13, డిసెంబర్ 2021, సోమవారం

ఓమిక్రాన్ వైరస్ గురించి

 *ఓమిక్రాన్ వైరస్ గురించి ఓ డాక్టర్ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తూ, అప్రమత్తత చేస్తూ రాసిన వ్యాసం ఇది.* 

1)ఎవరికి డేంజర్?  భయపడే వార్తలను పదేపదే చదివే వారికి,  వినేవారికి డేంజర్. వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది . ఓమిక్రాన్ చంపదు. భయం ముంచేస్తుంది. ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది .  అటుపై దాని కంటే అనేక రెట్ల వేగంతో విస్తరించే డెల్టా వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఓమిక్రాన్. కట్టడి చర్యల పేరుతొ మీ భయాన్ని మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. కరోనాను నుంచి ముక్కున్న  మానవుడు తప్పించుకోలేడు అని నేను ప్రారంభం నుంచి చెబుతున్నాను. కరోనా పోతుంది అని ఇంకా నమ్మే అమాయక ప్రజలు కోకొల్లలుగా వున్నారు . కరోనా ఎక్కడికీ పోదు . మరో వంద ఏళ్ళైనా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో స్పానిష్ ఫ్లూ కలుగ చేసిన వైరస్ ఇంకా మనమధ్యే వుంది. అది సాధారణ  జలుబు కలుగ చేస్తుంది . మొదటి ప్రపంచయుద్ధ కాలంలో అది ప్రాణాంతకం అయిన మాట వాస్తవం. కానీ మ్యుటేషన్లు జరిగే కొద్దీ బలహీనపడి జలుబు ఫ్లూ వైరస్ గా నిలిచిపోయింది.  కరోనా కూడా అంతే. ఒళ్ళు నొప్పుల వైరస్ గానో మరో స్వల్ప లక్షణాలు కలుగచేసే వైరస్ గానో స్థిరపడి పోతుంది. మీ జీవిత కాలంలో ఎన్నో సార్లు సోకుతుంది . సోకినా ఏమీ కాదు . భయపడే వ్యక్తిని ఎవరూ రక్షించలేరు. 

2)ఓమిక్రాన్ కు మోనోక్లోనల్ యాంటీబోడీ కాక్టెయిల్ పనిచేసే అవకాశం తక్కువ.  విపరీతంగా భయపడే వారు, లేదా ఇమ్మ్యూనిటీ మరీ బలహీనంగా ఉన్న వారు తప్పించి మిగతా వారికి దీనిఅవసరం రాదు. 

3)మ్యుటేషన్లకు గురికావడం సూక్షజీవుల లక్షణం. {ఆ మాటకు వస్తే అన్ని జీవులు. కాకపోతే సూక్షజీవుల పై ప్రభావం ఎక్కువ}. ఓమిక్రాన్ రేపు మరో రూపంలోకి మారొచ్చు. దాన్ని ఆపలేము. దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. మన ఇమ్మ్యూనిటినే మనకు రక్ష. ప్రతిరోజు కనీసం అరగంట ఎండలో నడవండి. *శరీరానికి డి-విటమిన్ అందివ్వండి . శాఖాహారులు బి12  విటమిన్ మాత్రలు తీసుకోండి. తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా {కనీసం ముప్పై శాతం} ఉండేలా చూసుకోండి.  పన్నీర్, మొలికెత్తిన పెసలు, *పుట్టగొడుగులు* 🍄🍄,

 ,* బ్రోకలీ, జామ కాయ, చికెన్, ఫిష్ మటన్, గుడ్డు ప్రోటీన్ అందించే ఆహార పదార్తాలు. రోజుకు పెద్దలు నాలుగు లీటర్ల నీరు తాగాలి. చెమట పట్టేదాకా వ్యాయామం {కనీసం నడక} చెయ్యాలి *బాడీ హీలింగ్ వ్యాయామం* . శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.  నిద్ర బాగా పోవాలి. ఇవన్నీ ఇమ్మ్యూనిటిని బలపరుచుకొనే మార్గాలు.   

అన్నింటికన్నా భయం పెద్ద విలన్. భయం ఇమ్మ్యూనిటిని చంపేస్తుంది. అదే ఫార్మసురుల అస్రం. భయంతో మళ్ళీ మీ ఆస్తులు ఖాళీచేసి వారి గోదాముల్లో నోట్లకట్టలు సంచుల్లో దాచుకొనే అవకాశాన్ని* కల్పించుకొంటున్నారు.  తస్మాత్ జాగ్రత్త. వేవ్ అంటే ఆసుపత్రిల్లో బెడ్లు దొరకపోవడం , అంబులెన్సుల క్యూలు.  ఇలాంటి స్థితి రాదు. కానీ మనదేశంలో కరోనా అంటే భయపడే వారు కోకొల్లలుగా వున్నారు. ఇన్నాళ్లయినా నిజాన్ని గ్రహించలేని వారు, భయం  వద్దని చెబితే మొండిగా,  మూర్ఖంగా వాదించేవారు వున్నారు. వారిని    ఓమిక్రాన్ నుంచి ఎవరూ రక్షించలేరు. తత్త్వం బోధపడేటప్పటికీ వారు ఉండక పోవచ్చు. ఉన్నా ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యంతో. ఇలా చెబుతున్నందుకు క్షంమించండి. నిజం నిష్టూరంగా ఉంటుంది. తప్పదు. 

భయాన్ని బహిష్కరించండి. నిర్భయంగా వుండండి. అప్రమత్తత అవసరం. అలసట అనిపిస్తే పల్స్ ఆక్సీమీటర్ లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒకసారి చెక్ చేసుకోండి. అది 94  పైగా ఉంటే హ్యాపీగా కాలం గడపండి. 

ఇంకోసారి చెబుతున్నా,  కరోనాకు చంపేగుణం పోయింది. భయం చంపుతుంది. అది ఓమిక్రాన్ రూపంలో కాకపోతే గుండెపోటు రూపంలో. 

డాక్టర్ షణ్ముఖ 

అపోలో హాస్పి

అంతా మిథ్యేనా.. (అంతర్మథనం)

 అంతా మిథ్యేనా.. (అంతర్మథనం)

................

కళ్ళ ముందు అన్నీ కనిపిస్తుంటే ఏమీ లేదని, అభాస అని అనేవాళ్ళని మనం ఏమనాలి? ఏదైనా అనండి, అనుకోండి. ఎందుకంటే వాళ్లకు మీ మాటల పట్టింపు ఉండదు కాబట్టి. ఈ మాటల్లో నిజమెంత అనేది మాత్రం ఆయా వ్యక్తుల ఆలోచనా విధానం, తార్కిక, తత్వ దృష్టిని బట్టి ఉంటుంది. సృష్టిలో అన్నీ ఉన్నాయి. లేనివే వీ కొత్తగా సృష్టించబడటం లేదు. కర్ర, ఇటుక, సున్నం, స్టీల్ ఇవన్నీ తయారు చేసినవా? సృష్టిలో ఉన్నవే కదా. అన్నీ కలిపి మనం ఇల్లు కడుతున్నాం. ఇవాళ నీది, ఆ తరువాత ఉంచుకుంటే నీది, లేకుంటే వేరొకరిది. అంటే ఓనర్లు మారుతున్నారు. మరి అసలు ఓనరు ఒకడు ఉండాలి కదా. వాడెవడు? వాడు సర్వాధికారి అయితే మనం ఎవళ్ళం? ఇదీ తార్కిక, తత్వ దృష్టి. ఇవన్నీ మాకెందుకు..వర్తమానం, భవిష్యత్తు మాకు ముఖ్యం అంటాం మనం. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వర్తమానం మరు నిమిషానికి గతం. భవిష్యత్తు అని మనం చెప్పేది కూడా వర్తమానంలోనే చూస్తాం. మరి ఉన్నది వర్తమానం ఒక్కటే అయితే మిగిలిన రెండూ లేనట్టేనా? మిథ్య అని చెబుతున్న వారి వాదనో, జ్ఞానమో..అది కరెక్టేనా?. మిథ్య అంటే లేదని ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే.. ఇవాళ ఉన్నది ఏదీ రేపటికి ఉంటుందని గ్యారంటీ లేదు కదా. అందం, ఆరోగ్యం, సంపద, పదవి, ఆయుష్షు..ఇవన్నీ ఆ కోవలోవే కదా. ఇది నిజం కదా. ఆ దృష్టి సదా నిలవడం కోసమే.. మిథ్యా ప్రపంచం అని పెద్దలు చెప్పి ఉంటారని అనుకుంటే జీవిత సత్యం కొంతయినా బోధపడుతుంది కదా. ఇక..మిథ్య అనే వాడిని ఎందుకు తప్పుపట్టడం? అశాశ్వతమైన వాటి కోసం జీవితాంతం వెంపర్లాడక, శాశ్వతమైన వస్తువును అన్వేషించడమే..పెద్దల చెప్పే మిథ్యా ప్రపంచానికి లోతైన అర్థంగా స్వీకరిస్తే తప్పూ లేదు, తప్పు పట్టుకోవాల్సిన పనీ లేదు కదా. సత్యాన్వేషి...సజ్జన సాంగత్యం, సద్ గ్రంథ పఠనం, సద్ గురువుల ఆశ్రయం, సత్ కర్మల ఆచరణతో ఈ విషయం నిగ్గు తేల్చుకోవాలి.. కోవచ్చు కూడా.// మీ...ఆదూరి వేంకటేశ్వరరావు. 🙏

12, డిసెంబర్ 2021, ఆదివారం

అహం

 *అహం*


కొన్ని విషయాలను బాగా గమనించండి... 

ఊపిరి పీల్చడం మన ప్రమేయం లేకుండా జరుగుతోంది. 

కనురెప్పలు వేయటం మన అనుమతితో జరగటం లేదు.

మరుక్షణం ఏమి చేస్తామో తెలీదు..?

ఇంకా కొన్ని అసంకల్పితంగా మననుంచి ఎన్నో జరుగుతున్నాయి. ప్రతీ క్షణం మన శరీరంలో ఎన్నో వేల మార్పులు జరుగుతున్నా...

మనకు వీటిపైన ఎలాంటి నిర్ణయం, నియంత్రణ 

లేకున్నా. 'అన్నీ నేనే చేస్తున్నాను' అని కేవలం భావిస్తాము. ఇలాంటి భావననే *అహము* అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. అహము అంటే ఇప్పటికీ మనిషికి అర్థము కాకుండా ఉంది.

ఈ అహాన్ని గుర్తించటం పెద్ద పెద్ద స్వాములకు కూడా వీలుకాకుండా ఉన్నది. ప్రతీ క్షణం... మన కర్మ ప్రకారం జరిగే పనుల్ని మనిషి నేను చేసాను అని అనుకోవడమే 'అహము'. వేటి మీదా మన ప్రమేయం లేదు. అని తెలుపుటకు ఉదాహరణకోసమే. మన ఊపిరిని, కనురెప్పలను అసంకల్పితంగా జరిగేలా ప్రత్యక్ష సాక్షంగా దేవుడు నిలిపాడు. అయినా ఇవేవీ అర్ధము చేసుకోక, మనిషి అంతా 'నేనే చేస్తున్నాను' అనే గొప్పలు పోతాడు... అహాన్ని గుర్తించటమే కర్మయోగము. మరి ఇవన్నీ చేస్తోంది ఎవరు? ఇన్ని పనులను చేసేది ఒక్కడే... 'ఆత్మ'. 

ఈ ఆత్మనే అందరిలో గలదు అని గీతయందు చెప్పారు. ఒక్కో మనిషి కర్మను బట్టి... ఆత్మ ఒక్కోలా ప్రవర్తిస్తుంది. కర్మ ప్రకారమే మనిషి కష్టమైనా, సుఖమైనా... వీటి అనుభవాలు అహం ద్వారా మనకు తాకుతున్నాయి... అసలు అహమే లేకుంటే వీటి రెండింటిని మనము పొందకుండా కర్మయోగులము అవుతాము. కాబట్టి అహముపై ధ్యాస పెట్టి మన లోపలి అహము చెప్పే మాటలు వినకపోతే అప్పుడు నువ్వు కర్మయోగివై...

శ్రీ కృష్ణుడి ప్రియశిష్యుడవు అవుతావు.


_సేకరణ_

11, డిసెంబర్ 2021, శనివారం

సైన్ధవ లవణం యొక్క ఉపయోగాలు -

 సైన్ధవ లవణం యొక్క ఉపయోగాలు - 


 * ఈ సైన్ధవ లవణం కొంచం మధురంగా ఉండును. 


 * శుక్రాన్ని వృద్దిచేయును .


 * హృదయముకు బలమును ఇచ్చును. 


 * శరీరం నందు వాత,పిత్త,కఫ దోషములను పొగొట్టును.


 * శరీరం నందు కొంచం ఉష్ణం కలుగచేయును .


 * నేత్రములకు మంచి ఉపకారం చేయును . 


 * శరీరం నందు జీర్ణశక్తిని వృద్దిచేయును .


 * వాతాన్ని హరించును .


 * వ్రణాలను తగ్గించును . 


 * శరీరం నందు పైత్యం హరించును . 


 * దీనిని వాడటం వలన మలబద్దకం హరించును . 


 * గ్యాస్ పట్టినప్పుడు దీనిని గోరువెచ్చటి నీటిలో కలిపి త్రాగించి వాంతి చేయించిన ఉదరం శుభ్రపడును . 


 * ఒక చెంచా చనుబాలలో చిటికెలో పావు వంతు సైన్ధవ లవణం కలిపి కంటిలో 2 చుక్కలచొప్పున వేయుచుండిన కంటి సమస్యలు నివారణ అగును. 


  గమనిక - 


      దీనిని అమితముగా పుచ్చుకున్న పైత్యం చేయును . అతిసార వ్యాధిని కలుగచేయును .


                       అతిత్వరలో నా మూడోవ గ్రంధం 

" సర్వ మూలికా చింతామణి " ప్రధమ భాగం రాబోతుంది. ఈ గ్రంధంలో అత్యంత రహస్య మూలికా యోగాల గురించి మరియు ప్రతి ఔషధ మొక్క గురించి అత్యంత విపులంగా రాయడం జరిగింది. ఆ సర్వేశ్వరుడి కృప వలన అతి త్వరలో మీకు అందచేస్తాను . ఈ గ్రంథంలో ఔషధ మొక్కల రంగుల చిత్రాలతోపాటు అత్యంత నాణ్యతతో వస్తుంది . 


              కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                   9885030034

మల్లెచెట్టు మహావృక్షమైతుందా !

 మల్లెచెట్టు మహావృక్షమైతుందా !

.....................................................................


సోమన దాక్షారామ సమీపంలోని వేములవాడ అగ్రహారంలో జీవించేవాడు. ఇతను సకలశాస్త్రపారంగతుడు, పండితుడు కాని పూటగడవని నిరుపేద. అతనిభార్య ఉత్తమఇల్లాలు భారతరామాయణాలు శివపురాణాలు చదువుకొంది.ఈమెకు సంగీతంలో ప్రవేశంవుంది. విధిబలీయమైనది.సంతానయోగం లేకనే చిన్నవయసులోనే సోమన అనారోగ్యంపాలై మరణించాడు.భర్త మరణాంతరం భార్య ఉదరపోషణార్థం సాటిబ్రాహ్మణులలో ఇండ్లలో పిల్లలకు రామాయణభారతభాగవత శివపురాణ ఇతిహాసాలను చెప్పుకొంటూ వారికి పాటలు పద్యాలు నేర్పిస్తూ వుండేది.


ఒకసారి శివరాత్రిపర్వదినాన వేములవాడ గ్రామమహిళలు కొందరు దాక్షారామంలోని భీమేశ్వరస్వామిని దర్శించుకోటానికి వెళ్ళారు.సోమన భార్య కూడా వారితోపాటు భీమేశ్వరదర్శనానికి వెళ్లింది. ముత్తయిదువులలో కొందరు సోమనభార్య వయసువారు, కాని నిస్సంతులు తమకు సంతానం కలగాలని వారు పార్వతీనాథుని వేడుకొన్నారు. సోమనభార్యను చూచి నువ్వు కూడా ఏదైనా వరం కోరుకోమని సరదాగా ఆటపట్టించారు. నాక్కూడా కడుపుపండితే పుట్టెడు నీళ్ళతో దీపారాధాన చేయిస్తానని మొక్కుకొంది. ఆమె కోరిక విని భర్తలేని నీకు పిల్లలెలా కలుగుతారని అందరూ పక్కున నవ్వారు. సోమనభార్య కూడా నవ్వింది. ఊరికి వెళ్లిన తరువాత ఎవరి సంసారంలో వారు పడి తాము భీమేశ్వరదేవుని కోరిన కోర్కెలు మరచిపోయారు.


కాని దేవుడి మహిమలు విచిత్రమైనవి. కొన్నాళ్ళకు సోమనభార్యకు చూలు నిలిచింది. ముండ యాగటైందని ఇంట్లోవారు ఊర్లోవారు బుగ్గలు నొక్కుకున్నారు. ఆమెమాత్రం వేములవాడ భీమలింగేశ్వరుని మీద భారంవేసి ఏం జరిగితే అదే జరగనీ అని ఊరకనే వుండిపోయింది. ఒక శుభముహుర్తాన పండంటి మగబిడ్దకు జన్మనిచ్చింది.దాంతో అగ్రహారీకులలో కొందరు ఆమెను దూరం పెట్టేశారు. అయినా ఆమె వెరవక బాలుడిని పెంచసాగింది.వేములవాడ భీమేశ్వరదేవర వరప్రసాదం కాబట్టి బాలునికి భీమన అనేపేరు పెట్టింది.


బాలుడు పెరిగి పెద్దవాడు కాసాగాడు. తల్లి దగ్గరే విద్యాబుద్ధులు నేర్చుకోసాగాడు. భీమన ఒకరోజున తోటి పిల్లలతో ఆడుకొనేటందుకు వీధిలోకి వెళ్ళాడు. నీకు నాన్నలేడు నువ్ ముండకొడుకంటూ భీమనను ఎగతాళిచేశారు. భీమనకు ఏడుపొచ్చింది, తండ్రెవరో తెలుసుకోవాలని తల్లిదగ్గరకు పరుగిడిపోయాడు. తన తండ్రెవరంటూ తల్లిని నిలదీశాడు.


తల్లికి ఏం చెప్పాలో తోచక, వేములవాడ భీమేశ్వర నీతండ్రని చెప్పింది. భీమన క్షణం ఆలస్యం చేయకుండా భీమేశ్వరాలయం చేరి, శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని నాన్నానాన్నా అంటూ గట్టిగా పిలవసాగాడు. అలా ఎంతసేపు పిలిచాడో కాని భక్తవరశంకరుడు బాలుని ముందు ప్రత్యక్షమై నాయనా నీవు నా వరప్రసాదవి. ఈ సంగతి అందరికి చెప్పు ఇకనుండి నిన్ను ఎవరు అనరు. నీకు చక్కని నోటివాక్కును ప్రసాదిస్తున్న నిన్ను ఎగతాళి చేసిన వారిపట్ల నువ్ ఏమంటే అది ఫలిస్తుందంటూ చెప్పి, అంతేకాదు ఇకనుండి నువ్వాడిందే ఆట నువ్ పాడిందేపాట ఆవుతుందంటూఆశీర్వదించాడు. భీమన నాటినుండి భీమేశ్వరుడిగా మారిపోయాడు.


బాలుడు సంతోషంతో ఊరిని చేరుకొన్నాడు. ఊర్లో బ్రాహ్మణ అన్నసంతర్పణ జరుగుతోంది. ఆకలిగా వుంటే వెళ్ళి బంతిలో కూచోబోయాడు. వడ్డించేవారు ఛీదరించుకొని విధవ కొడుకును ఎవడ్రా లోపలికి రానించిందంటూ కేకలు వేశారు.భీమనకు కోపం వచ్చింది, పందిరిలోని అన్నమంతా సున్నం, అప్పాలు - కప్పలు కావాలంటూ శపించాడు. అంతే విస్తరాకులలోని అన్నం సున్నంగాను అత్తిరసాలు/అప్పాలు కప్పలుగాను మారిపోయాయి. అన్నసంతర్పణ నిర్వాహంకులు లబోదిబోమన్నారు. భీమనతో క్షమాపణలు అడిగారు, భీమన శాంతించి సున్నమంతా అన్నంగాను, కప్పలన్ని అప్పాలుగాను మారాలని కోరుకొన్నాడు. అవన్ని అంతలోనే అన్నంగాను అప్పాలుగా మారిపోయాయి. వారా బాలుడిని అన్నబంతిలో కూర్చోబెట్టి అతనికేమేమి కావాలో అన్ని దగ్గరుండి వడ్డించారు.


ఆ బాలుడు పెరిగిపెద్దవాడైనాడు, తండ్రిలాగా సకలశాస్త్రాలు నేర్చి సంస్కృతాంధ్రభాషలలో గొప్పకవిగా రాణించాడు. నోటి వాక్కుతో ఎన్నో అద్భుతాలు చూపాడు.


ఒకసారి భీమలింగకవి రాజైన చొక్కభూపాలుని అస్థానానికి వెళ్ళాడు. రాజుతోపాటుగా ఉద్యానవనంలో విహరించాడు. రాజు ఒక తిన్నెపై కూర్చుని ఒక కాలును మల్లెచెట్టు కొమ్మపై వుంచి కూర్చున్నాడు. మహాకవి నీ నోటిమాట ఫలిస్తుందని అందరూ అంటారుగా ఏది ఈ మల్లెచెట్టును మహావృక్షంగా మార్చుచూద్దామన్నాడు. రాజు తనను తనను పరీక్షించాలని అనుకొంటున్నాడని భీమలింగకవి కింది పద్యాన్ని ఆశువుగా చెప్పాడు.


శా॥ ఆనీతాభ్యుపదానళృంఖలపదాభ్యాలంబితస్తంభమా !

నేనే వేములవాడ భీమకవినేనిజిత్రకూటంబులో

భూనవ్యాపితపల్లవోద్భవమహాపష్పోపగుచ్చంబులన్

నానాపక్వఫలప్రదాయి వగుమా నాకల్పవృక్షాకృతిన్.


అంతే చూస్తుండగానే ఆ మల్లెచెట్టు శాఖోపశాఖలుగా పెరిగి, మహవృక్షమైపోయింది. ఆ చెట్టు మొదట్లో రాజు కాలు ఇరుక్కుపోయింది. రాజు బాధతో అల్లాడిపోయి, ఆ పెద్దచెట్టును మామూలు మల్లెచెట్టుగా చేయమని కవిని ప్రార్థించాడు.


భీమకవి చిరునవ్వుతో కింది పద్యం చెప్పాడు.


ఉ॥

శంభువరప్రసాదకవిసంఘవరేణ్యుఁడ నైన నావచో

గుంభన చేయ నెంతొ యనుకూలత నొంది తనూనభావనన్

గుంభినజొక్క నామనృపకుంజరుపందిటిమల్లెసాలకున్

స్తంభమురీతి నీతనువుఁ దాలిచి యెప్పటియట్ల యుండుమా!


అశ్ఛర్యంగా అంత పెద్దచెట్టు పద్యం పూర్తైయ్యేలోపుగా పూర్వపు మల్లెచెట్టుగా మారిపోయింది. రాజు బ్రతుకు జీవుడా అంటూ మల్లెపొదలోనుండి కాలును బయటకు తీసేసుకొని కవికి నమస్కరించాడు.

.................................................................................. జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కాశీ.

 కాశీ.....🛕🙏💐


కాశీ వైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం...


కాశీ పట్టణం గొడుగు లాంటి పంచ క్రోశాల పరిధి లో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారం లో ఉంటుంది. కాశీ బ్రహ్మ దేవుని సృష్టి లోనిది కాదు. 


విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి, సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న 

ప్రత్యేక స్థలం.


ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. 

ప్రపంచ సాంస్కృతిక నగరం.

స్వయంగా శివుడు నివాసముండె నగరం.


ప్రళయ కాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడు. 


కాశీ భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశీ పన్నెందు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన భాండాలలో విశేషమైన స్థలం.


కాశీలో గంగా స్నానం,బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు,విశాలాక్షి, 

కాలభైరవ దర్శనము 

అతి ముఖ్యం....


ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికీ యమ బాధ పునర్ జన్మ ఉండదు.


కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్తుని నుండి మాయం అయి కాలభైరవుని వద్దకు చేరుతుంది....

డిండి గణపతి, కాల భైరవుడు పరిశీలించి యమ యాతన కంటే 32 రేట్లు అధిక శిక్షలు విధించి మరు జన్మ లేకుండా చేస్తాడు ...


కాబట్టే కాశీలో కాల భైరవ దర్శనం తరవాత పూజారులు వీపు పై కర్రతో కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లి పోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశి దారం కడతారు.


కాశీ వాసం చేసే వారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయి.కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు.


అందుకే కాశ్యాన్తు మరణాన్ ముక్తి అని శాస్త్ర వచనం కాబట్టే చివరి జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు.

మరణించిన వారి ఆస్తికలు కాశి గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్దరింప బడతారు.


గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లి దక్షిణ దిశగా ప్రవహించి దన్నుసాకారపు కాశీి పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు.


శివుని కాశీలోని కొన్ని వింతలు.

కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్య పోయ్యారు. 


అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి, అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు 

అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


కాశీి విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు, కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది, పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.


విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.


ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి... ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి 

ఎన్నో వున్నాయి. 


అందులో కొన్ని.....


1) దశాశ్వమేధ ఘాట్...


బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్...


ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్...


చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్...


సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం. ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్...


పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్...


ఇది కాశీలో మొట్ట మొదటిది. 

దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు.

ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. 

ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్...


ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. 

ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


😎 పంచ గంగా ఘాట్...


ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్...


గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్...


తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్...


ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్...


పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్...


సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...


14) మానస సరోవర్ ఘాట్...


ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.


15) నారద ఘాట్.. 


నారదుడు లింగం స్థాపించాడు.


16) చౌతస్సి ఘాట్...


ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 

64 యోగినిలు తపస్సు చేసినారు.

ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... 

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 

64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.


17) రానా మహల్ ఘాట్...


ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.


18) అహిల్యా బాయి ఘాట్...


ఈమె కారణంగానే మనం ఈరోజు 

కాశీవిశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము. 


కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.


పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.


కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము. విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. 


నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, 

మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.


కాశీ స్మరణం మోక్షకారకం...🙏


|| ఓం నమః శివాయ ||

10, డిసెంబర్ 2021, శుక్రవారం

తులనాభికాభంగ

 లలనా జనాపాంగ వలనావసదనంగ

తులనాభికాభంగ దోఃప్రసంగ

మలసానిల విలోలదళ సాసవ రసాల

ఫల సాదర శుకాలపన విశాల

మలినీ గరుదనీక మలినీకృత ధునీ క

మలినీ సుఖిత కోకకులవధూక

మతికాంత సలతాంత లతికాంతర నితాంత

రతికాంత రణతాంత సుతనుకాంత

తే.

మకృత కామోద కురవ కావికల వకుల

ముకుల సకల వనాంత ప్రమోద చలిత

కలిత కలకంఠకుల కంఠకాకలీ వి

భాసురము వొల్చు మధుమాస వాసరంబు!

అష్ట సిద్ధులు

 అష్ట సిద్ధులు  - 


  హిమాలయాలలో , దక్షిణమున నల్లమల అడువుల్లోని శ్రీశైల శిఖర ప్రాంతాన గొప్ప గొప్ప యోగులు ఉన్నారు . వారికి తెలియని విద్యలు అంటూ ఏమి లేవు . వారు ఎలాంటి విద్యలు కలిగి ఉంటారో మీకు ఈ పొస్ట్ లొ వివరిస్తాను.


 * అణిమ -  


 అన్ని జంతువుల కంటే స్వల్ప జంతువు వలే కనపడుట . తన ఆకారం కంటే కొద్ది ఆకారం గల జీవము వలే యుండుట .


 * మహిమ -


 బ్రహ్మ , విష్ణు, శివుడు ఈ త్రిమూర్తులు కంటే పెద్దవాడిగా కనపడుట.


 * లఘిమ - 


 దూది కంటే తేలిక అయ్యి ఉండుట. యే మాత్రం బరువు లేకుండా ఉండుట . 


 * గరిమ - 


 బరువుగల సమస్త జీవములు, సమస్త పదార్దముల కంటే బరువు అయ్యి ఉండుట. 


 * ప్రాప్తి  - 


 కోరిన దానినేల్లా కలగ చేసుకొనుట . తనకే ఆకారం కావలెను అన్న ఆ ఆకారంని పొందుట. కొరిన చోటకేల్లా క్షణ మాత్రములో పోవుట , కొరిన వస్తువుని గాని జీవముని గాని తన యోద్దకి తెప్పించు కొనుట . 


 * ప్రాకామ్యము  - 


 ఆకాశ గమనము కలిగి యుండుట, తన శరీరం వదిలి త్రిలోక సుందరమగు యవ్వన శరీరము తాను కోరినంత కాలము పొంది యుండుట. 


 * వశిత్వము  - 


 సమస్త జంతువులను , దుష్ట మృగములను పెద్ద పులి,చిరుత పులి , సింహము, మదగజము మొదలగు అడివి జంతువులను మొసలి, తాంబేలు, చేప మొదలగు నీటి జంతువులను, సర్పములు మొదలగు వాటిని మచ్చిక చేసుకొనుట .


 * ఈశత్వము  - 


 కామ, క్రోధ, లోభ, మోహ , మధ, మాత్సర్యము అనెడు అరిషడ్వర్గములను జయించి ఆధ్యాత్మిక , బౌతికాది , ధైవికములు అనెడి తాపత్రయములు లేనివాడై జితేన్ద్రియుడై , భూత, భవిష్యత్ , వర్తమాన విషయాలను సర్వమును గ్రహించి ఈశ్వరుని వలే సృష్టి, స్థితి, లయములు లకు కారణ భూతుడు అగుట .


                 

              కాళహస్తి వేంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                      9885030034

9, డిసెంబర్ 2021, గురువారం

గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?📚

 📚ఇంట్లో దేవుని ప‌టాలు ఉండ‌గా గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?📚


ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు ‘గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?’ అనే సందేహం చాలా మందికి వ‌స్తుంది. దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది. 


నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక, మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్లొ నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్లతరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం గొప్పవిషయంగా చెబుతారు....

మార్గశిర మాసం ప్రారంభం

 _*రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం , మార్గశిర మాస విశిష్టత*_


ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో *మాసానాం మార్గశీర్షోహం* అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని బాగా తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే అని చెప్తూ ఉంటారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలు అవుతుంది. ఈ మాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.


శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇది అని అందరు చెప్తూ ఉంటారు.


పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. భక్తితో ఉపవాసం , జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం .... మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.


అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం , ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం లాంటిది అని తెలుస్తుంది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో , సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రాహ్మీమహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో , అదే విధంగా దేవతలకు బ్రాహ్మీముహూర్తమైన ఈ మాసమంతా దేవతలు , ఋషులు, యోగులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం , కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మివారం (గురువారం) , మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనవి.

............. 💐💐🌹🌹...........