ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
27, నవంబర్ 2020, శుక్రవారం
పౌర్ణమి తిధి నిర్ణయం
_*ఈ సంవత్సరం పౌర్ణమి తిధి నిర్ణయం - సంశయ నివృత్తి*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఈసారి కార్తీక పౌర్ణమి తిధి 29వ తేదీ మధ్యాహ్నం 12.09 నిమిషాల నుండి మరుసటి రోజు మధ్యాహ్నం 2.03 నిమిషాలు వరకు ఉన్నందున భక్తులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు... ఏ రోజున కార్తీక పౌర్ణమి జరుపుకోవాలనేది సందేహం....దీనిని మిగులు...తగులు... అని అంటారు
పెద్దగా కంగారు పడవలసిన పని లేదు...
సహజంగా చంద్రునికి సంబంధించిన పండుగలలో వేద నిర్ణయం ప్రకారం...
*రాత్రులకు ప్రాధాన్యత ఉంటుంది...*
*అంటే దీపావళిని ఖచ్చితంగా ఆరోజు రాత్రి సమయంలో అమావాస్య తిధి కలిగి ఉన్న రోజున మాత్రమే జరుపుకొని తీరాలి...*
*అదేవిధంగా పౌర్ణమి కూడా...*
*రాత్రిపూట స్థిరంగా ఉండే తిధిని ప్రామాణికంగా తీసుకుని తీరవలసిందే....*
*ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన విషయం ఏమిటంటే... ఇతర పండుగలు జరుపుకుంటున్నట్లు , సూర్యోదయంలో ఉన్న తిధికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని మనం మరచిపోవాలి...*
*మరో ముఖ్య విషయం ఏమిటంటే...కృత్తిక నక్షత్రం పౌర్ణమి తిధిలో కలిగి ఉన్న మాసాన్ని కార్తీక మాసం అంటారనే విషయం అందరికి తెలిసినదే....*
*ఈ నక్షత్ర గమనం ప్రకారం కూడా... ఆదివారం రాత్రి పౌర్ణమి తిధితో కృత్తిక నక్షత్రం కలిసి ఉంటుంది..*
*ఆ విధంగా పౌర్ణమి తిధితో... కృత్తిక నక్షత్రం , సోమవారం ఉదయం 6:06 వరకు మాత్రమే జత కూడి ఉంటుంది...*
*కాబట్టి కార్తీక పౌర్ణమి ఖచ్చితంగా 29వ తేదీన... ఆదివారం మాత్రమే జరుపుకుని తీరాలి...*
*మరుసటి రోజు అంటే సోమవారం రాత్రికి జరుపుకుంటే రెండవ చంద్రుడు అవుతాడు... కృష్ణపక్షం వచ్చేస్తుంది...*
*కొంతమేర , సౌలభ్యత కోసం చెప్పుకోవాలంటే....*
*ఉపవాస నియమం ఉన్న... ఉండాలనుకునే వారు మాత్రం 29వ తేదీ ఉపవాస నియమాలు పాటించి...రాత్రిపూట ఒత్తులు వెలిగించుకొని , చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయవచ్చు...*
*ఉపవాస నియమం లేని వారు...*
*దీపాలు మాత్రమే వెలిగించాలనుకునేవారు 29వ తేదీ రాత్రి లేదా 30వ తేదీ ఉదయం ఆరు గంటల లోపు అంటే సూర్యోదయం కాకముందే ఒత్తులు వెలిగించు కోవచ్చు...*
*30వ తేదీ సోమవారం కూడాను....మరో లెక్క ప్రకారం కార్తీక మాసం 15వ రోజు కూడా అవుతుంది... కాబట్టి వత్తులు వెలిగించాలి అనుకునేవారికి మాత్రం 30వ తేదీ మధ్యాహ్నం లోపు నిరాహారంగా ఉండి...ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చును...*
*అదేవిధంగా నోములు , తోరాలు ఉన్నవారు కూడా 30వ తేదీ సోమవారం మధ్యాహ్నం లోపు ఆ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు... పౌర్ణమి తిధి ఉంటుంది కాబట్టి...*
*29వ తేదీ ఆదివారం సాయంత్రం కూడా నోములు , వ్రతాలు చేసుకోవచ్చు ఆక్షేపణ లేదు...*
*పెద్దగా ఇందులో సందేహించాల్సిన పని లేదు...*
*మనం భగవంతునికి ఆత్మ నివేదన చేసుకోవాలి... తద్వారా చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా భగవంతునికి ప్రీతిపాత్రమే...నిరంతర నామస్మరణతో సర్వేశ్వరుడు మన వెన్నంటే ఉంటారు...*
*ఓం నమఃశివాయ*
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
జయలక్ష్మి పిరాట్ల.హైదరాబాదు
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
ప్రసిద్ధ కవి నవలాకారులు అయిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారుపశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి లో 1867 సంవత్సరం సెప్టెంబర్ 26న జన్మించారు వీరి తల్లిదండ్రులు రత్నమ్మ వెంకన్న వీరవాసరం గ్రామంలో ప్రాథమిక విద్యను నర్సాపురం లో సెకండరీ విద్యను అభ్యసించారు 1887లో రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన కొంతకాలం రాజమండ్రిలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఆ తర్వాత పోలవరం జమిందార్ ప్రారంభించిన సరస్వతి పత్రిక కు సహాయ సంపాదకునిగా పనిచేశారు మీరు కొంతకాలం మనోరమ దేశమాత అనే పత్రికను కూడా నడిపారు చిలకమర్తివారు అనేక గ్రంథాలు రాశారు ఆయన రచనలు గణపతి రామచంద్ర విజయం హేమలత అహల్యాబాయి రాజస్థాన కథాకళి కర్పూర మంజరి ద్రౌపదీ పరిణయం గయోపాఖ్యానం ఇంకా ఎన్నోప్రహసనాలుమొదలగునవి రచనలు వీరు గొప్ప దేశ భక్తులు సంఘ సంస్కర్త 1914 సంవత్సరంలో జరిగిన కాంగ్రెస్ మహాసభ లో పాల్గొని దక్షిణాఫ్రికా సమస్యపై ఉపన్యసించారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు19 43 కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేసింది బాధకర విషయం ఏమిటంటే చిలకమర్తివారువారికి 26సంవత్సరములప్పుడు సంపూర్ణ అంధులు అయినారు అయిన ను వీరు.లేఖకునిద్వారా తెలుగు సాహిత్యానికి యనలేని సేవ చేశారు వీరినిఆంధ్ర మిల్టన్ అని పిలిచేవారు బెంగాల్ విభజన జరిగిన సందర్భంలో బి.పి.న్ చంద్రపాల్ దొరతనం వారికి చర్యను ఖండించండి అను విషయం పురస్కరించుకుని కలకత్తా నుండి బయలుదేరి రాజమహేంద్ర వారు వచ్చి ఇన్నీస్ పేట లో ఉపన్యసించిరి అప్పటినుండిఆపేటకు పాల్ చౌక్ అని పేరు వచ్చింది బిపిన్ చంద్ర పాల్ గారి ఉపన్యాసము విని జనులు ఆ ఇంగ్లీష్ ఉపన్యాసం తమకు తెలుగులో చెప్పమనగాచెప్పితరువాతచిలకమర్తివారి ఈ క్రింది పద్యమును బహిరంగముగా చెప్పిరి
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి
ఈ పద్యం విని సంతోష పారవశ్యం తోప్రజలు బ్రహ్మాండం పగులు నట్లు చప్పట్లు కొట్టిరి
ఈ పద్యము అన్ని పత్రికలలోనూ ప్రచురించిరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రాసిన ఈ పద్యం ప్రజలందరూ ఆ రోజుల్లో పాడుకొనే వారట చిలకమర్తి వారికి మూఢ విశ్వాసము లపై నమ్మకం లేదుఆరోజులో బ్రిటిష్ వారు దేశాభిమాని మహా పురుషుడు అయిన లాలాలజపతి రాయ్ గారి ని పట్టుకొని నగరంలో ఖైదు చేసి రి లాలాలజపతి రాయ్ గారి ప్రవాస మును గురించి ఈ క్రింది పద్యం చిలకమర్తివారు రచించి చదివిరి
చెరశాలలు పృథు చంద్ర శాల.లె యగున్ చేదోయి గీలిపించు న
య్యర దండల్ విరి దండలయ్యడును. హేయంబైన చోడంబలే
పరమాన్నం బగు మోట కంబళ్ళు దాల్పన్ పట్టు సెల్లా lలగున్
స్ధిరు డై యేనరుడాత్మ దేశమును భక్తి గొల్పు నవ్వానికిన్
ఈ విధంగా కవితలు గ్రంథములు ఎన్నో ప్రహసనాలు వ్రాసి ఈ మహాకవి19 46 జూన్ 17న మరణించినారు చిలకమర్తివారు స్వీయ చరిత్ర కూడా రాసిరి కన్నులు లేకున్నను చిలమర్తివారుతెలుగు సాహిత్యానికి నిరూపమైనసేవచేసిరి🙏🙏🙏
జయలక్ష్మి
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము
పతు లిరువురు యిలు వీడగ
వెత లన్నియు వెంటబడగ విధి వక్రించీ
ప్రతి దినమున బిక్షాటన
గతిలేకను చేయువలసె కడువ్యధ తోడన్ 91
ప్రతి దినమున యా కళావతి
యతి వినయముతోడ వెళ్లి యా పురమందున్
మతిమంతుల గృహమందున
యతి దీనత నడుగుకొనును యన్నము బిక్షన్ 92
పూర్వ రీతిగ నొకనాడు పురము నందు
తరుణి భిక్షకు తిరుగుచు దాహమయ్యు
యాగి నొక విప్రు గృహమున యలస టొంది
గాంచె నచ్చోట జరుగుట ఘన వ్రతంబు 93
గమనించె నట కళావతి
తమ యింటిలొ సత్య వ్రతము సల్పెడు విప్రున్
కమలాక్షు వ్రతము జూచియు
శ్రమ దక్కియు నుండె నచట సంతోషమునన్ 94
సత్యనారాయణస్వామి సద్వ్రతంబు
శాస్త్ర యుక్తంబుగా నచట సల్పుచుండ
క్రతువు జూచి కళావతి కలుగ భక్తి
తీర్ధమును యా ప్రసాదంబు తీసుకొనియె 95
క్రతువు మొత్తము జూచియు కథను వినియు
తీర్ధమును ప్రసాదంబును తీసుకొనియు
కొంత తల్లికి గైకొని సంతసమున
యింటి కెళ్ళగ జాగయ్యె యీశ్వ రేచ్చ 96
ఆలస్యంబుగ కూతురు
యేలా యిపుడొచ్చనంచు విస్మయ మందీ
లీలావతి యిట్లడిగెను
తాలిమిసహనంబు తోడ తగు మృదు భాషన్ 97
"ఇంత రాత్రి వఱకు యెచ్చోట నుంటివి ?
కారణంబు యేమి కలుగ జాగు
దిగులు కలిగె నాకు తెల్పుము పుత్రికా !
మనసు లోని మాట మాటు లేక " 98
మాత యడుగ నిటుల మానిని కూతురు *
పరమతోషమునను పలికె నిట్లు
"తిరిప మెత్తు నేను తిరుగుచూ తిరుగుచు
వెళ్లి యుంటి నొక్క విప్రు గృహము 99
అచట సత్యవ్రతము యాచరించుచు నుండ
భక్తి తోడ నేను పరవశించి
చివరి వరకు యుండి తీర్థంబు గొనియును
వచ్చు చుంటి నేను వడిగ వడిగ " 100
సశేషము...
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
శివ నిర్వాణ షట్క స్తోత్రం**
**ఓం నమః శివాయ**
**జగద్గురు ఆదిశంకర శంకరాచార్య కృత శివ నిర్వాణ షట్క స్తోత్రం**
**నిర్వాణ షట్కం లేదా ఆత్మషట్కం**
వేదాంతపరంగా చాలా గొప్ప భావన ఇది! సర్వ జీవులలోనూ భాసించు 'ఆత్మతత్త్వం', 'శివతత్త్వం' అందరిలోనూ ఒకే విధంగా ఉంటుంది! 'శివం' అనగా నిరాకారం, నిర్వికారం, నిరంజనం, నిర్గుణం, కేవలం, శుద్ధం, పూర్ణం, ఆనందం, తురీయం, తురీయాతీతం, ఆత్మనిష్ఠ, ఆత్మ నిత్యసత్యావస్థ, అనంత శుద్ధ చైతన్య జ్యోతిస్వరూపం. 'నిర్వాణం' అంటే సూక్ష్మంగా చెప్పాలంటే 'మోక్షం'! ఆరు శ్లోకాలలో 'ఆత్మ స్వరూపాన్ని' గురించి అద్భుతంగా బోధచేసారు ఆదిశంకరులు.
ఈ శ్లోకాలు 'ఆత్మతత్వాన్ని' గురించి చక్కగా తెలియచేశాయి కనుక, ఈ ఆరు శ్లోకాలని 'ఆత్మషట్కం' అని కూడా కొందరు అంటారు. 'షట్కం' అంటే ఆరు! ప్రపంచ సాహిత్యం మొత్తం మీద ఇలా 'వేదాంత సారాన్ని' ఇంత సరళంగా, క్లుప్తంగా చెప్పిన జ్ఞాని మరెవ్వరూ ఉండకపోవచ్చు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు!
సర్వజీవులలోనూ వెలుగొందు 'ఆత్మస్వరూపం, శివస్వరూపం' ఒక్కటే. సర్వేశ్వరుని సృష్టిలో సర్వజీవరాశులూ సమానమే. కావున అందరూ జాతి, వర్ణ, కుల, మత బేధాలు లేకుండా పరమేశ్వరుని ఏ రీతిలోనైనా ఆరాధించవచ్చును, 'శివయోగదీక్ష' గైకొని 'శివస్తోత్ర పఠనం' చేయవచ్చును. 'శివతత్వమును' హృదయమున నిలుపుకొనవచ్చును. వేదాంత సారమంతా ఈ ఆరు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన ఆది శంకరులకు నమస్సులు 🙏🙏🙏.
#శ్రీజగద్గురు #ఆదిశంకరాచార్యకృత #తాత్పర్యసహిత #నిర్వాణషట్కము...
'జగద్గురువు శ్రీ ఆది శంకరభగవత్పాదాచార్యుల వారు' ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి?" అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం 'అద్వైత వేదాంతాన్ని, ఆత్మస్థితి' ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "#ఆత్మషట్కము" అని కూడా అంటారు. 'నిర్వాణం' అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక 'శుధ్ధచేతన స్థితి'. అదే 'సచ్చిదానందం'. సమస్త అద్వైత సిద్ధాంత సారం 'నిర్వాణషట్కం' (ఆత్మషట్కం)
1. **మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్**
**న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే**
**న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః**
**చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**
భావం: మనసు, బుద్ధి, నేను నాది అనే తపన అంటే అహంకారము, చిత్తము,ఇవి నేను కాను. కర్ణము,జిహ్వ,ఘ్రాణము ఇవియును నేను కాను. పృథివ్యాపస్తేజోవాయురాకాశములు నేను కాను.అంటే పంచ భూతాత్మకమైన పంచకర్మేంద్రియములకు పంచజ్ఞానేంద్రియములకు విధేయుడను కాను. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.
సచ్చిదానందానికి సులభమైన నిర్వచనము
'సత్ అంటే సత్యము – చిత్ అనిన జ్ఞానము -పర సుఖమే ఆనందము'.
2. **న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః**
**న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః**
**న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు**
**చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**
పంచవాయువులు:
ప్రాణ : శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు
అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు
వ్యాన: శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం
ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు
సమాన: జీర్ణమవటానికి ఉపయోగించే వాయువు
ఉప ప్రాణాలు
నాగ : త్రేన్పు గా వచ్చే గాలి
కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి
కృకల : తుమ్ము
ధనంజయ :హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.
దేవదత్తం : ఆవులింత లోని గాలి
భావం: ఈ ఐదు వాయువులు, ఐదు ఉపవాయువులు మన శరీరమును నిర్దేశించుతాయని శాస్త్ర వాక్యము.ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు. ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది అని శాస్త్రము చెబుతుంది.
సప్త ధాతువులు: రక్తమాంసమేధోస్థిమజ్జారసశక్రములు (చర్మము, రక్తము, మాంసము, అస్తి, కొవ్వు, మజ్జ, శక్రం). ఇందులో చర్మము రక్తము మాంసము ఎముకలు క్రొవ్వు అందరికీ తెలిసినవే. మజ్జ అంటే ఎముక లోపలవుండే గుజ్జు, దీనినే bone marrow అని ఆంగ్లములో అంటారు. 'తస్స' అంటే ఈ 'మజ్జ'యే.
పంచ కర్మేంద్రియములు : వాక్పాణిపాదోపస్థపాయువులు. అంటే మాట-వాక్కు, చేయి-చేత,పాదములు-కాళ్ళు,ఉపస్థ-జననేంద్రియము,పాయువు-గుదము, ఉపస్థాపాయువులు అంటే పురీష శౌచ ద్వారములు.
నేను, పైన తెలిపినవేవీ కాను. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.
3. **న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ**
**మదో నైవ మే నైవ మాత్సర్య భావః**
**న ధర్మో న చార్థో న కామో న మోక్షః**
**చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**
భావం: నాకు రాగ ద్వేషములు లేవు. లోభామోహములు లేవు. మదమాత్సర్యములు లేవు. ధర్మార్థకామ మోక్షాలు లేవు. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.
4. **న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్**
**న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః**
**అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త**
**చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**
భావం: నాకు పుణ్య పాపములులేవు. సుఖ దుఖ్ఖములు లేవు. మంత్ర తీర్థ దాన యజ్ఞాలులేవు. నేను భోజన క్రియనుగానీ , భోజనమునుగానీ, భుజించేవాడినిగానీ కాదు. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.
5. **న మే మృత్యు శంకా న మే జాతి భేదః**
**పితా నైవ మే నైవ మాతా న జన్మః**
**న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః**
**చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**
భావం: నాకు మృత్యువు, భయము లేక సందిగ్ధత, జాతిరీతులు, తల్లిదండ్రులు, అసలు జన్మమే లేదు. బంధువులు మిత్రులు, గురువు, శిష్యులు ఏమీ లేవు. చిదానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.
మరి నేనెవరు ????
6. **అహం నిర్వికల్పో నిరాకార రూపో**
**విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం**
**న చాసంగత నైవ ముక్తిర్ న మేయః**
**చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**
వికల్పము : మతి భ్రమ, ఉల్లంఘనం జ్ఞాపకశక్తి, ఆలోచన తగ్గిపోవు లక్షణము కలిగిన మానసిక స్థితి అస్తవ్యస్తం, తారుమారు.
భావం: నేను వికల్పములకు అతీతుడను. ఎటువంటి వికల్పములూ నన్నంటవు. నేను సర్వవ్యాపిని. కావున నిరాకారుడను. నిరాకారుడనుకావున నేను నిరంజనుడను (దోషము లేని వాడిని). నాకు ఏవిధమైన ఇంద్రియ సంబంధము లేదు. నాకసలు బంధమూ లేదు మోక్షము లేదు. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.
"ఆత్మ" ను గూర్చి ఇంత వివరంగా విశదంగా విపులంగా అబుద్ధికి గూడా బోధపడు విధముగా చెప్పిన 'ఆది శంకరులకు' అంజలి ఘటించుట తప్ప అన్యము చేయ నశక్తులము.
**ఓం నమః శివాయ**
**జగద్గురు ఆది శంకరాచార్య కృత శివ నిర్వాణ షట్క స్తోత్రం**

**శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం**
🙏🙏🙏
సే కరణ
**శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం**
🙏🙏🙏
గుడికి వెళ్లి పూజచేయడం
ఇంట్లో దేవుని పటాలు ఉండగా గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?
ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు ‘గుడికి వెళ్లి పూజచేయడం ఎందుకు?’ అనే సందేహం చాలా మందికి వస్తుంది. దేవాలయంలో మూలవిరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దానిమీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తైనా ప్రతి కోణానికీ తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమిలోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావడంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తిక్షేత్రం ఏర్పడుతుంది.
నిజానికి స్వయంభూ దేవాలయాలన్నింటి దగ్గరా ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును రుషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక, మంత్రబలంతో ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్లొ నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్లతరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్లడం గొప్పవిషయంగా చెబుతారు....మీ... Chandrasekhar rallabhandhi
ధార్మికగీత - 93*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 93*
*****
*శ్లో:- నాస్తి మేఘ సమం తోయం ౹*
*నాస్తి చాత్మ సమం బలం ౹*
*నాస్తి చక్షు సమం తేజ: ౹*
*నాస్తి చాన్న సమం ప్రియమ్ ౹౹*
*****
*భా:- సృష్టిలో భగవంతుడు మానవాళికి ప్రసాదించిన అపూర్వమైన వరాల్లో నాలుగింటి పట్ల సదా మనం కృతజ్ఞులమై ఉండాలి. 1."మేఘము":- మేఘాలు వర్షించి జీవకోటికి త్రాగునీరు, పొలాలకు సాగునీరు ఇస్తున్నాయి.నీరు లేనిదే పనే లేదు. నీరే ప్రాణాధారము.మేఘాలు కురవకుంటే దుర్భిక్షమే. అపార జలసిరిని ఇచ్చే మేఘంతో సమానమైన వేరే జలం లేనేలేదు. 2. "ఆత్మబలం":- మనిషికి అంగ,ఆర్థిక,కండబలా లెన్ని ఉన్నా, మహత్తర కార్యసాధనకు "ఆత్మబలం" కావాలి. హనుమ సముద్రలంఘనానికి, భగీరథుని గంగావతరణ కార్యసాఫల్యానికి, సతీసావిత్రి పతి ప్రాణసాధనకు వారి "ఆత్మబలమే" ప్రధాన కారణము. ఆత్మబలంతో సమాన బలం వేరే యేది లేదు. 3. "చక్షువు":- సృష్టి లోని మహనీయ , కమనీయ, రమణీయ సుందరదృశ్యాలను తనివితీరా చూడగలిగేది మన "కన్ను". అది లేకుంటే అంతా అంధకార బంధురమే. కోటి మేటి విద్యుత్ కాంతులు విరజిమ్మే దీపాలు వెలిగించినా కంటి చూపుకు మించిన తేజస్సు లేదు. 4".అన్నము":- అన్ని జీవాలు అన్నం తినే బ్రతుకు తున్నాయి.ఎన్ని ఉపాహారాలు, చిరుతిండ్లు,పాలు,పండ్లు తిన్నా, అన్నం తినకుంటే తృప్తి ఉండదు.ఈ అన్నానికి కారణం మేఘమే.గూడు, గుడ్డ లేకున్నా బ్రతకవచ్చు. కాని అన్నం లేకుంటే మనలేము. అన్నంతో సాటిరాగల ప్రియమైన ఆహారం మరొకటి లేదు. కాన వాటి విలువలను గ్రహించి, జలాన్ని, అన్నాన్ని వృథాచేయరాదని, ఆత్మబలం పెంపొందించుకోవాలని,కంటిని జీవితాంతం పదిలంగా చూచుకొంటూ, సుఖజీవనయానం చేయాలని సారాంశము,*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
దీపం పెట్టవలసిన ముఖ్యప్రదేశాలేవి
🌹🥀🌸💐🌷🌺🌾
*ఇంట్లో దీపం పెట్టవలసిన ముఖ్యప్రదేశాలేవి*
దేవుని వద్ద మొదటిసారి దీపం వెలిగించాలి. గడపకు రెండువైపులా పెట్టే దీపాన్ని దేహళీ దత్త దీపం అంటారు.
*గడపపైన దీపం పెట్టకూడదు.*
గడపకు బయట వీధివైపు దీపం ప్రమిదలో పెట్టాలి. తులసికోట వద్ద, ధాన్యాగారం వద్ద, బావివద్ద ఈ అయిదు ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా దీపం పెట్టాలి.
ముఖ్యంగా కార్తికంలో పితృదేవతలను తలచుకుంటూ దీపం వెలిగించాలి.
ఉదయవేళలో అయితే సూర్యునికి నమస్కరించాలి. సాయంత్రవేళలో చంద్రునికి పక్కనే ఆర్థనక్షత్రం సాక్షాత్తూ శివస్వరూపంగా వెలుగుతూ ఉంటుంది.
సాయంత్రంపూట దీపారాధన అయిన వెంటనే నక్షత్రదర్శనం చేయాలి.
*భక్తి*
M.s.s.k
. శ్రీ దేవీ మహత్యము
*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 27 / Sri Devi Mahatyam - Durga Saptasati - 27 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 8*
*🌻. రక్తబీజ వధ - 1 🌻*
1-3. ఋషి పలికెను : చండదైత్యుడు వధింపబడి, ముండుడు కూల్పబడి, సైన్యంలో చాలా భాగం నాశనమైన పిదప దైత్యనాథుడూ ప్రతాపశాలి అయిన శుంభుడు కోపంతో పరవశతనొందిన మనస్సుతో అసుర సెన్యాలనన్నింటిని సన్నద్ధమై ఉండమని ఆదేశించాడు.
4. ఇప్పుడు ఎభై ఆర్గురు అసురులు- ఆయుధాలు ఎత్తి సిద్ధంగా పట్టుకొని- తమ బలాలు అన్నిటితో, స్వబలపరివేష్టితులైన ఎనభై నలుగురు "కంబులు”* వెడలిపోవుదురు గాక.
5. “నా ఆజ్ఞను పరిపాలించి కోటివీ ర్యాసుర* కుటుంబాలు ఏభై, ధౌమ కుటుంబాలు నూరూ బయలు వెడలుగాక.
6. “కాలక దౌర్హృదులు. మౌర్యులు, కాలకేయులు – ఈ అసురులందరూ కూడా నా ఆజ్ఞానువర్తులై వెంటనే యుద్ధసన్నద్ధులై బయలుదేరుతారు గాక.”
7. ఈ ఆజ్ఞలను ఇచ్చి చండశాసనుడు, అసుర నాథుడు అయిన శుంభుడు అనేకసహస్ర సంఖ్యగల మహా సైన్యంతో తాను బయలుదేరాడు.
8. అతిభయంకరమైన ఆ సైన్యపు రాకను చండిక చూసి తన అల్లెత్రాటి టంకారధ్వనితో భూమ్యాకాశాల మధ్య ప్రదేశాన్నంతా నింపివేసింది.
9. అంతట, రాజా! సింహం మహానాదం చేసింది. అంబిక ఆ సింహనాదాలను తన ఘంటానాదంతో ఇంకా వృద్ధిపరిచింది.
10. కాళి తన నోటిని విస్తారంగా తెరిచి, దిక్కులను హుంకార శబ్దాతో నింపి, ధనుష్టంకారం యొక్క, సింహం యొక్క, ఘంట యెక్క నాదాలను వినబడకుండేట్లు చేసింది.
11. ఆ నాదాన్ని విని అసుర సైన్యం రోషంతో (చండికా) దేవిని, సింహాన్ని, కాళిని నాలుగు దిక్కులా చుట్టుముట్టారు.
12–13. ఓ రాజా! ఆ సమయంలో సురవైరులను నాశనం చేయడానికి, అమరేశ్వరుల శుభం కొరకూ బ్రహ్మవిష్ణుమహేశ్వరుల, కుమారస్వామి, ఇంద్రుని శరీరాల నుండి బహుబలపరాక్రమాలు గల శక్తులు: బయలువెడలి ఆయాదేవతల రూపాలతో శక్తి వద్దకు వచ్చారు.
14. ఏ దేవునిది ఏ రూపమో, అతని భూషణాలు వాహనాలతో ఆ విధంగానే అతని శక్తి అసురులతో యుద్ధం చేయడానికి వచ్చింది.
15. హంసలు పూన్చిన విమానమెక్కి, మాలా కమండలువులతో బ్రహ్మ యొక్క శక్తి వచ్చింది. ఆమె పేరు బ్రహ్మాణి.
16. ఎద్దు పై ఉత్తమమైన త్రిశూలం ధరించి, పెద్ద సర్పాలను గాజులుగా కలిగి, చంద్రరేఖ విభూషణంగా దాల్చి మాహేశ్వరి వచ్చింది.
17. చేత బల్లెం దాల్చి, చక్కని నెమలిని ఎక్కి, కుమారస్వామి రూపంతో, అంబికా కౌమారి దైత్యులతో యుద్ధానికి వచ్చింది.
18. అలాగే విష్ణుశక్తి గరుడునిపై ఎక్కి, శంఖం, చక్రం, గద, శాస్రం (ధనుస్సు), ఖడ్గం, చేతులలో ధరించి వచ్చింది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹