11, నవంబర్ 2020, బుధవారం

ధర్మం

 ధర్మేణ హన్యతే వ్యాధిర్హన్యన్తే వై తథా గ్రహాః

ధర్మేణ హన్యతే శత్రు ర్యతో ధర్మస్తతో జయః.



ధర్మం వ్యాధిని నశింపచేస్తుంది. ధర్మం గ్రహాలను లొంగదీస్తుంది. ధర్మం శత్రువులను సంహరిస్తుంది.ధర్మం ఉన్నచోట జయం ఉంటుంది.


శుభోదయము !

రుద్రాభిషేకం మంత్రాలలో

 రుద్రాభిషేకం మంత్రాలలో అగ్ని యెుక్క మార్పు, రూప గుణ పదార్ధాలు లక్షణములను పదే పదే చెప్పుటవలన వాటి ద్వారా జీవ శక్తి యైన అణురూపంలోగల ఆత్మ శక్తిని తెలియజేయుచున్నది. వకు పరిశీలన. నమః ఇరిణ్యాయ చ ప్రపధ్యా చ.... అన్న మంత్రం దగ్గర నుండి నమః ఆగ్నీధ్రం చ మే హవిః ధానం చ మే అవభృధఈశచ మే స్వగాకారఈశచ మే యని కలదు. అగ్ని యెుక్క పరిమాణమును హవిస్సు యని తెలుపు చున్నది. ప్రతీ మంత్ర పాఠము వక సూత్రమే. యింత స్పష్టంగా అగ్ని రూపమైన సూర్య శక్తి వ్యాప్తమును సృష్ఠాదిలోనే వివరించిన మహర్షుల ఙ్ఞానమునకు ఎంత ఋణపడి యుండవలెనో కదా. ఎంత తెలిసినా అది లేశ మాత్రమే.తెలుసుకుంటూనే వుందాం.

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..


*స్వప్న సాక్షాత్కారం..*


1998 వ సంవత్సరం..విజయవాడలో ఉంటున్న పద్మావతి గారు కనకదుర్గా దేవి కి భక్తురాలు..తనకు ఏపాటి కష్టం కలిగినా..ఇంద్రకీలాద్రి కి వెళ్లి, ఆ తల్లిని దర్శించుకొని..తన బాధలు విన్నవించుకొని వచ్చేది..ఆ కనకదుర్గమ్మ దయతో పద్మావతి గారి సంసారం చక్కగా సాగిపోతున్నది..భర్త ప్రభుత్వద్యోగి..ఇద్దరు పిల్లలూ హైస్కూలు చదువులో వున్నారు..


కానీ..కొన్నాళ్లుగా ఆవిడకు స్వప్నంలో త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయుడు కనబడి..అంతలోనే మరో యోగి రూపంలోకి మారిపోయినట్లుగా దర్శనం అవుతున్నది..నవ్వుతూ తనను ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తోంది..ఇలా రెండు మూడు సార్లు స్వప్నం లో అనుభవం అయిన తరువాత..భర్త తో ఈ విషయం చెప్పింది..ఆయన పెద్దగా పట్టించుకోలేదు సరికదా.."నువ్వు ఎక్కువగా పూజలు చేస్తుంటావు కదా..ఆ భ్రమ లోంచి బైటకు రాకపోవడం చేత..ఇలాటి కలలు వస్తున్నాయేమో..సరే..నువ్వు నమ్మిన ఆ అమ్మవారి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చేయి..అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది.." అని చెప్పారు..పద్మావతి గారికి భర్త అలా తేలిగ్గా మాట్లాడటం నచ్చలేదు కానీ..కనకదుర్గా దేవిని దర్శించమని చెప్పిన సలహా మాత్రం మనసులో నాటుకున్నది..


సాయంత్రమే దుర్గగుడికి పద్మావతి గారు వెళ్లారు..అమ్మవారిని దర్శించుకున్న తరువాత..అక్కడే కూర్చున్నారు..ఇంతలో ఆవిడకు కొద్దిదూరంలో నలుగురైదుగురు ఆడవాళ్లు కూర్చుని వున్నారు..వాళ్ళ లో ఒకావిడ లేచి వచ్చి పద్మావతి గారి ప్రక్కనే కూర్చుని..తన చేతిలోని పుస్తకాన్ని తీసుకొని చదువుకోసాగింది..పద్మావతి గారు కేవలం కుతూహలం కొద్దీ..తన ప్రక్కన కూర్చున్నావిడ చదువుతున్న పుస్తకం ఏమిటని ఆవిడను అడిగారు..


"ఇది మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర అనీ..తాము శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి అనుయాయులమనీ..అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చామని..ఈ ఆలయం లో కొద్దిసేపు పారాయణ చేసుకుందామని ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాననీ.." చెప్పింది..


("మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మా అనుభవాలు" పేరుతో శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు వ్రాసిన రచన మొట్టమొదట శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో వెలువడుతున్న సాయిబాబా పత్రికలో ముద్రితం అయింది..తరువాత శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలోనే పుస్తక రూపంలో ముద్రించారు..)


పద్మావతి గారు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని..చూసారు..ఆశ్చర్యం!..ఆ పుస్తకం పై తనకు స్వప్నం లో కనిపించి ఆశీర్వదించిన యోగి ఫోటో ముద్రించి ఉన్నది..పద్మావతి గారు ఒక్కక్షణం మాన్ప్రడి పోయి..తేరుకొని.."అమ్మా..ఈ క్షేత్రం ఎక్కడ ఉన్నది?..ఎలా వెళ్ళాలి?..ఈ ఫొటోలో ఉన్న మహానుభావుడి దర్శనం నాకు స్వప్నంలో జరిగింది..మీరు వివరాలు చెప్పగలరా?.." అని గబ గబా అడిగేసారు..


ఆ వచ్చినావిడ..ఓపికగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి..ఆయన చరిత్ర..కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందడం..మొగలిచెర్ల వెళ్ళడానికి మార్గం..వివరంగా తెలిపారు..పద్మావతి గారు ఆవిడకూ..ఆవిడతో పాటు ఉన్న మిగిలిన ఆడవాళ్లకూ ధన్యవాదాలు తెలిపి..పరుగు పరుగున ఇంటికి వచ్చారు..ఆసరికే కార్యాలయం నుంచి వచ్చిన తన భర్త కు ఈ విషయం చెప్పి..మొగలిచెర్ల కు వెళ్లి ఆ అవధూత సమాధిని..ఆ యోగికి ఆశ్రయం కల్పించిన శ్రీధరరావు, ప్రభావతి గార్లను కూడా చూసి వద్దామని పట్టు బట్టారు..ఒక్క రెండురోజులు ఆగిన తరువాత ఆదివారం నాడు వెళదామని ఆయన చెప్పారు..


ఆదివారం నాడు కారు మాట్లాడుకుని..భర్త పిల్లలతో సహా పద్మావతి గారు మొగలిచెర్ల చేరారు..ముందుగా శ్రీధరరావు ప్రభావతి గార్లను కలిశారు..ఆ దంపతుల తో శ్రీ స్వామివారి గురించి వివరాలు తెలుసుకొని..శ్రీ స్వామివారి మందిరానికి చేరి..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..అక్కడ ఉన్న శ్రీ స్వామివారి ఫోటో ను చూసిన పద్మావతి గారికి కళ్లలోంచి ధారగా కన్నీళ్లు కారిపోసాగాయి..తనను ఆ దత్తాత్రేయుడి రూపంలో వచ్చి ఆశీర్వదించినది ఈ మహానుభావుడే అని భర్తతో పదే పదే చెప్పుకున్నారు..శ్రీ స్వామివారి సమాధికి సాగిలబడి నమస్కారం చేసుకున్నారు..శ్రీ స్వామివారికి నైవేద్యంగా ఇతర భక్తులు సమర్పించిన పొంగలిని, పద్మావతి గారు ప్రసాదంగా స్వీకరించి, భర్తకూ పెట్టారు..ఇటువంటి దత్త క్షేత్రం లో అన్నదానం చేస్తే విశేష ఫలితముంటుందని భర్త గారికి చెప్పి, ఒప్పించి..ఆ ప్రక్క ఆదివారం అన్నదానం చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును విరాళంగా ఇచ్చారు..


ఆరోజునుంచీ..పద్మావతి గారి కుటుంబం మొత్తం శ్రీ స్వామివారికి భక్తులుగా మారిపోయారు అంటే ఆశ్చర్య పోనక్ఖరలేదు కదా...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699).

10, నవంబర్ 2020, మంగళవారం

వాస్తు శాస్త్రానికి సంబంధించిన

 **వాస్తు శాస్త్రానికి సంబంధించిన గ్రంధాలు**

సౌలభ్యం కోసం ఆకారంత క్రమములో సంస్కృతంలో ఉన్న వాస్తు గ్రంధాలు

1. అపరాజిత పృచ్చ

2. అపరాజిత వాస్తు శాస్త్రం

3. అగ్నిపురాణం

4. అభిలషితార్ధ చింతామణి

5. అర్ధశాస్త్రం

6. అంశుమత్

7. కాశ్యపీయం

8. అంశుమాన కల్పం

9. ఆగమాలు-శైవ పాంచరాత్రం శాక్తేయ వైఖానసం

10. కూపాది జలస్థాన లక్షణం

11. కౌతుక లక్షణం

12. క్రియా సంగ్రహ పంజిక

13. గరుడ పురాణం

14. గార్గ్య సంహిత

15. గృహవాస్తు ప్రదీపము

16. గృహపీఠిక

17. గోపుర విమానాది లక్షణం

18. గ్రామ నిర్ణయం

19. ఘట్టోత్సర్గ సూచనిక

20. చక్ర శాస్త్రము

21. చిత్రకర్మ శిల్పశాస్త్రము

22. చిత్రపటము

23. చిత్రలక్షణము

24. చిత్రసూత్రము

25. జయమాధవ మానసోల్లాసము

26. జలార్గళ శాస్త్రము

27. జలార్గళ యంత్రము

28. జ్ఞానరత్న కోశము

29. తచ్చుశాస్త్రము

30. తారాలక్షణము

31. బుద్ధప్రతిమా లక్షణం

32. దశాప్రకారము

33. దేవతాశిల్పము

34. దేవాలయ లక్షణము

35. ద్వారలక్షణ పటలము.

36. నారద పురాణం

37. నారద సంహిత

38. నారద శిల్పము

39. పక్షిమనుష్యాలయ లక్షణము

40. పాంచరాత్ర ప్రదీపిక

41. పిండప్రకారము

42. పీఠ లక్షణము

43. పురాణాలు

44. ప్రతిమాద్రవ్యాది వచనము

45. ప్రతిమా దాన లక్షణము

46. ప్రతిష్టా తత్వము

47. ప్రతిష్టా తంత్రము

48. ప్రాసాద కల్పము

49. ప్రాసాదదీపిక

50. ప్రాసాద మండనము

51. ప్రాసాద లక్షణము

52. ప్రాసాదాలంకార లక్షణము

53. బింబ మానము

54. బృహత్సంహిత

55. బుద్ధప్రతిమా లక్షణము

56. బుద్ధలక్షణము

57. మఠ ప్రతిష్టా తత్వము

58. మనుష్యాలయ చంద్రిక

59. మంజుశ్రీ మూలకల్పము

60. మయమతము

61. మానకధనము

62. మానవవాస్తు లక్షణము

63. మానసారం

64. Manasara Series (An Encyclopedia of Indian Hindu Architecture by BP Acharya 9Volumes)

65. మానసొల్లాసము

66. మానసొల్లాస వృత్తాంత కధనము

67. మూర్తి ధ్యానము

68. మూలస్థంభ నిర్ణయము

69. రత్నదీపికా

70. రత్నమాల

71. రాజగృహ నిర్మాణము

72. రాజవల్లభం

73. రాశిప్రకాశిక

74. రూపమండనము

75. లక్షణ సముచ్చయము

76. లఘుశిల్పజ్యోతిషము

77. లఘుశిల్పజ్యోతిష సారము

78. బలిపీఠ నిర్ణయము

79. వాస్తు చక్రము

80. వాస్తు తత్వము

81. వాస్తు నిర్ణయము

82. వాస్తు పురుష లక్షణము

83. వాస్తు ప్రబంధము

84. వాస్తు ప్రదీపము

85. వాస్తు మంజరి

86. వాస్తు మండనము

87. వాస్తు యోగ తత్వము

88. వాస్తు తత్వ ప్రదీపము

89. వాస్తు రత్నావళి

90. వాస్తు రత్నాకరము

91. వాస్తు రాజవల్లభము

92. వాస్తు ముక్తావళి

93. వాస్తు లక్షనము

94. వాస్తు విచారము

95. వాస్తు విద్య

96. వాస్తు విద్య(విశ్వకర్మ ప్రోక్తము

97. వాస్తు విద్య(సనత్కుమార ప్రోక్తము

98. వాస్తు శాస్త్రం లేదా శిల్ప శాస్త్రం

99. వాస్తు శిరోమణి

100. వాస్తు సముచ్చయం

101. వాస్తు సంగ్రహం

102. వాస్తుసారము

103. వాస్తు సారిణి

104. వాస్తుసర్వస్వ సంగ్రహము

105. విమాన లక్షనము

106. విశ్వకర్మ మతము

107. విశ్వకర్మ జ్ఞానము

108. విశ్వకర్మ పురాణము

109. విశ్వకర్మ ప్రకాశము

110. విశ్వకర్మ సంప్రదాయము

111. విశ్వకర్మీయ శిల్పశాస్త్రం

112. విశ్వవిద్యాభరణం

113. శాస్త్రజలధి రత్నము

114. శిల్పదీపకము

115. శిల్పనిఘంటువు

116. శిల్పలేఖ

117. శిల్పశాస్త్రం

118. శిల్ప రత్నము(2 భాగాలు

119. శిల్పసారము

120. శిల్పార్ధ శాస్త్రము

121. శుక్రనీతి

122. సమరాంగణ సూత్రధారి

123. దీపార్ణవం

124. పాంచరాత్ర ప్రాసాద ప్రాసాదము

125. 108 పాంచరాత్ర ఆగమ సంహితలు 

126. కాశ్యప జ్ఞాన కాండము

127. సంముర్తార్చనాధికారము

128. శ్రీ విమానార్చనా కల్పము


తెలుగులో లభించే గ్రంధాలు

1. కృష్ణ వాస్తు

2. గృహవాస్తు

3. గృహవాస్తు గణిత రత్నావళి

4. గృహవాస్తుదీపిక

5. గృహవాస్తు దర్పణం

6. గృహవాస్తు రహస్యము

7. గృహగణిత బోధామృతం

8. పంచావాస్తు పారిజాతం

9. వాస్తు దుందుభి

10. వాస్తు పద్మాకరము

11. వాస్తు నారాయణీయం

12. వాస్తు పూజా విధానం

13. వాస్తు సార సంగ్రహం

14. రామరాయ వాస్తు

15. శిల్పశాస్త్రం

16. సుబ్బరాయ వాస్తు శాస్త్రం

17. వాస్తు విజ్ఞాన సర్వస్వం

ఇంకా ఆంగ్లంలో,తమిళంలో,కన్నడలో,మలయాళంలో కూడా గ్రంధాలు ఉన్నాయి.

**సంకలనం గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు**

కావలసిన పురాణం యొక్క బుక్స్ లింక్స్

 మీకు కావలసిన  పురాణం యొక్క బుక్స్ లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను 

పురాణ సంబంద 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో.


గరుడ పురాణం www.freegurukul.org/z/Puranamulu-1

దేవీ భాగవతం www.freegurukul.org/z/Puranamulu-2

విష్ణు పురాణం www.freegurukul.org/z/Puranamulu-3

సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం

www.freegurukul.org/z/Puranamulu-4

శివ పురాణము www.freegurukul.org/z/Puranamulu-5

భవిష్య మహా పురాణము

www.freegurukul.org/z/Puranamulu-6

దేవీ భాగవతం www.freegurukul.org/z/Puranamulu-7

సంపూర్ణ కార్తీక మహాపురాణం

www.freegurukul.org/z/Puranamulu-8

శివ పురాణం www.freegurukul.org/z/Puranamulu-9

పురాణ పరిచయము www.freegurukul.org/z/Puranamulu-10

బ్రహ్మ పురాణము-1,2,3

www.freegurukul.org/z/Puranamulu-11

మార్కండేయ పురాణం www.freegurukul.org/z/Puranamulu-12

శ్రీ దత్త పురాణం www.freegurukul.org/z/Puranamulu-13

హరి వంశ పురాణం www.freegurukul.org/z/Puranamulu-14

లక్ష్మీ నరసింహ పురాణం

www.freegurukul.org/z/Puranamulu-15

సంపూర్ణ దేవీ భాగవతము

www.freegurukul.org/z/Puranamulu-16

కల్కి పురాణము-1,2 www.freegurukul.org/z/Puranamulu-17

బసవ పురాణం www.freegurukul.org/z/Puranamulu-18

అష్టాదశ పురాణ కథా విజ్ఞాన సర్వస్వము

www.freegurukul.org/z/Puranamulu-19

శివ పురాణము – ధర్మ సంహిత

www.freegurukul.org/z/Puranamulu-20

కన్యకా పురాణం www.freegurukul.org/z/Puranamulu-21

శివ రహస్య ఖండము-1,2

www.freegurukul.org/z/Puranamulu-22

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణ సార సంగ్రహము www.freegurukul.org/z/Puranamulu-23

భాగవత,వామన, మార్కండేయ మహాపురాణాలు

www.freegurukul.org/z/Puranamulu-24

మార్కండేయ పురాణము

www.freegurukul.org/z/Puranamulu-25

శ్రీ పరమేశ్వరి-దేవీ భాగవత వచనము

www.freegurukul.org/z/Puranamulu-26

సూత సంహిత -స్కాంద పురాణాంతర్గతము

www.freegurukul.org/z/Puranamulu-27

ఆంధ్ర స్కాందము-1 www.freegurukul.org/z/Puranamulu-28

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-బ్రహ్మఖండము www.freegurukul.org/z/Puranamulu-29

స్కాందపురాణ సారామృతము

www.freegurukul.org/z/Puranamulu-30

దేవాంగ పురాణం www.freegurukul.org/z/Puranamulu-31

అగ్ని పురాణం www.freegurukul.org/z/Puranamulu-32

మత్స్య మహాపురాణము

www.freegurukul.org/z/Puranamulu-33

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-ప్రకృతి ఖండము www.freegurukul.org/z/Puranamulu-34

వైశాఖ పురాణము www.freegurukul.org/z/Puranamulu-35

పురాణ వాంగ్మయం www.freegurukul.org/z/Puranamulu-36

విష్ణు ధర్మోత్తర మహాపురాణము -1

www.freegurukul.org/z/Puranamulu-37

స్కాంద పురాణంతర్గత కార్తీక పురాణం

www.freegurukul.org/z/Puranamulu-38

నారదీయ పురాణము www.freegurukul.org/z/Puranamulu-39

పద్మ పురాణము-భూమి ఖండము

www.freegurukul.org/z/Puranamulu-40

మత్స్య మహా పురాణము-1

www.freegurukul.org/z/Puranamulu-41

స్కాంద పురాణతర్గత బ్రహ్మోత్తరఖండం

www.freegurukul.org/z/Puranamulu-42

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-ఉత్తరార్ధము

www.freegurukul.org/z/Puranamulu-43

మదాంధ్ర బ్రహ్మావైవర్త మహాపురాణము-శ్రీకృష్ణజన్మ ఖండము-పూర్వార్ధము

www.freegurukul.org/z/Puranamulu-44

సూత పురాణము www.freegurukul.org/z/Puranamulu-45

కైశిక మహత్యము www.freegurukul.org/z/Puranamulu-46

శివ తాండవము www.freegurukul.org/z/Puranamulu-47

దేవల మహర్షి చరిత్ర -వచన దేవాంగ పురాణం

www.freegurukul.org/z/Puranamulu-48

ప్రధమాంధ్ర మహాపురాణము

www.freegurukul.org/z/Puranamulu-49


పురాణముల పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి.

దీపావళి

 దీపావళి

తైలే లక్ష్మీ ర్టలే గంగా దీపావళి తిధౌ వసేత్‌

అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే|| 


దీపావళినాడు నువ్వుల నూనెలో లక్ష్మీయు, అన్నినదులు బావులు, మడుగులులోని నీళ్ళ యందు గంగయు ఉండును కావున ఆనాడు అలక్ష్మి (దారిద్య్రం) తొలగుటకు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలెను. దానిచేత గంగాస్నాన ఫలం లభిస్తుంది. నరక భయంగలవారు నివారణకై దీనిని చేయుట శుభము.

దీపములు వెలిగించి అందు లక్ష్మిని ఆహ్వనించి లక్ష్మీపూజ చేయవలెను. దీనివల్ల అలక్ష్మీ నిస్సరణ జరుగుతుంది. లక్ష్మీపూజ చేసిన వారి ఇంట లక్ష్మీ శావ్వతంగా ఉండవలెననీ బలివరం కోరుకొన్నాడు. అలక్ష్మీ నిస్పరణానికి, డిండిమాదులు వాయించటం, ఉల్కాదానం వీనికి చిహ్నములుగా టపాకాయలు పేల్చి చప్పుడు చేయటం, 'జ్ఞాత్వా కర్మాణి కుర్వీత' తెలిసి చేసినా తెలియక చేసినా ఫలం వస్తుంది. ఆశ్వయుజ బహుళచతుర్ధశి నరకచతుర్దశి. దీనిని ప్రేత చతుర్ధశి అని కూడా అంటారు.


ఆశ్వయుజ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా

యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే||

సూర్యోదయానికి ముందు రాత్రి తుదిజాములో ఈనాడు నువ్వుల నూనెతో అభ్యంగము చేసుకోవలెను. ఇందు వలన కలిగే ప్రభావం ఋషులు దివ్యదృష్టికే గోచరించే రహస్యం. ముఖ్య కాలంలో చేయుటకు వీలు కాకపోతే గౌణకాలంలోనైనా, అనగా సూర్యోదయం తర్వాతనైనా తైలా భ్యంగం చేయాలి. యతులు కూడా అభ్యంగం చేయాలని ధర్మసింధువు చెబుతున్నది. ఉత్తరేణి శిరస్సుపై తిప్పుతూ స్నానం చేయవలెను. దీనివల్ల యమబాధ తప్పుతుంది. త్రిప్పేటప్పుడు మంత్రంపఠిస్తూ త్రిప్పాలి.


శీతలోష్ఠ సమాయుక్త సకంటక దలాన్విత

హరపాప మాపామార్గ భ్రామ్యమాణః పునః పునః||

దున్నిన చాలులోని మట్టిపెళ్ళతో కూడినదీ, ముళ్ళతో నున్న ఆకులు గలదియూ అగు ఓఅపామార్గమా! నిన్ను త్రిప్పుతున్నాను. మాటిమాటికీ త్రిప్పబడి నీవు నాపాపమును హరింపచేయుము, అని అర్థము. అపామార్గాన్ని ఉత్తరేణు అని అంటారు.ఇక సాయంకాలం ప్రదోషసమయంలో అన్ని చోట్ల నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి.  


అమావాస్యా చతుర్దశ్యోః ప్రదోషే దీపదానతః|

యమమార్గే దికారేభ్యోముచ్యతే కార్తికే నరః||

ఇక్కడ 'కార్తికే' అన్నమాట పూర్ణిమాంత మాసపక్షము. మన దేశంలో అమావాస్యాంత మాసపక్షం అమలులో ఉన్నందున. మనకిది ఆశ్వయుజమే. ఇక ఉల్కాదానం దివిటీలుకొట్టడం దక్షిణదిశగా మగపిల్లలు నిలబడి పితృదేవతలకు త్రోవ చూపుటకుగాను దివిటీలు వెలిగించి చూపవలెను. పిమ్మట పిల్లలు కాళ్ళుకడుగుకొని లోపలికి వచ్చి మధుర పదార్థం తినుట ఆచారము. సేకరణ.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

నవగ్రహా దోషాల నివారణకు స్నానాలు

 నవగ్రహా దోషాల నివారణకు స్నానాలు


మానవ జీవితమున నవగ్రహాల ప్రభావంతో ఈతిబాధలు తప్పవు. నవగ్రహాలలో ఒక్కో గ్రహం, దాని తాలూక దోషం.. ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి పలు రకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.


స్నానౌషధములు సిద్ధౌషధ సేవల వల్ల వ్యాధులు, మంత్ర జపము వల్ల సకల భయం తీరునట్లుగా ఔషధస్నాన విధానం వల్ల గ్రహదోషములు నశించును.


సూర్య గ్రహ దోష నివారణకు...

కుంకుమ పువ్వు, మణిశిల, ఏలుకలు, దేవదారు, వట్టివేళ్ళు, యష్టిమధుకము, ఎర్ర పుష్పాలు, ఎర్రగన్నేరు పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఈ నీటితో స్నానం చేయాలి. సూర్య గ్రహ దోష నివారణకు గాను సూర్యున్ని పూజించుట, ఆదిత్య హృదయం పారయణ చేయుటకు, కెంపు,(మాణిక్యము) ధరించుట, సూర్యునకు గోధుములు, బెల్లం, కంచు, గుర్రము, రక్త చందనం, పద్మములు, ఆదివారం, దానం చేస్తే.. రవి వలన కలిగిన దోషాలు తొలుగును.


కంచుతో చేయబడిన ఉంగరం ధరించుట వల్ల మంజిష్టం గజమదం, కుంకుమ పువ్వు రక్త చందనములను రాగి పాత్రయందలి నీటిలో కలిపి ఆ రాగి పాత్ర యందలి నీటితో స్నానము చేసిన దోష నివృత్తి కలుగుతుంది. రాగి ఉంగరము ధరించడం కూడా మంచిదే. శుభ తిధి గల ఆదివారము రోజున సూర్యుని ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః సూర్యాయనమహః అను మూలమంత్రమును 40 రోజులలో 6 వేలు జపము పూర్తి చేసిన సూర్య సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. 


చంద్ర గ్రహ దోష నివారణకు...

గో మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు నెయ్యి, శంఖములు, మంచి గంధములు, స్పటికము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. చంద్రగ్రహ దోష నివారణకు చంద్రుని పూజించుట, దుర్గా దేవి ఉపాసించుట, బియ్యం దానం చేయుట, ముత్యం ఉంగరాన్ని ధరించుట గాని, మాలగా వేసుకొనుట గాని చేయాలి. సీసం, తెల్లని ఆవు, ముత్యములు, తెల్లని వస్త్రం నేయితో నింపిన కలశం, ఎద్దులలో ఎదేని ఒకటి సోమవారం దానము చేసినచో చంద్రునకు సంబంధించిన దోషం పోవును. వట్టివేర్లు, దిరిసెన గంధం, కుంకుమ పువ్వు, రక్త చందనము కలిపి శంఖములోపోసిన నీటితో స్నానం ఆచరిస్తే చంద్ర దోష పరిహారం కలుగుతుంది.


సీసపు ఉంగరము, వెండి ఉంగరము గాని ధరించుట మంచిది. శుభ తిధి గల సోమవారము నందు ఓం-శ్రాం-శ్రీం-శ్రౌం-సః చంద్రయనమః అను మంత్రమును 40 జపము చేసి చివరి రోజున అంటే.. 41వ రోజున బియ్యం, తెల్లని వస్త్రం నందు పోసి దానం చేస్తే చంద్ర దోష నివారణ కలుగుతుంది.


కుజ గ్రహ దోష నివారణకు...

మారేడు పట్టూ, ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు, ఇంగిలీకము, మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం ఆచరించాలి. కుజ దోష నివారణకు గాను కుజుని పూజించి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్లగానీ, ఎర్రని పగడమును గాని కందులు, మేకలు, బెల్లము, బంగారము, ఎర్రని వస్త్రము, రాగి వీటి యందేదయిన దానము చేయుటకు కాని కుజదోష నివారణ అవుతుంది. వెండి పాత్రయందు చండ్రకర్ర గంధము, దేవదారుగంధం ఉసిరిక పప్పు కలిపిన నీటితో స్నానం ఆచరిస్తే అంగారకదోష నివారణ కలుగుతుంది.


బంగారు ఉంగరము ధరించు ఆచారము కలదు. శుభ తిధి గల మంగళవారం రోజున ఓం-క్రాం-క్రీం-క్రౌం-సః భౌమాయనమః అను మంత్రమును 7 వేలు 40 రోజులలో పూర్తి చేసిన ఎర్రనిరంగు బుట్టలో కందులు వేసి 41 వ రోజున దానం చేయడం మంచిది.


బుధ గ్రహ దోష నివారణకు...

చిన్న సైజులో ఉండే పండ్లు, ఆవు పేడ, గోరోచనము, తేనే, ముత్యములు బంగారము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించవలెను. బుధ గ్రహ దోష నివారణకుగాను బుధ గ్రహమునకు పూజ,విష్ణు సహస్రనామ పారయణ చేయాలి. పెసలు దానము చేయాలి. ఆకు పచ్చ రంగు బట్ట, తగరము, టంకము, పచ్చ పెసలు, మరకతము, లొట్టపిట్ట, గజదండము (అంకుశము), పచ్చని పూవులు... వంటి వానిలో ఒకటి దానం చేసినచో బుధగ్రహం వలన కలుగు దోషం పరిహరించబడును.


నదీసంగమము నందు గల సముద్రపు నీటిని మట్టిపాత్రలో పోసి ఆ నీటిలో గజమదము కలిపి, ఆ నీటిని స్నానం చేస్తే కూడా బుధ దోషం తొలగును. ఇత్తడి లేక కంచు ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభ తిధితో కూడిన బుధవారమునందు ఓం-బ్రాం-బ్రీం-బ్రౌం-సః బుధాయనమః అను మంత్రమును 40 రోజులలో జరిపించి చివరి రోజున అనగా 41 ఆకు పచ్చని వస్త్రములలో పెసలు పోసి దానము చేసినచో బుధగ్రహ దోష నివారన కలుగును.


గురు గ్రహ దోష నివారణకు...

మాలతీ పువ్వులు, తెల్ల ఆవాలు, యష్టి మధుకం, తేనే... వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయాలి. గురు దోష నివారణకు గురుగ్రహమును పూజించుట నమక పారాయణ చేయడం వల్ల దోష నివారణయగును. పుష్యరాగం ఉంగరమున ధరించుట శనగలు, పుష్యరాగం, పసుపు, చక్కెర, ఏనుగు, బంగారు రంగువస్త్రము గాని, బంగారము గాని ఎదొకదానిని దానము చేయుటవలన కూడా గురునకు సంబంధించిన దోషము శాంతించగలదు. బంగారుతో చేసిన పాత్రతో బ్రహ్మమేడి (బొడ్డ), మారేడు, మర్రి, ఉసిరిక ఫలములను వేసి ఆ నీటితో స్నానం చేస్తే.. గురువునకు సంబంధించిన దోషము తొలగిపోవును.


బంగారముతో చేసిన ఉంగరము సాంప్రదాయము. శుభతిధి గల గురువారము నాడు ఉదయము ఓం-హ్రాం-హ్రీం-హ్రౌం-సః బృహస్పతయే నమః అను మంత్రము 40రోజులలో 16వేలు జపము పూర్తి చేసి పసుపు పచ్చని బట్టలో సెనగలు దానమిచ్చినచో గురుగ్రహ దోష శాంతి కలుగును.


శుక్ర గ్రహదోష నివారణకు...

కుంకుమ పువ్వు, యాలుకలు, మణిశిల, శౌవర్చ లవణము.. ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం ఆచరించాలి. శుక్ర గ్రహ గ్రహ నివారణకు గాను శుక్ర గ్రహమునకు లక్ష్మీదేవికి పూజ చేయాలి. వజ్రమును ఉంగరంను ధరించుట వలన శుభ వస్త్రము, తెల్లని గుర్రము తెల్లని ఆవు, వజ్రం, వెండి, గంధము, బియ్యం బొబ్బర్లు వీటియందేదొకటి దాన మిచ్చుట వలన గాని శుక్ర గ్రహ దోషం నివారింపబడును. వెండి పాత్రయందలి నీటిలో గోరోచనము గజమదము, శక్తిపుష్పము, శతావరిని కలిపి, ఆ నీటితో స్నానం ఆచరిస్తే శుక్రగ్రహ సంబంధమైన దోషం తొలగును.


వెండితో చేసిన ఉంగరము గాని, ముత్యముతో వెండి ఉంగరము ధరించుట సంప్రదాయము. శుభతిధితో కూడిన శుక్రవారమునందు ఓం-ద్రాం-ద్రీం-ద్రౌం-సః శుక్రాయనమః అను మంత్రము 20,వేలు 40రోజులలో జపము పూర్తిచేసి ,41వ రోజున తెల్లని వస్త్రములో బొబ్బరులుపోసి దానము చేసిన శుక్ర సంబంధమైన దోషం నివారింపబడును.


శని గ్రహ దోష నివారణకు..:

సాంబ్రాణి, నల్ల నువ్వులు, సుర్మరాయి, సోపు.. వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేయాలి. శని గ్రహ దోష నివారణకు శనిగ్రహ పూజలు,ఈశ్వర పూజ, తైలాభిషేకం, నీలమణి ధరించుట, నువ్వులు దానం చేయడం వల్ల గ్రహ దోష నివారణ కలుగును. నీలం, నూనె, నువ్వులు, గేదె, ఇనుము, నల్లని ఆవులందు ఏదో ఒకటి దానం చేయవలెను. ఇనుప పాత్రయందు గల నీటిలో మినుములు, ప్రియంగు ధాన్యము, నీలగంధ, నీల పుష్పములు వేసి ఆ నీటితో స్నానము చేస్తే శనిగ్రహ దోష నివారణయగును.


శుభతిధి గల శనివారము నుండి ఓం-ఖ్రాం-ఖ్రీం-ఖ్రౌం-సః శనయేనమః అను మంత్రము 40 రోజులలో 19వేలు జపము చేసి, 41వ రోజున నువ్వులు నల్లని బట్టలో వేసి శని గ్రహ దోష నివారణ కలుగుతుంది.


రాహు గ్రహ దోష నివారణకు...

నువ్వు చెట్టు ఆకులు, సాంబ్రాణి, కస్తూరి, ఏనుగు దంతము (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి).. ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించాలి.  రాహు గ్రహ దోష నివారణకుగాను రాహు గ్రహమును పూజించుట, దుర్గాదేవిని పూజించుట, గోమేధికమును ధరించుట వలన రాహు గ్రహ దోష నివారణ యగును, గోమేధ్కము, గుర్రము, నీలవస్త్రము, కంబళి నూనె, మినుములు, పంచలోహములు, వీటియందేదైన దానం చేయడం వల్ల కూడా దోష శాంతి కలుగును.


గేదె కొమ్ముతో చేసిన పాత్రయందలి ఉదకమున గుగ్గిలము, ఇంగువ,హరిదళము, మనశ్శిలలతో కలిపి ఆ నీటితో స్నానం చేసి అన్చో రాహు దోషం తొలగును. పంచ లోహములతో చేసిన ఉంగరము ధరించుట సాంప్రదాయం. శుభతిధి గల శనివారము నాడు రాహుమంత్రమగు ఓం-భ్రాం-భ్రీం-భ్రౌం-సః రాహవే నమః అను మంత్రమును 40 రోజులలో 18 వేలు జపము పూర్తి చేసి, 41వ రోజున మినుము చల్లని బట్టలో వేసి దానం చేసినచో రాహుగ్రహ సంబంధమైన దోషం తొలగిపోవును.


కేతు గ్రహ దోష నివారణకు...

సాంబ్రాణి, నువ్వుచెట్టు ఆకులు, మేజ మూత్రం, మారేడు పట్ట, ఏనుగు దంతం, (ఏనుగు దంతం లభించకపోతే మిగిలినవి)..  ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను. కేతు దోష నివారణకుగాను కేతుగ్రహమును పూజించి సూర్యనమస్కారములు చేస్తూ ఉలవలు దానం ఇవ్వాలి. వైఢూర్యం, నూనె, శాలువా, కస్తూరి, ఉలవలు వీటిని దానం చేసినా కూడా కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.


ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన పాత్రయందు గల నీటిలో పర్వతముల యందు పందికొమ్మతో తవ్వబడిన మట్టి, మేక పాలు కలిపి ఆ నీటితో స్నానం ఆచరిస్తే కేతుగ్రహ దోష నివారణ కలుగును. పంచలోహముల ఉంగరం ధరించుట సాంప్రదాయం. శుభ తిధి గల మంగళవారం నాటి నుంచి ఓం-ప్రాం-ప్రీం-ప్రౌం-సః కేతవే నమః అను మంత్రమును 40 రోజులలో 7 వేలు జపము పూర్తి చేసి 41వ రోజున ఎర్రని వస్త్రంలో ఉలవలు పోసి దానమిచ్చిననూ కేతుగ్రహ దోష నివారణ కలుగుతుంది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

విద్యాగంధం

 శ్లో!రూప యవ్వన సౌందర్యం గుణ శీల సమన్వితం 

                         విద్యాహీనం నశోభంతే పాలాశ కుసుమం వృధా 


ఒకరోజు ఈ   శ్లోకాన్ని చదివారు. మా నాన్నగారు.  అర్థమడిగాను. "ఎన్ని మంచి లక్షణాలు వున్నా విద్యాగంధం లేకుంటే, మోదుగ పూల లాగా వృథా, అని అంటూ, ఈ మోదుగ పూలు అడవిలో ఎక్కవగా పూయడం వల్ల వాటిని ఎవరూ ఆదరించరు, అలాగే, మంచి చదువు లేకున్నా మనిషి పరిస్థితి అంతే" అని ఒక సంబంధిత కథ చెప్పుకొచ్చారు.


పూర్వం ఒక గ్రామంలో సకల విద్యాపారంగతులైన ఒక బ్రాహ్మణ కుటుంబంలో నలుగురు కొడుకులు, ఒక కూతురు వుండేవారు. పదేళ్లు దాటిన తన కూతురికి వివాహం కాలేదని వాపోయేవాడు తండ్రి. చివరకు ఆయన స్నేహితుడి ద్వారా, ఒక సంపన్న కుటుంబంలోని పదహారేళ్ల యువకుడిని అల్లుడిగా చేసుకున్నాడు. అల్లుడు పెద్దగా చదువుకోలేదు. అయితే, ఏం? గొప్ప ఆస్తిపరులు. చిన్నపిల్ల కారణంగా కూతురిని ఇంకా కాపురానికి పంపలేదు.


ఐదేళ్లు గడిచిన తర్వాత, మామగారే వెళ్లి, అల్లుడిని  పండగ సాకుతో తమ ఊరికి   పిలుచుకొని వచ్చాడు. దాదాపు తన వయసు వారే అయిన బావమరదులు, బావగారిని సాదరంగా ఆహ్వానించారు. అందరికీ పాండిత్య ప్రకర్ష వుంది కనుక, శాస్త్ర చర్చలలో తమ పాండిత్యానికి పదును పెడుతూ కూర్చున్నారు.

బావగారు, 'కిం కర్తవ్యం' అన్నట్టు కూర్చున్నాడు. భర్త విద్యాగంధం లేనివాడని గ్రహించిన భార్య, 'పాలాశ కుసుమం వృథా' అని సరదాగా ఆట పట్టించింది. తనను, తన భార్యనే అందరి ముందు అవమానించిందనే ఆవేశంతో, అపార్థం చేసుకొని, అప్పటికి ఏమీ అనకపోయినా, ఎలాగైనా తాను కూడా సంస్కృత విద్యలో ఆరి తేరాలని, ఆ రాత్రికి రాత్రే అత్తగారిల్లు విడిచి వెళ్లిపోయాడు.


కథ కంచికి వెళ్లినట్టు, ఇతడు కూడా విద్యార్జన కోసం కాశీకి బయలు దేరాడు. అక్కడ సర్వ శాస్త్రములు తెలిసిన ఒక గురువు గారి అభయం కోరి,  కాళ్లుపట్టుకొని వదలలేదు. శిష్యుడి ఉద్దేశం గమనించిన గురువుగారు, అతడిని పైకిలేపి, "శుభం నాయనా, నూతి దగ్గరకు వెళ్లి స్నానం చేసిరా, భోజనం చేద్దువుగానీ" అన్నారు. 

పెరటి గుమ్మం పొట్టిగా వున్న కారణంగా, వస్తూ వెళుతూ గుమ్మాన్ని తలకు తగిలించుకునేవాడు. బాగా నొప్పి కలిగేది. అమ్మా! అబ్బా! అని అంటూవుండేవాడు కానీ, చదువు ధ్యాసలో ఇవన్నీ పట్టించుకునేవాడు కాదు. అయితే, గురువుగారు ఇదంతా గమనిస్తూ వుండేవారు.


అతనికి వంటల్లో ఆముదం వేసి పెట్టమని భార్యకు చెప్పాడు గురువుగారు. చదువు ధ్యాస ముందు ఏమీ తెలిసేది కాదు. అలా, ఎంతో నిష్ఠతో రోజులో పదహైదు గంటలు చదువుకు వెచ్చించి, గీర్వాణాంధ్ర భాషలు, తర్క, వ్యాకరణ, న్యాయ, మీమాంసాది షట్ శాస్త్రాలు క్షుణ్ణంగా ఐదేళ్లలో పూర్తి చేసేశాడు. 


ఒకరోజు యథాప్రకారం పెరట్లోకి వెళుతుంటే గుమ్మం తగిలింది. వెంటనే వెనుతిరిగి, "గురువుగారూ, ద్వార బంధం చిన్నగా వుండి, కొట్టుకుంటుంది, మార్పించండి" అన్నాడు. స్నానం చేసి, వచ్చి భోజనం చేస్తూ, "వంటల్లో కొంచెం ఆముదం వాసన వేస్తుంది" అన్నాడు. దీంతో, ఆ దంపతులు నవ్వుకున్నారు. "నాయనా, నీ చదువు అయిపోయింది. ఇక నువ్వు ఇంటికి పోవచ్చు" అన్నారు గురువుగారు.


గురువు దగ్గర సెలవు తీసుకొని చక్కగా, భార్య వున్న గ్రామానికే వచ్చి, అక్కడే ఒక అతిథి గృహంలో బస చేశాడు. గ్రామానికి ఎవరో పండితుడు వచ్చాడని, కర్ణాకర్ణిగా విన్న బావమరదులు  చూడడానికి వచ్చారు. విద్యతో వెలిగిపోతున్న అతడి వర్ఛస్సు, వాళ్లని కదలనివ్వలేదు. అతడి వినయం, గుణ సంపద కట్టిపడేసింది.

 

ఇంత చిన్న వయసులో, ఇంతటి పాండిత్యమా! అని ఆశ్చర్యపోయిన వాళ్లు, అతిథిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. అయితే,  ఐదేళ్ల నుండి చూడని కారణంగా, తమ బావగారిని గుర్తించలేదు. పైగా, దీక్షా కేశపాశాలు అడ్డమయ్యాయి. కానీ, ఇతడు వాళ్లను గుర్తు పట్టి, ఆతిథ్యానికి ఒప్పుకున్నాడు.


మరుసటి రోజు ఆతిథ్యానికి బయలుదేరాడు. ఇంత కాలం రాని అల్లుడు, తప్పక ఆత్మహత్య చేసుకొని వుంటాడని నమ్మిన గ్రామస్థులు, వాళ్లను బలవంతంగా ఒప్పించి, అతడికి ఉత్తర  క్రియలు చేయించి, భార్యకు శిరోముండనం కూడా చేయించారు. ఆమే వంటచేసి, అందరికీ వడ్డించింది. ఆ స్థితిలో వున్న భార్యను చూసి, చలించిపోయాడు. నిజంగా మనసులో బాధ పడ్డాడు.


భోజనం చేస్తున్నాడు. కానీ మనసు, మనసులో లేదు. జీలకర్ర, మంచి ఇంగువ వేసిన చారు వాసన అమోఘంగా వుంది. కానీ, ఉప్పు లేదు, రుచి అనిపించలేదు. ఐదేళ్ల క్రితం భార్య అన్న మాట గుర్తుకొచ్చి, అప్పుడు ఎగతాళి చేసిందనుకున్నాడు. కానీ,  వున్నమాటే అనిందని, తానెవరో భార్యకు తెలియజెప్పాలని, ఒక శ్లోకాన్ని వదిలాడు. 


                   శ్లో!చారు చారుసమాయుక్తం, హింగు జీలక మిశ్రితం 

                       కించిల్లవణ శూన్యంచ, పాలాశ కుసుమం వృథా!


అంటూ, గుర్తుపట్టిందా! లేదా అని భార్యవైపు చూశాడు. ఆమె ఆతడిని బాగా గమనించి, గుర్తించింది. ఒరేయ్, మీ బావగారురా! అని తెగ సిగ్గుపడిపోయి, తలపైన కొంగు సర్దుకుంటూ వంటిట్లోకి పరుగెత్తుకెళ్లింది. ఆశ్చర్యపోయిన సోదరులు కూడా అతడిని తేరిపారా చూసి, గుర్తించి, తెగ సంబరపడిపోయారు. 


మరుసటి రోజు అంబష్టుడిని పిలిపించి, క్షవరం చేయించి, నూతన వస్త్రాలతో సత్కరించి, అలంకృతుడిని చేసి, శాస్త్ర ప్రకారం ప్రాయశ్చిత్త, ఆయుష్షు హోమాది వైదిక కర్మలు, దానాదులు చేయించి, చెల్లెలిని సుమంగళిగా అలంకరించారు. గర్భాదాన ప్రక్రియ కూడా పూర్తి చేశారని, కథను ముగించారు మా నాన్నగారు.  

 

ఈ కథ ద్వారా చదువు యొక్క ఆవశ్యకత, విశిష్టత చెప్పడమే మా నాన్న గారి ఉద్దేశమై వుంటుంది. నిజంగా,ఆ తెల్లవారుజామున ఆయన కథ చెప్పిన తీరు, విధానం, నాకు చదువు పట్ల ఎంతో ఆసక్తిని కలిగించాయి.

 

ఈ నాటి యువత కూడా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు కలిగినా కృంగిపోకుండా చదువు మీదనే దృష్టిపెట్టి, జ్ఙానాన్ని సంపాదించుకుంటారని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

చదివినందులకు ధన్యవాదములు 🙏

అంబాళం పార్థసారథి,

08-09-2016.

----------------------   శుభసాయింత్రం   -----------------------------

సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం)

 స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం)





నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే |
నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ ||

నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ |
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః||

పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ |
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే ||

పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః |
పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప ! నమోస్తుతే ||

క్షమస్వ భగవాన్ ! దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్ |
పత్నిబంధో ! దయాసింధో ! దాసీదోషం క్షమస్వమే ||

- ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం
సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజ

సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః
పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ

బ్రహ్మవైవర్త పురాణంలోని  ఈ  స్తోత్రాన్నిలక్ష్మీ, సరస్వతి, గంగ, భూదేవి, సావిత్రి, పార్వతి మున్నగు దేవతా మూర్తులు పఠించారు. 

బ్రతుకు బండి

 బ్రతుకుమీద భ్రాంతి లేదు

మృత్యువంటే భయం లేదు

మనుగడ .. మృత్యువుల మధ్య

బ్రతుకు బండి సాగుతోంది

భారంగా !


భోగించాలన్న ఆశాలేదు

యోగి కావాలన్నధ్యాసాలేదు

భోగి.. యోగిల మధ్య

జీవితం జరిగిపోతుంది

జారుకుంటూ!


జ్ఞానికావాలన్న వాంఛాలేదు

అజ్ఞానిగా మిగలాలనీ లేదు

జ్ఞానం.. అజ్ఞానం మధ్య

జీవనం సాగిపోతుంది

పడుతూ.. లేస్తూ !


సంపాదనపై అనురక్తీలేదు

సంపద అంటే విరక్తీలేదు

అనురక్తీ.. విరక్తుల మధ్య

కాలం గడిచిపోతుంది

యధావిధిగా !


చావంటే భయం లేదు

చచ్చిపోవాలనీ లేదు

ఉఛ్వాశ.. నిశ్వాసల మధ్య

ఊపిరి సాగిపోతుంది

నిశ్శబ్దంగా!


ఆకలని  ధ్యాసా లేదు

అన్నం మానాలనీ లేదు

తినటం .. తిరగటం మధ్య

తనువు సాగిపోతుంది

యాంత్రికంగా !


కీర్తి కావాలని కోరుకోవటంలేదు

అపకీర్తి మూటకట్టాలనుకోవటంలేదు

అన్నీ.. అశాశ్వతమని

అందుకోసం ఆరాటమెందుకని

బ్రతుకు సాగుతోంది.. మామూలుగా!


భౌతిక వాంఛలను కాదన్నదీలేదు

ఆధ్యాత్మికతపై విరక్తీలేదు

భౌతికత .. ఆధ్యాత్మికతమధ్య

ఆవిరైపోతుంది ఆయువు

అయోమయంగా!


పాపం చేయాలనీలేదు

పుణ్యం మూట కట్టాలనీలేదు

పాప పుణ్యాల మధ్య

పుణ్యకాలం కరిగిపోతుంది

దిశారహితంగా!

👏👏👏