18, సెప్టెంబర్ 2021, శనివారం

ఈరోజు_శనిత్రయోదశి_విశేషం

 *శనివారం, సెప్టెంబర్ 18, 2021*


🕉️🍁🕉️🍁🕉️🍁🕉️🍁 *ఈరోజు_శనిత్రయోదశి_విశేషం*


రేపటి దినము చాలా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రయోదశి శనివారంతో కలిసిరావడం. 

మనము శని దేవుడిని కేవలం శని అని పిలవము. *శనీశ్వరుడు* అంటాము. అంటే ఆయన ఈశ్వర స్వరూపమైన గ్రహంగా భావిస్తాము. అలాంటి ఈశ్వర స్వరూపమైన శని ని ఈ పవిత్ర దినమున పూజించిన వారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అనడంలో సందేహంలేదు. ఉదయం శనీశ్వరుడిని ప్రదోషంలో ఈశ్వరుడిని ఒకేదినములో పూజించిన వారికి కష్టాలు తప్పినట్లే !

 రేపు అవకాశం ఉంటే ఉదయం శనికి తైలాభిషేకం, ప్రదోషంలో శివుడికి రుద్రాభిషేకం చేయించండి.

వీలుంటే హోమం నల్లనువ్వులు కిలో మరియు నలుపు వస్త్రము దానం చేయడం మంచిది.


రేపు మీరు చదువుకోవలసిన స్తోత్రం💐

కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో౹ యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:౹౹


ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం !!


*శని జపం చేసుకునే విధానం*

( *ఇది వేదం అర్హులైన వారికి మాత్రమే*)

అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః౹ శనైశ్చర

గ్రహోదేవతా౹ ఉష్టిప్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే౹

శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః౹౹


#కరన్యాసం

ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః

ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః

ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః

ఓం శంవాతః - అనామికాభ్యాం నమః

ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః

ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః #అంగన్యాసము:

ఓం శమగ్ని: - హృదయాయ నమః

ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ

ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్

ఓం శంవాతః - కవచాయహు

ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్

ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్

ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం

ఓం శమగ్ని -- శ్రిదః !!


#వ్యాస_ప్రోక్త_సోత్రం (అందరూ చదువుకోవచ్చు)

నీలాంజన సమాభాసం౹ రవిపుత్రం యమాగ్రజం౹౹ 

ఛాయా మార్తాండ సంభూతం౹ తం నమామి శనైశ్చరం౹౹


*శని కవచ స్తోత్రము*

 శనైశ్చరశ్శిరో రక్షేత్! ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు!


నేత్రే సర్వ భయంకరః!! కృష్ణాంగో నాసికాం రక్షేత్! కర్ణౌ మేచ శిఖండిజ:! భుజౌమే సుభుజః పాతు!


హస్తా నీలోత్పల ప్రభః! పాతుమే హృదయం కృష్ణ:! కృక్షిం శుష్కోధర స్తధాః! కటిం మే వికటః పాతు!


ఊరూ మే ఘోర రూపవాన్! జానునీ పాతు దీర్ఘోమే! జంఘేమే మంగళ ప్రభః! గల్పౌ గణాకరః పాతు!


పాదౌ మే మంగుపాదకః! సర్వాణిచ మామాచంగాని! పాతు భాస్కరనందనః!


*ఫలశ్రుతి*

య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్!


శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః!


నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః!! స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం!


షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం!!


#శన్యష్టోత్తర_శతనామావళి 

ఓం శనైశ్చరాయ నమః 

ఓం శాంతాయ నమః

ఓం శరణ్యాయ నమః 

ఓం వరేణ్యాయ నమః 

ఓం సర్వేశాయ నమః

ఓం సౌమ్యాయ నమః 

ఓం సురవంద్యాయ నమః 

ఓం సురలోక విహారిణే నమః

ఓం సుఖాననోవిష్టాయ నమః 

ఓం సుందరాయ నమః 

ఓం ఘనాయ నమః

ఓం ఘనరూపాయ నమః 

ఓం ఘనాభరణధారిణే నమః 

ఓం ఘనసారవిలేపాయ నమః

ఓం ఖద్యోతాయ నమః 

ఓం మందాయ నమః 

ఓం మందచేష్టాయ నమః

ఓం మహనీయగుణాత్మనే నమః ఓం మర్త్యపావనపాదాయ నమః

ఓం మహేశాయ నమః 

ఓం ఛాయాపుత్త్రాయ నమః 

ఓం శర్వాయ నమః

ఓం శ్రతూణీరధారిణే నమః 

ఓం చరస్థిరస్వభావాయ నమః 

ఓం చంచలాయ నమః

ఓం నీలవర్ణాయ నమః 

ఓం నిత్యాయ నమః 

ఓం నీలాంబసనిభాయ నమః

ఓం నీలాంబరవిభూషాయ నమః ఓం నిశ్చలాయ నమః 

ఓం వేద్యాయ నమః

ఓం విధిరూపాయ నమః 

ఓం విరోధాధార భూమయే నమః

ఓం వేదాస్పదస్వాభావాయ నమః ఓం వజ్రదేహాయ నమః 

ఓం వైరాగ్యదాయ నమః

ఓం వీరాయ నమః 

ఓం వీతరోగభయాయ నమః 

ఓం విపత్పరంపరేశాయ నమః

ఓం విశ్వనంద్యాయ నమః 

ఓం గృద్రహహాయ నమః 

ఓం గుధాయ నమః

ఓం కూర్మాంగాయ నమః 

ఓం కురూపిణే నమః 

ఓం కుత్సితాయ నమః

ఓం గుణాధ్యాయ నమః 

ఓం గోచరాయ నమః 

ఓం అవిద్యామూలనాశాయ నమః

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః ఓం ఆయుష్యకారణాయ నమః 

ఓం ఆపదుద్దర్త్రే నమః

ఓం విష్ణుభక్తాయ నమః 

ఓం వశినే నమః 

ఓం వివిధాగమనేదినే నమః

ఓం విధిస్తుత్యాయ నమః 

ఓం వంద్యాయ నమః 

ఓం విరూపాక్షాయ నమః

ఓం వరిష్టాయ నమః ఓం వజ్రాంకుశధరాయ నమః 

ఓం వరదాయ నమః

ఓం అభయహస్తాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం జేష్టాపత్నీసమేతాయ నమః

ఓం శ్రేష్టాయ నమః 

ఓం అమితభాషిణే నమః 

ఓం కస్టౌఘనాశకాయ నమః

ఓం ఆర్యపుష్టిదాయ నమః 

ఓం స్తుత్యాయ నమః 

ఓం స్తోత్రగమ్యాయ నమః

ఓం భక్తివశ్యాయ నమః 

ఓం భానవే నమః 

ఓం భానుపుత్త్రాయ నమః

ఓం భావ్యాయ నమః 

ఓం పావనాయ నమః 

ఓం ధనుర్మందల సంస్థాయ నమః

ఓం ధనదాయ నమః 

ఓం ధనుష్మతే నమః 

ఓం తనుప్రకాశ దేహాయ నమః

ఓం తామసాయ నమః 

ఓం అశేషజనవంద్యాయ నమః 

ఓం విశేషఫలదాయినే నమః

ఓం వశీకృతజనిశాయ నమః 

ఓం పశూనాంపతయే నమః 

ఓం ఖేచరాయ నమః

ఓం ఖగేశాయ నమః 

ఓం ఘననీలాంబరాయ నమః 

ఓం కాఠిన్యమానసాయ నమః

ఓం అరణ్యగణస్తుత్యాయ నమః ఓం నీలచ్చత్రాయ నమః 

ఓం నిత్యాయ నమః

ఓం నిర్గుణాయ నమః 

ఓం గుణాత్మనే నమః 

ఓం నిరామయాయ నమః 

ఓం నింద్యాయ నమః

ఓం వందనీయాయ నమః 

ఓం ధీరాయ నమః 

ఓం దివ్యదేహాయ నమః 

ఓం దీనార్తి హరణాయ నమః

ఓం దైన్య నాశకరాయ నమః 

ఓం ఆర్యజనగణణ్యాయ నమః 

ఓం క్రూరాయ నమః

ఓం క్రూరచేష్టాయ నమః 

ఓం కామక్రోధకరాయ నమః 

ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః

ఓం పరిపోషితభక్తాయ నమః 

ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః 

ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః


*శని దశనామ స్తోత్రము *

కోనస్తో పింగళ బబ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః


*దశరథ శని స్తోత్రము* 

కోనంతకో రౌద్ర యమాతః బబ్రుః కృష్ణః శనిః పింగళ మందః శౌరీః నిత్య స్మ్రుత్యో హరతే చ పీడః తస్మై నమః శ్రీ రవినందనయా॰


సురా అసురా కింపురుష రాజేంద్ర గంధర్వ విద్యాధర పన్నగాశ్చ పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰


నర నరేంద్ర పశవో మృగేంద్ర వన్యాశ్చ యే కీట పతంగ బ్రింగాః పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰


దేశాచ దుర్గాని వనాని యత్ర శేనానివేశ పుర పట్టణాని పీఢ్యంతి సర్వే విషమ స్థితేన తస్మై నమః శ్రీ రవినందనయా॰


తిలైర్యవైర్మశా గుదాన్నదానై అయోహీన నీలాంబర దానతోవా ప్రీనతి మన్త్రైర్నివాశరేచ తస్మై నమః శ్రీ రవినందనయా॰


ప్రయాగ కూలే యమునా తటేచ సరస్వతీ పుణ్యజలే గుహాయం యో యోగినం ధ్యానగతోపి శూక్ష్మాశ్ తస్మై నమః శ్రీ రవినందనయా॰


అన్య ప్రదేశాత్ స్వగృహం ప్రవిష్తాశ్ తదీయవరేశా నర సుఖేశాత్ గృహద్ గతో యో న పునః ప్రయాతి తస్మై నమః శ్రీ రవినందనయా॰


స్రష్ట స్వయంభూర్ భువన త్రయస్య త్రత హరీశో హరతే పినాకీ ఏకాస్ త్రిధా రిగ్ యజుః సామ వేదాః తస్మై నమః శ్రీ రవినందనయా॰


కోనస్తో పింగళ బబ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనైశ్చరో మందః పిప్పళాధీసు శని స్తుతాః


ఏతాని దశ నామాని నిత్యం ప్రాధయ పటే శనైశ్చర కృత పీడా న కదాచిద్ భవిష్యతి


*దశరథ ప్రోక్త శని స్తోత్రము* 

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండ నిభాయచ౹ నమో నీల మధూకాయ నీలోత్పల నిభాయచ౹ నమో నిర్మాంస దేహాయ దీర్ఘశ్రుతి జటాయచ౹ నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక౹ నమః పౌరుష గాత్రాయ స్థూల రోమాయతే నమః౹ నమో నిత్యం క్షుదార్తాయ నిత్య తృప్తాయతే నమః౹ నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే౹ నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే౹ నమస్తే ఘోర రూపాయ దుర్నిరీక్ష్యాయతే నమః౹ నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే౹ సూర్యపుత్ర నమస్తేస్తు భాస్వతే అభయ దాయినే౹ అధో దృష్టే నమస్తే-స్తు సంవర్తక నమోస్తుతే౹ నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమో నమః౹ తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయచ౹ జ్ఞాన చక్షుర్నమస్తేస్తు౹ కాశ్యపాత్మజ సూనవే తుష్టోదదాసి రాజ్యం త్యం క్రుద్ధో హరపి తత్‌క్షణాత్౹ దేవాసుర మనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః౹ త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే౹ బ్రహ్మాశక్రో యమశ్చైవ మునయస్సప్తతారకాః౹ రాజ్యభ్రష్టాః పతం తీహ తవ దృష్ట్యావలోకితాః౹ త్వయావలోకితాస్తే-పి నాశయాంతి సమూలతః౹ ప్రసాదం కురుమే సౌరే ప్రణత్వాహి త్వ మర్ధితః౹౹


   🌹🌷 *సేకరణ*🌷🌹

🕉️🕉️🕉️🛕🛕🕉️🕉️🕉️

           *న్యాయపతి*     

         *నరసింహారావు*

ముఖ్యమైన సందేశం

 చాలా ముఖ్యమైన సందేశం - దయచేసి జాగ్రత్తగా చదవండి, ముందుకు & దీన్ని అనుసరించండి .... 🙏 హై అలర్ట్ -

 సోదర సోదరీమణులందరూ,


 దయచేసి "మీ అన్ని కాంటాక్ట్‌లకు పాస్ చేయండి.


 డాక్టర్ అంజలి మాథుర్,

 ఛైర్మన్ & CMO,

 ఇండో అమెరికన్ హాస్పిటల్ (IAH),

 దక్షిణ డకోటా (యునైటెడ్ స్టేట్స్) ...


 ఈ సందేశం భారతదేశంలోని వైద్యుల బృందం (ప్రజా ప్రయోజనాల కోసం ఫార్వార్డ్ చేయబడింది).


 1) APPY FIZZ తాగవద్దు. ఇందులో క్యాన్సర్ కలిగించే ఏజెంట్ ఉంటుంది ..


 2) కోక్ లేదా పెప్సీ తాగే ముందు లేదా తర్వాత మెంటోస్ తినవద్దు ఎందుకంటే మిశ్రమం సైనైడ్‌గా మారడంతో వ్యక్తి వెంటనే చనిపోతాడు.


 3) కుర్కురే తినవద్దు ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ప్లాస్టిక్ ఉంటుంది.

 మీరు కుర్కురేను కాల్చండి మరియు మీరు ప్లాస్టిక్ కరగడాన్ని చూడవచ్చు.


 4) ఈ మాత్రలను నివారించండి, అవి చాలా ప్రమాదకరమైనవి:

 * డి-చలి

 * విక్స్ యాక్షన్ -500

 * యాక్టివేట్ చేయబడింది

 * కోల్డారిన్

 * కాసోమ్

 * బాగుంది

 * నిములిడ్

 * సెట్రిజెట్-డి

 అవి ఫినైల్ ప్రొపానాల్-అమిడ్ PPA ని కలిగి ఉంటాయి. ఇది స్ట్రోక్‌లకు కారణమవుతుంది & USA లో నిషేధించబడింది!


 దయచేసి, డిలీట్ చేసే ముందు, మీ స్నేహితులకు పాస్ చేయడం ద్వారా సహాయం చేయండి ..!


 అది ప్రతి ఒక్కరికీ చేరనివ్వండి


 ఇది ఎవరికైనా సహాయపడవచ్చు. మీకు వీలైనంత వరకు ఫార్వార్డ్ చేయండి.


 దయచేసి చదివి ఫార్వార్డ్ చేయండి:


 సిల్వర్ నైట్రో ఆక్సైడ్ వల్ల కలిగే కొత్త క్యాన్సర్‌ని డాక్టర్ ఆఫ్ ఇండో అమెరికా హాస్పిటల్ కనుగొంది. మీరు రీఛార్జ్ కార్డులను కొనుగోలు చేసినప్పుడల్లా, మీ గోళ్ళతో గీతలు పడకండి, ఎందుకంటే ఇందులో సిల్వర్ నైట్రో ఆక్సైడ్ పూత ఉంటుంది మరియు చర్మ క్యాన్సర్‌కు కారణం కావచ్చు. ఈ సందేశాన్ని మీ ప్రియమైనవారితో పంచుకోండి.


 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు:


 Phone ఎడమ చెవితో ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వండి.


 Cold చల్లని నీటితో మీ takeషధం తీసుకోకండి ...

చేతులెత్తి దండం

 🙏🏻 *_అందరికి చేతులెత్తి దండం పెట్ట కూడదా?_* 🙏🏻 🛎 నమస్కారం… భారతీయ సంస్కారం. కాదు, సంస్కృతిలో భాగం. ఇది ఒక గౌరవసూచకం. 👉మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు. దీనినే ఆత్మ అంటారు. 👉నమస్కారం పెట్టడం అంటే మన ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం. 👉కానీ, ప్రతి నమస్కరానికి ఒక విధానం ఉంది. అందరికీ చేతులెత్తి దండం పెట్ట కూడదట. 👉ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం 👉తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేస్తాం. 👉దేవుళ్లకు చేసే నమస్కారాలు ఒక విధంగా ఉంటాయి , గౌరవపూర్వకంగా మనుషులకు చేసే నమస్కారం మరో రకంగా ఉంటుంది. 👉శివకేశవులకు నమస్కరించేటపుడు తల నుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. అంటే చేతులెత్తి నమస్కరించాలి 👉హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు. 👉గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి . 👉తండ్రికి, ఇతర పెద్దలకు నోటికి నేరుగా చేతులు జోడించాలి. 👉తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి. 👉యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి. 🛎 మన శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి.......

నవగ్రహాలకు ప్రదక్షణ

 నవగ్రహాలకు ప్రదక్షణ, దానాదులు!!

నవగ్రహాలకు ప్రదక్షణ, దానాదులు!!  


జాతకం లో ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆయా గ్రహాలకు ఆయా రోజుల్లో ప్రదక్షిణ చేయడం ఉత్తమం. ప్రతికూలత అధికంగా వున్నప్పుడు దానాదులు చేయాలి. 


1) మాములుగా అయితే ప్రతిరోజూ నవగ్రహాలకు ఒక్క ప్రదక్షిణ మాత్రమే చేయాలి. 


2) నవగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. 


3) ఇతరులు ముట్టించిన దీపం తో మనదీపాన్ని వెలిగించరాదు. 


4) శని గ్రహానికి శనివారం మాత్రమే 9 ప్రదక్షిణలు చేయాలి. 


5) మాములు రోజుల్లో నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయకూడదు. 


6)శని గ్రహానికి ఎదురుగ నిలబడి నమస్కరించ కూడదు. 


7) గ్రహాల పై మాములు సమయాల్లో పసుపు కుంకుమలు, నవధాన్యాలు వేయకూడదు.


8) నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు విగ్రహాలను తాకకూడదు. 


9) నవగ్రహ ప్రదక్షిణ అనంతరం కాళ్ళు కడగడం చేయరాదు. 


10) ఒక్క శని గ్రహానికి అభిషేకం తర్వాత మాత్రం స్నానము చేయాలి. 


11) ఏ గ్రహానికి మనము గ్రహ ధాన్యాన్ని దానము చేస్తామో ఆ ధాన్యాన్ని ఆరు నెలల వరకు తినకూడదు. ( ముక్యంగా కుజ, శని, రాహు, కేతు, బుధ గ్రహాలకు ) 


12) నవగ్రహాలలో పాటుగా మిగితా దేవతలకు కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేయకూడదు. 


13) ఇతరులతో మాట్లాడుతూ, ఇతరులను చూస్తూ గ్రహ ప్రదక్షిణ చేయరాదు. 


14) నవగ్రహ ప్రదక్షిణ సమయం లో నవగ్రహ స్తోత్రం చదవడం ఉత్తమం. 


' ఆదిత్యాయచ సోమాయ 

మంగళాయ బుధాయచ 

గురు శుక్ర శనిభ్యశ్చ 

రాహవే కేతవే నమః '.


15) నవగ్రహాలకు ఇచ్చే దానం లో పూర్ణ ధాన్యాన్ని మాత్రమే దానంగా ఇవ్వాలి కండించిన ధాన్యం ( పప్పులు, పిండి ) ఇవ్వరాదు. 


16) బ్రాహ్మణ సహాయం లేకుండా గ్రహ పూజలు చేయరాదు. 


17) గ్రహానుకూలం కోసం చేసే దానము కూడా తప్పకుండ సద్బ్రాహ్మణులకు మాత్రమే చేయాలి, అన్యులకు గ్రహదానం చేయకూడదు.

పతన హాస్యం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

     *🌷పతన హాస్యం🌷* 

              🌷🌷🌷

‘ఫుల్లుమూను నైటటా.. జాసుమిన్ను వైటటా.. మూను కన్న మొల్ల కన్న నీదు మోము బ్రైటటా.. టా! టా! టా!’ అంటాడు గిరీశం ‘కన్యాశుల్కం’లో. ‘నేను వట్టి తెలివితక్కువ వాడిననా నీ అనుమానం’ అని కాంతం కథల్లో భర్త అంటే అందుకు కాంతం ‘అహహ అనుమానమేమీ లేదు.. గట్టి నమ్మకమే’ అంటుంది. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారబోశాను’ అని శ్రీశ్రీ రాస్తే జరుక్‌శాస్త్రి పేరడీగా ‘నేను సైతం కిళ్లీ కొట్లో పాతబాకీలెగరగొట్టాను’ అని రాశాడు. ‘నవ్వవు జంతువుల్‌.. నరుడు నవ్వును’ అంటాడో కవి. నవ్వు మానవ ప్రవృత్తి. సకల జీవజాలం నుంచి మనిషిని వేరు చేయగల ఒకే ఒక స్పందనాగుణం– నవ్వు.


‘నాకు గనక సెన్సాఫ్‌ హ్యూమర్‌ లేకపోతే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉందును’ అన్నారు గాంధీజీ. ఓ పెద్దాయన ‘ఏ మేన్‌  ఈజ్‌ నాట్‌ పూర్‌ ఇఫ్‌ హి కెన్‌ స్టిల్‌ హీ లాఫ్‌’ అన్నాడు. ‘నవ్వుకు చోటు దొరకనంత సేపు అది ఎంత పెద్ద గది అయినా ఇరుకే’ అని ఇంగ్లిష్‌ వ్యాఖ్య. బతకడానికి నవ్వు అవసరం అని సామాన్యుడేమిటి చక్రవర్తి కూడా అనుకున్నాడు. అందుకే విదూషకుణ్ణి ఆస్థానంలో పెట్టుకున్నాడు. తెనాలి రామలింగడు, బీర్బల్‌ తమ చక్రవర్తులను ఏమో కాని నేటికీ ఆబాలగోపాలాన్ని నవ్విస్తున్నారు.


మనుషులు నిత్య జీవితంలో పరాచికాలతో నవ్వుతారు. వెక్కిరించి నవ్వుతారు. తప్పులకు, అబద్ధాలకు నవ్వుతారు. అవివేకులను, మందబుద్ధులను, అతి తెలివిగల వారిని చూసి నవ్వుతారు. అధికారంలో ఉన్నవారిని ఏమీ అనలేక గేలి చేసి నవ్వుతారు. చాలక పుస్తకాలు చదివి, నాటకాలు చూసి, సినిమాలకు వెళ్లి కూడా నవ్వుతారు. అయినా కూడా గౌరవం పొందే విషయంలో హాస్యానిది ద్వితీయ స్థానమే. గంభీరంగా ఉండే అధికారినీ, గంభీరమైన ఉపన్యాసకుణ్ణీ గౌరవించినట్టుగా హాస్యం మిళితం చేసేవారిని గౌరవించరు. సాహిత్యంలో గొప్ప రచనలన్నీ గంభీరమైన విషయాలవే. హాస్యం రాస్తే ‘హాస్య రచయిత’.  గంభీరమైన విషయాలు రాస్తే ‘రచయిత’. అతి తక్కువ మందే హాస్యంతో గంభీరమైన విషయాలు రాసి గౌరవం పొందారు. 

తెలుగులో తొలి వచన సాధకులలో ఒకౖరైన వీరేశలింగం నవ్విస్తూ తొడపాశం పెట్టే శిల్పంలో తెలుగువారిని స్మిత వచనా సముద్రంలోకి ప్రవేశ పెట్టారు. మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు ‘హాస్యత్రయం’ అనిపించుకున్నారు. చిలకమర్తి ప్రహసనాలు, పానుగంటి ‘సాక్షి’ వ్యాసాలు క్లాసిక్స్‌. ఆ తర్వాతి రోజుల్లో ముళ్లపూడి వెంకటరమణ ‘బుడుగు’, పురాణం ‘ఇల్లాలి ముచ్చట్లు’, నండూరి పార్థసారథి ‘రాంబాబు డైరీ’... ఈ హాస్యధారను బలంగా ముందుకు తీసుకెళ్లాయి. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, తెలిదేవర భానుమూర్తి తదితరులు మాండలిక రచనతో హాస్యం ఎంత నేటివ్‌ రుచిగా ఉంటుందో చూపించగలిగారు.

అయితే ఆది నుంచి స్త్రీకి హాస్యం ‘అదుపు చేయబడినది’. నవ్వుకు ప్రధాన వాటాదారు పురుషుడే. స్త్రీ కాదు. ద్రౌపది కాలం నుంచి స్త్రీ నవ్వుకు అపఖ్యాతి, అపసవ్య వర్తనను ఆపాదిస్తూ వచ్చారు. నవ్వే, నవ్వించే స్త్రీలు నేటికీ తక్కువ. ఇలాంటి సంఘ అంకుశాలను కూడా ధిక్కరించి స్త్రీలు రాశారు. భానుమతి ‘అత్తగారి కథలు’, రంగనాయకమ్మ ‘స్వీట్‌హోమ్‌’ నవ్వించాయి. పొత్తూరి విజయలక్ష్మి,  మృణాళిని, సోమరాజు సుశీల... పాఠకులను తమ ఫిక్స్‌డ్‌ ఖాతాల్లో వేసుకోగలిగారు.

కాని నవ్వించడం ఏమాత్రం జోక్‌ కాదు. ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వించడం కొద్దిమందికే చేతనవుతుంది. సమాజంలో కానీ, రచనల్లో కానీ చాలామటుకు హాస్యం స్త్రీలను, బలహీనులను, వెనుకబడినవారిని దూషించడం వల్ల గేలి చేయడం వల్ల పుడుతూ ఉంటుంది. ఆస్తిత్వ రాజకీయ ఉద్యమాల వల్ల కలిగిన చైతన్యం ఇప్పుడు ఇవేవీ చేయడానికి వీల్లేని సంస్కారాన్ని ఇస్తున్నాయి. ఈ సంస్కార పరిధిలో ఉంటూ హాయిగా నవ్వుకోగల హాస్యాన్ని పుట్టించడం నవ్వు మీద సాముగా మారింది. 

ఈ సమయంలోనే నేటి తరం ఎటువంటి హాస్యానికి సామీప్యంలో ఉన్నదీ గమనించుకోవాలి. నిత్య ఒత్తిడి వల్ల పాఠకులు ప్రేక్షకులుగా మారి చదవడానికి బదులు చూడటానికి ఇష్టపడుతున్న సమయంలో హాస్యం వ్యాపార వనరుగా మారింది. అభినవ విదూషకులు పుట్టుకొచ్చారు. నిత్యం ప్రతి చానల్‌లో గంటో అరగంటో హాస్య కార్యక్రమం ఉంటోంది. అయితే అది ఎటువంటి హాస్యం? స్త్రీల రూపాలను, ఎదుటివారి ఆకారాలను పదే పదే హీనపరచడమే హాస్యంగా ఉంది. తెలుపు నలుపులను, పొడవు పొట్టిలను, భాషా యాసలను హీనపరచడమే హాస్యంగా ఉంది. ‘ఒరే దరిద్రుడా’ అనేది హాస్య సంబోధన. దరిద్రుడంటే పేదవాడు. పేదవాడు ఎవరికి హాస్య వస్తువు? ఎందుకు హాస్య వస్తువు? సమాజం లైంగిక అపక్రియల్లో మునిగినట్టుగా వాటి చుట్టూ అల్లిన హాస్యానికి రేటింగులు వస్తున్నాయి.

మాటలతో సాగే రతిని హాస్యం అంటున్నారు. ఇవి ఇళ్లల్లో ఉండి చూస్తున్న పిల్లలకూ, యువతీ యువకులకూ ఏం నేర్పిస్తున్నాయి? ఆరోగ్యకరమైన హాస్యాన్ని అలవర్చుకోని పిల్లలు తమక్కావాల్సిన హాస్యాన్ని వెతుక్కోవడంలో ఎదుటివారి దుఃఖానికి హేతువు అవుతారు. బాధించడాన్ని ‘ఎంజాయ్‌’ చేస్తారు. సత్యానికి, హేతువుకు, వాదనకు నిలబడలేక ‘ముఖాన్నో, మూతినో’ కామెంటు చేసి పారిపోతారు. సాంస్కృతిక దాడి చేస్తారు. ఉన్నతమైన విషయాన్ని కూడా పతనానికి తెచ్చి నవ్వుదామనుకుంటారు. పతన హాస్యపు ప్రతిఫలనం ఇది. ఇప్పుడు చలామణిలో ఉన్నదానిని అపహాస్యం అనడానికి కూడా లేదు. *ఇది  దుర్మార్గ, హాస్యం!*

ప్రయత్నించండి

 ప్రయత్నించండి  జవాబులు 

______________________________

(1) గ్రామాశ్వము అనగా ? (ఇ) గాడిద 


(అ) కుక్క

(ఆ) ఎద్దు

(ఇ) గాడిద 

(ఈ) ఆడఒంటె


(2) ఇంగలీకము అనగా ? (ఇ) కోతి


(అ) ఒకరకం చెట్టు

(ఆ) ఆయుర్వేద ఔషధం

(ఇ) కోతి

(ఈ) నల్లి


(3) కచ్ఛపి అనగా ?  (అ) సరస్వతి వీణ


(అ) సరస్వతి వీణ

(ఆ) గోచి

(ఇ) తాబేలు

(ఈ) రథము


(4) అనాలంబి అనగా ?


(అ) కుబేరుడి పురాణాలలో వీణల పేర్లు 

(ఆ) శివుడివీణ

(ఇ) ఇంద్రుడి ఉద్యానవనం

(ఈ) అశ్వనీదేవతల వాహనం


(5) కుముదము అనగా ?(అ) ఇంద్రలోకంలోని దివ్యపుష్పం


(అ) ఇంద్రలోకంలోని దివ్యపుష్పం

(ఆ) యముడి ఆయుధం

(ఇ) రావణుడి వీణ

(ఈ) శివుడి శంఖం


(6) అజగవము అనగా ?


(అ) అడవి జింక

(ఆ) ఉత్తమాశ్వము ( మేలుగుర్రం)

(ఇ) శివుడివిల్లు

(ఈ) విభీషణుడి విల్లు


(7) ముద్దయ్య అనగా ? (ఇ) కుమారస్వామి


(అ) పోలేరయ్య

(ఆ) శివుడు

(ఇ) కుమారస్వామి

(ఈ) శశీశ్వరుడు


(8) కటిసూత్రము అనగా ? (అ) మొలత్రాడు


(అ) మొలత్రాడు

(ఆ) భుజకీర్తి ( వంకీ)

(ఇ) ముంజేతికడియం

(ఈ) మంగళసూత్రం


(9) అనామిక అనగా ? (ఈ) ఉంగరపు వ్రేలు


(అ) అనామకుడు

(ఆ) అన్నసత్రం

(ఇ) గందంచెట్టు

(ఈ) ఉంగరపు వ్రేలు


(10) పుండరీకాక్షుడు అనగా ?


(అ) ఎర్రనికనులు కలవాడు

(ఆ) నీలికనులు కలవాడు

(ఇ) నల్లనికనులు కలవాడు

(ఈ) తెల్లని కనులుకలవాడు


( విష్ణువుకు గల పేరిది )


 

॥సేకరణ॥

__________________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

బ్రాహ్మిణ్‌లపై

 *బ్రాహ్మిణ్‌లపై వాస్తవ తనిఖీ*


కాలక్రమేణా కల్పన ఎలా నిజం అవుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది!


 వాస్తవాలు మరియు వాస్తవ చరిత్ర ఆధారంగా సత్యాన్ని పరిశీలిద్దాం.


 *1.* ముందుగా... హిందూ మతంలో ఒక్క బ్రాహ్మణ దేవుడు లేడు!


 *2.* దేవుళ్లందరూ వెనుకబడిన కులాలు, దళితులు మరియు గిరిజనుల నుండి వచ్చారు.


 *3*. బ్రాహ్మణులు హిందూ మతంలో దేవుళ్ల భావనను సృష్టించలేదు.


 *4.* భారతదేశాన్ని పాలించిన బ్రాహ్మణ రాజు ఒక్కడు కూడా లేడు.


 *5.* ఇతరులను అణచివేయడానికి అధికార స్థానాలు అవసరం. బ్రాహ్మణులు ఉపాధ్యాయులు, పండితులు, పూజారులు, సలహాదారులు కానీ పాలకులు కాదు.


 *6*. బ్రాహ్మణుల సాంప్రదాయక వృత్తి ఆలయ పూజారి (పురోహిత్), మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం. వారి ఏకైక ఆదాయం భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చిన _బిక్ష_ (భిక్ష).


 *7.* బ్రాహ్మణుల మరొక విభాగం ఉపాధ్యాయులు, అది కూడా జీతం లేకుండా.


 *8*. వేద సాహిత్యం ఎక్కువగా బ్రాహ్మణేతరులచే వ్రాయబడింది. బ్రాహ్మణులకు ఉన్నత హోదా ఇచ్చే ధర్మ శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనది, బ్రాహ్మణేతరుడైన మను వ్రాసిన మనుస్మృతి. బ్రాహ్మణుడు అంటే అదొక వృత్తి (వర్ణ) - కులం కాదు.


 *9.* సంస్కృతం చదవడం మరియు రాయడం బ్రాహ్మణులకే పరిమితమైతే, మీరు గిరిజన వాల్మీకి రామాయణాన్ని ఎలా కంపోజ్ చేస్తారు? నాలుగు వేదాలను వర్గీకరించి మహాభారతం రచించిన వేదవ్యాసుడు ఒక మత్స్యకారునికి జన్మించాడు.


 *10*. సంస్కృతాన్ని బ్రాహ్మణేతర రచయితలు ఎక్కువగా ఉపయోగించారు - బ్రాహ్మణులు రచించిన సంస్కృతంలో చాలా తక్కువ గ్రంథాలు ఉన్నాయి.


 *11*. వేదవ్యాసులు, వశిష్ట, వాల్మీకి, కృష్ణ, రాముడు, అగస్త్య, విశ్వామిత్ర, శృంగ, గౌతమ, బుద్ధ, మహావీర, తులసీదాస్, తిరువళ్లువర్, కబీర్, వివేకానంద, గాంధీ, నారాయణ గురు మొదలైన వారి బోధనలను అత్యంత విలువైనవిగా భావిస్తాం.


 *12*. వారెవరూ బ్రాహ్మణులు కాకపోతే, "బ్రాహ్మణులు మిమ్మల్ని నేర్చుకోవడానికి అనుమతించలేదు" అని ఎందుకు గట్టిగా అరుస్తారు? బ్రాహ్మణేతర భక్తి సాధువులచే భక్తిపై అనేక రచనలు ఉన్నాయి.


 *13.* బ్రాహ్మణులు ఇతరులను నేర్చుకోకుండా ఎప్పుడూ నిరోధించలేదు.


 *14*. చరిత్రలో ఏ సమయంలోనూ బ్రాహ్మణులు ధనవంతులు లేదా శక్తివంతులు కాదు. ఏదైనా పాత భారతీయ కథల పుస్తకాన్ని తీయండి, మీరు గరీబ్_ బ్రాహ్మణుడు (పేద బ్రాహ్మణుడు) ధర్మంగా పేర్కొనడాన్ని చూస్తారు. (సుదామ-కృష్ణ కథ గుర్తుందా?)


 *15.* వారి వృత్తి సమాజంలో అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతున్నప్పటికీ, బ్రాహ్మణ సన్యాసుల మనుగడకు ఏకైక మార్గం ప్రజలు ఇచ్చే భిక్ష.


 *16.* బ్రాహ్మణుల అతిపెద్ద సహకారం భూమిలో ఇప్పటివరకు మాట్లాడే అత్యుత్తమ భాష - సంస్కృతాన్ని నిలబెట్టుకోవడం. మీరు ఇంగ్లీష్ లేదా అరబిక్ నేర్చుకుంటే, మీకు వాణిజ్య ప్రయోజనాలు ఉంటాయి.


 *17*. సంస్కృతాన్ని ఎవరూ ప్రోత్సహించలేదు.

 ఎలాంటి ప్రయోజనాలు లేకుండా, బ్రాహ్మణులు సంస్కృతం నేర్చుకునే స్వచ్ఛంద పనిని చేపట్టారు. ఇప్పుడు మీరు వాటిని సంస్కృతంలో గుత్తాధిపత్యంగా ఆరోపిస్తున్నారు!


 అంతే కాకుండా, బ్రాహ్మణులు రాజులు కాదు. వారు అధికారాలను ఆస్వాదించలేదు లేదా సంపదను కలిగి లేరు. వారు జ్ఞానాన్ని సంపాదించడానికి మరియు కష్టతరమైన జీవితాన్ని గడపడానికి చాలా కష్టపడ్డారు. కాబట్టి బ్రాహ్మణుల దోపిడీ ప్రశ్న లేదు.


బ్రాహ్మణుల జనాభా తమిళనాడులో కేవలం 2% నుండి ఉత్తరాఖండ్‌లో 12% వరకు ఉన్నప్పుడు, వారు మెజారిటీలో ఎలా ఆధిపత్యం చెలాయించగలరు?


 ఇవన్నీ చదివిన తరువాత ఎవరైనా *బ్రాహ్మణులను* నిందించగలరా?


 *దయచేసి వీలైనంత ఎక్కువ మందికి ఫార్వార్డ్ చేయండి మరియు సమాజాన్ని విభజించే తప్పుడు సమాచారం యొక్క ఈ వైరస్‌ను చంపండి ...*🙏🙏🙏

కాసు' ల్లేవు

 *ఒక మువ్వురు కవులు కవి సంఘం పెట్టి, దానికి ఒక భవనం కట్టాలని సహాయం కోసం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు..*


*పరిచయ కార్యక్రమం:*

*"వీరు సున్నం రంగరాజు గారు..వీరు రాళ్ళబండి వెంకట్రాజు గారు..ఇక నేను తాపీ ధర్మారావు..."*


*కాసు బ్రహ్మనందరెడ్డి(ముఖ్యమంత్రి): "సంతోషం. ఎందుకోసం ఈ రాక ?"..*


*కవులు: "భవనం కట్టాలి మీ సహాయం కోసం వచ్చాము".*


*కాసు బ్రహ్మనందరెడ్డి :* 

*"ఇక్కడ.. తాపి, సున్నం, రాళ్ళ బండి ఉన్నాయిగా... నా అవసరమేముంది?*

*(హాస్యంగా)*


*కవులు: "అన్నీ ఉన్నాయి గానీ... 'కాసు' ల్లేవు... మీరు కూడా కలిస్తే ..భవనం పూర్తవుతుంది"* 

*(కవులు.. మరి !).* 😂😂

గణపతిని నిమజ్జనం

 _*గణపతిని నిమజ్జనం చేస్తారు ఎందుకు ?*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




మట్టి గణపతి ఆరాధన గురించి అడిగి తెలుసుకున్న శౌనకాదులు సూతుడితో *'మరి పూజానంతరం నీటిలో నిమజ్జనం ఎందుకు ?'* అన్నారు శౌనకాదుల. ఆ ప్రశ్నకు సూతుడు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు.


*చెపుతాను వినండి మట్టితో వినాయకుని చేస్తాం ఆ విగ్రహానికి మంత్రపూర్వకంగా ప్రాణప్రతిష్ట చేస్తాం పూజ చేస్తాం అంతవరకు బాగానే ఉంది. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే కానీ ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచిస్తే అది మామూలు మట్టి బొమ్మ కాదు. పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మనం ప్రాణప్రతిష్ట చేసి ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమ యందు పరబ్రహ్మ ఉన్నాడు. ఆ మృత్తికలోని అణువణువూ ఆయనే.... అలాంటి మృత్తికను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం. బొమ్మని సృష్టించాం. పూజానైవేధ్యాలతో పోషించాం. మరి లయం చేయవద్దా ? లయం చేయడమంటే ఆత్మను విశ్వాత్మతో ఐక్యం చేయడం. అణువును బ్రహ్మాండంలో లీనం చేయడం. అంటే ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే చేరుకోవడం. ఇదే సృష్టి , స్థితి , లయల చక్రభ్రమణం ఇదే పరబ్రహ్మతత్వం అందుకే పరబ్రహ్మ ప్రతిరూపమైన మట్టి వినాయకుడిని పరబ్రహ్మ స్థూలరూపమైన భూమిలో ఐక్యం చేయడానికి యీ విగ్రహాన్ని సముద్ర జలమందు గానీ , నదీ , తటాక జలములయందుగానీ నిమజ్జనం చేస్తే ఆ నీటియందు చేరిన విగ్రహం కరిగి ఆ జలప్రవాహంతో ప్రయానించి , అంటే వ్యాపిస్తూ , పరబ్రహ్మరూపమైన మట్టిలో ఐక్యమైపోతుంది. అందుకే పూజానంతరం వినాయక నిమజ్జనం ఆచారంగా పూర్వులు ప్రకటించారు. ఆచరించారు. పూజలో వినాయకుడికి అర్పించిన పత్రి ఓషధీ గుణాలు కల్గినవీ , భూదేవి ప్రసాదించినవే గనక వాటిని కూడా నిమజ్జనం ద్వారా ఆ పరబ్రహ్మకి అర్పించి అంజలి ఘటిస్తారు. సర్వ ఈశ్వరార్పణం అంటే అసలు అర్ధం ఇదే"* అని వివరించారు సూతమహర్షి.

ప్రశ్న పత్రం సంఖ్య: 31 జవాబులు

 ప్రశ్న పత్రం సంఖ్య: 31 జవాబులు  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

రామాయణ  సంబంధిత ప్రెశ్నలు. 

ఇతిహాసాలలో మొదటిది మరియు ఒక ఉత్తమపురుషుడు జీవనం ఎలాచేయాలి అనేది శ్రీ రాముని ద్వారా తెలుసుకోవాలని మన సాంప్రదాయాలలో శ్రీరాముని ఆదర్శ పురుషునిగా భావిస్తున్నాము. క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.   

1. రామాయణాన్ని రచించింది ఎవరు.  జవాబు: ఆదికవి వాల్మీకి 

2.ఆదికవికి రామాయణాన్ని రచించటానికి ప్రేరేపించిన మహాముని ఎవరు. జవాబు: నారద మహాముని 

3. శ్రీరాముని అక్కగారి పేరు ఏమిటి. జవాబు. శాంత (దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.)

4. రామాయణంలో ఎన్ని కాండలు వున్నాయి  జవాబు. 1) బాలకాండ, 2)అయోధ్యకాండ, 3)అరణ్య కాండ4) కిష్కింద కాండ, 5) సుందరా కండ 6) యుద్ధకాండ కాగా 7) ఉత్తరకాండ 

ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము.

5. రాముని సోదరులలో కవలపిల్లలు ఎవరు జవాబు. లక్ష్మణ,శత్రుఘ్నులు 

6. నందిగ్రామము ఎవరి మేనమామయూరు జవాబు. భరతుని 

7. దశరథమహారాజు మరణించినప్పుడు శ్రీరాముడు ఎక్కడ వున్నారు. జవాబు. అరణ్యంలో 

8. కైకేయిని ప్రేరేపించింది ఎవరు ఆమె ఏదేశంనుండి వచ్చినది. జవాబు. మందార 

9. ఇంటిగుట్టు లంకకు చేటు అనే సామెత ఎలా వచ్చింది. జవాబు. రావణుని మరణ రహస్యం విభిషణుడు రామునికి తెలుపుట వలన ఆ మాదిరిగా ఎవరైనా చేస్తే ఉపయోగించే వాక్యం. 

10.సీతజాడతెలిపిం పక్షి ఎవరు. జవాబు.జటాయువు

11. పరమేశుని ఆత్మలింగాన్ని వరంగా పొందిన భక్తుడు ఎవరు. జవాబు. రావణబ్రహ్మ 

12. సీతాదేవిని వివాహమాడటానికి శ్రీరాముడు చేసినది ఏమిటి. జవాబు. శివధనస్సు విరచటము  

13. రామోవిగ్రహవాన్ ______జవాబు. ధర్మః 

14. నదిదాటించింది ఎవరు, ఆ నడిపేరు ఏమిటి. జవాబు. గుహుడు, సరయు నది

15. శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు రధాన్ని నడిపిన సారధి ఎవరు. జవాబు. సుమంతుడు 

16. శ్రీరాముని శరీరఛాయ ఏమిటి. జవాబు. నీలమేఘచాయ 

17. శ్రీరాముడు మొదటిసారి హనుమంతుని చూసినప్పుడు ఆంజనేయులు ఏవేషంలో వున్నారు. జవాబు. బ్రాహ్మణ 

18.తార ఎవరి భార్య జవాబు. వాలి భార్య 

19. విశ్వామిత్రుడు రామాయణంలో ఏ కాండలో కనపడతాడు. జవాబు.  బాలకాండ-

20. మధువనంను పాడుచేసింది ఎవరు జవాబు. సుగ్రీవుని సేన అయిన వానరులు. 

21. ఎంగిలి పండ్లు ఎవరు ఎవరికి తినిపించారు.  జవాబు. శబరి, తినిపించింది శ్రీరామచంద్రునికి. 

22. శ్రీరాములవారి తల్లిగారి పేరు ఏమిటి. జవాబు. కౌసల్య 

23. విశ్వామిత్రుడు దశరధుని ఏమి కోరాడు జవాబు. యాగసంరక్షణకు శ్రీరాముని పంపమని కోరారు. 

24. భూమినుంచి పుట్టింది ఎవరు. జవాబు. సీతాదేవి 

25. లక్ష్మణ రేఖ అంటే ఏమిటి. జవాబు. లక్ష్మణులు సీతాదేవికి రక్షణగా  పర్ణశాలముందు గీసిన రేఖ 

26. బంగారు లేడి రూపంలో వున్నరాక్షసుడు ఎవరు. జవాబు. మారీచుడు (తాటక అనే యక్షిణికి, సుందుని వల్ల కలిగిన కుమారుడు.)

27. పర్ణశాల అంటే ఏమిటి దీనిని నిర్మించినది ఎవరు. జవాబు. అరణ్యవాసంలో సీత,రామ లక్ష్మణులు నివసించటానికి నిర్మించుకున్న వసతి గృహం. 

28. ముక్కుచెవులు కోసింది ఎవరు, ఎవరికి జవాబు. లక్ష్మణుడు, సూర్పనక్క ఈమె రావణుని సోదరి. 

29. లంకను కాపలా కాసింది ఎవరు. జవాబు. లంకిణి 

30. శ్రీరాముడు ఎవరి విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. జవాబు. రావణుని విమానం, దానిపేరు పుష్పక విమానం.