13, అక్టోబర్ 2023, శుక్రవారం

Permanent fountain


 

 


Life doesn't give you everything in order.

All it throws at you is a mess.


Its your positivity, creativity, and fun that put things in order, and bring beauty to it.

Mental peace


 

Panchaag


 

లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*విదేశీ ప్రయాణం-స్థిర నివాసం*


ప్రస్తుత కాలంలో చాలామంది విదేశాలకు వెళ్లాలని అక్కడ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని మరికొంతమందికి అక్కడ స్థిరంగా ఉండాలని కోరిక ఉంటుంది. మరి కొంతమందికి విదేశాలు వెళ్లి అక్కడ అందమైన ప్రదేశాలు చూడాలని టూరిస్ట్ గా కోరికలు ఉంటాయి. జాతకరీత్యా గ్రహ స్థితి అనుకూలంగా ఉన్న జాతకులు మాత్రమే విదేశాలకు వెళ్లడం స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. జ్యోతిషరీత్యా ఈ వివరాలను పరిశీలిద్దాం. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే భాగ్యస్థానము ద్వాదశ స్థానము పరిశీలించాలి. భాగ్యాధిపతి కానీ భాగ్య స్థానంలో ఉన్న గ్రహాలు కానీ అదేవిధంగా ద్వాదశ అధిపతి మరియు ద్వాదశ స్థానంలోని గ్రహాలు వీటి యొక్క దశ అంతర్దశలలో విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. భాగ్య అధిపతి అయితే విదేశాలకు వెళ్లి కొద్ది రోజులు ఉండి మాత్రం వచ్చేస్తారు అనగా టూరిస్ట్ గా కానీ బంధువులు ఇళ్ళకు గాని వేరే ఇతర కారణాలు గాని  వెళ్లి రావచ్చు ద్వాదశ అధిపతికి సంబంధం వస్తే మాత్రం ఎక్కువ కాలం పాటు విదేశాలలో ఉంటారు అయితే పర్మినెంట్ సెటిల్మెంట్ మాత్రం కాదు. పర్మినెంట్ గా విదేశాలలో ఉండాలంటే రాహువు శని భగవానుడు యొక్క స్థితిని పరిశీలించాలి. రాహు 12 వ స్థానంలో ఉంటే విదేశాలలో స్థిర నివాసానికి అవకాశాలు ఉంటాయి శని భగవానుడు కుటుంబ స్థానంలో కానీ చతుర్ధ స్థానంలో కానీ ఉన్నప్పుడు లేదా చతుర్ధ అధిపతికి ద్వాదశ అధిపతికి సంబంధం ఉన్నప్పుడు విదేశాలలో స్థిర నివాసం ఏర్పడే అవకాశం ఉంటుంది. చతుర్ధ స్థానం అనగా గృహము ఇది 12వ స్థానంలో దీనికి సంబంధించిన గ్రహాలు ఉంటే అనగా చతుర్ధాధిపతి ద్వాదశంలో ఉన్నా ద్వాదశ అధిపతి చతుర్దంలో ఉన్నా లేదా రెండు స్థానాధిపతులు పరివర్తన చెందినా విదేశాలలో నివాసం ఏర్పడుతుందని అర్థం.శని భగవానుడు కుటుంబ స్థానంలో కానీ చతుర్ధ స్థానంలో కానీ ఉన్నప్పుడు వాళ్లు జన్మస్థలానికి దూరంగా ఉంటారు. శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కూడా విదేశాలలో నివాస ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆయా స్థానాలు అధిపతులు లేదా స్థానంలో ఉండే  గ్రహాల యొక్క దశ అంతర్దశలో  అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నాలు చేస్తే సులభంగా విదేశీయానం చేయగలుగుతారు.


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message


Disclaimer.  This blogger is not responsible for the above content. Vewers are requested to enquir before proceed. 


రామాయణమ్ 353

 రామాయణమ్ 353

...

ఓ రామా ! ఈతడు రావణుడు పంపిన గూఢచారి కావచ్చును కావున నలుగురు సహచరులతో సహా ఆతనిని చంపివేయుదము అని సుగ్రీవుడు రామునితో పలుకగా ఆ మాటలు విని కాసేపు దాశరధి మౌనము పాటించెను.

.

మిత్రమా ! ఈ రాక్షసుడు దుష్టుడైనను కాకపోయిననూ నాకు ఏమీ భయము లేదు .ఇతడు నాకు ఏ విధముగనూ అపకారము చేయలేడు,చేయజాలడు.

.

సుగ్రీవా నేను తలచుకొన్నచో నా ఈ ధనుస్సునుండి సంధించిన బాణములు సకల పిశాచ,రాక్షస గణములను క్షణములో రూపుమాపగలవు .

.

పూర్వము "కండువ" అను ఒక మహర్షి చెప్పిన వచనములను వినుము.....

.

క్రూరుడు అయిన శత్రువు తన వద్దకు వచ్చి అంజలి ఘటించి కాపాడమని ప్రార్ధించినపుడు ,తనకు చెడు పేరు రాకూడదు అని తలపోయు రాజు అతనిని చంపకూడదు.

.

తన శరణుజొచ్చిన వానిని ఏకారణముచేతనైనా రక్షించలేకపోయినచో అతడు నిందితమైన పాపము చేసినవాడగును.

.

తాను శరణు ఇచ్చి న వాడు తన కళ్ళముందరే ప్రాణము విడిస్తే ,అది పుణ్యమును నశింపచేయును.

.

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే 

అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ

.

ఎవ్వడైననూ వచ్చి నేను నీవాడను అని చెప్పుచూ ఒక్కసారి శరణుపొందిన చాలును,వానిని  సకలప్రాణులనుండి నేను కాపాడెదను...ఇది నా వ్రతము...

.

అని రామచంద్రుడు దృఢచిత్తుడై పలికెను.

.

వూటుకూరు జానకిరామారావు

శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,58వ శ్లోకం*


 *యదా సంహరతే చాయం కూర్మోంఽగానీవ సర్వశః ।* 

 *ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 58* 


 *ప్రతిపదార్థము* 


యదా — ఎప్పుడైతే; సంహరతే — ఉపసంహరించి; చ — మరియు; అయం — ఇది; కూర్మః — తాబేలు; అంగాని — అంగములను; ఇవ — ఆ విధంగా; సర్వశః — పూర్తిగా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియ-అర్థేభ్యః — ఇంద్రియార్ధముల నుండి (ఇంద్రియ విషయముల నుండి); తస్య — అతని; ప్రజ్ఞా — దివ్య జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమవును.


 *తాత్పర్యము* 


 తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా, ఇంద్రియములను కేంద్రీ ఆర్తముల (విషయాదుల ) నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధిరముగా ఉన్నట్లు భావింపవలెను.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  -  చతుర్ధశి -  ఉత్తరాఫల్గుణి - భృగు వాసరే* (13.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/kYAcuOJHvpo?si=JH3BcWqwZsHkNObt



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి మందిర్

 🕉 మన గుడి : నెం 206


⚜ ఢిల్లీ : ఝాన్డే వాలన్


⚜ శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి మందిర్ 



💠 ఆది శక్తి మా జందెవాలి మా దుర్గా దేవి అవతారం.  

సృష్టిలో నైతిక క్రమాన్ని మరియు ధర్మాన్ని కాపాడే పరమాత్మ శక్తిని ఆమె సూచిస్తుంది.  ఆమె ఎరుపు రంగును ధరించి, అనేక ఆయుధాలను పట్టుకుని, తన వాహనం (పులి)పై ప్రయాణిస్తుంది, ఇవన్నీ ఆమె అపారమైన మరియు అపరిమితమైన శక్తిని సూచిస్తాయి, ఇది ధర్మాన్ని రక్షించడానికి మరియు చెడును నాశనం చేయడానికి ఉపయోగిస్తుంది.


💠 ఝండేవాలన్ మాత ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఉండేదని, మాతరణి యొక్క గొప్ప భక్తుడైన బద్రీ భగత్ ఆమె గురించి కలలు కన్నాడని మరియు ఆమె ఈ విగ్రహం గురించి అతనికి చెప్పిందని చెబుతారు.  

ఈ ప్రదేశంలో బద్రీ భగత్ అమ్మవారి విగ్రహాన్ని తవ్వినప్పుడు, విగ్రహం భూమిలో కనిపించింది, అయితే దురదృష్టవశాత్తు తల్లి విగ్రహం త్రవ్వినప్పుడు చేతులు విరిగిపోయాయి.

హిందూ గ్రంధాల ప్రకారం, విరిగిన విగ్రహాన్ని పూజించడం నిషేధించబడింది, అందుకే వెండి చేతులు తయారు చేయబడ్డాయి. 

ఇది ఇప్పటికీ ఆలయ గుహలో సురక్షితంగా ఉంచబడింది.



💠 దీని తరువాత అదే స్థలంలో ఝండేవాలన్ ఆలయం నిర్మించబడింది మరియు దీనిని శ్రీ బద్రీ భగత్ ఝండే వాలా మందిర్ అని కూడా పిలుస్తారు.  

ఇక్కడికి కుల, హోదా అనే తేడా లేకుండా అందరూ వచ్చి పూజలు చేసుకోవచ్చు.


💠 అది కొండ ప్రాంతం కాబట్టి గుడి ఆవరణలో పెద్ద పెద్ద జెండాలు అప్పట్లో పెట్టారు  తద్వారా ఆలయాన్ని చాలా దూరం నుండి చూడవచ్చు అని.

ఆ రోజులలో భక్తులు మా ఆది శక్తికి ప్రార్థన జెండాలను అధిక సంఖ్యలో సమర్పించారు కనుక దీనిని ఝండేవాలన్ దేవాలయం అంటారు.


💠 ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు, ఆలయ పవిత్ర వాతావరణం ఒక వ్యక్తిలో పవిత్రతను నింపుతుంది. అందమైన శిల్పకళతో, నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయాన్ని పువ్వులు, దీపాలతో అలంకరించి, భారీ సంఖ్యలో జనాలతో ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. 


💠 ఇందులో మా జందెవాలి విగ్రహం మరియు సరస్వతి మరియు కాళీ విగ్రహం ఇతర దేవుళ్ళతో పాటు ఉన్నాయి. ఇది కాకుండా, ఆలయం యొక్క దిగువ స్థాయికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో శివపూజ చేయడం కోసం మంత్రముగ్ధులను చేసే శివ మందిరం కూడా ఉంది


💠 ఆలయం అద్భుతంగా చెక్కబడింది మరియు కొన్ని స్తంభాలు బంగారంతో చెక్కబడ్డాయి.  

ఈ కాంప్లెక్స్‌లో మా ఆది శక్తితో పాటు అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి.


💠 గుహలో రెండు దీపాలు 8 దశాబ్దాలుగా వెలుగుతున్నాయి.  ఆలయంలో నవరాత్రులలో ప్రతిరోజూ భారీ అన్నదానం నిర్వహిస్తారు.  నవరాత్రి సమయంలో వేలాది మంది ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు.


💠 అన్ని ప్రధాన పండుగలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు 'బద్రీ భగత్ ఝండేవాల్ మందిర్ సొసైటీ' ద్వారా ఆలయంలో నిర్వహించబడతాయి.

ముఖ్యంగా దుర్గాపూజ మరియు నవరాత్రి పండుగలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


💠 ఆలయ సమయం : 

ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మరియు సాయంత్రం 4:00 నుండి రాత్రి 10:00 వరకు (పండుగల సమయంలో సమయాలు మారవచ్చు)


మంగళ ఆరతి- 5:30 AM

శృంగార్ ఆరతి- 9:30 AM

భోగ్ ఆరతి- 12:00 మధ్యాహ్నం

సాయంత్రం ఆరతి- 7:30 PM

రాత్రి ఆరతి- 10:00


💠 ఎలా చేరుకోవాలి ?

బ్లూ లైన్‌లో ఉన్న ఝండేవాలన్ మెట్రో స్టేషన్‌లో దిగాలి.  ఆలయం 5-10 నిమిషాల నడక దూరంలో ఉంది.

టికెట్లు గలవు

 *ఫ్లాష్ ఫ్లాష్ కొన్ని టికెట్లు గలవు* *తొందరపడింది* 🛕🌄 కార్తీక మాసం స్పెషల్ అరుణాచలం రైలు ప్రయాణం నవంబర్ 17న  కావున టికెట్లు తొందరగా కావాల్సిన వాళ్ళు రిజర్వ్ చేసుకోగలరు   తొందరగా మీ టికెట్స్ బుక్ చేసుకోండి.🛕🌄 అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే అద్భుతమైన అవకాశం ☀️

అరుణాచల యాత్ర ఈనెల అనగా నవంబర్ 17న న ప్రారంభమై 

18వ తేదీన వ   అరుణాచలం లో వుండి సాయంత్రం 🛺🛺 ఆటోలో గిరి ప్రదక్షిణం చేసి ఉదయం మరల 

🚶‍♂️కాలినడకన గిరి ప్రదక్షిణం చేసి సాయంత్రం బయలుదేరి మరుసటి రోజు ఉదయం నవంబర్ 20వ కల్లా హైదరాబాద్ కి చేరుకుంటాము 

వసతి గృహాల ఏర్పాటుతో పాటుగా మొత్తం రెండు వైపులా రైల్వే స్టేషన్ నుండి తిరిగి వచ్చేదాకా ఉదయం అల్పాహారం మరియు రాత్రి భోజనం ఏర్పాటు చేయబడును సౌకర్యవంతమైన ఈ అరుణాచల యాత్రకి గాను కేవలం 4500/- చెల్లించవలెను

సమయము తక్కువగా ఉన్నందున వీలైనంత తొందరగా మీ టికెట్ బుక్ చేసుకోగలరు

సంప్రదించవలసిన వివరములు

  యనమండ్ర శారద

ఫోన్ నంబర్  9247160975.

 *ట్రైన్ టికెట్లు కొన్నే ఉన్నాయి* *తొందరగా బుక్ చేసుకోగలరు*