21, సెప్టెంబర్ 2023, గురువారం

కొండనాలుక సమస్య నివారణ -

 కొండనాలుక సమస్య నివారణ  - 


    దాల్చిన చెక్క ని నీటితో రాయి మీద అరగదీసి ఆ గంధాన్ని దూది చుట్టిన పుల్లకు అద్ది కొండనాలుక కు రోజు మూడు పూటలా అంటిస్తూ ఉంటే మూడు రోజుల్లో కొండనాలుక యధాస్థితికి వస్తుంది. దగ్గు తగ్గుతుంది . 


  

    మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

పదకొండవ సంవత్సరము రాగానే

 *అన్యాయోపార్జితం విత్తం దశవర్షాణి తిష్ఠతి /*

*ప్రాప్తేచైకాదశే వర్షే సమూలంచ వినశ్యతి //*

*!! తా !!*

*అన్యాయంగా సంపాదించిన ధనం పది సంవత్సరాలు ఉంటుంది. పదకొండవ సంవత్సరము రాగానే ఆ ధనం సమూలంగా నశిస్తుంది"*

Panchaag

 


Maha kaleswar


 

Mechanical movement


 

Boomerang


 

Totakura purush

 


హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు,

 🎻🌹🙏హనుమాన్ చాలీసా పై ప్రశ్నలు, సమాధానములు...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు? 


🌸జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.


🌿ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం  వచ్చినపుడు, ఎవరైనా  గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.



🌸12. రాక్షస సంహారానికై  హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?


🌿జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం  చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. 


🌸ఆ సంగతి  నారదుని ద్వారా  హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. 


🌿వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ  ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, 


🌸ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.



🌿13 . రామకార్యం  చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?


🌸జ. మైనాకుని ఆతిథ్యం  స్వీకరించకుండా వెళ్ళడంలో.



🌿14 . సీతారాములు పట్టాభిషేక  అనంతరం  హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?


🌸జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన  అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని  బహుమతిగా  ఇచ్చాడు.



🌿15.  కపీశ అంటే అర్థం ఏమిటి?


🌸జ. కపీశ  అంటే...

a) కపులకు ఈశుడు

b) కపి రూపంలో ఉన్న ఈశుడు

సి) కం(జలం)  పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా  తేజస్వరూపుడు అని అర్థం.



🌿16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?


🌸జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు 



🌿17. హనుమ రామదూత ఎలా అయ్యాడు  ?


🌸జ. రాముని ఉంగరాన్ని దూతలా  వెళ్ళి  సీతమ్మ కు ఇచ్చాడు. వేదం  అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే  

అగ్ని ముఖావై దేవాః. 

దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము.


🌿 అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు  దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం  అంటే  సృష్టి  క్రమంలో  ఆకాశం నుండి వాయువు వచ్చింది. 


🌸వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి  వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో  పోల్చారు.


🌿 అగ్ని ఏవిధంగా  అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను  పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు.


🌸 అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు  హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత  అని మాత్రమే కాదు.



🌿18 . అతులిత బలధామా  అంటే అర్థం ? ఒక ఉదాహరణ?


🌸జ. ఎవ్వరితో  పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే  సీతాన్వేషణ కై హనుమని  ఎంచుకోవడం.



🌿19 . ఇంతకూ  హనుమ కేసరి నందనుడా?  వాయు పుత్రుడా?


🌸జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు  సూర్య  నాడి ద్వారా  వాయుదేవుడు  సర్వ దేవతా తేజస్సు  ప్రవేశ  పెట్టాడు కాబట్టి  ఇద్దరికీ.



🌿20 . నామస్మరణ మహిమ ఏమిటి?


🌸జ. కలియుగంలో  తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం....స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

మన పార్లమెంట్

 *మన పార్లమెంట్*                                                       కొత్త పార్లమెంటులో ఆరు ద్వారాలకు సంబంధించి ఆసక్తికర విషయాల్ని చూస్తే.. వావ్ అనుకోవాల్సిందే. ఆరు దర్వాజాలకు పౌరాణిక నేపథ్యం ఉన్న ప్రాణుల పేర్లు పెట్టారు. ఈ గుమ్మాలకు వాటిని కాపలాగా ఉంచిన వైనం.. అందుకురూపొందించిన శిల్పాల్ని చూసినంతనే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ద్వారాలకు పెట్టిన పేర్లు కూడా ఘనచరిత్రను ప్రతిబింబించేలా ఉన్నాయని చెప్పాలి.


కొత్త పార్లమెంటు భవనంలో మొత్తం ఆరు ద్వారాలు ఉన్నాయి. వీటికి పెట్టిన పేర్లు చూస్తే..


1. గజ ద్వారం


2. అశ్వ ద్వారం


3. గరుడ ద్వారం


4. మకర ద్వారం


5. శార్దూల ద్వారం


6. హంస ద్వారం


'గజ ద్వారం' ప్రత్యేకత ఏమంటే.. పార్లమెంటు కొత్త భవనం ఉత్తరం వైపు ఉన్న ఈ ద్వారానికి బుద్ధి.. సంపద.. జ్ఞాపకశక్తి.. జ్ఞానానికి ప్రతీకగా చెప్పే గజరాజు పేరును దీనికి పెట్టారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం బుధగ్రహంతో సంబంధం ఉందని.. ఇది తెలివికి మూలమని విశ్వసిస్తారు. రెండో ద్వారం పేరు అశ్వ ద్వారం. గుర్రం పేరు మీద ఈ గుమ్మానికి పేరుపెట్టటమే కాదు.. దీనికి కాపలాగా అందమైన గుర్రం బొమ్మల్ని చెక్కారు. శక్తికి.. బలానికి.. ధైర్యానికి నెలవుగా గుర్రాన్ని చెబుతారు. పాలనలో కావాల్సిన లక్షణాల్ని ఈ ద్వారం గుర్తు చేస్తుందని చెబుతున్నారు. మూడో ద్వారం పేరు గరుడ ద్వారం. శ్రీమహా విష్ణువు వాహనమైన గరుడ వాహనం పక్షులకు రాజుగా చెబుతారు. శక్తికి.. ధర్మానికి చిహ్నంగా గరుడను చెబుతారు. అనేక దేశాల చిహ్నాలపై గరుడ బొమ్మ ఉండటం తెలిసిందే. తూర్పు ద్వారంగా ఉండే గరుడ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.


చేపను మకరంగా పిలవటం తెలిసిందే. మకరం వివిధ జీవుల కలయికగా పేర్కొంటారు. మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం అన్న మాటకు నిదర్శనంగా దీన్ని ఏర్పాటు చేశారు. పాత పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వైపు మకర ద్వారాన్ని ఏర్పాటు చేవారు. ఐదో ద్వారం శార్దూలం పేరుతో ఏర్పాటు చేవారు. దేశ ప్రజల శక్తిని సూచించేలా దీన్ని ఏర్పాటు చేశారు. ఆరో ద్వారానికి హంస ద్వారమన్న పేరును పెట్టారు. హంస మోక్షానికి నెలవుగా చెబుతారు. జనన.. మరణ చక్రం నుంచి ఆత్మ విముక్తిని సూచన చేసే హంసను ఆరో ద్వారంగా ఏర్పాటు చేశారు.        *సేకరణ*

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


*ప్రథమాశ్వాసము*


           *1*



ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.


శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే

లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం

తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై

ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.


ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.


రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే

జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా

రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా

రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్


ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది.


*ప్రథమాశ్వాసము*


అవతారిక, మొదలగున్నవి, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు.


పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు కురుంక్షేత్ర యుద్ధంలో మరణించాడు. అభిమన్య, ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల శునకం అయిన సరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగాడు. అది చూసిన జనమేజయుని కుమారులు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమారు.


సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయం చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి " జనమేజయా ! నీ తమ్ముళ్ళు విచక్షణ కరుణ లేకుండా నా కుమారుడిని కొట్టారు. రాజా ! యుక్తా యుక్త విచక్షణ లేకుండా మంచి వారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చిపడతాయి." అని పలికి అక్కడి నుడి వెళ్ళిపోయింది.


యజ్ఞం పూర్తిచేసి జనమేజయుడు హస్థినాపురం పోయిన తరువాత ఒక రోజు సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. జరిగిన అపరాధానికి పరిహారం జరపక పోయినట్లైతే సమస్యలు ఎదురు కాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సుతశ్రవణుడు అనే మునిని కలుసుకుని నమస్కరించి " మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్విక్కుగా పంపించండి" అని ప్రార్థించాడు. అందుకు సుతశ్రవణుడు అంగీకరించి తన కుమారుడిని జనమేజయుని వద్దకు పంపాడు. జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేసాడు.