6, ఏప్రిల్ 2023, గురువారం

సంకెళ్లు

 *శుభోదయం* 🙏💐


నీ ఊహలే నీకు సంకెళ్లు... 

నీ కోరికలే నిన్ను ముంచే కెరటాలు.. 

నీ బంధాలే నిన్ను పట్టి లాగే పాశాలు... 

నీ సంసారమే నీకు జైలు.. 


సంకెళ్లతో పోరాడుతూ, 

కెరటాలలో మునిగి తేలుతూ, 

పాశంతో మరిన్ని చిక్కుముడులు వేసుకుంటూ 

సాగే ఈ సంసారమనే జైలులో

ఆనందాన్ని వెతుక్కునే అజ్ఞాని జీవుడు...  


🙏🙏🙏🙏🙏శ్లోకం:☝️

*య ఈర్షుః పరవిత్తేషు*

 *రూపే వీర్యే కులాన్వయే ।*

*సుఖసౌభాగ్యసత్కారే*

 *తస్య వ్యాధిరనన్తకః ॥*


భావం: ఇతరుల సంపద, అందం, పరాక్రమం, ఉన్నత కుటుంబం, సంతోషం, అదృష్టం మరియు గౌరవం పట్ల ద్వేషము, ఈర్ష్యా పడే వ్యక్తి ఒక కోలుకోలేని రోగి. అతని ఈ వ్యాధి ఎప్పటికీ నయం కాదు.



ధీరతతో రాణిస్తుంది*...

 .


             _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*దరిద్రతా ధీరతయా విరాజతే*

*కురూపతా శీలగుణేన రాజతే*

*కుభోజనంచోష్ణతయా విరాజతే*

*కువస్త్రతా శుభ్రతయా విరాజతే॥*


తా𝕝𝕝 

*దారిద్ర్యం ధీరతతో రాణిస్తుంది*..... 

*రూపహీనత శీలంతో, సద్గుణంతో రాణిస్తుంది*...... 

*రుచిలేని భోజనం వేడిగా ఉండటంతో రాణిస్తుంది*..... 

*చిరిగిన బట్ట పరిశుభ్రతతో రాణిస్తుంది*".....


.

             _*సూక్తిసుధ*_


*రాక్షసులు:* 

రాజాజ్ఞ మీరినవాడును, సఖులమాటవినక కోపించువాడును, సభకునెదిరించినవాడును, ప్రభువునకు అణగని సేవకుడును, పురుషునకు అణగని ఆడుదియు, తనవంటివాడులేదని గర్వించినవాడును, తల్లిదండ్రులను కష్టపరచువాడును, చేసిన ఉపకారము మఱచువాడును, అబద్ధములను చెప్పువాడును, వీరలు రాక్షసులతో సమానులు.


*శ్రీ హనుమాన్ విజయోత్సవం

 *శ్రీ హనుమాన్ విజయోత్సవం విశిష్టత🚩*

శ్రీరామునికి అత్యంత నమ్మకమైన బంటు హనుమంతుడు...


శ్రీరాముడు సీతను ఎడబాసి మానసిక క్షోభను అనుభవిస్తూ, సీత జాడ వెతుకుతున్న సందర్భ సమయంలో అడవిలో రాముడుకి హనుమంతునితో పరిచయం ఏర్పడినది... పరిచయం ఏర్పడిన నాటి నుండి శ్రీరామచంద్రున్ని హనుమంతుడు విడిచి ఉండలేదు, రాముడే తన సర్వస్వంగా భావించిన వాయునందనుడు తన ప్రభువైన రాముని మాట ఏనాడు జవదాటలేదు.


నేటి విశేషాన్ని పురస్కరించుకొని రెండు కథలు వున్నాయి...


1 , నేటి రోజున హనుమంతుడు సీత జాడను కనుగొని, తిరిగి ప్రయాణము అయి చేరిన రోజుగా పరిగణిస్తారు ... అందుకే వానరులు అంతా కలసి విజయోత్సవ దినంగా చేసుకొని, హనుమంతుణ్ణి పొగిడిన రోజు కాబట్టి ఈరోజు , హనుమద్ విజయోత్సవ దినంగా జరుపుకుంటారు...


-- -- -- -- 


2, హనుమంతుని సహాయంతో సీత జాడను వెతకడం, లంకేశ్వర్వునితో రాముడు పోరాటం చేయుటకు సముద్రంపై వారది కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర, లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేసాడు. 

హనుమంతుని శరీరంలోని రోమ రోమానికి తన రాముని స్మరణ తప్ప వేరే లేదని నిరూపించాడు. 

తన హృదయాన్ని చీల్చి సీతా రాములను చూపించాడు, ఇలా హనుమంతునికి రామునికి మధ్యన అన్యోనతలు ఎన్నో కనబడతాయి.


చివరికి రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీ రామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది… హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు నాకు అన్ని వేళల హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు.


నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేసాడో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి రోజు శ్రీ హనుమత్ విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.


ఈ ఏడాదిలో ప్రథమ పౌర్ణమి, చంద్రుడు పదహారు కళలతో సూర్యేందు సంగమ కాలాన్నే పర్వ సంధి కాలం అని అంటారు. 

అమావాస్య నుంచి పౌర్ణమి వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకి చంద్రునికి ఒక్కొక్క కళ హెచ్చుతూ, తిరిగి పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదహారు దినాలలో ఒక్కొక్క రోజుకు చంద్రునికి ఒక్కొక్క కళ తగ్గుతూ వస్తాడు.


ఇలా పదహారు కళలతో చంద్రుడు సంవత్సరానికి 12 పౌర్ణమిలు అత్యంత కాంతివంతుడై, ప్రతీ మాసంలోని పౌర్ణమి నాటి నక్షత్రంతో కూడి వుండటం వల్ల, ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పౌర్ణమికి ఆ పేరుతో వస్తుంది. ఇలా ఏడాదిలోని పండ్రెండు పౌర్ణమిలు పండ్రెండు పర్వ దినాలుగా అందిస్తూ చంద్రుడు సర్వ మానవాళికి ప్రకాశవంతమైన జీవనాన్ని అందిస్తున్నాడు. 

అందుకే ఉగాదితో సంవత్సరం ప్రారంభం అవుతుంది అందుకే రాముడు చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవానికి ఎంచుకున్నాడు


కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.


హనుమంతుని నైజం :-


యత్ర యత్ర రఘునాధ కీర్తనం – తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

బాష్పవారి పరిపూర్ణ లోచనం – మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను



కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు. 

పరమశివుని అంశతో జన్మించారు, సప్త (7) చిరంజీవులలో ఒకరు, ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాస మానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. 

ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. 

చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. 

అందరు రాక ముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.

భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. 

మహా రోగాలు నయమవుతాయి, చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. 

శని బాధలు తొలగిపోతాయి, బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 

5 ప్రదక్షిణలు చేయండి, అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం, వీలుంటే 5 పళ్ళు సమర్పించండి, 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల స్వామి వారి అనుగ్రహము కలుగుతుంది అని నమ్మకం...


శ్రీ రామ జయ రామ జయజయ🙏🍃☘️

దుష్టునికి బహుదూరంలోనూ

 *శకటం పంచహస్తేషు, దశహస్తేషు వాజినమ్*

*గజం సహస్ర హస్తేషు, దుష్టం దూరేణ వర్జయేత్.*


రథానికి ఐదు మూరల దూరంలోనూ, గుఱ్ఱానికి పది మూరల దూరంలోనూ, ఏనుగుకు వెయ్యి మూరల దూరంలోనూ, దుష్టునికి బహుదూరంలోనూ ఉండాలన్నారు.


కానీ గ్రహచారం సరిగా లేనప్పుడు అప్పుడప్పుడు కొంత కాలం దుష్టులతో సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్టి సమయాల్లో మౌనంగా, ఆధ్యాత్మిక చింతనతో జీవించడం అత్యున్నతం.

సుభాషితమ్

 .


           _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝


*ధర్మస్య దుర్లభో జ్ఞాతా*

*సమ్యక్ వక్తా తతోఽపి చ౹*

*శ్రోతా తతోఽపి శ్రద్ధావాన్* 

*కర్తా కోఽపి తతః సుధీః॥*


భావం:

*ధర్మం తెలిసినవారు చాలా అరుదు....ధర్మాన్ని చక్కగా వివరించేవారు ఇంకా అరుదు.... వివరించేవారు లభించినా దానిని భక్తి శ్రద్ధలతో వినేవారు చాలా అరుదు.... విని ఆ ధర్మాన్ని ఆచరించే బుద్ధిమంతులు అందరికంటే అరుదు*....

ఆదిశేషుని ప్రశస్తి...

 ఆదిశేషుని ప్రశస్తి...!!


🌿ఆదికాలంనుండి శ్రీమన్నారాయణుని పానుపై సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడు తన పైన ఆశీనుడైనప్పుడు  అంతటి భారాన్ని మోసిన ఘన కీర్తి ఆది శేషునిదే.


🌸సంకర్షణ నామంతో

శ్రీ మన్నారాయణుని రూపంలో వచ్చినది ఆదిశేషువే.


🌿శ్రీ వైకుంఠం లో, వీరాసనంలో, దర్శనమిస్తున్న పరవాసుదేవమూర్తికి

కావలసిన సేవలు తక్షణమే అందించే, నిత్య సేవకులకి  పర్యవేక్షక నాయకుడు

ఆదిశేషువే. 


🌸భూలోకానికి అడుగున పాతాళ లోకం వున్నది.పాతాళ లోకానికి క్రింద మరో 

పధ్నాలుగు లోకాలు వున్నట్లు మన

పురాణాలు చెప్తున్నాయి.యీ పధ్నాలుగు లోకాలకి అధిపతి ఆదిశేషువు.


🌿శ్రీవైష్ణవ ఆలయాలలో

శ్రీ మన్నారాయణుడు

శేషతల్ప శయన మూర్తిగా

దర్శనమిస్తాడు.


🌸ప్రకృతి ప్రళయాల వలన,

దుష్టశక్తులవలన,దేవతామూర్తులకు ఎట్టి ఛేదము జరుగకుండా,

యీ విగ్రహాల పరిరక్షణకు

నాగులను ఏర్పాటు చేసేది ఆదిశేషువు.


🌿అష్టసర్పాల నాయకులకు

అధిపతి ఆదిశేషువు.

మహాభారతం లో శ్రీ కృష్ణుడు రధసారధ్యం వహించిన  అర్జునుని రధం కూడా ఆదిశేషువే.


🌸ఆదిశేషుని, అపరమితమైన శక్తిని

'అయస్కాంత' శక్తి అంటారు. 

భూలోకానికి, సూర్యుని తో అనుసంధానం చేసి నడిపించేది యీ అయస్కాంత శక్తి. లేక భూమ్యాకర్షణ శక్తి.


🌿ఆదిశేషుని తల తిరుపతి

సప్తగిరులు, దేహం ఆహో బిలం, తోక 

శ్రీ శైలమని అంటారు.

శ్రీ వైష్ణవమతాన్ని,స్ధాపించిన

శ్రీ రామానుజాచార్యులవారు సాక్షాత్తు ఆదిశేషుని అవతారమని శ్రీవైష్ణవులంతా ఆయనను భక్తిశ్రధ్ధలతో ఆరాధిస్తారు..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి


https://kutumbapp.page.link/?isi=1598954409

 మంగళవారం

శంకరాభరణం సమూహం వారు ఇచ్చిన

సమస్య - 4386

5-4-2023 (బుధవారం)

 ఇది...


*“చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్”*


నా ప్రయత్నం ఇలా.....


ఉ.


నచ్చినవాడు మన్మథుడు నాకము నొందుట తప్పుగాదనెన్

రెచ్చిన కామపీడితయె, రెల్లు వనంబున భర్తకందగా

గ్రుచ్చుచు కత్తిచేఁ బతితఁ గోపముతోఁ బ్రతిఘాత వాక్కుగా

*చచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్యశోధనన్.*


.. డా.. అయ్యలసోమయాజుల సుబ్బారావు.

 Tnraoo: 

గయ్యాళి భార్య నిత్యమూ వేధించుచున్ననూ 


సయ్యాటకు ఉపక్రమింప సహకరింపని


భార్యతో చచ్చిన పాముని మరల చంపుట


న్యాయము సత్యశోధనన్ పరికింపగన్.

5, ఏప్రిల్ 2023, బుధవారం

అలిపిరి

 పెద్దలకు నమస్కరం


ఇందులో ప్రస్తావించిన విషయం చాలా ఆశ్చర్యంగా మరియు వాస్తవ దూరంగా ఉంది అనేది నా అభిప్రాయం


పెద్దలు దయతో దీని యొక్క రిఫరెన్స్ ఉంటే తెలియజేయగలరు



అలిపిరి అనే పేరు 1000 సం క్రిందట  *"అడి పడి"* గా పిలవబడేది


తమిళంలో

అడి అంటే పాదం

పడి అంటే మెట్టు


అంటే అప్పటి కాలంలో ఆ ప్రాంతం అంత తమిళ ప్రభావం కలిగిన ప్రాంతం కనుక అలా పిలిచారు


శ్రీవారి యొక్క పాదాలు అక్కడ ఉంటాయి

కాలి నడకన వెళ్లేవారు ఇప్పటికి ముందుగా ఈ శ్రీవారి పాదాల ఉన్న ఆలయాన్ని దర్శించి నడక యాత్ర ప్రారంభిస్తారు


*పాదాల చరిత్ర*


*శ్రీరామనుజులు* తిరుపతికి చేరి కులొత్తుంగ చోళునిచే సముద్రంలో పడవేయబడిన శ్రీ గోవిందరాజ స్వామిని తీయించి తిరుపతిలో దేవాలయం కట్టిస్తున్న కాలంలో  రామనుజులుకి నామకరణం చేసిన వారి యొక్క మేనమామ గారైన తిరుమల నంబి గారు కొండ పైన స్వామికి పూజలు చేస్తుండేవారు (ఆ రోజుల్లో కొండ అంత దట్టమైన అరణ్యం) వారు రామాయణం అర్థం చెప్పడం లో నైపుణ్యులు.


*సముద్రం లో నుండి తీసిన గోవిందా రాజ స్వామిని ఇప్పటికి మంచినీటి కోనేరు వద్ద చూడవచ్చు*



క్రింద దేవాలయ పనులు చూసుకుని రామనుజులు నడుచుకుంటూ కొండ క్రిందకు చేరేవారు

పైన పూజ ముగించుకుని తిరుమల నంబి గారు క్రిందకు దిగి రామనుజులు వారికి శ్రీమద్రామాయనం బోధించేవారు


అలా వారు 18సార్లు మొత్తం రామాయణాన్ని 18 రకాల కోణాల్లో రామనుజులకి భోదించారు


ఒక నాడు రామాయణ చర్చలో మునిగిన ఇద్దరూ సమయం మరిచిపోయారు


కాసేపటికి తేరుకొని కొండమీద సాయంకాలం పూజ ఆలస్యం అయిందని  బాధపడుతున్న వారికి పచకర్పూరపు వాసన వచ్చి పక్కనే శ్రీవారి పాదాలు స్వయంభూ గా ప్రత్యక్ష అయ్యాయి.


తిరుమలకు అనేక దారులు ఉన్నాయి


ఇది శ్రీవారి పాదాలు ఉన్న దారి కనుక *అడి పడి*  కాలంతారంలో రూపాంతరం చెంది అలిపిరి గా రూపాంతరం చెందింది


అంటే 

అస్త్రాలయం ఆస్ట్రేలియా గా

కాంబోజ దేశం కంబోడియా గా

కపిల అరణ్యం కాలిఫోర్నియా గా

రాజమహేంద్రి రాజమండ్రిగా

ఇలా అనేక ఉదాహరణలు

ఇతరుల సంపద

 శ్లోకం:☝️

*య ఈర్షుః పరవిత్తేషు*

 *రూపే వీర్యే కులాన్వయే ।*

*సుఖసౌభాగ్యసత్కారే*

 *తస్య వ్యాధిరనన్తకః ॥*


భావం: ఇతరుల సంపద, అందం, పరాక్రమం, ఉన్నత కుటుంబం, సంతోషం, అదృష్టం మరియు గౌరవం పట్ల  ద్వేషము, ఈర్ష్యా పడే వ్యక్తి ఒక కోలుకోలేని రోగి. అతని ఈ వ్యాధి ఎప్పటికీ నయం కాదు.

చీరల క్విజ్......

 చీరల క్విజ్........


1.గోవిందుని తలపించె చీర ?

2.ప్రసిద్ధి చెందిన కోట గల వూరి పెరే ఈ చీర పెరు?

3 శ్రీరామ నవమి ప్రసాదం, ఈ స్వామి కోవెల గల ఉరే ఈ చీర పేరు?

4.ప్రసిద్ధ హాస్య నటుడి ఇంటి పేరు ఈ చీర పేరు?

5.ఏడు కొండల స్వామిని తలపించే ఈ చీర పేరు?

6.భూ దానోద్యమం ని తలపించే ఈ చీర పేరు?

7.చందమామ ని చూడు, నన్ను చూడు ...అంటుంది ఈ చీర?

8. కోడి కూర ని తాళి పించే చీర?

9. ఇంగ్లీష్ లో ఆరతిపండు రసాన్ని తలపించ్డ్ చీరా?

10. దక్షిణ భారతంలో నే కాదు ప్రపంచ ప్రఖ్యాతి ఈ చీర?

11.మైసూర్ ప్యాలెస్ ని గుర్తు చేసే చీర?

12. పంజాబీ ఫుల్కా ను గుర్తు చేసే చీర?

13.ఇంగ్లీష్ కొండ చెలువ ను తలపించే చీర?

14.ఈ చీర పెరు చెప్తేతెలుగు కోట గుర్తు వస్తుంది?

15.లోన లోతారం పైన పటారంలా ద్వానించే చీర?

16.తెలుగు లో పెన్ను ను గుర్తు చేసే చీర?

17.కాశ్మీర్ లో సాలువా ల తో పాటు ఈ చీరలు కూడా ప్రసిద్ధి?

18. జామ కాయ ను గుర్తు చేసే చీర?

19.హిందీ జాగ్రత ఈ చీరలో వినిపిస్తుంది?

20.ఒకప్పటి రష్యా అధ్యక్షుడి పేరు ఈ చీర?

21.లవణాన్ని స్పురించే ఈ చీర ?

22..మన పక్క దేశం రాజధాని పేరు ఈ చీర ?

23.మన దేశం లో ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం పేరు ఈ చీర ?