4, నవంబర్ 2020, బుధవారం

చరిత్ర సంబంధ 55 పుస్తకాలు

 *చరిత్ర  సంబంధ 55  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


55 పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/charitra-pdf


               (OR)


హిందూ దేశ చరిత్ర www.freegurukul.org/g/Charitra-1


ఆంధ్రుల చరిత్ర www.freegurukul.org/g/Charitra-2


హిందుత్వం www.freegurukul.org/g/Charitra-3


తరతరాల భారత చరిత్ర www.freegurukul.org/g/Charitra-4


ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర www.freegurukul.org/g/Charitra-5


సారస్వత వ్యాసములు-5 www.freegurukul.org/g/Charitra-6


తెలుగువారి జానపద కళారూపాలు www.freegurukul.org/g/Charitra-7


ఆంధ్ర సాహిత్య చరిత్ర www.freegurukul.org/g/Charitra-8


ప్రపంచ చరిత్ర-5 www.freegurukul.org/g/Charitra-9


తెలుగువారి ఇంటిపేర్లు www.freegurukul.org/g/Charitra-10


ఆంధ్ర బాషా వికాసం www.freegurukul.org/g/Charitra-11


ప్రాచీన భారతదేశ చరిత్ర www.freegurukul.org/g/Charitra-12


ఆంధ్ర భాషా చరిత్రము-1,2 www.freegurukul.org/g/Charitra-13


ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరములు www.freegurukul.org/g/Charitra-14


భారత సంగ్రామము - పరిణామము www.freegurukul.org/g/Charitra-15


ప్రాచీన దక్షిణ భారత చరిత్ర www.freegurukul.org/g/Charitra-16


ఆంధ్ర వాంగ్మయ చరిత్ర www.freegurukul.org/g/Charitra-17


అధికార భాష - తెలుగు చరిత్ర www.freegurukul.org/g/Charitra-18


జానపద గేయ వాంగ్మయ పరిచయము www.freegurukul.org/g/Charitra-19


జానపద సాహిత్యం వీరగాధలు www.freegurukul.org/g/Charitra-20


సారస్వత వ్యాసములు-4 www.freegurukul.org/g/Charitra-21


నవభావన www.freegurukul.org/g/Charitra-22


విజయ నగర చరిత్రము www.freegurukul.org/g/Charitra-23


భారతీయ సాహిత్య సంకలనము www.freegurukul.org/g/Charitra-24


ద్విపద వాంగ్మయం www.freegurukul.org/g/Charitra-25


పాంచ జన్యం www.freegurukul.org/g/Charitra-26


భారతీయ తత్వ శాస్త్రము-1 నుంచి 5 www.freegurukul.org/g/Charitra-27


భారతీయ విజ్ఞానము www.freegurukul.org/g/Charitra-28


తూలనాత్మక సాహిత్యం www.freegurukul.org/g/Charitra-29


ఆత్మానందలహరి www.freegurukul.org/g/Charitra-30


భారతేతిహాస సినిమాలపై జానపద సాహిత్య ప్రభావం www.freegurukul.org/g/Charitra-31


ఉద్యమ దర్శనము www.freegurukul.org/g/Charitra-32


అధికార భాష తీరుతెన్నులు www.freegurukul.org/g/Charitra-33


ఆంధ్ర సాహిత్య  దర్పణము www.freegurukul.org/g/Charitra-34


ధర్మ రక్షణ www.freegurukul.org/g/Charitra-35


సింహావలోకనం www.freegurukul.org/g/Charitra-36


ఆకాశ భారతి www.freegurukul.org/g/Charitra-37


తెలుగు వ్యాస పరిణామం www.freegurukul.org/g/Charitra-38


ట్రైబల్ లైఫ్ www.freegurukul.org/g/Charitra-39


పూర్వ భారత కార్మికులు www.freegurukul.org/g/Charitra-40


ప్రాచీన ప్రపంచ చరిత్ర www.freegurukul.org/g/Charitra-41


సారస్వత వ్యాసములు-3 www.freegurukul.org/g/Charitra-42


మన చరిత్ర www.freegurukul.org/g/Charitra-43


వ్యాసావళి www.freegurukul.org/g/Charitra-44


ప్రాచీన వీర శైవము www.freegurukul.org/g/Charitra-45


వ్యాస భారతి www.freegurukul.org/g/Charitra-46


విశ్వమంతటా విస్తరించిన ప్రాచీన భారతీయ సంస్కృతి www.freegurukul.org/g/Charitra-47


మన దృక్కోణం www.freegurukul.org/g/Charitra-48


ఉషః కిరణాలు www.freegurukul.org/g/Charitra-49


ఉభయ భారతి www.freegurukul.org/g/Charitra-50


భారత ధ్వని దర్శనము www.freegurukul.org/g/Charitra-51


దర్శిని www.freegurukul.org/g/Charitra-52


తెలుగులో అలబ్ద వాగ్మయం www.freegurukul.org/g/Charitra-53


భారతదేశీయ సంఘ సంస్కర్తలు www.freegurukul.org/g/Charitra-54


ఒకే జాతిగా రూపొందడం ఎలా www.freegurukul.org/g/Charitra-55


చరిత్ర పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

17-08-గీతా మకరందము

 17-08-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అందు సాత్త్వికాహారమునుగూర్చి వచించుచున్నారు–


ఆయుస్సత్త్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః | 

రస్యాస్స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్వికప్రియాః || 


తాత్పర్యము:- ఆయుస్సును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగ వృద్ధినొందించునవియు, రసముగలవియు, చమురుగలవియు, దేహమందు చాలకాలము యుండునవియు, మనోహరములైనవియునగు ఆహారములు సత్త్వగుణముగలవారికి ఇష్టములైయుండును.


వ్యాఖ్య: - జనులయందు సత్త్వగుణ మభివృద్ధినొందునపుడు ఇట్టి యాహారము వారికి రుచించునని భావము. అనగా కారముతోను, పులుపుతోనుగూడినదియు, రాజసికమైనదియు లేక తామసికమైనదియు నగు ఆహారము వారికెన్నడును ప్రీతికరము కానేరదు. పైనదెల్పిన సాత్త్వికాహారమే వారికి ఇష్టముగనుండును. ధ్యానాదుల కిట్టి యాహారము మిక్కుటముగ అనుకూలించును. ఆహారవిషయము పరమార్థరంగమున ఎంతయో ముఖ్యమైనది. కనుకనే శ్రీకృష్ణమూర్తి గీతలో పెక్కుచోట్ల దానిని గుఱించి ప్రస్తావించుచువచ్చిరి. కావున ముముక్షువులు ఆహారసంయమము ఏదియో చిన్నవిషయమని తలంపక, బ్రహ్మమార్గమున కీలకస్థాన మాక్రమించియున్నదానినిగ అద్దానిని భావించి సాత్త్వికాహారమునే సేవించుచురావలెను.

ప్రశ్న:- సాత్త్వికాహార మెట్టిది?

ఉత్తరము:- (1) ఆయుస్సును, మనోబలమును, శరీరబలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని లెస్సగ అభివృద్ధినొందించునదియు (2) రసము గలదియు (3) చమురుతో గూడినదియు (4) దేహమునుందు చాలకాల ముండునదియు, మనోహరమైనదియు సాత్త్వికాహార మనబడును. కావున విజ్ఞు లట్టి యాహారమునే సేవించవలయును.

శాంతి లోపించటానికి ప్రధాన కారణం ఏమిటి ?"*

 *"జీవితంలో శాంతి లోపించటానికి ప్రధాన కారణం ఏమిటి ?"*

_*శ్రద్ధ లోపించటమే కారణం ! శ్రద్ధతో చేసే పనుల వల్ల అశాంతి ఉండదు. శ్రద్ధతో చేసే ప్రతి పని దైవార్పిత కార్యంగా మారి మనసును శుద్ధి చేస్తుంది. కేవలం పూజల్లోనే కాకుండా దైవధ్యానం నిరంతరం జరగాలి. అది శ్రద్ధతో ఉన్న మనసుకే సాధ్యం. ఎక్కడి నుండి తీసిన వస్తువును తిరిగి అక్కడ పెట్టే శ్రద్ధలేని వారికి దైవాన్ని తెలుసుకునే శ్రద్ధ ఎలా వస్తుంది ? చాలా మంది మతిమరుపు ఉందనుకుంటారు. అశ్రద్ధనే మనం మతిమరుపు అనుకుంటున్నాం. ప్రతి చిన్నపనిలో కూడా శ్రద్ధ అలవడితే జీవితమే మధురంగా మారిపోతుంది. అలాగే మరొకరి వస్తువును ఆశించే లక్షణం తగ్గితే మనసులోని స్వార్థం పోతుంది. నిత్యజీవితంలో తనకు అవసరమైన వస్తువులపైనే శ్రద్ధ పెట్టలేని మనసు తనపైన, జపంపైన ఎలా శ్రద్ధ నిలుపగలుగుతుంది ? జీవితంలో శాంతి లోపించేది అశ్రద్ధ వల్లనే !*

వి.బి.రాజేంద్రప్రసాద్

 నటుడవ్వాలని వచ్చి నిర్మాతగా స్ధిరపడ్డ వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. అరవై, డెబ్బై దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆనాటి మేటి చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలిచారు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ హిందీ భాషలలో 32 సినిమాలు నిర్మించి 19 సినిమాలకు దర్శకత్వం వహించారు.


శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ 1932 నవంబర్ 4 వ తేది, న కృష్ణా జిల్లాలోని డోకిపర్రు (కృష్ణా జిల్లా) గ్రామంలో, వ్యవవసాయ కుటుంబానికి చెందిన జగపతి చౌదరి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాబ్యాసం డోకిపర్రు గ్రామంలోనూ, కళాశాల  విద్యాబ్యాసం కాకినాడ లోనూ జరిగింది. అక్కడ వారికి ఏడిద నాగేశ్వరరావుతో పరిచయమైంది.' రాఘవ కళాసమితి' అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించి ఇన్‌స్పెక్టర్ జనరల్ వంటి వంటి పలు నాటకాలు ప్రదర్శించడమే కాకుండా స్త్రీ పాత్రలో నటించి ఉత్తమ కథానాయిక బహుమతిని గెలుచుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ లో, కొంతకాలం బందరులో వ్యాపారాలు నిర్వహించారు.


నటుడవ్వాలని మద్రాస్ కి వచ్చారు వి.బి.రాజేంద్రప్రసాద్. అక్కడ ఆయనకు అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం కలిగింది. అది రాజేంద్రప్రసాద్ జీవితంలో ఒక మలుపు. అక్కినేని నాగేశ్వరరావు, వి.బి. రాజేంద్రప్రాద్ ను చాలా ప్రోత్సహించారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ను అక్కినేని, ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు  పరిచయం చేసారు. కానీ నటుడిగా అవకాశాలు దొరకలేదు. దానితో నాగేశ్వరరావు ప్రోత్సాహంతో తండ్రిగారి పేరిట జగపతి సంస్థ స్థాపించి అన్నపూర్ణ చిత్రంతో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. దసరా బుల్లోడు  చిత్రంతో దర్శకుడిగా మారారు. వారి సంస్ధలలో నిర్మించిన చిత్రాలకేకాకుండా అందరూ దొంగలే సినిమాకు దర్శకత్వం వహించారు. ఎనభై దశకం నుండి చిత్ర విజయాలు తగ్గాయి. క్రమంగా చిత్రనిర్మాణాన్ని తగ్గించారు.


చిత్రరంగానికి నిర్మాతగా, దర్శకునిగా వి.బి.రాజేంద్రప్రసాద్ అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.


తీవ్రమైన అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈయన 2015, జనవరి 12 సోమవారం రోజున మరణించారు

దక్షణ కాశీ


 

కధ

 #Inspiration story...


#హైటెక్‌సిటీ చెంతన ఓ బస్తీలోని ఇరుకు గదిలో నివాసం. తండ్రి కూలీ. తల్లి హౌస్‌కీపర్. వీరి అబ్బాయి #నర్సింహ  ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.


సున్నాల్లేని గోడలు, గొళ్లాల్లేని తలుపులు... ఇరుకిరుకు గదులు, సమయానికి రాని మాస్టార్లు, నాణ్యతలేని మధ్యాహ్న భోజనం... అరకొర చదువులు... ప్రభుత్వ పాఠశాలలు అనగానే అందరికీ గుర్తుకువచ్చే దుస్థితి. అయితే అలాంటి పరిస్థితుల నుంచి కూడా విశేషమైన విజయాలు పుట్టుకొస్తాయి. అలాంటి విజయం సాధించిన బాలుడు నర్సింహ... ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ‘ఇంటలిజెన్స్’ ముందు దిగదుడుపే అని నిరూపించాడు. రూ.లక్షలు చెల్లించి చదివే విద్యార్థులతో పోటీపడి గెలిచాడు. అది కూడా తెలుగు మీడియం విద్యార్థులను అనుక్షణం భయపెట్టే ఆంగ్లభాషా ప్రావీణ్యంలో...


ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా పోటీలలో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో నర్సింహను ఎంపిక చేస్తే... ఏకంగా విజేతగా నిలిచి నర్సింహ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. అల్లిబిల్లిగా ఉండే ఆంగ్ల అక్షరాలతో పదాలను కూర్చడం, ఉచ్ఛరించిన ఆంగ్లపదాల స్పెల్లింగులు కరెక్ట్ చేయడం... వంటి విభిన్న రకాల అంశాలతో నిర్వహించిన ఈ పోటీకి నగరానికి చెందిన దాదాపు అన్ని టాప్ క్లాస్ కార్పొరేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ల్యాప్‌టాప్‌పై సమాధానాలు ఇస్తూ నర్సింహ ముందు వరుసలో నిలిచాడు.


చివరకి... మాదాపూర్‌లోని మహీంద్రా సత్యంలో  అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్- 2013-14’ ఫైనల్స్‌లో అందర్నీ తోసిరాజని... అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరఫున ప్రైమరీ స్కూల్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రశంసా పత్రం, మెమొంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని సైతం దక్కించుకున్నాడు.


మట్టిలో మాణిక్యం .. ఎందరికో స్ఫూర్తి దాయకం ...


భళా నర్సింహా! భళా..👏👏

#inspiration

🌻. మధు కైటభుల వధ వర్ణనము - 4 🌻

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 4  / Sri Devi Mahatyam - Durga Saptasati - 4 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


అధ్యాయము 1

*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 4 🌻*


రాజు పలికెను : భగవాన్! మహామాయ అని నీవు చెప్పు దేవి ఎవరు? ఆమె ఎలా ఉద్భవించింది? ఆమె ఏమి చేస్తుంది? ఓ బ్రాహ్మణా! ఆమె స్వభావం ఎటువంటిది? ఆమె స్వరూపం ఎలా ఉంటుంది? ఆమె ఎక్కడి నుండి ఉద్భవించింది? ఇదంతా బ్రహ్మజ్ఞాన వరేణ్యుడవైన నీ నుండి వినగోరుతున్నాను. (59–62)


ఋషి పలికెను : ఆమె నిత్య. ఆమెయే ఈ జగత్తుగా మూర్తీభవించింది. ఈ అంతటా ఆమె వ్యాపించి ఉంది. (63- 64)


కాని ఆమె బహు విధాలుగా ఉద్భవిస్తుంది; అది నేను చెబుతాను, విను! నిత్య అయినప్పటికీ, ఆమె దేవతల కార్యాలను నెరవేర్చడానికి ఎప్పుడు లోకంలో ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆమె ఉద్భవించిందని లోకులు పలుకుతారు. 


కల్పాంతంలో జగత్తంతా ఏకమై ప్రళయజలరాశి రూపంలో ఉండి, భగవంతుడైన శ్రీమహావిష్ణువు శేషతల్పశాయియై యోగనిద్రలో ఉన్నప్పుడు ఘోరరూపులు, విఖ్యాతులు అయిన మధుకైటభులనే ఇద్దరు అసురులు విష్ణుదేవుని చెవిలోని గుబిలి నుండి ఉద్భవించి బ్రహ్మను చంపడానికి యత్నించారు.


 ప్రజాపతియైన బ్రహ్మ విష్ణువు నాభికమలంలో కూర్చొని ఉన్నాడు. ఉగ్రరూపులైన ఈ అసురులిద్దరిని చూచి, విష్ణుదేవుడు నిద్రిస్తుండడం వల్ల ఆయన్ని మేలుకొల్పడానికై, ఆయన నేత్రాలలో వసిస్తున్న  యోగ నిద్రను ఏకాగ్రచిత్తంతో స్తుతించాడు. (65–70)


బ్రహ్మదేవుడు తేజోవంతుడైన విష్ణుదేవుని అసమానయైన దేవిని, యోగనిద్రను, సర్వలోక పాలకురాలిని, జగన్నిర్వాహకురాలిని, ప్రపంచ స్థితిలయకారిణిని -స్తుతించాడు. (71)


బ్రహ్మ పలికెను: “నీవు 'స్వాహా  మంత్రానివి, నీవు 'స్వధా * మంత్రానివి, స్వర్వానికి 4 మూర్తరూపానివి, వషట్కారమూనీవే కదా! సుధవు* నీవు. నాశము లేని శాశ్వతవు, త్రిమాత్రాత్మికవు నీవే. పూర్ణంగా ఉచ్చరించడానికే శక్యంకాని నిత్యస్వరూపిణివైన అర్ధమాత్రవు నీవే. దేవతల తల్లి, పరదేవత అయిన సావిత్రివి నీవే. (72-74)


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

06. ఉపాసనా యోగం

 **అద్వైత వేదాంత పరిచయం**


06. ఉపాసనా యోగం


  వైదికులు పొందాల్సిన నాలుగు లక్ష్యాలనూ, అందులో అంతిమ లక్ష ్యమైన మోక్షం గురించీ చూసాము. అవి పొందటానికి వాళ్ళు పాటించాల్సిన మార్గాలను 

మూడు విధాలుగా విభజించవచ్చు. అవి

1. కర్మయోగం 2. ఉపాసనాయోగం 3. జ్ఞానయోగం

  ఇంతకుముందు కర్మయోగం గురించి చూసాము. కర్మయోగం అంటే అంతర్గత ఎదుగుదలకి తోడ్పడేటట్లు పనులు చేయటం.ప్రాపంచిక సుఖాలకోసం పాటుపడకుండా 

ఆధ్యాత్మిక ఎదుగుదలకి పాటుపడాలి. దృక్పథంలో మార్పు వస్తే, అకర్తా, అభోక్తాగా పనులు చేయవచ్చు. దీన్ని 

భగవద్గీతలో మూడవ అధ్యాయంలో వివరంగా చూడవచ్చు.

  ఇక ఉపాసనాయోగం విషయానికి వస్తే శంకరాచార్యుల వారు దీన్ని సమాధియోగం అనికూడా అంటారు. పురుషార్థం సాధించటానికి మన వ్యక్తిత్వాన్ని సంసిద్ధం 

చేయటమే ఉపాసనాయోగం ఉద్దేశం. పురుషార్థయోగ్యతా సంపాదనార్థం. మన జీవిత అంతిమ లక్ష ్యం మానవ లక్ష్యాలను సాధించే నిరంతర ప్రయాణం కాబట్టి, ఉపాసనని, యోగ్యత 

సంపాదించే కార్యక్రమంగా అభివర్ణించవచ్చు.

  కఠోపనిషత్తులో, మన లక్ష ్యసాధనలో మనని ఒక రధంతో పోల్చారు.ఎలాగైతే ప్రయాణంచేసి, గమ్యం చేరటానికి వాహనం మంచి స్థితిలో ఉండాలో, అలా మన 

శరీరం కూడా మంచి స్థితిలో ఉండాలి. అందుకని,శాస్త్రాలు మన శరీరాన్ని కొన్ని భాగాలుగా విభజించాయి. శరీర 

నిర్మాణం క్లిష్టంగా ఉండి, ఒక్కసారిగా మనకి అర్థంకాదు కాబట్టి దాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా వివిధ విభాగాలుగా విభజించింది. ఒక కోణంలోంచి కోశపంచకం అన్నారు. ఇంకో 

కోణంలోంచి శరీరత్రయం అన్నారు.  మన అధ్యయనం కోసం మన శరీరాన్ని మూడు భాగాలుగా విభజిద్దాం.ఇది శాస్త్రప్రకారం జరిగింది,కాబట్టి, చాలా యోగ్యమైన విభజనగా పరిగణించాలి.

  1. కాయిక అంశ -భౌతిక కాయం

  2. వాచిక అంశ-వాక్కు

  3. మానసిక అంశ-మనసు

  వాక్కు మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. మనసు అంతకన్నా క్లిష్టమైనది, కాని అత్యంత ముఖ్యమైనది కావటంతో దాన్ని నిర్లక్ష ్యం చేయలేము. శాస్త్రం ఈ మూడు 

భాగాలని నియంత్రించేందుకు ప్రోగ్రాములని నిర్దేశించింది.

అద్వైత వేదాంత పరిచయం

6.2. వాచిక అంశ :

  వ్యక్తిత్వంలోని రెండో అంశ వాచిక అంశ. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. వివేకచూడామణిలో శంకరాచార్యులు చెప్పారు:

  యోగస్య ప్రథమం ద్వారం వాక్‌ నిరోధోపరిగ్రహ: నిరాశా చ నిరీహా చ। 

  కృష్ణుడు భగవద్గీత, పదిహేడవ అధ్యాయంలో వాచిక తపస్సుకి నాలుగు అంశాలను సూచించాడు.

🙏🙏🙏

సేకరణ

ధార్మికగీత - 70*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 70*

                                    *****

      *శ్లో: విశ్వా౽మిత్రాహి పశుషు ౹*

             *కర్దమే విషమ స్థలే ౹*

             *అంధే తమసి వార్ధక్యే ౹*

             *దండం దశగుణం భవేత్ ౹౹*

                                     *****

*భా:- "దండం" అంటే కఱ్ఱ అని నమస్కారం అని సామాన్యమైన అర్థాలు. "దండము" అత్యవసరంగా వినియోగించే సందర్భాలు "పది" ఉన్నవని శాస్త్రాలు చెబుతున్నాయి.అవి. 1."వి" :- ఆకాశంలో సంచరించే పక్షులు వివాహాది వేడుకలలో ఆహారపదార్థాలు ముట్టకుండా, రక్షణగా ఒకరు చేత ధరించి నిలబడడానికి. 2."శ్వా" :- స్వైరవిహారం చేసే ఊరకుక్కల దాడి మనపై జరగకుండా ఉండడానికి. 3."అమిత్ర" :- దారి కాచి, ఆకస్మికంగా తెగబడిన శత్రువు నుండి ఆత్మరక్షణచేసుకోడానికి. 4."అహి" :- ఆగమనం కూడా గమనింపజాలని వేగంతో తారసపడిన పామును అదిలించడానికి. 5.పశుషు :- గేదెలు,ఆవులు,గొఱ్ఱెలు, మేకలు మున్నగు జంతువులను కాపలా కాయడానికి. 6. "కర్దమే" :- లోతుపాతులు, ఊబులు గమనిస్తూ, బురద కయ్యలను సుఖంగా , సుకరంగా దాటడానికి. 7. "విషమస్థలే" :- ఎత్తుపల్లాలతో అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశంలో జాగ్రత్తగా నడవడానికి. 8."అంధే" :- తడిమి చూడడమే గాని, తనివితీరా చూడలేని గ్రుడ్డితనములో ఆచితూచి నడవడానికి. 9."తమసి" :- కన్నుపొడుచుకున్నా కనబడని చీకటిలో ముందడుగు వేయడానికి. 10."వార్ధక్యే" :- వయోభారం మీదబడిన వృద్ధాప్యమునందు తడబడకుండా నడవడానికి -ఇలా "కఱ్ఱ" ప్రతి ఒక్కరికి అనివార్యమై పదిరెట్లు ఉపకరణంగా, ఉపయోగకరంగా, ఉంటుంది. కాని లోకంతీరులో పంతులుగారి చేతిలో "కఱ్ఱ" ఉండడం గమనార్హం. "దండం దశ గుణం భవేత్" అనే నానుడి పిల్లల్ని దండించే సందర్భంలో వారి నోటి నుండే వెలువడడం సాంప్రదాయంగా వస్తోంది. మానవ జీవనానుగమనంలో ఇవే గాక మరెన్నో సన్నివేశాలలో "కఱ్ఱ" ఉపయోగం విస్తారంగా కనిపిస్తుంది.*ఓ దండమా ! నీ కో దండం*! 

                                    *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

మహనీయుని మాట*

                

 *మహనీయుని మాట*

    

"మనలో ఎవరైనా మంచివాడు ఎదుగుతుంటే ఎదగడానికి సహకరిద్దాము... ఎందుకంటే వాడిమార్గంలో కాని, వాడి నీడలో కాని పదిమంది ఎదుగుతారు.


అలాగే మనలో ఎవడైనా మంచివాడు పడిపోతుంటే అడ్డుకొని నిలబెడదాం...లేకుంటే వాణ్ణి నమ్ముకున్న పదిమంది కష్టాల పాలౌతారు..

 *నేటి మంచి మాట*🦜

      

"సమయానికి , ఆరోగ్యానికి విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు వాటి విలువ తెలుస్తుంది.....!"

 👏👏


          *పరిస్థితులు ఎప్పుడూ మన ఆధీనంలో ఉండవు , కానీ ప్రవర్తన మాత్రం ఎప్పుడూ మన ఆధీనంలోనే ఉంటుంది.*

        *అందుకే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.*

👬స్నేహం అనేది ఇలా ఉండాలి.. అలా ఉండాలి అనే నిర్దిష్టమైన లెక్కలు అంచనాలు ఉండవు..*

*ఓకేలా ఆలోచించి, ఒక గురువులా బోధించి, దారి చూపించి, తప్పు చేసినపుడు మందలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు...*

*కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నెల చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించేది మధురమైన స్నేహం...*👬

*👉" ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన వాళ్ళ సాన్నిహిత్యంలో దొరకవచ్చు. అందుకేమీ రోజులో కొంత సమయం వాళ్ళతో గడపండి."* 🌻


        మీ

మురళీమోహన్


 🤔 *" మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని గురించి తక్కువ ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు."* 🌹


       మీ

మురళీమోహన్


దానం ప్రియవాక్సహితం జ్ఞానమగర్వం క్షమాన్వితం శౌర్యమ్ 

విత్తం త్యాగసమేతం దుర్లభమేతచ్చతుర్విధం భద్రమ్.



మంచిమాటలు చెపుతూ దానం చెయ్యడం, జ్ఞానం ఉండికూడా గర్వం లేకపోవడం, ఓరిమితో కూడిన శౌర్యం, ధనంతోపాటు త్యాగగుణం కూడా ఉండడం-- ఈ ఉత్తమలక్షణాలు నాలుగూ ఉండడం చాలా కష్టం.


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞