16, నవంబర్ 2021, మంగళవారం

అద్భుతాలతో


మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ... ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!! 


మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .


🌷 *1* . *తల్లి* 


మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన... 👩‍🦱తల్లి మొదటి అద్భుతం. 


🌷 *2* . *తండ్రి* 


మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు  

మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 

దుఃఖాన్ని తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. 


🌷 *3* . *తోడబుట్టిన* *వాళ్ళు* 


మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  

మనతో పోట్లాడడానికి... మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺


🌷 *4* . *స్నేహితులు*  


మన భావాలను పంచుకోడానికి..  

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా.. మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం. 🌚🌝👨‍✈️🕺


 *🌷5* . *భార్య* / *భర్త* 


ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా చేస్తుంది 

కలకాలం తోడు ఉంటూ...🌛 ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే... ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది 🌜

భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం .


🌷 *6* . *పిల్లలు* 


మనలో స్వార్థం మొదలవుతుంది..  

మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  

వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  

వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది.. 

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు అసలు ఉండరు... 🙏

పిల్లలు ఆరో అద్భుతం 


అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?


🌷 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 


వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది.. 

వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం 

మళ్ళీ పసిపిల్లలం...🏃🏃‍♀️👩‍🔧👨‍💼👨‍🎓👩‍🎓 అయిపోతాం  

వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀


🌹ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి  

చిన్న పలకరింపు చాలు... మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.  

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం ...


ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి ఆయిగా జీవించడం లోనే ఆనందం...🌹🌹🌹

ఎవడింజను వాడిదే

 ఔరా! ఏమి చోద్యం:

(ఓ సెటైర్ యూట్యూబ్ వీడియోలపై)


వారం రోజులు గా సుబ్బారావు కి కడుపులో నొప్పి, బొడ్డు చుట్టూ మెలితిప్పి నట్టు బాధ. నిద్రపోయే అర్దరాత్రి వేళ గుండెల్లో గ్యాసు తన్నుకొస్తోంది.

మోషన్ అయితే ఔతోంది, కాకపోతే కావట్లేదు.

ఇంట్లో వాతావరణం కాలుష్యం చేస్తూ నిరంతరం అపాన వాయువు.వేడినీళ్ళు,వామునీళ్ళు, జీలకర్ర నీళ్ళు తాగు తూనే ఉన్నా ఏదో కాస్త ఉపశమనం ఉన్నా బాధ యథాతధం.


ఇది పనికాదని ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ డా...కాలేయ గారి ఎపాయింట్ మెంటు తీసుకున్నాడు.ఆయన ఆన్లైన్లో. చేయించి వలసిన టెస్ట్ లు చెప్పగా అవన్నీ చేయించి ఆ ఫైలు తీసుకొని

అపాయింట్మెంట్ రోజు న కలిసాడు డా..కాలేయ గారిని.


రిసెప్షనిస్ట్ రిపోర్ట్ లన్నీ తీసుకుని టోకెన్ ఇచ్చి మిమ్మల్ని ఓ అరగంట లో పిలుస్తారు కూర్చోండి అంది.


తన టర్మ్ రాగానే లోపలికి పోయాడు సుబ్బారావు

డా..కాలేయ గారు రిపోర్ట్ పరిశీలించి మీకు కడుపులో

బాగా అజీర్ణం ఉంది ఇది బాగా పేటీ లివర్ వల్ల, ఆహారం అరగక పోవడం వల్ల,కొంత ఇన్ఫెక్షన్ వల్ల, ఏర్పడింది.పచ్చివి తిన్నట్టు న్నారు బహుశా అన్నాడు.


మీ సమస్యలన్నీ మీకు అరుగుదల సరిగా లేకపోవడం వల్ల,చక్కగా ఉడికినవి, సులువుగా అరిగేవి తినండి.ఓఫ్లాస్కు కొనుక్కుని తరచుగా వేడినీళ్లు తాగుతూ ఉండండి.పచ్చికూరలు,గింజలు, కొబ్బరి నూనె తాగడం, నెయ్యి నాకేయడం,

ఇలాంటివి కొన్నాళ్ళు మానేసి ఉడకపెట్టినవి

సులువుగా జీర్ణం అయ్యేవి తినండి.మందులు రాస్తున్నా అని మందులు రాస్తుండగా, డా....కాలేయ గారి వెనుక గోడమీద ఉన్న నాలుగురు ఫోటోలు చూసి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు.


ఆ ఫోటోలు ఒకటి పకృతి వీర్రాజు ది,బాదాం బాలనాయుడిది,ఆకు కూరలు అప్పలర్రాజుది,అరికె పాషాది.


సుబ్బారావు డాక్టర్ గారూ మీరుకూడా వీరి అభిమానులా వీరి ఫాలోయర్సా అనడిగాడు.

డా... కాలేయ నవ్వుతూ వీరి ఫాలోయర్స్ సగం మంది నా ఫాలోయర్స్.నా వైద్యం అభి వృద్ధికి వీరే కారణం.యూట్యూబుల్లో మీలాగే వీరిని ఫాలో అయ్యేవారు లో సగంమంది జీర్ణవ్యవస్థ దెబ్బ తిని నాదగ్గరకు వస్తారు అందుకే వీరు నాకు ప్రాతస్మరణీయులు అన్నాడు.


చివరగా సుబ్బారావు గారూ మీకో మాట.ఎవరికో

మొలకలు సరిపోతాయని మీకు సరిపోవు.మనుషులందరూ ఒక్కటే అయినా

ఎవడి ఇంజను వాడిదే.ఈ వయసులో ప్రయోగాలు వద్దు.తేలికగా అరిగే వి తింటూ వాకింగ్ చేయండి.

నెల రోజుల తర్వాత రండి.


అలాగే వింటూ బయటికొచ్చిన సుబ్బారావుకి మనసులో మారు మోగుతున్న డా...కాలేయగారి మాట:


*మనుషులంతా ఒక్కటే--కానీ ఎవడింజను వాడిదే


నిజమే కదా.😊

15, నవంబర్ 2021, సోమవారం

మధుమేహం

 మధుమేహం గురించి సంపూర్ణ వివరణ - 


        మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును. ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 


              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 


              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 


     

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 


      1 - సహజము .


      2 - అపథ్య నిమిత్తజము . 


 * సహజము - 


        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 


 * అపథ్య నిమిత్తజము - 


        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 


                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 


       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును. 


                  మధుమేహా సమస్య నివారణలో ఔషధ సేవనతోపాటు ఆహార నియమాలు కూడా ప్రధానపాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మీకు తినవలసిన మరియు తినకూడని ఆహారనియమాల గురించి వివరిస్తాను. 


   తినవలసిన ఆహారపదార్ధాలు - 


       యవలు , గోధుమలు , కొర్రలు , రాగులు , పాతబియ్యపు అన్నం , పెసలు , చేదు గల కాయగూరలు , మరియు ఆకుకూరలు , చేదుపోట్ల , కాకరకాయ , మెంతులు , దొండకాయ , వెలగపండు , మారేడు , నేరేడు విత్తనాలు , ఉసిరిక పండు , పసుపు , అడివిమాంస రసములు ఎక్కువుగా వాడవచ్చు . 


  తినకూడని ఆహార పదార్దాలు - 


      కొత్త బియ్యపు అన్నం , అధిక నూనె కలిగిన ఆహారాలు , బెల్లపు పదార్దాలు , నెయ్యి వంటకములు , మద్యము , గంజి , చెరుకు రసము , పుల్లటి పదార్థాలు , చింతపండు , పెరుగు , వెన్న , జున్ను , దుంప కూరలు , కొవ్వులు అధికంగా ఉండు పదార్దాలు వాడకూడదు. అదేవిధముగా పగలు నిద్రించరాదు , ధూమపానం , రాత్రి సమయములో మేల్కొని ఉండటం నిషిద్దం . మలమూత్ర వేగాలను నియంత్రించరాదు.   


        పైన చెప్పిన నియమాలు పాటిస్తూ మధ్యాహ్న సమయంలో మజ్జిగ అన్నంలో 50 గ్రాముల ఉల్లిపాయని నంజుకొని తినండి. పలుచటి మజ్జిగని మాత్రమే వాడవలెను. శరీరం నందు వేడిమి పెరగకుండా జాగ్రత్తవహించండి. నేను రాసిన గ్రంధాల నందు పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా చిన్నచిన్న చిట్కాల సహాయంతో తగ్గించుకునే విధముగా అత్యంత సులభయోగాలు ఇచ్చాను . ప్రతి ఇంటి నందు ఉండవలసిన గ్రంధములు . తప్పక చదవగలరు.


                       * సంపూర్ణం *

  

 మధుమేహ నివారణా చూర్ణం నాదగ్గర లభ్యం అగును . నన్ను సంప్రదించగలరు .

విస్తరాకులలో తింటే

 భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు - వాటిలోని ఔషధ గుణాలు - 


        కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికొనుటకు ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు భుజించు ఆహారం కాదు వారు ఆహారాన్ని వండటానికి ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలే కారణం అని నిర్దారణకు వచ్చారు. ఈ అల్యూమినియం పాత్ర యందు వండబడిన ఆహారం విషపూరితం అగును. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచం కొంచంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయును .


              అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం అగును. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందును. 


          పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండుటకు ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చవలెను. అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.


 * అరటి ఆకు -


      ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .


 * మోదుగ విస్తరి -


      ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.


 * మర్రి ఆకు విస్తరి -


      దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.


 * పనస -


      దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.


 * రావి -


      ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .


 * వక్క వట్ట -


      ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును . 


      పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును. 


    

                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

14, నవంబర్ 2021, ఆదివారం

శ్రీమద్భాగవతము

 *11.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2319(౨౩౧౯)*


*10.1-1462*


*శా. రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్*

*చాలున్; మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్*

*లీలం బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ*

*మ్మేలా పాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే.* 🌺



*_భావము: భ్రమరేశ్వరా! మకరందం త్రావి త్రావి మదించియున్నావు. నీకు రాయబారాలు నడపటం బాగా అలవాటనుకుంటాను. నీ గడసరి తనము మాను. చమత్కారములు చాలించు. మా పాదాలు వదులు. మేము మా భర్తలను, కొడుకులను, ఇతర బంధువులందరిని అలక్ష్యము చేసి, మోక్షము మాటే తలపెట్టక, ఆయనలో ఐక్యమవ్వాలనే కాంక్ష తో వస్తే, మమ్ములను తృణీకరించి దూరమయ్యాడు ఆ శ్రీకృష్ణ ప్రభువు. ఈ చేష్టలను ధర్మ నిష్ఠ కల ప్రభువులు మెచ్చుకుంటారా?"_* 🙏



*_Meaning: "O king of the bees! You have become arrogant and fully intoxicated by drinking nectar from flowers. You are used to conducting mediation and Intercessions and are very adept at these. Enough with your shrewdness and stop your artfulness. Leave our feet and get away. We neglected and abandoned our husbands and children, never thought of Moksha but were completely involved in uniting with the Supreme being Sri Krishna. He made light of us and distanced from us, the ardent followers and puppets. Would the Supreme being approve of such misdemeanor?."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan kumar (9347214215).*

ఉన్మత్తుడు..ఉద్యోగి..

 *ఉన్మత్తుడు..ఉద్యోగి..*


"కొండారెడ్డీ! గురుబ్రహ్మం ఉన్నాడా?.." 

" ఉన్నాడు సార్ ..అన్నదానం వంటకు సరుకులిస్తున్నాడు.."


    " పరమేషూ..ఈరోజు లడ్లు చేయించే దగ్గర ఎవరున్నారు?.." 

" గురుబ్రహ్మమున్నాడు సార్..


  "అన్నదానం దగ్గర వడ్డనకు నేనూ, గురుబ్రహ్మం వెళుతున్నాము..మీకు చెప్పి వెళదామని వచ్చాము.." 


           "వెంకన్న గారూ..మీరు లీవు పెడితే, కౌంటర్ ఎవరు చూసుకుంటారు?..ఉన్న ఇద్దరూ సరుకులకెళుతున్నారు.." 


   మాట ముగించేలోపలే వచ్చే సమాధానం గురుబ్రహ్మం ఉన్నాడు అనే! 


       అర్చక స్వాములు, భక్తులకు ఇచ్చే కుంకుమను చక్కగా పోట్లాలుగా చుట్టి పెడుతూనో..లేదా..భక్తులకు ప్రసాదంగా తయారు చేసిన లడ్లు కవర్లలో ప్యాక్ చేస్తూనో..పల్లకీ సేవ కు మైక్ ఏర్పాటు చేస్తూనో...ఆలయం లో ఉన్నంత సేపూ ఏదో ఒక పని లో నిమగ్నుడై,.... మా దత్తాత్రేయ స్వామి మందిర వ్యవస్థ లో ఇంతగా మమేకం అయిన వ్యక్తీ...గురుబ్రహ్మం అనబడే సన్నగా రివటలా ఉండే వ్యక్తీ ....ఎనిమిరెడ్డి గురుబ్రహ్మారెడ్డి..


     2004 వ సంవత్సరం లో తన అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేక, తల్లి వెంబడి మొదటిసారి మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వచ్చాడు..ప్రకాశం జిల్లా, పెద చెర్లో పల్లి మండలం, పోతవరం గ్రామ నివాసి..వాళ్ళ కులదైవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు..ఇద్దరు సోదరులు..తల్లి, తను..


       కొన్నాళ్ళు ఇక్కడ వుండి, తల్లికి స్వస్థత చేకూరగానే తిరిగి వాళ్ళ వూరు వెళ్ళిపోయాడు..I.T.I. పాస్ అయ్యాడు..B.A., డిగ్రీ పూర్తీ చేసాడు.. 2006 వ సంవత్సరంలో AP TRANSCO లో హెల్పర్ గా ఉద్యోగం లో చేరాడు..


        అంతవరకు బాగానే ఉన్న గురుబ్రహ్మారెడ్డి మానసిక స్థితి క్రమంగా మారిపోయింది..2007 నాటికి అతను ప్రపంచం దృష్టిలో ఒక మానసిక రోగి..అంతుచిక్కని ఆరోగ్య సమస్య..సోదరుల ప్రయత్నాలన్నీ నిష్పలం అయ్యాక, వారికి చివరిగా తోచిన ఉపాయం మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధి..తీసుకొని వచ్చి ఆ దత్తుడి పాదాల చెంత వదిలిపెట్టారు..తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషిగా మారుతాడనే నమ్మకం ఆ కుటుంబ సభ్యుల్లో సన్నగిల్లే సమయం అది..ఆ పరిస్థితి లో గురుబ్రహ్మారెడ్డి ని శ్రీ స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు..


        ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడో తెలీని స్థితి..యెంత శాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడో, మరుక్షణం విపరీత రౌద్రం..ఉన్మత్త స్థాయి కి పరాకాష్ట గా మారిపోయే స్వభావం..వంటి మీద బట్టలు సైతం తీసి గిరాటు వేసేవాడు..క్షణానికో రకంగా మారిపోయే తత్వం..తనలో తానే మాట్లాడుకోవడం..పూర్తి ఉన్మత్త లక్షణాలు..సరిగ్గా అవధూతల గురించి చెప్పిన "బాలోన్మత్త పిశాచ వేషాయా.." అన్న పరిస్థితి కి తగ్గట్టుగా ఉన్నది అతని ప్రవర్తన..


 కుటుంబ సభ్యులు సహనం తో పట్టుబట్టి, శ్రీ స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయించసాగారు.. క్రమంగా మార్పు రావడం మొదలు పెట్టింది..2008 డిసెంబర్ నాటికి, గురుబ్రహ్మం మామూలు స్థాయికి వచ్చాడు..దేవాలయం లో పనులు చేసుకుంటూ..సాటివారి పనుల్లో సహాయం చేస్తూ.. స్వామి సన్నిధి లోనే కాలం గడపసాగాడు..


2009 లో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి నైట్ వాచ్ మాన్ హఠాన్మరణం తో, ఖాళీ ఏర్పడింది..అంతకుముందు నుంచీ గురుబ్రహ్మాన్ని దగ్గరగా పరిశీలిస్తూ ఉన్నాను కనుక, అతను ఆ ఉద్యోగం చేస్తాడో..లేదో..అని..అడిగి చూద్దామనుకున్నాను.. ఇతరులనూ సలహా అడిగి, చివరిగా గురుబ్రహ్మాన్ని సంప్రదించాను..."ఈ దత్తాత్రేయుడి దగ్గర ఏ పని చెప్పినా చేస్తాను" అని చెప్పాడు..అలా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ఉద్యోగుల్లో ఒకడిగా మారిపోయాడు..దేవాదాయ శాఖ వారి అనుమతీ తీసుకున్నాము..


 ఈ నాటికి సుమారు పది పదకొండు సంవత్సరాలు దాటిపోయింది గురుబ్రహ్మం శ్రీ స్వామివారి మందిరం లో ఉద్యోగిగా చేరి..మానసిక రోగి, మామూలు వ్యక్తిగా మారి, మాలో ఒకడుగుగా ఒదిగిపోయాడు..అదే మొగలిచెర్ల లో సిద్ధిపొందిన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయుడి లీల!..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523114...సెల్..94402 66380 & 99089 73699).

శ్రీమద్భాగవతము

 *10.11.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2318(౨౩౧౮)*


*10.1-1461*


*శా. సమదాళీశ్వర! చూడు ముజ్జ్వలిత హాసభ్రూవిజృంభంబులన్*

*రమణీయుండగు శౌరిచేఁ గరఁగరే రామల్ త్రిలోకంబులం?*

*బ్రమదారత్నము లక్ష్మి యాతని పదాబ్జాతంబు సేవించు ని*

*క్కము నే మెవ్వర మా కృపాజలధికిం గారుణ్యముం జేయఁగన్?* 🌺



*_భావము: "మదించిన తుమ్మెదల రాజా! నువ్వే చెప్పు! ఆ భువన మనోహరుని దరహాస చంద్రికలకు, కనుబొమల అందమైన కదలికలకు కరగిపోని వారుంటారా? ముల్లోకములు పూజనీయురాలు, శ్రేష్ఠ వనితారత్నమగు లక్ష్మీదేవియే ఆయన పాదపద్మములను ఆశ్రయించి కొలుస్తూ ఉంటుంది, మేమేపాటివారము? ఆ కరుణాసముద్రుని దయకు పాత్రులము కావటానికి మేమెంత వారము?"_*🙏



*_Meaning: "Hey King of fully drunk bees! You tell us whether there can be a mortal who is not in raptures on seeing the enticing smiling face of charming Sri Krishna and the captivating beauty of the movement of His eyebrows. Even the queen and the best of women LakshmiDevi serves Him with diligence and devotion. In comparison, we are minions and can we wish to become subjects to the benevolent glances of Sri Krishna, the ocean of compassion and magnanimity."_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కర్తృత్వభావన

 💐కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.*

 వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.💐


వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.

 అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.


 అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.


 రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు.అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.


 ఒకరు గురువుగారిని అడిగారు దైవీశక్తిని నేను చవిచూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి* *గురువుగారు ఇలా చెప్పారు- 


 500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.


 ప్రత్యక్షానుభవం కలుగుతుంది.

 కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుంది...అన్నారు.

 అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ, ప్రయత్నం చేయలేకపోయాడు.


 ఈ ఘట్టం విని అతని స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు.


 అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్షం చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా 

 ప్రయత్నం చేసి దైవీశక్తిని అనుభవించాడు.


 తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు..

 కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు...

 కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు. 

 అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక.


 వాస్తవానికి ప్రతి ఒక్కరు ఈ భూమ్మీదకు దిగంబరంగానే 

 వస్తారు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు..


 తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందుతారు...తిరిగి అందరినీ, అన్నింటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతారు.


 " ఖాళీ" అవడం తథ్యం....

 కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే

 గురువుగారు చెప్పిన "మెలకువలో నిద్ర".


 భగవద్గీతలో చెప్పినట్టు "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."

 నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.

 "ఖాళీ"గా ఉండడం. అదే* యోగనిద్ర.


 భగవద్గీత చరమశ్లోకంలో

 సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు.

 సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నారు.


 ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.

 "ఖాళీ" అనేది పరానికి సంబంధించినది.


 శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.

 కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు, 


 అర్థరాత్రి... ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధకారాన్ని(అభేదాన్ని)

 ఆస్వాదించడమే కాళీమాత దర్శనం.


 పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.


 కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.*

 వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.

 అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం. 


 నిజానికి తాను "ఖాళీ" అయిపోతే.... ఆ ఖాళీ ఖాళీగా ఉండదు... ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.

ఇదే "ఖాళీతత్త్వరహస్యం".


 అదే ఇది.... ఎవరూ లేకపోవడమే దేవుడు* ఉండడం. ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం. ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.


 నేను చేస్తున్నాను అనేది మన భ్రమ అదే మన కర్మ కు మూలం. అలా కాకుండా ఈ జగత్తు మొత్తం జగన్మాత(ఖాళీ)

 నడుపుతోంది. అని అనుకుంటే

అది దైవ దర్శనం మార్గం అవుతుంది మన ప్రయాణం శక్తి (ఖాళీ) తో కూడి చక్కగా సాగిపోతుంది అదే ఖాళీ తత్వ మార్గం. ఈ మార్గం కర్మలకు దూరంగా వున్న సర్వ సంతోషాల నిలయానికి 

 చేరుకోవడానికి సహాయపడుతుంది. ఆజగన్మాత దర్శనం మనకు లభిస్తుంది.

 తింటేనే రుచి తెలుస్తుంది,అనుభవంతోనే అమ్మ (ఖాళీ) గొప్పతనం తెలుస్తుంది.

8, నవంబర్ 2021, సోమవారం

మొలలనొప్పిని

 మొలలనొప్పిని వెంటనే హరించు సిద్దయోగం - 


    మొలలవ్యాధి అనేది శరీరము నందు వేడి విపరీతముగా పెరిగినప్పుడు సంప్రాప్తిస్తుంది. మలద్వారం నందు మొలకలు జనియించి తీవ్రమైన నొప్పి వచ్చును. మలబద్ధక సమస్య కూడా ఉత్పన్నం అగును. బలంగా మలమును బయటకి పంపుటకు ప్రయత్నించినప్పుడు మొలకలు తెగి తీవ్ర రక్తస్రావం జరుగును. ఒక్కోసారి రక్తస్రావం ఆగకపోవడం వలన ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చు. వ్యాధి ముదరక ముందే సరైన చికిత్స తీసుకోవలెను . 


            ఇప్పుడు నేను చెప్పబోయే సిద్దయోగం మొలల నొప్పిని వెంటనే హరించును . 


      ఒక గుప్పెడు మునగ ఆకును తీసుకుని మరుగుతున్న నీటి యందు వేసి వచ్చు ఆవిరిని మొలల స్థానమునకు పట్టించిన వెంటనే నొప్పి తగ్గిపోవును . 


   

             ఇది నా అనుభవపూర్వకం ........


   గుండెదడ , నీరసము హరించుటకు సులభ ఔషధ యోగము - 


       క్యారెట్ మెత్తగా దంచి రసము తీసి , 50 రసము నందు 20 గ్రాముల పటికబెల్లం చూర్ణము కలిపి పూటకు ఒక మోతాదు చొప్పున ఉదయము మరియు సాయంత్రం రెండు పూటలా తాగుచున్న గుండె దడ , నీరసం , నిస్సత్తువ హరించును . 


       పైన చెప్పిన సులభ యోగము వలే మరెన్నో అద్భుత సులభయోగాలు నేను రచించిన గ్రంథాల యందు సంపూర్ణముగా ఇచ్చాను. 

 .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


      గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఎందుకో తెలుసా..?

 #తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి #జయలలిత గారు తన జీవితంలో #దీపావళి పండుగను ఎప్పుడూ జరుపుకోలేదు..

ఎందుకో తెలుసా..??

******************************************************


#టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి 

#మేల్‌కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా...??


1790లో #నరకచతుర్దశి రోజు అర్థరాత్రి సమయంలో టిప్పుసుల్తాన్, తనకు అత్యంత నమ్మకస్తులు, అత్యంత క్రూరులైన సహచరులు, సైన్యంతో కలిసి మెల్కోట్ ఆలయానికి చేరుకున్నాడు.. 

అప్పటికి ఆ ఆలయంలో సుమారు 1000 మంది భక్తులు నరక చతుర్దశి పండుగ ఊరేగింపును జరుపుకుని ఆనందంగా ప్రసాదాలు భుజించి విశ్రమించడానికి సిధ్దమౌతున్నారు.. 

టిప్పు ఆలయానికి చేరుకుని ఆలయ తలుపులు, ద్వారాలు మూసివేసి, 1000 లో 800 మందిని ఊచకోత కోశాడు, పసిపిల్లలు అనికూడా దయ లేదు.. 

200 మంది సుందర స్త్రీలను బంధించాడు, మరుసటి రోజు ఉదయం అంటే, దీపావళి. అప్పుడు ఈ నర హంతకుడు, మెల్కోట్ ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180 గుర్రాలను ఉపయోగించినా మూడు రోజులు సమయం పట్టింది..

అంటే ఎంత సంపద కొల్లగొట్టాడో..

ఆ రోజుల్లో సంపద దేవాలయాల్లో దాచబడేది..

టిప్పు భూమిపై ఇప్పటివరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో ఒకడు..


ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ #మైసూరు_మేల్‌కోటే ప్రాంతంలో చాలామంది దీపావళి పండుగను జరుపుకోరు..


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినదే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగ జరుపుకోలేదు..

కారణం ఆమె వంశంలోని వారు (#మేల్కోటె_అయ్యంగార్) కూడా ఊచకోత కోయబడిన 800 మందిలో ఉన్నారు..


చరిత్ర పుస్తకాలలో టిప్పు చిత్రం చాలా అందమైన శ్రావ్యమైన, శాంతి, ప్రేమగల చిత్రంగా చేర్చబడింది, కాని లండన్ లైబ్రరీలో భద్రపరచబడిన టిప్పు యొక్క దిగువ వాస్తవ చిత్రాన్ని చూడండి.. 


భారతీయ చరిత్రను ఖాన్-గ్రెస్ మరియు కుమ్మీలు ఎలా పూర్తిగా మార్చి వేశారో టిప్పుసుల్తాన్ విషయమే మంచి ఉదాహరణ..


నరరూప రాక్షసుడు (టిప్పుచే) ఊచకోతకు మరియు దోచుకోబడ్డ దేవాలయాల జాబితా..👇 


త్రిపాంగోట్, 

త్రిచెంబరం, 

తిరునవయ, 

తిరువన్నూర్, 

కాలికట్ తాలి, 

హేమాంబికా ఆలయం, 

పాల్ఘాట్ లోని జైన దేవాలయం, 

మామియూర్, 

పరంబతాలి, 

వెంకటంగూ, 

పెమ్మాయనడు, 

తిరువంజుకులం, 

తేరుమనవ, 

తైమళూన్, 

తెమపనుమ, 

వడకళ కేరళీశ్వర, 

త్రిక్కండియూర్, 

సుకాపురం, 

భగవతి ఆలయం, 

మరణేహి ఆలయం, 

వెంగర ఆలయం, 

టికులం, 

రామనాథక్రా, 

అజింజలం, 

నరహంతకుడు టిప్పు, ప్రధాన పండుగ రోజులనే ఊచకోత కోయడానికి మరియు దోపిడీ చేయడానికి ఎంచుకునేవాడు..

కారణం: ఆ రోజున అధిక భక్తులు చేరుకుంటారు మరియు గరిష్ట సంపదను తీసుకువచ్చేవారు..

అప్పట్లో అధిక దేశ సంపద దేవాలయాల ఆధ్వర్యంలోనే ఉండేది..

టిప్పుసుల్తాన్ : 

1.కిట్తూరు చెన్నమ్మ రాజ్యంలో మతం మారనందుకు 40,000 మందిని తలలు నరికించాడు.

2.కేరళలో మతం మారని 10,000 మంది బ్రాహ్మణులకు బలవంతంగా సున్తీ చేయించాడు. 

3.హిందూ స్త్రీలను వాడి సైనికులకు బహుమతిగా ఇచ్చేవాడు.

4.ఇరవై సంవత్సరాల వయస్సు ఉన్న హిందూ యువకులను నపుంసకులుగా మార్చేవాడు. పరమ దుర్మార్గుడు వాడు.

5. కర్ణాటకలోని కొడగు హిందువులను ఊచకోత కోసాడు.

6.తిరుపతి కళ్యాణ వేంకటేశ్వరుని దోపిడీ చేసాడు టిప్పు తండ్రి హైదర్ అలీ.

7.కొడగు హిందూ స్త్రీల చన్నులు కోయించాడు టిప్పు సుల్తాన్.

8.చేతులు పైకెత్తించి చంక వెంట్రుకలు కనబడ్డ ప్రతి హిందూ బాలుడినీ చంపిన కసాయి టిప్పు.

9.కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోటె ప్రాంతంలో పవిత్రమైన దీపావళి పర్వదినం రోజు 800 మంది వేద పండితులను, చిన్న పిల్లలను, మహిళలను దారుణంగా గొంతులు కోసి హత్యలు చేశాడు టిప్పు సుల్తాన్, దీనికి నిరసనగా మెల్కోటె ప్రాంతంలో నేటికీ హిందువులు దీపావళి పండుగ చేసుకోవడం లేదు. కర్ణాటక కేరళ ప్రాంతాల్లో దాదాపు లక్ష మంది పైన అమాయక హిందువులను క్రూరంగా దారుణంగా హత్యలు చేశాడు ముస్లిం మతోన్మాది టిప్పు సుల్తాన్. వేలాది హైంధవ దేవాలయాల పైన దాడి చేసి ఆలయలలో వున్న విలువైన సంపదను దోపిడీ చేసి, ఆలయాలను మసీదులుగా మార్చాడు టిప్పు సుల్తాన్.


చరిత్రను హిందువులకు వ్యతిరేకంగా వ్రాసిన సంఘటనకు టిప్పూ చరిత్ర గొప్ప ఉదాహరణ. టీ.వీ ల్లో వచ్చే సీరియళ్ళు చూసి టిప్పును గొప్ప దేశభక్తుడూ, పరిపాలనాదక్షుడు అని భ్రమపడుతున్న అమాయక సెక్యులర్లూ, టిప్పూ కత్తి మీద ఏం రాసుందో ఒక్కసారి చదవండి.. "కాఫిర్‌లను ఊచకోతకోసిన ముస్లిం వీరుడు.." అని రాసుంటుంది. (కాఫిర్‌లు అంటే వాడి భాషలో హిందువులు..)


#TipuSultan #Melkote #Deepavali