21, ఏప్రిల్ 2024, ఆదివారం

Joke


















 

మూలకారణం

 ॐ దీనికి మూలకారణం 

     రామానుజులవారి అష్టోత్తర నామావళిలో 65వ నామం 

   "అద్వైతమత విచ్ఛేత్రే" అని ఉన్నప్పుడు, 

    భగవద్రామానుజులు నిజంగా ఆ పని చేశారా?  

    లేక తరువాత వచ్చిన ఈ జీయర్ స్వామివంటివారు రామానుజలకు ఆపాదిస్తూ, అద్వైతాన్ని ద్వేషిస్తున్నారా? ? 

   ఆ నామం వలన, సర్వమత సహజీవనం ఎలా కుదురుతుంది?


 రామానుజాష్టోత్తర శతనామావళిః ॥


ఓం రామానుజాయ నమః । 

పుష్కరాక్షాయ । 

యతీన్ద్రాయ । 

కరుణాకరాయ ।

కాన్తిమత్యాత్మజాయ । 

శ్రీమతే । 

లీలామానుషవిగ్రహాయ । 

సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞాయ ।

సర్వజ్ఞాయ । 

సజ్జనప్రియాయ ।

నారాయణకృపాపాత్రాయ । 

శ్రీభూతపురనాయకాయ । 

అనఘాయ । 

భక్తమన్దారాయ ।

కేశవానన్దవర్ధనాయ । 

కాఞ్చిపూర్ణప్రియసఖాయ । 

ప్రణతార్తివినాశకాయ ।

పుణ్యసఙ్కీర్తనాయ । 

పుణ్యాయ । 

బ్రహ్మరాక్షసమోచకాయ నమః ॥౨౦ ॥ యాదవపాదితాపార్థవృక్షఛేదకుఠారకాయ నమః । 

అమోఘాయ । 

లక్ష్మణమునయే । 

శారదాషోకనాశనాయ ।

నిరన్తరజనాజ్ఞానవిమోచనవిచక్షణాయ । 

వేదాన్తద్వయసారజ్ఞాయ ।

వరదామ్బుప్రదాయకాయ । 

పరాభిప్రాయతత్త్వజ్ఞాయ । 

యామునాఙ్గులిమోచకాయ ।

దేవరాజకృపాలబ్ధషడ్వాక్యార్థమహోదధయే । 

పూర్ణార్యలబ్ధసన్మన్త్రాయ ।

శౌరిపాదాబ్జషట్పదాయ । 

త్రిదణ్డధారిణే । 

బ్రహ్మజ్ఞాయ ।

బ్రహ్మజ్ఞానపరాయణాయ । 

రఙ్గేశకైఙ్కర్యరథాయ ।

విభూతిద్వయనాయకాయ । 

గోష్ఠిపూర్ణకృపాలబ్ధమన్త్రరాజప్రకాశకాయ ।

వరరఙ్గానుకమ్పాత్తద్రావిడామ్నాయపారగాయ ।

మాలాధరార్యసుజ్ఞాతద్రావిడామ్నాయతత్త్వధియే నమః ॥ ౪౦ ॥ 

చతుస్సప్తశిష్యాఢ్యాయ నమః । 

పఞ్చాచార్యపదాశ్రయాయ ।

ప్రపీతవిషతీర్థామ్బుప్రకటీకృతవైభవాయ ।

ప్రణతార్తిహరాచార్యదత్తభిక్షైకభోజనాయ । 

పవిత్రీకృతకూరేశాయ ।

భాగినేయత్రిదణ్డకాయ । 

కూరేశదాశరథ్యాదిచరమార్థప్రకాశకాయ ।

రఙ్గేశవేఙ్కటేశాదిప్రకటీకృతవైభవాయ । 

దేవరాజార్చనరతాయ ।

మూకముక్తిప్రదాయకాయ । 

యజ్ఞమూర్తిప్రతిష్ఠాత్రే । 

మన్నాథాయ ।

ధరణీధరాయ । 

వరదాచార్యసద్భక్తాయ । 

యజ్ఞేశార్తివినాశకాయ ।

అనన్తాభిష్టఫలదాయ । 

విట్టలేశప్రపూజితాయ ।

శ్రీశైలపూర్ణకరుణాలబ్ధరామాయణార్థకాయ । 

ప్రపత్తిధర్మైకరతాయ ।

గోవిన్దార్యప్రియానుజాయ నమః ॥ ౬౦ ॥ 

వ్యాససూత్రార్థతత్త్వజ్ఞాయ నమః ।

బోధాయనమతానుగాయ ।

శ్రీభాష్యాదిమహాగ్రన్థకారకాయ । 

కలినాశనాయ । 

అద్వైతమతవిచ్ఛేత్రే ।

విశిష్టాద్వైతపారగాయ । 

కురఙ్గనగరీపూర్ణమన్త్రరత్నోపదేశికాయ ।

వినాశితేతరమతాయ । 

శేషీకృతరమాపతయే । 

పుత్రీకృత శఠారాతయే ।

శఠజితే । 

ఋణమోచకాయ । 

భాషాదత్తహయగ్రీవాయ । 

భాష్యకారాయ ।

మఘహాయశసే ।

పవిత్రీకృతభూభాగాయ । 

కూర్మనాథప్రకాశకాయ ।

శ్రీవేఙ్కటాచలాధీశ-శఙ్ఖచక్రప్రదాయకాయ ।

శ్రీవేఙ్కటేశశ్వశురాయ । 

శ్రీరామసకఖదేశికాయ నమః ॥ ౮౦ ॥

కృపామాత్రప్రసన్నార్యాయ నమః । 

గోపికామోక్షదాయకాయ ।

సమీచీనార్యసచ్ఛిష్యసత్కృతాయ । 

వైష్ణవప్రియాయ ।

కృమికాణ్టనృపధ్వంసీనే । 

సర్వమన్త్రమహోదధయే ।

అఙ్గీకృతాన్ధ్రపూర్ణార్యాయ । శాలగ్రామప్రతిష్ఠితాయ ।

శ్రీభక్తగ్రామపూర్ణేశాయ ।

విష్ణువర్ధనరక్షకాయ ।

బౌద్ధధ్వాన్తసహస్రాంశవే । 

శేషరూపప్రదర్శకాయ ।

నగరీకృతవేదాద్రయే । 

దిల్లీశ్వరసమర్చితాయ । 

నారాయణప్రతిష్ఠాత్రే ।

సమ్పత్పుత్రవిమోచకాయ । 

సమ్పత్కుమారజనకాయ । 

సాధులోకశిఖామణయే ।

సుప్రతిష్ఠితగోవిన్దరాజాయ । 

పూర్ణమనోరథాయ నమః ॥ ౧౦౦ ॥

గోదాగ్రజాయ నమః । 

దిగ్విజేత్రే । 

గోదాభీష్టప్రపూరకాయ ।

సర్వసంశయవిచ్ఛేత్రే । 

విష్ణులోకప్రదాయకాయ । 

అవ్యాహతమహద్వర్త్మనే ।

యతిరాజాయ । 

జగద్గురవే నమః ॥ ౧౦౮ ॥


ఇతి రామానుజాష్టోత్తరశతనామావళిః సమాప్తా ।

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*21-04-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం  కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.  ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి.

---------------------------------------

వృషభం


నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల  నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు. సంతానం విద్యా  ఫలితాలు  సంతృప్తి కలిగిస్తాయి.

---------------------------------------

మిధునం


బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు.

---------------------------------------

కర్కాటకం


పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి.   దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి.

---------------------------------------

సింహం


గృహమున శుభకార్యాలు  నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.  విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి.

---------------------------------------

కన్య


దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు.  వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతాహవరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. స్ధిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.

---------------------------------------

తుల


కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో  కాని  పూర్తికావు. కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.  వ్యాపారాలు తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

ధనస్సు


సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల  పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి.  భూ సంబంధిత  క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మకరం


అధిక శ్రమతో అల్ప  ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

కుంభం


ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మీనం


ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా  సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. కుటుంబ పెద్దలతో కల సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

వెలిగించిన దీపం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో ।।   

*యథా ప్రదీప్తః పురతః ప్రదీపః*

*ప్రకాశమన్యస్య కరోతి దీప్యన్।*

*తధేహ పంచేంద్రియదీపవృక్షాః*

*జ్ఞానప్రదీప్తాఃపరవంత ఏవ॥*


          వెలిగించిన దీపం తాను ప్రకాశిస్తూ, తన సమీపాన గల ఇతరవస్తువులను కూడా ప్రకాశింపజేసినట్లు *శరీరమనే వృక్షంలోనున్న పంచేంద్రియాలు జ్ఞానంతో తాము ప్రకాశిస్తూ, విషయాలను కూడా ప్రకాశింపజేస్తాయి*....

నాలుగు రకాల వారూ

 


కర్తా కారయితా చైవ

ప్రేరకశ్చానుమోదకః

సుకృతం దుష్కృతం చైవ

చత్వారి సమభాగినః


చేసిన, చేయించిన, ప్రేరేపించిన, ఊరక చోద్యం చూస్తున్నా .... ఈ నాలుగు రకాల వారూ *అనుభవించాల్సిందే*. మహామహా భీష్మునకే తప్పలేదు. పరమాత్మ కూడా అతీతంగా వ్యవహరించడు


మూర్తి,ఫిజిక్స్ లెక్చరర్,9985617100

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం -‌ త్రయోదశి - ఉత్తరాఫల్గుని -‌‌ భాను వాసరే* (21.04.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  -‌ త్రయోదశి - ఉత్తరాఫల్గుని -‌‌ భాను వాసరే* (21.04.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/XWjZ5cWhuVY?si=QTPgLq46jB2SWUhR


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మాన్యత లేమిని,

 ధార్మికగీత 

                                                                   

      01. శ్లో: మన స్యేకం వచ స్యేకం 

                 కర్మ ణ్యేకం మహాత్మనామ్

                 మన స్యన్యత్ వచ స్యన్యత్

                 కర్మ ణ్యన్యత్ దురాత్మనామ్

                                        

చ. మనసును మాట చేతయును మాన్యుల కుండెడు నేక రీతిలో ,

     ననయము వారి జీవనము నందఱి కుండును మార్గదర్శియై, 

     మనసును మాట చేత నణు మాత్రము పొంతన లేక యుంద్రు దు

     ర్మనుజులు లోకమందు , తగు మాన్యత లేమిని,మంచి లేమి చేన్. 01*


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

20, ఏప్రిల్ 2024, శనివారం

Panchang


 

కాశీ యాత్ర (నాలుగవ భాగము)

 

కాశీ యాత్ర (నాలుగవ భాగము

 6 తారీకు ఉదయం నేను 3-30 గంటలకు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నా శ్రీమతిని, కుమారుడిని త్వరగా తయారు కమ్మని చెప్పగా ఉదయం 5 గంటలకు మేము రూముకు తాళం వేసి చిన్నగా ఆశ్రమం ప్రక్క సందునుండి సైకిలు బాబా ఆశ్రమం వరకు నడుచుకుంటూ వెళితే అక్కడ ఒక రిక్షా కనిపించింది 300 రూపాయలకు నంది సర్కిల్ వరకు రావటానికి వప్పుకొన్నాడు. బ్యాటరీ రిక్షాలు రోడ్డుమీద వెళితే మనకు ఎడ్ల బండి ఎక్కిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటె వాటి షాక్ అబ్సర్వర్స్ మంచిగా వుండవు. 15 నిముషాలలో మమ్మలను నంది సర్కిల్లో దించాడు. మేము ఆలస్యం చేయకుండా గేటు  నెంబరు 1 ద్వారా వెళ్లి సాక్షి గణపతి మరియు అన్నపూర్ణ అమ్మవారిని, మరియు వారాహి మాత అమ్మవారిని చూడాలని సంకల్పంకాగా అక్కడి పోలీసులు గేటు -1 నుండి వెళ్లనీయలేదు. మేము కొంచం ముందుకు వెళ్లి గేటు-2 నుండి వెళ్లి దైవానుగ్రహంతో ముందుగా సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాము. ఆంజనేయస్వామికి పూసినట్లు స్వామికి సిందూరం పూసి ఉంచారు. జనం ఎవరు లేరు. చక్కగా దర్శనం అయ్యింది. తరువాత వారాహి అమ్మవారి దర్శనానికి వెళితే అక్కడ చాలామంది క్యూలో వున్నారు. మేము క్యూ చివరకు వెళితే అక్కడ ఒక ఆంజనేయస్వామి దేవాలయం కనిపించింది స్వామిని దర్శించుకొన్నాము దేవాలయ ప్రాంగణం చిన్నగా వుంది అక్కడ్నుంచి చుస్తే గంగ నది కనిపిస్తున్నది. కొంచం సేపు అక్కడ ఉండి దేవాలయం క్రింద ఒక మునిసిపల్ నల్ల కనిపిస్తే కాళీ ఆయిన మా నీళ్ల సీసాను నింపుకొని మరల క్యూను ముందరగా వెళితే అక్కడ వున్న రోడ్డు ప్రక్క దుకాణం ఆమె మీరు ఒక్కొక్కరు రూ 300 ఇస్తే మీకు స్పెషల్ దర్శనం  చేయిస్తాను. అది నాకు ఇవ్వనక్కరలేదు పూజారికి ఇవ్వండి అని మమ్మలను ఆపింది. నాకు ఎండకు అస్వస్థతగా ఉండటం చేత మనం వెళదాం అని మా వాళ్ళను తొందర పెట్టితే ఆమె బాబూజీ ఉండండి మీకు కుర్చీ వేస్తా అని ఒక కుర్చీ తెచ్చి వేసి నాకు త్రాగటానికి నీళ్లు ఇస్తా అని చెప్పి ఆమె కూతురుకు ఫురమిస్తే అమ్మాయి ఒక పెద్ద గ్లాసునిండా మజ్జిగ పంచదార కలుపుకొని వచ్చి నాకు ఇచ్చింది. అది తాగి నేను కొంత ఊరట చెందాను. ఇంతలో దేవాలయపు తలుపులు మూయటంతో క్యూలోని వాళ్లంతా వెళ్లారు. అక్కడ మేము ముగ్గురం మా ముందు దుకాణం ఆమె ఆపిన మొరొక 4గురు మాత్రమే మిగిలారు. ఇంతలో ప్రక్క ఇంట్లోంచి ఒక పూజారి వచ్చి కేతేనే లోగ్ హై అన్నాడు. తీన్ అని మా కాంట్రాక్టరు, చారు అని ఎదురు షాపు ఆమె అనటంతో జెల్ది ఆజావ్ అని దేవాలయపు తలుపు ప్రక్కన వున్న గది తలుపు తెరిచాడు. మేము ముగ్గురం మిగిలిన వార్ అందరం లోపలి వెళ్ళాం తీన్  తీన్  సౌ దేవ్ అని ముందుగా మా దగ్గర 900 రూపాయలు తీసుకున్నాడు. నాకు అంతా అయోమయంగా అనిపించిందిమమ్మలను చిన్నగా ఒక గదికి తీసుకొని వెళ్ళాడు అదే వారాహి అమ్మ దేవాలయం. నన్ను కూర్చో మని అన్నాడు నాకు తెలియక బాసుపేట్లు  వేసుకొని కూర్చున్నాను. ఐస నై అని గొంతుకు కూర్చోమని చెప్పాడు అక్కడ 2.x 1 అడుగుల  కంత ఒకటి వున్నది దానిలోంచి క్రిందికి చూడమని చెప్పాడు. అప్పుడు నాకు తెలిసింది అమ్మవారు క్రింద వున్నారని. నేను చుస్తే అమ్మవారి ముఖం ఒక ప్రక్కగా క్రింద కనిపించింది. చేలో చేలో అని నన్ను పంపించి మిగిలిన వారికి కూడా ఒక 2 నిముషాలలో దర్శనం చేయించి పంపాడు. మేము బ్రతుకు జీవుడా అని బయటకు  వచ్చాము. తరువాత అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కోసం బయట విచారించాం కానీ క్యూ చాల పెద్దగా ఉండటం చేత తల్లిని చూడకుండానే వెళదామని నిర్ణయించుకున్నాం. బయటకు అంటే సందులలోంచి రోడ్డు మీదకు రాగానే ఒక టీ దుకాణం కనిపించింది. మట్టి గ్లాసులల్లో టీ ఇస్తున్నాడు. గ్లాసు 15 రూపాయలు. తాగినవి పారేయటమే. నాకు మట్టి గ్లాసు నచ్చింది. నాకు ఒక కాళీ గ్లాసు కావలి అంటే 3రూపాయలకు ఇచ్చాడు. దానిని భద్రంగా తెచ్చుకొన్నాను

రోడ్డుకు ఇరుపైపుల మన చార్మినార్ రోడ్డులాగా అన్నీ బట్టల  దుకాణాలు,డ్రస్సులు అమ్ముతున్నారు. ఆడవారు చేతినిండా డబ్బులు తీసుకొని వస్తే మోయలేనన్ని బట్టలు కొనటం కాయం. కాకపొతే మాకు ఆకలి బాగా వేయటంతో ఏమి కొనకుండానే 1-30 గంటలకు నంది సర్కిలుకు నడుచుకుంటూ వచ్చి ఒక సైకిల్ రిక్షా ఎక్కి రూము దోవ పట్టము. రిక్షా వాడు రూ 100 తీసుకున్నాడు. రూములో కొంతసేపు ఉండి అక్కడినుండి కరివేనసత్రం భోజనాలయానికి వెళ్లి భోజనం చేసి ఇక రోజు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నామునేను మాత్రం మరుసటి రోజు ప్రోగాంగూర్చి ఆలోచిస్తున్నాను. మేము ఆశ్రమ సందులోకి వస్తూవుంటే ఒకడు కరపత్రాలను పంచుతున్నాడు. అది గయ, ప్రయాగరాజుకు టూరులు అది చదివి నేను మరుసటి రోజు గయకు వెళ్ళటానికి కారు మాట్లాడుకున్నాను. గయా చూపించి తిరిగి తీసుకొని రావటానికి రూ 6000 అడిగాడు. ముందుగా అద్వాన్సు రూ  500 అడిగితె ఇచ్చాను. నాకు ఆతను డ్రైవరు ఫోను నంబరు ఇచ్చాడు. ఉదయం 5గంటలకు బెంగాలీ టోలి దగ్గరకు కారు వస్తుంది అని అన్నాడు. నేను ఇంటికి వచ్చి రేపటి ప్రోగ్రాం గురుంచి మావాళ్లకు చెప్పాను . సాయంత్రం ఆంధ్రశ్రమం నుంచి తెచ్చుకున్నటిఫిన్ బియ్యపురవ్వ ఉప్మా తిని పడుకున్నాము