5, సెప్టెంబర్ 2025, శుక్రవారం

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి

 

 దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి 

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత తెలియని తెలుగువారు వుండరు. నిజానికి పండిత పామరులకు ఎల్లప్పుడూ నాలుకమీద ఆడే సామెత ఇది.దీనిని సాధారణ సామాజిక అర్ధంలో యేమని అంటారంటే క్రమశిక్షణతో నిర్ణీత సమయంలో పనులు ముగించుకోవాలి. కాలం గడచినతరువాత వగచిన ప్రయోజనం లేదు. ఇంకా కొంచం వివరంగా చెప్పాలంటే సమయంలో చేయాల్సిన పనులు సమయంలోనే చేయాలి కానీ కాలయాపన చేయకూడదు. ఒక రైతు వర్షం రాగానే భూమి దున్ని పైరు వేయటానికి సిద్ధపడాలి, అదే కాలం దాటినదాకా కాలయాపన చేస్తే పైరు పండదు సరికదా పెట్టిన పెట్టుబడికూడా వృధా అవుతుంది

అసలు సామెత ఎలా పుట్టిందా అని ఆలోచిస్తే నాకు తట్టినది. పూర్వం కిరోసిన్ దీపాలు కూడా లేనప్పుడు అంటే అప్పుడు కరంట్ అస్సలు లేదనుకోవాలి. ఆముదంతో దీపాలు వెలిగించేవారట. చిన్న మట్టి ప్రమిదలో ఒకటో రెండో ప్రత్తివత్తులు వేసి ఆముదం పోసి దీపం వెలిగించేవారు. ఇప్పడు మనం దీపావళికి వెలిగిస్తున్నాము. అయితే దీపం ప్రమిదలో ఆముదం వున్నంతవరకు మాత్రం వెలుగుతూ ఉండేది. తరచూ దానిలోని ఆముదాన్ని చూసుకుంటూ రాత్రిపూట ఇంట్లో పనులు చేసుకునేవారు. అంటే వారు దీపం ఆరిపోకముందే అన్నీ పనులు ముగించుకొని మంచం మీదకు చేరాలి. అది వారి దిన చర్య. అంటే త్వర త్వరగా పనులు చేసుకోవాలి. సామెతను మనం ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా అన్వయించుకోవచ్చు

ప్రపంచం మొత్తం వెలుగుతో నిండి వున్నది వెలుగు మనకు పగటిపూట సూర్యభగవానులద్వారా వస్తున్నదన్నది అందరకు  తెలిసిన సత్యం. వెలుగు ఉంటేనే ప్రతి వస్తువు ప్రకాశిస్తుంది. వెలుగుతోటె మనకు మనముందు వున్న కుండ కుండగా, గ్లాసు గ్లాసుగా, మనిషి మనిషిగా కనిపించుతున్నాడు. మరి ఆలా కనిపిస్తున్నది ఎవరికి అని ప్రశ్నిస్తే నాకు అని సమాధానం ఇస్తాము నేను ఎవరు అని ఆలోచించి మన మేధావులు మనకు ఇచ్చిన సమాధానం నాలో వున్న నేను నేను అనే ప్రకాశం వలననే నేను నేనుగా బాసిల్లుతున్నాను( తెలియపడుతున్నాను) ప్రకాశాన్ని మన ఋషులు ఆత్మ అని ఆత్మ పరమాత్మ అంశమని మనకు తెలియపరిచారు. మన ఉపనిషత్తులు కూడా సత్యాన్నే తెలుపుతున్నాయి. "అహం బ్రహ్మస్మి' అనే మహా వాక్యము ఇంకా 'తత్వమసి' అనే మహావాక్యాలు విషయాన్నే తెలుపుతున్నాయి. ఒక సూర్యుడు నీరు వున్న అనేక కుండలలో అనేక సూర్యుళ్ళలాగా ఎలా కనపడుతున్నాడో అదేవిధంగా ఒక పరమాత్మా అనేక జీవులలో అనేక ఆత్మలుగా మనకు గోచరిస్తున్నాడు. ఆత్మే జీవులలో (మనుషులలో) వెలిగే ప్రకాశం లేక దీపంగా మనం అభివర్ణించవచ్చు. దీపం ఎంతసేపు వెలుగుతూ వుండాలని నిర్ధారించే ఆముదము మనిషి ఆయుష్షు గా మనం తెలుసుకోవచ్చు. ఏరకంగా అయితే మనం ఇంట్లో దీపం ఆరిపోకముందే ఇంటి కార్యాలన్నీ చక్కదిద్దుకుంటామో అదే విధంగా జీవుడు తనలోని దీపం (ఆయుష్షు) ఆరిపోకముందు తన జీవన వ్యాపారాలన్నీ ముగించుకోవాలి

నేను పుట్టింది శారీరిక సుఖాలను, భోగాలను అనుభవించటానికి కాదు ఇవన్నీ శరీరానికి సంబందించినవి, మరియు తాత్కాలికమైనవి అని ఎప్పుడైతే సాధకుడు తెలుసుకుంటాడో అప్పుడు అతని మనస్సు నిత్యం సత్యము, శాశ్వితము అయిన పరబ్రహ్మ సుఖం వైపు మళ్లుతుంది. అది తెలుసుకున్న ముముక్షువు మోక్షార్ధి అయి సాధన చేసి జీవైక్యం పొందుతాడు. అద్వితీయ అనుభవానికోసం ప్రతి సాధకుడు కృషిచేయాలి. సాధనాత్ సాధ్యతే సర్వం.

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ భార్గవ శర్మ 

గురువునకు వందనపంచకము

 గురుపూజోత్సవం సందర్భముగా...

🔯 *గురువునకు వందనపంచకము* 🔯



కం. 1

వాత్సల్యముతో గూడియు 

మత్సుతులని హృదయమందు మలినము లేకన్ 

కుత్సితబుద్ధుల సహితము 

సత్సంతుగ జేయువాడె సద్గురువిలలో 


కం. 2

మనముల తిమిరము దొలుగగ 

ఘనవిజ్ఞానము జొనుపుచు ఘనులుగ జేయన్ 

తన తపమును ననవరతము 

కొనసాగించెడి గురునిల కొలువగవలయున్ 


కం. 3

విద్యాబుద్ధుల నేర్పుచు 

సద్యోజ్ఞానము నొసగును చదువులబడిలో 

నుద్యద్యజ్ఞమె యవ నన 

వద్యుడు గురువు తెలియంగ వందితగుణుడౌన్ 


కం. 4

చదువుల నేర్పే క్రమమున 

ముదమారగ శిష్యుజేరి బోధించుటలో 

కదిలించు నాపదైనను 

విదిలించుకపోవు గురునకు వేవేలనతుల్ 


కం. 5

గురువే తల్లియు దండ్రియు 

గురువే దైవమ్ము లోకకోటులకెల్లన్ 

గురువే బ్రహ్మము ధర్మము 

గురువే మోక్షమ్ము వాని గొలిచెద సతమున్ 

*~శ్రీశర్మద*

ఇంకొక డాక్టరుని చూస్తా

 

 ఇంకొక డాక్టరుని చూస్తా 

ఒక పెద్దాయనకు రీనల్ ఫెయిల్యూర్, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, కార్డియాటిక్ మిసఫంక్షన్, లివర్ సోరోసిస్, మొదలైన వ్యాధులతో ఒక పెద్ద హాస్పిటల్లో చేరాడుఆయన చుట్టూ, కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవారాళ్ళు అందరు ఆయనకు సేవలు చేయటానికి  వచ్చారు. ఒక్కొక్క డాక్టరు వచ్చి ఒక్కొక్క రోగానికి చికిత్స చేస్తూ వున్నారు. ఎవరు మందులు ఇస్తున్నారో పాపం అక్కడ వున్న కొడుకులకు తెలియటంలేదు డాక్టర్ మందులు, ఇంజక్షన్లు తెమ్మంటే అవి తెచ్చి ఇస్తున్నారుఅప్పటికే హాస్పిటల్ బిల్లు డాక్టర్ల బిల్లులు లక్షలు దాటాయిఎప్పుడు క్షణాన వార్త వినవలసి వస్తుందో నని భయం భయంగా అందరు ఎదురు చూస్తూవున్నారు

ఆయనను చూసే అందరు డాక్టర్లు మీటింగు పెట్టుకొని చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే పెద్దాయన ఇంకొక గంట లేక గంటన్నర మాత్రం బతకగలడు అనే ఉమ్మడి నిర్ణయానికి వచ్చి రోగితో వచ్చిన కొడుకులకు విషయం చెప్పారు. మీరు కావాలంటే అయన ఎవరినయిన చూస్తానంటే పిలిపించండి అని చెప్పారుచిన్నగా వార్త పెద్దాయన కొడుకు  నాన్న నీవు ఇంకొక గంట మాత్రం బ్రతుకుతావు నీవు ఎవరినయినా చూడదలుచుకుంటే చెప్పు పిలిపిస్తాం అని అన్నారు మాట విన్న పెద్దాయన మాత్రం బెదరకుండా చిరునవ్వుతో నాయనా "నాకు ఇంకొక డాక్టరుని చూడాలని ఉందిరా" అని అన్నాడు. ఇది చదవటానికి నవ్వు వచ్చేదిగా  ఉంటుంది. కానీ ప్రతి మనిషి అలవరచుకోవలసిం లక్షణం అదే అదేమిటో చూద్దాం

ప్రతి మనిషి రెండిటితో ఎప్పుడు ముడివేసుకుని ఉంటాడు అదేమిటంటే సుఖము, దుఖ్ఖము. మనిషి ఆలోచనలు వాటి ఫలితాలు ఎప్పుడు రెండిటిలో ఏదో ఒకదానికి తావు ఇస్తాయి. అది యెట్లా అంటే నిన్ను ఎవరైనా మెచ్చుకొని, పొగిడారనుకో అప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది అంటే అది సుఖం అన్న మాటఅదే నిన్ను ఎవరైనా దూషించినా, కించపరచినా అవమానపరచిన వెంటనే నీకు కోపం వస్తుంది దాని పర్యవసానమే దుఃఖం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి మనిషి సదా రెండు మానసిక స్థితుల మధ్యనే ఉగిసలాడుతూ ఉంటాడు. దానివలన అనవసరపు ఆలోచనలు చివరకు అనేకవిధాల అనారోగ్య సమస్యలు వస్తూవుంటాయి. రెండిటిని సమతుల్యం చేయగల వానిని స్థితప్రగ్న్యుడు అంటారుప్రతి సాధకుడు స్థితప్రజ్ఞత సాదించాలి

ఒకమనిషి ఒక గంటలో చనిపోతాడు అని తెలిస్తే వెంటనే ఎంతో ఆందోళన భయం చెప్పలేని బాధ కలుగుతాయికానీ స్థితప్రజ్ఞత కలిగినవాడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలరు అదే పైన పెద్దాయన నిర్ణయంఇంతమంది డాక్టర్లు వైద్యం చేస్తున్న ఆయనకు స్వస్థతను చేకూర్చలేక పోయారు ఇంకొక డాక్టరు అయన ఆయనను బ్రతికిస్తాడనేది ఆశా వాదం. ప్రతి మనిషి ఆశావాదిగా మాత్రమే తన జీవితాన్ని గడపాలిఅప్పుడే జీవితాన్ని సాపీగా ఎలాంటి ఒడిదుడుకులనేనా ఎదుర్కొని ముందుకు సాగగలడు

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే చాలామంది సాధకులు ప్రారంభంలో నాకు ధ్యానం మీద మనస్సు లగ్నత కలగటం  లేదు నేను సాధనను కొనసాగించలేను అని చిన్న చిన్న అవరోధాలకు భయపడి సాధనను ప్రారంభంలోనే మానుకునే సాధకులు ఎందరోకానీ సాధకుడు అయితే ఎలాంటి అవరోధాన్ని అయినా ఎదుర్కొని ముందుకు సాగుతాడో అతనే మోక్షాన్ని పొందగలడు

మన మహర్షులు మనకు త్రివిధమైన అవరోధాలను తెలిపారు అవి 1) ఆద్యాత్మికం 2) అది భౌతికము 3) అధి దైవికము మూడు అవరోధాలను సాధకుడు అయితే ఎదుర్కొని తన సాధనను కొనసాగిస్తాడో సాధకుడు మాత్రమే మోక్షాన్ని చేరుకోగలడు

ఇప్పుడే దృఢ సంకల్పం తీసుకో ఎలాంటి అవరోధాలు ఎదురైనా నేను నా సాధనను నిలిపి వేయను. ప్రతి నిత్యం నేను నా మనస్సును పరమేశ్వరుని మీదనే నిలుపుతానుఎట్టి పరిస్థితిలోకూడా నేను నా దృష్టిని ఈశ్వరునిమీద నుంచి మరల్చనునేను అరిషడ్వార్గాన్ని పూర్తిగా నా స్వాధీనంలో ఉంచుకుంటానుఐహికమైన ఎటువంటి ప్రలోభాలకు నేను  లొంగను. అనే దృఢచిత్తంతో వున్న సాధకునికి మోక్షము కారతలామలకాలము అవుతుంది ఇది సత్యం

సాధకుడు ముందుగా దేహ వ్యామోహాన్ని వదలాలి అప్పుడే సాధనలో ముందుకు వెళ్లగలడు

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ