ఆరోగ్యాభిలాషులు అందరికీ.... ఆరోగ్యమే మహాభాగ్యం- అందరూ ఆరోగ్యంగా జీవించాలానే తలంపుతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం, విశాఖపట్నం వారు ప్రఖ్యాత సిద్ధ ఆయుర్వేద వైద్యులు జై శ్రీరామ్ గురువు గారిని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ లో వివిధ నగరాలకు తీసుకొని వచ్చి గత 5 నెలల నుండి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాము..
వీరు అనేక దశాబ్దాల నుండి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు స్పాండిలైటిస్ భుజం నొప్పులు వెన్నుపూస సంబంధిత ఇబ్బందులు సరిజేయడంలో సిద్ధహస్తులు.
ఈ ఐదు నెలలో ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపు లో ఎంతో మంది ఎన్నో సంవత్సరాలనుండి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు స్పాండిలైటిస్ భుజం నొప్పులు తో బాధ పడుతున్న వందలాది ప్రజలు ఉపశమనం పొందారు.
అత్యంత పురాతన సాంప్రదాయ ప్రాచీన సిద్ధ వైద్యం ప్రాచుర్యం లోకి తీసుకుని రావాలని సంకల్పం తో ప్రతీ నెల మన రాష్ట్రం లో వివిధ ఊర్లులలో ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగుతుంది ..
ఈ ఆగస్ట్ నెలలో మరింత మందికీ ఈ ఉచిత సిద్ధ వైద్యం అందించాలని తలంపుతో క్షత్రియ పరిషత్, కాకినాడ వారి సౌజన్యం తో కాకినాడ లో కూడా నిర్వహిస్తున్నాము
ఆగష్టు నెల ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపు వివరాలు.
ఆగస్ట్ 16 శుక్రవారం.. విజయనగరం
ఆగస్ట్:17 శనివారం.. విశాఖపట్నం
ఆగస్ట్:18 ఆదివారం.. విశాఖపట్నం
ఆగస్ట్:19 సోమవారం. కాకినాడ
ఆగస్ట్: 20 .మంగళవారం రాజమండ్రి
ఆగస్ట్: 21.. బుధవారం అమలాపురం
ఆగస్ట్: 22... గురువారం విజయవాడ
ఆగస్ట్: 23... శుక్రవారం ఎలాప్రోలు విజయవాడ..
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సేవా సంఘం వారు సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపును పూర్తిగా సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఏ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు. ఎవరి సౌకర్యములు వారే చూసుకో వలెను.
ఈ అత్యంత పురాతన సాంప్రదాయ ప్రాచీన సిద్ధ వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలని కృషిచేస్తున్న
భారత్ జాతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి శ్రీ జలగం కుమారస్వామి గారికి ప్రఖ్యాత సిద్ధ ఆయుర్వేద వైద్యులు జై శ్రీరామ్ గురుజీ గారికి శ్రీ తులసి సిద్ధ ఆయుర్వేద వైద్యశాల, హైదరాబాద్ సిద్ధ వైద్యుల బృందం శ్రీ జగదీశ్, శ్రీ శ్రీనాథ్, శ్రీ రితిక్ కన్నా గార్లకు ప్రత్యేక ధన్యవాదములు...
ఆగస్టు నెలల ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపు పూర్తి వివరాలు జతచేసాను... మీ బంధుమిత్రులలో ఎవరైనా మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు స్పాండిలైటిస్ భుజం నొప్పులు తో బాధ పడుతున్నవారు ఉంటే ప్రతీ నెల నిర్వహిస్తున్న ఈ ఉచిత సిద్ధ వైద్యం మెడికల్ క్యాంపును వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము..
శ్రీ తులసి ఆయుర్వేదం, హైదరాబాద్ (సిద్ధ వైద్యం) ఫోన్ నెం 9390484780 కు ఫోన్ చేసి మీ ఆరోగ్య సమస్యలు పూర్తి వివరాలుతో తెలియజేస్తే వారు మీ ఆరోగ్య సమస్యలకు హైదరాబాద్ లో కూడా పరిష్కారం తెలుపగలరు .. ఉదయం 11.00 గం నుండి సాయంత్రం 4.00 గం ల వరకు ఫోన్ అందుబాటు లో ఉంటుంది.. 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి