చీర భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం . మహా విలయంలో నుంచి ప్రాణాలు కాపాడింది..
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
2, సెప్టెంబర్ 2026, బుధవారం
వరదల విలయంలో ఓ చీర 21 మందిని
నేపాల్ ఆకస్మిక వరదల విలయంలో ఓ చీర 21 మందిని కాపాడింది. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో చీర అతి ముఖ్యమైనది. అలాంటి చీర 21 మంది ప్రాణాలను కాపాడగలిగిందంటే గొప్ప విషయం. అందులోనూ చీర సాయంతో బయటపడ్డ వారంతా వృద్ధులే. 26 తేదీన సంభవించిన నేపాల్ ప్రళయంలో టిబెట్ సరిహద్దుల్లో ఉన్న రషువా జిల్లాలో తమిళనాడుకు చెందిన 21 మంది భక్తులు మానస సరోవరం కైలాస యాత్రకు పోతున్నారు. ఈ సందర్భంగా ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయారు. బస్సు మూడు వంతులు మట్టిలో కూరుకుపోతోంది. వరద వేగం పెరుగుతుంది. అప్పుడే అరవై అయిదు ఏళ్ల ఓ మహిళ కష్టపడి బస్సు పైకి ఎక్కి అక్కడి నుంచి గట్టు పైకి ఎక్కింది . తన చీర వవిప్పదీసి కిందకు జార విడిచింది. అదృష్టం ఏమిటంటే ఆమె చీర జారవేసిన పక్కనే ఒక కేబుల్ వైర్ కూడా ఉంది . చీరను పట్టుకున్న మహిళలు ఆసరాగా కేబుల్ వైర్ కూడా పట్టుకుని అతి కష్టం మీద మృత్యువు తరుముకొస్తున్న తరుణంలో 21 మంది వృద్ధ మహిళలు నిమిషాల మీద ఆ చీర సాయంతో పైకి చేరుకున్నారు. మధ్యలో ఆ చీరకు మరో ఇద్దరు మహిళలు తమ చీరలను కూడా దానికి కలిపి ముడి వేసి కిందకు వదిలారు. 21 మంది పైకెక్కిన తర్వాత విచిత్రంగా బస్సు కూడా కొట్టుకుపోయింది. మహిళలు భగవంతుడే తమను ఈ ప్రమాదంలో నుంచి రక్షించాడని కైలాస శిఖరం వైపు తిరిగి కన్నీళ్ళతో దండం పెట్టుకున్నారు. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు వాళ్లు తెలియజేశారు. ఆ బృందం ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా జై శంకర్ వారికి స్వాగతం చెప్పారు . అప్పుడు ఆ మహిళ చెప్పిన అద్భుతమైన ఈ సంఘటన విని ఆయన కళ్ళు చెమర్చాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి