1, డిసెంబర్ 2020, మంగళవారం

మొగలిచెర్ల అవధూత

 *శ్రీ మెంటా మస్తాన్ రావు గారు..*


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మా తల్లిదండ్రులకు (శ్రీ పవని శ్రీధర రావు, నిర్మల ప్రభావతి దంపతులు) పరిచయమయ్యే నాటికే, విజయవాడ వాస్తవ్యులు శ్రీ చక్కగా కేశవులు గారు స్వామి వారిని పరిపూర్ణంగా నమ్మి, భక్తి తో సేవిస్తున్నారు..స్వామి వారు మాలకొండలో తపస్సు చేసుకునే పార్వతీ అమ్మవారి మఠం లో ఓ స్టీలు మంచం ఏర్పాటు చేశారు..తరువాతి కాలంలో శ్రీ కేశవులు గారు, మా అమ్మా నాన్న గార్లకు పరిచయం కావడం , ఆ అనుబంధం చివరి వరకూ కొనసాగడం, ఇప్పుడుకూడా శ్రీకేశవులు గారి అబ్బాయి కృష్ణ , మేమూ సత్సంబంధాలు కలిగి వుండటం ఆ దత్తుడి కృపే..


ఆ కేశవులు గారి తోడల్లుడు శ్రీ మెంటా మస్తాన్ రావు గారికి కూడా 1973 ప్రాంతంలో శ్రీ స్వామి వారు కేశవులు గారి ద్వారానే పరిచయం అయ్యారు..వారూ స్వామి వారికి పరమ భక్తులుగా మారిపోయారు..శ్రీ కేశవులు గారు, తమ కూతురు వివాహానికి రమ్మని స్వామి వారిని మరీ మరీ కోరి, మొత్తానికి స్వామి వారు విజయవాడ వచ్చేటట్లు ఒప్పించగలిగారు..


శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉండాటానికి శ్రీ మెంటా మస్తాన్ రావు గారి ఇంట్లో బస ఏర్పాటు చేశారు..ఇది మస్తాన్ రావుగారికి ఊహించని వరం..ఆ దంపతులిద్దరూ పొంగిపోయారు..స్వామి వారు మాత్రం ఎక్కడఉన్నా ఒకేవిధంగా ఉండగలిగే వారు..వారి తపోసాధన కానీ.. ఆహారపుటలవాట్లు కానీ.. ఎటువంటి మార్పు లేకుండా ఉండేవి..శ్రీ మస్తాన్ రావు గారికి ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువ..శ్రీ స్వామివారి సాహచర్యంతో అది మరికొంచెం ఎక్కువ అయింది..సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడు తన ఇంటికొచ్చి తనకు ఉపదేశం ఇచ్చినట్లు గా భావించేవారు..శ్రీ మస్తాన్ రావు గారు మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడల్లా..శ్రీ స్వామివారు తమతో గడిపిన కాలం తాలూకు జ్ఞాపకాలను పదే పదే మాతో చెప్పుకొని తన్మయత్వం చెందేవారు..


"ఇప్పటికీ శ్రీ స్వామివారు మా ఇంట్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతుందయ్యా.. మహానుభావుడు..దాదాపు పది రోజులపాటు వున్నాడు..ఎంతో బోధ చేసాడు..మా జన్మ తరించింది!.." అని మా దంపతులతో చెప్పేవారు..


శ్రీ మస్తాన్ రావు గారికి వాస్తు శాస్త్రం మీద అవగాహన ఉంది..తన సందేహాలను స్వామి వారిని అడిగారు..స్వామి వారు తమ ధ్యానం అయిపోయిన తరువాత వారి సందేహాలను నివృత్తి చేసేవారు..శ్రీ స్వామివారి మందిరం లో ఏవైనా మార్పులు చేర్పులు చేసే ముందు మేము కూడా శ్రీ మస్తాన్ రావు గారిని సంప్రదించడం ఒక ఆనవాయితీ..

ఈరోజు మేము మందిరం లో ఉంచిన స్వామి వారి ఫోటో...శ్రీ మస్తాన్ రావు గారి ఇంటిలో తీసినదే..స్వామి వారి అసలు రూపం లో లభ్యమవుతున్న ఒకేఒక్క ఫోటో అదే..


ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు..అదేవిధంగా శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి శ్రీ మెంటా మస్తాన్ రావు గారి దంపతులు మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శిస్తూ ఉన్నారు..మొగలిచెర్ల స్వామి వారిని దర్శించే ఆర్యవైస్యుల సౌకర్యార్థం ఓ అన్నదాన సత్రాన్ని, వసతి గృహాన్ని ఏర్పరచే పధకం లో..స్వామి వారి ఆశ్రమ నిర్మాణ దాత శ్రీ మీరాశెట్టి, చెక్కా కేశవులు గారితో కలిసి చురుకుగా పాల్గొని దానిని పూర్తి చేశారు...


ఎనభై ఏళ్ళు పైబడినా.. ఓపిక చేసుకుని శ్రీ స్వామి వారి మందిరం దర్శించడానికి మళ్లీ ఈమధ్య మొగలిచెర్ల కు వచ్చారు..స్వామి వారి సమాధిని దర్శించుకుని, ఆనాటి అనుభవాలు గుర్తు చేసుకొని, మా దంపతులను ఆశీర్వదించి వెళ్లారు..తమకు ఓపిక ఉన్నంతవరకూ దర్శనానికి వస్తుంటామనీ..ఆ శక్తి శ్రీ స్వామివారు తమకు ఇస్తాడనీ నమ్మకంగా చెప్పి మరీ వెళ్లారు..


శ్రీ స్వామివారి కృపను పరిపూర్ణంగా పొందిన శ్రీ మస్తాన్ రావు గారు గత సంవత్సరం విజయవాడ లోని వారి స్వగృహం లో పరమపదించారు..మాకందరికీ పెద్ద దిక్కుగా ఉన్న శ్రీ మస్తాన్ రావు గారి మరణం మాకు తీరని లోటు..కానీ దైవ నిర్ణయాలను ధిక్కరించలేము కదా..


ఈమధ్యనే శ్రీ మస్తాన్ రావు గారి కుటుంబసభ్యులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి, ఆ శనివారం సాయంత్రం జరిగిన పల్లకీసేవ లోనూ..ఆ ప్రక్కరోజు ఆదివారం ప్రభాత సేవ లోనూ పాల్గొన్నారు.."మాకు వీలున్నప్పుడల్లా ఈ మహానుభావుడి సమాధి దర్శనం చేసుకుంటామండీ.." అని మస్తాన్ రావు గారి సతీమణి చెప్పారు..వారి కుటుంబానికి ఆ దత్తాత్రేయుడి ఆశీస్సులే రక్ష..!!


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



ఉదర పోషణక్రియే యుదయాస్త మానంబు

             మదియందు దలచుచు మానకుండ

తిరిగితి నిరతంబు సిరిమంతు లింటికి

              యర్థంబు కొఱకునై వ్యర్థ ముగను

మాయాంధ కారాన మగ్నుండ నగునేను

               భవసేవ నెఱుగక బ్రతికి యుంటి

పూర్వ జన్మాంతర పుణ్యంబు కతనను

                నీవు నా డెందాన నిల్చి నావు

అట్టి హేతువు చేనైన యభవ ! నన్ను

తప్పకను నీవె రక్షించ దగును స్వామి ! 

కరుణ జూపుచు  నాపైన గరళ కంఠ !

నీదు సాన్నిధ్య మోసగుచు నిలువ నిమ్ము.    57#



క్షితి నభో వ్యాప్తమై.  చీకట్ల నెల్లను

           పారద్రోలుచు నుండు భాస్కరుండు

యగుపించు చున్నాడు యంబరంబందున

          ప్రత్యక్ష మూర్తి యై పలువురికిని

కోటి సూర్య ప్రభల్ గూడిన నీవేల

            సాక్షాత్క రించవు శర్వ ! నాకు ?

అరయ నాలో నున్న యజ్ఞాన తిమిరమున్

            తొలగించ జాలవే ? తలచితేని

పార్వతీ నాథ ! సర్వేశ ! భవ విదూర !

నాదు యజ్ఞాన మంతయు నాశ పరచి

దివ్య దర్శన మిచ్చియు భవ్య పురుష !

నిండు యభయంబు నిడి ప్రసన్నుండ వగుము.  58 .   



      ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

నక్షత్ర దర్శనం

 🌹🌺🌸🥀🌷💐


*కార్తికంలో నక్షత్ర దర్శనం ప్రాధాన్యం ఏమిటి?*


*కార్తికమాసంలో నక్షత్ర కూటమిని విరాట్ పురుషునిగా భావించి ఆరాధించాలి ఈ నక్షత్ర పురుషునికి కృత్తిక కటిస్తానం. మూల నక్షత్రం పాదాలు. రోహిణి తొడలు. అశ్వని మోకాళ్లు, పూర్వాషాడ, ఉత్తరాషాడ పిరుదులు. ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి నక్షత్రాలు మర్మస్థానాలు. ఉత్తరాబాధ్ర, పూర్వాభాద్ర నక్షత్రాలు భుజాలు. రేవతి కుక్షి. అనురాధ వక్షస్థలం. విశాఖ ముంజేతులు హస్త చేతులు. పునర్వసు వేళ్లు. జ్యేష్ఠ కంఠం. పుష్యమి ముఖం. భరణి శిరస్సుగా మారిపోతాయి. కార్తిక మాసంలో నక్షత్ర పురుష పూజ అంటే విశాల విశ్వారాధనగా భావించాలి*


*నక్తవ్రతం చేయాల్సిన రోజులు : కార్తిక సోమవారాలు పూర్తి ఉపవాసం చేయాల్సిన రోజులు : కార్తిక ఏకాదశి తిథులు, పౌర్ణమి.*


                   *భక్తి*

                  M.s.s.k

గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి

 🌹🌾🌺🌸🥀🌷💐


*గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి దీపారాధన ఎలా చేయాలి?*


*రవిగ్రహ దోష నివారణకు కుంకుమ వర్ణంలోని వత్తులను, ఆవునేతిని ఉపయోగించాలి.*


*చంద్ర గ్రహ దోషం పోగొట్టుకోవడానికి తెల్లవత్తులు రెండింటిని నేతిలో ముంచి వెలిగించాలి.*


*కుజ గ్రహదోషానికి ఎరుపురంగులోని మూడు వత్తులను, నువ్వుల నూనెను వాడాలి.*


*బుధగ్రహానికి సంబంధించి తెల్లజిల్లేడు వత్తులను నాలుగింటిని ఎర్రటి ప్రమిదెలో తమలపాకు వేసి వెలిగించాలిఇందులో  దీపారాధనకు గాను కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది.*  


*గురుగ్రహానికి అయిదు తామర వత్తులను ఆవునేతిని ఉపయోగించాలి.*


*శుక్రగ్రహానికి ఆరు తామర వత్తులు వినియోగించాలి.*


*శనిగ్రహానికి ఏడు నల్లని వత్తులను ఇనుప ప్రమిదెలో నువ్వులనూనెతో వెలిగించాలి.*


*రాహుదోషానికి నలుపు వర్ణం కలిగిన ఎనిమిది వత్తులను నిమ్మకాయ డొప్పలో వెలిగించాలి. దీపారాధనలో అష్టమూలికా తైలాన్ని వినియోగించాలి.*


*కేతుగ్రహానికి తెల్లజిల్లేడు వత్తులు తొమ్మిదింటిని కొబ్బరి నూనెతో వెలిగించాలి.*


                   *భక్తి*

                  M.s.s.k

30, నవంబర్ 2020, సోమవారం

వివాహము విధాలు

 వివాహము విధాలు - వివాహ లగ్నము


వివాహము అంటే సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. యువతీ-యువకుడు పెద్దల సమక్షంలో.. అగ్నిసాక్షిగా వేద మంత్రాల నడుమ పెళ్లాడటమన్నది సంప్రదాయం. పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తాపది అనే పలు విధములుగా అర్థాలు ఉన్నాయి.


వివాహము అనేది మన శాస్త్ర, పురాణాల్లో 8 రకాలుగా ఉన్నాయి. అందులో.. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని పేర్లు ఉన్నాయి.


వీటిలో మొదటిది బ్రహ్మ వివాహం. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు. కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే వివాహం ఇది.


2వది దైవ వివాహం. యజ్ఞంలో రుత్విక్‌‌కు అలంకరించిన కన్యాదానంగా చెబుతారు. గోమిధునాన్ని వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెబుతారు. మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.


అదేవిధంగా.. జ్ఞానులు కన్యకు తన శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా చెబుతారు. వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెబుతారు. బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం. నిద్రిస్తున్న మత్తులో ఉన్న స్త్రీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే అది పైశాచిక వివాహం.


వివాహ లగ్నము - వైవాహిక జీవితం

కుండలి స్థితిలో ఉన్న గ్రహములు వైవాహిక జీవితాన్ని సుఖమయంగా, కలహపూర్ణంగా చేయగలదని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ తత్వములు ప్రమాణికమైనవి. యది వైవాహిక లగ్నమును సరైన రీతిలో విచారణ చేస్తే, వివాహం తర్వాత దాంపత్య జీవితంలో కలిగే సమస్యలు తగ్గుతాయి. వైవాహిక జీవితం సుఖమయమవుతుంది.


వివాహ సంస్కారములను వ్యక్తి రెండవ జీవితంగా గుర్తిస్తారు. దీని ప్రకారం వివాహ సమయములో శుభ లగ్నము.. మహత్యం కలిగి ఉండును, జన్మ కుండలిలో లగ్న స్థానములో శుభ గ్రహములు స్థితిలో ఉండును. వివాహం కొరకు లగ్నమును నిశ్చయించు సమయములో వధువు, వరుని కుండలిని గమనించి వివాహ లగ్నమును నిశ్చయించవలసి ఉంటుంది. కుండలి లేకపోతే గనక వరుడు, కన్య పేరులో ఉన్న రాశికి అనుగుణంగా లగ్నమును గుర్తించాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. జన్మ లగ్నము, రాశి నుంచి అష్టమ లగ్నం అశుభ ఫలదాయకముగా ఉండును. అంటే ఈ లగ్నంలో వివాహము గురించి ఆలోచించరాదు.


జన్మ లగ్నం, జన్మరాశి నుంచి 4వ, 12 వ రాశి గుణములను లెక్కించుటలో శ్రేష్టంగా ఉంటే గనక ఈ లగ్నంలో వివాహం సంభవము. అన్యతా జన్మ లగ్నము నుంచి చతుర్ధ, ద్వాదశ రాశితో లగ్నంలో వివాహం దోష పూరితంగా ఉండును. ఎవరి కుండలిలో లగ్నం నుంచి కేంద్ర స్థానములో శుభ గ్రహములు ఉండునో వారికి వివాహ లగ్న దోషం కలుగదు.


కుజ లగ్నం నుంచి బుధుడు, గురువు, శుక్రుడు యది కేంద్రంలో లేదా త్రికోణంలో ఉంటే గనక వివాహ లగ్నములో అనేక విధాలైన దోషములు.. అంటే దగ్దతిధి, గుడ్డి, చెవిడు కలుగవు. వివాహ లగ్నము సందర్భంను లెక్కించు సమయంలో రాహువు శనికి సరిసమమైన ప్రభావకారిగా ఉండును. ఇంకా కుజుడు కేతువుకు సమానంగా ఉండునని చెప్పదగ్గది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

Batakamma



 

God











 

క్షణభంగురం

 క్షణభంగురం


🍁🍁🍁🍁


 మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్

మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||


-----ఆదిశంకరుల భజగోవిందం నుండి


ధనము – జనము – యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును.


 మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.




ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి.


 ఈ క్షణికమైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు. అహంకరిస్తాడు. శాశ్వతమనుకొని భ్రమ పడతాడు. 


ధన జన యౌవన గర్వం:- కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు. వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి. ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు. అంతా డబ్బే. డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు. అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు.  


 కొందరికి జనగర్వం. తన వెనుక ఎందరో ఉన్నారనుకుంటారు. తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తన నాశ్రయించిన వారందరూ తనవారేననుకుంటారు. అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు. తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు. కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది. తన శ్రేయోభిలాషులెవరో.


 ఇక కొందరికి యౌవన గర్వం. యవ్వనం శాశ్వతం అనుకుంటారు. శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి గర్వం. ఆ గర్వంలో అతడు మంచి చెడూ గమనించడు. కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తాడు. అహంభావంతో ఉంటాడు. ముసలివాళ్ళను ఎగతాళి చేస్తాడు. 


*హరతి నిమేషాత్కాలః సర్వం* :- ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేడు. ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధనసంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి. నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహారపొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. ఇప్పుడేమయింది ఆ గర్వం? నీ ధనం నిన్ను రక్షిస్తుందా? నీ జనం నిన్ను రక్షిస్తారా? అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యం ఎక్కిరిస్తూ మననెత్తి మీదికి వచ్చి కూర్చుంటుంది.


 కాబట్టి ఇదంతా మాయాజాలం అని, క్షణికమైనవని భావించు. అంటే అనుభవించు తప్పులేదు. కాని వాటితో సంగభావం పెట్టుకోకు.



T.me/namonarayana


🌸 *జై శ్రీమన్నారాయణ🌸* 


🍁🍁🍁🍁🍁

ధార్మికగీత - 96*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 96*

                                   *****

         *శ్లో:- నరత్వం దుర్లభం లోకే ౹*

                *విద్యా తత్ర సుదుర్లభా ౹*

                *వివేకో దుర్లభ స్తత్ర ౹*

                *దాతృత్వం చ విశేషతః ౹౹*   

                                        *****

*భా:- లోకంలో మిక్కిలి దుర్లభములు అని చెప్పదగినవి 4 ఉన్నాయి.1."నరత్వం" :- 84 లక్షల జీవరాసులలో నరజన్మ దుర్లభమని , శ్రేష్ఠమైనదని చెబుతున్నారు*. *మానవీయ,మాననీయ విలువల పరీమళాలతో దాన్ని సార్థకం చేసుకోవాలి. సమసమాజంలో మనీషిగా జీవించాలి. 2."విద్య":- నరునిగా పుట్టగానే సరిపోదు*. *అర్థము,పరమార్థము నివ్వగల విద్య నార్జించడం చాల కష్టము. దీక్ష-దక్షత; శ్రద్ధ-ఆసక్తి; నయము-భయము;* *వినయము-విధేయత;నిష్ఠ-నీమము లేనిదే చదువు వీసమైనా అబ్బదు. విద్యలేనివాడు* *వింతపశువే గదా! 3."వివేకము":- మనిషిగా పుట్టవచ్చు. అనేక విద్యలు నేర్వవచ్చు. కాని అట్టి వానికి "వివేకము" ఉండడం మిక్కిలి కష్టము. పశుత్వము నుండి మనిషిని వేరుచేసేది*వివేకము -విచక్షణ" అని గమనించాలి.అది లేని వ్యక్తి వాసన లేని పుష్పమే*.

 *4."దాతృత్వము":- నరునిగా పుట్టాడు. విద్యావంతుడైనాడు. వివేకం తోడైనది. కాని అతనికి "దానగుణం" అబ్బడం కుదరని పని. ఒక వేళ అబ్బితే విశేషాతిశయమే. కాన ఉత్తమ నరునిగా పుట్టి, విద్యాప్రావీణ్యంతో, వివేకవర్తనుడై , దానగుణంతో మానవసేవయే మాధవసేవగా, పరోపకారమే పరమార్థముగా, సేవలందిస్తూ, సుఖ జీవన యానం చేయాలని సారాంశము*.

                                  *****

                  *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీమన్నారాయణీయం

 *శ్రీమన్నారాయణీయం*


శ్రీ కృష్ణుని విషయానికి వస్తే నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్ లోని మధుర, గుజరాత్ రాష్ట్రంలో ద్వారక, కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.


నారాయణీయంతో సంబంధంవున్న గురువాయూర్ గురించి చూద్దాం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. 


నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". 


కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు.


ఇక్కడి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.


ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశ ఋషికి ప్రసాదించాడనీ, ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించగా, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. 


స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట.


అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. 


గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 


ఇక్కడి క్రృష్ణుడిని భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. 


బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. 


పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 


గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. 


ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు. 


ఆ గురువాయూర క్రృష్ణ ఆరాధనతో ఈ నారాయణీయం మొదలవుతుంది.


 స్వస్తి. 

🙏🙏🙏

సేకరణ

దశకరాము