31, అక్టోబర్ 2023, మంగళవారం

దేవుడు అంటే ఏంటి

 ఆత్మ విద్య : మీ జన్మ రహస్యం *దేవుడు అంటే ఏంటి*? 


*పూజ చేయకపోతే ఏమవుతుంది*? అని...

చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.


*పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ. మనసుతో చేసే వ్యాయామం*.


*మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి* 

*మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ*.


*దీప ప్రజ్వలనం అనేది..... త్రాటకం అనే యోగ ప్రక్రియ*.


రోజూ ఓ *మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు* అని పెద్దలు చెప్పిన మాట.


ఏదైనా *కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు*.

*అది నాలికకు ఎక్సర్‌సైజ్‌*. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది.

*ధారణ శక్తి పెరుగుతుంది*. *భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది*.


*పూజ అంటే చాదస్తం కాదు .మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని* చెప్పండి.


*మన హిందూ ధర్మాన్ని ప్రోత్స హించండి*.


అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది.....


*1. మూలవిరాట్* 🚩 భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.


*2. ప్రదక్షిణ 🚩* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


*3. ఆభరణాలతో దర్శనం 🚩* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.


*4. కొబ్బరి కాయ* 🚩 

ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.


*5.మంత్రాలు 🚩* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజ పరువస్తాయి.


*6. గర్భగుడి 🚩* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.


*7. అభిషేకం 🚩* 

విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.


*8. హారతి 🚩* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


*9. తీర్థం 🚩* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._


*10. మడి 🚩* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!


*🙏లోకాః సమస్తాః సుఖినోభవంతు🙏*

రాశి ఫలితాలు

 (31-10-2023)

 రాశి ఫలితాలు

భౌమ వాసరః మంగళవారం 

***********


మేషం

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో  జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.

---------------------------------------

వృషభం

అన్ని రంగాల వారికీ లాభదాయకంగా ఉంటుంది.  ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట  చెందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనం నడిపే విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మిధునం

వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధు మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితుల ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

కర్కాటకం

సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ  పూర్తిచేస్తారు. వ్యాపారపరంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి  నూతన  విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

---------------------------------------

సింహం

నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది.  స్నేహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

కన్య

దీర్ఘకాలిక రుణాలు తీర్చి  మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.  ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

తుల

సన్నిహితులతో చాలా కాలంగా  ఉన్న  వివాదాలను పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దూర   ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయాలలో చిన్నపాటి  ఇబ్బందులు కలుగుతాయి.

---------------------------------------

వృశ్చికం

ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో  అధికారులు అనుగ్రహం వలన ఉన్నత పదవులు లభిస్తాయి. 

--------------------------------------

ధనస్సు

దూరప్రాంత బంధుమిత్రుల   ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తివ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. 

---------------------------------------

మకరం

ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు  లభిస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుకుంటారు.

---------------------------------------

కుంభం

చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు.  మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలుంటాయి.  ఆరోగ్య విషయాలలో  అప్రమత్తంగా వ్యవహారించాలి.  గృహమున వివాహాది శుభకార్య ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

మీనం

వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. పాత  మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం   చేస్తారు. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశములు లభిస్తాయి.

---------------------------------------

 ఈ రోజు పంచాంగం 31.10.2023  Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష: తృతీయ తిధి భౌమ వాసర: రోహిణి నక్షత్రం వరీయాన్ యోగ: వణిజ తదుపరి భద్ర కరణం ఇది ఈరోజు పంచాంగం.


తదియ రాత్రి 09:34 వరకు.

రోహిణీ రాత్రి 03:58 వరకు .

సూర్యోదయం : 06:17

సూర్యాస్తమయం : 05:41

వర్జ్యం : రాత్రి 07:59 నుండి 09:35 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:34 నుండి 09:19 వరకు తిరిగి రాత్రి  10:44 నుండి 11:34 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం   03:00  నుండి 04:30 వరకు 


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

పూజాకార్యక్రమాల సంకల్పము

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 31.10..2023

మంగళ వారం (భౌమ వాసరే) 

**************

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ  సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే కృష్ణ పక్షే తృతీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భౌమ వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  కృష్ణ పక్షే తృతీయాయాం

భౌమ వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.01

సూ.అ.5.27

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

కృష్ణ పక్షం తదియ రా.10.47 వరకు. 

మంగళ వారం. 

నక్షత్రం రోహిణి పూర్తి. 


అమృతం రా. తె.2.59 ల 4.37 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.18 ల 9.04 వరకు.

దుర్ముహూర్తం రా.10.28 ల 11.19 వరకు. 

వర్జ్యం రా. 10.06 ల‌ 11.44 వరకు .

యోగం వరీయాన్ సా. 6.26 వరకు.

కరణం వనజి ప. 11.04 వరకు.

కరణం భద్ర రా. 10.47 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం సా. 3.00 ల 4.30 వరకు. 

గుళిక కాలం మ.12.00 ల 1.30 వరకు. 

యమగండ కాలం ప.9.00 ల 10.30 వరకు. 

.***********

పుణ్యతిధి ఆశ్వయుజ బహుళ తదియ. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

సాటిలేని మహా భక్తుడు

 ఓం నమశివాయ శివుని యొక్క తొలి భక్తుడు ఎవరు


"సాటిలేని మహా భక్తుడు శ్రీ మహావిష్ణువు".....


శివుని  యొక్క సకార స్వరూపమైన సదాశివుని వామంగం నుండి ఆవిర్భవించిన తొలి పురుషుడు శ్రీ మహావిష్ణువు. ఈ సృష్టిలో శివుని యొక్క తొలి శివ భక్తుడు అనే ఘనకీర్తి విష్ణు దేవునికే లభించినది. కారణం శివుడిని ఆరాధించే మొదటి అవకాశం మహాభాగ్యం విష్ణుదేవుని లభించినది. 


*పార్వతి శంకరుడిని, రాధ శ్రీ కృష్ణుడిని,,సీత శ్రీరాముడిని, ఏ విధంగా ధ్యానం చేస్తూఉంటారు. ఆ విధంగా విష్ణువు శివుని సదా ధ్యానిస్తూ ఉంటాడు. నిరంతరం శివ నామస్మరణ చేస్తూ ఉంటాడు. 

ఈ కారణం వల్లనే!...


శివుడి అష్టోత్తర శత నామాలులో శివుడు విష్ణు వల్లభూదాని కీర్తించబడినాడు. నేను నిరంతరం ధ్యానించే శివుడు నాకు ప్రియమైన వాడు అందుకే శివుడిని విష్ణు వల్లభూదాని అని అంటారని విష్ణువు పార్వతితో ఇలా తెలిపెను.


శంకర: శూలపాణిచ కట్వంగి విష్ణువల్లబా:


విష్ణువు యొక్క శివ భక్తుని మెచ్చి. శివుడు విష్ణువు కు ఎన్నో వరాలను ప్రసాదించాడు. ఎన్నో దివ్యశక్తులను ప్రసాదించాడు. క్షణాలలో శత్రువులను సమూలంగా నాశనం చేసే సుదర్శనచక్రాన్ని విష్ణువుకు ప్రసాదించాడు.


భూలోకములో మానవులచే పూజలందుకునే వరాన్ని కూడా ప్రసాదించాడు, భూలోకములో, క్షేత్రం, ప్రతిష్ట, ఉత్సవం, జరిగే విధంగా శివుడు విష్ణువు వరం ప్రసాదించాడు. విష్ణువు ఎంతటి శివభక్తుడు ఆదిశంకరులు, పరమశివ! త్రిపుర సంహారం కాలమందు విష్ణువు నీకు బాణం అయ్యెను. వృషభ రూపమును పొంది నీకు వాహనం అయ్యెను.  ఆర్య రూపమును పొంది నీ అర్థంగమ్మున భార్యఅయినాడు. నీ పాదాలను దర్శించుటకు వరాహ రూపం దాల్చనో.  జగన్మోహిని రూపమును పొంది నీ వల్లభూదపొందేన.  నీవు శివ తాండవం చేసే సమయాన నీ పాదాలకు నమస్కరించి సాహసం చేసిన నీ దేహం ఒక భాగం గలవాడై బ్రహ్మాదుల కంటే కూడా అధికంగా పూజింపబడిన లేనిచో విష్ణువు అంతటి   పూజ్యుడు ఎలా అగునని తెలిపెను. 


హనుమంతుడు శ్రీరాముడిని నిండు ప్రేమతో, అనన్య భక్తితో ఏ విధంగా ప్రేమించాడో, సేవించాడు. ఆ విధంగా శివుడిని ప్రేమించినవాడు, సేవించినవాడు విష్ణువు.  అందుకే ఎన్నో పురాణాలు విష్ణువు సాటిలేని గొప్ప శివ భక్తుడు అని కొనియాడారు.  


హనుమంతుడు తన హృదయములో గల శ్రీరాముడిని చూపినట్లు మహావిష్ణువు తన హృద యములో గల శివుడు ని చూపించుని వామన పురాణం ఎలా తెలిపినది. మహావిష్ణువు, కమలం అంటే తన హృదయాన నివసించే శివ లింగేశ్వరుడు దేవతలకు చూపించెను. విష్ణువు ఎంతటి గొప్ప శివభక్తుడు, "శుద్ధగామం"  ఈ విధంగా తెలిపినది. త్రయోదశo   హరే రార్ధం - అర్ధనారి  చతుర్దశo' 

 విష్ణువు శివుని ధ్యానించి సేవించి సగము శరీరమును పొందిన హరిహర మూర్తి. ఈ లీల రూపము మహేశ్వరుని లీలా రూపములలో 13వ అర్ధనారీశ్వర రూపం 14 విష్ణువు పార్వతీ కన్నా ముందే శివుని శరీరమును పొందాడు. అందుకే పార్వతి విష్ణువును ఆదర్శంగా తీసుకున్నది. విష్ణువుచే అష్టోత్తర శత నామాలను ఉపదేశం పొంది కఠోరంగా తపస్సు చేసి శివుని లో సగం శరీరం సాధించి  "అర్ధనారీశ్వరి"  అయినది.


 విష్ణువు ఎంతటి గొప్ప మహా శివ భక్తుడు కాబట్టి శివుడే దేవాది దేవుడు, ఆదిదేవుడు,   పరమపురుషుడు.......

 

🙏🙏🙏🙏

కావమ్మ మొగుడు కథ*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*కావమ్మ మొగుడు కథ*


దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో CM NTR ‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ: 

ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని  చూసి ఒక స్త్రీ కావమ్మ మొగుడులా ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని  వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది. అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు.


రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్‌ తో సహ  సభ్యులందరూ నవ్వారు. తరువాత ఎన్‌టిఆర్‌ తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు.

మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు  దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్‌ గ్రోత్‌ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– నాకేం తెలుసు మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు...  అని ముక్తాయించారు రోశయ్య.


ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది.


పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం?. దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది. మరి నా ప్రసంగం ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాటలాగా ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు.


అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.


*ఎం. వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్.*


*సేకరణ:- శ్రీ వసంతకుమార్ గారి వాట్సాప్ పోస్ట్.*

నవగ్రహా పురాణం🪐* . *70వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *70వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*చంద్రగ్రహ చరిత్ర - 8*


దక్షప్రజాపతి ఇంద్రుడి వైపు చూశాడు. *"ఇంద్రా ! నా శాపాన్ని పూర్తిగా ఉపసంహరించే ఇష్టం నాకు లేదు. సరస్వతీ నది సముద్రంలో కలిసే పావన సంగమ స్థానంలో స్నానం చేస్తూ ఉంటే క్షయ తగ్గుముఖం పడుతుంది. చంద్రుడి కళ వృద్ధి చెందుతుంది. ఆ స్నాన ప్రభావంతో చంద్రుడు పక్షం రోజులు వృద్ధి చెందుతాడు. పక్షం రోజులు క్షీణిస్తూ ఉంటాడు. భార్యలందరినీ సమదృష్టితో చూసే సత్ప్రవర్తన సరస్వతీ సంగమ స్నానం ద్వారా సిద్ధించే వృద్ధికి మూలంగా ఉంటుంది.”*


*"మాతామహా ! అంటే చంద్రుడు ఒక మాసంలో పక్షం రోజులు తన 'కళ' పరంగా క్రమంగా వృద్ధి చెందుతూ పరిపూర్ణమైన కళతో ఆనందంగా ఉంటాడు. రెండవ పక్షం రోజులూ కళ క్షీణిస్తూ ఉంటుంది ! అంతే కదు !"* అన్నాడు ఇంద్రుడు.


*"చక్కగా గ్రహించావు ! మాసంలో సగం రోజులు వృద్ధి చంద్రుడుగా , సగం రోజులు క్షీణ చంద్రుడుగా ఉంటాడు !"* దక్షుడు వివరించాడు. *"ప్రతీ అమావాస్య నాడూ ఆ తీర్థంలో స్నానం చేస్తూ ఉండాలి !"*


*"చక్కటి పరిష్కారం. ఇది ఉభయతారకం !"* నారదుడు మెచ్చుకున్నాడు. 


చంద్రుడిని అక్కడే వదిలి పెట్టి , ఇంద్రాదులు వెళ్ళిపోయారు. 


*“మామగారూ ! నన్ను క్షమించండి !"* చంద్రుడు దక్ష ప్రజాపతితో అన్నాడు.


*"క్షమించాను గనుకనే శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించాను. అమావాస్య , అమావాస్యకూ సరస్వతీ సాగర సంగమ స్థానంలో పవిత్ర స్నానం చేస్తూ , నీ కళలను వృద్ధి చేసుకుంటూ ఉండు. నీ సప్తవింశతి సతీమణులనూ సమానంగా ఆదరించు !”* దక్షుడు ప్రబోధించాడు.


చంద్రుడు అశ్వినీ , ఆమెలాగే తన మూలంగా క్షోభించిన ఆమె చెల్లెళ్ళనూ కలయజూస్తూ , గద్గద కంఠంతో క్షమాపణ అడిగాడు. చేసిన అపరాధానికి చింత వ్యక్తం చేసి , అత్తగారి ఆశీస్సులు అందుకున్నాడు. అందరి నుండి అనుమతి స్వీకరించి , సరస్వతీ సంగమ స్థానంలో స్నానం చేయడానికి వెళ్ళాడు.


పావన తీర్థంలో స్నానం చేయగానే చంద్రుడి శరీరాన్ని పీడిస్తూ వస్తున్న భయంకర వ్యాధి నిమ్మళించింది. ఆరోగ్యాన్ని పుంజుకుంటూ , వర్చస్సునూ , కళనూ పెంపొందించు కుంటూ పత్నులందరితోనూ అత్తవారింట కొంతకాలం విడిదిచేసి ఇరవై యేడుగురు చక్కని చుక్కలనూ వెంటబెట్టుకుని తన మందిరం చేరుకున్నాడు చంద్రుడు.


ఆనాటి నుండి పత్నులందరినీ సమదృష్టితో ఆదరిస్తూ - 'బహు సతీవ్రతుడి'గా పేరు పొందాడు. చంద్రుడు కళాపూర్ణుడైన క్షణం నుంచీ ఔషధులకూ , వృక్షసంతతికీ , సస్యాలకూ ప్రాణాలు లేచి వచ్చాయి.


ప్రాణులకు ఆహారము , ఆరోగ్యం సంప్రాప్తించాయి. అన్ని లోకాలలోనూ ఆనందం వెళ్ళి విరిసింది.


చంద్ర మందిరం ఆనంద మందిరంగా మారింది.


*"ఇదీ చంద్రుడి చరిత్ర !"* కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద.


*"ఆలోచిస్తూ ఉంటే , చంద్రుడు సౌందర్యోపాసకుడనిపిస్తోంది. గురువుగారూ !".* విమలానందుడు నవ్వుతూ అన్నాడు. *“వివాహానికి ముందు తారా ప్రణయం , వివాహానంతరం రోహిణీ పక్షపాతం !"*


నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. *"స్థూల దృష్టికి కనిపించేది అదే ! ఇలాంటి విషయాలను సూక్ష్మంగా ఆలోచించాలి. అలా ఆలోచించేటప్పుడు ప్రస్తుతం మన ఆచారాలనూ , నియమ నిబంధనలనూ , కట్టుబాట్లనూ కొలబద్దలుగా తీసుకోరాదు. చంద్రుడు నవగ్రహాలలో ఒకడు. దైవస్వరూపు డాయన. దైవస్వరూపాల కార్యకలాపాలు లోకాల హితం కోసమే జరుగుతాయి. చంద్రుడు తారతో ప్రణయ యాత్ర సాగించాడు. దాని ఫలితంగా నవగ్రహాలలో మరొక గ్రహమైన బుధుడు ఆవిర్భవించాడు. ఇదే లోక హితం ! ఆ విషయంలో బృహస్పతి ఆలోచనా , స్పందనా సుస్పష్టమే. తన ధర్మపత్ని తార పాతివ్రత్యానికి భంగం కలిగిందని ఆయన అనుకోలేదు. స్త్రీ వ్యభిచార దోషం బహిష్టుతో ప్రక్షాళనమైపోతుందన్న నీతిని ప్రకటించిన శాసనకర్త ఆయన. తను అనుశాసన ధర్మానికి కట్టుబడే ప్రవర్తించాడు.”*


*"ఇక చంద్రుడి రోహిణీ పక్షపాతం - రోహిణిని ఇష్ట పత్నిగా నెత్తికెక్కించుకుని , ఇతర పత్నుల్ని కష్టపెట్టినందుకు ఆయన క్షయవ్యాధిని కొని తెచ్చుకున్నాడు. పర్యవసానంగా నెలలో పక్షం రోజులు వృద్ధి చంద్రుడుగా , పక్షం రోజులు క్షీణ చంద్రుడుగా ఉండాల్సి వచ్చింది. సృష్టిలో - ఈ విశ్వంలో సాగుతూ వస్తున్న చంద్రుడి వృద్ధి , క్షీణత వల్ల వాతావరణానికి మేలే జరిగింది కదా ! లోకాలకు హితమే జరిగింది కదా ! అదే విధంగా అంతరాళంలో నెలకొన్న చంద్రుడి వల్లా , ఆయన పత్నులైన అశ్వినీ , భరణీ మొదలైన ఇరవై ఏడు నక్షత్రాల వల్ల కూడా జరిగిందీ , జరుగుతుందీ లోకహితమే !"*


*"బాగుంది గురువుగారూ ! మీ విశ్లేషణ మాలో కలిగిన అనుమానాలను నివృత్తి చేసింది !"* శివానందుడు అన్నాడు.


*"సంతోషం , నాయనా ! ఇప్పుడు నవగ్రహాలలో మూడవ గ్రహమైన కుజుడి చరిత్ర శ్రవణం చేయండి !”* నిర్వికల్పానంద అన్నాడు. *"కుజుడు పరమశివుడి స్వేదబిందువు నుంచి ఆవిర్భవించాడనీ , భూదేవి ఆ బాలుడిని తన బిడ్డగా స్వీకరించిందనీ చెప్పుకున్నాం. కదా ! పరమేశ్వరుడు సూచించిన విధంగా , భూమాత కుజుణ్ణి కన్నబిడ్డలా చూసుకుంటోంది. కుజుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు...”*


*రేపటి నుండి కుజగ్రహ చరిత్ర చదువుకుందాము*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 80*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 80*


*నిర్వికల్ప సమాధి*


ఒక రోజు సాయంత్రం ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా నరేంద్రునికి అద్వైత పరాకాష్టయైన నిర్వికల్పసమాధి స్థితి సిద్ధించింది. ముందు అతడి తల వెనుక విభాగంలో ఒక దివ్యజ్యోతి కానవచ్చింది. పిదప అతడు మెల్లమెల్లగా బాహ్య, శరీర స్మృతులను కోల్పోయి సమాధిలో మగ్నుడయ్యాడు. ఇంద్రియాలకూ, మనస్సుకూ, లోకాలకూ, సమస్తానికీ అతీతమైన చైతన్యమయమైన నిర్వికల్పసమాధిలో లయించిపోయాడు. అలా చాలాసేపు గడచిపోయింది.


 సమాధిస్థితి నుండి దిగి వచ్చిన తరువాత కూడా అతడికి శరీర స్మృతి పూర్తిగా రాలేదు. తల మాత్రమే ఉండడం అతడి కెరుక, తక్కిన దేహం ఉన్నట్లు అసలు తెలియలేదు. కాబట్టి, "నా శరీరం ఎక్కడ? నా శరీరం ఎక్కడ?” అంటూ కేకలుపెట్టాడు. అతడి కేకలు విని పరుగున వచ్చిన పెద్దగోపాల్, అతడి శరీరాన్ని తాకి చూపి, "ఇదుగో ఉంది. నరేన్, ఇదుగో ఉంది" అన్నాడు. గోపాల్ మాటలు నరేంద్రునికి వినిపించినట్లు లేదు. ముందు మాదిరిగానే కేకపెట్టాడు. దాంతో భయపడిపోయిన గోపాల్

పరుగెత్తుకొని మేడ మీదికి వెళ్ళి శ్రీరామకృష్ణులకు ఈ విషయం వివరించి చెప్పాడు. 


అంతా ప్రశాంతంగా విన్న శ్రీరామకృష్ణులు నవ్వుతూ, "అతణ్ణి ఆస్థితి లోనే ఇంకా కొంతసేపు ఉండనివ్వు. ఈ స్థితి కావాలని పలుమార్లు అతడు నన్ను వేధించాడు" అన్నారు.


చాలాసేపు గడచిన తరువాతే నరేంద్రునికి బాహ్యస్కృతి వచ్చింది. కళ్ళు తెరచి చూసిన అతడికి తన చుట్టూ సోదర శిష్యులు విచారవదనంతో కూర్చుని ఉండడం కనిపించింది. ఇన్ని రోజులుగా అతడి మనస్సులో చెలరేగుతున్న తుపాను ఉపశమించింది: అమిత ప్రశాంతత నెలకొంది.


 ఆ తరువాత అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. అతణ్ణి ఆనందంగా చూస్తూ ఆయన, "కాళీమాత ఇప్పుడు నీకు సమస్తాన్నీ చూపించింది. కాని ఈ అనుభవం తాత్కాలికంగా తాళం వేయబడి ఉంటుంది. దాని తాళం చెవి నా వద్ద ఉంటుంది. నువ్వు ఆమె కార్యాన్ని పూర్తిచేయగానే ఈ పెన్నిధి మళ్లీ నీకు దక్కుతుంది; మళ్లీ నీకు సమస్తమూ "అవగతమవుతుంది" అన్నారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 70*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 70*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*మృణాళీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం*

*చతుర్భి స్సౌందర్యం సరసిజభవ స్త్సౌతి వదనైః |*

*నఖేభ్య స్సంత్రస్యన్ ప్రథమమథనా దన్ధక రిపో*

*శ్చతుర్ణాం శీర్షాణాం సమ మభయహస్తార్పణధియా ||*

*కంఠాధఃకటి పర్యంత మధ్యకూట స్వరూపిణీ*

*శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారణీ ||* 


అని శ్రీ లలితా సహస్రనామలలో చెప్పినట్లు ఈ శ్లోకములో అమ్మవారి హస్తములను వర్ణస్తున్నారు.


మృణాళీమృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం = అమ్మా నీ నాలుగు చేతులు కమలములవలే మృదువుగా వున్నాయి.


చతుర్భిః సౌందర్యం సరసిజభవ స్త్సౌతి వదనైః = ఆ నాలుగు చేతుల సౌందర్యమును చతుర్ముఖ బ్రహ్మ నాలుగు రెట్లుగా స్తుతించాడు.ఎప్పుడు ?


నఖేభ్య స్సంత్రస్యన్ ప్రధమమధనా దన్ధక రిపో = అంధకాసురుని మర్ధించిన శివుడు తన వాడియైన గోళ్ళతో

తన తలను త్రుంచివేసినప్పుడు దీని సందర్భమేమిటో అందరికీ తెలుసు కానీ మరొక్కమారు స్మరిద్దాం.

ఒకప్పుడు ఐదు శిరస్సులు కలిగిన బ్రహ్మకూ, విష్ణువుకూ తగాదా వచ్చిందిట.మనలో ఎవరు గొప్ప అని. ఆ సమయంలో వారిద్దరిమధ్య ఆద్యంతములు తెలియని ఒక పెద్ద జ్యోతిర్లింగ రూపంగా శివుడు ఉద్భవించాడట. ఆయన బ్రహ్మకూ విష్ణువుకూ చెప్పారుట.నా ఆద్యంతములు తెలుసుకుని ముందు ఎవరు వచ్చి చెపుతారో వారు గొప్ప అని.అప్పుడు విష్ణువు ఆదివరాహ రూపంలో భూమిని త్రవ్వుకుంటూ వెళ్ళారుట. బ్రహ్మ తన హంస వాహనం పై ఆకాశ మార్గన వెతుక్కుంటూ వెళ్ళారుట.ఎంతకాలమైనా వారిద్దరూ ఆ జ్యోతిర్లింగము యొక్క ఆద్యంతములు కనుగొనలేకపోయారు. విసుగు చెందిన బ్రహ్మ దారిలో ఎదురైన కేతకి(మొగలి)పుష్పాన్ని తాను శివలింగం యొక్క చివరి భాగాన్ని కనుగొన్నట్లుగా అబద్ధపు సాక్ష్యము చెప్పమన్నాడు.విష్ణువు విఫలుడై తిరిగిరాగా,బ్రహ్మ అబద్ధం చెప్పటంతో శివుడు తన వాడి గోరుతో ఆయన ఐదవ తలను త్రుంచివేశాడు. కేతకి పుష్పాన్ని దైవపూజకు అనర్హురాలిగా శాపమిచ్చాడు. బ్రహ్మ తన మిగిలిన నాలుగు తలలను ఖండిస్తారనే భయంతో అమ్మా అని ఆక్రందన చేశాడు.అప్పుడు అమ్మవారు వచ్చి తన నాలుగు హస్తాలను ఆయన నాలుగు తలలకు రక్షణగా నిలిపింది.అంటే సృష్టికర్తనూ,సృష్టినీ ఆమె కాపాడుతతుందని భావం.


          🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

మహనీయుడి పేరు శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి

 




హనుమాన్ ఆశీర్వాదంతో జన్మించిన సనాతన హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఉత్తరాది హిందీ రాష్ట్రాలను జాగృతం చేస్తున్న  ఓ యువ సంత్ గురించి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసే ఉంటుంది అనుకుంటారు.  

ఆ మహనీయుడి పేరు శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి  వయస్సు 27సం , గ్రామం ; గాఢ , ఛత్రపూర్ జిల్లా , మధ్యప్రదేశ్ రాష్ట్రం . వంశపారంపర్యంగా బ్రాహ్మణ పూజారి కుటుంబం, తన గ్రామంలో స్వయంభూగా వెలసిన  బాగేశ్వర్ బాలాజీ హనుమాన్ దేవాలయంలో పూజ కార్యకలాపాలు , హనుమాన్ ఉపాసకుడు , ప్రవచన కర్త .  ఆయన వాక్కు ఎలా ఉంటుందంటే  మన శ్రీ గరికపాటిగారిని + శ్రీ చాగంటి  గారి ఇద్దరు ఒక్కటిగా ఉంటే ఎలా ఉంటుందోఆయనే  శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి - బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ఆలా హిందూ ధర్మం , రామరాజ్యం , హిందూ ధర్మం , హిందూ దేశం గురించి దేశమంతా తిరుగుతూ హిందువులను చైతన్య పరుస్తున్నారు .  ఎక్కడ తొణకుడు బెణకడు - సూటిగా సుత్తిలేకుండా తలకెక్కుతుంది - భయమనేది అసలే లేదు 

ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సభ పెడుతున్నారంటే లక్షల్లో ప్రజలు వస్తారు , కనీసం దూరం నుంచి  చూస్తే చాలు  జన్మ ధన్యం అయ్యింది అనేవారు లక్షల్లో ఉన్నారు . 

ఒకానొక సందర్భంలో  బీహార్ లో  7 రోజుల రామ కథ ప్రవచనం అంటే , అక్కడి  ప్రభుత్వంమీరు అన్ని రోజులు  సబ పెడితే సెక్యూరిటీ ఇవ్వడం మావల్ల కాదు సభను కుదించండి అని వేడుకుంది ఎందుకంటే అంతకు కొన్ని నెలల ముందు  ఓ బీహార్ మంత్రి  "శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి" ఎలా వస్తారో చూస్తా అన్నాడు అప్పుడు ఆయన రానే వచ్చాడు ఒక్క రోజు సభ పెట్టారు  స్వచ్చందంగా 10 లక్షల మంది భక్తులతో తో పాట్నా నగరం అష్టదిగ్బంధనం అయ్యింది . ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయి  అదే "శ్రీ ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి"  ఈ పీఠాధిపతి  రాజకీయ నాయకుడు కాదు సుమా . 

ఎంతటి పేరుమోసిన జర్నలిస్ట్ అయినా ఆయన దగ్గర తోకముడవాల్సిo దే  తప్పదు అంతటి మాట చాతుర్యం ఈ సంత్ గురించి మన ఈటీవీ , టీవీ 9, వాళ్లకు తెలుసు కానీ హిందీ  భాష వల్లనో ఏమో మనకు చూపించరు 

ఈయన హనుమాన్ వరప్రసాదం పుత్రుడు - ఈయన సభలో నువ్వు ఎక్కడ కూర్చున్న నీ పేరు , నీ  తండ్రి  పేరు , నీ తాతగారి పేరు పెట్టి మరి పిలిచి నువ్వు  ఇంతకుముందు  చేసిన పనులు , నీ కష్టం , నీ భవిష్యత్తు అన్ని పూసగుచ్చి , ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు wahttsapp చాటింగ్ ఎవరితో చేస్తున్నావ్ కూడా చెప్పగలరు  - నీ భవిష్యత్తుకు మార్గం దిశా నిర్దేశం కూడా చేయగలడుఅంతటి దైవాంశ సంభూతుడు ఆయన పేరు కన్నా "బాగేశ్వర్ ధామ్ సర్కార్ "అంటేనే ఎక్కువ గుర్తు పడతారు 

ఒక్కసారి “Bageshwardhamsarkarofficial” అని youtube లో చూడండి ఆయనగురించి మీకే తెలుస్తుంది హైదరాబాద్ హిందీ కాకుండా ఒరిజినల్ హిందీ నేర్చుకోవాలి అనుకునే వారు ఈ సంత్ ప్రసంగం వింటే చాలు మీకు హిందీ వచ్చినట్టే 

జై శ్రీరామ్ - జై సీతారాం  - జై హనుమాన్