4, సెప్టెంబర్ 2023, సోమవారం

ముహూర్తం

 *ముహూర్తం అంటే ఏమిటి? దానికి బలం అనేది ఉంటుందా? ఎలా నమ్మాలి? దేనికి నమ్మాలి?*

*విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయల తో మంచి స్థలం కోసం గాలిస్తున్నారు. వారు ఒక ప్రాంతం చేరగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొన్ని కుందేళ్లు వేటకుక్కలను తరుముతున్న దృశ్యం చూడగానే మ్రాన్పడిపోయారు. ఆ బలం కుందేళ్ళది కాదు అని, అది ఆ నేలలో ఉన్న మహత్తర శక్తి అని విద్యారణ్య స్వామి గ్రహించారు. అక్కడ రాజధానిని నిర్మిస్తే, శక్తివంతమైన సైనికులు, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు, మేధావులైన అధికారగణం, నిజాయితీపరులైన ప్రజలతో రాజ్యం విలసిల్లుతుంది అని భావించారు.*

*రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు. తెల్లవారుజామున ఒక ఘడియ లో చంద్రుడు ఏవో నక్షత్రాలకు సమీపిస్తాడు ట. అది అత్యద్భుతమైన ముహూర్తం అని భావించారు. హరిహర. బుక్క రాయల తో "నేను ఆ సమీపం లోని కొండపైకి ఎక్కి చంద్రగ్రహ కదలికలను గమనిస్తూ, సరైన ముహూర్త సమయం రాగానే శంఖాన్ని పూరిస్తాను. ఆ శబ్దం వినపడింది మరుక్షణమే మీరు ఇక్కడ పునాది ని తవ్వాలి. ఆ సమయంలో పడిన పునాది విజయనగర సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు ఆ ముహూర్తబలం కాపాడుతుంది" అని చెప్పి స్వామి కొండపైనున్న శిఖరాగ్రానికి వెళ్లారు.*

*రాయల సోదరులు ఇరువురూ గునపాలు చేబూని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారు జామున పూర్ణచంద్రుడు తేజోమయంగా నభో మండలం లో నిశ్చలంగా పరిభ్రమిస్తున్నాడు. నక్షత్రాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సరిగ్గా అదే సమయం లో ఒక జంగం దేవర నదీస్నానం చెయ్యడానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు. అది స్వాములవారు పూరించినదే అని భ్రమించి రాయలసోదరులు భూమిలోకి గునపాలు దించారు. ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి మోగింది. ఇది స్వామి పూరించింది. ఆ శబ్దం వినగానే సోదరులు ఇద్దరూ దిగ్భ్రాంతి చెంది అచేతనంగా నిలబడి పోయారు.*

*ఇంతలో స్వామి కొండదిగి వచ్చారు. ఆయన రాగానే "గురుదేవా.. ఎందుకు శంఖాన్ని రెండుసార్లు పూరించారు?" అని ప్రశ్నించారు సోదరులు. స్వామి ఆశ్చర్యంగా అదేమిటి? నేను ఇప్పుడే శంఖనాదం చేసాను. పునాది తీసారా? అని ఆత్రంగా ప్రశ్నించారు. "లేదు గురుదేవా.. కొన్ని ఘడియల క్రితం శంఖనాదం వినిపించింది. అది మీరే పూరించారు అని అప్పుడే పునాది తీసాము" చెప్పారు సోదరులు.*

*అప్పుడే మళ్ళీ శంఖం ఊదుకుంటూ జంగందేవర వెళ్ళిపోతున్నాడు. అతడిని చూడగానే స్వామి ఖిన్నుడు అయ్యారు. "అయ్యో... తొలిసారి పూరించింది నేను కాదు. ఆ జంగం దేవర...ఎంత పొరపాటు అయింది... మీరు పునాది తీసిన ఘడియ అంత బలమైనది కాదు. ఆ ముహూర్తం లో తీసిన పునాది ఎక్కువకాలం నిలబడదు. రెండు వందల సంవత్సరాలలో ఈ సామ్రాజ్యం కూలిపోతుంది. విదేశీయులకు మనవాళ్ళు బానిసలు అవుతారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకుటుంబం పతనమై పోతుంది.. అంతా విధి రాత" అన్నారు బాధగా...*

*ఆయన చెప్పినట్లే విఆయనగర సామ్రాజ్యం రెండువందల ఏళ్లకే పతనమై పోయి చివరకు ఆంగ్లేయుల స్వాధీనం లోకి వెళ్ళిపోయింది.*

*ముహూర్త నిర్ణయం లో అంత శక్తి ఉన్నది.*

*శాస్త్రం ఏ విషయాన్నైనా నిష్కర్షగా కర్కశంగా చెప్తుంది.*

🙏🌞🌞🌞🌞🌞🙏

నవగ్రహా పురాణం🪐* . *16వ అధ్యాయం*

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *16వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*పురాణ పఠనం ప్రారంభం*

*సూర్యగ్రహ జననం - 7*

కశ్యప ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది. వేదాలూ , వేదాంగాలూ , తర్క , వ్యాకరణ , ధర్మ , మీమాంస , జ్యోతిష , వైద్య శాస్త్రాలూ అచిరకాలంలో సూర్యుడి మేధస్సులో కాపురం చేయసాగాయి. విద్యా బలంతో , సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖ మండలంలో నూతన వర్చస్సు తాండవం చేయసాగింది.

సకల చరాచర ప్రాణుల పట్లా చిన్నతనం నుంచే సూర్యుడు ప్రకటించే 'సమత' అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. విద్యనూ , వినయాన్నీ పుణికి పుచ్చుకున్న సూర్యుడు బాల్యావస్థను దాటి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. చూపుల్ని సూదంటు రాయిలా లాగిపట్టే శరీరకాంతి , సౌష్టవంతో నిండిన నిలువెత్తు విగ్రహం , అందమైన ముఖంలో చెరగని చిరునవ్వు , ప్రత్యూష సౌందర్య పరాకాష్ఠలా ఉన్నాడు సూర్యుడు.

అదితి ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చుంది. సమిధలూ , పువ్వులూ సేకరించుకుని కశ్యపుడు వచ్చాడు. పువ్వుల్ని అదితి ముందున్న దర్భతో అల్లిన చాప మీద రాశిగా పోశాడు. అందమైన తామర మొగ్గలు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి.

తల్లిదండ్రుల వైపు చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెలుపలి నుంచి ఆశ్రమం వైపుకు వస్తున్నాడు. అదితి కొడుకుని రెప్పవేయకుండా చూస్తోంది.

*"స్వామీ ! నా కొడుకుని చూశారా ! యవ్వనం సూర్యుడి అందాన్ని వెయ్యింతలు చేసింది కదూ ?"* అదితి కంఠంలో మాతృ సహజమైన గర్వం లీలగా ధ్వనించింది. *"నీ పుత్రుడి సౌందర్యం దైవిక సౌందర్యం అదితీ !"*

*"నా బిడ్డడి ఆ దివ్య సౌందర్యం ఏ అదృష్టవంతురాలికి మహాభాగ్యం అవుతుందో !"* అదితి పారవశ్యంతో అంది.

*"సౌందర్యంలో సరితూగే యువతిని అన్వేషించాలి మన సూర్యుడి కోసం ,"* కశ్యపుడు సూర్యుణ్ణి చూస్తూ అన్నాడు.

సూర్యుడు ఆశ్రమం ద్వారం ముందుకు వచ్చాడు. సూర్యుడు దగ్గరకు రాగానే ప్రాణం వచ్చినట్లు తామర మొగ్గలు వికసించాయి.

*"సమిధలు ఇలా ఇవ్వండి నాన్నగారూ !"* అంటూ కశ్యపుడు మోస్తున్న సమిధలను తీసుకుని సూర్యుడు ఆశ్రమంలోనికి వెళ్లాడు. కశ్యపుడు కూర్చున్నాడు. అదితి , కశ్యపులు తలలు తిప్పి , కొడుకు వైపే చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆశ్రమం ముందు వైపు నుంచి శ్రావ్యంగా నారాయణ నామగానం వినిపించింది. ఇద్దరూ తలలు తిప్పి చూశారు. వీణను మీటుతూ , నామగానం చేస్తూ వస్తున్నాడు నారదమహర్షి.

అదితి , కశ్యపుడూ అరుగు మీంచి లేచి , మర్యాద పూర్వకంగా నారదుడికి ఎదురేగారు. చిరునవ్వుతో స్వాగతం చెప్తూ , *"దయచేయండి !"* కశ్యపుడు చేతులు జోడిస్తూ అన్నాడు. *"ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి !"* అదితి నారదుడితో అంది.

*"అలాగేమ్మా. దానికేం భాగ్యం !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"ఆకాశమార్గాన వెళ్తుంటే... మీ సుపుత్రుడు సూర్యుడు ఏదో కాంతిస్తంభంలా కనిపించాడు. వయసు పెరిగింది ; అందమూ పెరిగింది.”*

*"ఇందాకా మేమిద్దరమూ అదే అనుకున్నాం. సూర్యుడు చూడచక్కని యువకుడయ్యాడు!"* కశ్యపుడు నవ్వుతూ అన్నాడు.. *"ఔనౌను. వివాహం సంకల్పించారా ? నారదుడు అడిగాడు.ఆ

*"మాదేముంది ? ఆ దైవం సంకల్పించాలి.”* అదితి వినయంగా అంది.

*"దైవ సంకల్పం జరిగిపోయింది. ఆ... కశ్యపా ! చూడచక్కని సుందరాకారుడైన సూర్యుడికి చూడచక్కని సుందరి కావాలి కదా. చూడచక్కని సుందరాంగిని ఇటీవల చూశాను...”* నారదుడు అన్నాడు. అరుగు మీద ఆసీనుడవుతూ...

*"ఎక్కడ మహర్షీ ?"* అదితి ఆతృతగా అడిగింది. *"ఎవరా చిన్నది ?”.* 

*"దేవశిల్పి విశ్వకర్మ ఉన్నాడు కదా ! ఆయన ఎవరనుకున్నారు ?"* నారదుడు అడిగాడు.

*"ప్రభాసవసు పుత్రుడు కదా?"* కశ్యపుడు అన్నాడు.

*"ఔను ! అష్టవసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడికీ , ఆయన పత్ని 'వరస్త్రీ'కి జన్మించినవాడు మన విశ్వకర్మ. ఆయన సేవలు అందుకొనని దేవతలు లేరు. ఆ దంపతుల జ్యేష్ఠ పుత్రిక సంజ్ఞ... సౌందర్యరాశి. మన సూర్యుడి కోసమే జన్మించిందని అనిపించింది నాకు ఆ కన్యను చూడగానే ,"* నారదుడు వివరించాడు.

*"అలాగా ! అయితే విశ్వకర్మ దంపతులను సంప్రదించి , వాళ్ళ అభిప్రాయం...."* అదితి కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకుపోతోంది. 

*"తెలుసుకునే వచ్చాను!"* ఆమె మాటకు తన మాటతో అడ్డువేశాడు నారదుడు. *"మన సూర్యుడి గురించి విశ్వకర్మ ఆనోటా , ఈనోటా మాత్రమే కాకుండా చతుర్ముఖుల నాలుగు నోళ్ళ ద్వారా విని ఉన్నాడు. ఆ దంపతులకు లేశమంత అభ్యంతరమూ లేదు..."*

*"అయితే ఆ కన్యామణి అభిప్రాయం ?"* కళ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞాకుమారి అభిప్రాయం కూడా పసిగట్టే వచ్చాను. ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనూ , విడిగానూ సూర్యుడి అందచందాలనూ , ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్టు చక్కగా వర్ణించాను. సంజ్ఞ తన ఇష్టాన్ని పెదవులతో చెప్పలేదు గానీ , కళ్ళతో స్పష్టం చేసింది"* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అలాగా ! అన్నీ ఆకళింపు చేసుకునే వచ్చారన్నమాట!"* అదితి నవ్వుతూ అంది.

*"నారదుల వారి తీరే అంత అదితీ , మన కళ్యాణం విషయంలోనూ ఇలాగే చొరవగా ప్రవర్తించారు కదా !"* కశ్యపుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు. 

*"ఇంతెందుకు కశ్యప ప్రజాపతీ ! నాతో చెప్పకపోయినప్పటికీ సంజ్ఞ అభిప్రాయం. వినే వచ్చాను. ఆ చిన్నది ఉద్యానవనంలో తన తల్లితో సూర్యుడి గురించి ఉత్సాహంగా చెప్తుంటే ఆ మాటను చాటుగా విన్నాను."* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అయితే , ఇంకేం ? ఆ కన్యామణి అందచందాల గురించీ , గుణగణాల గురించీ సూర్యుడికి మీరే వివరించి చెప్పండి. తదనంతరం విశ్వకర్మ దంపతులతో సంప్రదించి , కళ్యాణం జరిపించుదాం !"* కశ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞ గురించి మన సూర్యుడికి ఎరుక పరచడానికే ప్రత్యేకంగా వచ్చాననుకోండి ! ఆ కార్యం సానుకూలం చేసి , విశ్వకర్మతో మాట్లాడుతాను. ఆయనే మీ దర్శనానికి వస్తాడు."* అన్నాడు నారదుడు.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-35🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-35🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*విష్ణుమూర్తి విగ్రహంగా నిరూపణ:*

వేంకటేశ్వరస్వామి విగ్రహం విష్ణువా, కుమారస్వామియా, శివుడా, శక్తియా, కాలభైరవుడా, బ్రహ్మా అన్న విషయంపై జరిగిన నిర్ణయచర్చలో రామానుజులు ఇతర దైవాలన్న వాదనలు ఖండిస్తూ, విష్ణువేనన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని అంశాలివి. అనంతాచార్యులు రచించిన వేంకటాచల ఇతిహాసమాలలో క్రీ.శ.పదకొండవ శతాబ్దినాడు జరిగిన ఈ వాదన విస్తారంగా వివరించారు.

వామనపురాణంలోని 33వ అధ్యాయంలో అగస్త్యుడు, ఇతర మునులు, వసువుతో స్వామి పుష్కరిణికి, వేంకటాచలానికి వెళ్తూ-అది నారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రమని ప్రస్తావిస్తారు. వరాహపురాణంలో సూతుని వాక్యాలు, భూ వరాహస్వాముల సంవాదం, పద్మపురాణంలోని శుకుని వాక్యాలు, గరుడపురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ, బ్రహ్మాండపురాణంలో భృగుమహర్షికి నారదుని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వేంకటాచలాన్ని అభివర్ణించారు.

హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వేంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ 'స్వామి పుష్కరిణీ తీరములో సూర్యమండలమువంటి విమానంలో శ్రీనివాసుడు వేంచేసి వున్నారని వర్ణించారు. వరాహపురాణంలో భూదేవి, వరాహమూర్తిల సంభాషణలో వేంకటాచలంపై పుష్కరిణీతీరంపై ఆనందము అనే పేరుగల పుణ్యవిమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్తారు. పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించడాన్ని గురించి పద్మపురాణం, మార్కండేయ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులవర్ణనలు ఉన్నాయి

స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందున ధృవబేరం ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకుని, ఆయన గురించి తపస్సు చేయడానికో, పాపప్రక్షాళనల కొరకో వచ్చినవారేనని పురాణాలే చెప్తున్నాయని వివరించారు.

వామన పురాణంలో తారకాసురుని వధ వల్ల వచ్చిన పాపప్రక్షాళన ఎలా చేసుకోవాలని ప్రశ్నించిన స్కందునితో వేంకటాచల మహాత్మ్యం అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలు వివరించి పరమశివుడే వేంకటాచలం పంపినట్టు నారదుడు వాల్మీకితో చెప్పారు. వైష్ణవ మంత్రాల్లోకెల్లా ఉత్తమమైన వైష్ణవమంత్రం ఉపదేశించమని శంభుణ్ణి కోరి ఉపదేశం పొందిన స్కందుడు వేంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తోంది.

పురాణాల పరంగా ఆదిశేషుడు, వాయుదేవుడూ ఈ పర్వతంపై తపమాచరించారని అంతమాత్రాన ఇది వాయుక్షేత్రమో, శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు. స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం వెనుక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమమని భగవంతుడు వరం ఇవ్వడమే కారణమని స్పష్టం చేశారు. తపస్సు ఆచరించడానికి వచ్చిన కుమారస్వామి కనుక ఆయుధాలు లేవని శైవుల సమర్థనను వామన పురాణంలో వేంకటాచలం వెళ్ళినపుడు కుమారస్వామి ధనుస్సు, శక్తి ధరించే వెళ్ళినట్టు ఉండడాన్ని గుర్తుచేసి ఖండించారు. 

ధృవబేరానికి రెండు చేతులు కటిహస్తం, వరదహస్తం కాగా మరో రెండు చేతులూ పైకి ఎత్తి ఆయుధాలు పట్టుకోవడానికి ఎత్తినట్టు ఉంటాయి. శరవణుడే ఐతే ధనుస్సు ఆయుధంగా కల ఆయన అది వదిలారనుకున్నా అలా చెయ్యి ఎత్తిపట్టుకోరు కదా. 3

శంఖ చక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో చోళరాజుకు ఐదు ఆయుధాలు ఇవ్వడం, రాక్షస సంహారం కోసం తొండమాను చక్రవర్తికి తన శంఖచక్రాలు ఇచ్చినట్టున్న సందర్భాలు వివరించారు.

శ్రీనివాసుడు తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకొమ్మంటే తనకు సహాయంగా శ్రీహరి శంఖచక్రాలు ఇచ్చినట్టు తరతరాలుగా తెలిసేట్టు ఆ ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు. దాన్ని మన్నించి ఆ ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించి సమర్థించారు.

తొండమానుడితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంఖచక్రాలు ధరిస్తానని తెలిపారట.

వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరం స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంఖచక్రాలు, సుబ్రహ్మణ్య ఆయుధాలైన శక్తి, శివపార్వతుల త్రిశూలం బంగారంతో చేయించి ముందుంచారు. నీవు ఏ దైవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లూ ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరచి చూశారు. ఖాళీ చేతుల స్థానంలో శంఖ చక్రాలు చేరాయని అదే స్థితిలో నేటికీ ధృవబేరం ఉందని వేంకటాచల ఇతిహాసమాల తెలిపింది.

వక్షఃస్థలంపై లక్ష్మీశ్రీవత్సం ఉండడం కూడా వేంకటేశుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్టుగా తెలిపారు.

మహేంద్ర వినుత గోవిందా, మహాను భావా గోవిందా, మహలక్ష్మి నాధ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||35||

*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹సౌందర్యలహరి🌹* *శ్లోకం - 13*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 13*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం*

*తవాపాంగాలోకే పతిత మనుధావన్తి శతశః |*

*గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః*

*హఠత్తృట్యత్ కాంచో విగళిత దుకూలా యువతయః ||*

అమ్మా నీ కరుణా కటాక్ష వీక్షణాలు పడితే ఎంత పనికిమాలినవాడైనా సమర్ధుడుగా మారతాడని ఈ శ్లోకం అర్థం. ఇక్కడ శంకరులు స్థిరః, స్థాణుః అని నామాలున్న జడుడైన(ఆత్మారాముడైన) శివుని పై ఆరోపించి చమత్కారంగా చెప్పారు ఈ అద్భుతమైన శ్లోకం.

నరం వర్షీయాంసం = వయస్సుచేత వృద్ధుడు (అనాదియైనవాడు)

నయనవిరసం = కంటి చూపుకు కూడా బాగాలేనివాడు (విరూపాక్షుడు కదా!)

నర్మసు జడం = సరసానికి, రసజ్ఞతకు జడుడు.ఇలాంటి వాడిని అమ్మవారు,

మనుధావంతి శతశః = తన కరుణాపూరితమైన చూపులు ప్రసరింపచేయగానే,ఆయన ఎంత ఆకర్షణీయంగా అవుతాడంటే,దేవతా స్త్రీలు ఆయనను చూసి,

గలద్వేణీబంధాః = జుట్టు ముడులు విడిపోతూ ఉండగా

యోగపరంగా రుద్రగ్రంథి విభేదిని, భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రము నుండి సహస్రారపద్మమునకు చేర్చునది.కేశపాశములు ఉండే స్థానము.

కుచకలశ విస్రస్త సిచయాః = వక్షములపై కల వస్త్రములు ముడులు తొలగిపోయి

విష్ణుగ్రంధి విభేదిని, హృదయస్థానములో కల అనాహతము నుండి విశుద్ధిచక్రమునకు చేర్చునది.

హఠాత్తృట్యత్ కాంచో = నడుముకు చుట్టిన  వస్త్రము ముడి ఊడిపోయి

బ్రహ్మగ్రంధి విభేదిని, మూలాధారము నుండి నాభి వెనక కల మణిపూరమునకు చేర్చునది.ఈ గ్రంధులు విడిపోగానే సాధకుడు జీవన్ముక్తుడవుతాడు.

విగళిత దుకూలా = వస్త్రములు ఊడిపోయి 

కృష్ణుని వేణుగానం విన్న గోపికలవలె తనువులు మరచి ఆకర్షితులవుతున్నారు అని భావం.

అమ్మవారి చూపు పడగానే ప్రపంచంలోని శక్తులన్నీ ఆమెకి దాసానుదాసులవుతారని గ్రహించాలి.

            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 29*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 29*

ఎవరో చెప్పారు కనుక, ఏదో ఫలానా గ్రంథంలో వ్రాశారు కాబట్టి దేనినీ యథాతథంగా స్వీకరించే వ్యక్తి కాదు నరేంద్రుడు. సత్యాన్ని ప్రత్యక్షంగా ఆవిష్కరించుకొన్న వ్యక్తిని దర్శించాలని  పలువురిని కలుసుకొని విచారణ చేశాడు. కాని ఎవరి నుండి 'అవును' అనే స్పష్టమయిన జవాబు లభించలేదు. ఈ తరుణంలో ఒక రోజు అతడి బంధువూ, శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరూ అయిన రామచంద్ర దత్తా అతడితో, 

"ఇలా చూడు నరేంద్రా! నిజమైన మహాత్మునికై నువ్వు ఇక్కడా అక్కడా గాలిస్తున్నావు. దక్షిణేశ్వరంలో ఒక పరమహంస నివసిస్తున్నారు. ఒక రోజు నాతోబాటు వచ్చి ఆయనను చూడు" అని చెప్పాడు. అందుకు నరేంద్రుడు "నాకు తెలుసు. ఆయనను గురించి వాకబు చేశాను. కాని ఆయన విద్యాగంధం లేని వారు! స్పెన్సర్, హేమిల్టన్, లాక్కే లాంటి పలువురిని అధ్యయనం చేసిన నాకు, విద్యాహీనులైన ఆయన ఎలా మార్గదర్శికాగలరు?" అని ఎదురు ప్రశ్న వేశాడు. రామచంద్రదత్తా మౌనం వహించాడు.దేనికైనా సమయమూ, సందర్భమూ రావాలి కదా! అలాంటి తరుణం సత్వరమే ఆసన్నమయింది.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పో త న కవి తా వై భ వం!!

పో త న కవి తా వై భ వం!!

*రచన:-శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు:--*

ఎండిన మ్రోడులే కిసలయించెనొ! యేకశిలాపురమ్ములో

బండలు పుల్కరించెనొ ! అపార ముదమ్మున తెల్గుతల్లికిన్‌

గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనొ ! 

పచ్చి పైరులే

పండెనొ ! 

జాలువారిన భవత్‌ కవితామృత భక్తిచారలన్‌ !

 భీష్మునిపైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి

కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు

ముడివీడి మూపు పై పడిన జుట్టు

సమరమ్ము గావించు సత్య కన్నుల నుండి

వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు

కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ సందు మాగాయ పచ్చడి పసందు

ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి

 రయ్య ! యే రాత్రి కలగంటివయ్య ! రంగు

కుంచెతో దిద్ది తీర్చి  చిత్రించినావు !!

సహజ పాండితి కిది నిదర్శనమటయ్య !!

ముద్దులుగార- భాగవతమున్‌ రచియించుచు, పంచదారలో

నద్దితివేమొ గంటము 

మహా కవి శేఖర ! మధ్య మధ్య నట్లద్దక వట్టి గంటమున నట్టిట్టు గీచిన, తాటియాకులో

పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!

*సేకరణ: శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి వాట్సాప్ పోస్ట్.* 

🙏🙏🙏🌷🌷👏👏👏👏

నవగ్రహా పురాణం🪐* . *16వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *16వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*పురాణ పఠనం ప్రారంభం*

*సూర్యగ్రహ జననం - 7*

కశ్యప ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది. వేదాలూ , వేదాంగాలూ , తర్క , వ్యాకరణ , ధర్మ , మీమాంస , జ్యోతిష , వైద్య శాస్త్రాలూ అచిరకాలంలో సూర్యుడి మేధస్సులో కాపురం చేయసాగాయి. విద్యా బలంతో , సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖ మండలంలో నూతన వర్చస్సు తాండవం చేయసాగింది.

సకల చరాచర ప్రాణుల పట్లా చిన్నతనం నుంచే సూర్యుడు ప్రకటించే 'సమత' అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. విద్యనూ , వినయాన్నీ పుణికి పుచ్చుకున్న సూర్యుడు బాల్యావస్థను దాటి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. చూపుల్ని సూదంటు రాయిలా లాగిపట్టే శరీరకాంతి , సౌష్టవంతో నిండిన నిలువెత్తు విగ్రహం , అందమైన ముఖంలో చెరగని చిరునవ్వు , ప్రత్యూష సౌందర్య పరాకాష్ఠలా ఉన్నాడు సూర్యుడు.

అదితి ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చుంది. సమిధలూ , పువ్వులూ సేకరించుకుని కశ్యపుడు వచ్చాడు. పువ్వుల్ని అదితి ముందున్న దర్భతో అల్లిన చాప మీద రాశిగా పోశాడు. అందమైన తామర మొగ్గలు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి.

తల్లిదండ్రుల వైపు చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెలుపలి నుంచి ఆశ్రమం వైపుకు వస్తున్నాడు. అదితి కొడుకుని రెప్పవేయకుండా చూస్తోంది.

*"స్వామీ ! నా కొడుకుని చూశారా ! యవ్వనం సూర్యుడి అందాన్ని వెయ్యింతలు చేసింది కదూ ?"* అదితి కంఠంలో మాతృ సహజమైన గర్వం లీలగా ధ్వనించింది. *"నీ పుత్రుడి సౌందర్యం దైవిక సౌందర్యం అదితీ !"*

*"నా బిడ్డడి ఆ దివ్య సౌందర్యం ఏ అదృష్టవంతురాలికి మహాభాగ్యం అవుతుందో !"* అదితి పారవశ్యంతో అంది.

*"సౌందర్యంలో సరితూగే యువతిని అన్వేషించాలి మన సూర్యుడి కోసం ,"* కశ్యపుడు సూర్యుణ్ణి చూస్తూ అన్నాడు.

సూర్యుడు ఆశ్రమం ద్వారం ముందుకు వచ్చాడు. సూర్యుడు దగ్గరకు రాగానే ప్రాణం వచ్చినట్లు తామర మొగ్గలు వికసించాయి.

*"సమిధలు ఇలా ఇవ్వండి నాన్నగారూ !"* అంటూ కశ్యపుడు మోస్తున్న సమిధలను తీసుకుని సూర్యుడు ఆశ్రమంలోనికి వెళ్లాడు. కశ్యపుడు కూర్చున్నాడు. అదితి , కశ్యపులు తలలు తిప్పి , కొడుకు వైపే చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆశ్రమం ముందు వైపు నుంచి శ్రావ్యంగా నారాయణ నామగానం వినిపించింది. ఇద్దరూ తలలు తిప్పి చూశారు. వీణను మీటుతూ , నామగానం చేస్తూ వస్తున్నాడు నారదమహర్షి.

అదితి , కశ్యపుడూ అరుగు మీంచి లేచి , మర్యాద పూర్వకంగా నారదుడికి ఎదురేగారు. చిరునవ్వుతో స్వాగతం చెప్తూ , *"దయచేయండి !"* కశ్యపుడు చేతులు జోడిస్తూ అన్నాడు. *"ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి !"* అదితి నారదుడితో అంది.

*"అలాగేమ్మా. దానికేం భాగ్యం !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"ఆకాశమార్గాన వెళ్తుంటే... మీ సుపుత్రుడు సూర్యుడు ఏదో కాంతిస్తంభంలా కనిపించాడు. వయసు పెరిగింది ; అందమూ పెరిగింది.”*

*"ఇందాకా మేమిద్దరమూ అదే అనుకున్నాం. సూర్యుడు చూడచక్కని యువకుడయ్యాడు!"* కశ్యపుడు నవ్వుతూ అన్నాడు.. *"ఔనౌను. వివాహం సంకల్పించారా ? నారదుడు అడిగాడు.ఆ

*"మాదేముంది ? ఆ దైవం సంకల్పించాలి.”* అదితి వినయంగా అంది.

*"దైవ సంకల్పం జరిగిపోయింది. ఆ... కశ్యపా ! చూడచక్కని సుందరాకారుడైన సూర్యుడికి చూడచక్కని సుందరి కావాలి కదా. చూడచక్కని సుందరాంగిని ఇటీవల చూశాను...”* నారదుడు అన్నాడు. అరుగు మీద ఆసీనుడవుతూ...

*"ఎక్కడ మహర్షీ ?"* అదితి ఆతృతగా అడిగింది. *"ఎవరా చిన్నది ?”.* 

*"దేవశిల్పి విశ్వకర్మ ఉన్నాడు కదా ! ఆయన ఎవరనుకున్నారు ?"* నారదుడు అడిగాడు.

*"ప్రభాసవసు పుత్రుడు కదా?"* కశ్యపుడు అన్నాడు.

*"ఔను ! అష్టవసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడికీ , ఆయన పత్ని 'వరస్త్రీ'కి జన్మించినవాడు మన విశ్వకర్మ. ఆయన సేవలు అందుకొనని దేవతలు లేరు. ఆ దంపతుల జ్యేష్ఠ పుత్రిక సంజ్ఞ... సౌందర్యరాశి. మన సూర్యుడి కోసమే జన్మించిందని అనిపించింది నాకు ఆ కన్యను చూడగానే ,"* నారదుడు వివరించాడు.

*"అలాగా ! అయితే విశ్వకర్మ దంపతులను సంప్రదించి , వాళ్ళ అభిప్రాయం...."* అదితి కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకుపోతోంది. 

*"తెలుసుకునే వచ్చాను!"* ఆమె మాటకు తన మాటతో అడ్డువేశాడు నారదుడు. *"మన సూర్యుడి గురించి విశ్వకర్మ ఆనోటా , ఈనోటా మాత్రమే కాకుండా చతుర్ముఖుల నాలుగు నోళ్ళ ద్వారా విని ఉన్నాడు. ఆ దంపతులకు లేశమంత అభ్యంతరమూ లేదు..."*

*"అయితే ఆ కన్యామణి అభిప్రాయం ?"* కళ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞాకుమారి అభిప్రాయం కూడా పసిగట్టే వచ్చాను. ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనూ , విడిగానూ సూర్యుడి అందచందాలనూ , ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్టు చక్కగా వర్ణించాను. సంజ్ఞ తన ఇష్టాన్ని పెదవులతో చెప్పలేదు గానీ , కళ్ళతో స్పష్టం చేసింది"* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అలాగా ! అన్నీ ఆకళింపు చేసుకునే వచ్చారన్నమాట!"* అదితి నవ్వుతూ అంది.

*"నారదుల వారి తీరే అంత అదితీ , మన కళ్యాణం విషయంలోనూ ఇలాగే చొరవగా ప్రవర్తించారు కదా !"* కశ్యపుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు. 

*"ఇంతెందుకు కశ్యప ప్రజాపతీ ! నాతో చెప్పకపోయినప్పటికీ సంజ్ఞ అభిప్రాయం. వినే వచ్చాను. ఆ చిన్నది ఉద్యానవనంలో తన తల్లితో సూర్యుడి గురించి ఉత్సాహంగా చెప్తుంటే ఆ మాటను చాటుగా విన్నాను."* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అయితే , ఇంకేం ? ఆ కన్యామణి అందచందాల గురించీ , గుణగణాల గురించీ సూర్యుడికి మీరే వివరించి చెప్పండి. తదనంతరం విశ్వకర్మ దంపతులతో సంప్రదించి , కళ్యాణం జరిపించుదాం !"* కశ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞ గురించి మన సూర్యుడికి ఎరుక పరచడానికే ప్రత్యేకంగా వచ్చాననుకోండి ! ఆ కార్యం సానుకూలం చేసి , విశ్వకర్మతో మాట్లాడుతాను. ఆయనే మీ దర్శనానికి వస్తాడు."* అన్నాడు నారదుడు.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 29*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 29*

ఎవరో చెప్పారు కనుక, ఏదో ఫలానా గ్రంథంలో వ్రాశారు కాబట్టి దేనినీ యథాతథంగా స్వీకరించే వ్యక్తి కాదు నరేంద్రుడు. సత్యాన్ని ప్రత్యక్షంగా ఆవిష్కరించుకొన్న వ్యక్తిని దర్శించాలని  పలువురిని కలుసుకొని విచారణ చేశాడు. కాని ఎవరి నుండి 'అవును' అనే స్పష్టమయిన జవాబు లభించలేదు. ఈ తరుణంలో ఒక రోజు అతడి బంధువూ, శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరూ అయిన రామచంద్ర దత్తా అతడితో, 

"ఇలా చూడు నరేంద్రా! నిజమైన మహాత్మునికై నువ్వు ఇక్కడా అక్కడా గాలిస్తున్నావు. దక్షిణేశ్వరంలో ఒక పరమహంస నివసిస్తున్నారు. ఒక రోజు నాతోబాటు వచ్చి ఆయనను చూడు" అని చెప్పాడు. అందుకు నరేంద్రుడు "నాకు తెలుసు. ఆయనను గురించి వాకబు చేశాను. కాని ఆయన విద్యాగంధం లేని వారు! స్పెన్సర్, హేమిల్టన్, లాక్కే లాంటి పలువురిని అధ్యయనం చేసిన నాకు, విద్యాహీనులైన ఆయన ఎలా మార్గదర్శికాగలరు?" అని ఎదురు ప్రశ్న వేశాడు. రామచంద్రదత్తా మౌనం వహించాడు.దేనికైనా సమయమూ, సందర్భమూ రావాలి కదా! అలాంటి తరుణం సత్వరమే ఆసన్నమయింది.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సద్గుణాల వల్ల

 శ్లోకం:☝️

*గుణైరుత్తమతాం యాన్తి*

  *నోచ్చైరాసనసంస్థితైః ।*

*ప్రసాదశిఖరస్థోఽపి*

  *కిం కాకో గరుడాయతే ॥*

భావం: మనిషి కేవలం సద్గుణాల వల్ల గొప్పవాడవుతాడు తప్ప ఉన్నత స్థానంలో కూర్చోవడం వల్ల కాదు. రాజభవనం శిఖరం పైన కూర్చున్నా కాకి గ్రద్దగా మారదు కదా!

పంచాంగం 04.09.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 04.09.2023 Monday,

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: పంచమి తిధి ఇందు వాసర: అశ్విని నక్షత్రం ధ్రువ యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం. 

పంచమి సాయంత్రం 04:48 వరకు.

అశ్విని పగలు 09:29 వరకు.

సూర్యోదయం : 06:06

సూర్యాస్తమయం : 06:24

వర్జ్యం : ఉదయం 05:41 నుండి 07:12 వరకు తిరిగి సాయంత్రం 06:54 నుండి రాత్రి 08:28 వరకు.

దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:40 నుండి 01:29 వరకు తిరిగి మధ్యాహ్నం 03:07 నుండి 03:56 వరకు.

రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00  వరకు.

యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.  

శుభోదయ:, నమస్కార: