17, నవంబర్ 2023, శుక్రవారం

ఈరోజు (17-11-2023) రాశి ఫలితాలు

 *ఈరోజు (17-11-2023) రాశి ఫలితాలు*


మేషం🐐

ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. 

అదృష్ట సంఖ్య 1


వృషభం🐂

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. 

అదృష్ట సంఖ్య 9


మిథునం👫

దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

అదృష్ట సంఖ్య 7


కర్కాటకం🦀

రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. 

అదృష్ట సంఖ్య 2


సింహం🦁

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. 

అదృష్ట సంఖ్య 9


కన్య👩

వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి.

అదృష్ట సంఖ్య 7


తుల⚖️

నూతన వ్యాపారాలు ప్రారంభించక పోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

అదృష్ట సంఖ్య 1


వృశ్చికము🦂

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. 

అదృష్ట సంఖ్య 3


ధనస్సు🏹

కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. 

అదృష్ట సంఖ్య 9


మకరం🐊

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరో బాధను కలిగిస్తాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

అదృష్ట సంఖ్య 8


కుంభం⚱️

వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు.

అదృష్ట సంఖ్య 6


మీనం🐟

వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

అదృష్ట సంఖ్య 4

_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -07_* _

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*_భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం_*

*_సర్వభూతపతిం పరాత్పర మప్రమేయమనుత్తమం_*

*_సోమవారిణ  భూహుతాశన సోమపానిఖిలాకృతిం_*

*_చన్ద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_*


_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -07_* _


భక్తవత్సలుడిగా పూజించబడి, నాశనము లేని సంపద యైన వాడు, సర్వభూతములకు అధిపతియైన వాడు, పరాత్పరుడు, అప్రమేయుడు, అన్నిటికన్నా ఉత్తమమైన, వికారమయమైన కోరికలను బూడిదచేసి, అబూడిదను పులుముకొనే చన్ద్రుని శిరమున ధరించిన ఆ చన్ద్రశేఖరుడను పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  - చతుర్థి  - పూర్వాషాఢ -‌  భృగు వాసరే* *(17-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/liEP-CHM6F0?si=iIFCZcuAbn9CFawP


🙏🙏

సుభాషితమ్

 🕉️🪔  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪔🕉️

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


*శ్లోకం*


*_భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం_*

*_సర్వభూతపతిం పరాత్పర మప్రమేయమనుత్తమం_*

*_సోమవారిణ  భూహుతాశన సోమపానిఖిలాకృతిం_*

*_చన్ద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః_*


_ *_శ్రీ చన్ద్రశేఖరాష్టకం -07_* _


భక్తవత్సలుడిగా పూజించబడి, నాశనము లేని సంపద యైన వాడు, సర్వభూతములకు అధిపతియైన వాడు, పరాత్పరుడు, అప్రమేయుడు, అన్నిటికన్నా ఉత్తమమైన, వికారమయమైన కోరికలను బూడిదచేసి, అబూడిదను పులుముకొనే చన్ద్రుని శిరమున ధరించిన ఆ చన్ద్రశేఖరుడను పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.

నవగ్రహా పురాణం🪐* . *79వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *79వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*"నా పేరు అదే - ఈ రూపం రాకముందు పురుష రూపంలో సుద్యుమ్నుడు..."* *"సుద్యుమ్నుడా !! నారాయణ !"* నారదుడు ఆశ్చర్యంతో అన్నాడు.


*"ఔను ! స్త్రీ రూపం రాగానే నా పేరు 'ఇల' అని అనిపించింది ఎందుకో ?"* ఇల దీనంగా అంది.


*“నారాయణ ! సుద్యుమ్నుడు...ఇది... అప్పుడు పురుషుడు... ఇప్పుడు స్త్రీ...అప్పుడు యువకుడు... ఇప్పుడు యువతి ! బాగుంది... "* నారదుడు స్వగతంలా అనుకుంటున్నాడు. 


*"మహర్షీ ! నాకు ఈ గతి ఎందుకు పట్టింది ?"* ఇల దయనీయంగా అడిగింది.


*"ఎందుకు ?"* నారదుడు సాలోచనగా అన్నాడు. *"నారాయణ ! నువ్వు... పొరపాటున ఆ 'కుమార వనం'లో అడుగుపెట్టలేదు కద ?"* 


*"కుమారవనం అని తెలీదు కానీ , ఒక వనంలోకి వెళ్ళాం నేనూ , భటులూ..."* అంటూ ప్రారంభించి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది ఇలా..


*"నారాయణ ! ఇంక నీ గతి ఇంతే ! ఈ ఇల మీద నువ్వు 'ఇల'గా జీవించాల్సిందే !”* నారదుడు నిష్కర్షగా అన్నాడు. *"ఎందుకు ఇలా జరిగిందని కదా నీ అనుమానం. ఆ కుమారవనంలోకి ఎవరు అడుగుపెట్టినా అంతే ! ఏ పురుష ప్రాణి అయినా సరే - కుమార వనంలో పాదం మోపగానే స్త్రీ ప్రాణిగా మారిపోవాల్సిందే ! స్త్రీ ప్రాణిగా జీవించాల్సిందే ! స్త్రీ ప్రాణిగా మరణించాల్సిందే !*


*"అలా జరగాలని పార్వతీ పరమేశ్వరులు తమ శాపంతో శాసించారు. కుమారవనం ఆ ఆదిదంపతుల ప్రత్యేక ప్రణయోద్యానం ! పార్వతీ మాత శాపం పెట్టడానికి కారణం ఉంది. ఒకనాడు ప్రశాంత సమయాన పార్వతీ శంకరులు కుమారవనంలో , ఏకాంతంలో ఒకరికి ఒకరై ఆనందిస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి కొందరు మహామునులు వాళ్ళ దర్శనానికి వచ్చి , వనంలో ప్రవేశించారు. ఆది దంపతుల ప్రణయ కాలక్షేపం గురించి తెలియని ఆ మునులు వాళ్ళిద్దరూ ఆదమరిచి ఉన్న ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళిపోయారు.”*


*"పార్వతి సిగ్గుపడింది. ఆగ్రహించింది. తమ అభ్యంతర విహార స్థలమైన కుమారవనంలోకి ప్రవేశించిన ప్రతి పురుషప్రాణీ స్త్రీగా మారిపోయేలా శాపం పెట్టాలంది ! శివుడు సరే అన్నాడు ! ఇద్దరూ ఏక కంఠంతో ఆ విధంగా శాపం పెట్టేశారు !"* నారదుడు వివరించి , ఇల వైపు చూశాడు.


*"నారద మహర్షీ ! నా గతి ఏమిటి ? ఆదిశక్తి శాపానికి విరుగుడు లేదా ?"* ఇల ఆశగా అడిగింది.


*"చండిక శాసనం అది ! అంటే చండశాసనం అన్నమాటే. తల్లీ ! ఆదిశక్తి ఆగ్రహమైనా , అనుగ్రహమైనా అనుభవించక తప్పదు ! నిన్ను సుద్యుమ్నుడుగా ఎవరూ గుర్తించరు. నిన్ను స్త్రీగానే భావిస్తారు ! అంగీకరిస్తారు ! స్వీకరిస్తారు ! అందగత్తెవైన నీలాంటి యువతులకు పురుషులతో ప్రమాదం ఉండనే ఉంది ! అంచేత నువ్వు... రాజధానికి తిరిగి వెళ్ళడం శ్రేయస్కరం కాదు...”* నారదుడు చెప్పుకు పోతున్నాడు.


*"అయితే...నా భవిష్యత్తు ? మీరే నాకు మార్గ దర్శనం చేయాలి ?"* ఇల ప్రాధేయ పూర్వకంగా అంది.


*"ఈ అరణ్యంలో తూర్పుదిక్కుగా వెళ్తే నీకు మేలు జరిగే అవకాశం ఉంది. మహాసాత్వికులైన మంచి వ్యక్తులు నీకు పరిచయమవుతారు. నీ భవిష్యత్తుకు అంకురార్పణ జరుగుతుంది !"* నారదుడు భవితను సూచించే జ్యోష్కుడిలాగా అన్నాడు.


*“అయితే... నన్ను... ఇటు వైపు వెళ్ళమంటారా ?”* ఇలా అడిగింది. 


*"ప్రస్తుతం నీ మార్గాంతరం అదే ! బయలుదేరు ! శుభం భూయాత్ !"* నారదుడు దీవిస్తూ అన్నాడు.


ఇల నారదుడు సూచించిన దిశగా అడుగులు వేస్తోంది. రూపం మారేసరికి తనలో మానసికంగా కూడా ఏదో మార్పు వచ్చేసింది. చిన్న చప్పుడుకు కూడా తను జడుసుకుంటోంది. కుందేళ్ళనీ , లేళ్ళనీ , దుప్పులనీ చూస్తుంటే - పురుషావతారంలో అనిపించినట్టు వాటిని సంహరించాలనిపించడం లేదు. వాటిని చేరదీసి ముద్దు చేయాలని ముచ్చటవేస్తోంది. పురుష మనస్తత్వానికీ , స్త్రీ మనస్తత్వానికీ , ఆలోచనా సరళికి ఇంత అంతరం ఉంటుందా ?


మెత్తటి అడుగుల చప్పుడు ఇలను ఆలోచనల నుండి లాగింది. ఆమెలో ఆలోచనలు ఆగినట్టే , ఎదురుగా వినవచ్చిన అడుగుల సవ్వడి కూడా ఆగింది. ఇల బెరుకు బెరుకుగా చూసింది.


ఎదురుగా ఒక యువకుడు ! తనలాగే నిలబడి , తనలాగే ఆశ్చర్యపోతూ చూస్తున్న యువకుడు. ఇందాక లేడిని చూడగానే భయంతో స్పందించిన ఆమె గుండె ఇంకా ఎంతో వేగంగా స్పందిస్తోంది. అయితే భయంతో కాదు , ఏదో ఉద్వేగంతో !


పురుష సౌందర్యానికి నిర్వచనంలా ఉన్నాడా యువకుడు ! పోతపోసిన అందంలా ఉన్నాడు ! తళతళ లాడుతూ కనిపిస్తున్న శరీర సౌష్టవం ! గుండ్రటి ముఖం. చూపుల్ని బలంగా లాగి బంధించివేసే అందమైన పెద్ద పెద్ద కళ్ళు ! దరహాసానికి ప్రాణం పోస్తున్న పెదవులు... దగ్గరైన అదృష్టవంతురాలికి ప్రణయ పీఠంలా భాసించే విశాల వక్షం.... కళ్ళు చెదిరే శరీర వర్ణం... ఆ దేహకాంతిని హెచ్చవేత వేసి చూపించే వస్త్రధారణ... గాలికి ఎగురుతున్న పల్చటి అంగవస్త్రం. 


ఇల తటాలున రెప్పవాల్చి తనను చూసుకుంది. మరుక్షణం ఆమె సిగ్గుతో కుంచించుకు పోయింది. ఎడమ చెయ్యి తటాలున ఆమె పయ్యద ఉండాల్సిన స్థానాన్ని ఆక్రమించింది. కుడి చెయ్యి కిందకి జారిపోయి గాలికి మెలికలు తిరుగుతున్న పైటకొంగుని అందుకుంది. ఇదంతా లిప్త పాటు కాలంలో జరిగిపోయింది. 


సిగ్గుతో ఇంకా రెప్పలు దించుకునే ఉన్న ఇలలో ఆలోచన వెన్నెల్లో కలువ మొగ్గలా వికసిస్తోంది. అంటే... అంటే... గాలి తాకిడికి పైట తొలగిపోయిన విషయాన్నీ , తన వక్షభాగం అనాచ్ఛాదితంగా ఉన్న విషయాన్నీ గమనించే స్థితిని దాటిపోయి, ఆ యువకుడిని చూస్తూ ఉండిపోయింది తను. అంత అందగాడా అతడు ? ఇలా అంతరంగంలో పుట్టిన ఆ ప్రశ్నకు అంతరంగంలోనే సమాధానం దృశ్య రూపంలో లభించింది. ఇంకా కిందికి వాలి ఉన్న రెప్పల వెనక తను ఇందాకా చూసిన ఆ యువకుడి సమ్మోహనాకారం ప్రత్యక్షమైంది ! తన అంతరంగం మీదికి చేరిపోయి కనిపిస్తున్న ఆ యువకుణ్ణి అలాగే 'లో' చూపుతో చూస్తూ ఉండిపోయింది ఇల.


తాను నిలుచున్న రెండు పొదరిండ్ల మధ్య అందమైన యవ్వన వృక్షంలో ఉన్న యువకుడు ప్రకృతి నేపథ్యంలో తన ముందు నిలుచున్న ఆ యువతిని చూస్తూ. ఉండిపోయాడు. ఆమె నిసర్గ సౌందర్యం తనను మంత్రముగ్ధుణ్ణి చేసి వేసింది. బంగారు తీగను గుర్తుకు తెచ్చే శరీరం... పూర్తిగా వికసించిన పద్మంలాంటి ముఖం ! కలువరేకుల్లాంటి అందమైన విశాల నేత్రాలు... ఊహూ... అవి నేత్రాలు కావు , ఎదుటి వారి మీద కాంతి కిరణాల్ని రువ్వే జ్యోతులు ! పగడాల్లాంటి పెదవులు. అవి కదిలినప్పుడల్లా తొంగి చూస్తున్న ముత్యాల్లాంటి పళ్ళు ! ఆమె సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తున్న ఆ పైట... ఆమె అందాన్ని తన చర్మచక్షువులకు కనిపించకుండా దాచగలిగింది కానీ , తన అంతర్నేత్రాల నుంచి , ఇంకా ఆ అయస్కాంత సౌందర్యాన్ని దర్శిస్తున్న తన అంతర్నేత్రాల నుండి దాచలేకపోతోంది !


ఈ నడుస్తున్న సౌందర్యం ఎక్కడిది ? ఎక్కణ్ణుంచి వచ్చింది ? ప్రశ్నకు సమాధానాన్ని కనుక్కోలేకా , ఆమెను అడగలేకా సతమతమనుతున్న యువకుడు తనకు తెలీకుండానే ముందుకు సాగాడు. అతని కదలిక కోసమే కాచుకున్నట్టు , ఆమె కూడా ముందుకు అడుగులు వేసింది. ఇద్దరూ ఒకర్ని దాటి ఒకరు ముందుకు వెళ్ళిపోయారు.


ఏదో అజ్ఞాత సంకేతాన్ని అందుకున్న వాళ్ళలాగా ఇద్దరూ ఒకేసారి వెనుదిరిగారు. ఒకరికొకరు అభిముఖంగా నిలుచున్నారు. ఇద్దరి ప్రయత్నమూ లేకుండానే , ఇద్దరి కళ్ళూ తమ భాషలో పలకరించుకుంటున్నాయి. ఆ 'నేత్రభాష' పెదవులను స్పందింప జేస్తోంది. రెచ్చగొట్టుతోంది.


*“నా పేరు... బుధుడు...”* యువకుడు ఆమె కళ్ళలోకే చూస్తూ అన్నాడు *“నువ్వు...”*


*"నా పేరు... ఇల...”.*


*"నేను చంద్రుడి పుత్రుణ్ణి. తారాదేవి నా తల్లి. నేను ఈ దగ్గర్లోని ఆశ్రమంలో నివసిస్తున్నాను. నువ్వు..."* బుధుడు రెండు అక్షరాలతో ప్రశ్నను పూర్తి చేశాడు.


*“నాకు... నాకు... ఎవ్వరూ లేరు...”* తన గతం గురించి , పురుష జన్మ గురించి , పార్వతి శాపం గురించి చెప్పాలనిపించడంలేదు ఇలకు. ఆ అందగాడికి భయాందోళనలూ , సందేహాలూ కలిగించే నిజాలేవీ చెప్పకూడదనిపిస్తోంది. చెప్తే , తనకు... దూరమైపోతాడేమో ! ఇల తన ఆలోచనలకు తానే నవ్వుకుంది. ఇప్పుడు దగ్గరయ్యాడా దూరం కావడానికి ?!


*"సూర్యాస్తమయం కావస్తోంది. అరణ్యం క్షేమకరం కాదు. నా ఆశ్రమంలో... విశ్రాంతి తీసుకోవచ్చు...”* బుధుడు ఆహ్వాన సూచకంగా అన్నాడు.


*“సరే..."* ఇలా అసంకల్పితంగా అంది. 


బుధుడు వెనుదిరి , తన ఆశ్రమం వైపు దారి తీశాడు. తనను వేటాడుతున్న ఇల కళ్ళను చూశాక అతను వేట గురించి , వేటగాళ్ళ గురించి మరచి పోయాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

పెరియ పురాణం⚜️

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 02*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *2. ఇయర్ పగై నాయనారు*


పూంబుహార్ నగరంలో ఇయర్ పగై నాయనారు అనే పేరుగల

వర్తకుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. శివభక్తులు

ఏది అడిగినా లేదనకుండా ఇచ్చే దాన స్వభావి. ఆ విధంగా భక్తులు

అడిగినది లేదనకుండా ఇవ్వడం లోక స్వభావానికి విరుద్ధం కాబట్టి అందరూ

అతనిని ఇయర్ పగై (లోక ప్రవృత్తికి విరుద్ధమైన) నాయనారు అని పిలుస్తుండేవారు. 


తన భక్తుని దాన గుణాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో శివుడు ఒక ధూర్త బ్రాహ్మణ వేషధారియై ఇయర్ వగై నాయనార్ ఇంటికి

వచ్చాడు. నాయనార్ ఆ బ్రాహ్మణ శివభక్తుని భక్తి పూర్వకంగా సముచిత

సత్కారాలతో గౌరవించాడు. 


తనముందు నిలబడిన ఇయర్ పగై నాయనారును చూసి వంచక బ్రాహ్మణుడు నీ భార్యను కావాలని కోరి నీ

ఇంటికి వచ్చాను అని చెప్పగా నాయనారు ఏ మాత్రమూ కోపం చెందక

తన భార్యను సంతోషంగా తాపసికి సమర్పించాడు. అప్పుడా బ్రాహ్మణుడు

"నీ భార్యను నేను ఒంటరిగా పిలుచుకొని వెళ్తున్నపుడు నీ బంధువులు

నాపై పగబట్టి నాకు అపకారం చేయవచ్చు. కాబట్టి నగరం పొలిమేరలు

దాటేంతవరకు నీవు నాకు తోడుగా రావాలి" అని ఆజ్ఞాపించాడు. 


వెంటనే ఇయర్ పగై నాయనారు వాళ్ల వెనుకగా ఒకచేతిలో కరవాలము, మరొక

చేతిలో డాలును ధరించి తనను ఎదిరించిన వాళ్లను కరవాలంతో

నేలకూలుస్తానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు.

ఊహించిన విధంగానే నాయనారు బంధువులు ఆయుధాలతో ఆ

ధూర్త బ్రాహ్మణుని చంపడానికి ఉద్యుక్తులయ్యారు. నాయనారు వాళ్లందరినీ

తన కరవాలంతో నిర్దాక్షిణ్యంగా సంహరించాడు.


తన భార్యను వైదికోత్తమునికి సమర్పించి "స్వామీ! ఇక మీరు

భయపడకుండా వెళ్లండి" అంటూ వాళ్లు సురక్షిత ప్రదేశానికి చేరుకున్న

తరువాత తన అర్ధాంగిని శాశ్వతంగా వదిలిపెట్టి వెనుదిరిగి చూడక

సంతోషంతో తన ఇంటికి బయలుదేరాడు. అన్యులు చేయడానికి

అసాధ్యమైన కార్యాన్ని చేసినవాడునూ, శివభక్తుడునూ అయిన ఇయర్

పగై నాయనారును బ్రాహ్మణుడు ఎలుగెత్తి పిలిచాడు. 


ఆ శబ్దాన్ని విని “ఈ

దాసుడు ఇదిగో వస్తున్నాడు. మీకు అపకారం తలపెట్టిన వారిని ఈ  కరవాలంతో ఖండిస్తాను" అని చెబుతూ ఇయర్ పగై నాయనారు

బ్రాహ్మణుడున్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ విధంగా పరిగెత్తుకుంటూ

వచ్చిన ఇయర్ పగై నాయనారుకు బ్రాహ్మణుడు కనిపించలేదు. రత్నాభరణ

భూషితురాలైన భార్య మాత్రం కనిపించింది. 


ఇంతలో శివగామవల్లీ సమేతుడై వృషభ వాహనం మీద కొలువు తీరిన నటరాజస్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీవు నీ భార్య ఇరువురూ కైలాసానికి విచ్చేయండి”

అని వారిని తన కరుణా కటాక్షాలచే అనుగ్రహించాడు. 


చనిపోయిన

నాయనారు బంధువులను, కులపెద్దలను పునర్జీవితులను చేసి వాళ్లు కూడ

శివలోక పదవిని అందుకొని సుఖ సంతోషాలను అనుభవించే వరాన్ని

అనుగ్రహించాడు.


    *రెండవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 89*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 89*


శ్రీరామకృష్ణులు అవతార పురుషుడనే  విషయాన్ని పరీక్షించాలనే ఆలోచన నరేంద్రునిలో తలెత్తింది.......   ఆ రోజు భరించరాని నొప్పితో శ్రీరామకృష్ణులు తల్లడిల్లిపోతున్నారు. ' 'శారీరక వ్యాధి వలన ఇంతగా తల్లడిల్లిపోతున్న ఈ స్థితిలో కూడా ఆయన తమను అవతారపురుషునిగా వచించే పక్షంలో, ముమ్మాటికీ ఆయన అవతారపురుషులేనని నమ్ముతాను' అని నరేంద్రుడు అనుకొన్నాడు. 


ఇలా అతడు అనుకోవడమే ఆలస్యం, పడక మీద పడుకొనివున్న శ్రీరామకృష్ణులు తమ శక్తినంతా కూడదీసుకొని లేచి కూర్చుని సుస్పష్టమైన స్వరంలో ఇలా అన్నారు: "నరేన్! మునుపు ఎవరు రాముడుగాను, కృష్ణుడుగాను. అవతరించారో, వారే ఇప్పుడు రామకృష్ణులుగా ఈ శరీరంలో ఉన్నారు. కాని నీ వేదాంత భావన ప్రకారం కాదు." ఎన్నో దివ్య దృశ్యాలూ, శక్తులూ ఆయనలో చూసిన తరువాత కూడా ఇంకా తనకు సంశయం నివృత్తి కాకపోయినందుకు నరేంద్రుడు సిగ్గుతో, అవమానంతో తలవంచాడు.


ఒక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తప్ప తక్కిన తమ యువశిష్యులను పిలిపించారు. ఆయన మాట్లాడలేకపోతున్నారు. అయినప్పటికీ అతి మెల్లని స్వరంలో, "ఇదిగో చూడండి! మిమ్మల్ని నరేంద్రుని బాధ్యతలో వదలి పోతున్నాను. అతడు చెప్పినట్లు మెలగండి. అతడి ఆరోగ్యాన్నీ, శ్రేయస్సునూ గమనించి మసలుకోండి" అన్నారు. 


ఆ తరువాత నరేంద్రుణ్ణి పిలిచి, "ఇదిగో చూడు నాయనా, నరేన్! ఈ నా బిడ్డలనందరిని నీకు అప్పగించిపోతున్నాను. అందరిలోను బుద్ధిశాలివీ, ప్రతిభావంతుడివీ నువ్వు ప్రేమతో వారికి నేతృత్వం వహించు. నా కోసం పనిచేయి” అన్నారు.🌹


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 79*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

          *🌹సౌందర్యలహరి🌹*

                   *శ్లోకం - 79*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


 *నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో*

 *నమన్మూర్తే ర్నారీ తిలక శనకై స్త్రుట్యత ఇవ |*

 *చిరం తే మధ్యస్య     త్రుటిత తటినీతీరతరుణా*

 *సమావస్థా స్థేమ్నో భవతు కుశలం శైలతనయే ‖*


ఓ శైల తనయా ఓ నారీ తిలకమా సన్ననిదీ, పాలిండ్ల భారము చేత బడలి, క్రిందికి వంగి, ఉద్ధృతమైన వరద ప్రవాహము చేత కోసుకుపోతున్న నదీ తటమున వున్న చెట్టు వలె వున్నదీ అయిన నీ నడుము చిరకాలము సురక్షితముగా ఉండుగాక!


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

దీపారాధన మహిమ*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*కార్తీకపురాణం - 4వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*దీపారాధన మహిమ*


ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసమున యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి. 

జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన యందు అతి ముఖ్యము.  దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని  వైకుంఠ ప్రాప్తి నొ౦దుదురు.  కార్తిక మాసమందు హరి హరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు  అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను.  దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను  నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.


*శతృజిత్ కథ* 


పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చటకు పికెదుడను ముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నీవెందుల కింత తపమాచరించు చున్నావు?  నీ కోరిక యేమి?'  యని ప్రశ్నించగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని   చెప్పెను. అంత మునిపున్గవుడు' ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నేర వేరగలదు ' యని చెప్పి వెడలిపోయెను.


వెంటనే పాంచాల రాజు తన దేశమునకు, వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలతో  నియమాను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముహూర్తమున నొక కుమారుని గనెను.  రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములు జేసి, ఆ బాలునకు ' శత్రుజిత్' యని నామకరణ ము చేయించి అమిత గరాబముతో పెంచుచుండిరి.  కార్తిక మాస  దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను.  కాని, యవ్వనము  రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కమావాంఛ తీర్చుకొనుచుండెను.

తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల ప్రేమతో చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి.  శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకుని, ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను.   ఆమె ఒక ఉత్తమ భార్య, మిగుల రూపవతి.  ఆమె అందచందములను వ ర్ణించుట మన్మధునికైననూ శక్యము గాదు.  అట్టి స్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై, కామవికారముతో నామెను సమీపించి తన కమవాంఛను తెలియచేసేను.  ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై, కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను అనుభవించెను. 


ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత, వారు ప్రతి దినము నర్థరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు, తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి, ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.


ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు, అంతకుముందే కత్తితో  సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను.  ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున 'చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన  పైట చెంగును చించి, అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో  రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని

ఖండించి, తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు  బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి.  అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు 'ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు?  కామాంధకారముతో  కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల?  చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను.  అంత యమకింకరులు ' ఓ బాపడ! ఎవరెంతటి  నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశించిపోయినవి.  కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు'  అలా యెన్నటికిని జరగనివ్వను.  తప్పొప్పులు యెలాగునున్నప్పటికీ మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా యందరికి  వర్తించ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో  కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను.  వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి. 

వింటివా రాజా!  శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికుల పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను.  కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొందుదురు.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త  కార్తిక మహాత్యమందలి*

*నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.*

*ఉ || ఎల్ల శరీర దారులకు నీళ్ళను చీకటి నులిలోపలన్*

*ద్రెళ్లక ' మీరుమే' మను మతిభ్రమణంబున భిన్నులై*

*ప్రవర్తిల్లక సర్వమున్నతని* *దివ్యకళమయమంచు విష్ణు నందుల్లము జేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణి ||*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 ఈ రోజు పంచాంగం 17.11.2023  Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస శుక్ల పక్ష: చతుర్ధి తిధి భృగు వాసర: పూర్వాషాఢ నక్షత్రం ధృతి తదుపరి శూల యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


చవితి పగలు 11:02 వరకు.

పూర్వాషాఢ రాత్రి 01:15 వరకు.

సూర్యోదయం : 06:26

సూర్యాస్తమయం : 05:36

వర్జ్యం : మధ్యాహ్నం 11:27 నుండి 12:59 వరకు .

దుర్ముహూర్తం : పగలు 08:40 నుండి 09:25 వరకు తిరిగి మధ్యాహ్నం 12:23 నుండి 01:08 వరకు. 


రాహుకాలం : పగలు 10:30  నుండి 12:00 వరకు.


యమగండం : మద్యాహ్నం   03:00 నుండి 04:30 వరకు.


శుభోదయ:, నమస్కార: