15, ఆగస్టు 2024, గురువారం

కళల వలన ప్రయోజనం

 

కళల వలన  ప్రయోజనం

 విద్య అంటే మనం పాఠశాలల్లోనో లేక కళాశాలల్లోనో చదువుకునే చదువే కాదు మనం తెలుసుకునే ప్రతి జ్ఞ్యానం కూడా విద్యయేకొన్ని సందర్భాలలో మనం చిన్నతనంలో సరదాగా నేర్చుకునే కళలు కూడా కొన్ని సందర్భాలలో మన ప్రాణాలను కాపాడవచ్చుఅటువంటిదే ఒక యదార్ధ సంఘటన నాకు ఇంటర్నెట్లో దొరికిందిఅది మీతో పంచుకుంటున్నాను.

కేరళ నుంచి ఒక మిత్ర బృందం అస్సాం అందాలు చూడాలని బయలుదేరి వెళ్ళారు. చాలాచోట్ల తిరిగారు. ఒక కొత్త ప్రదేశం చూడాలని అక్కడివారి సాయంతో జీప్ లో బయలుదేరి వెళ్ళారు, చూడవలసినవి చూసి వస్తున్నారు ఘాట్ రోడ్ లో. హటాత్తుగా ఏనుగుల గుంపు కనిపించింది, ఏం చేయడానికి తోచక జీప్ ఆపుకుని కూచున్నారు. కొందరు జీపు దిగారు. ఒక పక్క లోయ, మరో పక్క ఎత్తైన కొండ. లోయ పక్క దట్టమైన చెట్లు. ఒక ఏనుగు జీపుని లోయలోకి తోసేసింది. ఎవరికి తోచింది వారు చేశారు, జీప్ నుంచి దూకినవారు, పరుగెట్టి వెనక్కిపారిపోయినవారు, ఇలా చెట్టుకొకరు పుట్టకొకరు ఐపోయారు. ఒకతను జీప్ లో ఉండిపోయాడు, జీప్ ని తోయడంలో బయటపడి లోయలో పడిపోయాడు, చివరికి జారి లోయ కిందికి చేరిపోయాడు.స్పృహ తప్పిపోయాడు జీపు చెట్లలో చిక్కుకుపోయింది. .

 రాత్రి పడింది, పైవాళ్ళు ఏనుగులు వెళ్ళిన తరవాత ఒక్కొకరూ చేరేరొకచోటికి, అందరూ చేరారు కాని లోయలో పడినవాడు కనపడలేదు, వెతికినా! లోయలో పడిపోయి ఉంటాడనుకున్నారు, కేకలేశారు, కిందవాడికా కేక అందలేదు,స్పృహ తప్పిపోయాడు. ఉదయం చూద్దామని ముందుకెళ్ళిపోయింది మిత్ర బృందం చాలా సేపు వెతికి వేసారిమర్నాడు ప్రమాదం జరిగిన చోట వెతికారు,ప్రయోజనం లేకపోయింది, జీప్ ను పైకి లాక్కుని వెళిపోయారు.. పోలీస్ కి ఫిర్యాదిచ్చి వెనక్కి పోయారు, ఆచూకీ దొరకలేదని.

లోయలో పడినవాడికి కొంతకాలానికి తెలివొచ్చింది. కేకలేశాడు, పైకి ఎక్కడానికి ప్రయత్నమూ చేశాడు, విఫలమయ్యాడు. దారి ఉపయోగించేవారు తక్కువ కావడంతో ప్రయోజనం లేకపోయింది. ఏంచెయ్యాలి? కడుపులో కాలుతోంది, మరికొంత దూరం కాలు సారిస్తే కొన్ని పళ్ళు దొరికాయి,తిన్నాడు, సెలయేరు కనపడితే నీరుతాగాడు. ఆకలి దప్పికలు తీరాయి, తరవాతకీ భయం లేకపోవడంతో పైకి చేరుకునే మార్గం గురించి ఆలోచన మొదలు పెట్టేడు. ఏం చేయాలో తోచలేదు. అలా తిరుగుతుండగా వెదురుపొద కనపడింది. వెదురు కర్రని సాధ్యం చేసి, ఉన్న రాళ్ళ తో ఒక వేణువును తయారు చేశాడు. ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న వేణువును పలికించడం ప్రారంభించాడు. అదే ఒక తపస్సు అయి వేణువును పలికించడమే పరమావధిగా చేసుకున్నాడు.

ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక సైనికాధికారి రోడ్ పోతూ వేణుగానాన్ని విన్నాడు, జీప్ ఆపించి పరిశీలించమన్నాడు. ఎవరూ కనపడలేదు, కేకలకి ప్రతి స్పందించలేదుఅధికారి లాభం లేదనుకుని మరలిపోయాడు. మరునాడు మళ్ళీ వేణుగానం విన్నాడు, ఆచోటిలోనే. ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలం బయలుదేరి, కొంతమంది సైనికులతో, తాళ్ళు తదితర సామగ్రితో వచ్చి లోయలోకి దిగి వేణుగానం వైపుసాగారు. అక్కడ ఇతను కనపడ్డాడు. లోయలో ఉన్నావాని భాష సైనికులకురాదు, సైనికుల భాష లోయలోనివానికి తెలియదు. మొత్తానికి అతన్ని తీసుకుని పైకొచ్చారు. అధికారిదీ అదే వ్యధ, లోయలో పడినవానికి మరో భాష రాదు. విదేశీయుడా? గూఢచారా? అనేక అనుమానాల మధ్య అతన్ని సైనిక కేంద్రానికి తీసుకొస్తే అతను మాటాడుతున్న భాష మలయాలం అని తెలిసి, సైనికులలో మలయాలం తెలిసినవారితో మాటాడించి అతని చరిత్ర తెలుసుకున్నారు.

లోయలో పడినవాని మురళీ వాయిద్యానికి అధికారి ముగ్ధుడయాడు. ఒక సభ చేసి ఇతనిచే వేణుగానం చేయించి విన్నారు. అందరూ ఆనంద పరవశులయ్యారు. ఎవరిమటుకువారు అతనికి కొంత సొమ్మిచ్చారు, అప్పటికప్పుడు, అక్కడికక్కడ. అధికారి ఇతని క్షేమసమాచారం అతని ఇంటికి చేరేశారు, తొందరలో తిరిగొస్తున్నట్టూ టెలిగ్రాం లిచ్చారు. ఇతని చేత మరికొన్ని కచేరీలు చేయించి ఇతోధికంగా సత్కరించి, రైలెక్కించి, తడికళ్ళతో వీడ్కోలు పలికారు. కథ శుభాంతం అయింది.

చూసారా చిన్న చిన్న విషయాలు ఎలా పెద్ద సహాయకారిగా అవుతాయో కదామనం చిన్నప్పుడు నేర్చుకునే చెట్లు ఎక్కటం, ఈతకొట్టటం, వేగంగా పరిగెత్తటం, చేతులు నోటి ముందుపెట్టుకుని పెద్దగాఅరవటం, తదితర విషయాలు మనకు జీవితంలో ఎప్పుడో ఒక్కప్పుడు అవసరానికి ఉపయోగపడవచ్చు. చిన్నతనంలో పిల్లలు వారి వారి అభిరుచులను పట్టి ఎన్నో కళలు నేర్చుకుంటారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ప్రస్తుతం బాల్యం నాలుగు గోడలమధ్యన సెల్పోను తోటి గడుస్తుందిపిల్లలలో సృజనాత్మకత అభివృద్ధి కావటంలేదు, మానవసంబందాలు ఏర్పడటంలేదు. ఇది ఇట్లావుండగా పిల్లలకు తలకు మించిన భారంగా పుస్తకాలు, పాఠశాలల, కళాశాలల మధ్య పోటీతో పిల్లలను బలిచేస్తున్నారుతల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అందరికంటే ఎక్కువ మార్కులు రావాలనే తాపత్రయంతో వారి సంతోషాలను, ఆనందాలను బాలి తీసుకుంటున్నారు. మన పిల్లలను రోలులో ఒక గంట అయినా బయట తోటి పిల్లలతో ఆడుకునేటందుకు ప్రోత్సహించాలిఆదివారాలు, శలవుదినాలలో పిల్లలతో కలిసి సినిమాలకు, చుట్టుప్రక్కల ప్రదేశాలను చూడటానికి అనుమతించి వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందటానికి తోడ్పడాలి. కొన్నిసందర్భాలలో అనిపిస్తుంది పిల్లలను అతి ప్రేమగా చూడటం వారి అభివృద్ధికి గొడ్డలి పెట్టు అవుతుందనిపిస్తుంది

మీ 

భార్గవ శర్మ

 

ఎందరో మేధావులు

 https://youtu.be/Wq12KjnGuIk?si=On7KN-79MASpkkvu

శ్రీభారత్ వీక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🌹మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే, తెలుగు నాట ప్రభవించిన ఎందరో మేధావులు, పండితులు తెలుగు ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటారు. వారిలో కాశీ కృష్ణాచార్యులు గారు అగ్రగణ్యులు. అష్టావధానం, శతావధానాలలో అందెవేసిన ఆయన గురించి ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు ఎంత రమణీయంగా చెప్పారో వినండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆస్థాన కవి గా కూడా ఉన్న ఆయన కవితా మాధుర్యాన్ని మనకు చక్కగా అందించారు వేణు గారు. ఆస్వాదించండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి. 🙏

స్వాతంత్ర్యదినోత్సవ

 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*78వ భారత స్వాతంత్ర్యదినోత్సవ*

                *శుభాకాంక్షలు*


మహిత భారతసంతతీ మాన్యులార! 

అందుకొనుడు స్వాతంత్ర్య శుభాశచయము 

దేశభారతి మీకెల్ల తీయనైన 

యాస్త లెన్నియొ తీర్చంగ నమరగలదు 

*~శ్రీశర్మద*

ఆరోగ్యమే మహాభాగ్యం

 ఆరోగ్యాభిలాషులు అందరికీ.... ఆరోగ్యమే మహాభాగ్యం- అందరూ ఆరోగ్యంగా జీవించాలానే తలంపుతో గో ఆధారిత   ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం, విశాఖపట్నం వారు ప్రఖ్యాత సిద్ధ ఆయుర్వేద వైద్యులు జై శ్రీరామ్ గురువు గారిని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ లో వివిధ నగరాలకు తీసుకొని వచ్చి గత  5 నెలల నుండి  ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాము.. 


వీరు అనేక దశాబ్దాల నుండి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు స్పాండిలైటిస్ భుజం నొప్పులు వెన్నుపూస సంబంధిత ఇబ్బందులు సరిజేయడంలో సిద్ధహస్తులు.


ఈ ఐదు నెలలో  ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపు లో ఎంతో మంది ఎన్నో సంవత్సరాలనుండి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు స్పాండిలైటిస్ భుజం నొప్పులు తో బాధ పడుతున్న వందలాది  ప్రజలు ఉపశమనం పొందారు.  


అత్యంత పురాతన సాంప్రదాయ ప్రాచీన సిద్ధ వైద్యం ప్రాచుర్యం లోకి తీసుకుని రావాలని సంకల్పం తో ప్రతీ  నెల మన రాష్ట్రం లో వివిధ ఊర్లులలో ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగుతుంది .. 


ఈ ఆగస్ట్ నెలలో మరింత మందికీ ఈ ఉచిత సిద్ధ వైద్యం అందించాలని తలంపుతో క్షత్రియ పరిషత్, కాకినాడ వారి సౌజన్యం తో కాకినాడ లో కూడా నిర్వహిస్తున్నాము 


ఆగష్టు నెల ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపు వివరాలు.



ఆగస్ట్ 16 శుక్రవారం.. విజయనగరం 

ఆగస్ట్:17 శనివారం.. విశాఖపట్నం 

ఆగస్ట్:18 ఆదివారం.. విశాఖపట్నం

ఆగస్ట్:19  సోమవారం. కాకినాడ 

ఆగస్ట్: 20 .మంగళవారం రాజమండ్రి 

ఆగస్ట్: 21.. బుధవారం అమలాపురం 

ఆగస్ట్: 22... గురువారం విజయవాడ 

ఆగస్ట్: 23... శుక్రవారం ఎలాప్రోలు విజయవాడ..



గో ఆధారిత   ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం వారు సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపును  పూర్తిగా సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఏ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు. ఎవరి సౌకర్యములు వారే చూసుకో వలెను. 


ఈ అత్యంత పురాతన సాంప్రదాయ ప్రాచీన సిద్ధ వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలని కృషిచేస్తున్న 

భారత్ జాతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి శ్రీ జలగం కుమారస్వామి గారికి  ప్రఖ్యాత సిద్ధ ఆయుర్వేద వైద్యులు జై శ్రీరామ్ గురుజీ గారికి  శ్రీ తులసి  సిద్ధ ఆయుర్వేద వైద్యశాల, హైదరాబాద్ సిద్ధ వైద్యుల బృందం శ్రీ జగదీశ్, శ్రీ శ్రీనాథ్, శ్రీ రితిక్ కన్నా గార్లకు ప్రత్యేక ధన్యవాదములు...


ఆగస్టు నెలల ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపు పూర్తి వివరాలు జతచేసాను...  మీ బంధుమిత్రులలో ఎవరైనా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు స్పాండిలైటిస్ భుజం నొప్పులు తో బాధ పడుతున్నవారు ఉంటే ప్రతీ నెల నిర్వహిస్తున్న ఈ ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపును వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము..


శ్రీ తులసి ఆయుర్వేదం, హైదరాబాద్ (సిద్ధ వైద్యం) ఫోన్ నెం  9390484780 కు ఫోన్ చేసి మీ ఆరోగ్య సమస్యలు పూర్తి వివరాలుతో తెలియజేస్తే వారు మీ  ఆరోగ్య  సమస్యలకు హైదరాబాద్ లో కూడా పరిష్కారం తెలుపగలరు .. ఉదయం 11.00 గం నుండి సాయంత్రం 4.00 గం ల వరకు ఫోన్ అందుబాటు లో ఉంటుంది.. 🙏🙏🙏

14.08.2024. బుధవారం

 


14.08.2024.     బుధవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు శ్రావణ మాస శుక్ల పక్ష

*నవమి* తిథి ఉ.10.23 వరకూ తదుపరి *దశమి* తిథి, *అనూరాధ* నక్షత్రం మ.12.13 వరకూ తదుపరి *జ్యేష్ట* నక్షత్రం, *ఐంద్రం* యోగం సా.04.06 వరకూ తదుపరి *వైధృతి* యోగం, *కౌలవ* కరణం ఉ.10.23 వరకూ తదుపరి *తైతిల* కరణం రా.10.31 వరకూ ఉంటాయి.

*సూర్య రాశి* : కర్కాటక రాశి లో(ఆశ్లేష నక్షత్రం లో)

*చంద్ర రాశి* :వృశ్చిక రాశి లో.

*నక్షత్ర వర్జ్యం*: సా.05.58 నుండి రా.07.37 వరకూ

*అమృత కాలం*: రా.03.50 నుండి రా.రే.తె.05.29 వరకూ

 

( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.59

*సూర్యాస్తమయం*: సా.06.42

*చంద్రోదయం* : మ.01.58

*చంద్రాస్తమయం*: రా.01.08

*అభిజిత్ ముహూర్తం*: లేదు

*దుర్ముహూర్తం*: ప.11.55 నుండి మ.12.46 వరకూ.

*రాహు కాలం*: మ.12.21 నుండి మ.01.56 వరకూ

*గుళిక కాలం*: ఉ.10.45 నుండి మ.12.21 వరకూ

*యమగండం*: ఉ.07.34 నుండి 09.10 వరకూ.


*సర్వార్థ సిద్ధి యోగం,అమృత సిద్ధి యోగాలు* ఈ రోజు సూర్యోదయం నుండి మ.12.13 వరకూ (బుధవారం,అనూరాధ నక్షత్రం కలయిక) ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికీ, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


*గురు, కుజ గ్రహాల మధ్య సమాగమనం* ఈరోజు రాత్రి 10.22 కి ఏర్పడుతుంది. వృషభ రాశిలో సంచరిస్తున్న కుజ గ్రహానికి దక్షిణ దిశ లో 18 నిమిషాల కోణ స్థితి లో గురు గ్రహం చేరువ అవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి తూర్పు ఆకాశం లో 57° డిగ్రీల కోణ స్థితి లో, ఈరోజు రాత్రి 01.13 కి కనిపించడం ప్రారంభం అయ్యి రేపు తెల్లవారి వెలుగు లో అంతర్ధానం అవుతాయి.


నారాయణ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.