5, ఆగస్టు 2025, మంగళవారం

కలం యోధుడిలా

 *కలం యోధుడిలా మట్టిలో కలుస్తాను..!!*

నాలో గుండె చప్పుళ్ళు 

కవిత రూపమై స్పందిస్తూ 

కనుల ముందు ప్రత్యక్షమై 

సమాజంలో దర్శనమిస్తాను..

ఎన్నో హృదయాలకు దగ్గరగా

నలుగురి ముందుకు నడుస్తూ 

అక్షర స్వప్నాన్ని ఆవిష్కరిస్తూ 

నన్ను నేను పరిచయం చేసుకుంటా...

మాటలను పాటలుగా మలుచుకుంటూ 

జీవన గీతాన్ని పాడుకుంటూ 

కష్ట సుఖాల కడలిలో ఈదుకుంటూ

ప్రతి అడుగులో నా ఉనికిని చాటుతాను..

పున్నమి వెలుగుల్లో విహరిస్తూ 

అమావాస్య వరకు ఆనందిస్తూ 

చీకటి వెలుగులను ఆస్వాదిస్తూ 

బ్రతుకు పంటను పండిస్తాను....

అమ్మ గోరుముద్దల జ్ఞాపకాలను 

జీవితాంతం గుర్తుచేసుకుంటూ 

వాటిని మధురంగా మలుచుకుంటూ 

జీవన యాత్రలో తోడుగా ఉంచుకుంటాను..

మనసు తొందరలో ఎన్నో చేస్తుంది 

మరలి వెళ్ళిన ఆలోచన నెమరు వేస్తూ 

భవిష్యత్తును ఇంద్రధనస్సుల అలంకరించాలని 

వర్తమానంలో ఎన్నో గీతాలను ఆలపిస్తాను.

సత్కారాలకు అవమానాలకు కొదవలేదు 

రాసే పుటల్లో నా నామం సుస్థిరంగా 

నాలుగు కాలాలు నిలబడితే చాలు 

కలం యోధుడిలా మట్టిలో కలుస్తాను..

కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

మంగళవారం 5 ఆగస్టు 2025🍁*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁మంగళవారం 5 ఆగస్టు 2025🍁*

                        2️⃣2️⃣

                    *ప్రతిరోజూ*

 *మహాకవి బమ్మెర పోతనామాత్య*

   *శ్రీమద్భాగవత కథలు*```

(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``

*దేవహూతికి, కర్దముడికి కపిలుడుగా విష్ణువు అవతారం*             

```

స్వాయంభవ మనువు తన కుమార్తె దేవహూతిని కర్దముడికి ఇచ్చి వివాహం చేసి తన రాజ్యానికి వెళ్లిపోయిన తరువాత, దేవహూతి, పతిభక్తితో అనునిత్యం భర్తకు సేవచేయ సాగింది. ఆమె పతిభక్తికి, సేవకు మెచ్చి ఆమెకు అంతులేని భోగాలు కలుగుతాయనీ, ఆమెకు దివ్యదృష్టిని కూడా ఇస్తున్నాననీ కర్దముడు చెప్పాడామెకు. ఆ దివ్యదృష్టి వల్ల ఆమెకు సర్వం కనిపిస్తుందన్నాడు. అయితే, సంతానం కావాలనుకున్న ఆమె, గతంలో ఆయన అన్న మాటలను గుర్తు చేసింది. సంతానం కలిగేటంత వరకు శరీర సంగమం కలిగి ఉంటానని కర్దముడు చెప్పాడనీ, కాబట్టి తనను అనుగ్రహించి రతిరహస్యాన్ని చెప్పే కామశాస్త్రాన్ని నేర్పమని కోరింది. అప్పుడాయన ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు. దానిలో అందమైన గదులు, సన్నని వస్త్రాలు, పట్టు చీరెలు, పట్టె మంచాలు... ఇలా ఎన్నెన్నో సకల భోగ్యాలకు అనుకూలమైనవి ఉన్నాయి. సరోవర జలాలలో స్నానం చేసి విమానాన్ని ఎక్కమన్నాడు.

ఆమె స్నానానికి సరోవరంలోకి దిగగానే, అందులోంచి వేలాది కన్యకామణులు ఆమె చెంతకు చేరి, నలుగుపెట్టి స్నానం చేయించారు. అలంకరించారు. కర్దముడు స్నానంచేసి కూచున్న దేవహూతిని చూసి మురిసిపోయాడు. ఇద్దరూ విమానం ఎక్కి మేరుపర్వత గుహ దగ్గరకు చేరి విహరించారు. ఆ తరువాత భూమండలమంతా వాయువేగంతో చుట్టారు. కర్దముడు భార్యకు ధరామండలం అంతా చూపించి, తిరిగి వాళ్ళుండే చోటుకు తీసుకువచ్చాడు. భార్య మనస్సు అర్ధం చేసుకుని శృంగారంలో మునిగి తేలాడు ఆమెతో. అలా నూరు సంవత్సరాలు ఒక ముహూర్తంలాగా గడిపారు.

అలా గడుపుతూ కర్దముడు ఒకనాడు, తొమ్మిది విధాలైన దేహాలను ధరించి, మృదువుగా తన వీర్యాన్ని తన భార్య గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిపాడు. ఆ కారణంగా దేవహూతి తొమ్మిదిమంది కూతుళ్లను కన్నది. అనంతరం సన్యసించడానికి సిద్ధపడుతున్న భర్తను చూసి, కుమార్తెల వివాహం జరిగినదాకా ఆగమనీ, కొడుకును కూడా ప్రసాదించి కటాక్షించమని వేడుకుంది దేవహూతి. శ్రీహరి తనకు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి కర్దముడికి శ్రీహరి ఆమె గర్భంలో జన్మిస్తాడని, విచారించవద్దనీ, భగవంతుడిని ధ్యానించమనీ చెప్పాడు.

కర్దముడి మాటలకు సంతోషించిన దేవహూతి విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కొన్ని సంవత్సరాలు గడిపింది. అప్పుడు హరి ఒకనాడు కర్దముడి తేజస్సు ధరించి, జమ్మిచెట్టు తొర్రలో నుండి వచ్చిన అగ్నిలాగా దేవహూతి గర్భంలో జన్మించాడు. ఆ సమయంలో దేవహూతికి తత్త్వ జ్ఞానాన్ని బోధించడం కోసం, గర్భస్త నారాయణుడిని దర్శించడం కోసం, బ్రహ్మ వచ్చాడు. కర్దముడి, దేవహూతిల జన్మలు సాఫల్యమైనాయని అన్నాడు బ్రహ్మ. వారి కుమార్తెలను శ్రేష్ఠులైన మునులకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. అప్పుడు అనేక రకాలైన ప్రజా సృష్టి జరుగుతుంది అని చెప్పాడు. దేవహూతి గర్భంలో ఉన్న శ్రీమన్నారాయణుడు వారికి తత్త్వబోధ చేస్తాడని కూడా చెప్పాడు. అతడు కపిలుడు అనే పేరుతో విరాజిల్లుతాడని అన్నాడు. ఇలా చెప్పి బ్రహ్మ వెళ్లిపోయాడు.

బ్రహ్మ ఆజ్ఞానుసారం కర్దముడు తన కుమార్తెలకు పెళ్లి చేశాడు. కళను మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగిరసుడికి, హవిర్భువును పులస్త్యుడికి, గతిని పులహుడికి, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వశిష్ఠుడికి, శాంతిని అధర్వుడికి ఇచ్చాడు.

భగవంతుడైన శ్రీహరి దేవహూతికి కపిలుడుగా జన్మించాడన్న విషయం గుర్తుకు తెచ్చుకుని ఆయన్ను స్తుతించాడు పలువిధాలుగా కర్దముడు. కర్దముడి మాటలు విన్న భగవంతుడైన కపిలుడు, తాను కేవలం ముని వేషం ధరించడం కోసం పుట్టలేదనీ, మహాత్ములైన మునులకు భగవత్సంబంధమైన తత్త్వజ్ఞానాన్ని బోధించడం కొరకు మాత్రమే ఈ దేహాన్ని ధరించానని అన్నాడు. మోహాన్ని విడిచి, మోక్షం కోసం యోగామార్గాన్ని అనుసరించమని కర్దముడికి చెప్పాడు కపిలుడు. భగవంతుడు చెప్పినట్లే ఆయన చేసి, భక్తియోగంలో భాగవతులు పొందే స్థానాన్ని పొందాడు.

కర్దముడు అరణ్యాలకు పోయిన తరువాత దేవహూతి కపిల మహర్షిని చూసి తనకు మోహాంధకారం నుండి బయటపడే ఉపాయం చెప్పమని అడిగింది. తల్లి వాక్యాలను విన్న కపిలుడు సమాధానంగా దేవహూతికి తత్త్వజ్ఞానం, భక్తియోగం తెలియ చేశాడు వివరంగా.

```

                 *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*

         *రచన:శ్రీ వనం*

 *జ్వాలా నరసింహారావు*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 *🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 

ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

18-59-గీతా మకరందము

 18-59-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అII ఒకవేళ అహంకారముచే నా వాక్యములను వినక "నేను యుద్ధముచేయ’ నని నీవు చెప్పినను ప్రకృతియే నీచే యుద్ధము చేయించునని భగవానుడు అర్జునునితో పలుకుచున్నారు -

యద్యహఙ్కారమాశ్రిత్య * 

న యోత్స్య ఇతి మన్యసే | 

మిథ్యైష వ్యవసాయ స్తే 

ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి || 

తా:- ఒకవేళ అహంకారము నవలంబించి "నేను యుద్ధముచేయను" అని నీవు తలంచెదవేని అట్టి నీ ప్రయత్నము వ్యర్థమైనదియే యగును. (ఏలయనిన) నీ (క్షత్రియ) స్వభావమే నిన్ను (యుద్ధమున) నియోగింపగలదు.

వ్యాఖ్య: - కర్తృత్వమునువీడి, క్షత్రియోచితమగు ధర్మయుద్ధమును గావింపుమని అర్జునునకు భగవాను డిదివఱలో తెలిపియుండిరి. ఇపుడు 

"ఓ అర్జునా! అహంకారము వలన నా ఈ వాక్యములను ఉల్లంఘించినచో అది నీయొక్క వ్యర్థప్రయత్నమే కాగలదు. ఏలయనిన, నీ క్షత్రియసంబంధ ప్రకృతియే, స్వభావమే బలాత్కారముగ నిన్ను యుద్ధమున దింపగలదు". అని భవిష్యజ్జ్ఞానముగల పరమాత్మ వచించిరి.

---------

* యదహంకారమాశ్రిత్య = పాఠాన్తరము.

4, ఆగస్టు 2025, సోమవారం

నిమ్మకాయతో చికిత్స -

 నిమ్మకాయతో చికిత్స  - 

 * అజీర్ణం  ( Dyspepsia ) - 

.        గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 

*  మలాశయం బాధ  ( Bowel Trouble ) - 

       నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.

*  స్థూలకాయం  ( Obesity ) - 

.      నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు     ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.

*. ముఖ సౌందర్యం  ( cosmetic ) - 

.      సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు         ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 

*.  చలి జ్వరం  - ( Maleria ) 

.      నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు        ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 

.      అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.

*. రక్తస్రావం  - 

.   శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను.  ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen 

*. కడుపులో బల్ల పెరుగుట హరించును. 

.     నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 

*. దంతశుద్ధి  - 

.     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది. 

.    ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 గమనిక  -

.        నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

.         నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

.           ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

.      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

.        కాళహస్తి వేంకటేశ్వరరావు  

.    అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

.                 9885030034

పురాతన శరీర విజ్ఞాన పరీక్ష

 పురాతన శరీర విజ్ఞాన పరీక్ష - శస్త్ర చికిత్స .

. భారతీయ పురాతన ఆయుర్వేద నిపుణులు , మహర్షులు మానవ శరీర నిర్మాణమును తెలుసుకొనుటకు వారి వారి ఆశ్రమాలలో శవాలను తీసుకొచ్చి వాటిని కోసి పుర్తిగా పరీక్షించే వారు .

సుశ్రుతములో శరీర పరీక్ష గురించి కొంత వివరణ ఇవ్వబడింది. ఇప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాను. మొదట శరీర స్థానం నందు పూర్తి పరిజ్ఞానం తెలుసుకొవలెను. అటు మనిషుని యెక్క శరీరమును "ద్రుష్ట కర్మం" ( Dissection) కు సిద్దం చేసి ప్రతి అవయవ భాగం ను ప్రత్యక్షం గా పరీక్షించ వలెను.

. పరీక్షార్ధం నిర్దిష్టమైన మృత కళేబరం తీసుకొనవలెను. వ్రుద్దునిది, ధీర్గకాల రోగ పీడితునది , విషాదుల చేత మృతి నొందినది కాక సర్వాయవ స్పూర్తి నొందినది కలిగి ఉండవలెను. ముందు మృత కళేబరం నందు ఉండు వ్యర్ధములను " వస్థి కర్మం " ( enema) చేత బయటకి వెడలించి శోధనం చేయవలెను . పిదప ముంజ గడ్డి , దర్భ, నార మొదలగు వాని చేత అన్ని అవయవములను బాగుగా కట్టి చేపలు మొదలగు నీటి జంతువులు తినకుండా ప్రవాహం నందు కొట్టుకొని పోకుండా పంజరస్థం గావించి నిలువయున్న నీటిలో వాగునందు కుళ్లే విదంగా ఉంచవలెను. అలా 7 దినములు నీటిలో ఉంచవలెను. 7 దినములు అయిన తరువాత బాగుగా కుళ్ళిన శరీరమును పైకి దీసి దర్భ, గడ్డి వీని వేళ్ళతో చేసిన కుంచెను గాని , వెదురు కుంచెతో గాని చర్మం , మాంస కండరములు , సిరలు , నరములు , ధమనులు, ఆంత్రము ( Intestines) , యక్రుత్తు ( Liver) , ప్లీహము (spleen) , హృదయము (Heart) , వ్రుక్కములు ( kidneys) , పుప్పుసము ( Lungs) , క్లోమము ( pancreas) మొదలగు అవయవములును , అస్తులు (Bones) ,అస్థి సంధులు (Joints) . మొదలగు చర్మ బాహ్య,అంతర అవయవాలను విభజించి బాగుగా పరీక్షించ వలెను.ఈ రీతి శరీర శాస్త్రమును చక్కగా అభ్యసించవలెను .

 • శరీర పరీక్ష నేర్చుకునే విదానము.- 

  పలుమార్లు శిష్యునకు శవ పరీక్షా విదానం చేసే విదానం చూపించిన తరువాత శిష్యుని చేత స్వయంగా పరీక్ష చేయించవలెను.

• చేదన కర్మం - 

. సోరపుచ్చ, నూగు దోస , బుడమ, పెద్ద దోస , మొదలగు కాయలను కోసి చూపవలెను .అదే విదంగా ఉత్కర్థానము (పైకి కోయుట ), పరికర్థనము (ధిగువకు కొయుట ).మొదలుగునవి కుడా బోధిం పవలెను .

•. బేధ్య కర్మం - 

. నీరు నింపిన తిత్తులు గాని , మృతి చెందిన జంతువుల మూత్ర కోశములు గాని , జిగురు వస్తువులలో , లేక పలుచనైన బురదతో నింపిన తోలుతిత్తులను గాని చీల్చి చూపవలెను .

• లేఖ్య కర్మం - 

. రోమయుక్తమగు చర్మమును పైన , లొపల బేదములు ను చూపవలెను .

 •. వేద్య కర్మం - 

. మృత జంతువులు యెక్క సిరలును కలువ కాడలును , మొదలగువానిని వేధించి చూపవలెను . ఇయ్యది కేవలం జలోదరం, మూత్ర వృద్ది మొదలగు వాని యందు ఉపయోగించవచ్చు .

•. ఏష్య కర్మం - 

. పురుగు తినిపోయిన బెజ్జములు గల కొయ్య కర్రల యందు , వెదురు గోట్టములు , తుటి కాడలు, తామర కాడలు, ఎండిపొయిన సొరకాయలు, మొదలగు వానిని ముఖ ములములందు చేయవలసిన శస్త్ర చికిత్సకు ఉదాహరణగా చూపించ వచ్చు. దీనిని ఏషిని అను శలాకమ్ ఉపయొగించి నేర్పించవలెను .

• ఆహార కర్మం - 

. పనస, మారేడు, దొండ, మొదలగు ఫలముల నుండి గింజలు బయటకు తీయు విద్యను అభ్యసించవలెను. ఈ విదానం నోటిలోని దంతము లను ఉడ దీయుటకు ఉపయొగించ వలెను.

 • విశ్రావ్య కర్మం - 

. విశ్రావ్య కర్మను శాల్మలి ఫలకం నందు మైనం పూసి ప్రతిమలు చేసీ ఆయా ప్రదేశం నందు చీము మొదలగు వానిని స్రవింప జేయవలెను .

• సీస కర్మం - 

. మృదువగు వస్త్రములును చర్మం మొదలగు వాని ఎందు యుంచి కుట్టి సేవన కర్మం చేయవలెను .

 •. స్థల బేధమున శస్త్ర ఉపయోగ బేదములు -

. కనుబొమ్మ, కణత , నొసలు, గండ భాగము, కనురెప్ప, క్రింద పెదవి, పంటి చిగురు, చంక, కటి, బోడ్డు , గజ్జ, వీని యందు దిర్యక్చేధనం చేయవలెను .అరిచేయి , అరికాలు, వీనీ యందు జంద్ర మండలాక్రుతి గా ( గుండ్రముగా ) కోయవలెను. గుదము, మేడ్రము వీని యందు అర్థ చంద్రాక్రుతిలో కొయవలెను లేనిచో సిరలు (venis) , ధమనులు తెగిపోయి మిగుల బాధను కలిగించును. అలగే మానుట చాలా కష్టం. అలానే ఉంటే ఆ గాయం గ్రందిలా తయారగును. కనుక జాగ్రత్త వహించవలెను.

•. శస్త్ర చికిత్స చేయు విదానం -

. శస్త్ర చికిత్స చేయుటకు పూర్వం రోగి కి చాలా తక్కువ ఆహారం ఇవ్వవలెను. శస్త్ర చికిత్స బాధలు తెలియకుండా ఉండుటకు బాగా మత్తుగా ఉండు మధ్యములను త్రాగిపించవలెను . శస్త్ర చికిత్స ముందు భుజించడం మూలాన "మూర్చ " మొదలగునవి కలవు. మద్య ద్రవ్యములను ఉపయోగించుట చేత బాద తెలియకుండును.

 •. శస్త్ర చికిత్సకు కావలిసిన వస్తువులు.-

 * శస్త్రములు - ( Inustruments , Lancet etc .)

 * యంత్రములు - ( surgical applinces)

 * క్షారము - ( Alkali) .

 * అగ్ని - ( Fire for cauterisation) .

 * జలూక - ( Leeches) .

 * శలాక - ( Probe or direetor ).

 * జాంబ వోష్ణము -( Cavtersing 

Inusruments) .

 * పిచువు - (Cotton) .

 * ప్లోతము - ( Lint) .

 * సూత్రము - (Thread) .

 * పట్టము - ( Tow ).

 * తేనే - ( Honey) .

 * నెయ్యి - ( Ghee) .

 * కొవ్వు.

 * పాలు.

* నూనే .

* తర్పణం - ( powederd wheat soaked in 

water ) .

 * కషాయం - ( Decoctions) .

* అలేపము - ( Medicated Plasters) .

 * కల్కము - ( Paste) .

 * చన్నీళ్ళు.

 * వేడి నీళ్ళు .

* కవలిక - ( Splints) .

 * వెదురు వేళ్ళు - ( Skin of Bamboos ).

 * స్పటికం - ( Lens) .

 * కురువింద రాళ్ళు .

 * అయస్కాన్థములు .

 * గాజు తునకలు.

 * టేకు ఆకులు. మరియు మత్తు కలగ చేయు పదార్దం.

. ఈ విధంగా మన పూర్వీకులు వివిధ రకాల వస్తువులు ఉపయోగించి అత్యద్భుతంగా శస్త్రచికిత్సలు చేసేవారు .

 మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

గమనిక -

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

. 9885030034

మనం ఎదుగుతున్నామా?...

 *నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం.*

ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం.. 

 *అమ్మ అరగంట కనబడ కుంటేనే అల్లాడిపోయిన మనం..* 

అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..

 *నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...* 

నేనే హీరో”... నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..

 *నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం...* 

చిల్లరబుద్ధులతో,సంపాదనలో, అవే చిల్లర కూడా, .....తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచు కుంటున్నాం..

 *చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం..* 

ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం...

 *బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం..* 

ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక కుటుంబాన్ని చిన్నదిగా మల్చు కుంటున్నాం..

 *చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం...* 

ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!

*మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగు తున్నాం.*..

కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...

 *మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!* 

మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం.!!

*నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!*

ఎందుకంటే... 

మనం ఎదుగుతున్నాం..!

మనం మనకే అందనంతగా...

మనం ఎదుగుతున్నాం..!

మనం,మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం అని కూడా తెలియనంతగా...

నిజంగా మనం ఎదుగుతున్నామా?...

........ ఆలోచన చేయండి.....🙏

2, ఆగస్టు 2025, శనివారం

లటానుప్రాసము

 1 🙏🙏🙏లటానుప్రాసము

అర్ద భేదము లేకుండా తాత్పర్యభేదము కలిగి వర్ణముల యొక్క జంట గాని సమూహము గాని అవ్యధానముగా ఆవృత్తి అయిన లాటాను ప్రాసము ఉదాహరణ

కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాధు వర్ణించు జిహ్వజిహ్వ

లటానుప్రాసము అనేటప్పటికి గుర్తుకు వచ్చే ఏకైక పద్యం ఇక్కడ "కరములు కరములు "  "జిహ్వ జిహ్వ "అవ్యధానముగా ఆవృత్తి అయినది. .కరములు అనగా చేతులు అని అర్ధము జిహ్వ అనగా నాలుక ఇక్కడ అర్ధభేదము లేదు కాని కమలాక్షుని అర్చన చేయు చేతులే చేతులు అని శ్రీనాధుని వర్ణించునట్టి నాలుకయే నాలుక అని తాత్పర్యభేదము కనబడుచున్నది కావున లటానుప్రాసము.

శ్రీనాధుడు అంటే గుర్తు వచ్చింది అయన వ్రాసిన లటానుప్రాస పద్యం

"శ్రీ భీమ నాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వ

దక్షవాటీ పురాధ్యక్ష మోహన మూర్తి చూడంగ నేర్చిన చూపు చూపు " ముందుగా శ్రీనాధుడు వ్రాశారు.ఈ పద్యమును బట్టి పోతన గారు కమలాక్షు నర్చించు కరములు కరములు పద్యం సాన బట్టి ఎంతో రమ్యముగా వ్రాసి జనుల జిహ్వలపై నాట్యమాడించారు శ్రీనాధుని పద్యం పండిత లోకమునకు తప్ప సామాన్య జనులకు తెలియదు.( ఇది భీమేశ్వర పురాణము లోనిది )

అటులనే "తల్లిదండ్రులను సేవించు సుతుడు సుతుడు " "విద్యాబుద్దులు నేర్పు గురువు గురువు " ఇల్లా ఎన్నైనా తయారుజేయవచ్చు.

ఆచార్య ఆత్రేయ గారు లాటాను ప్రాసములో

" అడగక ఇచ్చిన ముద్దు ముద్దు "అని లాటాను ప్రాసానుగుణముగా వ్రాశారు. అయితే స్వర కల్పనకు అనుకూలముగా లేదు మార్చాలి అని పట్టు పడితే అప్పుడు "అడగక ఇచ్చిన ముద్దే ముద్దు అని మార్చవలసి వచ్చింది అప్పుడు తాత్పర్యార్థము వ్రాసి ఇచ్చారు అయినా లాటాను ప్రాసము అవుతుంది 

2 యమకము

యమకము అంటే సంస్కృతంలో  " జత " అని అర్ధము కాని సమూహం కూడా గ్రహిస్తున్నారు 

వర్ణముల జంట గాని సమూహము గాని అర్ద భేదము కలిగి వ్యవధానముగా ఆవృత్తి అయిన

యమకము అనెడి శబ్దాలంకార�

శబ్ద ప్రధానములైనవి శబ్దాలంకారములు

 🙏🙏🙏శబ్ద ప్రధానములైనవి శబ్దాలంకారములు

శబ్దాలంకారములు అనగానే దండి మహాకవి గుర్తుకు వస్తాడు. అన్ని అలంకారాలు ఆయన గద్య కావ్యము దశకుమార చరిత్రలో ఉన్నాయి ప్రారంభమే శబ్దాలంకారములు " అస్తి సమస్త నగరి నికషాయమాణ శశ్వదగణ్య పుణ్యవిస్తారిత మణిగణాదివస్తు జాత 

అద్భుతమైనకావ్యం.అట్లే బాణుని కాదంబరి కావ్యం కూడా గొప్ప గద్య కావ్యము 

1 వృత్త్యను ప్రాసము :

ఒక అక్షరము లేదా రెండు మూడు అక్షరాలు వ్యవధానముతో ఆహ్లాదము, చమత్కృతి కలిగించుచు అవృత్తియైన వృత్త్యను ప్రాసము.

ఉదాహరణ : విరూపాక్షండు రూక్షాక్ష రంబుల నధి క్షేపించి ఇక్కడ" క్ష " అనే అక్షరం వ్యవధానముతో ఆవృత్తి అయినది.(రూక్షాక్ష అనునపుడు అ వ్యవధానం అనుకోవచ్చు రూక్ష +అక్షర మధ్యలో అ ఉన్నది )

కలుగడే నాపాలి కలిమి సందేహింప

కలిమి లేములు లేక కలుగు వాడు

ఇక్కడ కకారము, లకారము వ్యవధానముతో ఆవృత్తి అయినది

"అడిగెదనని కడువడిcజను

నడిగినcదను మగుడ నుడువడని నడయుడుగున్ "పద్యంలో ఎన్నో డకార నకార ములు వ్యవధానముతో ఆవృత్తి చేసినాడు "రవిరధ తురంగ శృంగార చారు చామర ఛటా...." ఇక్కడ రకార చకారములు వ్యవధానముతో ఆవృత్తి అయినవి. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుcగృష్ణు ఇక్కడ ష్ణు అనేక పర్యాయములు వ్యవధానముతో ఆవృత్తి అయినది. ఇది వృత్త్యను ప్రాసము సినిమా పాటలలో ఈ అలంకారమునకు ఉదాహరణలు కోకొల్లలు.

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగనఝగనసొగసుల లనవె

సినీ కవులు అందరు వృత్త్యను ప్రాసముతోనే పాటలు వ్రాశారు దీనివల్ల పాటకి ఆకర్షణ చామత్కారము వస్తుంది.లేకపోతే ఉడకపెట్టి ఉప్పు కారం చల్లినట్టు ఉంటుంది.

2 ఛేకానుప్రాసము

అర్ద భేదము కలిగి వర్ణముల యొక్క జంట గాని సమూహము గాని అవ్యవధానముగా ఆవృత్తియైన ఛేకానుప్రాసము

ఉదాహరణ : జఠర క్షుధావ్యధా దూయమాన మానసుండు ఇక్కడ మాన - మాన అనే వర్ణముల జంట అవ్యవధానము

Panchaag

29, జులై 2025, మంగళవారం

పరమాచార్య వైభవమ్…

 ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

114a;307e2.    నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0282.పరమాచార్య పావన గాధలు…

*పరమాచార్య స్వామి*– 

                 *ఉప్పు వ్యాపారి*

                    ➖➖➖✍️

```

అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు. 

అప్పుడు రాత్రి పది గంటలు.... 

కటిక చీకటి.... కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది. 

“...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”. 

“తవ హి చరణావేవ నిపుణౌ... సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం

త్వదన్యః పాణిభ్యాం...”

పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”

అంతా నిశ్శబ్ధం.... “సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”

“తెలుసు పెరియవ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”

“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”

“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”

“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. 

“ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”

“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”

“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే 

ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”

“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్షం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము, మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”

ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.”

కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే. 

మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే సరికి రాత్రి 2:30 అయ్యింది.

అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను. 

పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా! 

తరువాత మహాస్వామి వారు “క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు.

ఈనాటికీ నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది. ✍️```

*--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్,* శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1

*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*

*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥*

```

#KanchiParamacharyaVaibhavam # “కంచిపరమాచార్యవైభవం”🙏

.     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

            🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.