16, సెప్టెంబర్ 2023, శనివారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 40*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 40*


శ్రీరామకృష్ణుల మనోఫలకంపై నరేంద్రుని భవిష్యత్తు దేదీప్య మానమైన చిత్తరువులా ద్యోతకమయింది. సమావేశానంతరం ఆయన ఇలా అన్నారు: "ఏ శక్తితో కేశవ్ లోకప్రసిద్ధుడై ప్రశంసలందుకొంటున్నాడో అలాంటి పద్దెనిమిది శక్తులు నరేంద్రునిలో పరిపూర్ణ స్థితిలో నెలకొని ఉండడం చూశాను! కేశవ్ లోనూ, విజయ్ లోనూ జ్ఞానప్రకాశం ఒక దీపంలా మాత్రమే ప్రకాశిస్తూన్నది. కాని నరేంద్రుణ్ణి చూస్తే, అతడి హృదయంలో జ్ఞానభాస్కరుడే ఉదయించి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశం, మాయను ఆసాంతం తుడిచివేసింది.”


మరొకసారి ఇలా అన్నారు.... 


“నరేంద్రుడు అత్యున్నత స్థితికి చెందినవాడు. మగతనం గలవాడు. ఎందరో భక్తులు ఇక్కడకు వస్తూవుంటారు. కాని మచ్చుకు ఒక్కరు కూడా అతడి మాదిరి లేరు. ఇక్కడకు వస్తూవున్న భక్తుల గురించి అప్పుడప్పుడు నేను యోచించడం కద్దు. వారిలో కొందరు దశదళ పద్మాలు, కొందరు శతదళ పద్మాలు, కాని నరేంద్రుడో సహస్రదళ పద్మం, తక్కిన భక్తులు కుండలు, కడవలు; నరేంద్రుడు పెద్ద గంగాళం. తక్కిన వారు చిన్న నీటి గుంటలు; నరేంద్రుడు హాల్దార్పుకూర్ లాంటి పెద్ద చెరువు. తక్కినవారు చిన్న చిన్న చేపలు; నరేంద్రుడు ఎర్రటి కళ్లుగల పెద్ద బాడిస చేప.”


శ్రీరామకృష్ణులు ముఖతా ఇలాంటి ప్రశంసలు వింటే ఆంతరిక ప్రకాశం కొరవడిన దుర్బలుడు, అహంకారంతో కన్నూమిన్నూ తెలియకుండా గంతులు వేస్తాడు. నరేంద్రుని విషయంలో ఈ మాటలు పూర్తిగా మరో విధమైన ప్రభావాన్ని చూపాయి. అసాధారణమైన అంతర్ముఖ స్థితిలో ఉండే అతడి మనస్సు లోలోతులకు పోయి కేశవ్, విజయ్ ఎనలేని సుగుణాలతో తన అప్పటి స్థితిని పోల్చి చూసింది. అంతటి ప్రశంసలకు తాను తగననుకొన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వాక్కులను నిరసించాడు: 


“ఏమంటున్నారు? ఇది వింటే లోకులు మిమ్మల్ని పిచ్చివాడంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేశవ్ సేన్ ఎక్కడ? మహాత్ముడైన విజయ్ గోస్వామి ఎక్కడ? ఏమీలేని పాఠశాల విద్యార్థినయిన నే నెక్కడ? వారితో నన్ను పోల్చకండి, దయచేసి ఇలా మాట్లాడకండి" అన్నాడతడు. కాని నరేంద్రుని నిరసనను శ్రీరామకృష్ణులు పట్టించుకోలేదు. అది ఆయనకు సంతోషాన్నే కలిగించింది. ఆప్యాయంగా ఆయన ఇలా అన్నారు:


 “నాయనా! నేనేం చేయగలను? ఈ మాటలు నేను పలుకుతున్నానని అనుకొంటున్నావా నువ్వు? జగజ్జనని నాకు. దర్శింపజేసింది. నేను చెప్పాను. ఆమె సత్యం తప్ప మరేదీ దర్శింపజేయదు. అందువల్లనే అలా మాట్లాడాను.”🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 23* 🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 23*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


       *త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా*

       *శరీరార్ధం శంభో రపరమపి శంకే హృతమభూత్ |*

       *యదేత త్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం*

       *కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడాల మకుటమ్ ||*


అమ్మా 

త్వయా హృత్వా వామం వపు: = శివుడిలో వామార్థ  భాగం నీవు తీసుకొని కూడా


అపరితృప్తేన మనసా = నీ మనస్సు తృప్తి చెందటం లేదు.


శరీరార్ధం శంభో రపరమపి శంకే హృతమభూత్ = శంకరుని అర్ధభాగం కూడా నీవు ఆక్రమించుకున్నావు.


యదేత త్త్వద్రూపం సకలమరుణాభం = అలా ఆక్రమించుకొని పూర్తిగా అరుణ వర్ణంలో ప్రకాశిస్తున్నావు.

పోనీ మొత్తం నీవే ఉన్నావా అంటే మళ్ళీ త్రినయనాలతో వున్నావు. పైగా చంద్రవంక మకుటంపై ధరించి వున్నావు.*శశి చూడాల మకుటమ్*


అలాగని పూర్తిగా శివుడని అనుకుందామా కుదరటం లేదు. ఎందుకంటే, కుచాభ్యామానమ్రం = ఎత్తైన వక్షస్థలం తోనూ 


అరుణాభం = యెర్రని రంగుతోనూ ప్రకాశిస్తున్నావు.


ఇక్కడ శంకరులు శివ శక్త్యేక్య స్వరూపాన్ని చమత్కారంగా వర్ణించారు. 


కంచి కామాక్షి ఆలయంలో కూర్చున్న అమ్మవారు తపః కామాక్షి అనబడుతారు. అయితే అంత పెద్ద ఆలయ సముదాయంలో ఎక్కడా శివలింగం కనబడదు. అంటే, అమ్మవారిలోనే అయ్యవారు కూడా ఉన్నారనే భావనతో దర్శించాలి మనం.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*బాల గోపాలుని మురళీగానం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

       🌷 *శు భో ద యం 🌷* 


  *బాల గోపాలుని మురళీగానం* 

         ----------------------------------

             *ప్రకృతి పరవశం!* 


ఉ: కానల నుండుచున్ సరస గాన వివేక విహీన జాతలై

వీనుల నేఁడు కృష్ణముఖ వేణు రవామృత ధారసోకినన్

మేనులు మేఁతలున్ మఱచి మెత్తని చూడ్కి మృగీ మృగావళుల్

మానిని ! చూడవమ్మ! బహుమానము చేసె, కృతార్ధ చిత్తలై ;


భాగ 8స్కం థం 785 ప:


బాలగోపాలుడు వేణువునూదుతుంటే ఆనాద మాధుర్యానికి ప్రకృతి యెంత పులకించి పోయిందో కిన్నర మిధునం దర్శిస్తూ  దానిని వర్ణిస్తున్నారు.

అసలు సంగీతమంటే యేమోతెలియని మృగాలు (అడవిలోజంతువులు) చేష్ఠలుడిగి తన్మయంగా చిత్రీకృత దృశ్యాలవలె నిలబడి పరవశంతో వింటున్నాయట!


మరోచిత్రం!


ఉ: తల్లుల చన్నుఁ బ్రాలు మును ద్రావు తరిన్ ,దమ కర్ణవీధులన్ 

వల్లభమైన మాధవుని వంశ రవామృత ధార చొచ్చినన్ 

ద్రుళ్ళక పాలురాఁ దివక దూఁటక మానక, కృష్ణుమీఁద దృ

గ్వల్లులు చేర్చి , నిల్చె నదె వత్సము లంగనలార!గంటిరే?


దూడలు తల్లి పొదుగు లోముట్టె దూర్చి పాలుతాగ బోతున్నాయి. ఇంతలో నల్లనయ్య మురళీరవం చెవిని సోకింది. అంతే అవి పాలుచేపేందుకు చేసేప్రయత్నం మాని యిటునటు త్రుళ్ళక మొగమును కృష్ణుని వయిపు తిప్పి వేణు రవాన్ని వింటానికి ఉత్సాహం చూపుతున్నాయట! యెంత ప్రకృతి విరుధ్ధం!


మరోవిచిత్రం!


మ: మమతన్ మోములు మీఁది కెత్తుకొని రోమంథంబు సాలించి హృ

త్కమలాగ్రంబున కృష్ణునిల్పి మురళీ గానామృత శ్రేణి క

ర్ణములన్ గ్రోలుచు మేఁత మాని గళితానందా శ్రులై చిత్రితో

పమ లై గోవులు చూచు చున్న వదిగో పద్మాక్షి ! వీక్షించి తే?


ఎంతో ప్రేమతో మోరలు పైకిలేపి హృదయకమలంలో కృష్ణుని దివ్యమంగళ విగ్రహం నెలకొలిపి మురళీగానామృతమును చెవులతో పానం చేస్తూ మేతమాని ఆనందాశ్రువులు కన్నులనుండి జాలువారగా చిత్రితోపమంగా నిలచి పోయి కృష్ణుని చూచు చున్నాయట!


మరో విచిత్రం!


మ: జగతీ జంబుల శాఖ లెక్కి మురళీ శబ్దామృత స్యందముల్ 

మిగుల్ వీనులఁ ద్రావి , వ్రేగుపడు నెమ్మిం గృష్ణరూపంబు చి

త్తగమై యుండగ నడ్డబెట్టు క్రియ నేత్రంబుల్ దగన్ మూసి యీ

ఖగముల్ సొక్కెడిఁ జూచితే మునిజనాకారంబులన్ గామినీ!!


పక్షులుగూడా పరవశములై తమలోనున్న కృష్ణుని రూపం బయటకు రాకుండా తలుపులు మూసినాయా?అనే రీతిగా కన్నులు మూసి మునులవలె మురళీగానాన్ని ఆశ్వాదిస్తున్నాయట!


నదులు సరోవరాలు తమ తరంగ హస్తాలతో పద్మములను దెచ్చి కృష్ణునకు పాదార్ఛనలు గావించేరీతిగా ఉన్నాయట! ఇదీ మురళీ గాన ప్రభావంతో అక్కడి చరాచర ప్రకృతి పరవశం!


" శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణీ! "- అన్నారు విజ్ఙులు!


కృష్ణుని మురళీ గానంలో నాదం ఉన్నది. అది సామ వేదం .విశ్వ ప్రేమవాదం .అదే కారణం ప్రకృతి మురిసిపోయి

మూగనోము పట్టటానికి. ఆఅదృష్టం అలనాడు నంద గోకులానికి దక్కింది. మన హృదయాలు కూడా పరిశుధ్ధమై ప్రేమ పూరితములై త్యాగ మయములై "ఆనందంతో నిండిన గోకులంగా (గోశబ్దానికి యింద్రియాలు అనే అర్ధంకూడా ఉంది)మారినప్పుడు ఆమురళీ గానం మనకు గూడా వినిపిస్తుందేమో? ప్రయత్నిద్దాం!


*సేకరణ:-  శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్* 

💐🌷💐💐💐🌷🌷🌷💐💐💐

మనస్ఫూర్తిగా

 మనస్ఫూర్తిగా నమ్మాడు.* అపార నమ్మకం ,సమర్పణ


ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో  భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు.


భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల 

వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. 


భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము  అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు.


బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ  లేదు ‘ అని అన్నారు. 

దొంగ: మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ  పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు.


బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు  రోజూ  ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు.  ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు


దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో 

పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.


బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు.


ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు  వచ్చింది..


తరువాత చూస్తే, దొంగ భుజం  మీద నగలు నిండి ఉన్న ఒక మూట  ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు.


ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన  చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి  వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని  అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని  బాధపడ్డాడు.


అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘ *నీవు భాగవత* *పురాణమును  కేవలము* *ఒక కథగా* *చదివావు* , *కాని , దొంగ,* *నువ్వు చెప్పిన* *కథని, మాటలని* *మనస్ఫూర్తిగా నమ్మాడు.* అపార నమ్మకం ,సమర్పణ

 శరణాగతి ఉన్న చోటే  నేను ఉంటాను.”


నీతి:


పురాణాలను  చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి. 


మనము కూడా మన చిత్తములని ఆ చిత్త చోరునికి సమర్పిద్దాము.


🌼🌿 *బాలం ముకుందం మనసా స్మరామి🌼🌿

15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

Pandem


 

Front and back view


 

Chintamani


 

Ant colony


 

Ice


 

Dterl work shop