుర్తించి తన ఆధీనంలో చేర్చుకుంది . రూ || 13 లక్షలు వెచ్చించి స్వామి వారి గర్భాలయం , ముఖ మండపం , శివాలయం , శిఖరాల నిర్మాణం చేశారు . ప్రతి శుక్ర , శని , ఆది , మంగళ వారాలలో భక్తులు వేల సంఖ్యలో దర్శించుకొని ముక్తి పొందుతున్నారు .*

సార్ధకత

 సార్ధకత



మనం ధారతో కలిసి ప్రవహిస్తుంటే మనకి ఎలాంటి బాధ ఉండదు. కానీ మనం ఎదురీదే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం లో అహంకారం నిర్మితమౌతుంది. కానీ కాల ప్రవాహానికి ఎదురు వెళ్లలేము. ఆ ప్రవాహం వెనుక ఏమీ ఉండదు. అది విలీనమైపోతూ ఉంటుంది. అందుకని జీవితం ఏది తీసుకువచ్చినా దాన్ని పరమానందంతో స్వీకరించాలి. వాటియందు కొంచెం కూడా స్వీకరించక పోవడం అనే భావన ఉండకూడదు. జీవితానికి సబంధించిన ఫిర్యాదులు లేని వాడే ధార్మికుడు.


మనం ఒక ఎండిన ఆకులా ఉండాలి. ఎండిన ఆకుకి తన ఇష్టం అనేది ఏదీ ప్రత్యేకంగా ఉండదు. ఎలాంటి ఆకాంక్ష ఉండదు. తాను ఎక్కడకు వెడుతున్నాను అనేది తెలియదు. ఎక్కడకు వెళ్ళాలో అనేది కూడా తెలియదు. గాలి ఎక్కడికి తీసుకువెడుతుందో అక్కడకు వెడుతుంది.


 ఎండుటాకు తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. మన వాసనలే మన అస్థిత్వము. జనన మరణాలు మన చేతుల్లో లేవు అనే విషయం గ్రహించిన నాడు, నీవు నిమిత్తమాత్రుడుగా వుండగలవు.


ఎవరు జీవితం యొక్క సార్ధకతని తెలుసుకుని, జీవన ఆనందాన్ని పొందుతారో, వారు మృత్యువు వలన వేదనకు గురైన దాఖలాలు లేవు.


 అయ్యో! ఈ జీవితం వ్యర్థం అయిపోయిందే అనే బాధ మరణించేటప్పుడు కలుగుతుంది. ఆ బాధ మృత్యువుకి సంబంధించినది కాదు, జీవితానికి సంబంధించినది.