4, అక్టోబర్ 2023, బుధవారం

Power from sea


 

DC Fan


 

సాంఖ్య యోగః 🌸* *2-అధ్యాయం,49వ శ్లోకం*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,49వ శ్లోకం*


 *దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ |* 

 *బుద్దౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః || 49* 


 *ప్రతిపదార్థం* 


బుద్ధి యోగాత్ = (సమత్వ ) బుద్ధి యోగము కంటెను; కర్మ = సకామకర్మ ; దూరేణ అవరమ్ (అతః )= మిక్కిలి నిన్న శ్రేణికి చెందినదని కావున ; ధనంజయ = ఓ ధనంజయా! ; బుద్దౌ= సమత్వ బుద్ధి యందే; శరణమ్ = తరుణోపాయమును; అన్విచ్ఛ = వెదకుము  ( సమత్వ బుద్ధియోగమును ఆశ్రయింపుము ) ;హి = ఏలనన ; ఫల హేతవః = ఫలములను ఆసించువారు (ఫలాసక్తి తో కర్మలను ఆచరించు వారు )i కృషణాః = అత్యంత దీనులు;


 *తాత్పర్యము* 


ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను సకామ కర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయా! నీవు సమత్వ బుద్ధియోగమునే ఆశ్రయింపుము - ఏలననా ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

శరీరానికి 24 రకాల ఖనిజ లవణాలు అవసరం

 మానవ శరీరానికి 24 రకాల ఖనిజ లవణాలు అవసరం అవుతాయి . మన శరీరములో ఖనిజ లవణాలు లోపించినప్పుడు శరీరం మొత్తానికి 60 గ్రాముల ఖనిజ లవణాలు మాత్రమే అవసరం . కాని దీనిలో ఏవి లోపించినా సమస్యలు వస్తాయి . క్యాల్షియం లోపించినప్పుడు కండరాలు పట్టేస్తాయి . ఎముకలు పెళుసుబారి పోతాయి . మెగ్నీషియం లోపం వలన వెంట్రుకలు రాలిపోతాయి . 


 ఖనిజ లవణాలు దొరికే ఆహారాలు - 


 * కలబందలో 18 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  తేనెలో 10 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  దేశివాళీ ఆవు పంచకములో 24 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  పైనాపిల్ లో ఖనిజ లవణాలు ఉంటాయి. 


 *  ముల్లంగిలో ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  కొబ్బరిలో ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  ఖర్జూరములో ఖనిజ లవణాలు ఉంటాయి . 


 *  గోధుమ గడ్డి చూర్ణములో గాని , రసములో పుష్కలముగా ఉంటాయి . 


 *  దంపుడు బియ్యములో ఖనిజ లవణాలు ఉంటాయి . 


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

భూమి సంబందిత వివరాలు

 భూమి కొలతలు..

1) ఒక ఎకరాకు =  40 గుంటలు 

2) ఒక ఎకరాకు =  4840 Syd

3) ఒక ఎకరాకు =  43,560 Sft

4) ఒక గుంటకు =  121  Syd

5) ఒక గుంటకు =  1089 Sft

6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09

    చదరపు ఫీట్లు 

7) 121 x 09  =  1089  Sft

8) 4840 Syd x 09 = 43,560 Sft

9) ఒక  సెంట్ కు   =  48.4  Syd 

10) ఒక సెంట్ కు  =  435.6  Sft


Land servay కోసం అత్యవసరమైన information...

 Common Terminology  in Revenue Department


గ్రామ కంఠం :

గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.


అసైన్డ్‌భూమి :

 భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.


ఆయకట్టు :

 ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.


బంజరు భూమి (బంచరామి) :

 గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.


అగ్రహారం :

 పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.


దేవళ్‌ ఇనాం :

 దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.


అడంగల్‌ (పహాణీ) :

 గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.


తరి : సాగు భూమి


ఖుష్కీ : మెట్ట ప్రాంతం


గెట్టు : పొలం హద్దు


కౌల్దార్‌ : భూమిని కౌలుకు తీసకునేవాడు


కమతం : భూమి విస్తీర్ణం


ఇలాకా : ప్రాంతం


ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి


బాలోతా ఇనాం :

 భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి


సర్ఫేఖాస్‌ : నిజాం నవాబు సొంత భూమి


సీలింగ్‌ : భూ గరిష్ఠ పరిమితి


సర్వే నంబర్‌ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది


నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం


కబ్జాదార్‌ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి


ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) :

 భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.


ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ :

 దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.


బందోబస్తు :

 వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.


బీ మెమో :

 ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.


పోరంబోకు :

 భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.


ఫైసల్‌ పట్టీ :

 బదిలీ రిజిస్టర్‌


చౌఫస్లా :

 ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.


డైగ్లాట్‌ :

 తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.


విరాసత్‌/ఫౌతి :

 భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.


కాస్తు :

 సాగు చేయడం


మింజుములే :

 మొత్తం భూమి.


మార్ట్‌గేజ్‌ :

 రుణం కోసం భూమిని కుదవపెట్టడం.


మోకా :

 క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).


పట్టాదారు పాస్‌ పుస్తకం :

 రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.


టైటిల్‌ డీడ్‌ :

 భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.


ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :

 భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.


ఆర్‌ఎస్సార్‌ :

 రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.


పర్మినెంట్‌ రిజిస్టర్‌ :

 సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.


సేత్వార్‌ :

 రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.


సాదాబైనామా :

 భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.


దస్తావేజు :

 భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.


ఎకరం :

 భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.


అబి :

 వానకాలం పంట


ఆబాది :

 గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు


అసైన్‌మెంట్‌ :

 ప్రత్యేకంగాకేటాయంచిన భూమి


శిఖం :

 చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం


బేవార్స్‌ :

 హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.


దో ఫసల్‌ :

 రెండు పంటలు పండే భూమి


ఫసలీ :

 జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.


నాలా :

 వ్యవసాయేతర భూమి


ఇస్తిఫా భూమి :

 పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి


ఇనాం దస్తర్‌దాన్‌ :

 పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి


ఖాస్రాపహానీ :

 ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.


గైరాన్‌ :

 సామాజిక పోరంబోకు


యేక్‌రార్‌నామా :

 ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం..

సంతోషిస్తారు

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


// *శ్లోకం* //


*స్వే స్వే కిల కులే జాతే పుత్రే నప్తరి వా పునః౹*

*పితర: పితృలోకస్థా: శోచంతి చ హసంతి చ౹౹* 

*కిం తస్య దుష్కృతే౽స్మాభిః సంప్రాప్తవ్యం భవిష్యతి౹*

*కించాస్య సుకృతే౽స్మాభిః ప్రాప్తవ్యమితి శోభనమ్౹౹*


 *తాత్పర్యం:-*


*పితృలోకమందున్న పితృదేవతలు తమతమ వంశమున కుమారులు, మనుమల పుట్టుకకు వారి చెడుపనివల్ల మనమేం పొందాల్సి ఉంటుందో? అని దుఃఖిస్తారు*.... 

*అలాగే వారి మంచిపనుల వల్ల మనకేం మంచి లభిస్తుందో అని సంతోషిస్తారు....*


🧘‍♂️🙏🪷 ✍️🙏

బుధవారం, అక్టోబరు 4, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


బుధవారం, అక్టోబరు 4, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:పంచమి ఉ8.56 వరకు  

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:రోహిణి రా10.41 వరకు

యోగం:సిద్ధి ఉ11.39 వరకు

కరణం:తైతుల ఉ8.56 వరకు తదుపరి గరజి రా8.52 వరకు

వర్జ్యం:మ2.35 -4.12 & తె4.28నుండి

దుర్ముహూర్తము:ఉ11.26 - 12.13

అమృతకాలం:రా7.26 - 9.04

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి కన్య

చంద్రరాశి వృషభం 

సూర్యోదయం:5.54

సూర్యాస్తమయం: 5.46


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

గొప్ప వారు.

 *1941*

*కం*

చెడులను గని చెడుచెడనుచు

పడిపడి ప్రచురించకుండ పనిగట్టుకు నా

చెడులను శుభ్రము చేసెడి

వడిగలవారలె ప్రముఖులు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! చెడులను చూసి అది చెడు అని పదేపదే చెప్పకుండా విధిగా ఆ చెడులను శుభ్రం చేసే వేగం ఉన్న వారే గొప్ప వారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*, 

కొత్త ఆవిష్కరణ



 తల్లి ఆవు పేడ నుండి కొత్త ఆవిష్కరణ.పూర్తిగా చదవాలి.   మిస్టర్ ఉమేష్ జీ   సోఫాలో కాళ్లు పైకి లేపి కూర్చోవడం నాకు అలవాటు కాబట్టి 10 నిమిషాలకు మించి కాళ్లు కిందికి దించలేకపోతున్నాను.   నేను రోజుకు 10-15 సార్లు 10-10 నిమిషాలు ఈ ఆవు పేడ పిడకలపై నా పాదాలతో కూర్చుంటాను.    నేను సాయంత్రం 6 గంటలకు యాదృచ్ఛికంగా నా చక్కెరను తనిఖీ చేస్తున్నాను, ఇది సంవత్సరాలుగా 250 లేదా 300 వద్ద కొనసాగుతోంది.   కానీ దాదాపు 15 రోజులుగా నేను ప్రతిరోజూ పిడ్డకలపై కాళ్లతో కూర్చున్నాను.  అలా నిన్న సాయంత్రం 6 గంటలకు షుగర్ 129కి వచ్చింది.  నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను గత 15 రోజులుగా షుగర్ మాత్రలు తీసుకోవడం లేదు.   షుగర్ కంట్రోల్ లోకి వచ్చింది వెంటనే బెల్లం తిన్నాను.   ఇప్పుడు పిడకలపై అడుగు పెట్టడం ద్వారా మాత్రమే చక్కెర నియంత్రణ సాధించబడుతుంది.   గత రెండు రోజుల నుంచి ముక్కులో నుంచి నీరు ఎక్కువగా వస్తోంది అంటే గడ్డకట్టిన చలి బయటకు వస్తోంది.   ఇది కూడా పిడకల ఫలితమేనని నేను నమ్ముతున్నాను.   షుగర్‌ని నియంత్రించడం వల్ల కాలేయం, మూత్రపిండాలు మరియు గుండెపై వచ్చే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి.   ధన్యవాదాలు🙏🏻 ఏ మాత్రం నడవలేని వ్యక్తి , ప్రతి రోజు గోమయ పిడకలపైన కాళ్ళు పెట్టుకుని వున్నారు . Sugar levels తగ్గిపోయింది . ఇతనిలోని Negative energy పోయింది , చాలా అనారోగ్య సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి .. జై గోమాత ... జై జై విశ్వమాత . 🙏

రామాయణ కల్పవృక్షం లో

ఆమెనఖాంతకాంతులవియాడెను తారకలట్లు నామె దృ సీతాంబుదముల్ పరిణామమందు భూ


స్త్రీ మృదుకజ్జలంబులు చరించెడు


నాకసమట్లు నామె చే


లామృత కాంతిసంతతి


మీ మహిళా సుతాతనువె


మిన్నఖిలంబుగ కానిపింపగన్


ఆమె యొక్క నఖ(గోళ్ళ)కాంతులు నక్షత్రాలవలె మెరిసినాయి. ఆమె యొక్క మృదువైన కంటి చూపులు అనే సంపదల యొక్క కాటుకలు ఆకాశమువలె చరిస్తున్నాయి. ఆమె యొక్క చీరచెంగు యొక్క కాంతులు అనే గంగాజలములుగా మారిపోతున్నాయి. ఆవిధంగా భూమిసుత అయిన సీతాదేవి గొప్పగా కనిపిస్తోంది. 


*అని ఈ పద్యము యొక్క భావము*

 రామాయణ కల్పవృక్షం లో విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన ఈ పద్యం పూర్తిగా అర్థం కాలేదు పెద్దలెవరైనా వివరింపగలరు 🙏