11, ఏప్రిల్ 2025, శుక్రవారం

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                    𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 

*ధర్మో వై భగవాన్ సతామధిపతిర్ధర్మం భజేత్సర్వదా*

*ధర్మేణైవ నివార్యతేఽఘనివహో ధర్మాయ తస్మై నమః|*

*ధర్మాన్నాస్తి పరం పదం త్రిభువనే ధర్మస్య శాంతిః ప్రియా*

*ధర్మో తిష్ఠతి సత్యమేవ శుభదం మా ధర్మ మాం వర్జయ 

     *భావం:*

*ధర్మమే నిజంగా భగవంతుడు, మరియు సద్గుణుల అధిపతి.*

*అందుచేత ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించాలి.*

*పాపాల ప్రవాహాన్ని నివారించగలది ధర్మం ద్వారానే, అటువంటి ధర్మానికి నేను నిత్యం నమస్కరిస్తున్నాను.*

*ఈ మూడు లోకాల్లో ధర్మానికి మించిన గొప్ప స్థానం లేదు*.

*ధర్మానికి శాంతి ప్రియమైనది, మరియు శుభప్రదమైనది సత్యమే.*

*ధర్మం సత్యములోనే నిలిచి ఉంటుంది. ఓ ధర్మా! నన్ను ఎప్పుడూ వదలవద్దు —నేను నిన్ను విడువను!*


 ✍️🌹💐🪷🙏

మహాభారతం సంబంధ 53 పుస్తకాలు

 *మహాభారతం సంబంధ 53 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

సంపూర్ణ ఆంధ్ర మహా భారతం(TTD వారి) www.freegurukul.org/g/Bharatham-1


సంపూర్ణ మహాభారతం(వచన) www.freegurukul.org/g/Bharatham-2


సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-3


వ్యావహారికాంధ్ర మహాభారతం-1 నుంచి 7 భాగాలు www.freegurukul.org/g/Bharatham-4


మహా భారత కథలు www.freegurukul.org/g/Bharatham-5


భారత రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-6


బాలానంద బొమ్మల భారతం www.freegurukul.org/g/Bharatham-7


ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు www.freegurukul.org/g/Bharatham-8


పంచమ వేదం-సంపూర్ణ మహాభారతం www.freegurukul.org/g/Bharatham-9


మహాభారత ధర్మ శాస్త్రము www.freegurukul.org/g/Bharatham-10


భారతము రాజనీతి విశేషాలు www.freegurukul.org/g/Bharatham-11


ఆంధ్రమహాభారతం-ధర్మతత్త్వం www.freegurukul.org/g/Bharatham-12


భారతం-1,2 www.freegurukul.org/g/Bharatham-13


ఆంధ్ర మహాభారతంలో వరాలు,శాపాలు - ఒక పరిశీలన www.freegurukul.org/g/Bharatham-14


మహా భారతంలో ఆదర్శ పాత్రలు www.freegurukul.org/g/Bharatham-15


ఆంధ్ర మహాభారతం-అమృతత్వ సాధనం www.freegurukul.org/g/Bharatham-16


మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-17


వేదవ్యాస మహాభారతము-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-18


వేదవ్యాస మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-19


వేదవ్యాస మహాభారతము-ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-20


మహాభారతము-అశ్వమేథ పర్వము www.freegurukul.org/g/Bharatham-21


మహాభారతము వచనము--అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-22


మహాభారతము వచనము--ఉద్యోగ పర్వము www.freegurukul.org/g/Bharatham-23


మహాభారతము వచనము--భీష్మ పర్వము www.freegurukul.org/g/Bharatham-24


మహాభారతము వచనము--సౌప్తిక పర్వము www.freegurukul.org/g/Bharatham-25


మహాభారతము వచనము--ఆశ్రమ-స్వర్గారోహణ పర్వము www.freegurukul.org/g/Bharatham-26


కథా భారతం-అరణ్య పర్వం www.freegurukul.org/g/Bharatham-27


ద్రోణ ప్రశస్తి www.freegurukul.org/g/Bharatham-28


శకుని www.freegurukul.org/g/Bharatham-29


భీముడు www.freegurukul.org/g/Bharatham-30


దృతరాష్ట్రుడు www.freegurukul.org/g/Bharatham-31


మహారధి www.freegurukul.org/g/Bharatham-32


బృహన్నల విజయము www.freegurukul.org/g/Bharatham-33


మహాభారత సాహిత్యం www.freegurukul.org/g/Bharatham-34


ఊర్జితారన్య పర్వము తిక్కనదే www.freegurukul.org/g/Bharatham-35


మహాభారత వైజ్ఞానిక సమీక్ష-ఆది పర్వము www.freegurukul.org/g/Bharatham-36


తిక్కన చేసిన మార్పులు ఓచిత్యపు తీర్పులు www.freegurukul.org/g/Bharatham-37


ధర్మ విజయము www.freegurukul.org/g/Bharatham-38


ఆంధ్ర మహాభారత పురాణం www.freegurukul.org/g/Bharatham-39


తిక్కన భారతము రసపోషణ www.freegurukul.org/g/Bharatham-40


మహా భారతంలో ప్రేమ కథలు www.freegurukul.org/g/Bharatham-41

భారతావతరణం www.freegurukul.org/g/Bharatham-42


ఆంధ్రమహాభారతం-ఔపదేషిక ప్రతిపత్తి www.freegurukul.org/g/Bharatham-43


ఆంధ్ర మహాభారతము - సూక్తి రత్నాకరము www.freegurukul.org/g/Bharatham-44


మహాభారతం మోక్షధర్మ పర్వం www.freegurukul.org/g/Bharatham-45


భీష్మ స్తవ రాజము www.freegurukul.org/g/Bharatham-46


వాసుదేవ కథాసుధ-4 వ భాగము www.freegurukul.org/g/Bharatham-47


ఆంధ్ర మహా భారతము- అరణ్య పర్వము-ఘోష యాత్ర www.freegurukul.org/g/Bharatham-48


మన్మహాభారతము ఉద్యోగ పర్వము -1 www.freegurukul.org/g/Bharatham-49


విరాట భారతి www.freegurukul.org/g/Bharatham-50  

సంపూర్ణ మదాంధ్ర మహాభారతము-పద్య-2 నుంచి 6 భాగాలు www.freegurukul.org/g/Bharatham-51


ఆంధ్ర మహాభారతము-సభా పర్వము www.freegurukul.org/g/Bharatham-52


ఆంధ్ర మహాభారతము-అరణ్య పర్వము www.freegurukul.org/g/Bharatham-53


మహాభారతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

వామనుడు త్రివిక్రముడైన విధానం

 🙏పోతన విశ్వ రూప సందర్శనము🙏

వామనుడు త్రివిక్రముడైన విధానం వర్ణించిన తీరు అద్భుతం. ఇది మూలంలో లేదు. పోతన మహాశయుడు సొంతంగా రచించి మనలకు కన్నులకు కట్టాడు.ఆ పద్యరాజములను చూద్దాము

.

శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

      నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

      నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

      నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై!!

ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద – కనీసం మొదటి లైను ఐనా – నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన. చేతులతో అభినయంచకుండా ఈ పద్యం బోధించలేము.చేతులతో చూపిస్తూ ముఖం ఆకాశము వైపు ఎత్తవలసినదే.

ఇంతైనాడు, మరిం తైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుని దాటి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినాడు, చూస్తుండగానే సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా బ్రహ్మాండ భాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పద పదానికీ పెరుగుతూపోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి. ఈ పద్యం మనసున పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక గ్రాఫిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది. నిజం చెప్పాలంటే 

కెమెరాలో చిత్రించి చూపించాడు. ఇంతటితో సంతృప్తి చెందలేదు. ఇంకా వివరించాలి అనుకున్నాడు 

ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, కంఠా భరణంగానూ, బంగారు భుజ కీర్తులు లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.ఈ పద్యం లో మన దృష్టి సూర్యునిపై కేంద్రీకరింప జేశాడు మీరు సూర్యుణ్ణే చూడమన్నాడు సూర్య బింబము ఎలా మారుతోందో చక్కగా చిత్రీకరించాడు 

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్

మహానుభావుడు పోతన. భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు గుండెలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ అలవోకగా జేరిపోయి ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సాహిత్య విశేషాలు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు. 🌹 తిరుపతి వెంకట కవులు అవధాన విద్యను ఔపోసన పట్టిన మహా పండిత కవులు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులలో అగ్రగణ్యులు. వారు అవధానాలలో చూపిన విద్వత్ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు సోదాహరణంగా వివరించారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు. చక్కని గాన మాధుర్యంతో వేణు గారు వివరించిన సాహిత్య విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

అర్హతలేంటో

 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


ఎవరు దాత?


కాలగర్భంలో కలిసిపోయే వారికి, చరిత్రలో నిలిచిపోయేవారికి ముఖ్యమైన తేడాల్లో ఒకటి- దాతృత్వం! స్వభావరీత్యా దాతలైనవారిని లోకం గౌరవిస్తుంది. ఆప్యాయంగా కొలుస్తుంది, ఆదర్శంగా భావిస్తుంది. అలనాటి శిబిచక్రవర్తి నుంచి మనం దానం ఏదైనా అందుకొన్నామా? కలియుగ డొక్కా సీతమ్మ పెట్టిన అన్నం ఎప్పుడైనా తిన్నామా? అయినా ఇప్పటికీ వారి గురించి చెప్పుకొంటున్నామంటే- వారి దానశీలతే అందుకు కారణం. ఈ లోకం ప్రత్యేకత ఏంటంటే- మనం చెప్పిన మంచి మాటలను బట్టి కాకుండా, చేసిన మంచి పనులను బట్టి మన గొప్పదనాన్ని అంచనా వేస్తుంది. కాబట్టి మనల్ని శాశ్వతంగా నిలబెట్టేవి శిలా విగ్రహాలు కావు- శీల స్వభావాలు!


పెట్టు బుద్ధిని పుట్టుబుద్ధిగా కలిగినవారు స్వభావరీత్యా మంచి దాతలవుతారు. శాస్త్రం ఆ స్వభావాన్ని గురించి చెబుతూ- శ్రియాదేయం, ప్రియా దేయం, భియాదేయం... అనే మూడు లక్షణాలను చెప్పింది. దానం చేయడంపట్ల ఒక అవగాహనతో తన స్తోమతకు తగినట్లుగా సంతో షంగా దానం చేయడాన్ని శ్రియాదేయం అంటారు. 'అలాంటి అవగాహన, స్తోమత రెండూ ఉండి కూడా- దాన సంకల్పం లేనివారు ఈ భూమికే భారం' అన్నాడు శృంగారనైషధంలో శ్రీనాథుడు. దానం చేయడంపట్ల ఆసక్తి, అవగా హన ఉన్నా- పదిమందీ దాన్ని గుర్తించాలనే యావ ఏమాత్రం కూడదంది మహాభారతం. ఎంతో ఇస్తున్నా- ఇంతే ఇవ్వగలిగానని సిగ్గుప డుతూ దానం చేయడం ప్రియాదేయమనే మాటకు తాత్పర్యం. ముఖ్యంగా పండితులకు ఇచ్చేటప్పుడు- వారికి ఇవ్వడానికి తనకో అవకాశం దక్కిందన్న కృతజ్ఞతాభావంతోను, వారి విద్వత్తుకు తగినంతగా ఇవ్వలేకపోతున్నామనే న్యూనతాభావంతోను దానం చేయడం ప్రియా దేయం అవుతుంది. ఆ రెండింటికన్నా ముఖ్యమైన మూడోది- భియాదేయం. అంటే భయపడుతూ దానం చేయడం. తాను చేస్తున్న దానంలో అక్రమంగా ఆర్జించిన సొత్తు లేశమైనా కలగలిసిపోయిందేమోనన్న భయంతో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి. అయాచితంగానో అన్యాయంగానో వచ్చి చేరిన సొత్తును కాకుండా న్యాయార్జితమైన సొమ్మునే దానం చేయాలని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. కామ్యకవనంలో అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వేదవ్యాస మహర్షి వెళ్తాడు. ఆ సందర్భంలో 'అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేయడం అవివేకం... దానివల్ల పుణ్యఫలం ఏ మాత్రం దక్కదు' అని ధర్మరాజుతో చెబుతాడు. అక్రమంగా ఆర్జించిన ధనాన్ని తెచ్చి దేవుడికిచ్చే వారంతా గ్రహించాల్సిన పరమసత్యాన్ని వ్యాసుడు ఆనాడే వెల్లడించాడు.

శ్రియాదేయం ప్రియాదేయం భియాదేయం... మూడింటినీ ఎరిగి, త్రికరణశుద్ధిగా దానం చేసినవారికి దానఫలం తప్పక లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చేయడా నికి తగినంత స్తోమతను ఇచ్చినందుకు భగవంతుడికి, స్వీకరించడానికి తగిన యోగ్య తను కలిగినందుకు దానస్వీకర్తకు- దాత కృతజ్ఞుడై ఉండాలని బోధించాయి. అంతే కాదు, ఇచ్చాక... ఇచ్చినందుకు చింతించినా, ఇచ్చానని గర్వంగా ప్రకటించినా- దాన ఫలం దక్కదు సుమా... అంటూ భారతం ఆనుశాసనిక పర్వం హెచ్చరించింది. దాతలమని చెప్పుకోవడానికి మనకున్న అర్హతలేంటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

మనసుకు దూరంగా!

 శీర్షిక..మనసుకు దూరంగా!


ఏమై పోతున్నాడు మనిషి? 

ఎటు పోతున్నాడు? మతి గతి తప్పుతూ

స్వార్ధం నిండిన రొచ్చులో కూరుకుపోతూ 

అత్యాశల కోర్కెలతో కష్టాల పాలవుతూ 

నీకు నీవె మంటల్లో చితి పేర్చుకుంటున్నావ్..


ఓ మనిషీ!

నవ యుగానికి నాందిగా నిలిచావు 

వైజ్ఞానిక యుగమంటూ

మేథా శోధనకు పదును పెట్టావు 

మనిషి సాధించలేనిదంటూ ఏమీ లేదని 

పంచభూతాలూ నా వశమంటూ 

ఆకాశం హద్దుగా పైపైకి ఎగిరావు 

నిన్ను నీవే మరమనిషిగా మార్చేసుకున్నావు..


అణువణువునీ శోధించావు 

అణుబాంబులను సృష్టించావు 

రాముని క్షేత్రాన్ని రణక్షేత్రంగా మార్చేసావు 

రక్తపు ధారలను ప్రవహింపజేస్తున్నావు 

విరుద్ధ వైషమ్య భావాలతో నిన్ను నీవే చంపేసుకుంటున్నావ్..


నింగికి నేలకు వంతెన లేసి 

లోకాన్ని జయించానని అనుకుంటున్నావు

భూగోళాన్ని చుట్టేస్తున్నావు 

ఆగని పయనం, ప్రగతికి దారులు వేస్తున్నా 

ఈర్ష్యా ద్వేషాలతో మనస్సులను చంపేస్తూ

యంత్రాల పనిముట్టులా మారిపోతున్నావు 

*ఆలోచించు! పయనం ప్రపంచమంతా*

*హృదయం మాత్రం అతి కాలుష్యంతో*


మరిచి పోతున్నావు..శాంతీ సౌహార్ద్రభావాలను

నీతీ-రీతి..నిజాయితీని నవ్వుల పాల్జేస్తూ

అగాథంలో పడి నీ ఉనికిని కోల్పోతున్నావు..


ఇకనైనా గుర్తించు, బేధాలెంచని సహకారమె

నీ సొత్తని..కలిసుంటే నే కలదు సుఖమని 

సమతా మమతా నిండినళ మానవతా తత్వమె

నీ మనుగడకు సిద్ధాంతమని..

.......................................................

ఇది నా స్వీయ కవిత

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷శుక్రవారం 11 ఏప్రిల్ 2025🪷*


            *రామాయణం*

ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది.


       *వాల్మీకి రామాయణం*

              *5 వ  భాగం*

                    

*తతః చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ।*

*నక్షత్రే అదితి దైవత్యే స్వ ఉచ్ఛ సంస్థేషు పంచసు॥*

*గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా ఇందునా సహ ।*

*ప్రోద్యమానే జగన్నాథం సర్వ లోక నమస్కృతం ॥*

```

జగన్నాధుడైన వాడు, సర్వలోకాల చేత నమస్కరింపబడే వాడు 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి,చైత్రమాసంలో, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. 

అదే సమయంలో కైకేయకి పుష్యమి నక్షత్రంలో, మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. తరువాత సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు.

తనకి నలుగురు కుమారులు పుట్టారని తెలిసి ఆ దశరథుడు చాలా ఆనందపడ్డాడు. కోసల దేశంలోని ప్రజలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో బ్రహ్మ గారు దేవతలతో ఒక సభ తీర్చారు....     “శ్రీమహా విష్ణువు భూలోకంలో      రాముడిగా అవతరించారు, రావణసంహారంలో రాముడికి సహాయం చెయ్యడానికి మీరు మీ అంశలతో  కొంతమందిని సృష్టించండి. పార్వతీదేవి శాపం వల్ల మీకు మీ భార్యలవల్ల సంతానం కలగదు, కావున మీతో సమానమైన తేజస్సు, పరాక్రమము కలిగిన వానరాలని గంధర్వ, అప్సరస, కిన్నెర స్త్రీలందు కనండి” అని చెప్పారు. 


దేవతలందరూ రామకార్యం కోసం పుట్టడం మన అదృష్టమని ఆనందపడ్డారు.


అప్పుడు బ్రహ్మ “ఒకసారి నాకు ఆవలింతవచ్చింది, అప్పుడు నా నోట్లోనుంచి ఒకడు కిందపడ్డాడు, అతనే జాంబవంతుడు. ఇక మీరు సృష్టించండి” అని అన్నారు. 


ఇంద్రుడి అంశతో వాలి జన్మించాడు, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మించాడు, బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు, కుబేరుడి అంశతో గంధమాదనుడు జన్మించాడు, అశ్విని దేవతల అంశతో మైందుడు, ద్వివిదుడు జన్మించారు, అగ్ని అంశతో నీలుడు జన్మించాడు, వాయువు అంశతో  హనుమంతుడు జన్మించాడు, పర్జన్యుడికి శరభుడు, వరుణుడికి సుషేణుడు జన్మించారు. దేవతలు ఇలా సృష్టించడం చూసిన ఋషులు మేము కూడా సృష్టిస్తాం అని     కొన్ని కోట్ల కోట్ల వానరాలని సృష్టించారు.```


*అతీత్య ఏకాదశ ఆహం తు నామ కర్మ తథా అకరోత్।*

*జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీ సుతం॥*

*సౌమిత్రిం లక్ష్మణం ఇతి శత్రుఘ్నం అపరం తథా।*

*వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా॥*``` 


రాముడు పుట్టిన 11 రోజులకి జాతాసౌచం పోయాక ఆయనకి నామకరణం చేయించారు కులగురువైన వశిష్ఠ మహర్షి, సర్వజనులు ఆయన గుణములు చూసి పొంగిపోయెదరు కనుక ఆయనకి రామ (రా అంటే అగ్ని బీజం, మ అంటే అమృత బీజం) అని, సుమిత్ర కుమారుడైన సౌమిత్రి అపారమైన లక్ష్మి సంపన్నుడు (రామ సేవే ఆయన లక్ష్మం) కనుక  ఆయనకి లక్ష్మణ అని, కైకేయ కుమారుడు భరించే గుణము కలవాడు కనుక ఆయనకి భరత అని,    శత్రువులను(అంతః శత్రువులు) సంహరించగలవాడు కనుక శత్రుఘ్ను అని నామకరణం చేశారు వశిష్ఠ మహర్షి.


తన కుమారులు పెరిగి పెద్దవారవుతుంటే    వాళ్ళని చూసుకొని దశరథుడు ఎంతో మురిసిపోయాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడు గురువులని పూజించేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రిగారికి సేవ చేసేవాళ్ళు. రాముడు జులపాల జుట్టుతో   రాజమార్గంలో వెళుతుంటే చూసిన దశరథుడికి తను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో రాముడు కూడా అలానే ఉన్నాడనిపించేది. అలా లేక లేక పుట్టిన పిల్లలని చూసుకుంటూ ఆ రాజదంపతులు హాయిగా కాలం గడిపారు.


అలా కొంతకాలం గడిచాక, ఒకనాడు దశరథ మహారాజు సభలో ఇలా అన్నారు… “నా పిల్లలకి 12సంవత్సరాల వయస్సు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, కాబట్టి వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను, తగిన సంబంధాలని వెతకమని దశరథుడు అంటుండగా ఆ సభలోకి ఎవరూ అనుకోని విధంగా విశ్వామిత్రుడు వచ్చాడు. 

వెంటనే దశరథుడు లేచి ఆయనకి ఎదురొచ్చి స్వాగతం పలికాడు. “మీరు    మా రాజ్యానికి రావడం మా అదృష్టం, మీలాంటి గొప్ప మహర్షులు ఊరకనే రారు, కాబట్టి మీ కోరికేదైన నేను సంతోషంగా తీరుస్తాను” అని దశరథుడు అన్నాడు.


అప్పుడు విశ్వామిత్రుడు “దశరథ! నీకు సామంత రాజులందరూ లొంగి ఉన్నారా, దానధర్మాలు సక్రమంగా చేస్తున్నావా, మంత్రులందరూ నీకు సాచివ్యం చేస్తున్నారా?” అని పలు కుశల ప్రశ్నలు వేసి, “నాకు ఒక కోరిక ఉంది, నువ్వు తీర్చాలి” అన్నాడు.```


*స్వ పుత్రం రాజ శార్దూల రామం సత్య పరాక్రమం।*

*కాక పక్ష ధరం శూరం జ్యేష్ఠం మే దాతుం అర్హసి॥*```


“నీ పెద్దకొడుకైన రాముడిని నాతో పంపిస్తావా,మా యాగాలకి అడ్డువస్తున్న రాక్షసులని వధించడానికి తీసుకు వెళతాను,” అని విశ్వామిత్రుడు అన్నాడు. 


ఈ మాట విన్న దశరథుడు కిందపడిపోయాడు.```


*ఊన షోడశ వర్షో మే రామో రాజీవ లోచనః।*

*న యుద్ధ యోగ్యతాం అస్య పశ్యామి సహ రాక్షసైః॥*```


మెల్లగా తేరుకొన్న దశరథుడు, “ఇంకా 16 సంవత్సరాలు కూడా నా రాముడికి రాలేదు, ఆ రాక్షసులని ఎలా సంహరించగలడు, కావాలంటే నేను నా చతురంగ బలాలతో వచ్చి ఆ రాక్షస సంహారం చేస్తాను, పోనీ రాముడే రావాలంటే, రాముడితో నేను కూడా వస్తాను.” అని దశరథుడు ప్రాధేయపడ్డాడు.


“రాముడు పిల్లవాడు, ఏమిచెయ్యలేడు అని నువ్వు అనుకుంటున్నావు, కాని రాముడంటే ఎవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు. రాముడు రాక్షసులను వధించి తప్పక తిరిగివస్తాడు. నువ్వు తండ్రివి కనుక, నీకు రాముడిమీద ఉన్న పుత్రవాత్సల్యంవల్ల నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, రాముడిని నాతో పంపించు!” అని విశ్వామిత్రుడు అడిగాడు.


అప్పుడు దశరథుడు “లేక లేక పుట్టిన   నా కొడుకుని, నన్ను విడిచిపెట్టు” అన్నాడు. 


ఈ మాటలు విన్న విశ్వామిత్రుడుకి ఆగ్రహం వచ్చి, “చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోలేక, మాట తప్పిన ధర్మం తెలియని దశరథా, పుత్ర పౌత్రాదులతో సుఖముగా, శాంతిగా జీవించు!” అని వెళ్ళిపోతున్నాడు. 


వెంటనే వశిష్ఠుడు లేచి, విశ్వామిత్రుడిని కూర్చోమని చెప్పి దశరథుడితో ఇలా అన్నాడు…  “ఇంత కాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడవని అనిపించుకున్నావు. ఇప్పుడు ఆడిన మాట తప్పి, దశరథుడు అధర్ముడు, మాట తప్పినవాడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరో తెలుసా..?```


*ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం వరః ।*

*ఏష విద్య అధికో లోకే తపసః చ పరాయణం॥*```


“ఈ లోకంలోని ధర్మం అంతా విశ్వామిత్రుడు, ఈ లోకంలోని తపస్సు అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు,     ఈ లోకంలోని బుద్ధి అంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు,శివుడి అనుగ్రహంగా ఆయనకి ధనుర్వేదం మొత్తం భాసించింది, కావున ఆయనకి ఈ లోకంలో ఉన్న అన్ని అస్త్ర-శస్త్రాలు తెలుసు. ఇన్ని తెలిసిన విశ్వామిత్రుడు తనని తాను రక్షించుకోగలడు. కాని రాముడికి ఆ కీర్తి దక్కాలని, తనకి తెలిసిన సమస్త విద్యలు రాముడికి ధారపొయ్యాలని ఆయన ఆశ,      ఎందుకు అడ్డుపడతావు?” అని అన్నాడు.


దశరథుడు అంతఃపురంలోకి వెళ్లి “రాముడిని తీసుకురా” అని కౌసల్యతో చెప్పాడు. 


రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. 


స్వస్తి వాచకం చేసి, కౌసల్య రాముడిని పంపింది. 


సభలోకి వచ్చిన రాముడిని అక్కడున్న ఋషులందరూ ఆశీర్వదించారు. 


దశరథుడు రాముడి మూర్ధ్ని భాగం మీద ముద్దు పెట్టాడు. చాలా సంతోషంతో…  “నా కొడుకుని మీ చేతులలో పెడుతున్నాను,  మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి.” అని విశ్వామిత్రుడితో చెప్పాడు. 


“విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి” అని రాముడితో చెప్పి సాగనంపాడు. 


అలా విశ్వామిత్రుడి వెనక రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరారు.```


*రేపు... 6వ భాగం*


*🚩జై శ్రీరామ్.!   జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

.

శుక్రవారం🌹* *🪷11, ఏప్రిల్, 2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      *🌹శుక్రవారం🌹*

*🪷11, ఏప్రిల్, 2025🪷*

   *దృగ్గణిత పంచాంగం*                  


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - శుక్లపక్షం*


*తిథి : చతుర్దశి* రా 03.21 వరకు ఉపరి *పూర్ణిమ*

*వారం    : శుక్రవారం*

(భృగువాసరే)

*నక్షత్రం : ఉత్తర* మ 03.10 వరకు ఉపరి *హస్త*


*యోగం  : ధ్రువ* రా 07.46 వరకు ఉపరి *వ్యాఘాత*

*కరణం : గరజి* మ 02.09 *వణజి* రా 03.21 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం : *ఉ 07.08 - 08.55*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.33*


*వర్జ్యం : రా 12.36 - 02.24*

*దుర్ముహూర్తం : ఉ 08.24 - 09.14 మ 12.33 - 01.23*

*రాహు కాలం : ఉ 10.35 - 12.08*

గుళికకాళం : *ఉ 07.28 - 09.02*

యమగండం : *మ 03.15 - 04.49*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.55* 

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.55 - 08.25*

సంగవ కాలం         :      *08.25 - 10.54*

మధ్యాహ్న కాలం  :      *10.54 - 01.23*

అపరాహ్న కాలం   : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి        : చైత్ర శుద్ధ చతుర్దశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.22*

ప్రదోష కాలం         :  *సా 06.22 - 08.40*

రాత్రి కాలం : *రా 08.40 - 11.45*

నిశీధి కాలం          :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం🪷*


 *నమఃక్షీరాబ్ధితనయే* *నమస్త్రైలోక్యధారిణి*

*శశివక్త్రేనమస్తుభ్యం* *రక్షమాంశరణాగతం*     

   

*🪷ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

Panchang



 

11.04.2025, శుక్రవారం

 *🙏జై శ్రీమన్నారాయణ🙏*

*🙏జై శ్రీమన్నారాయణ🙏*

11.04.2025, శుక్రవారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - వసంత ఋతువు

చైత్ర మాసం - శుక్ల పక్షం

తిథి:చతుర్దశి రా2.32 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:ఉత్తర మ2.53 వరకు

యోగం:ధృవం రా7.32 వరకు

కరణం:గరజి మ1.46 వరకు

తదుపరి వణిజ రా2.32 వరకు 

వర్జ్యం:రా12.05 - 1.50

దుర్ముహూర్తము:ఉ8.18 - 9.07 మరల మ12.24 - 1.14

అమృతకాలం:ఉ7.06 - 8.50

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:మీనం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:5.51

సూర్యాస్తమయం:6.10



ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు.


ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు గత 20 ఏళ్లలో మూడో వంతు తగ్గింది. అయినా, ప్రసూతి సంబంధిత సమస్యలతో ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఎ) నివేదిక గతంలో వెల్లడించింది. ప్రసూతి మరణాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ సైతం ఒకటి. గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయంలో లేదా బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం 42 రోజుల్లో స్త్రీ ప్రాణాలు కోల్పోతే ప్రసూతి మరణంగా డబ్ల్యూహెచ్ఎ పరిగణిస్తోంది. ఒక ఏడాదిలో ప్రతి లక్ష సజీవ శిశు జననాల్లో జరిగే మాతృ మరణాలను వార్షిక ప్రసూతి మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్)గా చెబుతారు.


*ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని, ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు!*

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - వసంత ఋతువు

చైత్ర మాసం - శుక్ల పక్షం

తిథి:చతుర్దశి రా2.32 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:ఉత్తర మ2.53 వరకు

యోగం:ధృవం రా7.32 వరకు

కరణం:గరజి మ1.46 వరకు

తదుపరి వణిజ రా2.32 వరకు 

వర్జ్యం:రా12.05 - 1.50

దుర్ముహూర్తము:ఉ8.18 - 9.07 మరల మ12.24 - 1.14

అమృతకాలం:ఉ7.06 - 8.50

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:మీనం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:5.51

సూర్యాస్తమయం:6.10



ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు.


ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు గత 20 ఏళ్లలో మూడో వంతు తగ్గింది. అయినా, ప్రసూతి సంబంధిత సమస్యలతో ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఎ) నివేదిక గతంలో వెల్లడించింది. ప్రసూతి మరణాలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ సైతం ఒకటి. గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవ సమయంలో లేదా బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం 42 రోజుల్లో స్త్రీ ప్రాణాలు కోల్పోతే ప్రసూతి మరణంగా డబ్ల్యూహెచ్ఎ పరిగణిస్తోంది. ఒక ఏడాదిలో ప్రతి లక్ష సజీవ శిశు జననాల్లో జరిగే మాతృ మరణాలను వార్షిక ప్రసూతి మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్)గా చెబుతారు.


*ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని, ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు!*